29, జూన్ 2017, గురువారం

విశ్వంలో జీవితం -37

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

విశ్వంలో జీవితం -37

ఓమనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో

డంబములు పలికే వాని
తప్పు తప్పుని వొప్పుకోని వాని
ఆడవాళ్లు చుట్టూ తిరిగే వాని
మాట నమ్ముట ఎప్పుడు హాని 

మంచి చెడులు తెలియని
మమత లనేవి ఎరుగని
మనసు మనసులో లేని
మానవుని కలియుట హాని

వావి వరుసలు ఎరుగని
సుఖమే శాశ్విత మని
దుర్మార్గమే గొప్ప యని
తలిచిన వాని కలియుట హాని

అతిగా ఏడిచే మొగ వానిని
అతిగా నవ్వే ఆడ దానిని
అటు ఇటు కాని స్త్రీని గాని
మాటలకు లొంగితే హాని
   
జాలి కరుణలు మాని
ఆలి నేలని వాని
జోలికెళితే హాని

ఓమనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో 

ఆశ పెరిగిన వాడు
అహము పెరిగిన వాడు
తనకు తానే కీడు

కీడును తలచేవాడు
పాపాలు చేయువాడు
పుణ్యమే చేయని వాడు
రోగంతో మరణం పొందేవాడు

మానవత్వాన్ని నమ్మనివాడు
మనిషి మనిషిగా గుర్తించని వాడు
గురువు, పెద్దలను గౌరవించని వాడు
పిచ్చి వాడితో సమాన మైన వాడు    

సంపాదన కోసం వెంపర్లాడే వాడు
ధనము ఖర్చు చేయక దాచేవాడు
నీరు, మట్టి విలువ తెలియనివాడు
పిచ్చివాడి చేతిలో రాయిలాంటి వాడు

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో 

ఓ మనిషీ తెలుసుకో 
తెలుసుకొని మసలుకో 

బాహ్యాన్ని ఆకర్షింన్చుతావెందుకు 
అంతర్గతంలో ఉన్నది గ్రహించవెందుకు   
వ్యామోహానికి వెంపర్లాడుట ఎందుకు
ధ్యాన నిమగ్నుడవై సాగు ముందుకు  

విద్య నాకే ఉన్నదని ఎగిరి పడబోకు 
అసత్యమైన విశ్వాసానికి లోను కాకు 
అసత్యం కోసం విద్య ధారపోసి బాధపడకు  
తప్పును గ్రహించి ధర్మమార్గంలో బ్రతుకు 

చిలక పలుకుల చిన్నదానికి చిక్కకు 
చిక్కినా నీవు బానిసై ఊడిగం చేయకు
ఇది వయసు ధర్మమని వాదించ బోకు
రోగాలు పెంచుకొని భాధ పడుట ఎందుకు 

ఓ మనిషీ తెలుసుకో 
తెలుసుకొని మసలుకో