10, ఏప్రిల్ 2024, బుధవారం

 అర్ధనీరీశ్వర లీలలు (1)

(దాంపత్య సుఖలీల.. గోల శృంగార భరిత పద్య కావ్యం)


కం..సౌందర్య ఆరాధ్య మగుట 

సందేహముతీర్చగల్గు సమ్మోహనbమే 

సుందర చరణాలు గనే 

పొందే ప్రియురాలు భాగ్య పొందిక సుఖమే 


కం.తక్కెక్కువకాదునులే 

మక్కువగు రసికతలోన మానస తృప్తే 

దక్కే గెలుపోటములే  

చక్కా శృంగార కేళి చెలి ప దములో 


కం..అద్భుత కళలుగు ప్రేమే 

సద్భా వపు సుఖమును పొంద సందర్బముగా 

సద్భంధ మనసు ప్రేమే 

తత్భా వ సతిపతిలీల తన్మాయకళే


కం..ప్రేమే జగతిన నిత్యం 

ప్రేమే ప్రాణం సతిపతి ప్రగతికి మూలం 

ప్రేమే నిధి గా మదియే 

ప్రేమే ఆశయము గాను ప్రీతిగ జీవం


ప్రాకృతి లీలా గమనము 

జాగృతి సుఖమగు యుగమున జాతర ప్రేమే 

ఆకృతి జపమే సతిపతి 

స్వీకృతి హృదయ మగుటయె శ్రీకర ప్రేమే


సీ.నిండు పున్నమిరేయి పండు వెన్నెలవోలె

మధుపమ్ము గొనితెచ్చు మధువువోలె

చక్కని చుక్కవు చెంతను సుఖమేలె 

మింట విద్యుల్లతమెరుపువోలె

పలకరింపు మనసు పరిమళంబుల వోలె

అలుకతీర్చవయసు ఆటవోలె

భార్య గుండెలపైన భారమవక వోలె

సమయ తృప్తి పరచ స్పర్శవోలె


తే.మనసు గెలువ పతికి మేలు మార్గ మోలె 

ముద్దు ముద్దుగ తెలవారు పొద్దువోలె

కనులు కలలు తీర్చ సమయ కాల మోలె 

నియమ శృంగార రంగమ్ము నిజము లేలె


తే. ఎంత వారికైన మగువ యెరుక గలుగు 

ఎన్ని యన్నను మనసుగా యేల గలుగు 

తప్పు ఒప్పు లనక సేవ తలచు పతియు 

కాల నిర్ణయం కలియుటే కళలు తీరు  


తే..క్రోధియనిన ద్రోహీ యన కోప మున్న

విధిగ వీధిన పెట్టినా వినయ ముంచ 

ఆలి మాట యెదురనక ఆశ లేక 

బాధ లున్న పతిగసేవ బంధ మందు


తే..మిత్రులు సజ్జనుల్ దుష్టులు మేటి కవులు 

పండితోత్తముల్ శిష్యులు భక్త వరులు 

గౌర వించుచుందును గాని, కన్నసంతు

పితరులను భక్తితో గౌరవించ లేదె 


తే.బంధువులుగాని స్నేహితుల్ బ్రాహ్మణవరు 

లాదరించుచుఁ బ్రేమతో మోదమలరఁ

బలుకరింతురుగాని,యా స్వసుతులెవరు 

ప్రియముతోఁ బల్కరించరు ప్రేమతోడ.


తే.జాలిఁజూపుచు పతినందు సహృదయముగఁ

బొగడుచుందుచు గాని,యా పంత కలిఁకఁ

బితరులను నీచముగనెంచి ప్రేమలేక 

గబ్బికంటె హీనంబుగాఁ గాంచుచుంద్రు.


తే.వారి నధికంబు ప్రేమించ వలదు వలదు 

మోక్ష దాయకమన్నను మోదమలరఁ

పతిని బ్రేమించ కలలుగా పలుకు లగుట 

సతము గొలువుము మనసు సతిని నిజము


అర్ధనీరీశ్వర లీలలు (2)

(దాంపత్య సుఖలీల.. గోల శృంగార భరిత పద్య కావ్యం)

స్త్రీలు తమ ఆలోచనలు మగవారి కొంటె చేష్టలు ఒకరికొకరు ముచ్చట్లు 

అందులో ఒక స్త్రీ తన అనుభవము ఇలా చెప్పింది 

"ఆహా అక్కడ ఒక పండితుడు ఇలా చెప్పాడు"  


తే..పట్నవాస మహిళ గాను పక్కనవ్వె   

లొల్లి చేయకె  కదలేను  లోకతృప్తి 

గాలి సవ్వడి  కదిలెను  కాలవలువ 

గాజులు థలథలలుగాను  గాలమేయ


తే. కళ్ళజోడుయు కదలేను కన్యగాను 

కళ్ళు నెత్తికి వచ్చియు కలల కులుకు 

నడవ లేకనడుచు నవనారి స్థితియు  

ఎత్తు చెప్పులగుట వళ్ళ ఎగురుకొంటు  


ఆ..వానమబ్బు మెరిసె వాలుజల్లు కురిసే 

జల్లు ఒళ్ళు తాకె జలము కార్చె 

పునుముకున్న రంగు పూర్తిగా మారియు 

అసలు రంగు బయట అంద మౌనె 


ఆ..బురదలో నడకాయె బురబురా శబ్దమే 

చెప్పు తెగెట వళ్ళ చింత చేరె 

నడక చేతకాక నాడు చెప్పు లిసిరే 

బురదతోను చేరె బుసలు బుసలు 


ఆ..పల్లె చేరు నున్న పగడాల మెరుపులై 

జూచువారి శోభ చూపు లయ్యె 

అదిరె బెదిరె వారు అలకల చూపులై 

పల్లెటూరి జనులు పకపకపక 


తే.. ఏమి యందపు గంధము ఏల వదల 

రక్తి లిఖియించు కొంటి రమణి రూపు 

భావభాసురమగు హృదంబరమునందు 

ఇంట గెలువు ముందుమగడా  ఇంతి పలుకు  


"అక్కడేవున్న మరో స్త్రీ ఇలా వాపోయింది"  

యి.రోజూ నె చూస్తున్న  రోకటి పోటుయే 

అయినా యి మోములో అలుపుయే ఎరుగదు

ఏదొ కొత్తదనమే యేల చెప్పగలను 


ఆ చిలిపి కనులు ఆశలు రేపునే 


యి.తెలియని మహత్మ్య తీరుబడిగ యేది 

చిరుహాస పెదాల చిత్రవిచిత్రాలు 

దాయలేని కళలు ఆత్మీయ ఘటనలు 

ఎంతసేపు తనువు ఎంతో సహకరించు 


యి.తనివితీరని సుఖ తన్మయత్వముగాను 

ప్రేమ. ఆరాధన .. ప్రియుని కౌగిలి 

మనసుకు ఎరగని మమతల సంధిగ్ధ 

మరవలేని తనము మరచి పోని సుఖము 


ఆ..అంత నయిరువురును అన్యోన్యముఖపు వి  

లోకనంబు నెయ్యముల్‌ కొ సరిక , 

పదియడుగులు నడచి పాఠమగు కదియ  

చిటికలోపల కల సింరుత్కటభరాప్తి. 


ఒక స్తిని జూసి వెంటడు 


ఆ..ప్రతిభ స్త్రీ కొరకునె  ప్రవచించ నెన్నైన

నటన జూపువాఁడు నరుల గెలిచి

కొసరి వెంట పడగ కొన్నైన నెరవేర్చ

ప్రేమికుడగు నతడు ప్రేమ కోరి 


తే..అకట వేధించుట విధిగా దాహఫలము 

వరుడు వీడు నీవేలను వగచ  నేల 

మోహమా వేపెదేల యీ మౌన కృపను  

శూన్యమగుచు నెందేని గాంచుము ప్రశాంతి.


తే..ఆజనన బద్ధబాంధన మయిన చనువు, 

చిరసమేళన కాంక్షావిశేష రక్తి, 

బలవ దాశావిభంగ తాపంబు; ఆ ప 

డుచుజతను నేమి సేయు నట్టుల నొనర్చె. 


కం.. స్వగత విలాపములన్‌ గని    

ప్రగతి హృదయంబు తోడగు ప్రతిభే జూపుల్ 

భోగపు యౌవనుని కళే   

యోగ కళలగుటయు ప్రేమ యుక్తమగుటగన్


అర్ధనీరీశ్వర లీలలు (3)

(దాంపత్య సుఖలీల.. గోల శృంగార భరిత పద్య కావ్యం)


తే. తాండవ కళలు కేళీ నీతాప మాయ 

భోగ లాలస మానసం భోద్య మవదు 

పంకజం కిరణాలతొ పలుక రింపు 

సర్వ సమ్మోహ శివలీల సృజన శక్తి


తే..రమ్యత సహచరి కూడగా రాస లీల 

సౌమ్యపు కులుకు కదలిక సమ్మతి గుణ

కామ్యపుకళల జీవన కాల ప్రక్రియ 

గమ్యపు ప్రేమే బ్రతుకుగాను కల్వ తీర్పు


తే.. వలచి వచ్చి తిని పలుకవేమి భామ ?

పిలచి కలచి వయిచినేను , బిగువ దేల ?

పలుక వేమి చెలియ సమ పాఠమౌను 

అలుక చిలుక బోకు యిపుడు ! అమల వదన !


తే.."కాలమా! ఆస నడియాస గాగ జేసి 

వేసటల ద్రోసి యాయాసపెట్ట దలతె! 

వృంత మెడ సేసి, తింక లతాంత మెంత 

తడవు కృశియించి సొబగులు చెడకయుండు? 


కం..నా ప్రియసఖి! అనురూప గు 

ణప్రతిమ! ప్రసన్నశీల! నవనీత శిరీ 

ష ప్రణయ మృదులహృదయ! క 

టా! ప్రాణము లుండ యెటు విడంబడి సయితున్‌?


కం..నాప్రేమ కుదిపి కులుకగు  

ణ ప్రతిభ జూపితి నశీల నవనీత విధీ

సుప్రభాతముగా కదిలే 

యీప్రాణముగాను దేహ మీశ్వర కృపగన్


తే..హృదయమా! ఆసయే లేదు మొదల పూల 

మీద, నభిలషించితి వొక్క మృదు సుమంబు 

చిరతరోత్కంఠ నెటులో సైచితివి; కాని 

కాలము నిరాశ తార్చెనే గతి భరింతు!


తే..ప్రేమమా మది దాహము ప్రియుని చెంత  

కామమా సకలంబగు కామి చెంత

కాలమా సహనమ్మగు కావ్య చెంత  

 మోక్షమా మోహ సుఖమగు మోము చెంత 


తే..భావభాసురమగు హృదంబరమునందు 

రక్తి లిఖియించుకొంటి వే రమణి రూపు, 

అదియె ముద మీక యలత కాస్పదమ యయ్యె 

గ్రహణగత మైన చంద్రుని కల విధాన.


తే..ఏ దొ చెప్పలేనిది గతి ఏల కినుకు 

రుచులు ఏమో తెలపకయే రుసలు ఏల 

మీకు యే కళో చెప్పండి మేలు జేయ 

అన్యధా వెతకాలిగా అసలు తెలియు


తే..పెళ్లి కాని పడుతు లున్న యిల్లు కళలు 

పెళ్లి పడతికైన మనసు పీకు చుండు 

తల్లి లల్లలాడు గుణము తల్ల డిల్లు 

సుదతులకు సిగ్గు దుఃఖము సుఖము విలువె


కం..స్వామీ యేమిది యనుటే 

కామిత భావపు సుఖమ్ము కనులే కలిసే 

మామీ ననక ప్రకృతి గా 

ప్రేమ ల చిగురే హృదయపు ప్రీతిగ మారుణ్



అర్ధనీరీశ్వర లీలలు (4)

(దాంపత్య సుఖలీల.. గోల శృంగార భరిత పద్య కావ్యం)


తే..వదలబోకు  చెలియనన్ను , వాదనొద్దు 

వేద నేల నింకయు నీకు , బేల వలెను !

చంద్ర బింబ వదన తెల్పు , జగడ మేల 

ఇంద్ర చాపము వలె కళ , యేల వెలుగు !


తే..*తేటవలపులు మొలక లెత్తినది మొదలు 

నిలిపితి పవిత్రరాగ మా నెలత యెడల, 

తుదకు భగ్నమనోరథ దోషి వగుచు 

ఏటి కారాటపడ మరులెత్తి మనస! 


తే.*వలపునిండిన యకలుషభావముందు 

ఎద్ది కాంక్షించి తది లభియింప దయ్యె! 

కడకు ననుతాప మొకడె నీయెడల నిలిచె, 

ఆమె ప్రణయ స్మరణచిహ్న మగుచు నకట! 


తే..*హృదయ మోహన మయి, ప్రేమమృదుల మైన 

తావకీన రీలాదాన దళపుటంబు, 

మామకీన ప్రణయభంగి మధుకణములు 

విడిచెడు విరక్తి బాష్పముల్‌ విడుచుపోల్కి. 


తే..హృదయమందుయాకర్షణ మృదులమైన 

యూహలందున ఉడికియు యున్నతంబు   

మా మనందు ప్రణయభంగి మధుకణములు 

విడిచెడు విరక్తి బాష్పముల్ విడుచు నారి 


తే.. తేటవలపులు మొలక లెత్తినది మొదలు 

నిలిపితి పవిత్రరాగ మా నెలత యెడల, 

తుదకు భగ్నమనోరథ దోషి వగుచు 

ఏటి కారాటపడ మరులెత్తి మనస! 


తే.. మాయ వలపు మొలకలెత్తి మనసు మొదలు   

తెలిపితి పలుకతోను లెత్తినది నెలఁత 

పిదప భగ్నమనోరథ చిత్త వగుచు 

ఎందు కారాటపడ మరులెత్తి మనస    


తే..*వలపునిండిన యకలుషభావముందు 

ఎద్ది కాంక్షించి తది లభియింప దయ్యె! 

కడకు ననుతాప మొకడె నీయెడల నిలిచె, 

ఆమె ప్రణయ స్మరణచిహ్న మగుచు నకట! 


తే..కలుపు తీయుము కలవాలి కాలమందు 

ఎద్ధి యాశించ తది లభియింప దయ్యె!

యెదన ననుతాప మొకడె నీయెడల నిలిచె,

ఆమె ప్రణయ స్మరణచిహ్న మగుచు నకట! 


తే..*లలిత లావణ్య పుర్ణమౌ లలన చెలువ 

మొదట కన్పట్టుచుండు నెల్లెడల నాకు, 

కనులు మూసినన్‌ విప్పినన్‌ కలలె వచ్చు; 

పగలు రే లను భేద మేర్పడక యుండ. 


తే..చలన చంచల చిన్నది చిత్త చెలువ 

వచ్చి వచ్చినట్లును రాక వాలుచూపు 

కనులు మూసినన్‌ విప్పినన్‌ కలలె వచ్చు; 

పగలు రేయి కలలు వెంట పాడు మనసు 


తే..*నిదుర లేనట్టి రేలను నెలత! నీదు 

ప్రణయ జాగరరక్తి నేత్రముల గాంతు, 

నిదురపట్టిన రేల గాంచుదు సుఖంబు 

స్వప్నపు టవస్థలనుజూసి సమయ తృప్తి 


తే..*భావభాసురమగు హృదంబరమునందు 

రక్తి లిఖియించుకొంటి వే రమణి రూపు, 

అదియె ముద మీక యలత కాస్పదమ యయ్యె 

గ్రహణగత మైన చంద్రుని కల విధాన.


అర్ధనీరీశ్వర లీలలు (5)

(దాంపత్య సుఖలీల.. గోల శృంగార భరిత పద్య కావ్యం)

మల్లాప్రగడ రామకృష్ణ 

కంటి కాటుక సూపులు కమ్ము చుండ 

కనులు కవ్వించి కాటేయు కళలు బుద్ధి 

పెదవి నంటిన నగవులు పిలుపు కళలు 

నమ్మ పేనాలు తీయును నమ్మి నాక

చిలిపి పలుగింజ దానిమ్మ సిలుక లొలక 

మదిని తొలిసేయు మగువల మాయ మెరుపు 

పలుకు పలికేను యదజూపి పమిట  కుదిపి 

కాలి గజ్జెల మోతతొ ఘల్లు ఘల్లు 

సాగి గుండెలో గుచ్చెడి సోకు కదలె 

యేటి కెరటాల మల్లెను ఎరుక పరచు 

ఎదను తాకుతూ మళ్ళగు ఎరుక పరుచు 

మొద్దు మొరటుగా గుండెలో మోదు గుండె 

ఎంకి సుట్టూన సేరియు యెగిరి గంతు 

హంస నడకల తీరులు హాయి గొలుపు 

హృదయ మదిలించు నోసారి ఇష్ట మొచ్చి 

వెంట పడకానె నుండ లే నేదు మారి !

నిత్య కవ్వింత కౌగిలీ నియమ సూరి 

వేడి నులిమేయు పేనాన్ని  విరియు చున్న 

నాదు ఎదసాటు పరువాలు నటన మీరు 

తట్టి సరిసేయు దాహాన్ని తాప  మందు 

రొదలు దూరమ్ము బెట్టియు దొరక పుచ్చు 

మొదలు సరిసేత్త మనుచునే మొక్క నాటు 

కడలికట్టాలు కన్నీళ్లు కాల తీరు

చురకలు సుగుణాల లలన చూపు కళలు  

చెరకుగడ కోరి చెలిమితో చేరువ కళ   

తరుణ సుఖమిచ్చి పొందిక తరుణి యేలు 

బరువు యనకయే బలపడు బంధమందు    

విసర చిఱునవ్వు వెన్నెల చెండ్లు కదల 

పూల పాలు పిదుక కళ పూని  కళలు 

వలపు కాంచన కొమ్మలు వదల లేక   

వలపుటుచ్చుల చూపులు  వాడి వేడి  

ప్రేమభావముల్‌ గను నూత్న ప్రీతి చెంద   

నడలు ప్రాయంపు సన్నల నడక సూప

కనుల నఱవాల్చి క్రీగంటికొసలు పాతి

తాక్షముల తోడకాంచియు  కాంచలేని 

తరుణి తపనలు సరియగు తాళమేయ 

పెడల వాలికల్‌ రాల నిల్చెడు వేళ   

మౌగ్ధ్య మెడబాయలేదు నా మదియు నింక   

భావబంధ మందిన విభ్ర మం  లతాంగి!"

*చిదికి చిదుకని వలపులన్‌ చెనకువగలు, 

విడిచి విడువని మౌగ్ధ్యంబు వడయు లజ్జ, 

సమయభరమును, వినయ ప్రసన్న బుద్ధి, 

ఒకటి నొకటి మచ్చరికించు చుండ నామె 

చలిత జపమని తలపులన్ చెనకువగలు, 

కలువ కదలని మౌగ్ధ్యంబు కలయు లజ్జ,

తరుణ తమకము తనువున తత్వ బుద్ది    

ఒకరి కొకరు మచ్చరికించు చుండ నామె

*సోగకన్నులు విప్పారజూచి ప్రియును 

పలుకుల హృదంతరార్థ మేర్పడగ ననియె; 

అస్ఖలిత మగు ప్రేమరహస్య సూత్ర 

విశద బుద్ధిన్‌ హృదయవాద కుశల యగుచు. 


స్నేహ కన్నులు విప్పార సిగ్గు ప్రియము 

తలపులు కళలు యేర్పడ తన్మయ ననె   

అవసరపు హృధ్య ప్రేమరహస్య సూత్ర

 ప్రణయ బుద్దిన్ హృదయవాద కుశల యగుచు.   


"సఖుల మనః ప్రియబంధము 

లఖండము లటంచు విందు మకటా! యెటులన్‌ 

లిఖియింపక తాళితివి, న 

ను ఖిన్న పడజేయుట తగునో నీకు సఖా! 


ప్రియశి మనః ప్రియభంధము       

ప్రియాతిప్రియమనుచు విందు ప్రియుడై యెటులన్‌

పయణింపక తాళితివి న    

ను యాసల పల్లకి యైన నో నీకు సఖా


అర్ధనారీశ్వరి లీలలు ..7


సీసము  

పెట్టకు పెట్టకు నెప్పుడు ఇబ్బంది 

చూడకు చూడకు చూపులు జార్చి 

తొందర తొందర తోడుగా ఎందుకు 

కాలము అంతయు కానిదవదు 

ఆకలి తీర్చుకో  ఆశల గుట్టుగా 

చేసి సంతోషమ్ము  చెలిమి రుచిని చూడు 

పందాలు కట్టకు పరువమ్ము వ్యర్ధము 

చేయకు అందుకో చిందు సుఖము 


ఆటవెలది      

వద్దు వద్దు హద్దు అంటూనే కవ్వించి 

చాక చక్య మంత చిమ్మ రించి  

ముందు వెనుక అనక ముద్దు ఆ లోచన  

అందు కున్న దంత హద్దు చేయి 

***


సీ.. పరుగులు ఉండవు ... పలకరింపు వెలుగుకు 
బతుకులు నిత్యమూ .. పాడు చుండు 
ఉరకలు ఉండవు ... ఉయ్యాల ఊపులు 
ఉజ్వల వెల్గులు ....  ఉండు చుండు 
కరుణతొ ఉన్నను ... కారుణ్య తలపులు 
కమనీయ వెల్గులు ... కాంచు చుండు 
సహనము చూపుతూ ... సాహస మునుచూపు 
సౌందర్య వెల్గులు ... సేవ చేయు 
 
తేటగీత 
సమరమును చేయుటయు తేలి సమముగుండు  
సహనమును చూపు టయు నిత్య సత్య మవ్వు
నిముషమును కూడ నష్టము నియమ ముండు 
సమము తెలుపుట సౌందర్య సాక్షి గుండు  
      

--(())--


*అశ్రుకణీకామలీమస మయిన యతని 
కౌతుకాభోగ నేత్రయుగ్మమ్ము, నపుడు 
తెఱచి యుండియు కనలేని తివుట లొదవె 
కలికి నవఘర్మకలుషితగండములను.

చిలికి మనసుగెలుచు చుండి చెలిమి గాను 
తలపు లుండియు కనలేని తీరమగుట 
గమ్యకాభోగ సూత్రయుగ్మమ్ము నపుడు 
అతని కళలు తీర్చుట కామి బుద్ధి   


ఆలివి నీవు నా మలుపు ఔదల చూపుల సందడేయగున్  
ఏలిక  మేను సేవ మది యేలుట నీకృప ధర్మమేయగున్ 
నాలిక మౌన దీక్షతయు నానుడి  చిత్తము నేస్తమేను  ఆ
ఏలిక శాంతిగా కను వియోగపు జూపుల ధార్మికమ్ముగన్ 

"నాయనుగున్ జెలీ! చెలిమినానిన చిత్తమె మెత్తగిల్లు, నా 
శాయతరంజనం బయి ప్రియంబు లిగిర్చిన యా దశల్‌ కడుం 
దీయము లేమి చెప్ప! విడదీసిన రేకులపూవు చంద మై 
పోయిన మైత్రి కే గతులు పో వలవంతలుదక్క నీ భువిన్‌. 

కాలము నీదిగా కలియు కామము నున్నతి మెత్తగిల్లు నా 
ఫాలము నీదిగా తడిసి పోవు రగిల్చియు వేడి సేవఁగాఁ
తాళము నేయుమా మనసు తాపము మార్చుము పూవు గంధమై 
నాళము మైత్రిగా విధిగనె నాదియుచూపితి నీది నా గతిన్                   

బాలా! యేటికి మాటలెత్తి నను నొవ్వంజేసె దింకన్‌, వృథా 
లీలాభ్రాంతి యటం చెఱుంగక వ్యధాలీనుండ నైతిన్‌ తుదిన్‌, 
చాలున్‌ నెయ్యపుతీరుతియ్యములు, బాష్ప జ్ఞానవిద్యార్థినై 
కాలంబు న్వయసున్‌ వ్యయించెదను సౌఖ్యంబౌను నిశ్శాంతిమై. 

బేలా పిల్పులుగాను యేల నను శోభింపా నువేద్రక్షలే      
లీలాక్రాంతి పుటం మెఱుంగక మజాలీ యండవైతిన్ తుదిన్ 
చాలున్ నవ్వులమేనుమోహములు బాష్ప ప్రేమ మాధుర్యనై 
కాలంబు న్వయసున్ రాయింపదల కామ్యంబౌను నీప్రీతి గన్   
***
నను వదలి  నీ వేటకు పోవద్దురా  

చిరు నగవు  చూపే మది పొంగెనురా  

విరహమును తెల్పే సమయమ్ము ఇదే 

వినయనును చూ పేందుకు వచ్చి పొరా యీశ్వరా 


అది ఇదని నే నెప్పుడు చేపన్నురా 

ఇది అదని వేదించుట లేదే నురా 

తరుణ మిది  నీ వెప్పుడు వావెంటనే 

పరువము ను నీ కర్పణ చేసేందుకే  యీశ్వరా


కల నిజము చేసేందుకు వేగమ్ము రా 

సహనమును చూపేందుకు కాలమ్ము రా  

నవ విధము నా పూజలు చేసేద  రా  

పలుపలుకు తో హాయిని  కల్పించెదా యీశ్వరా 


మన మనసు యేకమ్మగు క్షేమమ్ము రా  

కను లు కలలే కమ్మగ నేనుం డు  రా    

చనువు మనకే తామసమే కాదును రా

పనులు నీవంతు సమేకమ్మునురా  యీశ్వరా 

 

***




 



5, మార్చి 2024, మంగళవారం

 నేటి ప్రాంజలి ప్రభ.. దేవీ.. శ్రీదేవీ.. వృత్త మాల

ప్రతిరోజు చందస్సు గణాలు పొందు పరిచేద
గురువులు పండితులు వ్రాయగలరని ఆశిస్తూ..05/03..
***
Pranjali Prabha  వృత్త మాల
మాత్రా శ్రేణి..ర స య త త గ గ.. యతి.. 10

ధైర్య సాహసమేను విద్యాదైవమ్ము తోడ్పాటు గానే
సౌర్య వంతుడుగాను దేశా సౌఖ్యమ్ము ధర్మమ్ము గానే
ఆర్యపుత్రుడుగాను సత్యా ఆధ్యాత్మ మార్గమ్ము గానే
కార్య సిద్ధివలే సహాయమ్ కారుణ్య భావమ్ము దేవీ

నాకు విద్యల వెల్లువే ధ్యానా సత్య దారామృతమ్మే
లోకమందున ధైర్యపుణ్యశ్లోకాలు వళ్లించ లక్ష్య
మ్మే కళా మది మోక్ష ధర్మమ్మే నీతి సామర్ధ్య మూర్తిన్
చాక చక్యము జూపి సంసారం క్రాంతి నిచ్చేటి దేవీ

కాల నిర్ణయమే సవిద్యా కామ్యమ్ము కర్తవ్య దీక్షా
జ్వాల దేశమునందు దుష్టా జాడ్యమ్ము తర్మేటి శిక్షా
పాలకుండును సర్వ రాష్ట్రా పాఠ్యమ్ము తెల్పేటి రక్షా
వేళ మీరక సత్య సేవా విద్యా గాపాడుమా తల్లి దేవీ

మన్ననే మదివాక్కు సాధ్యా మాధుర్య సామ్మోహ సేవా
మన్నికై సహనమ్ము జూపే మంగళ్య బంధమ్ము సేవా
ఉన్న మార్గము నమ్మి జేసే యోనత్య లక్ష్యమ్ము సేవా
కన్న వారితొ జూపు ప్రేమ కర్తవ్య సర్వమ్ము దేవీ

ధ్యాన మార్గము నెంచి నిష్టా ధ్యాసా మహా ప్ర్రార్ధ నౌనే
మౌన లక్ష్యము గాను దాస్యంమౌ భక్తి సామాన్య మౌనే
మాన ప్రాణము విశ్వ కళ్యాణా ధ్యాన దారుడ్య మౌనే
వాన తీర్ధము పారమార్ధం వ్యాసార్ధమే ప్రేమ దేవీ

ఆకరమ్ములు సర్వ రక్షా సాధ్యా సమానమ్ము గానే
భీకరమ్ముల విద్య తోడై పూర్ణత్వ దాహమ్ము గానే
శ్రీకరమ్ముల నేస్తమే సు శ్రీలన్ సు బంధుత్వ మేనే
నీకరమ్ములు శ్రీకరమ్ముల్ నీ సాటి లేరమ్మ దేవీ

సామ్యమే చరితమ్ము సాధ్యా సామర్ధ్య సాంగత్యమేలే
కామ్య యున్నతినెంచ నిత్యా కర్తవ్య దాతృత్వ మేలే
రమ్యతే విషయమ్ము చాతుర్యమ్మేను మాటల్లు మేలే
సౌమ్యమే సహనమ్ము గానే సౌసీల్య బంధమ్ము దేవీ

కోరు కోకయు వచ్చి పోయే కోలాట బుద్దుల్ గ నేలే
చేరు వేయగు దుఃఖ మోనే చింతల్లొ చేష్టల్ గ నేలే
మారు పోకడ వచ్చిజేరే మానమ్ము  సౌఖ్యం గ నేలే
పారు నీదయ ధర్మ మౌనే పాఠమ్ము దీనమ్ము దేవీ

లోక శోకవినాశ కార్యా లోలా నతుల్ దివ్య వాణీ
నేకమౌ కళజూప సత్యా నీడా గతుల్ భవ్య వాణీ
స్వీకరమ్మగు లక్ష్య మార్గా స్వీకర్త బాంధవ్య వాణీ
శ్రీకరా భవ బంధ హృద్యా శ్వేత ప్రభా పూర్ణ దేవీ

నేటి ప్రాంజలి ప్రభ.. దేవీ.. శ్రీదేవీ.. వృత్త మాల
ప్రతిరోజు చందస్సు గణాలు పొందు పరిచేద
గురువులు పండితులు వ్రాయగలరని ఆశిస్తూ..05/03..
***
Pranjali Prabha  వృత్త మాల
మాత్రా శ్రేణి..ర స య త త గ గ.. యతి.. 10

ధైర్య సాహసమేను విద్యాదైవమ్ము తోడ్పాటు గానే
సౌర్య వంతుడుగాను దేశా సౌఖ్యమ్ము ధర్మమ్ము గానే
ఆర్యపుత్రుడుగాను సత్యా ఆధ్యాత్మ మార్గమ్ము గానే
కార్య సిద్ధివలే సహాయమ్ కారుణ్య భావమ్ము దేవీ

నాకు విద్యల వెల్లువే ధ్యానా సత్య దారామృతమ్మే
లోకమందున ధైర్యపుణ్యశ్లోకాలు వళ్లించ లక్ష్య
మ్మే కళా మది మోక్ష ధర్మమ్మే నీతి సామర్ధ్య మూర్తిన్
చాక చక్యము జూపి సంసారం క్రాంతి నిచ్చేటి దేవీ

కాల నిర్ణయమే సవిద్యా కామ్యమ్ము కర్తవ్య దీక్షా
జ్వాల దేశమునందు దుష్టా జాడ్యమ్ము తర్మేటి శిక్షా
పాలకుండును సర్వ రాష్ట్రా పాఠ్యమ్ము తెల్పేటి రక్షా
వేళ మీరక సత్య సేవా విద్యా గాపాడుమా తల్లి దేవీ

మన్ననే మదివాక్కు సాధ్యా మాధుర్య సామ్మోహ సేవా
మన్నికై సహనమ్ము జూపే మంగళ్య బంధమ్ము సేవా
ఉన్న మార్గము నమ్మి జేసే యోనత్య లక్ష్యమ్ము సేవా
కన్న వారితొ జూపు ప్రేమ కర్తవ్య సర్వమ్ము దేవీ

ధ్యాన మార్గము నెంచి నిష్టా ధ్యాసా మహా ప్ర్రార్ధ నౌనే
మౌన లక్ష్యము గాను దాస్యంమౌ భక్తి సామాన్య మౌనే
మాన ప్రాణము విశ్వ కళ్యాణా ధ్యాన దారుడ్య మౌనే
వాన తీర్ధము పారమార్ధం వ్యాసార్ధమే ప్రేమ దేవీ

ఆకరమ్ములు సర్వ రక్షా సాధ్యా సమానమ్ము గానే
భీకరమ్ముల విద్య తోడై పూర్ణత్వ దాహమ్ము గానే
శ్రీకరమ్ముల నేస్తమే సు శ్రీలన్ సు బంధుత్వ మేనే
నీకరమ్ములు శ్రీకరమ్ముల్ నీ సాటి లేరమ్మ దేవీ

సామ్యమే చరితమ్ము సాధ్యా సామర్ధ్య సాంగత్యమేలే
కామ్య యున్నతినెంచ నిత్యా కర్తవ్య దాతృత్వ మేలే
రమ్యతే విషయమ్ము చాతుర్యమ్మేను మాటల్లు మేలే
సౌమ్యమే సహనమ్ము గానే సౌసీల్య బంధమ్ము దేవీ

కోరు కోకయు వచ్చి పోయే కోలాట బుద్దుల్ గ నేలే
చేరు వేయగు దుఃఖ మోనే చింతల్లొ చేష్టల్ గ నేలే
మారు పోకడ వచ్చిజేరే మానమ్ము  సౌఖ్యం గ నేలే
పారు నీదయ ధర్మ మౌనే పాఠమ్ము దీనమ్ము దేవీ

లోక శోకవినాశ కార్యా లోలా నతుల్ దివ్య వాణీ
నేకమౌ కళజూప సత్యా నీడా గతుల్ భవ్య వాణీ
స్వీకరమ్మగు లక్ష్య మార్గా స్వీకర్త బాంధవ్య వాణీ
శ్రీకరా భవ బంధ హృద్యా శ్వేత ప్రభా పూర్ణ దేవీ


విన్న పాలను విన్న వించ విఘ్నాలు మాపేటి దేవీ

కన్న వారికి మంచి చేయు కాసేటి మోసేటి దేవీ

****


మల్లాప్రగడ రామకృష్ణ

అంశం.. మనసు

6-3-2024


విన్న పాలను విన్న వించ విఘ్నాలు మాపేటి దేవీ

కన్న వారికి మంచి చేయు కాసేటి మోసేటి దేవీ

వెన్న ముద్దలు ఆరగించు వేనోళ్ల మొక్కేటి దేవీ

 వెన్నెలై దయ చూప గల్గు విశ్వాన్ని యేలేటి దేవీ 


రాదు రాదను మాట నోటన్ రాణించ నీ శక్తి లీలన్

పోదు పొదను విద్య పంచెన్ భోగించ నీ యుక్తి లీలన్

కాదు కాదని లీల జల్లుల్ గర్హించ నీ ముక్తి వానల్

లేదు లేదన బోకు నేర్చన్ లీలావిశేషాలు దేవీ


ప్రీతి నిచ్చెడి  నీతి వాక్కుల్ విశ్వాస నీ భక్తి సేవల్

ఖ్యాతి పెంచెడి గీత వెల్గుల్ కాలమ్ము నీ మాయ శోభల్

జ్యోతి కాంతులు నిత్య శోభల్ జోలాలి నీ పాట మార్పుల్

నాతి వై పలు ధర్మ మై సన్మార్గంబు వై వెల్గు దేవీ 


కావ్య దీపము నిత్య వేల్గు కార్యమ్ము జే సేటి జీవిన్

దివ్య బావుక సత్య మార్గ తేజమ్ము నందించు జీవిన్

అవ్యయం మది విద్య నెంచి సామర్థ్య మేజూప జీవిన్

సవ్యమై యలరార బుద్ధి సత్యమ్ము తెల్పేటి దేవీ


చాలు చాలని చెప్ప లేను జాధ్యమ్ము   చెప్పాను లేకన్

మేలు మేలని ఒప్ప లేను మో హమ్ము నేమర్వ లేకన్

పాలు నీళ్లని తెల్ప లేను పాపమ్ము మార్చేది లేకన్

వీలు నీదయ నౌను తల్లి విశ్వమ్ము యేలేటి దేవీ


కంచి చేరితి నీదు భక్తి కామ్యమ్ము జూపేటి తీరుణ్

సంచి తమ్ముగు నీదు నీడ సమ్మోహ మాపేటి తీరుణ్

వాంచి తమ్ముగు నీదు పూజ వాశ్చల్య లక్ష్యమ్ము తీరుణ్ 

మంచి మాటలు నీదు భుక్తి మమ్మేలు నీ యుక్తి దేవీ


రంగు రంగుల రవ్వ వెల్గు రంగేళి రాజ్యంబు నందున్

చెంగు చెంగున దూకు వెల్గు చెంబేలి పువ్వుల్ల నందున్ 

హంగు పొంగుల గువ్వ వెల్గు హంగామ జూఫుల్లు నందున్

పొంగు బంధమ్ము జూపు వెల్గు ప్రోశ్చాహ పర్చేటి దేవీ


నిత్య మానస సౌఖ్య మౌను నీడల్లె వెన్నంటి శక్తిన్

సత్య సాధన ధర్మ మౌను సంతోష సాహిత్య శక్తిన్

ముత్య మైనది వెల్గు లౌను ముఖ్యమ్ము ప్రేమైన శక్తిన్

పైత్యమే కళ మాట లౌను దైవమ్ము తోడౌను దేవీ


అల్లరే మది పద్య మౌను యాశ్చర్య పర్చేటి కళల్

చిల్లరే గతి విద్య లౌను చేయూత లేనట్టి కళల్

పిల్లలే విధి మాట లౌను పీయూష బంధమ్మ కళల్

చల్లనీ పిలుపాయె నీదు చిన్మాయ మాపైన దేవీ

రామకృష్ణుని లీలల్ స్ఫూర్తీ రమ్యత్వ చేయూత శోభల్

శోమ లీలలు గానే స్ఫూర్తీ స్తోత్రమ్ము తో పూజ శోభల్

ప్రేమ రాగ మనస్సే స్ఫూర్తీ ప్రేమత్వ లక్ష్యమ్ము శోభల్ 

శ్యామ సుందర లీలే స్ఫూర్తీ సాధ్యాయ దీపమ్ము దేవీ


నా మనోగత శక్తీ  నీవే నాదంబు గానంబు నీవై

ప్రేమ రూపము యుక్తీ నీవే వేదార్ధ సారంబు నీవై

క్షేమమే యగు భక్తీ నీవే కీర్తింతు రూపంబు నీవై 

శ్రీ మయంబగు ముక్తీ నీవే శ్రీ శక్తి రూపంబు దేవీ


సర్వ జీవుల నాదమ్మేలే సంగీత సాహిత్య రాజ్ణీ

నిర్వ హించును లోకార్ధమ్మై నీ దృష్టి నీశక్తి రాజ్ణీ

సార్వ భౌముని సర్వార్ధమ్మే సంతోష సంతృప్తి రాజ్ణీ

పర్వమై సహ పాండిత్యమ్మే పాఠమ్ము పత్రాక్షి దేవీ


జ్ఞాన నేత్రము కల్పించే విజ్ఞానమ్ము పంచేటి ప్రేమా 

ధ్యానమేగతి సౌలభ్యమ్మే దానమ్ము చేసేటి ప్రేమా 

మానమే విధి మార్గంబేగా మానుష్య తత్త్వమ్ము ప్రేమా 

మౌనమే మది వాశ్చల్యమ్మే మోక్షమ్ము నిచ్చేటి దేవీ


శోభితా నన సిందూరా శ్రీస్తోత్రస్య మూల్యమ్ము నేత్రే

ప్రాభవమ్మగు సూర్యాధిత్యా ప్రాధాన్యతా శక్తి నేత్రే

వైభవమ్మగు చంద్రాదిత్యా వైఫల్య పూర్ణత్వ నేత్రే

లాభమే శుభ జీవంమౌనే లాలిత్వ భావమ్ము దేవీ


మానవుల్ కళ విశ్వాసమ్మే మాధుర్యమ్మే భూతళమ్మే

దానవుల్ కళ సూర్మార్గం మేధారూప  మ్మై లోకంబు కమ్మే

ప్రాణముల్ సహ వాశ్చల్యమ్మై ప్రావిన్యమ్మే సీతళమ్మే

మానమే విధి మౌనమ్మే సా మాన్యమ్ము మోదమ్ము దేవీ


రక్త  వర్ణము భక్తీ రక్తీ రమ్యత్వమ్మే స్వాహ తృప్తీ 

రక్షుడై గుణ దీక్షా దక్షా రౌరత్వమ్ము  ధణాఢ్య తృప్తీ 

భక్తులే కథ చెప్పేకామ్యమ్ బంధుత్వ బంధవ్య తృప్తీ 

భుక్తికే గతి దాంపత్యమ్మే ప్రోత్సాహ వైనమ్ము  దేవీ


ఈ ప్రపంచమె తెల్పే విద్యా యీశా మహేశా సువాక్కుల్

దాపముల్ నశియిమ్చే వేగన్ ధన్యంబు నాజన్మ వాక్కుల్

కోపమున్ వదిలించే వేగన్ క్రోదమ్ము మాపేటి వాక్కుల్

జూపు సత్పదమున్ తేజమ్మై శో భాళి నిత్యంబు దేవీ 


అమ్మ నీకృపతో మామార్పే ఆశ్చర్య కావ్యమ్ము లిచ్చెన్

కమ్మనౌ పదముల్ రాహించున్ కర్తవ్య లక్ష్యమ్ము తెల్పెన్

నెమ్మి కూర్చగనే తేజమ్మై  నీకే నమోవాక్కు నాకున్

రమ్ము నాకిడుగా వేగంధీరత్వమ్ము సంప్రీతి దేవీ 


ర స మ త  త గ గ యతి..10

వెన్న ముద్దలు ఆరగించు వేనోళ్ల మొక్కేటి దేవీ

 వెన్నెలై దయ చూప గల్గు విశ్వాన్ని యేలేటి దేవీ 


రాదు రాదను మాట నోటన్ రాణించ నీ శక్తి లీలన్

పోదు పొదను విద్య పంచెన్ భోగించ నీ యుక్తి లీలన్

కాదు కాదని లీల జల్లుల్ గర్హించ నీ ముక్తి వానల్

లేదు లేదన బోకు నేర్చన్ లీలావిశేషాలు దేవీ


ప్రీతి నిచ్చెడి  నీతి వాక్కుల్ విశ్వాస నీ భక్తి సేవల్

ఖ్యాతి పెంచెడి గీత వెల్గుల్ కాలమ్ము నీ మాయ శోభల్

జ్యోతి కాంతులు నిత్య శోభల్ జోలాలి నీ పాట మార్పుల్

నాతి వై పలు ధర్మ మై సన్మార్గంబు వై వెల్గు దేవీ 


కావ్య దీపము నిత్య వేల్గు కార్యమ్ము జే సేటి జీవిన్

దివ్య బావుక సత్య మార్గ తేజమ్ము నందించు జీవిన్

అవ్యయం మది విద్య నెంచి సామర్థ్య మేజూప జీవిన్

సవ్యమై యలరార బుద్ధి సత్యమ్ము తెల్పేటి దేవీ


చాలు చాలని చెప్ప లేను జాధ్యమ్ము   చెప్పాను లేకన్

మేలు మేలని ఒప్ప లేను మో హమ్ము నేమర్వ లేకన్

పాలు నీళ్లని తెల్ప లేను పాపమ్ము మార్చేది లేకన్

వీలు నీదయ నౌను తల్లి విశ్వమ్ము యేలేటి దేవీ


కంచి చేరితి నీదు భక్తి కామ్యమ్ము జూపేటి తీరుణ్

సంచి తమ్ముగు నీదు నీడ సమ్మోహ మాపేటి తీరుణ్

వాంచి తమ్ముగు నీదు పూజ వాశ్చల్య లక్ష్యమ్ము తీరుణ్ 

మంచి మాటలు నీదు భుక్తి మమ్మేలు నీ యుక్తి దేవీ

****
యమునా!* జననిగఁ బ్రజలలొ యాసలు తీర్చన్ 
సముచితముగ కాచుచున్న చక్కని తల్లీ!
ప్రముదముతోడనె భజింతు ప్రభలే యగుటన్ 
సముదంచిత కవన ధార జయదా దేవీ

అంబా శాంభవి భవాని యాశ్రిత దుర్గా
లంబోదర మాతవమ్మ లాలించమ్మా
కంబుగ్రీవా నతిగొనికాలము హంత్రీ 
దంబంబుల బాపుమమ్మ  దానవ దేవీ

వర సిద్ధి బుద్ధి తోడుగ వాక్కుల పంచెన్ 
వరముల నోసగెడు గణేశ భయభక్తులతో
నిరతము నిను గొలిచెతల్లి నిజమే యగుటన్ 
మరువక మము గావుమయ్య మదిలోనెపుడున్||

అల్లెద పద్యము తెలుగున ఆలన పాలన్ 
యల్లరి వేషము కలవర యాసగు లేలన్
చల్లని చూపుల కలయిక చలమై తృప్తిన్
తెల్లని వెలుగుల పరమగు తేలుచు దేవీ

నిలువెల్లనుభయముచేత నీరగు చుండన్
తలదాచుకుంటి తరణము తక్కెర చెందున్
నలనల్లని మేని ప్రభలె నయనములమరెన్
కళలే నిలిపిన జగతిన కానుపు దేవీ

నిను మిత్రుండను రజితము విలువేయగుటన్
గనకముబుద్ధియును నాల్గు కారణములుగన్
కనుగొను రూప కమనీయ కాలమగుటయున్
 కని దేవ గురుడుగ సెప్పె నన్నిట దేవీ

అందము లేకయు యగుపడి ఆకర్షితిగన్
అందములో రవి ని కాను ఆశ్రిత వాణిన్
అందము లో శశి ని కాను ఆ సత్తి యగున్
పొందుసు ఖమ్ము కలిగించు పోలిక దేవీ

మనసు శృతిలయలకు మగువ మాత్రము బుద్ధిన్
తనువు విలువ తెలుపగలగు తాపము నందున్
మనదను వశము సుఖమగు మానస మందున్
అణుకువ బ్రతుకు అల మల్లె ఆటలు దేవీ 

ధనమే పొందవచ్చు మనసు ధర్మము తప్పున్
మనకే నిద్ర కరువగుట. మర్మము వల్లన్
క్షణమే సుఖమగుచు నుండు క్షామము పెర్గున్
మనసే శాంతికి మనుగడ మావలి దేవీ

25, ఫిబ్రవరి 2024, ఆదివారం


691..జ త త గ గ.. యతి..7


స కామ బుద్ధీ మనో శక్తీ ధ్యా

న కాల యుక్తీ మనో రక్తీ ధ్యా

స కావ్య ముక్తీ యశో రక్షా ధ్యా

స కామ్య విద్యా యశో శ్రీదేవీ


692.. స్నిగ్ధ.. భ మ మ.. యతి లేదు


కాలము తీర్పే సంసారమ్మే

జ్వాలలు ఓర్పే శృంగారమ్మే

ప్రేలుడు వల్లే సందేహమ్మే

కాలుని వేటేలే శ్రీదేవీ


693.. స్పోటిక క్రీడామ్..స య మ మ మ.. యతి..10


మనసౌను యిచ్ఛా మార్గమ్మే మాధుర్యమ్మే ప్రేమా

తృణమైన సేవా భావమ్మే తత్వార్ధమ్మే ప్రేమా

ఋణమైన పృథ్వీ లక్ష్యమ్మే రుణ్మా యే ప్రేమా

క్షణమైన తృప్తీ స్నేహమ్మే క్షేమం శ్రీదేవీ


694.. స్మృతి.. జ భ స య..యతి..7


సుఖాల నీడన శుభములు ప్రేమా

వికాశ మే మతి విభవము ప్రేమా

ప్రకాశ మే విధి ప్రముఖము ప్రేమా

సకాల సౌఖ్యము సమయము దేవీ



2, జనవరి 2024, మంగళవారం



బ్రహ్మతత్వభావాలు ..౧ సీస పద్యాలు 


అన్యాయమును దుష్టబుద్ధిని తరిమియు 

ధీరుడుగాను విధేయుడగుట, 

సిద్ధాంతములనువశీకరములగాను     

నిర్భీతిగా నుద్ఘాటించుచుండె 

తెగువతో కాపాడి గుప్తవిద్య లనేవి  

నేర్పి మానవుని పురోభివృద్ధి

పరిపూర్ణతల యెడ పరమావిధినిచూపి    

జనుల సేవయు చేయు జపత రామ 


జాగరూకత కలిగి యుండుటయు రామ 

మానవ పురోభివృద్ధిగా మనసు పంచు 

ప్రజల రక్షణ ధ్యేయంగ పాకులాడు 

ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు   



***

అంబవు నీవునా మలుపు ఔదల చూపుల సందడేయగున్  

అంబర మేను సేవ మది అక్కడ నీకృప ధర్మమేయగున్ 

బంబర మౌన దీక్షతయు బంధపు చిత్తము నేస్తమేను  ఆ

డంబర శాంతిగా కను విడంబన జూపుల ధార్మికమ్ముగన్