15, మార్చి 2014, శనివారం

118. Love story - 11/22( అడవి మల్లెకు పెళ్లి )


అది ఒక మారు మూల అడవి ప్రాంతం,  చిన్న వాగు ప్రక్కన ఒక పదిహేను కుటుంబాలు నివసిస్తున్నారు. వారికి నవసమాజముతో సంభందము ఉండదు, ఆధునిక సౌకర్యాలు ఏమి ఉండవు. కాని వారు కాయధాన్యాలు, పప్పుధాన్యాలు, పండించు కుంటు  ఉంటారు.మరియు దొరికిన జంతువుని కాల్చుకొని తింటూ ఉంటారు. వీరిలొ పెద్దను గౌరవిమ్చుతారు. వారుచెప్పిన విధముగా నడుచుకోవాలి, ఎదురు తిరిగిన వారిని అక్కడనుండి పంపించి వేస్తారు. అట్లాగే క్రొత్తగా పెళ్లి చేసుకున్నవారిని దూరముగా ఉన్న గ్రామాలల్లో కొన్ని నాళ్ళు బ్రతకాలని తరువాత తిరిగి ఇక్కడకు  రావాలని ఒక ఆంక్ష పెట్టుకున్నారు.

మనం హోలీ పండుగ వారికి కూడా  వెన్నెల పండుగగా ఒక ప్రత్యేకతముగా జరుపుకుంటారు. అదే రోజు కొత్త  జంటలకు వివాహము చేస్తారు. ప్రేమించినవారికి పొటీలు పెడతారు.  ఇదే రోజు వంటి నిండా నూనె వ్రాసుకొని కుస్తీ పోటీలు, ఆడవారికి పూసలతొ అలంకరణ పోటీలు, రంగులు చల్లుకుంటూ సరద సరదాగా ఉంటారు.

హోలీ రోజున " అడవి పెద్ద"  కూతురు మల్లి ని మబ్బుకు ఇచ్చి పెద్దల సమక్షమున తప్పెట్ల వాయిద్యముల  మద్య వివాహము చేసినారు.

అడవిని వదలి గ్రామములో బ్రతకమని అడవి దినుసులు, ముంత  నీరు ఇచ్చి అమ్దరూ సాగనంపారు అడవినుండి త్వరలో తిరిగి రమ్మని ఆశీర్వదిమ్చారు. ఇట్లు చేయుట ముఖ్య కారణము ఇక్కడనుండి పోయి న వారు ఎంతో  కొంత విద్యనేర్చుకొని వస్తారని వారి నమ్మకము.

అందరికి దండములు పెట్టి " మబ్బు మల్లిక " నగరమునకు బయలుదేరారు.  నడుస్తున్నకొద్ది వారికి గ్రామములనేవి  కనబడుటలేదు. వారు దారిలో సొమ్మ సిల్లి పడి పోయిన వ్యక్తిని చూసారు. వారికీ తమవద్ద ఉన్న నీటిని త్రాగించి. తమవద్ద ఉన్న దుంపలు పెట్టారు.

అవి తిని ఓపికతో మీరు అడవిలో ఉండే వారు కదా, నేను మీకు తెలియక పోవచ్చు. మీ నాన్నగారు నాకు బాగా తెలుసు నేను పెద్ద వాడ్ని అయ్యాను నాకు ఓపిక తగ్గింది. మనం ఉండే అడవికి పోతున్నాను. నాకు మీరు చేసిన సహాయము మిమ్ము రక్షిమ్చుతుమ్ది అని దీవిమ్చాడు.

నా దగ్గర ఉన్న పూసలు, రుద్రాక్షలు, శంఖాలు, జంతువుల కొమ్ములు, చర్మాలు, అన్ని మీకిస్తున్నాను. వీటి ని అమ్ముకొని జీవితము గడపండి.  నా  అంతిమ శేష జీవితము అడవిలో గడుపుదామను కుంటున్నాను . 

ఇక్కడకు కొంత దూరములొ ఒక పెద్ద రోడ్డు వస్తుంది. అక్కడ కు ఒక పెద్ద బస్సు వస్తుంది. మీరు ఈ ఎర్ర గుడ్డ చూపి వారిని బ్రతిమాలి ఎక్కండి తర్వాత మీ భవిషత్ మీరె నిర్ణ ఇంచు కోండి. ఇదిగో ఈ డబ్బులు మీ దగ్గర ఉమ్చు కోండి అని చేతికి ఇచ్చి వెనుతిరిగాడు పెద్ద మనిషి. అంతలో బస్సు రావటం దానిలో ఎక్కడం జరిగి పోయింది.

    

అంతలో బస్సులో ఏదో పోయిందని వెదుకుతున్నారు.  అది ఒక ఉంగరం అది మల్లిక కాలి వద్దకు పడింది. అది ఎవరిదా అని అడిగుతున్నది అప్పుడే, అప్పుడే ఒక పెద్దావిడ వచ్చి ఇది  నాది నాకిచ్చేయమని అడిగింది. మీకివ్వ  టానికే  మిమ్ము పిలిచింది.  అన్నది మల్లిక.  ఆ బస్సులోనే ఒక మూల ఇద్దరు క్రింద కూర్చొని ఉన్నారు. బస్సు లో టికెట్టు ఎక్కడకు అన్నప్పుడు పెద్దావిడ చెప్పినవూరు చెప్పింది మల్లికా. తనవద్ద ఉన్న బంగారు కాసులు ఇచ్చింది. కండక్టర్ తీసుకొని వెళ్లి పోయాడు.

మల్లి క బస్సు బయలు దేరుతున్నాప్పుడు నిద్రపట్టక అట్లాగే కూర్చొని ఉన్నది. అంతలో తనకి ఏదో వాసన వచ్చిన నట్లు గమనించింది. వెంటనే బస్సు పోతున్నప్పుడు పెద్దావిడ సీటు ప్రక్క పెద్ద "తేలు " ప్రాకటం చూసిమ్ది. వెంటనే క్రింద ఉన్న చెప్పుతో దాన్ని చంపటం జరిగింది. పెద్దావిడ మేలుకుంది. నన్ను రక్షిమ్చావు. నీవు దానిని చంపకపోతే నాకే ఎంతో భాద పడాల్సి వచ్చేది.

ఇమ్తకీ మీరెక్కడనుమ్చి వచ్చారు ఎక్కడకు పోతున్నారు, మీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా, అది చాలా పెద్ద కధ  అమ్మగారు. మరి నాకు చెప్పవే నేను వింటాను ఇటురా ఇక్కడ కూర్చొని చెప్పు అన్నది పెద్దావిడ.      

             అమ్మగారు మేము పెరగిన అడవితల్లిని వదిలి, మమ్ము ముద్దుగా పెంచిన తల్లి తండ్రులను వదిలి, మాకు ధైర్యము నేర్పిన గురువుగారిని వదిలి, స్నేహితులను, మిత్రులను వదిలి మా ఆచారము ప్రకారము పెళ్లి ఐన తర్వాత బయట ప్రపంచమును చూడాలి అనేది మా ఆడవి పెద్దల నిర్ణయం దాని ప్రకారము మేము వచ్చాము అమ్మగారు.

అది సరే మీ ఇద్దరిలో ప్రేమ ఎట్లా మెదలైనది,  అది వివరముగా చెప్పు అని అడిగింది పెద్దమ్మ మల్లిని.

ముసి ముసి నవ్వులతో మీరడుగు తుంటే  నాకు సిగ్గే స్తుంది  అమ్మగారు. నీ సిగ్గు ఇప్పుడు ఎవరు బయటకు చెప్పరులే జరిగింది చెప్పు.

మా పాక ఎదురు మరోపాక ఉండేది. ఆ పాకలో మబ్బు అనే వాడు ఉండేవాడు. అతడు ఎవరు ఏది చెప్పిన పని చేసి పెట్టేవాడు. నన్ను ఎప్పుడూ అదేపనిగా చూస్తు ఉండేవాడు.

అతని చూపులో  నాకు ఏదో ఆకర్షణ కనిపించింది. అంతే  ఒక్క సారి "మబ్బును"  చూసా ఒక వెలుగు కిరణం నా వళ్ళు చేరింది. నాలో ఏదో తెలియని తాపము పెరిగింది.  మనసులో ఏదో కావాలని యద రోదచేయటం మొదల పెట్టింది. అపుడే మా అమ్మ స్నానము  చేయి అసలే మనది తడికల ఇల్లు ఎవరి కళ్ళు పడ్డ కష్టం. త్వరపడు అన్నమాటలకు మల్లి సరే అన్నది.

మబ్బు మాత్రము తడికలపై ఉన్న బట్టలు చూసి ఎప్పు డోస్తుందా అని ఎదురు చేసేవాడు. అంటే నేను కూడా  ఉడికించటానికి కట్టి కట్ట నట్లుగా, బట్ట కట్టి ఉడికించే దానిని. అంతే  ఉండ బట్టలేక మబ్బు దగ్గరకొచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు.

అప్పటి దాక నాకు ప్రేమ అనేది ఏమిటో తెలియదు. మబ్బు చెప్పిన తర్వాత నా వళ్ళు జలద రిమ్చిమ్ది . అంతే  లోపలి పరుగెత్తాను నేను " అది నా మొదటి అనుభవము".

ఒక నాడు మబ్బును కమ్మేసింది మేఘం. ఎంత ప్రయత్నిమ్చిన వెలుగును చూడలేక పోయినాను.  మేఘము ఎప్పుడు పోతుందా నా యి కళ్ళు కాయలు కాసేదాక కూర్చొని అదే పనిగా మబ్బును చూస్తూ కూర్చున్నాను.  అంతలో నాకు కళ్ళంబడి నీలు తిరిగాయి, అప్పుడే తలమీద  చినుకు పడింది. కిరణము రాలేదు కాని చినుకులతో వొళ్ళంతా తడిసి పోయింది.  నాలోని అందాలు పురివిప్పిన నెమలి లాగా, విచ్చు కున్న పుష్పం లాగా మారింది.

ఇంట్లో ఉండు  బయట తడవకు మల్లి, మబ్బు వస్తాడు. కిరణం తో వస్తాడు. మేఘం కురిసి వెళ్లి పోతుంది ఇది ఎప్పుడు జరిగే విషయం .  ముందు   లోపలకు వచ్చి వళ్ళు వెచ్చ చేసుకో అని గట్టిగా అరిచింది.  అంతే లోపలకేల్లి వంటి మీద బట్టలు విప్పి మంట దగ్గర కాచు కుంటున్నాను.  ఏమిటే చీన్న పిల్లలాగ బట్టలు లేకుండా కూర్చున్నావు ముందు బట్టలు కట్టుకో అని అన్నమాటలకు ఉలిక్కి పడింది మల్లి.  ఒక్క సారిగా నాలో చిన్నప్పుడు పక్షులవద్ద జిమ్కల వద్ద అడుకున్నది గుర్తుకొచ్చింది నాకు.       
                                           

                                                                    

ఒక నాడు మా ఇంట్లో పెద్దలు ఎవ్వరు లేరు, అది అదును చూసుకొని లోపలకు వచ్చాడు మబ్బు. నన్ను బయటకు రమ్మన్నాడు. పువ్వులు తెచ్చాను నీకు ఇస్తానన్నాడు. పడ్లు తెచ్చాను నీకు ఇస్తానన్నాడు. భయముతో మా ఇంటి దగ్గర చెట్టు కాడకైతే వస్తానని చెప్పి అతనితో ముందుకు నడిచాను.

చెట్టు చాటుకుకు పోగానే అమాంతముగా తన బాహు భందాలలో ఇరికించి నా పెదాలు ఒక్కసారి ముద్దాడి నా వళ్ళంతా నిమిరాడు. అంతే  నాలో తెలియని భయము ఏర్పడి ఒక్కసారి మబ్బును తోసి ముందుకు జరిగా అంతే నా పయట జారి నా అందాలు అతని కంట పడ్డాయి, మబ్బు చేతికి చిక్కకుండా లోపలకు పరు గెత్తాను  "నా  రెండవ అనుభవము". నన్ను పట్టుకోలేక క్రింద పడ్డాడు నా మబ్బు. ఎవ్వరో వస్తున్నట్లు గమనించి చల్లగా తప్పుకున్నాడు నా మబ్బు.

ఆ రోజునుంచి నాకు నిద్ర రావాటములేదు, మరోసారి మబ్బును కలవాలని ఒకటే కోరిక నన్ను వేమ్బ డించింది మబ్బు ఆన్న మాటలు గుర్తుకు తెచ్చుకున్నాను " నా మనసు నీది, నీ మనసు నాది, నన్ను నీ ప్రేమలో ముమ్చెయి, నీ మాటలను ఎప్పుడు జవదాటను నాకు నీవు, నీకు నేనుగా జీవిద్దాము అన్న మాటలు గుర్తుకొ చ్చి నవ్వుకుంది మల్లి

ఒక్క సారి బస్సు శబ్దం చేస్తూ ఆగింది అమ్దరూ గబా గబా దిగారు. మబ్బు , మల్లి, పెద్దమ్మ, కూడా దిగారు. ఎందుకు ఆపారు అని అడిగితె ఇక్కడ దగ్గరలో పెద్ద చెరువు ఉంది. అక్కడకు అడవి నుండి ఏనుగుల మంద  వస్తున్నాయి.  అవి మన బస్సును చూసాయను కుంటే మొత్తం  బస్సుపై కి వస్తాయి అందుకే ముందు  జాగార్తకు ఇక్కడ ఆపాము అన్నారు బస్సు నడిపేవారు.

ప్రక్కనే చిన్న చిన్న టెంటులు వేసి అక్కడ పడక కుర్చీలు  వేసి విశ్రాంతికి ఏర్పాటు చేసారు. అమ్దరూ విశ్రాంతి తీసు కుంటున్నారు. అంతలో పెద్దమ్మ  మీ ప్రేమ విషయం ఇంట్లో వాల్లకు తెలిసిందా లేదా అని అడిగింది

అందుకే ఒకనాడు మానాన్న లేని సమయాన మా అమ్మ వద్దకు నేను మబ్బు కలసి పోయి మేమిద్దరం పెళ్లి చెసు కుందా మను కుంటున్నాము అన్నాము మా అమ్మతో.

మీరు తొందర పడకండి మీనాన్నతొ మాట్లాడి మీకు పెళ్లి మేమే చేస్తాము అన్నది మా అమ్మ .

అంతలో తండ్రి ఇంట్లోకి  వస్తూనె మన అమ్మాయికి  మంచి సంభంధం చూసాను , అబ్బాయి చాలా మంచివాడు. అబ్బాయి పేరు మేఘం బాగుంది కదూ పేరు అని భార్యతో చెప్పాడు.

భార్య మల్లి ప్రేమ విషయం చెప్పింది మొగుడుతో అప్పుడు అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు "ప్రేమ లేదు దోమలేదు నేను చూసిన వాడ్ని పెళ్లి చేసుకోవాలి అన్నాడు.

మా అల్లి తండ్రులు కాసేపు ఘర్షణ పడి చివరకు మా కుల ఆచారము ప్రకారము "ఓ అమ్మాయిని ఇద్దరు పెళ్లి చేసుకుంటామని వస్తే వాళ్లకు పరీక్షలు పెడతారు "  అట్లాగే మీరు కూడా మీ అమ్మాయి కోసం పెట్టండని భార్య సలహా ఇచ్చింది.

అమ్మ మాటలకు నాన్న శాంత పడి అట్లాగే " మేఘం, మబ్బు " తల్లి తండ్రులకు ఈ విషయం చెప్పి వస్తాను వారికి ఇష్ట మైతే నాకు ఎందుకు  అబ్యంతరము అన్నాడు.                
కులపెద్దలను పిలిపించి అన్ని  విషయాలు చెప్పి ఇద్దరి ఇష్టాలను దృష్టిలో పెట్టు కొని మూడు పరిక్షలు పెట్ట దలిచారు.

మొదటి ప్రశ్న: దూరముగా ఉన్న భగవాన్ కొండ పైన రకరకాల చీరలు వ్రేలాడి ఉంటాయి. వాటిలో మల్లి కకు ఇష్టమైనది, కట్టుకున్నది, ఉంటుంది. అది తెచ్చినవారు విజయము పొందినట్లు. ఆక్కడ రెండు పలుగులున్నాఇ వాటినిచేరోకటి  తీసుకొని కొండపైకి పోయి అక్కడ  పాతి  చీర ముందుగా తేవాలి అన్నారు   
                                            

 
           మేఘం మబ్బు ఈ పరీక్షకు సిద్ధం అయ్యారు. అక్కడ ఉన్న పిల్లలు పెద్దలు అమ్దరూ అక్కడకు చేరారు. వెంటనే తొందరగా తిరిగిరావాలని పలుగు పట్టు కున్నాడు మీఘం అది చేతిని కాల్చింది. ఎందు కంటే అది కొలిమిలో కాల్చిన కడ్డి.  కాని ఆప్పుడే మబ్బు చేతిలో ఇసుక మన్ను పెట్టుకొని మరీ పట్టుకొని పరుగెత్తడం మొదలుపెట్టాడు. మేఘం మబ్బు ఇరువురు వేగాలు పెంచి ముందుకు పోవటం  జరుగుతున్నది. పైదాకా ఇద్దరు ముందే వెళ్లారు ఎచీర తీసుకురావాలని మేఘం ఆలోచిస్తూ ఉన్నాడు.

అప్పుడే మబ్బు ఒక చీరను తీసుకొని వెనుతిరిగాడు.

మల్లి మనసులో అనుకుంటుంది. మబ్బు నా చీర గుర్తు పడతాడా  లేదా అని ఆలోచిస్తుంది. అప్పుడే గుర్తుకొచ్చింది సరస్సులో జరిగిన సంఘటన.  

ఒకనాడు మల్లి, చేమంతి. గులాబి, కొందరు ఆడవాల్లు సరస్సుకు కుండలతో నీరు తేవటానికి వెళ్ళారు. ఏదో మాటల్లో ఉండగా గులాబి  కుండ  నీటిలో గాలికి దోర్లు కుంటు పడి  పోయింది. అంటే అమ్దరూ కలసి అది పట్టు కోటానికి నీటిలోకి దిగారు. పట్టుకోటాని ఈదుతున్నారు. కాని కుండ చిక్కలేదు. అక్కడకోస్తున్న మబ్బు చూసాడు ఆడవారు మీరు కష్ట పడవద్దు . మీరమ్దరు ఇక్కడే ఉండండి నేను వెళ్లి కుండ తెస్తాను అన్నాడు.

నీటిలోకి దూకి ఈదు కుంటు  చివరకు కుండ తెచ్చి గులాబికి ఇచ్చాడు. మబ్బు అప్పుడే చాలా సమయము అగుటవల్ల మల్లి తప్ప అమ్దరూ వేగంగా వెళ్లి పోయారు. మల్లి మాత్రము మబ్బు కండల శరీరము ను చూస్తు దగ్గరకు తడిచిన చీరతొ ముందుకు వచ్చి అమాంతము మబ్బును చేతులతో భందించి ఒక్క తోపు నీల్లలొకి తోసి నేను వెళ్ళొస్తా అంటు  ఒకటే పరుగో పరుగు. పగటి కల చెదిరింది

ఇద్దరు ఒక్కసారే రావటం, ఇరువురు చెరో రంగు చీర తావడం జరిగింది అమ్దరూ ఎవరు గెలిచారో చెప్పండి అని అరవడం క్షణంలో జరిగింది.

అప్పుడు పెద్దలు మూడు పరిక్షలు ఐనతర్వత మీకు తెలియపరుస్తాము అన్నారు. 
రెండవ పరిక్ష : అక్కడ రెండు సుత్తులు ఉన్నాయి వాటిలో చెరోకటి తీసుకొని అక్కడ కనిపిమ్చు చున్న పెద్ద బండలు వద్దకు పొయి మీరు వానిని పగలగొట్టాలి. ప్రక్కన ఉన్న ఇసుక బొమ్మలు ఏమి చెదర కూడదు. కేవలము పది ఘడియలలో ఈ పని చేయాలి అని వారికి చెప్పారు పెద్ద మనషులు.

వెంటనే మబ్బు, మేఘం ఇద్దరు బండల వద్దకు పోయారు. మేఘం వెంటనే బండను కొట్టి వేణు తిరిగాడు. మబ్బు మాత్రము  బండను కొట్ట కుండా మెల్లగా బండ మీద కోడుతు ఒక్క సారి ఒకే ఒక దెబ్బ కొట్టాడు అంతే  ముక్కలు   ఐనాయి. కాని ఆలస్యముగా వచ్చాడు పెద్దలవద్దకు. అందరు మేఘం గెలిచాడు అని బిగ్గరుగా అరిచారు.

తోమ్దరోద్దు మూడవ పరిక్ష పెడుతున్నాము అది కూడా గెలవాలి కదా అన్నారు.

మల్లి మనస్సు భయము ఏర్పడినది తల్లిని పట్టుకొని ఒకటే ఏడుస్తున్నాది. అమ్మ నేను మేఘాన్ని చేసుకొనే అని భయ మెందుకమ్మ, మేము పెద్దలున్నాము కదా అంతా నీకు మంచే జరుగుతుంది.
        
మూడవ పరిక్ష : మీరు అడవిలోకి పోయి తేన తుట్టె పటుకురావాలి అదే పందెం అన్నారు పెద్దలు .

ఇంతే కదా అంటు " మేఘం " ముందు పరుగెత్తాడు. చేటు వద్దకు పోయి సేగపెట్టి  తెనె టీగలు తరిమి
తెనతుట్టేను తీసు కొచ్చాడు. ముందుగా  వచ్చాడు.

మబ్బు మాత్రము తేన తుట్టె ఉన్న కొమ్మ మొత్తము కొట్టుకొని తేన టీగలు  కుడుతున్నా నెమ్మదిగా పందెం  ప్రాంతానికి మోసుకొచ్చాడు.

అమ్దరూ" మేఘం " గెలిచాడు హోలీ సంబరం చేసుకుందాం అగ్గి వెలిగించండి అని కొందరంటున్నారు.

పెద్ద మనుషులందరూ కూడ బలుక్కొని మూడు పరిక్షల పెట్టిన తర్వాత గెలిచిన వారు, మల్లికను వివాహము చేకోనేవారు వివరముగా తెలియపరుస్తున్నాము. ఓడినవారు గెలిచినవారిని అభినందించి ఉండాలి అందుకు  అందరికి ఇష్టమేనా  ముఖ్యముగా పోటిలో పాల్గొన్నవారు ఇష్ట పడినట్లు మన కులదేవత అడవి తల్లి వద్ద గోమాత వద్ద ప్రమాణం చేయండి అప్పుడు మాతీర్పు చెబుతాము అన్నారు.     
                                                  
                                        


అంటే ఇరు కుటుంబాలవారు, మల్లి తరుఫు వారు మరియు గూడేం వారు అమ్దరూ అడవితల్లికి, గోమాతకు నమస్కరించారు.


మెదటి పరీక్షలో ఇద్దరు సమానముగా వచ్చిన తెచ్చిన చీర బట్టి మేము గేలుపు  నిర్ధారణ చేయటము జరిగింది. మేము ముందుగా నిర్ణ ఇమ్చుకొని పెట్టిన చీరను తెచ్చిన వ్యక్తి " మబ్బు "  కనుక ఈ పందెములో మబ్బు గెలిచినట్లు చెప్పటం జరిగింది.

రెండవ పరీక్షలో : మేఘం తొందరగా సుత్తితో కొట్టడం వళ్ళ బండ ముక్కలు ముక్కలుగా మారటమే కాకుండా ప్రక్కన ఉన్న ఇసుక బొమ్మలకు  తగలి బోమ్మలు చెరిగి పోవటం జరిగింది. మబ్బు ఒకే ఒక దెబ్బతో కొట్టడం వళ్ళ బండ ముక్కలుగా చీలాయి. కనుక ఈ పందెములో మబ్బు గెలిచినట్లు చెప్పటం జరిగింది.

మూడవ పరీక్షలో  మేఘం ముందుగా వచ్చి తేన తుట్టె తెచ్చి ఇవ్వటం జరిగింది.  కాని దానిలో తేనే కారి పొయి దానిలో తుట్టె మాత్రమె ఉన్నాది. మబ్బు  తెచ్చిన దానిలో తెనతో తెన టీగలు కుడా ఉన్నాయి.

ముఖ్యముగా మేము చెప్పేదేమిటంటే ఏపని చేసిన ఇష్టన్ని  బట్టి చేయాలి , ఏపని చేసిన నాడిని  బట్టి ప్రవరిమ్చాలి, ఏపని ఎట్లా చేసిన ఫలితము కలగాలి కనుక ఈ పందెములో విజేత మబ్బు అని మేమే తీర్మానం  చేస్తూ తీర్పు చెపుతున్నాము అని తెలియపరిచారు.

అందరు ఒక్కసారి ఒకవేపు మబ్బును, మరోవేపు మల్లిని ఊరెగిమ్చారు. రంగులుచల్లుకున్నారు.  మేలతాలలు మ్రోగాయి ఆరోజే అందరి ముందు చేతి బొటనవేలు రక్తంతో మబ్బు మల్లి నుదుటిపై పెట్టించారు తరువాత మల్లి చేతి బొటనవేలు రక్తంతో మబ్బు  నుదుటిపై పెట్టించారు. దండలు మార్పించారు. మన ఆచారము ప్రకారము మీరిద్దరు ఈరొజు నుండి  దంపతులుగా జీవించాలి అని దీవిమ్చారు.
                      
   


ఆరోజే మా ఇద్దరినీ మా గూడెం వారు మమ్ము సాగనంపారు,  దేశంలో బ్రతకమని అని పెద్దమ్మకు చెప్పింది తన ప్రేమ పెళ్లి  కధ .

అమ్మో ఇంత జరిగిందా మరి మీరే క్కడ కెల్తున్నారు.

తెలీదమ్మగారు. మాకు చదువు రాదు మొద్దుగా బ్రతకటమే.

ముందు మబ్బును  పిలువు అన్నది పెద్దమ్మ . మబ్బు వచ్చాడు ప్రక్కన నిల బడ్డాడు.

మీరిద్దరిని మాఊరుకు  తీసు కెలతాను, మీకు విద్య నేర్పుతాను, మీరు నేర్చుకొని కొన్ని రోజులు మావద్ద ఉండి చిన్న చిన్న పనులు చేసుకొంటూ ఉండండి. విద్యనేర్చుకొన్న తర్వాత మీ అడవికి వెళ్ళవచ్చు మిమ్మల్ని మరలా ఇదే బస్సు ఎక్కి పంపిస్తాను మీరు దిగి మీ అడవిలోకి పోవచ్చు అన్నది పెద్దమ్మ.

మల్లిక ఏది చెపితే, నేను అదే చెపుతాను, అది అదంటే అది. ఇదంటే ఇది
                   

                                                                                         

  
          


                                                 8, మార్చి 2014, శనివారం

117. Philos'ophy story -/21 (ఆర్ధిక విజేత )

                                                                               


ఆర్ధిక విజేత
మధ్య తరగతి మానవులు పౌష్టిక ఆహారము తీసుకొనుటకు ప్రయత్నించాలి, వాటివల్ల కండరబలము పెరుగుతుంది. శరీరము ఎదుగుదలకు తోడ్పడుతుంది. మనసుకు ప్రసాంతత ఏర్పడుతుంది.  యవ్వనంలో శరీరరానికి కాస్తంత కొవ్వు అవసరం అది పరిధిలు దాటితే మాత్రము ప్రమాదం అని గమనించాలి. నిత్యమూ పాలు త్రాగుట అనేది అలవాటు చేసుకోవటం మంచిది.

" టీ " లు, కాఫీలు అలవాటు చేసుకోవటం అంత మంచిది కాదు. కాని కాఫీ మాత్రము తెల్లవారుజామున లేచిన తర్వాత త్రాగితే మనము తిన్న ఆహారము జీర్నము అవటానికి దోహద పడుతుంది." టీ " లు త్రాగితే ఉల్లాసముగా  ఉత్చాహముగా ఉంటుంది. అదేపనిగా మాత్రము త్రాగావలదు .     

అలవాటుగా పొరపాటు చేయక, నేను తెలియక పొరబాటు చేసినాను అని సరిదిద్దు కోన్నప్పుడే మనము ఆర్ధికంగా విజేతలు అవుతాము.

జన్మత: కొందరు లక్షాదికారులు, కొటీశ్వరులు కావచ్చు. వారి గుణాలు మాత్రము ఎలా ఉంటాయో ఎవ్వరూ చెప్పలేరు. తండ్రి సంపాదనను దుర్వినియోగము చేయవచ్చు లేదా సద్వినియోగాముచేసి నలుగురిలో మంచి పేరు తెచ్చు  కోవచ్చు.  కాలక్రమాన నిర్దిష్టమైన అలవాట్లు బట్టి మానవులు వృద్ధికి రావటమా లేదా పతనము కావటమా అనేది మనము అలవరుచుకున్న అలవాట్లు, పద్ధతులుపై జీవితములొ మార్పులు సమ్భవిస్తాయి దానికి భాద్యులు మనమే, ఇందుకు వేరొకరిని అన్న ఫలితము ఉండదు.  

ఎంత ఆస్తిఉన్న అప్పు తీసుకొవటము కొందరి అలవాటు, దానిని తీర్చుకొవటములొ ఉన్నది మజా అని భావిస్తారు. అప్పువారు మనచుట్టూ తిరిగితే అదొక గొప్ప అని భావిస్తారు.   వారి తిట్లు శాపనార్ధాలు తలుగుతాయని తెలిసి కూడా  తీసు కుంటారు. అవసరము మించి ఆప్పు తీసుకొకూడదని తీసుకున్నా వెంటనే తీర్చుటకు ప్రణాళిక ఏర్పాటుచేసి ఆర్ధిక ఇబ్బందులు రాకుండా జాగర్త పడాలని నేను చెపుతున్నాను.

లేనిదాని కోసం వేమ్పర్లాడవద్దు, ఉన్న దానిని వదులుకోవద్దు, ఎట్టి  పరిస్తితులలో మనసుకు భాధకలిగిమ్చి పనిని ఎవ్వరుచేయవద్దు. కూర్చొని తింటే కొండలైనా కరుగును.  ప్రతిఒక్కరు కష్టపడుతూ ఉంటే దాని ఫలితము పెరిగి కొండలా మన ఆదాయము పెరుగుతుంది. ఈనాడు  క్రమం తప్పకుండా ఇంటి ఖర్చులతో పాటు  అప్పు తీర్చుకుంటూ  పొతే మనసు ప్రసామ్తము, ఇంటి యందు ఆనందము ఉమ్టుందని నా అనుభవ పూర్వకుమ్గా ఇందు తెలియ పరుస్తున్నాను. 

జీవితములో మొదట 25 సంవత్స్చరములు ఉల్లాసముగా ఉత్చాహముగా, ఆనందముగా ఏమ్తోకోర్కలతో సరదా సరదాగా గడపాలి. యువరక్త ప్రవాహంలో ఎదిమంచో ఏది చెడో తెలిసికొనే వయసు కాదు, శక్తి ఉండదు.  కొన్ని మానసిక కోరికలు వెమ్బడిస్తాఇ. జిహ్వాచాపల్యము పెరుగుతుంది. ఏదో సాధించాలని తపన పెరుగుతుంది. అందమైన పూలను చూసిన అమ్మాయిలను చూసిన మనసులో ఏదో కోరిక కలుగుతుంది, మనసంతా వికారముగా మారుతుంది. ఎవరికీ చెపితే ఫలితము తగులుతుంది అని ఆలోచిస్తారు.

ముందుగా స్నేహితులకు తమ అభిప్రాయాలు చెప్పుకుంటారు. అక్కడే కొన్ని అలవాట్లు మొదలవుతాయి కొందరికి (సిగరెట్టూ, మందు, చతుర్ముఖపారాయనము, గుర్రపు పందెములు, నేమ్బ రింగు ఆట, లాతరీలు కట్టడం ) వాటిని వదిలించుకోవటం చాలా కష్టం. అలవాటు పడకుండా ఉండటమే నిజమైన ఆర్ధి విజేతగా మారే వ్యక్తి అని నేను మనసు పూర్వకముగా చెపుతున్నాను.
                                                


పెద్దలు ఏమి చెప్పిన ఆ వయసుకు ఎక్కదు, ఎ విషయము చెప్పిన అంతా మాకు తెలుసు మేమేమి చిన్న పిల్లమా అందులో చదువుకున్న వాళ్లము, నీవు మాకేం చెప్పొద్దూ.నీ మాటలన్నీ పాత చింత కాయ పచ్చడి లాంటివి, ఇప్పుడు మనము ఆధునిక యుగంలో ఉన్నాము అని వాదిస్తారు.
అదే ఆడపిల్లలైతే అందమైన వస్త్రాలు ధరించి కుర్రకారును రెచ్చకొట్టి ఏమి తెలియని అమాయకులుగా ఉంటారు. వారికి నిక్ నేఁములు పెడితే ఏడుస్తారు.
                                          


International women's day on 9-03-2014
కాని ఈనా డు  స్త్రీలలో కుడా ఆత్మధైర్యం పెరిగింది. పురుషులతో పా
టు సమానముగా ముందుకు వస్తున్నారు.  
స్త్రీలు, పురుషులు కరమ తప్పకుండా తెల్లవారుజామున లేవటం తప్పక అలవాటు చేసుకోవాలి యవ్వనదసలో ఏదో ఒక విద్యలో అభ్యసిమ్చినప్పుడు దాని వళ్ళ నలుగురులో మంచి పేరు తేచ్చుకోవటానికి ఓక్ ఆవకాసము వస్తుంది.   యోగాబ్యాసము పుస్తకపటనము మనసుకు ప్రశాంత కలిగించును. 

ఒక కళాకారుని కొడుకుని కాని, కూతురుని కాని వారి కళయందు ఉన్న మంచి చెడులు వంశ  పారంపర్యముగా వచ్చిన విద్యనూ వృద్ధిపరిచిన నాడే దేశం బాగుపడుతుంది. ప్రతిఒక్కరు ఆర్ధికంగా ముందుకు పోయే అవకాసము ఉంటుంది.

లోకకల్యానమునకు విద్య ఎంత వరకు ఉపయోగపడుతుందో అంతవరకు నేర్చుకొనుట మంచిది.  అత్యాశకు పొఐ ఇంకా చదువుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అని పట్టుదలతో చదువులు చదివితే జీవితములొ ఉన్న సుఖాలు పోగొట్టుకుంటారు. వయసులో ఉన్నప్పుడే వివాహము చేసుకుంటే దానిలో ఉన్న తృప్తి తెలుస్తుంది. విజ్ఞాన వారసత్వము పిల్లలకు తల్లి తండ్రులు పంచాలి.
                                                    


ఆధునిక విద్యకోసం విదేశాలకు పంపి భాదపడుట అవసరామా, డబ్బే సాస్వితముకాదు. మనిషి ఆరోగ్యము కుడా చాలా విలువైనది. శరీరమ్ ఆరోగ్యంగా ఉంటేనే మనసు ఆరోగ్యంగా ఉంటుంది.  మనస్సు ఆరోగ్యంగా ఉంటేనే బుర్ర చురుగ్గా పనిచేస్తుంది. అందుకే ఆర్ధిక విజేతలు డబ్బు కెంత విలువ యిస్తారో ఆరోగ్యానికి అంతే  ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్యానిచ్చే  ఆహారం తీసు కుంటారు . ఆరోగ్యమైన జీవన శైలిని ఎన్నుకుంటారు. వ్యాయామానికి సమయం కేటాయిస్తారు. ఏటా ఆరోగ్య పరిక్షలు చెఇమ్చుకుమ్తారు. కుటుంబ సభ్యులకు వైద్యపరీక్షలు చెఇస్తారు. వైద్యపరిక్షల క్రింద  ఆదాయపుపన్ను మినహాయింపు కూడా  పొందుతారు.   


చిన్నప్పుడు వేలుపట్టుకొని నడకనేర్పుతారు, చెఐపత్తుకొని అక్షరాలు నేర్పుతారు, హండిల్ పట్టుకొని సైకిల్ నేర్పుతారు, సాటి వారిని ప్రేమించటం నేర్పుతారు. అదే కొందరి తల్లి తండ్రులకు నాన్న నేను ప్రేమలో పడ్డాను నేను అతనిని తప్ప వెరుకరిని పెళ్లి చేసుకోనన్నప్పుడు తల్లి తండ్రుల భాద ఏవిధముగా ఉంటుందో అందరికి తెలుసు.

ముఖ్యముగా తల్లి తండ్రులు విద్యాబ్యాసము చెఇమ్చారు,  మంచిగా చదివించారు, చదివిమ్చిన చదువుకు దేశానికి సేవ చేసి నలుగురికి సహాయపడే విధముగా ఉండాలి, నలుగురికి సహాయపడని చదువు చదువు కాదు, ప్రేమలేని పెళ్లి పెళ్లి కాదు.

ముఖ్యముగా డబ్బు లేకపోతే, తల్లి, కొడుకులు,కూతుర్లు,  భార్య, మిత్రులు కూడా  శత్రువులుగా మారిపోతారు ఇది నిజం ఈది నిజం ఇది నిజం.

తను చదివిన చదువుకు తగిన ఉద్యోగము చూసుకొని దానిమీద వచ్చే ధన సంపాదనతో మాత్రము మనిషి సుఖసంతోషాలు సంప్రాప్తమోతాయి. అదే నా నమ్మకము.

విఘ్నేశ్వరుని ఆఅరాధిమ్చటం మరువద్దు 
అవినీతి సొమ్ము జీర్ణము కాదు
ఆశకుపోతే వచ్చిన ధనం నిలబడదు
ఇల్లాలి సుఖమే నిజమైన ధనం

సింహం లక్ష్యం దిశగా దూసుకు వెళ్తున్నప్పుడు ఒక్క సారి వెనుకకు తిరిగి చూసు కుంటుంది. 
మనము ఆర్ధిక వేజేత  కావాలని ఎంత కష్ట  పడ్డ,  మన వెనుక ఉన్న తల్లి తండ్రులను, గురువులను, మిత్రులను, మరచిపోనివాడే నిజమైన ఆర్ధిక విజేత.                                          
                                                    

2, మార్చి 2014, ఆదివారం

116. Philos'ophy story -/20 (నిజమైన ధర్మాత్ముడు)


దృశ్య ప్రపంచమునకు వెనుక ఏమి దాగియున్నదో కనుగోనవలయునని మానవుని బుద్ధి సదా పెనుగులాడుతూనే యుండును.

ఉదయాస్తమానాలు, తుపానులు, ప్రకృతియొక్క మహోత్తర గమ్బీర శక్తులు, అందలి రమనీయత వివిధ మానవుల భుద్ధి ఆకర్షిమ్చును.  అంతటితో త్రుప్తి చెందక  వాని రహస్యమును గ్రహించవలయునని కాంక్ష పెరుగును.  మానవుని ఉపయోగపడే వస్తువులను తయారుచేయుటకు  మేదస్సు పనికి వచ్చును. ఇతర దేశాల వారికి మనమేధస్సు ఉపయోగపడుతున్నాది.

ఒక్క విషయము మాత్రము నేను చెప్పగలను.  మానవులు తమ ఇంద్రియ పరిమితులను దాటి పోవుచున్నారు. ఇమ్ద్రియములతో తృప్తి పడుటలేదు. ప్రక్రుతి సృష్టిని ధిక్కరిమ్చుతున్నారు. కొందరు ధర్మాన్ని అర్ధం చేసుకొని ఆవేశము చెందకుండా, తన్మయత్యులుగా  మారకుండా జీవిమ్చ కలుగుతున్నారు.

నక్షత్రాలు, గ్రహాలు చలించు ధర్మాలు బ్రాహ్మణులు గ్రహించుట మనహిమ్దువులు చేసుకున్న పుణ్యము. ధర్మాలబాట్టి మన పండగలు వస్తున్నాయని గ్రహించగలరు.      


ధర్మ భోధవలననే వ్యక్తి లో దయ నిండు కుంటుందిదయగల హృదయమే ఎదుటి వ్యక్తి హృదయాన్ని తృప్తి పరుచగలదు. గాయాలనుయ్ మాన్చాగలదు. మనసును ప్రశాంతముగా ఉమ్చగలదు  ప్రతి వ్యక్తిలో సీలాన్ని  పెమ్పోమ్దిమ్చాలి. 

భీష్మ పితామహుడు శాంతి పర్వంలో వ్యక్తి ధర్మాల్ని  కూడా భోదించాడు.  ప్రతివ్యక్తి శీల వంతుడై  జీవిమ్చాలన్నాడు. మనసా, వాచా, కర్మణా ఇతరులకు హాని చేయకపోవడమే శీలమ్, సిగ్గుతో తలదించుకోవాల్సిన పనులు చేయకపోవడమే శీలం  సాటివారికి సాయపడటమే శీలమ్ - ఎట్టి  పరిస్తితులల్లో  కూడా సీలమ్ వదలుకొకూడదని హెచ్చరించాడు.

ప్రస్తుత పరిస్తితులలో శీలాన్ని కోల్పోయిన వ్యాపార వెక్తలు  జైలు పాలైన సమ్ధర్బాలున్నాయి.  శీలాన్ని వదులుకున్న రాజకీయనాయకుల్ని ప్రజలు ఘోరంగా తిరస్కరించిన ఉదంతాలు లున్నాయి.   శీలాన్ని వదులుకున్న న్యాయ మూర్తులు, ఐ.ఎ. ఎస్, ఐ.పి.ఎస్ వారు దోషులుగా నిలబడిన సంఘటనలు ఉన్నాయి.
ధనం కోసం, రాజకీయమ్ కోసం శీలాన్ని తాకాటు పెట్టిన వారున్నారు.     

ముఖస్తుతికి పొంగి పోవద్దు. నిష్టురసత్యాలకు కోపం తెచ్చుకోవద్దు. మంచి చెడులను బెరీజు వెసు కుంటు  దుర్మార్గుల్నీ సన్మారుర్గుల్నీ వెరుచెసు కుంటు  ముందుకెళ్ళి పోవడమే జీవితమ్ అనేది ఆచార్యుని సలహా.

ఆదిత్యు డుదఇమ్చగానే  విశ్వమంతా వేలుగు తోరణాలతో శోభిస్తుంది.వ్యక్తిలో  ధర్మం ఉదఇమ్చగానే జీవితము   కళ్యామయమై భావిస్తుంది. మనసును అదుపులో ఉమ్చటము ద్వారా సత్ప్రవర్తన ద్వారా, ఆత్మావలోకనం ద్వారా ప్రశాంతతను పొందవచ్చునని మన పూర్వీకులు మనకుకు భోదిమ్చారు.

ధర్మమే స్తితి కారణమైనది.  ధర్మమును దక్షిమ్చినవారిని ధర్మమే రక్ష్మిచును. ధర్మమును అతిక్రమిమ్చినవారిని ఆ ధర్మమే అమ్తరిమ్ప చేయును.         
వేదాల సారాన్ని, ఉపనిషత్తుల మర్మాన్ని, ధర్మ సూక్ష్మాల లొతుల్నీ కధల రూపంలో పిల్లలకు నేర్పుట ప్రతి తల్లి తండ్రులకు శీల సంపదగా భావించి, ఆరోగ్యమునకు ఆనందమునకు ప్రతిరోజూ పార్కుకు తీసుకొని వెళ్లి పిల్లలతో ఆడుట అనేది తల్లి తండ్రులకు కూడా ఒక యోగ లాంటిదని భావించవచ్చును.       

                                                   
శ్రీ కృష్ణ పరమాత్ముడు బాల్యంలో అమాయకుడుగా అందరిని మెప్పించడం, ఆనందపరచడం, చిన్న చిన్న దొంగతనాలు చేయడం, పెద్దవాళ్ళను, చీన్నవాళ్ళను, ఆడవాళ్ళను ఆట పట్టించడం  బాల్య చేష్టలుగా భావించ గలిగింది ఆనాడు యశోద. ఈనాడు కూడా ప్రతిఒక్కరు తమపిల్లలను గారాబముగా పెంచుతున్నారు.

జీవిత మనేది  ఒక ఆట అని, ఆ ఆటలో ఒకనాడు గెలువ వచ్చు, ఒకనాడు ఓడ వచ్చు అంత మాత్రమున భాదపడుట, మనసుకు గాయముగా భావించుట, చిన్న పెద్ద లేకుండా అరుచుకోనుట, ఎవ్వరికి తగదని మనధర్మాలు చెపుతున్నాయి.        

ఇంద్రియ వ్యాపార ఫలము మొదట అనుకూలముగా ఉండును.  తరువాత ఎదురుతిరుగు చుండును. కాలముయోక్క నడక అలల నడకగా పోల్చవచ్చును. ప్రతి అల మొదట దిగుడు మరుక్షణము మరల ఎగుడు, మరల దిగుడు ఎగుడు మాదిరగా ఆవృత రూపముగ సాగుచుండును. మానవుని మనస్సు కూడా సంకోచ వ్యాకొచములు జరుగును.  యంత్రమునకు శక్తి తోడ్పడితే ఎట్లు కదులునో, అట్లే ప్రతిఒక్కరిలొకూడా ఏదో శక్తి  ఆవహించి జీవితము నేట్టుకుంటు వచ్చు బండి లాగ జరుగు చుండును.

ఇమ్ద్రియగోచారుడగు మానవుడు బుద్ధికి అతీతుడు, ప్రతిబిమ్బమువంటివాడే, దేశకాల భాద్యుడు అగుటచే నిత్యముక్తుడు. అతడెన్నడూ భద్దుడు కాలేడు కాజాలుడు.

మనశరీరములొని రక్తకణాలు మారు చుండును.   శరీరమమ్తా  నిరంతరం పరిబ్రమిమ్చు చుండును. వయస్సు పెరిగినకొద్దీ అనేక వ్యాధులు రావటానికి మూలకారణము మనము అనుకరించిన పదద్దతులు, మానసిక వత్తిడివల్ల, ఆలోచనవల్ల, మనిషిలో ఉన్న శక్తి కొంత తగ్గును. మన మనస్సు ఒక క్షణం సౌఖ్యం, మరుక్షణం అసౌఖ్యం, ఒక క్షణం బలం అనుక్షణం దౌర్బల్యం, నిరంతరము నీటిలో  సుడిగుండము వలే  తిరుగు చుండును.

ప్రతి కాలితో నడుచునది నీవె, ప్రతి పెదవితో మాట్లాడునది నీవె, ప్రతికల్లతో చూచునది నీవె, ప్రతి చేతులతో చేయునది నీవె, ప్రతి హృదయముతో కష్టసుఖాదులను భావిమ్చునది నీవె.

సత్యమును ధర్మమును తెలిసికొన్నచో మనుష్యులు భీతిచేమ్దరు. తమవ్యక్తిత్వమును నిలబెట్టు కొందురు.

                                                                      

అనగనగా ఒక రాజ్యమున్నది. ఆరాజ్యమునకు ఒక రాజు ఆ రాజుకు నలుగురు కొడుకులు ఉన్నారు. నలుగురిని పిలిపించి నేను వృద్దుడైనాను సర్వాదికారములు మీలొ ఎవరుకి ఇవ్వాలో నాకు తెలియుటలేదు ఎమ్డుకంటే మీరు అన్ని విద్యలలో సమానులు. మీలొ ఎవరైతే సర్వాదికుడైన ధర్మాత్మున్ని వెతికి తీసుకు వస్తాడో అతనికి రాజ్యాధికారము ఇస్తాను. ధర్మాత్మునికి నేను పరీక్షలు పెట్టి, భహుమతి ఇచ్చి పపంపెదను అట్లు ఇష్టపడ్డవారినే తీసుకురండి.

నలుగురు కుమారులు నాలుగు దిక్కులు బయలు దేరారు. పెద్దవాడు ఒకనగరములొ ఒక గుప్తా  గారిని కలిసి  మీకు మారాజ్యం లో సన్మానము చేస్తారు మీరు వస్తారా, మారాజ్యములో మీరు మీ ధర్మ ప్రచారము చేసుకొనవచ్చును అని చెప్పాడు. అట్లే అని ఒప్పుకున్నతర్వాత అతనిని రాజదర్బారులో కూర్చొ బెట్టి. వారిని గురించి ఈ విధముగా వివరించాడు పెద్దకొడుకు.       

ఇతను వేలాది రూపాయలు దానము చేసాడు, ఆలయాలు కట్టించాడు, చెరువులు త్రవ్వించాడు, చలివేంద్రాలు ఏర్పాటు చేసాడు. నిత్యమూ వీరు పురాణ శ్రవణము చేస్తుంటారు. గొపూజలు చేస్తుంటారు. వీరిని మించిన ధర్మాత్ముడు ఉండదు అన్నాడు.

వెంటనే రాజు గారు గుప్తాగారిని కొన్ని ప్రశ్నలు వేసారు.

ప్రతిఒక్కరికి ఉండవలసిన "దానం " మెది ?
కాసేపు ఆలోచించి  "నిదానం " అని సమాధానము చెప్పాడు.

ఇది దానం కాదు విశాలమైన దానం ఏది. ?
కాసేపు ఆలోచించి  "మైదానం " అని సమాధానము చెప్పాడు.

దంపతులు ఎదానం చేస్తే పుణ్య మోస్తుమ్ది ?
దంపతులు ముక్యముగా కన్యాదానం చేస్తే పుణ్య మోస్తుంది.
సభలో ఉన్న వారమ్దరూ సమాధానాలకు కరతలధ్వనులతో రాజుగారు గుప్తాగారిని సన్మానించారు.  
 

రెండవ కుమారుడు ఒక బ్రాహ్మనోత్తముడిని  తీసుకొని వచ్చి సభికులందరి ముందు నిలబెట్టి ఇతడే నిజమైన ధర్మాత్ముడు అని అతని వివరాలు తెలియపరిచాడు.
నియమభద్ధముగా మంత్రజపాదులు పూర్తిచెసుకున్నతరువాత నే  జలపానం చేస్తారు. త్రికాలాలలో సంద్యావందనం చేస్తారు. ఆసత్యానికి వీరు భయపడతారు. ఈయనకు కోపమనేది ఎప్పుడూ రాలేదు అట్లువచ్చినట్లు ఎవరూ చూడలేదు. ఎప్పుడు భక్తి కీర్తనలతొ దేవుణ్ణి కొలుస్తూ ఉంటాడు. భగవద్గీతను అద్బుతముగా ప్రజలకు అర్ధమయ్యె విధముగా విడమరిచి చెప్పగలరు. అని వివరించాడు.

ఈయన నిశ్చయమగా  ధర్మాతుడు ఐన నేను మూడు  ప్రశ్నలను వేస్తాను సమాధానము చెప్పగలరు అని రాజు గారు బ్రాహ్మణుడిని అడిగారు.
1.ఎఘడియల్లో దేవుణ్ణి ప్రార్ధించాలి ?
    అమ్రుతఘడియల్లో
2. దేవున్ని పూజ చేసే టప్పుడు అందరికి ఉండ వలసినది ఏమిటి.?
    ఓర్పు, శక్తి
3. మూర్ఖుడు నైన  చక్కపరిచేది ఏది ?
    సత్సాంగత్యం
సమాధానాలకు అమ్దరూ మెచ్చు కున్నారు, సన్మానమును చేసి పంపారు. 


మూడవ కుమారుడు   ఒక బాబాను తీసుకొని వచ్చి  రాజభవనంలో అందరి సమక్షమున అతని గుణగనాలు వివరించాడు.

యితడు మహాతపస్వి, వారానికి ఒక్క సారి మాత్రమే క్షీరపానమ్ చేస్తారు.  సీతాకాలాలల్లో జలాలల్లో నిలబడతారు. గ్రీష్మ ఋతువులో పంచాగ్ని మధ్యలో ఉంటారు. నిత్యమూ గాలి నీరుద్వారానే జీవితము గడుపుతారు. ఆశ్రమం ద్వారా భక్తులకు వేదం నేర్పుతారు. యజ్నయాగాలు నిర్వహిస్తారు.
వెంటనే రాజు వీరు మహా ధర్మాత్ములు ఇందు సందేహములేదు. ఐన నేను మూదు ప్రశ్నలు వేస్తాను అని అన్నాడు.

1.నోటినుండి శివ లింగము తెప్పిమ్చుట ఎంగిలి కాదా ?
   ఉదర పోషనార్ధం చేసే విద్యకు సిగ్గు, ఎంగిలి ఉంటే జీవిమ్చ లేము.

2. స్వామి  మీకు ఇంద్రియ సుఖం అవసరమా? 
    పరమేశ్వరునికే తప్పలేదు నాలాంటి వానికి ఎలా సాద్యం.

3.మీ పాదాలకు పూజ చేసి నీరు చల్లు కోవటం మంచిదా?
   దేవుడని నమ్మినవానినికి మంచిది. కాని నేను చెప్పేది ప్రత్యక్ష దైవాలైన తల్లి తమ్డులకు పాదాలు కడిగి
   ఆనీరు చల్లుకోవటం మంచిది.   

సమాధానాలకు అమ్దరూ సంతృప్తి పడ్డారు. అంతలో రాజు సన్మానము చేయబోతుంటే నేను సన్యాసిని నాకు మీరు సన్మానము చేయవలదు. మీరు చెయ్యాలంటే
ర్మాన్ని నాలుగుపాదాలతో నడిపే వేదాలను రక్షించి ఆ వేదాల అర్ధాన్ని ప్రజలకు తెలిపే అవకాసము నాకివ్వండి అన్నారు. అమ్దరూ లేచి బాబాకు నమస్కరించారు. 
అదే మీరు నాకు చేసే స్న్మానముగా భావిస్తాను. అన్నమాతలకు రాజు చాలా సంతో సహించి భూదానంతో గోదానంతో సత్కరించి పంపారు.  నాల్గవ చిన్న కుమారుడు ఒక రైతును నిలబెట్టి అతని విషయాలు వివరముగా సభికులందరికీ తెలియపరిచాడు. వానరుల నుండి  మానవులుగా మారారని అందరకి తెలుసు. మానవులు జ్ఞానవంతులు తనజ్ఞానాన్ని నలుగురికి పంచి దానివల్ల వచ్చే రోక్ఖమును సంసారపోషణకు వాడుకొనుట అనేది సహజము. అదేవిధముగా రైతు పంట పండించి తన కుటుంబమునకు  సరిపడు బియ్యపు గింజలు వుంచుకొని మిగతావి దానం చేస్తాడు.మూగ ప్రాణు లణు సేకరించి వాటిని పోషించి వాటి మీద  వచ్చే  ఆదాయమును నలుగురికి పంచేవాడు.  ఉచితముగా అందరికి ఆవుపాలు, గేదపాలు పోసేవాడు. పెంపుడు జంతువులకు చిన్న గాయమైన వెంటనే దానికి మందు వాడేవాడు. వాటి రక్షణ కోసం ఆహార్నిసాల కష్టపడేవాడు.

రొజూ దేవాలయము వద్దకు పోయి అంతా సుబ్రపరచి దీపమ్ వెలిగించేవాడు. యితడు చదువుకోలేదు. కాని ఎవరైనా జబ్బు పడితే వార్కి దగ్గరుండి సేవచేస్తాడు. ఎవరైనా యాచిస్తే గుప్ప్డు మెతుకులు పెడతాడు ఇతడే నిజమైన ధర్మాత్ముడు. అని చెప్పాడు చిన్న కుమారుడు.

వెంటనే రాజు గారు మిమ్మల్ని మూడు ప్రశ్నలు వేద్దామని అనుకుంటున్నాను. మీ చేతిలో ఏదో తెచ్చారు అన్నాడు.          

ఇది సాక్షాత్తు హనుమంతుని రూపమ్ ఆకుపై కనబడుతుంది. అది మీకు చూపిద్దామని తెచ్చాను అని "ఆకు చూపిమ్చాడు". అమ్దరూ చూసి ఆశ్చర్య పోయారు.   

అమ్దరూ ఆకుకు ఒక్కసారి సమస్కరిమ్చారు.

1. మనుష్యులంటే ఎవ్వరు ?
    పరుల సుఖం కోసం స్వార్ధాన్ని, స్వసుఖాన్ని కూడా త్యాగం చేయగలవారు.

2. ఎప్పుడు ఏది కోరుకుంటావు ?
    నా పొలం కన్నా నాపొలం చుట్టు ఉన్న పొలాలు బాగా పండాలని కోరుకుంటాను.

3. పంటను ఎలా పండించాలి ?
   మనుష్యులకు అరి షడ్ వర్గాలు ఎలా వెంబడిస్తాయో, అట్లే పొలంలో కలుపు మొక్కలు ఉంటాయి అవి
   తొలగించాలి. అవగాహనా అనే జాలం పోసి, వివేకమనే ఎరువువేసి, అభిమానమనే పక్షులు, అహంకారమనే   మృగాలు పాడుచేయకుండా చూసుకొవాలి. బీజమ్ నాటిన నాటి నుంచి అది పుష్పించి ఫలింమ్చే వరకు   తోటమాలి ఏవిధముగా శ్రద్ధ కలిగి ఉంటాడో (కదుపుతొఉన్న స్త్రీ 9నెలలు కడుపులో పెరుగుతున్న ప్రాణం   కోసం ఎట్లా శ్రద్ధ వహిస్తారో ) అట్లే  పంట పండింమ్చే  వాడు జాగరూకతొ ఉండాలి. ప్రక్రుతి విపత్తులు వచ్చిన   కష్టాన్ని భరించి ఓర్పుతో, ఓపికతో, ఓదార్పుతో, పొలమును నమ్ముకొని జీవిమ్చె వాడే నిజమైన రైతు ఆ   మాటలకు అమ్దరూ ముక్త  కమ్థముగా ఇతడే నిజమైన ధర్మాత్ముడు అన్నారు.

   వెంటనే రాజు కష్టాలలో ఆ
దుకున్నావాడే నిజమైన స్నేహితుడు            
   అనారోగ్యముతో భాద పడినవాడిని ఆదుకున్నవాడే నిజమైన వైద్యుడు.
   చీకటిలొ ఉన్నవానికి వెలుగు చూపెవాడే నిజమైన సూర్యుడు.
   భూమి ఆకాశమును నమ్ముకొని తిండిగింజలు పండించి అందరి ఆకలి తీర్చువాడే                           రైతు భాంధవుడు,    ధర్మాత్ముడు.         
                                                                             

రాజు తనకుమారులకు తనరాజ్యమును నాలుగు భాగాలుగా చేసి నలుగురికి పంచి ధర్మాన్ని విడువకుండా జీవిమ్చండి.

చివరగా సభలో ఉన్న వారందరికీ నేచేప్పేద్ర్మం ఏమిటంటే రైతు రకరకాల పంటలు పండించాలి వారికి అమ్దరూ సహాయము చేయాలి. రైతు ఆరోగ్యముగా ఉంటే దేశం ఆరోగ్యముగా ఉంటుంది.

సృష్టిలో జంతువులు ఇతరజంతువుల్ని ఆహారం కోసం ఆకలేసినప్పుడు చంపుతాయి. ఒక్క జమ్తువుమాత్రమే వినోదంకోసం, జిహ్వాచాపల్యంకోసం "జంతు మాసాన్ని" తినే జంతువే మానవుడు.

కరుణ,  ప్రేమ, వాత్స్యల్యం, ఔదార్యం, స్నేహం, తృప్తి కోరవ పడి నప్పుడు మనిషిలో హింసగుణం పెరిగి జంతువుగా మారుతాడు. అట్లా మారకుండా అందరు సుఖ శాంతులతో జీవిమ్చాలని నీ కోరుతున్నాను.

వయస్సుకు తగ్గ తృప్తి పొమ్దుతూ సంతృప్తిగా జీవిమ్చాలని నా ఆకాంక్ష.

ఈ కధ మీ అభి ప్రాయాలు తెలుపగలరు.
                                                             మీ మల్లాప్రగడ రామకృష్ణ 

                                                            Asst. Treasury Officer.
                                                             O/o The Disstrict Treasury
                                                             Nizamabad, Telangana 
                                                             Andhrapradesh, India.