31, అక్టోబర్ 2017, మంగళవారం

ప్రాంజలిప్రభ - భగవద్గీత ( అంతర్గత) సూక్తులు 2వ అధ్యాయం



ప్రాంజలిప్రభ - భగవద్గీత ( అంతర్గత) సూక్తులు
"O Brahma-, it is I, the Personality of Godhead, who was existing before the creation, when there was nothing but Myself. Nor was there the material nature, the cause of this creation. That which you see now is also I, the Personality of Godhead, and after annihilation what remains will also be I, the Personality of Godhead." (Bhag.2.9.33)
2వ అధ్యాయం (1/1)

1. కనులలో అశ్రువులు నిండియుండి, వ్యాకుల పాటుతో సోకముగా ఉన్న వానినీ ఓదార్పు మాటలు కొంత సాంత పర్చుటయే పెద్దల కర్తవ్యం.(గీత. 1 నండి 3 ).

2. మోహము వెంబడించి నప్పుడు మనసు మనసులో ఉండదు, ఆలోచనలు మారును. అప్పుడు ప్రవర్తన మారును.

3. అహంతో, బ్రమతో చేసే పనులు స్వర్గమును అందించవు , కీర్తిని పెంచవు. అది గమనించాలి.

4. పిరికి తనము యెవరి నైన నిలవ నీయదు, అది వేరొకరికి బలముగా మారును . అట్లు ఎవరూ ప్రవర్తించ కూడదు.

5. తుచ్ఛమైన హ్రుదయ దౌర్బల్యంను. వీడి నిజమును గ్రహించి ప్రతి ఒక్కరు విజయ లక్ష్యముగా ముందుకు సాగాలి. (గీత 4 మరియు 5 )

6. పూజ్యులైన వారిని యెదిరించుట తప్పు అని అనుకో వద్దు ? అణ్యాయాన్ని అనుచుట తప్పు కాదు అని గ్రహించాలి.

7 అహంకార మమకారములను పూర్తిగా వదలించు కొని నీలో ఉన్న అజ్ఞాన్నాన్ని పార ద్రోలి ధర్మమేదో గమనించాలి. 

8 ఏ విషయము నందు కూడా జయాప జయాలు ఎవరూ చెప్పలేరు. అందరుకు కర్తవ్యము మాత్రేమే భోధించగలరు. 9గీత 6 & 7 శ్లోకాలు 0

9 కొందరికి కాల దోషం, కార్పణ్య దోషం ఆవరించి మనసు పరి పరి విదాల పోయి, ఏది చేయాలో ఏది చేయ కూడదో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది దానిని తట్టుకొని నిగ్రహించు కోవాలి.

10 .శోకము ఇంద్రియములను దహించి వేయును, శోక దాహము చల్లార్చు కొనుటకు ఉపాయము గాంచవలెను . (గీత్ - (8 వ శ్లోకం )

11 పండితుల వలె మాట్లాడేవారు ఎవరైనా ప్రాణములు పోయినవారి గురించి, ఉన్నవారి గురించి  ఎట్టి పరిస్థితిలో శోకించరు.(గీత - 11 )

12 స్వధర్మమును విడిచిన వాడు, పాపము చేసిన వాడై నరకమున బడును .

13 .చంపువారు, చంప బడువారు వివేక దృష్టితో ఆలోచిస్తే ఎవరు కానరారు (గీత - ౧౨)

14 . ప్రతి ఒక్కరు కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఆయా దశలలో ఉన్న సుఖాలు (దేహప్రాప్తి)  అనుభవించాలి. ధీరుడైన వాడు వాటి విషయములో మోహము చెంది పతనము కాడు.

15 విష యేంద్రియ సంయోగము వలన సుఖ దుఃఖములు కలుగును, వాటి గురించి పదే పదే ఆలోచించుట అనవసరము (గీత - 14 )

16 . శీతోష్ణములు స్థిరముగా ఉన్న మీకు కానరావు, వాటివల్ల ఉత్పత్తి, వినాశము సంభవించిన  విచారించుట అవసరము లేదు.

17 . ప్రతి ఒక్కరు ఉత్తమము, మద్యమము, ప్రధమము గా  త్రికాలములలో జీవితమును అను భవించి తీరుతారని గమనించగలరు.

18 జనన మరణములు, మాత్రమూ జీవులు ఊహించినట్లు  సంభవించవు, వారు చేసిన పుణ్య పాపములు బట్టి జరుగునని గమనించ గలరు (గీత -15 )

19 ధీరుడైనవాడు సుఖ దు:ఖములను సమానముగా చూడవలెను. అట్టి పురుషునిలో విషయేంద్రియ సంయోగములు చలింప చేయజాలవు, అతడే ధర్మపరుడుగా ఉండగలడు. 

20 ప్రారబ్దము ననుసరించి వచ్చే కష్టాలు ఓరిమితో అనుభవించి, సహన శక్తిని పెంచుకొని, ఏ పరిస్థితిలో ఎవరికీ లొంగక, అధైర్యపడక, ధైర్యముతో సమబుద్ధిని ప్రవర్తించి నిజానిజాలు గ్రహించి జీవించటమే మానవుల లక్ష్యమని గ్రహించాలి. 

21 లేని వస్తువుకు ఉనికి లేదు, ఉన్న వస్తువుకు ఉనికి లేకుండా పోదు. 

22 ప్రతి మనిషిలో ఉంటుంది నిత్యమైన ఆత్మ, దేహము మాత్రము అనాత్మ.  

23 . ఏ విషయాలైన వాస్తవ రూపములను గ్రహించటం కష్టమే, కొంతవరకు తత్వజ్ఞానము తెలిసినవానికి తెలియవచ్చును. 

24 ధర్మాన్ని ఎవరు అడ్డు కోలేరు, నాశరహితమైన సత్యము ప్రపంచ మంతా ఆవహించి ఉన్నది అని గ్రహించగలరు (గీత -16 ).

25 ఆత్మ  అనేది ఎవరిని చంపలేదు, ఎవరి చేత ఎవరిచేత చంప బడలేదు ఆ ఆలోచన వచ్చిన వారు అజ్ఞానులు  

26 ఆత్మ అనేది పురాతనము, అజము, నిత్యమూ, శాశ్వతము, శరీరము చంపబడినను ఇది మాత్రము చంప బడదు. (గీత - 18 ) 

27  చిరిగిన వస్త్రము వదలి నూతన వస్త్రము ధరించినట్లే, ఆత్మ శిధిలమైన శరీరమునువదలి నూతన శరీరములో ప్రవేశించును.  (గీత - 22 )  

28 ఆత్మ ఉట్పట్టి, అస్తిత్వం, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశము అను భావ వికారములు లేనిది.

29 .ఆత్మ జనన మరణములు లేనిది, మార్పు లేనిది, దానిని  చంపు తున్నాము అని అనుకుంటే  అది ఒక మూర్ఖుని ఆలోచన అని అనుకోవచ్చును.

30 ఆత్మను శస్త్రములు చేధింపజాలవు. అగ్ని దహింప జాలదు. నీరుతో తడప జాలదు, వాయువు ఆరిపోవునట్లు చేయ జాలదు.(gita -23)

28, అక్టోబర్ 2017, శనివారం

భగవద్గీతలో (అంతర్గత) సూక్తులు -1/2(మొదటి అధ్యాయము )

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:- శ్రీ కృష్ణాయనమ:
Krishna
భగవద్గీతలో  (అంతర్గత)  సూక్తులు  -1/4(మొదటి అధ్యాయము ) (4-1-


31 .అధర్మ ప్రాభల్యము వలన కుల స్త్రీలు చెడుదురు, అందువలన వర్ణ సంకరము ఏర్పడును.


32. కామాన్ని జయించలేక స్త్రీ పురుషులు కొందరు వక్రమార్గమున అనుసరించి కొందరి అనాథలను సృష్టింస్తున్నారు, ఇది అవసరమా?


33. వర్ణ సాంకర్యము వలన మృతులై పితృలోకమందున్న వంశీయులు కుడా తిలోదకములు, పిండ ప్రదానాలు లేక అధోగతి పాలగుదురు.అది గమనించాలి


34. కామాన్ని జయించి నిగ్రహించు కోవటానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి, అది వర్ణ సంకరము కాకుండా జాగర్త పడాలి, అట్లు అయినచో తల్లి తండ్రులు తృప్తి పడరు, వారి మరణించిన పుత్రులు "శ్రద్ధలేక అర్చనలు " చేసిన " ఖర్మలు"  చేసిన ఫలితము ఉండదు .


35 మహాపాపముల వలన కుల ధర్మములు, జాతి ధర్మములు అడుగంటును, అందుకనే ఏ స్త్రీ అయిన పురుషుడు అయిన సక్రమ మార్గమున నడుచు తీరాలి.
--((**))--
36.సాంకర్యమునకు కామ వాసనా ప్రాబల్యమే మూలము. జ్ఞానమునకు ప్రబల శత్రువుగా మారును, అట్టి పరిస్తుతులలో నిగ్రహించుటకు ఆధ్యాత్మిక పద్ధతిలో మౌనం వహించి నిగ్రహించుకోవాలి అప్పుడే   నీలో ఉన్న శత్రువుని జయించ గలగుతావు. తాత్కాలికంగా కామాన్ని జయించ గలుగు తావు.


37  మానవ జాతికి అశ్వ శునకము లాంటి పారిశుద్ధ్యం పనికి రాదేమో.


38 శారీరక దృష్ట్యా వర్ణసాంకర్యము ఉత్త మోత్తమని వాదించేవారు కలియుగములో పుడతారు చిత్రమేమో గాని అది ముప్పు అని తెలిసినా ఒప్పుకుంటారు, నిప్పు అని తెలిసిన పట్టుకుంటారు అటు వంటి వారికి కాలమే సమాధానము చెపుతుందని గమనింఛాలి. (గీత - 43  & 44 )


39.  దుర్మార్గులను చంపుట మహా పాపము కాదు, వారిలో ఉన్న దుర్మార్గాన్ని తొలగించుటకు ప్రయత్నం చేయాలి.


40. బలమైనవాడు బలహీనునకు అవకాశము ఇచ్చిన "పిల్లి పులిగా మారినట్లు "  బలహీనుడు బలవంతుని ఎదుర్కొనే శక్తిగా మారుతారని గమనించాలి.


41. 10 సార్లు ఓడిన దిగులు పడ నవసరము లేదు, ఎందుకనగా నీవు ప్రతిసారి కొత్తదనం కోసం ప్రయత్నిమ్చావు, ఎప్పటికైనా గెలుస్తానాని నమ్మకంతో కనుక విజయం తప్పక నిన్నే ఆవరిస్తుంది.


42  మానవులు ప్రతి విషయములోను తృప్తిని గ్రహించవలెను, ఏ పరిస్థిలోను అసంతృప్తిలో ప్రకటించిన అది మన శరీరమునే తిని వేయును, ఫలితము లేదని తెలిసిన ప్రయత్నాన్ని కాలానికి వదిలి వేయ వలెను కానీ అనుమానము పెట్టుకొని బాధ పెట్టుట ఎవరినీ బ్రతికించదు.


43 . అసంతృప్తిగా ఉన్నచో ఉన్నతాశయములే దరిచేరవు, ఆధ్యాత్మిక జీవిత్తమే గుర్తుకు రాదు, భయము ఆవహించి మనసుని వేదన గురి చేస్తుంది అది అవసరమా ?


44. విషాదము నుండి విచారము పుట్టును, విచారము నుండి వివేకమైన ఆలోచనలు వెంబడించును, వాటిని సద్విని యోగము చేసు కొనుటయే మానవుని లక్షణంగా భావించాలి


45 దు:ఖమువలన మానవునకు లోక పరిస్థితులు స్పష్టముగా భోదపడి వివేకము కలుగును.


46 .దు:ఖమువలన హృదయము మృధువై పరుల కష్టమునందు సానుభూతి, సహకారము అనే గుణము ఉద్భవించును


47. నరులకు తమ దు:ఖములే గురువులని తెలుసుకొని ప్రకృతి ననుసరించాలి.


48.  ధర్మసందేహములను తీర్చి ఆధ్యాత్మికోన్నతికి మారుటకు విషాదయోగమే మూలము.


49. ధర్మము అతి సూక్షమైన దనియు, అనంత మైనదనియు దాని ననుసరించు వ్యక్తులను బట్టియు, సమాజమును బట్టియు అది వివివిధ రీతులలో ఉండును.


50. వ్యక్తి పరముగ నియమము లకును, సమాజము యొక్క నియమము లకును వ్యత్యాసము ఉండును. వ్యత్యాసములను గమనించి నడుచుకోవటమే మానవుల లక్షణం అని తెలుసుకోవాలి.  
                       
51 కురుక్షేత్రం భారత దేశంలో ఉన్నది . ఆ ప్రాంత విశేషము కుడా తెలుసుకోవాలి ఎందుకనగా ఇక్కడ అగ్ని ఇంద్రుడు, బ్రహ్మ మొదలగు దేవతలు తపస్సు చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయి. అందువల్ల ధర్మ క్షేత్రం, పుణ్యక్షేత్రం కురుక్షేత్రం అని భగవానుడు తెలియ పరిచారు.


52 మనమున్న ప్రాంతము ఒక్క సారి పరిశీలించుకొని అడుగు పెట్టమని, మనచుట్టు ఉన్నవారిని గమనించి ప్రవర్తించమని, మనమున్న ప్రాంతము అందర్ని కలుపుకొని పుణ్యక్షేత్రముగా మార్చుకొనుటకు ప్రయత్నం చేయాలి.


53  మన చేతివేళ్ళు 5 వేరుగా ఉన్న వాటి ఉపయోగము సమానము అని గమనించాలి, అట్లాగే అన్నదమ్ములు గుణములు వేరైనా శుభ కార్యమునకు అశుభ కార్యమునకు తప్పక ఏకం అవ్వాలి అని గమనించలి.


54. అన్నాదమ్ములలో, అక్కా చెల్లళ్ళల్లో పెద్దవారి మాటలకు విలువ ఇచ్చి ప్రవర్తించాలి, వారు చెప్పే విషయాలలో ఉన్న సత్యాన్ని గ్రహించాలి


55. ఏవిషయములో నైనా ఎత్తుకు పై ఎత్తు వేసి బ్రతుకును సార్ధకము చేసుకోవాలి,  ధర్మ భద్దముగా నడుచు కోవాలి.   


56. పెద్దవారు ఎవరైనా సరే తను అనుకరించే విధానాలు అందరిని సంప్రదించుకొని నడుస్తూ ఉంటే అందరికి మంచిది. మూర్ఖముగా ఒక్కరినే నమ్ముకొని ప్రవర్తించినా మంచిది కాదు అని గమనించాలి


57. అవసరమునకు సంఖ్యా బలము కన్నా, గుణబలం ఉన్న చోట తప్పక విజయము జరుగు నని గమనించాలి.


58 . అధికారంలో ఉన్న వాడు బలమైన అసమర్థుడుంటే వానికి ఎంతటిసమర్ధుడైన, గొప్పవారైనా తలవంచక తప్పదు, అది అధికారానికి గౌరవించక తప్పదు. 


59. ప్రాణానికి ప్రాణం దూరంగా ఉన్నా మనసు మాత్రం దగ్గరగా ఉంటుంది. భావాలన్నీ శుభ సూచకాలు అందిస్తాయి. అది  ఆధారపడి ఉంటుంది . 


60. అధి కారుని కొరకు,  ప్రాణాలనైనా ఆర్పించుటకు సిద్దీముగా  ఉంటారు కొందరు, అంతిమ శ్వాసవిడుచు వరకు విజయమునకై విరోచితముగా సమస్యను పరిష్కారిస్తారు మరికొందరు. ఏది ఏమైనా అది అధికారము ఉన్నంతవరకే.  

               
                  . 

25, అక్టోబర్ 2017, బుధవారం

భగవద్గీతలో (అంతర్గత) సూక్తులు -1(మొదటి అధ్యాయము )


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:- శ్రీ కృష్ణాయనమ:
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
Muralidhar Krishna (via wallpapersafari.com)







































భగవద్గీతలో  (అంతర్గత)  సూక్తులు  -1(మొదటి అధ్యాయము )

1.  గ్రుడ్డివారైన,  వయసు మీదపడిన వారైన వారికి  కన్నప్రేమ ఎప్పటికీ తగ్గదు,  మనవారు పరాయివారు మధ్య సంఘటనలు తెలుసుకోవాలని ఆరాటం తగ్గదు  (గీత 1/1)

2. ఎంతటి బలవంతుడైన సరే గురువుని ప్రార్ధించి ఏపని ఐన  చేస్తే దానికి తగ్గ ఫలితము రాగలదు (గీత 1/2)


3. ఎంతటి వారైనా గురుపుత్రులను తక్కువ చేయకూడదు, శిష్యులను తక్కువ చేయకూడదు,  అందరిలో ఉన్న   గొప్పతనమును గ్రహించాలి (గీత 1/3).

4. ఎంతటి వారైన సరే, ఎదుటి వారి తెలివి, వారి వంశములో ఉన్న తెలివి, వారి నడవడిక ముందు కొంత తెలుసుకుంటే మనకు ఎంత వరకు ఉపయోగ పడునో తెలుసుకొని ఉపయోగించుకోగలరు ( గీత 1/4 to 9)

5. మన స్నేహితులు పరిమితము అని బలహీన పడవద్దు, వారి స్నేహితులు అపరిమితము అని  దిగులు చెందకు,  ధైర్యవంతుడు ఒక్కడున్నా ఆవర్గము విజయము ఖాయము అని నమంకం ఉంచుకోవలెను.   (గీత 1/10)

--((**))--
6. మనకు ఒకని వల్ల ఇబ్బంది అని తెలుసు కున్నప్పుడు తప్పించు కొనుటకు ప్రయత్నించాలి, సింహనాదం చేసిన ముప్పు వచ్చేది రాక మానదు.    (గీత 1/11to 13)

7. ఎన్నో రకాల వాయిద్యాలు మ్రోగించిన భయస్తుల గుండెలు భీతిల్లక మానదు, భయము లేనివారికి ఉత్తేజము పెరుగక మానదు.  (గీత 1/ 14 తో 20)

8. ఎంతటి వారైన తనతో ఉన్న వారిని గొప్పతనం తెలుసు కోవాలి ముందు, గొప్పలకు పోయి నేనే ధైర్యవంతుణ్ణి ఈ పని నేను సాధిస్తా, అందరి ముందుకు తీసుకు వెళ్ళు అని ఆలోచించక గొప్పలు  చెప్ప కూడదు.  (గీత 1/21)

9. మనము ఏ విషయమైన ప్రత్యక్షముగా చూడవలెను, చారులు చెప్పిన విషయాలు గమనించక వారికి మనకు వ్యత్యాసము గమనించి దేశకాల పరిస్థితులను బట్టి ప్రవర్తించ వలెను. (గీత 1/22&23)

10. నడి రోడ్డులో మనిషిని నిలబెట్టి నీవు అన్నీ వైపుల గమనించు ఎం తెలుసు కుంటావో తెలుసుకో అంటే అతని చూపు ఎటు ఉంటుందో ఎవరు చెప్పలేరు, ఆలోచించటం తప్ప.  (గీత -1/24/25). 


11. ఒక పని చేయ దలుచు కున్నప్పుడు బంధు వర్గము చూచి అపారమగు జాలిచే గుండె కరిగి బ్రతకటం  ఎవరికి  అవసరము ? (గీత -1/26&27)


12. ఆత్మబంధువులను చూచి, మనసు తల్లడిల్లి, వణుకు ఏర్పడుట, చేతిలో ఉన్న చేయు పనిని వదులుట, ఎంతవరకు, సమంజసము? ఎవరైన సమయానికి ఆదుకుంటారని అనుకోవటం తప్పు, చేస్తున్న పని ఆపుట తప్పు, అసలు విషయం గమనించాలి.


13.  ధర్మం అని తెలిసినప్పుడు అది అనుకరించుటలో తన మన అని మనసులోకి వచ్చుట అంత మంచిది కాదు, ధర్మాన్ని ఆచరించ గలగటమే ఉత్తమ లక్ష్యం .

14. అనుకోని విధముగా మన శరీరము గగుర్పాటుకు గురి అయిన ఇంద్రియాలను నిగ్రహించుకొన్న వాడే నిజమైన స్త్రీ పురుషులని గమనించాలి.(ఇది కలియుగంలో కష్ట సాధ్యమే ఆయన సాధనమున సాధించలేనిది లేదుకనుక ప్రయత్నిమ్చ గలరు)


15. ఎవరికైనా అనుకోని విధముగా దేహములో కనబడని మంటలు ఆవహించి మనస్సును అల్లకల్లోలము చేసిన మంటలకు కారణమును గ్రహించి తగు మందు వేసుకోనుటే నిజమైన లక్ష్యము అని గ్రహించాలి


16. గ్రహించిన విద్యను మరచిన, పరులకు ఉపయోగించక పోయిన అటువంటి వారు ఎవరైనా ఉన్నా లేనట్లే.

17. శరీర శుభ్రత చాలా అవసరము ఎందుకనగా నిద్రలో కళ్ళకు కనురెప్పలు ఎంత సహకరిస్థాయో, అట్లే మనలో ఉన్న మలినాన్ని తొలగించు కోవటం ప్రతిరోజూ చేయాలి, అది మన మనస్సుకు ఎంతో ప్రశాంతత కల్గిస్తుంది అని గ్రహించాలి

18. ఈరోజు మంచిది కాదు అని తలచి రేపు చేద్దామని అనుకోవటం ఎప్పటికి మంచిది కాదు. మంచి చెడులు చూడటంకన్నా లక్ష్య సాధనకు కృషిలో మంచి కనబడుతుంది అని గ్రహించాలి.

19. అవసర మనుకున్నప్పుడు ఆత్మబంధువులు, కన్నబిడ్డలు, ధర్మము తప్పారని తెలిసినప్పుడు తనవారినైనా సరే యెరులైన సరే భాధ పెట్టక తప్పదు. సక్రమ మార్గమును తెచ్చుటకు చేయాలి కృషి .

20. నిజాయితి బ్రతుకులో ఉన్న తృప్తి మరి ఎక్కడ కనబడదని గ్రహించాలి (గీత  - 28 నుండి 35)  


21.ఎవరైనా సరే, అవసర మైనప్పుడు ధన ప్రాణములపై ఆశలు వదలి, ధైర్యముతో ముందుకు నడచినవారే ఎన్ని కష్టాలనైనా జయించ గలరు.

22. సుఖమనేది, కష్టమనేది,  శాస్వతము మాత్రము కాదు. సంతృప్తిలోనే అసలు విజయమున్నది.

23. ఎదుటి వారు దాడికి సిద్దమైనప్పుడు, మరణమే వీర స్వర్గమని తలచి ఎదురుగా ఎదిరించుటలోనే ఉన్నది నిజమైన ధైర్యము. (గీత 31 నుండి 35  వరకు )


24 నామీద దాడి చేసినా,  నేను మాత్రము దాడి చేయను అని కూర్చుంటే,  చేతకాని వాడిలాగా లెక్క గడతారు, ఉన్న గుర్తింపు కుడా పోతుంది అని గమనించాలి.

25 విషము పెట్టువాడు, కొంపలు కాల్చువాడు, భార్యను ఆవమానించువాడు, నీట ముంచువాడు సర్వస్వము అపహరించువాడు,  ఆయుధము పట్టి నిరాయుధుడిపై దాడి చేసేవాడు, అటువంటి వారిని బ్రతికించుట వలన ఎవరికి ఉపయోగము?  (గీత - 36  నుండి 40 వరకు )

26. మూర్ఖుడు అని తెలిసి నప్పడు వానిని దూరముగా ఉంచుటయేగాని, లేదా మనమే దూరముగా ఉండుటగాని చేయవలెను, అతడు మృగమని తెలిసి నప్పుడు చంపుటయే వేట ధర్మమ్ అని అందరు తెలుసుకోవాలి. 

27. యద్దము చేసేటప్పుడు మనవారు పరాయి వారు అని చూడకూడదు, పాపము అంటుతుంది అనుకుంటే యుద్ధము గురించి కుడా మాట్లాడ కూడదు.         .   .          

28 దురాశపరులు, యుక్త , యుక్త వీక్షణక్షణ నేరగని వారని తెలిసి వారిపై మనము మూర్ఖులుగా మారుట సమంజసమా ? వారిని మార్చలేనప్పుడు మనమే దూరముగా ఉండుట నేర్చుకోవాలి.  

29 కులము నశించిన, కులధర్మము నశించును. ధర్మము నశించగా అధర్మము పెచ్చు పెరుగును. (Gita- 41 )

30 వర్ణసాంకర్యమువలన కులము వారికిని, కులఘాతకులకు కుడా నరకప్రాప్తి తప్పదు (గీత -42).   .

Image may contain: 1 person, outdoor



భగవద్గీతలో  (అంతర్గత)  సూక్తులు  -1(మొదటి అధ్యాయము )

దృష్టి దోషమున్నను కన్న దృష్టియు ఇది 
సంఘటన లన్ని మన వారు సరయు మధ్య 
వయసు మీరిన యుద్దపు విషయ వాంఛ 
నిత్య ఆరాట ముయె పోరు నీకు నాకు ---- 1

గురువు ని ప్రార్ధించె ఫలము గొప్ప దగును     
తగ్గ ఫలితము పొందుట తగిన రీతి 
తక్కువయు ఎక్కువయు చూపు తప్పు అనకు 
శిష్యు లందరు ఒకటి గా శాంతి చేయు ----- 2

గొప్ప తనమును తెలిసియు గోల అనకు 
మంచి ఎవ్వరు చెప్పినా మనసు పంచు 
గౌరవమ్మును కలిగించు గురువు సేవ   
గురువు లే నేర్పు విద్యయు గళము తెల్పు ---- 3

ఎదుటి వారి తెలివి గాను యదలొ చేరు    
వారి వంశంలొ తెలివిని విషయ వరము  
నడవడిక బట్టి కొంతయు నటన తెలియు 
మనకు ఉపయోగ మెంతయో మరులు గొలుపు ---  4 

స్నేహితులు పరిమితము గా సేవ పెరుగు 
అపరిమితము వున్న చెలిమి  ఆశ కరుగు  
ధైర్యమున్న వాడును ఉన్న  దారి కలుగు  
నమ్మకము బలం పైనను నేర్పు కలుగు  ----- 5

సింహ నాదము అవసరం సిరుల వెంట  
ఒకని వల్లనే ఇబ్బంది వదలి వెడలు 
వచ్చు ముప్పుకు ఎదురేగి వలదు అనకు 
సాధనమున పనులు వచ్చి సహన మయ్యె --- 6 

గుండె దడలు పెరుగు శబ్ద గురక ఉన్న 
భయపు వాయిద్యాల తొ ఘోష బోధ చేయు 
ఉత్తేజము పెర్గి విజయము ఉలికి పడును 
యుద్ధ భేరీ నినాదము యముని పిలుపు  ---- 7

గొప్పలకు పోయి తిప్పలు గొలుసు లయ్యె  
ధైర్యముతొ ఎదు రీతలు దరిని చేర్చు 
సాధనతొ సాధించుట గొప్ప శాంతి కలుగు 
అహము అనుకున్నది తరిమి అవగతముగు --- 8
     
ప్రీతి కల్గించు క్షణము యే పిలుపు లాయె 
ప్రతిది అనుభవమును బట్టి ప్రీతి కలుగు 
దేశ కాలస్థితి గమనం దైవ తీర్పు 
మనలొ వత్యాసం తెలుసుకో మౌనముగను ----9 

అందరిలొ మంచి గమనించి ఆదరణలు       
నీకు ఆలోచనలు మంచి నీడ నిచ్చు 
నిన్ను నీవుగా నమ్మాలి నియమ బుద్ధి 
ఏది అయినను ఎరుకగా యదను పంచు ----- 10

సంకటస్థితి లోనైన శాంతి చూపు  
దిక్కులేనిసమయమునఁ దైవ నీడ 
మనిషి నాలుగు రోడ్లలో మౌన మన్న 
ఏది దారో తెలియక యే ఏమి అనరు ----- 11

జాలి అన్నీవిధముల లో జూప వలదు 
బంధు వర్గపు ప్రేమలు బాధ్యత యగు 
జాలితో బ్రతుకుటఏగ చపల మేళ 
గుండె కరిగేట్లు నటనలు గాలు టేల ----- 12

విద్యయున్న నిరాయుధ విజయ మేళ 
మనసు తల్లడిల్లిన ఫల మేళ కలుగు 
వణకి బేజారు అవుటయు వలదు నీకు 
పిరికి వానివలెనీవు పలుకు లేల      ----- 13
          
సమయముయెదుర్విని యోగ సేవ లేల 
చేతిలోవున్న విద్యను  జాగు నేల 
తప్పు పనులను ఆపుట తొంద రవుట 
తప్పు జోలికి పోకుండ తపన లుంచు ---- 14

ధర్మమార్గము వీడక ధైర్య ముంచు 
దైవచింతన మానక ధైర్య ముంచు
కరుణయన్నది తోడుగా కార్య మయ్యె 
కక్షతో మదినింపకు కరువు వచ్చు   ----- 15
 
పొందగలగేటి సుఖమును పోరు అనకు 
గద్దెకెక్కిన నేమియు గోల అవదు 
జ్ఞానమన్నది లేకయే జాగు అనకు 
పరులసొమ్ములు దోచినా పలుక వద్దు ----- 16

మాటలెన్నోఅనుటయేల మడమ తిప్పు  
మూలమూలలు గమనించి మనసు తెలుపు     
మూలమే మఱచిన నీకు యూత మేళ 
ఆట బొమ్మగా ప్రతి ఒక్క రేను నిజము ----- 17

పనిని విస్మరించుట ఏల పలుకు లేల 
తనమన అనుట ధర్మపు తలపు లేల      
ధర్మముయె నిన్ను రక్షించు ధరణి యందు 
ఉత్తమము లక్ష్య సాధన ఉంచి కదులు ----- 18
  
ఇంద్రియాల నిగ్రహము యే ఇలలొ మేలు 
నిజము తెల్ప గలిగి ఉంటె నీకు మేలు 
తెలుసు కోలేని ఘటనలు తలపు లగును
స్త్రీ పురుషులలో ప్రేమయే స్థిరము యగును   --19   

దేహమున మంట కలుగుట దైవ ఇఛ్ఛ 
మందు లకు తగ్గనిది మంట మౌన మాయె 
ద్రోహముతొ కల్గు మంటలు దాడి చేయు 
దాహముతొ వచ్చు మంటలు దరిలొ కరుగు ---- 20

విద్య నిన్నునిన్నుగను యే వింత మార్పు 
విద్య దానం చేసే కొద్ది వినయ మిచ్చు 
విద్య ఉండి లేదన్నను వింత మృగము 
విద్య ఉన్నశాంతియు పోతె వీధి తెలుపు ---- 21

కళ్లపై రెప్పలు కనులు కాపు కాయు 
నిద్రలో రెప్పలను మూయు నీకు రక్ష 
కథలు వలదులే కనుపాప కరువు ఐన       
నయనమే ప్రధానము నీకు నేస్త ముగను ---22

రాతలను కోసె కోతలు రవ్వ లగును 
చింపు కాగితం జీవితం చెత్త లుగను  
మోయు మొతలుగా జీవితం మారు టగును  
మారకయె ముందు మట్టిలో మనసు యగును ---23 

ఊపిరిని ఇచ్చు రాతలు ఉరక లయ్యె   
రాతి మనుషుల మధ్యన రాయ లయ్యె 
మనసు కరిగిపోవుట సహజ మాయ లయ్యె 
జీవతంలొ జయ అపజయం జీత మయ్యె  ---- 24

మంచి చెడులని వెనకకు మరల వద్దు 
శుబ్రత మనకు శుభముయే శాంతి నిచ్చు 
మనలొ ఉన్నమలినమంత మనసు చెఱచు   
నిత్యమూ మనసున మాట నిన్ను మార్చు ----25

నేడు కాదు రేపుఅనిన నమ్మ వద్దు 
లక్ష్య సాధనకు కృషిలో లాలి జూపు 
భయము తనవారు తోనైన బాధ తెచ్చు 
ఆత్మబంధువు ధర్మము ఆశ పెంచు  ----- 26
  
పగలు రేయి కలవవు లే పట్టు విడుపు 
భగవదాకాంక్ష ఆకాంక్ష భక్తి బట్టి 
కామనా రహితులు ఉంటె కార్య ఫలము 
శాస్త్ర పాండిత్యము ను నమ్మి సేవ చేయు ---27

కర్మచేతను అమరత్వ కార్య మవదు   
సంతతితొ ధనము ను తోడు శాంతి రాదు  
త్యాగమువలన ధర్మము తృప్తి నిచ్చు 
ధర్మమార్గము సూక్ష్మము దారి లేదు ----28
     
కామినీ కాంచనాలను కలువ కుండ 
కాల మంతాను దైవము కోరి ఉన్న 
చీకటిని తరిమే వెలుగు చెంత మిగులు  
కోరికలను త్యజించుట గొప్ప శక్తి     ---29
 
అంతరాత్మకు తృప్తియు అంతము లేదు 
సాధకుణ్ణి వెంబడించును సాక్షి లాగ 
మనసు ఆలోచనల దృష్టి మంత్ర మయ్యె 
అనుభవించ దలచిననే అంత మాయ ---30
   
భక్త జీవితముయు కోర్క బద్ద మగును 
త్యాగమును భక్తి యుక్తము తీపి గుర్తు 
జ్ఞానమనె అగ్ని పట్టుట జపము తీర్చు   
హృదయ పూర్వకంగాకోరు హాయి పొందు ---31

తనయు లందరూ దుష్టులై తాడు తెంచ 
కష్టమైనను కర్మగా కారు చిచ్చు 
నీదు కర్తవ్య మును ఎంచి నటన కాక 
మార్గ మీదైన సంహార మొవ్వ వలెను   --- 32
 
తృప్తి యు నిజాయితీగను తెలపగలగు 
ప్రాణములపైన ఆశల పలుకు వదులు 
ధైర్యముగను మాట్లాడుట ధర్మ మగును 
కష్ట నష్టము క్షణకము కాలమ గును      ---33
    
సంతసమ్ముగా ఉండుట సమ్మతగును 
సుఖము కష్టము స్నేహము స్థిరము కాదు 
తృప్తి సంతృప్తి ఆతృప్తి తారుమారు 
శాస్వితము ఏది లేదులే శాంతి కొరకు ---- 34
 
నిజము తెలిసియు నడచుట నీకు రక్ష 
ఎదుటి వారిని ఊహించి యదను పంచు 
అవసరములైతే ఎదుర్కొను ఆట లాగ 
నిజము ధైర్యగా నీవెంట సిద్ధ మగును ---35

తప్పు కానిచో పోరాటం ఒప్పు అవును  
మరణ మైనను వీరస్వర్గమని కదులు 
శరణమా మరణము కాదు శాంతి రాదు 
కార్య సాధకునికిధైర్య  కార్య మగును ---36
 
నిన్ను నీవుగా రక్షణే -- నీకు మేలు 
దాడి చేయను అంటెను -- తప్పు నీది 
ధర్మమును తెల్పి ఓర్పుతో -- దాడి చేయి 
చేత కాని వాడిల వద్దు -- చేత చూపు ------37 

గుర్తు కొరకుగా గుర్తింపు  -- గలుగునీకు 
గొప్పకాదును అదియును -- గోప్య మొవ్వు 
అక్కరకురాని వాడుగా -- అలుక వద్దు 
ఆటు పోటులు తప్పవు -- ఆకలవ్వు   ----38
 
విషము పెట్టియు బతుకుకు -- వివర నిచ్చె 
కొంపలను కాల్చి ఏడ్చుట -- కాల మెనెను 
భార్య తిట్టికొట్టియు ప్రేమ -- భయము చూపె
నీట ముంచి తెలివనెను  -- నమ్మ కాన ---39

సర్వ మును హరించియు పాడు -- సేయువాడు 
ఆయుధము ఉపాయము తెల్సి -- వాడ నాడు 
భార్య ఉన్నా సుఖము లేక   -- బాధ పెట్టు 
వాడు వారును ఉన్నాను -- వల్ల కాడె ----40
    
మృగము ఆయితేను చంపాలి -- మౌనమోద్దు 
దూరముంచుము మూర్ఖుణ్ణి  -- దురద చేరు 
మనము మారక తెలివిగా  -- మెలగ వలెను 
చచ్చె ముందు ధర్మము లేదు -- చావు తప్ప ---41 

పాప పుణ్యాలు అనుటయు -- ఆపదవ్వు 
యుద్ధ నీతితో పోరాడు -- జయము నిచ్చు    
మనలొ వారు పరాయొరు -- మాట వద్దు 
యుద్ధ కాంక్ష తీర్చుకొనుము -- మలుపు తిప్పు ---42
 
నిత్యమూ దురాశపరులు -- నిన్ను తాకు 
అశ లనుచూపి ఆరాట --  ఆట నేర్పు 
యుక్త వీక్షణక్షణ మేర - యశము అగును 
మారుట సమంజసము అయ్యె -- మఱువ వలదు -43

మార్చలేనప్పుడు మనమే-- మనము మారె 
నేర్చుకోవాలి జగతిలో  -- నిజము మాట  
దూరముంచిన కోపము -- దరిన చేరు 
దరిన చేరిన కౌగిళి -- దారి మార్చు  ---44
 
కులము నశించి పోవుట -- కలల నిజము 
కులము ధర్మము నశించు - కళలు మరు 
ధర్మము తొలగి యు అధర్మ - ధర్మ మగును 
దుష్ట బుద్దులు పెరుగును -- ధరిణి యందు --45 

వర్ణసాంకర్యమువలన-- వరుస మారు
స్త్రీ పురుషులలో భేదమే -- సొమ్ము చేయు 
కులము విలువలు పడిపోవు -- కలత లగును 
పెళ్లి యు కులాంతరముగా - పేరు మారు ---46
   
నరక పు ప్రాప్తి అన్నను -- నటన అనెను 
నమ్మినచొ వెన్ను పాటుయే  -- నాణ్యతవ్వు 
నేడు సుఖముయు ప్రశ్నలే -- నేర్పు గాను 
వయసు పోకడ అనుటయు -- వలపు లిచ్చు ---47
   
 
సమస్య క్లిష్టమైనది కాదని అనుకున్న వెంటనే, 
ఆ సమస్య 99 శాతం నిర్జీవమైపోయినట్లే।

నేటి గీతా భాష్యం 
 కోరుకోవడం వల్ల లభించేవి - శాపాలు। 
వచ్చినవి ఏకీభవిస్తే - వరాలు।

: నువ్వెవరో తెలిపి , ఏం చేయాలో నేర్పి,  చివరివరకు నీ చెయ్యి పట్టుకుని నడిపించేదే  --- ధ్యానం।

ఉత్తముని కోపము -  నీటిపై వ్రాత వలె। (క్షణ కాలము)
మధ్యముని కోపము -  ఇసుక పై వ్రాత వలె।  (కొన్ని గంటలు)
అధముని కోపము - పలకపై వ్రాత వలె। (కొన్ని వారాలు/నెలలు)
అధమాధముని కోపము -  శిలపై వ్రాత వలె।  (కొన్ని సంవత్సరాలు/దశాబ్దాలు)

 "గురుఁడవు పరమాత్మ ।।నీవే
నరులకు జ్ఞానమునొసఁగుము పరమాత్మా  !
పరులనణఁచికావుమయా।।
సురుచిరహాసా ।।సురవర సుందర రూపా  !!! "
 ----
" మరుదంశసంభవహనుమ ।।
పరులనణంచుచు భయమునుబాపుమ।।తండ్రీ !
నరవరరాఘవభక్తా !
ఉరుసాగరలంఘనవర ।।యో దనుజారీ !!! "

12, అక్టోబర్ 2017, గురువారం

సుమతీ శతకం.




‌సౌందర్య లహరి
(శ్రీ శంకర భగవత్పాద విరచితము)
(శ్రీ లలితాంబికాయైనమః)
ప్రక్షిప్త శ్లోకము __1
( సౌందర్య లహరి స్తోత్రం లో మూడు శ్లోకాలు ప్రక్షిప్త శ్లోకాలు గా 
ప్రచారంలో ఉన్నాయి)

"సమానీతః పద్భ్యాం  మణిముకురతా మమ్బరమణిః
భయాదన్తర్బద్ద  స్తిమిత కిరణ శ్రేణి మసృణః !
దధాతి త్వద్వక్త్రం ప్రతిఫలిత మశ్రాన్త వికచం
నిరాతంకం చంద్రాన్నిజ హృదయ పంకేరుహ మివ !!

ఈ శ్లోకం లో శ్రీదేవి ముఖ ప్రతిబింబ మహిమ ను స్తుతించారు.

అమ్మా! భగవతీ!ఆకాశానికి మణి వంటి వాడైన సూర్యుడు నీ పాదసేవకుడు గానూ , నీవు పాదము లుం చే మణిదర్పణం గానూ ఏర్పడిన వాడై యున్నాడు. అమిత ప్రకాశ వంతమైన నీ ముఖాన్ని ౘూసి , అతడు భయపడి తన వేయి సూర్యకిరణాలను పైకి ప్రసరింౘ నీ యకుండా తన లోనే అణౘు కుంటున్నాడు. నీ కిరీట మందున్న చంద్రుడి చేత, తన హృదయంలోని తామర
( నీ ముఖ ప్రతిబింబము ) ముడుౘు కొనకుండా వికాసము పొంది వెలుగు ౘుండగా  దానిని ధరిస్తున్నాడు.

సూర్యుడు శ్రీదేవి ముఖ పద్మాన్ని ధ్యానిస్తూ దేవీ పాదసేవను చేస్తున్నాడని భావము. సూర్యుడు దేవీ పాదపీఠ రూపమైన మణిదర్పణముగా స్వీకరింపబడ్డాడు. ఆ దర్పణంలో ప్రతిబింబించిన శ్రీదేవి ముఖ పద్మము, వికసించిన సూర్యుని హృదయ పద్మము వలె ఉన్నది.

--((**))--

ప్రక్షిప్త శ్లోకము __2

" సముద్భూత స్థూల _ స్తనభర ముర శ్చారుహసితం
కటాక్షే కందర్పః _ కుసుమిత కదంబద్యుతివపుః !
హరస్య త్వద్భ్రాంతిం _ మనసి జనయామాస మదనో
మావయ్యా యే భక్తాః పరిణతి రమీషా మియముమే" !!

దేవీ ఉపాసన వల్ల, " సారూప్యము" ఫలితంగా వస్తుందని చెప్పబడింది.

తల్లీ! దేవీ ! నిన్ను ఉపాసించిన మన్మథుడు, సారూప్య రూపమైన ఫలమును పొంది, ఉన్నతము లైన స్తనముల బరువును భరింౘుౘున్న నీ ఉరస్థ్సలమునూ సుందరమైన నీ చిరునవ్వు నూ , కడిమి పూవుల కెంపు ఛాయ గల నీ శరీరము నూ ,కడగంటి ౘూపులయందు అనురాగము నూ వహించి , పరమశివుని మనస్సులో నే తాను ఈ రూపంతో , నీవు అనే భ్రాంతిని కలిగిస్తున్నాడు. 
ఉమాదేవీ! నీ భక్తులందరికీ పరిణామము ఇటువంటిదే అవుతుంది కదా !
( నీ భక్తులందరకూ సారూప్య రూపమైన ఫలము కలుగుతుందని భావము)
అమ్మ ను ఉపాసించిన వారు, ఆమె దయవల్ల దేవీ రూపాన్నే పొందుతారని భావము.
--((**))--





సుమతీ శతకం.

తల్లిదండ్రులు తమ బిడ్డలను సన్మార్గ గాములను చేసే ప్రథమ ప్రయత్నమే
ఈ సుమతి శతక సాథన . ఇది కంద పద్య శతకం.
శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకలజనులు నౌరా యనగ
ధారాళమైన నీతులు
నోరూరగఁ జవులు పుట్ట నుడివెద సుమతీ !

ఓ సుమతీ .! ఆ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వలన ప్రాప్తించిన కవితాగుణం తో సమస్త ప్రజానీకము భళీ యని మెచ్చుకొనేటట్లు , ధారాశుధ్ధి కల్గి , ప్రసిద్ధములై ,అపవాదము లేని నీతులను మళ్ళీ మళ్ళీ వినాలనే కోరిక కలిగేటట్లు గా చెపుతాను.

......... ----- అని ప్రతిజ్ఞ చేసి , కవి ఈ శతకాన్ని ప్రారంభిస్తున్నాడు. ఇది కవికి తన కవిత్వం పై తన కున్న అపారమైన నమ్మకానికి ఉదాహరణ. ఆ నమ్మకం వమ్ము కాలేదు . ఎనిమిదివందల సంవత్సరాలుగా నోరూరి ,చవులు కలిగించి తెలుగు వారి నాలుకలపై సుమతీ పద్యాలు నాట్యమాడుతూనే ఉన్నాయి. ఇదే కదా ఒక మహాకవికి జాతి అందించే మహా నీరాజనం..

తెలుగు నాట పూర్వకాలం లో ఏదైనా వ్రాయడానికి మొదలుపెట్టే ముందు “శ్రీరామ జయం” అనో , “శ్రీరామ “ అనో “శ్రీరామ రక్ష” అనో ,వ్రాసి , కన్నుల కద్దుకొని తరువాత ,వ్రాయడం ప్రారంభించడం మన పూర్వీకుల అలవాటు. ఇది తెలుగు జాతి నడచిన బాట. ఆ శ్రీరాముడు తెలుగు వారి ఆరాథ్యదైవం కదా. అదే ఈ కవి చేత శ్రీరామ అనిపించింది . కావ్యాన్ని "శ్రీ " తో ప్రారంభించడం శుభకరమని మన పూర్వ కవులు ఒక సంప్రదాయం ప్రవేశపెట్టారు. " మంగళాదీని మంగళ మథ్యాని ."..... అనేది ఆర్యోక్తి...


విత్తమందు భ్రా౦తి వాసినయట్టి 
పురుషుడవనిలోన పుణ్యమూర్తి 
పరులవిత్తమరయ పాపసంచితమగు 
విశ్వదాభిరామ వినురవేమ 

పరులసొమ్ము కోసం ఎగబడనివాడే పుణ్యాత్ముడు. అలాకాదని బుద్ధికి గడ్డి మేపుతూ పక్కవాళ్ళ జేబుల్లో చేతులు పెట్టేవాళ్లకు మిగిలేవి పాపాలమూటలే.
"మంచిమాటవినర మానవుండ" శతకం రచయిత్రి భమిడిపాటి కామేశ్వరమ్మ 

నీదిగాని దానికెన్నడాశించకు
నీదియైనదాని వదలబోకు 
నీకు సాటిరారు నిలలోన నెవ్వరు 
"మంచిమాటవినర మానవుండ

ఇతరుల ఆస్తులకు ఆశపడకపోవడం మంచిదే కానీ సొంత మనుకున్నదాన్ని కాపాడుకొనే విజ్ఞతకూడా డాలి.లేకపోతే యిల్లు గుల్లవుతుంది. కాపురం వీధిపాలవుతుంది.

మాడలమీద నాసఁగలమానిసి కెక్కడి కీర్తి?కీర్తి పై 
వేడుకగల్గు నాతనికి విత్తము మీద మరెక్కడాస? యీ
రేడు జగంబులందు వెలహెచ్చిన కీర్తి ధనంబు గాంచి స 
స్ప్రౌఢ యశంబు జేకొనియె బమ్మయసింగడు దానకర్ణుడై

క్షమ గలిగిన సిరి గలుగును 
క్షమగలిగిన దన కలుగు సౌర ప్రభయున్
క్షమ గలిగిన దొన గలుగును హరియు మెచ్చు 
విశ్వదాభిరామ వినుర వేమ

ఓర్పు వున్నయెడలసంపదలు గలుగును, దానితో సూర్యుని వంటి వెలుగు కలుగును (కీర్తి)ఓర్పుతో రక్షణ కూడా కలుగును, హరి కూడా మెచ్చుకుంటాడు.

జాతి నీతి వేరు జన్మంబదొక్కటి 
అరయ తిండ్లు వేరె యాకలొకటే
దర్శనములు వేరు దైవమౌ నొక్కటి 
విశ్వదాభిరామ వినుర వేమ


' ప్రాణమయ కోశం '
దీనిలో లోపలినుండి బయటికి వెళ్ళే ' ప్రాణం ' బయటినుండి లోనికి పోవు ' అపానం ' నాభిస్థానంలోఉండి శరీరమంతటా రసాన్ని వ్యాపింపజేసే ' సమానం ' కంఠంలో ఉండి ఆహార పానీయాలను లోనికి ఆకర్షించి బలపరాక్రమాలను కలిగించే ' ఉదానం ' శరీరం అంతటా వ్యాపించి జీవుడు శరీరంలో ఆ యా కర్మలను చేయటానికి తోడ్పడు ' వ్యానం ', అను పంచ ప్రాణాలున్నాయి.


neti kavialu -4

om sri ram - sri maatrenama:
Wedding stage decorations
ప్రాంజలి  ప్రభ - నేటి కవిత

భర్తకు దూరంగా ఉన్న భార్య
వ్రాసిన గుండెల్లో దాగిన ప్రేమ లేఖ

కళ్ళుంటే చూసి వాక్కుంటే మాట్లాడి
మనసుంటే అందించి ప్రేమను పొంద లేవా
ప్రతి రాత్రి వసంత రాత్రి మనసును పంచె రాత్రి
మమతను పంచి ప్రేమను పొంద లేవా

ప్రతి గాలి పైర గాలి మల్లె పూల గాలి
వయసుని పంచి శాంతి పొంద లేవా
లేలేత చెక్కిళ్ళు, గులాబీ పువ్వుళ్లు
ముద్దు నందించి ఆనందం పొంద లేవా

మొక్కజొన్న తోటలో మురిసిన చీకట్లలో
మంచెకాడ కావల్సినది పొంద లేవా
కొండమీద సుక్కలన్ని సోకు చేసుకొనే వేళ
అవేళ వచ్చి నీక్కావల్సింది పొంద లేవా

గాలి వరవడికి పకపకా నవ్వుకునే వేళ
చక్కిలి గిలి పెట్టి కావాల్సింది పొంద లేవా
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
నవ్వులో నవ్వునై ఉన్న నన్ను పొంద లేవా

చలిగాలిలో నీకోసం ఎదురు చూసేవేళ  
వెచ్చని కౌగిళ్లు నాకు పంచి సుఖపడలేవా
నీ నీడలో తోడునై కలిసి మురిసే వేళ
మనసు అర్పించి మమత పొంద లేవా

వెన్నెలంతా మేసి ఏరు నెమరెసినా వేళ
సొగసంతా ఏటి పాలుకాకుండా ఆప లేవా
గాలి నన్ను ఆవరించి కమ్ముకొనేవేళ
గాలిగా ఆలింగనం చేసుకొని తృప్తి పడలేవా
--((*))--



జయతు సంస్కృత మాతరం 
జయతు సంస్కృత భాషణం 
జయతు సంస్కృత శిక్షణం 
జయతు సంస్కృత భావనం 

-- 

కలుగనీయకు ... 
**************** 

-- 
రాజమరాళ వృత్తము 
-- 
గణములు - న,భ,ర 
యతి లేదు 
-- 
జయము నీకగు శారదా 
జయము నీకగు భాగ్యదా 
జయము నీకగు జ్ఞానదా 
జయము నీకగు సర్వదా 
-- 
కరుణ నుంచుము సీమపై 
నొరుగకుండను మత్తులో 
నెఱుకఁ గూర్చుచు జాతిలో 
విరియఁజేయుము ప్రీతిగా 
-- 
మరువనీయక సంస్కృతిన్ 
వరలి నిత్యము తెల్వితో 
శిరము నెత్తుక నిల్వఁగా 
త్వరగఁ గూర్చుము జాగృతిన్ 
-- 
తెలిసి సంస్కృతి యున్నతిన్ 
నిలిపి నిచ్చలు ధర్మమున్ 
వెలుఁగ పూర్వపు రీతినే 
తొలఁగఁ జేయుము మాంద్యమున్ 
-- 
తెలిసి జర్గెడి దంతయున్ 
దెలివి నీయక నున్నచోఁ 
వెలుగుటెట్టుల జీవితాల్ 
కలుగు టెట్లిక శ్రేయముల్ 
-- 
కలికి పల్కుల కాంతగా 
వెలుఁగుఁ జూపెడి తల్లిగా 
కొలుచుకొందుము భక్తితో 
సలిపి జోతలు మెండుగా 
-- 
కలుగనీయకు భారతీ 
కలను సైతము నాపదన్ 
లలిత సుందర భాషకై 
వెలుఁగు గోరెడి భూమికై 
-- 
సుప్రభ 
5:17 ఫం 
08-29-2018 
ప్రతిదినమ్ము ... 
----------------------- 
-- 
సీ. 
-- 
తెలుఁగునాఁడునఁ బుట్టి వెలుఁగు పేరునఁ గల్గి 
పలుకు తల్లినిఁ గొల్చు వెలఁది నగుదు 
నిలిచియుండియు నిప్పు డిలను వేరొక చోటఁ 
దలఁపునుంచుదుఁ గన్నతల్లి భాష 
కలుగకుండినఁగాని ఘనమైన విద్వత్తు 
పలుకుచుందును మెచ్చి పద్యమందు 
పలుకుచున్నను వేరుభాష యవసరమై 
తెలుఁగు మర్వఁగఁ జాలఁ గలను నైన 
-- 
తెలుఁగు పండితునింటఁ గలిగినట్టిది జన్మ 
ఫలము నీయక యుండె పలువిధాల 
తెలుఁగు పాఠము నేర్పి తీయఁగా బడిలోనఁ 
గలుగఁ జేసెను బ్రీతి తెలుఁగునతఁడె 
కలముఁ దీసితినంచుఁ గవితలల్లఁగనేఁడు 
తెలియఁజెప్పఁగ లేని స్థితియె యైన 
నలరునాతని యాత్మ యాశీర్వదించఁగా 
వెలుఁగుచుండుమటంచు వృద్ధిఁ గలిగి 
-- 
ఆ.వె 
-- 
తలఁచుకొందునతనిఁ దెలుఁగు భాషకుఁ దోడు 
నిలిపినిత్యమెదను బలికి జేలు 
కలుగకుండుఁగాక విలపింపఁ జేయనీ 
తెలుఁగు వెలుఁగు మరచు తెగులు నాకు 
-- 
తీయనగుచు వినఁగ హాయి గూర్చెడి మాట 
తాయి పలుకు భాష తనివినిడును 
శ్రేయమిడెడు నాకుఁ జెప్పలేనంతగా 
వ్రాయఁ జేసి యందె భాష నుతియు 
-- 
చండి కృపను నేర్చి సరసమౌ యీ భాష 
పండుగవఁగ , రుచియు మెండు గాఁగఁ 
బండితులకునైనఁ బామరులకయిన 
గుండెపొంగఁ బదము గూర్చనగును 
-- 
ఒక్క దినమె కాదు చక్కఁగాఁ బొగడుట 
నిక్కువముగఁ దలఁతు నిత్యమిటుల 
మక్కువమెయి నేర్పు మాత శ్రీవాణియుఁ 
బ్రక్కనుండి భాష పెక్కు గతుల 
-- 
ప్రతిదినమ్ము నాకు భాషోత్సవంబగు 
ప్రతిదినమ్ము నాకు వరమె, నిజము 
ప్రతిదినమ్ము శ్రీకరమ్ముగఁ గొలుచుటే 
ప్రస్తుతించుచుండి భాష పదము/కృపను. 
-- 
తెలుఁగు వెలుఁగుఁ బంచి దేశదేశమ్ములఁ 
దలిఋణమ్ము దీర్చి ధన్యనవఁగ 
కలుగఁ జేయుఁ గాత కరుణతో శ్రీమాత 
వలయునట్టి శక్తి కలముకొసఁగి 
-- 
వందనమ్ములిడుదు భాషామ తల్లికి 
వందనమ్ములిడుదు బంధురముగ 
నందమైన యట్టి యాంధ్రభాషకుఁ గూడ 
సుందరముగనొప్పు ఛందమందు 

-- 

సుప్రభ 
11:05 
08-29-2018


ప్రాంజలి ప్రభ - నేటి కవితలు 
*సుప్రభాతం నీకు శుభోదయం

అరుణారుణ వర్ణాలతో
అనంతకోటి విశ్వాన్ని
ఆత్మీయతాభావంతో
ఉత్తేజపరిచే ఉదయభానుని
ప్రభాతవేళలో మెలుకో
ఓ మిత్రమా  
యుగధర్మం తెలుసుకో
ఓ మిత్రమా     

పృథ్వి ఒక్కసారిగా
చీకట్లను కమ్ముకున్న ముసుగును
తొలగించగా ఆదిత్యుని
అత్యోన్నతి భగ భగ
కిరణాలను ఆహ్వానం పలికింది

సరస్సులోని  కమలం
తన్మయత్వంతో వికసించింది
గూటిలోని చిలకా గోరింకలు
గుసగుసలాట మొదలైనది
చిగురాకు కదలిక మొదలైంది

 గంగమ్మ తల్లి కిరణవెలుగుతో
 నూతనోత్సాహముతో పరవళ్లు
తొక్కుతూ కదలిక ప్రారంభిస్తుంది
సకలజీవకోటికి ప్రాణా ధారమవుతుంది

జీవకోటి కనులు విప్పి
ప్రకృతినిచూసి ఆనంద
పారవశ్యంలో కర్తవ్య
నిర్ధారణకు వేళైనది

మేలుకో మిత్రమా మేలుకో
ప్రాంజలి ప్రభాస గీతమ్ తో
ప్రాపంచిక విషయాలను
అర్ధం చేసుకొని మేలుకో     

సుప్రభాతం నీకు శుభోదయం 
--((*))--

ప్రాంజలి ప్రభ 

అర్ధం కొరకు ప్రపంచ మంతా
వెంపర్లాడుతు ఉండు
వెంపర్లాడే గుణం ప్రపంచమంతా
జీవించుతూనే ఉండు

జీవితం తప్పదు ప్రపంచమంతా
ప్రశ్నార్ధకముగానే ఉండు
ప్రశ్నలపై ప్రశ్నలు ప్రపంచమంతా
నిగురుకప్పిన నిప్పులాగుండు

నిగురుకప్పిన ప్రపంచ మంతా
ప్రశాంతత కు వెతుకుచుండు

లేకుండా ప్రపంచమంతా
బంధానికి చిక్కి తిరుగుచుండు

బంధపు ప్రేమలు ప్రపంచమంతా
ప్రశ్నల మనసుతో నలుగచుండు
మనసులేని ప్రపంచమంతా
సమయాన్ని వ్యర్ధము చేయుచుండు

సమయ విజ్ఞానము ప్రపంచమంతా 
విశ్వశాంతి కి తోడ్పడు చుండు 
విశ్వశాంతికోసం ప్రపంచ మంతా 
 దైవాన్ని ప్రార్ధించుతూ ఉండు 


* వేంకటేశా  * వేంకటేశా  * వేంకటేశా
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 


కవితను వ్రాద్దామనుకున్నాను వేంకటేశా
నా ప్రేరణ నీవేకదా, నీ రుచులు అభిరుచులు తెలుపవా
గాత్రం తో పాడుదామకున్నాను వెంకటేశా
నీ నిద్ర భంగం చేయలేను, అయిన ఏ రాగంలో పాడాలో తెలుపవా

విరహం నన్ను ఆవరిస్తున్నది వేంకటేశా
కోరిక ఇదని చెప్పలేను, అయిన అనుభవశాలివి తెలుపవా
దాహంతో తపిస్తున్నాను వేంకటేశా
దాహం తీర్చుకోలేను, అయిన దాహం తీర్చే దారి తెలుపవా

దూరం నన్ను భయపెడుతున్నది వేంకటేశా
అది నీపై అలకని చెప్పలేను, అయిన దగ్గిర మార్గం తెలుపవా
నీ స్నేహం కోసం అర్ధిస్తున్నాను వేంకటేశా
సరస్వం నీకే అర్పిస్తున్నాను, అయిన మనస్సుకు శాంతి తెలుపవా

ఆశలు నన్ను తరుముతున్నాయి వేంకటేశా
కావ్యాన్ని వ్రాయలనుకున్నాను,  అయిన ఎలా వ్రాయాలో తెలుపవా
ద్యాస అంతా నీ దగ్గరే ఉంది వేంకటేశా
ధ్యానం చేస్తున్నాను, అయిన నీపై ఏకాగ్ర దృష్టి ఎలాగో తెలుపవా

శ్రావ్యంగా గానం చేయాలనుకున్నాను వేంకటేశా
లక్ష్యాలను అధికమిస్తున్నాను, అయిన లక్ష్యానికి దారి చూపలేవా
దాన, ధర్మాలు చేస్తున్నాను వేంకటేశా
అనురాగభంధలో ఉన్నాను, అయిన భందాలకు విముక్తి తెలుపవా

చీకటిలో ఏమిచేయాలో తెలియకున్నాను వెంకటేశా
వెలుగు చూడలేకున్నాను అయిన నా మస్తకమునందు వెలుగు నింపలేవా
బంధానికి అతీతుడనై ఉండలేకున్నాను వేంకటేశా
భక్తి  భావనలో ఉన్నాను,అయిన భాగ్యం కలిగించే మనస్సు అందించవా

జగత్తు కోసం ఏమిచేయాలో తెలపాలి వేంకటేశా
అభినయించ గలను, అయిన నటనా సూత్రధారివి కదా ఎలాగో తెలుపవా
భంగిమలా బ్రతకాలనుకున్నాను వెంకటేశా
నాట్యం చేయాలనుకున్నాను, అయిన వశీకరణం  ఎలాగో తెలుపవా


ఉచ్వాస వద్దన్నా వెంబడిస్తున్నది వేంకటేశా
నిశ్వాస ఎలా చేయగలను, అయిన ప్రకృతిలో ఎలా బ్రతకాలో తెలుపవా
తనువంతా నీకే అర్పిస్తున్నాను వేంకటేశా
ప్రాణాలను నీదగ్గరే ఉంచుతున్నాను, అయిన నీలో ఇక్యమార్గం తెలుపవా  
ఓం శ్రీ రామ వేంకటేశా
ఓం శ్రీ కృష్ణ వేంకటేశా
ఓం కార వేంకటేశా
నమో నమ: నమోనమ: నమోనమ:


--((*))--


ఓం శ్రీ రామ్ = శ్రీ మాత్రేనమ: 

రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

ప్రాంజలి ప్రభ - ఓం నమ:శివాయ  


సముద్రంలో కలిసే నదిలా

సాగి పోతున్నా శివా
వేషాలు వేసే నటుడిలా 
వేస్తూ బ్రతుకు తున్నా శివా  

భూమిపై ఎందుకున్నానో తెలవలా

భూమికి భారంగా ఉండలేను శివా   
పాత్ర ఔచిత్యంలో బ్రతికే దెలా 
బ్రతుకే ఒక నాటక మైనది శివా 

వయసుకు న్యాయం చేయలా 

ప్రేమను పంచ లేకపోతున్న శివా 
ఏమి పొందానో ఏమి కోల్పోయానో ఎలా 
ఏమి జ్ఞప్తికి రాని జీవి నైనాను శివా 

ఆశయం వదలి ఆశకు చిక్కాను ఎలా 

ప్రకృతికి భార మైనాను శివా 
జీవన పోరాటంలో నీవు గుర్తుకు రాలా
నిన్ను పూజించక నిర్లక్ష్యం చేశా శివా 

నా అజ్ఞానాన్నీ మన్నించేది ఎలా  

నన్ను కరుణించి కాపాడవా శివా 
కుటుంబం కోసం ఆరాటపడి బ్రతికేదెలా
నీ శాన్నిత్యాన్ని పొందాలని ఉంది శివా  

తెలియదు నీ అనుగ్రహము పొందేదెలా 

కార్తీక మాసం పూజ చేస్తున్నా శివా 
మూర్ఖత్వ వాత్లల్యంతో బ్రతికేదేలా
నాతండ్రిగా నాకు మోక్షము ఇవ్వవా శివా   


--((*))--

9, అక్టోబర్ 2017, సోమవారం

నేటి కవితలు -3


స్కూలుకెళ్ళే ఆ పొద్దు

సాహితీమిత్రులారా!
వాకిలి సాహిత్య పత్రికలో డైరీ శీర్షికలోని ఒక అంశం ఇది
ఆస్వాదించండి-
పిట్టగోడనానుకుని వున్న గన్నేరు చెట్టు మీద పిచుకలు తెగ అల్లరి చేస్తున్నాయి. బాయిలర్‌లోని వేడి నీళ్ళతో బాల్చీ నిండుతోంది. రెండు చేతులూ పైకి చాచి ఓ సారి ఒళ్ళు విరుచుకుంది చిన్ని. పూలచెట్లని, నీళ్ళ కుండీలని రాసుకుంటూ చిట్టిదూడ గంతులు వేస్తూ పరిగెడుతోంది. దాన్నో కంట కనిపెడుతూ బుజాల మీద వాలిన రెండు జడలని పైకెత్తి వెనుకకి ముడివేసింది.

నిండిన వేడి నీళ్ళ బాల్చీని తీసుకెళ్ళేముందు తన వంతు న్యాయంగా బాయిలర్ గొట్టంలో వేసిన రెండు చెక్కముక్కలు చిటపటామంటూ వెలుగందుకున్నాయి. స్నానం కానిచ్చి – ఆవుదూడని తల్లి దగ్గరికి చేర్చే ప్రయత్నంలో పరుగులు పెడుతుంటే – అమ్మ వేసిన మూడో కేక ఇంటి లోపలికి నడిపించింది. వెళ్తూ వెళ్తూ తుంపుకెళ్ళిన ఒంటి రెక్క ఎర్ర మందారం అమ్మ జడలోకి చేరింది. పెద్దయ్యాక ఎవరేం చేస్తారు, ఏం చదువుతారు వంటి కబుర్లు నడుస్తున్నాయి చిన్నక్క చిన్నన్న నాన్నల మధ్య.

తడి ఒంటి మీద గౌను వేసుకోవద్దన్నానా అంటూ కాస్త చిరాకుపడి – ఇటుతిప్పి బొట్టూ కాటుక దిద్ది – అటుతిప్పి రెండు జడలు అల్లి పైకి కట్టి, ఆ పైన పెరుగన్నం పెట్టి వెళ్ళమంది అమ్మ. బ్యాగు బుజానికి తగిలించి “నాన్న! నేనైతే పెద్దయ్యాక చందమామకి బొమ్మలు వేస్తా” అంటూ బయటకి పరుగుతీసింది. రోజుకోటి చెబుతుంది అంటూ ఇంటిల్లిపాది నవ్వే నవ్వులు వెనకాలే వచ్చాయి కాసింత దూరం.

ఎడమవైపు ఆట మైదానం దాటి ఆ దిగువన పంట కాలువ పక్కనుండి ఎడ్ల బండ్లు రెండు ఊర్లోకి వెళ్తున్నాయి. రెండో బండిలో ఎవరూ లేరు. ముందు బండి వెనకాలే అలా వెళ్ళిపోతోంది. నా వెనకే రా! – అంటూ ఎద్దులు కూడా మాట్లాడుకుంటాయా? ! కాస్సేపు ఆగి చూసి కదిలింది.

కొద్ది వాలులో వున్న మైసూరు రామస్వామిగారి ఇంటికెళ్ళే దారిలో రంగురాళ్ళు పైకొచ్చి మెరుస్తున్నాయి. నిన్నా, మొన్నా చూడలేదే అక్కడ? నాలుగు రాళ్ళని ఏరి గౌనుకి తుడిచి బ్యాగులో వేసుకుంది. ఇంతకు ముందు కష్టపడి ఏరి దాచుకున్న రాళ్ళని అమ్మ ఇల్లు సద్దుతూ చెత్తలోకి విసిరేసింది. వీటినెక్కడ దాచాలో!

మొక్కలకి నీళ్ళు పెడుతున్న రాచకొండ రమణ ఆంటీ పలకరింపుగా చెయ్యి ఊపింది. కాలువ పక్కగా వున్న దర్జీ వాళ్ళ ఇంట్లోంచి బయటకి వచ్చిన ఆమె నీళ్ళ కోసం బిందె తీసుకుని కాలువలోకి దిగింది. ఆమె వెనకే వెళ్ళిన ఓ బుడ్డోడు పారే నీళ్ళ పక్కగా వున్న ఇసుక మేట పైన వాలి హాయిగా పడుకున్నాడు. వీడెప్పుడు స్కూలికోస్తాడో?

ఒకరినొకరు తరుముకుంటూ హెడ్మాస్టర్‌గారింటిలోనుండి వచ్చి కలిసారు చంటి, మోహన్. మైదానంలో ఉయ్యాల బల్లలు, జారుడుబండ సాయంత్రం కోసం ఎదురు చూస్తున్నాయి. పొడుగైన జండా కర్రకి ఆ చివరనున్న చక్రం గాలికి దానంతటదే గిరగిరా తిరుగుతోంది.

ముందు వెళ్తున్న కాంపౌండర్ ముత్యాలు వాళ్ళ రాణి వెనక్కి తిరిగి చూసి ఆగింది. “నీతానింకో పెన్సిలుందా? నాదేడ్నోబోయింది”. తలూపి బ్యాగ్ లోంచి కంపాస్ బాక్స్ తీసి తెరిచింది. పెన్సిల్ తీసుకుని బాక్స్ లోకి చూస్తూ అడిగింది రాణి “ఎందుకిన్ని గాలిబుగ్గలు (బెలూన్లు) ? ” . “ఉత్తినే! ఊదుకోడానికి”.

రామలక్ష్మీ టీచర్ ఇంటి గుమ్మంలోనుండి తొంగి చూసిన ప్రమీల ఆగొద్దని, వెళ్ళిపోమ్మని సైగ చేసింది. తమ్ముడితో కలిసి వస్తుంది కాబోలు.

ఇంటిముందు కనిపించని చంద్రకళ కోసం లోపలికి తొంగి చూస్తే – ఎదురొచ్చిన అయ్య గంగారం “దోస్తులిద్దరు కల్సిపోతరా!” అంటూ నవ్వి బయటకెళ్ళిపోయాడు. “రా! రొట్టె తిందువు” అంటూ ఆప్యాయంగా పిలిచింది లక్ష్మీబాయి. పీట మీద కూర్చున్న ఆమె రెండు చేతుల మధ్య గిరగిరా తిరుగుతోందో పచ్చి జొన్న రొట్టె. ముందు పెనం మీద దోరగా కాలుతూ మరోటి. పక్కన పింగాణీ పాత్రలో ఎర్రని పండు మిరపకాయ కారం. నోటిలో ఊరుతున్న నీటిని అణుచుకుంటూ “వద్దిప్పుడు, సాయంత్రం వస్తా” అంటూ మాటిచ్చింది.

చంద్రకళ చెల్లెళ్ళు మున్నీ, రాజీ, తమ్ముడు శంకర్లతో కలిసి వచ్చేలోపు ముందేళ్తున్న గ్రేసు వెనక్కి వచ్చి - ఆ రోజు సాయంత్రం ఆటలకి కొండ పైకి వెళ్ళడమా లేక మైదానంలోకా అని తేల్చుకుని వెళ్ళింది.

కాలువనానుకుని వున్న చెరుకు పంట మధ్యగా వున్న మట్టి రోడ్డు పైన ఎవరో సైకిల్ మీద వెళ్తున్నారు. ఆ పంట, మరింక ఆ దారి అలా వెళ్ళి వెళ్ళి – ఆ చివరన మబ్బుల్లో కలిసి పోయిన కొండల దాకా వున్నాయి. మరెంత దూరం వెళ్తాడతడు?

అలా అటుకేసి చూస్తుండగానే – వెనుకనుండి ప్రమీల, సుబ్రమణ్యం వచ్చి కలిసారు. రఘునాధన్ మామి ఇల్లు కూడా దాటి – ఇంకో నలుగురు స్నేహితులని పోగేసుకుని కదిలిపోతుంటే – “ఆపా ఆరహై క్యా?” అంటూ ఆపింది జుబేద. “హా! వస్తోంది. పీచే” అంటూ వెళ్తుంటే జుబేద చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్ళు వచ్చి కలిసారు.

ఇల్లు మాయమై కొండ దారి మిగిలాకా – గుంపంతా కలిసి కొండ అంచునే ఈదరి నుండి ఆదరిన వున్న స్కూలుకి నడుస్తున్నారు. సరిగ్గా కొండ మధ్యకి వచ్చేటప్పటికి ప్రతి రోజులానే ప్రమీల తల పైకెత్తి ‘హచ్!’ అంటూ మూడు సార్లు తుమ్మింది. సీతాకోకచిలుకల గుంపోకటి వాళ్ళ తలల మీదుగా ఎగిరెళ్ళిపోయింది. ఇటునుంచి వెళ్తున్నవీళ్ళని అటునుంచి ఊర్లోకి వెళ్తున్నవాళ్ళు ఆగి మరీ చూస్తున్నారు.

కొండ మలుపు తిరిగింది. దూరంగా వెళుతున్న రామలక్ష్మీ టీచర్ని చూడాగానే కలిసి నడుస్తున్న గుంపునంతా వదిలి ఆమె కోసం పరిగెట్టింది. ఊ అన్నా , ఆ అన్నా కథలు చెప్పే ఆమె పక్కన నడవడం ఇష్టం మరి. వగరుస్తూ దగ్గరికి వెళ్ళి “నిన్నటి కథ… అదే… సగంలో… ఆపేసారే…” అంటుండగానే – “ఏంటా పరుగు ఆ!” అంటూ మందలిస్తూనే చెప్పింది “కథ పూర్తి చేసేంత సమయం లేదమ్మాయ్! చూసావా! అదిగో స్కూల్ దగ్గరపడింది”.

“అయినా ఈరోజో కొత్త కథ ఎదురు చూస్తోందిలే” అందామె తిరిగి నవ్వుతూ. ఏ కథో అడగక ముందే “చూసావా?! ఈ చీర కొంగు. ఎంత పెద్దగా వేసుకున్నానో?” అంటూ ఎదురు ప్రశ్న వేసింది.

“ఎందుకూ?”.

“పోయినసారి మూడు నెలల జీతాలు ఒకేసారి ఇచ్చారుగా. ఈసారి నాలుగు నెలలవి మరి! మూట కట్టుకుపోదామని”. ఓ సారి మొహంలోకి తొంగి చూసి ఆ నవ్వులో వంతకలిపిందే కానీ – ఈ కథ కానీ కథేదో నిజంగా కలవరపెట్టింది. ఆ కొంగుని తాకుతూ ఆమెకి మరింత దగ్గరగా నడుస్తుండగానే స్కూలోచ్చింది.
---------------------------------------------------------
రచన - విజయ కర్రా, వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో
---------------------------------------------------------
- ఏ.వి.రమణరాజు

ప్రాంజలిప్రభ - రెండక్షరాల ప్రేమ భావకవిత
భూమి పై పుట్టి
నింగి క్రింద పెర్గి
ఎండ కు ఎండి
వాన కు తడ్శి
చలి కి వన్కి
అవ్వా తాత
అమ్మ నాన్న
అన్నా అక్కా
చెల్లి తమ్ముడనే
భాంధవ్వాల మధ్య
గురు వు దగ్గర
విద్య ను నేర్చుకొని
కొల్వు ని సాధించి
డబ్బు ని సంపాదించి
పెళ్ళి అనే బంధంలో చిక్కి
భార్యా బిడ్డలకు
ప్రేమ ను పంచి
స్నేహం ను పెంచి
భాద ను భరించి
సుఖా న్ని అందించి
అహం ను తొలగించి
కోపా న్ని తగ్గించి
శాంతీ ని కల్పించి
నేను అనే అహంకారాన్ని వదలి
మనం అనే మమకారం తో
జాలి దయ చూపుతూ
తీపి అనుభవాన్ని పంచుతూ
చేదు అనుభవాన్ని మర్చి పోతూ
కాలం తోపాటు తో తిరుగతూ
సూర్య చంద్ర సహాయముతో
ముఖంపై నవ్వు చూపుతూ
స్వర్గం అదించే మాట లతో
ప్రేమ ను పంచుతూ
భంద మేర్పడుటే జీవితం
ఓర్పు నేర్పు మార్పే
శక్తి యుక్తి ముక్తి
అదే క్రాంతి ఖ్యాతి
ప్రేమ ను పంచే జ్యోతి


ప్రాంజలి ప్రభ - నేటి కవితలు

నేను దుర్మార్గుడనే - నా చేతలు దుర్మార్గాలే
నేను పంచిన అన్నాన్నే - మీరు తింటున్నారులే

ఉదయ భాను శక్తితో - వృక్ష సంపద శక్తితో
గాలి సహకారంతో - ఉప్పొంగే జలా ల శక్తితో
మనుష్యల కష్టం తో - స్త్రీ,  పురుష, జంతు బలంతో
పంట పండించి మీకు అందించా - దానిలో దుర్మార్గం లేదే

పుణ్యం పొందిన భూమితో - పాపం తో చేసిన విత్తులతో
స్వార్థము తో వేసిన ఎరువులతో - మద్యాన్ని పోయుటతో
కాలం కాపుగా ఉండటంతో - అమాయక జీవాల సహాయమంతో
అబద్ధమనే మాటలతో - నిజమనే పంటను ఇచ్ఛా దానిలో దుర్మార్గం లేదే

ఆకాశం సాక్షితో - పంటను ఇంటికి చేర్చి పంచటంతో
ఎగబడి అందు కోవటంతో - అద్భుతమని అమోఘమని అనటంతో
పనిలో దుర్మార్గం లేదు, అటు వంటి వాడు దుర్మార్గుడెలా అవుతాడు
మా వరకు మా ఆకలి తీర్చిన అన్నపూర్ణ వల్లభుడు

ఇది కలియుగం బ్రతుకుని సద్వినియోగం చేసుకోక తప్పదు
మనిషి మనిషిగా బ్రతుకుటకు అందరి సహకారం కోరటం  తప్పా       

__((*))--

ప్రాంజలి ప్రభ - నేటి కవితలు -

నడకకు దూరం తెలియదు
పిడుగుకు మౌనం తెలియదు
వరుసకు వైనం తెలియదు
తరువుకు వైరం తెలియదు

మరుపుకు మోసం తెలియదు
చెరువుకు మీనం తెలియదు
వయసుకు కామం తెలియదు
తనువుకు తాపం తెలియదు

చినుకుకు శబ్ధం తెలియదు
మగువకు మర్మం తెలియదు
మగనికి భిన్నం తెలియదు
వలపుకి వాటం తెలియదు

మాటలకి భావం తెలియదు
చేష్టలకి లౌక్యం తెలియదు
కడలికి కెరటం తెలియదు
కలలకి నిద్ర తెలియదు

నాకు ఏమీ తెలియదు
మనసు నిద్ర పోనీయదు
మమత కలవ నీయదు
కవితలు వ్రాయకతప్పదు

చదివి భాధపడవద్దు
చదవమని చెప్పొద్దు
షేర్ చయ్య వద్దు
లైక్ అసలివ్వ వద్దు
తెలియక వ్రాసాను
నన్ను అర్ధం చేసుకుంటేచాలు
మీ "మ. రామక్రృష్ణ
అందరికీ ధన్యవాదాలు

ప్రాంజలి ప్రభ - నేటి కవితలు -3  



వేళా పాళా అనకే
ఆకలి గీకలి అనవద్దు
గడ బిడ చేయకే
దీక్ష గీక్ష అనవద్దు

తక మక పెట్టకే
తరుణం దాటనీయవద్దు
బేరసారాలు ఏందుకే
యెక్కాక దిగు అనవద్దు

తళుకు బెళుకు చూపకే
వద్దు ఇప్పటొద్దు అనవద్ద
ఉక్కిరిబిక్కిరి చేయకే
రేపు మాపు అనవద్దు

ఎక్కువతక్కువ చూడకే
లాభం ఏమిటనవద్దు
కళ్ళు వళ్ళు తిప్పకే
వళ్ళు గుళ్ళ చేయవద్దు

నీ నవ్వే నాకు పడకే
నీ నడకే నాకు చురకే
నీ మోనం నాకు ఓకే
నా వైనం నీకు ఓకే
ఇద్దరి ఏకం ప్రపంచానికి ఓకే

ప్రాంజలి ప్రభ - నేటి కవితలు -3  


మనసు ఉంటే నే ప్రేమకలదు
ప్రేమ ఉంటేనే.చెలిమి కలదు
చెలిమి ఉంటేనే బలము కలదు
బలము ఉంటేనే మమత కలదు

మమత ఉంటేనే అప్పు కలదు
అప్పు ఉంటేనే మెతుకు కలదు
మెతుకు ఉంటేనే నడక కలదు
నడక ఉంటేనే బతుకు కలదు

బతుకు ఉంటేనే గుర్తింపు కలదు
గుర్తింపు ఉంటేనే విలువ కలదు
విలువ ఉంటేనే ప్రేమ కలదు
ప్రేమ లేనిదే మనిషికి బ్రతుకే లేదు