5, అక్టోబర్ 2017, గురువారం

ప్రాంజలి ప్రభ - నేటి సూక్తులు





నేటి సూక్తులు - ప్రాంజలి ప్రభ 


.ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోఁక దేహతాపంబులు దీఱిపోవు 

నే నీ శుభాకార మీక్షింపఁ గన్నుల కఖిలార్థలాభంబు గలుగుచుండు 
నే నీ చరణసేవ లే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబుఁ బొందఁగలుగు 
నే నీ లసన్నామ మేప్రొద్దుభక్తితోఁ దడవిన బంధసంతతులు వాయు 

నట్టి నీయందు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీ యాన నానలేదు 

కరుణఁ జూడుము కంసారి! ఖలవిదారి! శ్రీయుతాకార! మానినీ చిత్తచోర! 

పోతనామాత్య "భాగవతము" దశమ స్కంధము నుండి



--((*))--


4 November 2017 22:17

ప్రాంజలిప్రభ నేటి సూక్తులు -11

వస్త్రేణ వపుషా వాచా 

విద్యయా వినయేనచ
వకార పంచకేనైవ 
నరః ప్రప్నోతి గౌరవం

వస్త్ర ధారణ , శరీర స్వభావం , మాట్లాడేతీరు , విద్య , వినయం వకార పంచకం వీటితో మనిషిలో 

మార్పు వస్తుంది మంచి నడవడిక అయితే గౌరవం , చెడుని ఆశ్రయిస్తే నరకం .

ప్రాంజలిప్రభ నేటి సూక్తులు -10


న చోరహార్యం నచరాజ హార్యం 

న భ్రాత్రృభాజ్యం నచ భారకారి
వ్యయేక్రృతే వర్ధత ఏవ నిత్యం
విధ్యాధనం సర్వ ధనప్రధానం

దొంగలు దొంగిలించ లేనిది, ప్రభువులు స్వాధీనం చేసుకో లేనిది, సోదరులు పంచుకో లేనిది

ఖర్చుచేసిన దినదిన ప్రవర్ధమాన మయ్యేది, అయిన విద్యా సంపద అన్నీ సంపదల్లోకెల్ల ప్రధాన మైనది

ప్రాంజలి ప్రభ - సూక్తులు (త్రీ) -9
ప్రాంజలి ప్రభ - నేటి సూక్తులు 

ఏనికమోముతా ల్పెలుక నెక్కిన రావుతురాజు సౌరసే 

నానియనుంగుఁబెద్దన వినాయకదేవుఁడు కర్ణతాళఝం 
ఝూనిలతాడనంబున నిరంతరమున్ బ్రబలాంతరాయసం 
తానమహాఘనాఘన కదంబములన్ విదళించుఁ గావుతన్ 

ఏనికమోముతాల్పు= గజముఖుడు, ఎలిక... రాజు= మూషికవాహనుడు, సౌర..అన్న=దేవతల సైన్యాధిపతి కుమారస్వామి అన్నగారు అయిన వినాయకుడు, కర్ణ .. తాడనంబునన్= చెవులగాలితో, ప్రబల .. కదంబములన్=విఘ్నములను కారుమబ్బులను, విదలించుగావుతన్=పోఁగొట్టుఁగాక 


గజముఖుడు,  మూషికవాహనుడు, దేవతల సైన్యాధిపతి కుమారస్వామి అన్నగారు అయిన వినాయకుడు,  చెవులగాలితో, విఘ్నములను కారుమబ్బులను, పోఁగొట్టుఁగాక 



శ్రీనాథ కవిసార్వభౌముని "శ్రీభీమేశ్వర పురాణము (భీమఖండము)" నుండి గజానన ప్రార్ధన



ప్రాంజలి ప్రభ - నేటి సూక్తులు - 8
అపూర్యమాణ మచల ప్రతిష్ఠం,
సముద్ర మాపః ప్రవిశన్తి యద్వద్.


ఆపూర్వమాణ మంటే అంతటా నిండినది. అచల ప్రతిష్ఠర్సకదలక మెదలక ఉండేది. అది రాలేదే, ఇది రాలేదే, ఇంకా నీరు చాలదే అని సముద్రం దుఃఖించదు. కొంచెమయినా చలనం లేనిది సముద్రం.
అంతటా ఆవరించి ఉండేది  " గాలి " ఇదే జీవకోటి ప్రాణాధారం, సముద్రంలో ఎంత నీరు చేరిన తన గుణం మార్చుకోదు, అట్లే అహంతో ఉన్నదా మగవాడికి ఎన్ని మంచి  చెప్పిన యాలకు ఎక్కవు కదా ? 



ప్రాంజలి ప్రభ - నేటి సూక్తులు -7


"కవితా కన్య రసజ్ఞత కవి కన్నా
రసజ్ఞుడెరుంగు గాని కవి కేమి ఎరుగు;
నవ కోమలాంగి సురతము
భర్త ఎరుంగును కాని తండ్రికేమి తెలియును"
,
భావము:
కవిత యొక్క భావంలోని అందం అది వ్రాసిన కవికంటే దాన్ని ఆస్వాదించే రసజ్ఞులకే బాగా తెలుస్తుంది. అలాగే యవ్వన స్త్రీ యొక్క సొగసులు తండ్రి కంటే కూడా భర్తకే బాగా తెలుస్తుంది



ప్రాంజలి ప్రభ - నేటి సూక్తులు - 6 



శరచ్చంద్రప్రకాశేన వపుషా శీతలద్యుతిమ్,
ధ్యాయేత్సింహాసనాసీనముమయా సహితం శివమ్.

శరత్కాలమునందలి చంద్రునివంటి కాంతిగల దేహముతో గూడినవాడును, చల్లనికాంతిగలవాడును, సింహాసనమున గూర్చుండినవాడును, ఉమతో గూడిన శివుని ధ్యానించుచున్నాను.

దేవత: శంభువు
ఋషి: శంభువు

--((*))--

ప్రాంజలి ప్రభ - నేటి సూక్తులు - 5 


అదిపర్వం 1-6 -175 
క// ధరణీ దిశ ప్రసారిత ;గురుకర నికరంబు లుడిచికొని దీర్ఘనిరం ;// 
తరగతి ఖిన్నుడ పోలెను;హరిదశ్వుడు విశ్రమించె నస్తాద్రిదరిన్ 

దీర్ఘనిరం తరగతిన్= ఎడతెగని నడక చేత // 

ఖిన్నము =భేదము నొందినది //ఖిన్నుడ పోలెను= అలసెనో అనునట్లు//కరము =కిరణము ,చెయి 

విరామము లేని సుదీర్ఘ గతిచేత అలిసెనో యనునట్లు ; సూర్యుడు భూమిపై చాపిన స్వీయ కిరణములనే చేతులను అస్తగిరిగుహ లోకి ముడుచుకొని విశ్రమించాడు . 


ఈ పద్యములో ప్రతిఒక్కరు పగలు శ్రమించిన రాత్రి యందు నిద్రలో విశ్రాంతి సుఖము కలుగునని నీతి ణాని తీసుకోక తప్పదు 



--((*))__

ప్రాంజలి ప్రభ - సూక్తులు (4 )

అహు: సత్యంహి పరమం !
ధర్మం ధర్మవిధో జనా:
(రామాయణంలో అయోధ్యకాండ, 14 వ సరిగా, ౩వ శ్లోకం) 

ధర్మం తెలిసిన సజ్జనులు సత్యపాలననే పరమధర్మమని చెపుతూ ఉంటారు

రామాయణంలో దశరధుని భార్య కైకేయి "వరాలిస్తావని ప్రతిజ్ఞ చేసావు"  తీర్చమని అడుగగా "ఎదో తప్పు చేసినట్లు తెగ భాద పడతావేమి " ధర్మం తెలిసిన సజ్జనులు సత్యపాలననే పరమధర్మమని చెపుతూ ఉంటారు " నీ మాటను నిలబెట్టుకొని ఉత్తమగతిని పొందవయ్య అని పలికిన సందర్భం. 

"ప్రతిఒక్కరు వాగ్దానాలు చేసేటప్పుడు చాలా జాగర్త పడాలి లేదా దశరధుని గతి పట్టవచ్చు అనే హెచ్చరిక".  

ఒక స్త్రీకి సహాయం చేద్దామను కోవటం తప్పుకాదు నెరవేర్చ గలమో లేదో ఆలోచించాలి అనేదే ఇందు నీతి 
శ్రీ మాత్రే నమః 

అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె 
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో 
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా 
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్. 

భావము: 
దుర్గాదేవి తల్లు లందరికి తల్లి; సప్తమాతృకలను కన్నతల్లి; ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి; అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్పతల్లి; రక్కసి మూకలను అణచిన యమ్మ; నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి; అయిన మా అమ్మ దయాసముద్రి అయ్యి ఈ మహాభాగవత తెలుగు ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక. 
--((*))--
తల్లి హృదయంలో నిండు మనసుతో బిడ్డ లందరు సేవచేస్తూ ఆరాధించాలనేదే ఇందు నీతి  

ప్రాంజలి ప్రభ - సూక్తులు -1


ధర్మోహి పరమోలోకే

ధర్మే సత్యం ప్రతిష్ఠితమ్
(అయోధ్యకాండము -21వసర్గ - 40 వ శ్లోకం)
సత్యమనే గుణం సక్రమంగా నిలబడాలంటే ధర్మమార్గమే ప్రధానమైనది.

రామాయణంలో అరణ్యమునకు పోయిన రాముడ్ని కలసిన భరతుడు అయోధ్యకు వచ్చి పట్టాభిషేకము చేయిన్చుకొని మా కందరికి సంతోషాన్ని కలిగించమని వేడుకొనెను. వారిమాటలకు సంతోషం వక్తపరుస్తూ  రామచంద్రుడు పలికిన మాటలు.


"తండ్రి మాటను జవ దాట రాదు అనేది ధర్మము, సత్య గుణం రక్షించ బడాలంటే ధర్మాన్ని అను సరించి తీరాల్సిందే "  

 "తండ్రి మాట " ఎట్టి పరిస్థితిలో తృణీకరించ కూడదనేది రాయణంలోని సూక్తి
--((*))--

ప్రాంజలి ప్రభ - సూక్తులు -2


పితుర్హి వచనం కుర్వన్ !

నకశ్చిన్నామ హీయతే !!
(అయోధ్యకాండము -21వసర్గ - 36 వ శ్లోకం)

"తండ్రిమాటను పాటించు వాడు ఎన్నటికీ నాశనం పొందడు"


రామాయణంలో అరణ్యమునకు పోయిన రాముడ్ని కలసిన  "తల్లి కౌసల్య "  అయోధ్యకు వచ్చి పట్టాభిషేకము చేయిన్చుకొని మా కందరికి సంతోషాన్ని కలిగించమని వేడుకొనెను. తల్లికి దు:ఖం  కలిగించరాదు నాయనా  అన్నమాటలకు సంతోషం వక్తపరుస్తూ  రామచంద్రుడు పలికిన మాటలు.


"తండ్రి మాటను జవ దాట రాదు అనేది ధర్మము, తండ్రి మాటకు కట్టుబడి ఉన్నవాడు మంచి ఫలితము పొందుతాడు,  ధిక్కరించిన వాడు నాశనము పొందుతాడు అది మీకు తేలుసు కదమ్మా,  సత్య గుణం రక్షించ బడాలంటే తండ్రి మాటను ధర్మాన్ని అను సరించి తీరాల్సిందే "  

 "తండ్రి మాట " పాటించేవాడు సుఖ సంతోషాలతో ఉండగలడనేదే రాయణంలోని సూక్తి
--((*))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి