30, జనవరి 2014, గురువారం

109. Love story -13 (చేతిలో పైకము లేకుండా చేసే పెళ్లి )


                                                                                
"చేతిలో పైకము లేకుండా చేసే పెళ్లి"

రంగురంగుల నక్షత్ర కాంతుల వెలుగులు, తారాజువ్వలలాగా ఆకాశములో మిణుగురులు, ఎటు చూసిన అందమైన పట్టు చీరలలొ స్త్రీలు కొందరు, జుట్టు విరపొసుకొని బొడ్డుకు బెత్తడు క్రిన్దగా లంగాలు కట్టుకొని, పైటలను విసుర్తూ యవ్వనమునకు వచ్చిన ముద్దుగుమ్మలు, అందమైన లాల్చి ఫైజమాలతొ, సూటు బూటు ఇన్ షర్ట్ వేసుకున్న వారు కొందరు, జరీ అంచు పంచలలొ బ్రాహ్మణులు, అల్లరి చేస్తూ ముద్దు ముద్దుగా మాట్లాడు కుంటూ ఉన్న చిన్న పాపాలు బాబులు ఒకరేమిటి ప్రతిఒక్కరు ఇది మనందరం కలసి చూస్తున్న పెళ్లి అదే "స్తీతారామయ్యగారు మనవరాలి పెళ్లి ".

మొదలు నరకిన అరటి చెట్లు, వాటి మద్య ఒక వైపు అరటిపూలు, మరొకవైపు అరటిగేలలు, ఒక చిన్న కుటీరమువలె  కొబ్బరిఆకులతో కాగితపు పూలతొ, మల్లెపూలు ఉన్న తీగలతొ అద్బుతముగా కళ్యాణ మండపమును అలంకరించారు "సీతారమయ్యగారి శిష్యులు".

అది ఒక గొప్ప ఇంట్లో జరిగె పెళ్లిలా ( రాజకీయనాయకుల, సినమానటుల ) కానీ విని ఎరుగని విధముగా చేస్తున్నారు "పద్మావతి శ్రీనివాస కల్యాణం ".

నారదుడు భూలోక సంచారిగా ఇక్కడకు వచ్చి, అక్కడ ఉన్న వ్యక్తిని పిలిచి, ఈ పెళ్లి ఎంత ఖర్చు చేసి యుంటారు, అని అడిగారు ఏమో నాకేం తెలుసు అందరూ అంటుంటే విన్నాను ఇది "చేతిలో పైసా లేకుండా పెళ్లి " అని.

చాలా ఆశ్చర్యముగా ఉన్నదే, ఇట్లా కూర్చొ, ఒక్కసారి నీకు తెలిసిన కధ చెప్పు నాకు వినాలని ఉన్నది అన్నాడు నారదుడు అక్కడున్న తుమ్బురునితొ.

ఐదురోజుల్లో పెళ్లి చేస్తానని ఒప్పుకున్నావు నాన్న, ఎలా చేస్తావు? " చేతిలో పైసా లేదు " నీ ధైర్యాన్ని చూస్తె నాకు భయమేస్తుంది కొంత సమయము అడగమంటే "కక్కు వచ్చిన కళ్యాణ ఘడియ వచ్చిన ఆగ దంటావు", ఆ భగవంతుడు నాతొ చేస్తున్న పెళ్లి అంటావు, మీ రందరూ  చేస్తున్నారు నేను నిమిత్త మాత్రునంటావు.

పెళ్ళికి లక్షలు కర్చు అవుతాయి, మనకు రావలసినవి సమయానికి అందుతాయో , అమ్దవొ నని భయము ఈ ఐదు రోజుల్లో "అన్ని పెళ్లి పనులు" చెయలంటేనె కష్టము, నాకు "లోను" వస్తుందని నమ్మకము కని పిన్చుటలేదు, అన్నాడు  కొడుకు పురుషోత్తముడు తండ్రి సీతారామయ్యతొ.


సీతారామయ్యగారు ఇంట్లో ఉన్న వారినందరినీ (భార్య జానకిని, కోడలు లక్ష్మిని, మనవరాలు పద్మావతిని ) పిలిచి తను చేయదలుచుకున్న పెళ్లి గురించి అందరికి చెప్పాడు. మీరన్దరు చాలా కోపముగా ఉన్నారు నా ఉద్దేశ్యము చెపుతున్నాను " ఇది సలక్షణమైన సంభంధం, పిల్లవాడికి గవర్నమెంటు ఉద్యోగము ఉంది, ఎర్రగా ఉన్న ఆరడుగుల అందగాడు, మన అమ్మాయిని కాని కట్నం లేకుండా చేసుకుంటామని "ఫోటో, వీడియోకు , పెళ్లి బ్రాహ్మణునికి, బ్యాండు మేళానికి అయ్యెఖర్చు వాళ్ళే పెట్టుకుంటామని ఒప్పుకున్నారు, ఐదురోజుల్లో పెళ్లి చేయమని, తరువాత మంచి లగ్గాలు లేవని, వారు చెప్పగా నేను ఒప్పుకున్నాను, మనము ఆరాధించే ఆ ఆంజనేయులువారు నిర్ణ ఇమ్చిన లగ్నమని, నేను ముందుకు వచ్చాను.


ఒక మంచి పని చేస్తున్నప్పుడు అన్దరూ సహకరించాలి, కోపతాపాలు లేకుండా ఎవరు చేయాల్సిన పనులు వారు చేయండి, అన్ని మీకు ఎప్పటికప్పుడు చెపుతాను, జెట్ ప్లైన్ పోయినట్లు, వెగమ్పెంచి, సంతోషముగా, పనులు  చేసుకుందాము అన్నారు " సీతారామయ్యగారు "


ముందు "కొడుకు, కోడలు " ను పిలిచి సమయము తక్కువ ఉన్నది, మన భన్ధువలన్దరికి శుభలేఖలు సమయానికి చేరినా చెరక పోయిన "ఫోన్ ద్వారా మిమ్మల్ని పెండ్లికి భందు మిత్ర సమేతముగా " కాలేజి గ్రౌండ్ లో "  అహ్వానిస్తున్నామని పిలవండి" అని పురమాఇంచాడు.

                                              

భార్య జానకిని, మనరాలు పద్మావతిని, పిలిచి మీరు ఆ సంచీలొ అందమైన కార్డలు ఉన్నాయి వాటిలో కొన్ని తీసి లోపల పత్రికలను తీసి " మానవరాళ కమ్పూటర్ ప్రింటర్ ద్వారా మంచి పెపార్ పై బ్రహ్మణుడు వ్రాసిన సుభలేఖను అక్షరాలూ తప్పులు లేకుండా " కాలేజి గ్రౌండ్ లో " మాచే ఏర్పాటు  చేసిన కల్యాణ మండపం లొ "పెళ్లి "ముద్రించి తయారుచేయటం మీ వంతు అని పురమాఇంచాడు.

ఇంటి దగ్గరగ ఉన్న తను చదివిన కాలేజి "యాన్యువల్ ఫన్షన్" తన మనవరాలి పెళ్లి ముందు రొజెనని తెలుసు కున్నాడు, వెంటనే కాలేజి డైరక్టరు వద్దకు బయలుదేరి కలిసాడు, కాలెజీ స్తలములో మనవరాలి పెళ్లి గురించి వారిని అడిగాడు " కల్యాణ మండపాలు దొరకలేదు, మీరెమను కోకుంటే శనివారం మీ ఫన్షన్ ఆదివారం మా మనవరాలి పెళ్లి "మీరు వేసిన టెంట్లు, అలంకరించిన బల్బులు, తెచ్చిన వంటసామగ్రి, కుర్చీలు బల్లలు ఆదివారము కూడా  ఉండేటట్లు చేస్తే చాలు" అన్నాడు.

పంతులుగారు మీరు అంత చెప్పాలా షామ్యానా వానికి నేను ఫోన్ చేసి చెపుతాను ఒక్కరోజు అధికముగా ఉంచ మని అన్నారు కాలేజి డైరక్టరు, సంతోషము చిన్నవాడివైన ఒప్పుకున్నావు ఆ దేవుని క్రుపవల్ల అందరికి మనసు ప్రశాంతముగా ఉండాలిని ఆ దేవునిని కోరు కోవటం తప్ప నేనేం చేయలేను ప్రస్తుతం అన్నాడు.


కాలేజి నుండి తిరిగివస్తు అద్దెకు ఇల్లు అనే బోర్డు చూసి లోపలకు పోయి ఎవరున్నారు ఇంట్లో అని అడిగారు సీతారామయ్య గారు.

లోపలనుండి పంతులుగారు మీరు ఇటు వచ్చారేమిటి, కాకికితొకబురు పంపితే నేనే మీ దగ్గరకి వచ్చేవాడ్ని మీ శిష్యుడ్ని గుర్తు పట్టలేదా, మీరు పెద్దవారు ముందు ఈ కాసిని మంచినీరు త్రాగండి అంటూ నీరు అందించారు ముందు దప్పిక తిర్చావు సగం పని అయింది, "అద్దెకు ఇల్లు " అడగటానికి వచ్చారా, కాదు ఒక్కరోజు నా మనవరాలి పెళ్ళికి వచ్చేవారికి, పెళ్ళివారికి విడిది కోసం మిమ్మల్ని అర్ధించ టానికి వచ్చాను. అంత పెద్ద మాటలు అనకండి నేను శిష్యుడ్ని ఇంతకీ మీకు ఎప్పుడుకావాలి " ఈ ఆదివారంనాడు " ఇప్పుడే రంగులు వేసి యున్నాము, ఒక్కరోజు కాదు మూడు రోజు వాడుకోండి, ఒక్క రోజు చాలు అంటూ సంతోషము చిన్నవాడివైన ఒప్పుకున్నావు ఆ దేవుని క్రుపవల్ల అందరికి మనసు ప్రశాంతముగా ఉండాలిని ఆ దేవునిని కోరుకోవటం తప్ప నేనేం చేయలేను అన్నాడు.

ఏమిటి గురువుగారు చెపుతూ చెపుతూ కధ ఆపారు, నేను ఆపలేదు ఆడపెళ్లి వారు అలసిపోయారు మీరు  "టిఫిన్ తిని కాఫీ త్రాగ మంటున్నారు" ఐతే ఒక పట్టు పట్టుదాం అంటావు తప్పదుకదా గురువుగారు. వంట చెసినవారెవరో , నలుడో, భీముడో వచ్చి చేసినట్టుంది, నా పొట్ట పట్టలేదు ఇంకా తినాలనిపించింది.
                                                     

ఆ ఇక కధ మొదలు పెడతావా, తినపొతె రుచి అడగ కూడదు, పెల్లికూతురిని శోభనం నాడు అనుభవం ఉందా అడుగ కూడదు, కధవినబొతు సస్స్పెన్సు చెప్పమన కూడదు, నీరు పల్లము కాకుండా ఎగువపొమ్మన కూడదు.

నిదానంగా ఇంటికి చేరాడు సీతారామయ్యగారు, ఏమండి మీరొక్కరె కష్టపడుతుంటే నాగుండె తరిగిపోతుంది, అట్లా అనకూడదె, "అందరు మనబిడ్దలే ", మనలో శక్తి ఉన్నంతవరకు ఇతరులకు సహాయపడటం లో ఉంది సంతోషం.  ఇదిగోనండి చల్లని మజ్జిగ అంటూ ఇచ్చింది గబగబా త్రాగి మడత కూర్చిలొ కాసేపు నడుం వాల్చి  విశ్రాంతి తీసుకున్నాడు.

అంతలో ఫోన్ "ఈ ఫోన్ ఎవరి దండి", ఫోన్ చేసి ఫోన్ ఎవరి దండి అంటావు, కాని ఈ ఫోన్ ఒక ఆఫర్ వచ్చింది, అన్నారు అవతల నుంచి ఇక్కడ ఎవరు "జోకర్లు " అయ్యేవారు ఎవరు లేరమ్మ నీమాటలకు, నామాట నమ్మండి నెచెప్పెది అభధమ్ కాదు, మీరు పెద్దవారి లాగున్నారు " మీ మీద ఒట్టు, మీరు ఆరాధించే దేవుడి మీద ఒట్టు" అన్నామాటలకు ఒట్టు లెన్దుకమ్మ చెప్పేదేదో చెప్పు అన్నాడు.

ఫోనులో ఏమివిన్నాడో  వెంటనే కండవా సర్దుకొని, చేతికర్ర తీసుకోని నేను ఇప్పుడే వస్తాను మీరు పెళ్ళికి  కావలసినవి, పెళ్లి వారికి పెట్ట వలసినవి, బంగారం నగల విషయంలో అన్ని వ్రాసుకొని ఉంచండి, అంటూ చేతిలో బ్యాంకు డిపాజిట్ కాగితము తీసుకోని బయలు దేరాడు.

ఫాదర్ & మదర్ బిగ్ బజార్ చేరాడు, మేనేజర్ను కలిసాడు, ముందు ఫోన్ విషయము నిజమాకాదా అని తెలుసుకున్నాడు "నిజమే అని తెలిసిన తర్వాత సంతోషం పొందాడు, వెంటనే ఫోన్ ద్వారా కొడుకు ,కోడలు,మనవరాలు అన్దరైని బిగ్బజార్ రమ్మనమని అందరిని కావలసినవి కొనుక్కోమని చెప్పాడు.

అందరికి అనుమానం వచ్చింది, చేతిలో డబ్బులులేవు, అంత  పెద్ద షాపుకు రమ్మన్నాడు, అనుకోని అన్దరూ వచ్చారు, మీకు కావలసినవి తీసు కొండి, డబ్బులు గురించి  ఆలొచించద్దు అన్నమాట ప్రకారముగా పెళ్ళికి కావలసినవి అన్ని తీసుకొవటానికి  ఒక్క రోజు పట్టింది. అన్దరూ సంతోషముగా తీసుకెళ్ళారు.

 తాతగారు డబ్బులు ఎపుడు కట్టారో అర్ధం కాలేదు మనవరాలుకి, భార్య జానకి కూడా సీతారామయ్యగారి ప్రవర్తన అర్ధం కాలేదు, అడుగదామంటే భయం, ఏదైతే ముందు పెళ్ళికి కావలసినవన్నీ వచ్చాయి తర్వాత కనుకుమ్దామ్  అనుకున్నారు అందరు. ఇంటికి రావటముతోనే సీతారామయ్యగారు, బాబు నీవు వంట వానికి  ఫోన్ చేసావా, పెల్లింకా రెండే రోజులున్నాయి ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, వేగం పెంచండి. అన్నాడు.

లేదు నాన్నగారు ఫోన్ కలవటం లేదు, ఎందుకైనా మంచిది నీవు ముందు వెళ్లి కనుక్కో అన్నాడు, నాన్న అంటూ ఏమిటి చెప్పు, ఏమిలేదు నాన్న నాకు రావలసిన "లోను" ఇంకా రెండు రోజులు పడుతుండట, పెళ్లి ఖర్చుకు అందు తుందో లేదో అనుమానముగా ఉన్నది, నేను చెప్పిన పని చేయి నీవు ఏమి ఆలో చించకు అన్నింటికీ ఆదేవుడున్నాడు నివు భయపడకు అన్నాడు.  సరే వెళుతున్నాను నాన్న

అంతలో సెల్ లో మెసేజ్ ఉండటం చూసాడు, వెంటనే తలారా స్నానం చేసి దేవుడి గదిలొ కూర్చొని ప్రార్ధనలు చేస్తున్నాడు. ఎం జరిగిందో ఎవ్వరికి  అర్ధం కాలేదు.

వెళ్ళిన కొడుకు వెనక్కు వచ్చి నాన్న వంట చేసే వాని ఇల్లు తాళం ఉన్నది అంటుండగా భార్య విమల వచ్చి మీనాన్న గారు ఈ సెల్లో  ఏదో చూసి దేవుని గదిలో పూజ చేస్తున్నారు, ఒక సారి చూడండి, అన్నమాటలకు  భర్త ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు, ఏమైందిరా బాబు చెప్పు అంటూ వచ్చింది అల్లి, మనం వప్పుకున్న వంట వానికి యాక్సిడెంటు జరిగిందట నాకు రావటము కుదరదు వేరొకరిని పెట్టుకోండి అని రెండు రొజుల క్రితమ్ మెసేజ్ ఇచ్చాడు క్షమించండి అనికూడా  వ్రాసాడు.

వెంటనే జానకమ్మగారు ఏమి ఆలోచించకు నేను చెప్పిన పని చేయి, మీ నాన్నగారికి నేను చెప్పుకుంటాను, ఇవన్న కోపము వచ్చిన పర్వాలేదు, నాకు ముందు పెళ్లి ఆగ కూడదు, అని ఉండు లోపాలకి వెళ్లి తన నగల సంచి తెచ్చి కొడుకు ముందు పెట్టింది తల్లి జానకమ్మ, వెంటనే నీవు మంచి హోటల్ కు పోయి పెళ్ళివారి అయ్యె టిఫిన్, భొజనము కర్చు కనీసము 500 మందికి సరిపడే వంట చేయమని చెప్పి, ఈ నగలు ఎక్కడైనా తాకట్టు  పెట్టి, ముందు ఏర్పాటు చెయ్ అన్నది, ఆగండి అంటూ భార్య విమల కూడా నగల ఇచ్చి మనమ్మాయి పెళ్లి కదండీ ముందు పని అయ్యేటట్లు చూడండి,. సరే  నాన్న పూజ నుండి వచ్చాక  అన్ని వివరముగా చెప్పండి అంటూ  బయటకు నడిచాడు పురుషోత్తముడు.

అంతలో పెళ్లి ఇంటిలో అంతా నిశబ్ధంగ ఉన్నదేంటి అంటూ సూర్యా కాంతం అడుగుపెట్టింది.  ఇదిగో అమ్మాయి పెళ్లి కి  మీరేం కష్ట పడు తారని నేనే చేసి "సారే "నాలుగు రకాల స్వీటులు, ఒక కారా ఇంకా మీకన్దరికి బట్టలు నేను తెచ్చాను, ముందు అవన్నీ లోపల పెట్టండి. జానకమ్మగరు, విమల,  సూర్యాకాంతం విలువ తెలుసు కాబట్టి ఏమి మాట్లాడకుండా లోపల సర్దారు.

సీతారామయ్యగారు బయటకు వచ్చి సూర్యాకాంతం నిన్ను చూసి చాలా  రోజులైంది, ఎట్లా ఉన్నావు అన్నాడు, నాగురించే ఎమ్చెప్పెది ముందు మనింట్లో పెళ్లి హడావిడి ఏది, రేపే అంటున్నారు, నువ్వు వచ్చావుగా కాస్త హడావిడి చేయి, నవ్వు కుంటూ లోపలకు వెళ్ళాడు.

"సీతారామయ్యగారు ఎవరండి అంటూ ఒక తెల్లని ప్యాంటు, తెల్లని షర్టు వేసుకొని ఉన్న కుర్రావాడు వచ్చాడు.
రేపు పెళ్లి టిఫిన్ కు, భోజనమునకు మేము ఎక్కడ  ఏర్పాటు చేసుకోవాలో చూపండి, అన్న మాటలకు అందరు  ఆశ్చర్యపొయారు, అంతలో   సూర్యా కాంతం ఏమిటే, అందరు తెల్ల మొఖాలు వేసుకొని చూస్తున్నరు, వచ్చింది వంటవాడు, కల్యాణ మండపం చూప మంటున్నాడు.

అంతలో భర్త నుండి విమలకు ఫోన్ వచ్చింది, ఇక్కడ నగలు తాకట్టు పెట్టుకొనేవారు దొరుకుటలేదు, అన్న మాటలకు మీరు వచ్చేయండి "క్యాటరిన్ వారు వచ్చారు".

వెంటనే వచ్చి, వాళ్ళని  పెళ్లి మండపము వద్దకు తీసుకెళ్ళాడు, నగలన్నీ ఇంట్లో నే ఉంచారు.

జానకిని పిలిచి మిరొకటి చేద్దామను కున్నారు, చేయలేక పోయారు, నా కంతా తెలుసు, నగలన్నీ ఎవరికీ వారు పెట్టు కొండి,  మరెప్పుడు సొంత ప్రయత్నం చేయకండి, అని బయటకు నడిచాడు ప్రశాంతముగా "సీతారామయ్యగారు"

అక్కడ ఉన్న వృద్ధాస్రమమునకు పోయి అందరిని భోజనమునకు రమ్మని ఆహ్వానించాడు మరియు తన ఇంటి చుట్టువున్నా వారిని కూడా పిలిచాడు.

పెళ్లి వారు రావటం బ్యాండు మేళాలతో పెళ్లి వారిని పిలవడం, అందరు కలసి ఆనందముగా నృత్యము చేయటం, ఒకరిని ఒకరు కలుసుకొని వివరాలు అడగటం, మేలతాలాల  మద్య "పద్మావతి శ్రీనివాస్ " వివాహము వైభవముగా జరగటం, అందరికి భోజనాలతో సంతృప్తి  పరచటం, స్వర్గలోకంలో తలపించే విధముగా పెళ్లి జరిగింది, మీరు కూడా చూస్తున్నారు అంటూ తుమ్పురుడు ముగించాడు.

నారదుడు తుమ్బురుని అడిగాడు, భోజనాలు ఖర్చు, నగలు బట్టలు ఎట్లా కొన్నారు అని అడిగాడు అన్ని నెచెప్పితె నా కధ కు విలువెమున్ది అని నెమ్మదిగా జారుకున్నాడు తుంబురుడు.

నారదుడు పెళ్లిని చూసి అక్షంతలు వేసి దీవించి వైకున్టం చేరాడు దిగులుగా.నారాయణుడు అడిగాడు ఏమి నారద వెల్లెతప్పుద్ హుషారుగా వెళ్లావు వఛదప్పుదు దిగులుగా ఉన్నావు పెళ్లి " ఆ పెల్లిఘనమ్గా జరిగింది" నా సమస్యమాతరము తీరలేదు. బట్టలు నగలు ఖర్చు ఎవరు పెట్టారు, భోజనాలకు ఎవరు ఇచ్చారు అని అనుమానము. త్రిలోక సంచారులు మీకు తెలియలేదా ఇంత చిన్న విషయం

సహనం. సంకల్పం, సహకారం, ఉంటె విజయము తధ్యం అక్కడ అపజయం ఉండదు.  అందులో హనుమంతుని భక్తుని పరీక్షిన్దామనుకున్నావు నివే పెళ్లిని మెచ్చుకొని తిరిగి వచ్చావు.

"సీతారామయ్యగారు తనదగ్గరున్న నెలరొజులలో మారే తన 50,000 రూపాయల డిపాజిట్ పెట్టి రెండు లక్షల నగలు బట్టాలు కొనుకొఛారు అంతే.

ఆంటే 50,000/- వేలకే 2,00,000 తీసుకోమని ఇచ్చారా.

అక్కడే ఉంది ఆ బిగ్ బజార్ ఓనర్ తల్లి తండ్రులు పుట్టిన రోజు నాడే చని పోయి  నారు, వారిని తలుచుకుంటూ  ఫోన్ చేసిన గంటలో కొన్నవారికి మాత్రమే 2,00,000/- ల పైన ఎంతైనా తీసుకొ వచ్చు బిల్లు పై నాలుగొవంతు వన్తమాత్రమె కట్టాలి అన్నాడు నారాయణుడు.

అదా విషయం

మరి భోజనాలు

క్యాటరిన్ వప్పుకున్న వాడు తనకు జరిగిన యాక్సిడెంటు విషయం సీతారామయ్యగరికి తెలియపరిచాడు, కొడుక్కు తెలియపరుస్తూ బొంబాయి నుండి రమ్మన్నన్దుకు ఏమనకు,.  నీవు డాక్టర్వి నా ఆరోగ్యం గురించి ఆలోచించకు, మాటకు కట్టుపడి ఉండే వంశం, ముందు పెళ్లి ఆగకుండా ఉండేవిధముగా చేస్తావని ఆశిస్తున్నాను, వస్తావని అనుకున్నాను.

కొడుకు రావడం హోటల్లో "టిఫిన్, భోజనాలు"  బుక్ చేయటం, తండ్రికి మంచి మందులు, మంచి డాక్టర్ని  కలసి కొలుకొనే దాక దగ్గర ఉండి తండ్రి ఋణం తీర్చుకున్నాడు.  

ఇక్కడ నాన్న, మా అమ్మాయి పెళ్లికి "లోను " ఈరొజు వచ్చింది ఈ డబ్బులు తీసుకొ న్నాన్న . నీవు ఎక్కడ తెచ్చావో అక్కడ తిరిగి ఇచ్చేయి, ఇప్పుడు లొనుతొ పనిలేదు, చిల్లర ఖర్చులు అమ్మాయికి వచ్చిన, చదివింపులు వాడాను, నివే నన్ను క్షమించాలి బాబు అన్న మాటలకు కళ్ళంబడి ఆనంద భాష్పాలు రాలి భార్యను పిలిచి తల్లి తండ్రులను కూర్చొ బెట్టి పాదాలు కడిగారు. నాన్న  నీకె  సాధ్యమైంది  " పైసా లేకుండా పెల్లిచెసిన ఘనత "                                                        

ఇందులో నాగోప్ప ఏమిలేదు అ రామభక్త హనుమంతుని నమ్మనివారికి జయము ఖాయం అని మీకన్దరికి తెలిసింది "హనుమంతుని కొలుద్దాం హయిగా జీవిద్దామ్" 
       ఈ కధ  వ్రాసు కున్నప్పుడు మహానటుడు అక్కినేని  నాగేశ్వరరావు గారు "దివ్యదామం" చెందటం జరిగింది. వారి ఆత్మా శాంతి జరగాలని ఈ కధను  వారికి అంకితం చేస్తున్నాను.                                        
                                              


                                                              
  

                                                  


 

 

27, జనవరి 2014, సోమవారం

108. Love Story 12 ( భంధం )

భంధం

శారదాదేవి సుర్యాస్తమైన  తర్వాత తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి ప్రదక్షణాలు తిరిగి కుంకము బొట్టు పెట్టుకొని ప్రసాదం నైవైద్యము పెట్టి ఎవరికైనా పెట్టినతర్వాత తను తినేది ప్రసాదాన్ని.

అప్పుడే వచ్చింది పనిచేసే  రాములమ్మ, ఎ రాములమ్మ ఈరొజు ఎక్కడా పనిలేదా ముందే వచ్చావు, ఉన్దమ్మగారు రొజూ చేసే ఇల్లెగదా ఒక్కరోజు పోకపోతే ఏంకాదు, వారేమన్న గిన్నెలు తోవుతారా ఏమిటి గొణుక్కుంటూ ఉంటారు మొతం నా మొహాన కొట్టి, రాలేదని సాపనార్దాలతొ తిట్టి, ఏదో బెదిరింపు మాటలతో సతాఇస్తారు.

నేను ఎపుడైనా నీవు రాకపోతే అట్లా చేసానా, మీరు దేవత అమ్మగారు, మీ మాట ఒక వేదవాక్కు, మాటలు వింటుంటే నాకు ఎక్కడికి పనికి పోకుండా వినాలనిపిస్తుంది.

నాలుగు రోజులనుంచి గమనిస్తున్నాను మీరు దిగులుగా ఉన్నారు, ఎందుకో అడగాలని అడగ లేక పోయినాను  ఇప్పుడడుగుతున్నాను,  చప్పండి మీ కధ ఏమిటో అని నేలపై చతికల పడింది, గుమ్మం ముందు  ఉన్న అరుగుపై కూర్చొని తన కధ చెప్పటం మొదలు పెట్టింది ముందు ఈ ప్రసాదం తిను తర్వాత నే చెప్పే కధ విను.

నేను గుంటూరులో ఇంటర్ లో స్టేట్ ఫస్ట్ వచ్చాను,  పై చదువులు చదివించమని ఏంతో  ప్రాధేయ పడ్డాను మా న్నాన్నగారిని, నిన్ను చదివించాననుకొ,   నీ  తోబుట్టువులను చదివిన్చాల్సి వస్తుంది. నీవు చదివిన చదువుకు ఎక్కడైనా ప్లే స్కూల్ లో పనిచేయవచ్చు అని చదువు మాన్పించారు మా నాన్నగారు.

ఎక్కడో దూరపు చుట్టము  ఒకాయన వచ్చి మా అబ్బాయి మీ అమ్మాయిని కాలేజి దగ్గర చుసాడుట అప్పటినుంచి నేను పెళ్ళిచేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటానని పట్టుపట్టాడు.

ఆ అబ్బాయె     మీ అయ్యగారు " శివానంద్ " అప్పట్లో డిగ్రి తప్పి ఇంట్లో  కూర్చొని సినమాల  వెంబడి, పార్కుల వెంబడి, కాలెజీల వెమ్బడి తిరిగేవాడు. వాడి బుద్ధి మారుతుందని నాకు ఇచ్చి పెళ్లి చేసారు, నేనొక పిచ్చి మాలోకం, మానాన్నగారు అన్ని తెలిసి పెళ్ళైతే బాగుపడతారని తెలిసి మరి నాకు పెళ్లి చేసాడు.

నా అదృష్టం కొద్ది నా భర్తను ఇంటి యందె చదివించి డిగ్రి పూర్తి  చేఇంచాను, తర్వాత బి.ఐ.డి కూడా చదివించాను, నాకు కాన్వెంటు లో ఇచ్చే జీతముతొ పట్టుదలతో చదివించాను, నాకు అప్పుడు ఇద్దరు పిల్లలుకూడా కలిగారు.

పిల్లలను బాగా చదివించాలని ఊరు కాని ఊరు వచ్చాము, అప్పుడు మావారు నీవు ఉద్యోగము చేయనంటేనే
పిల్లలను చదివిస్తాను, నేను ఎక్కడైనా స్కూల్లో మాస్టర్గా చేరుతాను మనం హాయిగా ఉందాం అని ఇక్కడకు తెచ్చారు.

మా కాపురం మూడు కాయలు ఆరు పువ్వులగా మారింది, సినామాలకు, షికార్లకు వెల్లేవాల్లము, నా అంత సంతోషం వేరెవ్వరికి ఉన్దదనుకొనె దాన్ని, మావారుచాలా మంచివారు అని అన్దర్కి చెప్పెదాన్ని, నా కాపురం ఇలా సాగిపోతున్నది, సముద్రములో నావ కదిలనట్లు కదులుతున్నది ఇదే మా పచ్చని కాపురం.

అందరి చెప్పే కధ మీరు చెప్పారు దీనిలొ ప్రెత్యెకత ఏముంది, మీరు భాధాపడటం గురించి నేనడిగాను దానిగురించి.

అది చెప్పిన ఆర్చెవారెవరు తీర్చెవరెవరు, " ఎవరొచెప్పారొ కాని ముల్లోచ్చి ఇస్తరాకుమీదపడ్డ, ఇస్తరాకు వచ్చి ముళ్ళు మీద పడ్డ బొక్క ఇస్తరాకుకెకదె "

అవునమ్మగారు ఈ మొగవాళ్ళు అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు, కాదనుకో నోటికి వచ్చినట్టు తిడతారు అది మొగవాళ్ళ గర్వం "నేనే మొగాన్ని " అనేది.

ఎందుకె అంత పెద్ద మాటలంటావు, మేమైతే పచ్చి బూతులు తిట్టుకుంటాము, ఒకరి కష్టం ఒకరు పంచుకుంటాము, మాకు పెద్దగా చదువు లెద్దమ్మ "రోజుకూలికి పోవటం " తినటం త్రాగటం పడుకోవటం మే మా పని" నీదగ్గరకు వచ్చి  నా విషయం చెపుతున్నాను అన్నది రాములమ్మ.

ఒకరి విషయాలు ఒకరికి చెప్పుకుంటేనే మనసు తృప్తి,  సంతోషము ఉంటుంది. ఏమిటో ఈరొజు నామనసు చాల  తేలికైనది, అన్నది శారదా దేవి.                              

రాములమ్మ మేము వచ్చిన కొత్తలో సరదాగా సినామాలకు పార్కులకు పిల్లలతో తిరిగాము, మావారు స్కూల్లో ఉద్యోగము వచ్చింది. అప్పటినుంచి మామీద శ్రద్ధ తగ్గింది.

ఒకరోజు అందముగా ప్యాంటు,షర్టు ఇన్షర్ట్ వేసుకొని, షూషు  వేసుకొని బయలుదేరారు మావారు, నేను మిమ్మల్ని చూస్తుంటే, నా దిష్టే తగిలేట్టుంది అన్నాను. ఎందుకె భయపడతావు నేనేమన్నా చిన్న పిల్లవాడినా, ఇద్దరు  పిల్లలు గల తండ్రిని అన్నాడు.  నిన్ను వదలి నేను బ్రతక గలనా అని దగ్గర తీసుకొని మరి ముద్దిచ్చేవాడు.

మరోసారి చొక్కాలను సర్దుతుంటే నాకు పాన్ పరాఖ పొట్లాలు ఉన్నాయి, అడిగితె ఏదో సరదాగా వేసు కుంటున్నాను, అన్నింటికీ నీకు భయమే, ఈ భయముతో ఈ భగ్యనగరములొ బ్రతకలేవు, ఇక్కడ హిందీ కుడా నేర్చికోవాలి అని హెచ్చరించాడు.  అపుడే కొంత మా వారుపై అనుమానం పెరిగింది.

నా  మొగుడు ఏది అడిగితె  అది చేసి పెట్టేదాన్ని, ఇల్లు దాటి బయటకు వచ్చేదాన్ని కాదు, పిల్లలను ఇంట్లో చదివించేదాన్ని. భర్తకు రోజు క్యారేజ్ ఇచ్చి పంపేదాన్ని. ఇల్లంతా శుభ్రముగా ఉంచేదాన్ని.

కాని భర్త రావాడం అదిబాగొలెదు, ఇది బాగోలేదు అని అరిచేవాడు.

ఇంటికి ఆలస్యముగా వస్తూ ఉండేవాడు, కారణమడిగితే స్కూల్లో పని పెరిగిందని, ఇంట్లో కూర్చొని యక్ష ప్రశ్నలు వేస్తున్నావు, నా బట్టలు ఇస్త్రి కూడా చేయటము లేదు,  ఇంట్లో కూర్చొని ఎమ్చెస్తున్నావు, అనేవాడు.

నివు ఇంటికి  కావలసినవన్నీ తెచ్చుకొమంటే నన్నే తేమంటావు, తెచ్చినతర్వాత  ఇది బాగోలేదు అది బాగోలేదు అంటావు (నేను ఏమి అనక పొఇన నాతొ వాదనకు దిగేవాడు రాములమ్మ.)

ఈ మోగోల్లంతా ఇన్తెనమ్మ, అందితే జుట్టు పడతారు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళ అవసరాళ్ళు తిరిస్తెచాలు ఏమనకుండా ఉంటారు.

మా వారు  ఆలస్యముగా వస్తున్నాడు, ఎదోఒక  సాకు చెప్పేవాడు, పిల్లలను దగ్గరకు తీసుకోవడం మానేసాడు,  నన్ను కూడా  దూరంగా ఉంచడం మొదలు పెట్టాడు. కారణం ఏమి ఉంటుందా అని చాలాసార్లు ఆలోచిన్చేదాన్ని. ఫలితం లేక నిద్ర మాత్రలు వేసుకొని నిదించెదాన్ని.

ఇరుగు పొరుగు వారు అనగా విన్నాను, తనతో పనిచేస్తున్న స్కూలు టీచరు మోజులో పడి  దాని చుట్టూ తిరుగుతున్నాడని తెలిసింది. నేను ఎవరికీ చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి, చెపితే పరువుపోతుంది, చెప్పకపోతే నా కాపురమే నాశనమవుతుంది. ఇంకా మారుతాడని ఓపికతో ఉన్నాను రాములమ్మా.

పిల్లల కోసం అవమానం సహించాను, దెబ్బలు భరించాను, తిట్లు సహించాను, ఆకలి సహించాను, కాని నాభర్త ధోరణి మారలేదు            
ఒకరోజు నేను మా స్నేహితులతో ఇంటికి వస్తున్నాను, కాఫీ టిఫిన్లు రడీ  చేయ మన్నాడు, ఇంట్లో సరుకులు లేవన్న ఇంటిదగ్గర షాపులో వస్తువులు తీసుకోమని మరి చెప్పాడు, చేసేదిలేక చేతనైనంతవరకు కాఫీ టిఫిన్లు రడీ చేసాను.

మరలా ఫోన్లో మెముమగవాల్లము మన ఇంట్లో పేక అదెందు వస్తున్నాము, మెమువఛి వెళ్ళేదాకా ప్రక్క ఇంట్లో కూర్చొ అన్న మాటలకు నా తలతిరిగింది. అన్ని బల్ల మీద సర్ది పిల్లలను తీసుకోని ఎదురింటి వారిని పలకరిస్తూ కూర్చున్నాను.

మరునాడు మీరు ఇట్లా ఇంటికి ఎవరినిపడితే వారి తెస్తే చేసే ఓపిక నాకు లేదు అన్న మాటలకూ విపరీతమైన కోపముతో నే చెప్పిన పని చేయాలి, నా ఇష్టమైన వారితో తిరుగుతాను, నీకు కావలసినది నిన్ను పిల్లలను చూసు కోవడమెకద అన్నాడు.  అవును అది చాలు ఇంత మూర్ఖముగ మాటలొద్దు అన్నాను కొంచం ధైర్యము తెచ్చుకొని.  

అంటే నా మీద కోపముతో నాకే ఎదురుచెప్పె సాహసము చేస్తావా, నా మాటలు లెక్కచెయవా, అని నే బయటకు వెళుతున్నాను మూడు రోజులు దాకా రాను ఇంట్లో కూర్చొని అష్టమ చెమ్మ ఆడుకో అని వెళ్ళేవాడు.

ఆ కోపముతో పిల్లలను కొట్టేదాన్ని, మూర్ఖముగా ఉండే భర్తతో కాపురము చేసేకన్నా హుస్సేన్ సాగరంలో పడి చావాలని అనుకున్నా, అమ్మ అని పిల్లల మాటలకు వీరికొసమైన బ్రతకాలని బ్రతికి ఉన్న.

మరో రోజు త్రాగి వచ్చాడు, పిల్లలను ఇష్టమొచ్చినట్లు తిట్టాడు, నాపై  ఒక పశువుగా ప్రవర్తించాడు, విపరీతముగా అరిచాను, నా కష్టం, నా సుఖం, ఎమన్నా పట్టిన్చుకుంటున్నావా అని ఎదురు తిరిగాను. ఇక్కడ నాకు సుఖం లేదు అంటూ బయటకు వెళ్ళిపోయాడు.

నేను అన్న వండటం మానివేశాను, తినటం మాని వేసాను, నీరసముతొ మంచము ఎక్కాను, కాని పిల్లల ఆకలి తీర్చాలి  అని ఎన్తొ ఓపికచేసుకొని వండి పెట్టేదాన్ని "చివరకు పిల్లలకోసం నేను బ్రతకాలని  నిర్ణ ఇంచు కున్నాను,  మూగదానిలొ భర్తకోసం ఎదురుచూస్తున్నాను అన్నది శారదాదేవి రాములమ్మతొ.

నేను మీకు చెప్పేంత దానిని కాదు ఐన మీ కదా విన్న తర్వాత మీకు ఒక సలహా ఇద్దా మను కుంటున్నాను
ఇక్కడ దగ్గరలో హనుమాన్ విద్యామందిర్, హనుమాన్ జ్ఞాన మందిర్, హనుమాన్ ఆరోగ్య సేవా మందిర్, ఇలాంటివి చాల ప్రజా సేవకొరకు మల్లాప్రగడ  రామకృష్ణ గారు ఏర్పాటు చేసారు, వారిని కలిస్తే నీకు  ఏదైనా మంచి జరుగుతుందని నాకు అనిపిస్తుంది. 

ఆ హనుమంతుని నమ్ముకో, ఆ హనుమంతుని గుర్తుతెచ్చుకో , ప్రార్ధించు ధైర్యముతో వారు ఏమిచేపితే అదే చే యి, నీభర్తను గురించి ఆలోచన తగ్గించు, నిపిల్లల భవిషత్ గురించి ఆలోచించు, నీ ప్రేమ ఉన్న్నన్తకాలమ్ నీ భర్త న్నిన్ను వదలి ఉండలేడు, కొన్నాళ్ళు భర్తకు దూరముగా తెలియకుండా అజ్ఞాతముగా ఉండి నీ భర్తను గమనిస్తూ ఉండు అని నేను చెప్పే సలహా .

నీవు చెప్పినట్లుగా వారిని ఈరొజె కలుస్తాను ఆ దేవుడు కల్పించే ఆటలో నేను ఒక పావును, పంజరములో చిక్కిన  చిలకను ఐన పంజరాని చేదించి బయటకు వస్తున్నాను. అంటూ ఇంటి వారికి మా వూరు పోతున్నాను మావారు వస్తే తాళం ఇవ్వండి అనే చెప్పి బ్రతుకుతెరువు కోసం ఆధునిక   ప్రపంచములో అడుగుపెట్టింది


హనుమాన్ జ్ఞాన మందిర్ వద్దకు చేరింది శారదా దేవి, అక్కడ వారిని " రామకృష్ణగారు " ఉన్నారా అని అడిగింది. ఇప్పుడే భార్యా భర్తల భంధం గురించి చెపుతున్నారు. ఆ ఉపన్యాసం ఐన తర్వాత కలవచ్చు, ఆక్కడ కూర్చున్న వారితొ కూర్చొమ్డి అన్నాడు, మందిరానికి వచ్చిన భక్తుడు. పిల్లతో అక్కడే కూర్చొన్నది.

అప్పుడే ఉపన్యాసం ప్రారంభమైనది. నేను చెప్పేవన్ని అనుభవ సారాంశాలు, ప్రక్రుతి రహస్యాలు, మేధావులు రచించిన విషయాలు, మంచిని గ్రహించి జీవితము సార్ధకము చేసుకొని హనుమంతుని ద్యానిస్తు మనోధైర్యముగా, నిగ్రహశక్తి తొ  జీవితము గడపాలి, ఉప్పెన వచ్చిందని భయపడకూడదు, చికటి  వెలుగులు, మనుష్యులను వెమ్బడిస్తాయని మరువకండి.

స్త్రీ గొప్ప అని , పురుషుడు గొప్ప అని కొందరు వాదించు చున్నారు, స్త్రీ పురుషులు సమానమని, దయార్ద కరుణ కలిగిన వారని, మానవత్వం ఉన్న మనుష్యులని, ఇరువురి అవసరముతొనె సృష్టి మెదలైనదని నేనంటాను.
       
ఎగిరి ఎగిరి (స్త్రీ ) అనే రక్కలగల పావురము, ఆకులు కొమ్మలు రమ్మలు బలంగా ఉన్న చెట్టు (పురుషుడు ) దొరికిందని ఆ చెట్టే తన సర్వస్వమని భావించి ఎంతో సంబరపడి అందే ఉండిపోతుంది, ఆశ్రయము కల్పించి ఆదుకోవటమే చెట్టు లక్షణం  అని నేనంటాను.  
               
చలికి, వానకి, ఎండకి, ఎండి, మేక్కగా పెరిగి పువ్వునై, వెరొకపంచన చేరి,  సువాసనలు,  సుగంధాలు, అందించి చివరకు దేవుని పూజా పుష్పముగా మరుదున్దని నేనంటాను.

రక్షణ వలయములో ఉండి, ప్రేమగా ముద్దుగా పెరిగి, ప్రక్రుతి సౌందర్యాలను చూడాలని, అనుమతితో ప్రవేశించిన లేడి పిల్ల బెదురు చూపులతొ రక్షణ కర్తను చేరి మనసు విప్పి మట్లాడి, మనసును అర్పించటమే, ఆనందాన్ని పంచి అనుభవించటమే ప్రేమ అని నేనంటాను.

మాటల రంగుల్లో, మనసుల ముసుగుల్లొ,  రంజిమ్పచెసి, రక్తికట్టించి నటనతో వసపరుచుకొని, ఇది ఒక నాటకమని నేను పాత్రదారుడునని, నమ్మించి మోసంచేసి ఎమీ తెలియదని అమాయకులమని అనే స్త్రీ పురుషులు ఉన్నారని నేనంటాను.

అఖండ ఆశా జ్యోతి కోసం కాళ్ళవద్ద ఉన్న దీపపు బుడ్డిని ప్రక్కకు జరిపి మిడి మిడి మిణుగురు పురుగుల వెలుతురులో ప్రలోభాలకు లొంగి కాపురాలు నడి సముద్రములొ ఉన్న గాలికి కదిలే పడవలా, దిక్కుతోచని పక్షులు ఎలా విలపిస్తాయొ, పిల్లలను భర్తను దారి తెచ్చు కోలేక విలపించెది స్త్రీ లేనని  నేనంటాను,.

సుఖం అందించలేని స్త్రీ కాని,  పురుషుడుకాని పెళ్లి చేసుకోవటం వ్యర్ధం. పెళ్లి చేసుకున్న తరవాత (స్త్రీ పురుషులు సంసారానికి పనికి రారని తెలుసుకున్న)  క్షణాన కలిసి జీవించడం వ్యర్ధం,  విడి పోయి వేరొకరిని మొసగించ కుండా  జీవితకాలములొ ఒంటరిగా బ్రతుకుటే న్యాయమని నేనంటాను.

స్త్రీ  పురుషులమద్య కాంక్షా రహిత సంభంధం, అలోకిక సంభంధం, శరీర రహిత సంభంధం, ఉండవచ్చు అంత  మాత్రాన నైతిక విలువలు మరచి ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నారు ఎందుకని నేనంటున్నాను.

కుటిల పాండిత్యముతో  అమాయక ప్రాణులను లోబరుచుకొని,  మానాలను హరించి, వీధిన విసిరేసిన చెత్త సంచీలుగా మార్చి,  దిక్కునావారి చెప్పుకోమని, కోపముతో హతమార్చిన నరహన్తకులన్నరని నేనంటున్నాను.

ఒక శబ్ద తరంగమ్ చేవునికి చెరినన్త మాత్రాన బి.పి., పెంచుకోమని, కోపం తెచ్చు కోమని, ఆలోచన శక్తి మొద్దు మారినట్లుగా ప్రవర్తింమ్చుట ఎందుకని, మనస్సుని నిగ్రహించుకొని ఉండ లెక పొతున్నారు స్త్రీ పురుషులు ఎందుకని నేనంటున్నాను.

జాజి పూల సన్నని సువాసన మతిబ్రమిమ్చవచ్చు, చల్లని నీటి తుమ్పరులు మనస్సును ప్రెరెపిమ్ప వచ్చు, చలిని తట్టుకోలేక వేడికోసం వెమ్పర్లాడ వచ్చు, కాని మనస్సును నిగ్రహిమ్చెకొనె శక్తి ఆ దేవుడు మనకిచ్చాడు దానిని సద్వినియోగము చేసుకోలేక భాదపదుతున్నారని నేనంటున్నాను.

నిర్ణయాలన్నీ సహజ అమోదాలుగా భావించి వాని ఫలితములు, దుస్పలితములు తెలుసుకొని సరిదిద్దుకోవాలి స్త్రీ పురుషులు అంతే కాని ఎవరో చెప్పారు, నేను చేసాను, అని వారిని దూషించుట తగదు, వర్ని హేళన చేయుట తగదు, గుణఫాటాలే అనుభవాలని తలంచి జీవించాలని నే నంటాను.

స్త్రీపురుషులు ఇద్దరు ఉల్లాసముగా,  ఉత్చాహముగా,  ఆరోగ్యముగా మనస్సును ఆకర్షించే విదముగ, లక్షణ విలక్షణముగా, వైవిద్య భావాలు మనస్సున రానియక, అసభ్య పదాలు వాడకుండగా, మనిషిని బట్టి వారి మనసుని బట్టి ఏది మాట్లాడాలో అంతవరకూ మాటలతో సంతోషపరిచి, మానవాతీత శక్తిని పదర్సిమ్చి నలుగురిలో మంచివారని, మంచి కుటుంబమని అనిపించుకుంటే చాలని నేనంటాను.

వినోదాన్ని అందించి చమత్కారాన్ని సొంతం చేసుకోవాలి, అనుకున్న భావాన్ని ఇరువురు తెలుసుకొని అమలు జరపాలి,  సుఖదుక్ఖాలు ఇద్దరి వళ్ళ వచ్చు నని అనుకోవాలి, సూర్య చన్ద్రులులాగ వేళ తప్ప  కుండా  దేవుని నమ్ముకొని బ్రత కాలని నేనంటాను.

ఇంద్ర ధనుస్సు ల వెలిగిపోతూ, మనస్సులోని కోరికలను సామరస్యముగా తీర్చుకుంటూ, ప్రశాంత వాతావరణము లో ప్రక్రుతి వడిలో పున్నమినాడు వెన్నెల కిరణాల వలె ఒకరి మాట ఒకరు అర్ధం చేసుకొని జీవించాలి, కోపముతో గాని, తాపముతో గాని, అసభ్య పదజాలముతొ ఒకరికొకరు వాదనలు చేయుట  మంచిదికాదు,  అందులో పిల్లల ముందు ప్రవర్తించటం అంతకన్నా మంచిది కాదని  నేనంటున్నాను.

మనసు మనసు కలసిన నాడు ఏర్పడును భంధం, మనసు విరిగిన నాడు ఇంకా పెరుగును భంధం, పిల్లల ప్రేమను పంచు కొనె టప్పుడు ఉంటుంది భంధం, పిల్లలు ప్రయోజకులై వృద్దిలోకి రావటమే నిజమైన భంధం అని నేనంటాను.

తప్పు ఎవరిదైన వేలెత్తి చూపకు, పదే పదే విమర్సిమ్చకు,   చీకటి  తరిమే వెలుగు ఉంటుందని మరువకు, సుఖం, దుఖం ఎప్పుడు ని వెనుకే ఉంటాయి వాటిని చూసి భయపడకు, వాటికోసం పరుగెత్తకు, భార్యా భర్తలనెవారు కావడి  కుండల్లా  కదులుతూ మనందరినీ భరిస్తున్న భూమాతను, కావడిని మోస్తున్న ఆ పరమాత్మునితో  ఉండాలి భంధం.

బురదలో పడ్డ బయటకు వచ్చి సుబ్రముగా  కడుక్కొని బ్రతకాలి,   కాలమే మనకు ఆశలు రేపుతుంది, అవకాశములు కల్పిస్తుంది, ఆనందాన్ని పంచుతుంది, దుఖాన్ని దూరమ్ చేస్తుంది.

ప్రతిఒక్కరు మనసు ప్రశాంతముగా ఉషోదయ  కిరణాలులా, దేవునికి అర్పించే పుష్పాలలా, నలుగురితో కలసి జీవిమ్చటమే నిజమైన భంధం.

ఒక చెరువులొ ఉన్న మంచి నీరు భూమిని తడుపుతూ  మరొక చెరువులొ కలసి కలకల లాడుతూ అందరికి ఉపయొగ పడేవిధముగా, భార్యాభర్తలు కలసి జీవిమ్చటమే భంధం, మానవసేవే మాధవ సేవని భావించటమే  నిజమైన భంధం.                            

ఉపన్యాసము అంతా విన్న తర్వాత ఆ హనుమంతునికి నమస్కరించి " రామకృష్ణగారి దీవెనలుతీసుకొని ధైర్యముగా భర్త బలహీనతను గమనించి, వలలో వేసుకున్న దానికి బుద్ధి చెప్పి ఉన్న ప్రాంతమును మారి భర్తతోపాటు టిచర్గా  పనిచేసి పిల్లలకు మంచి విద్య వచ్చుటకు తనవంతు కష్టపడింది శారదాదేవి అదే భంధం

ఈకధపై మరియు నేను వ్రాస్తున్న కధలపై మీ అభిప్రాయలు మీ స్నెహితులతో పంచుకుంటూ మనస్సు ప్రశాంతముగా ఉండాలనేదే నా భావన.

                                      

                                               

      అంటి అంట నట్లుగా, చూసి చూడ నట్లుగా, విని విన నట్లుగా , మాట్లాడి మాట్లాడ నట్లుగా , ప్రతి విషయాన్ని తేలిక తీసు కోవటమే కలియుగ భంధం అని నేనంటాను.       

26, జనవరి 2014, ఆదివారం

107. comedy story -11 (నేను నేనే )

                                                                           
నేను నేనే


నిత్యము జరుగుతున్న సంఘటనలు ఆధారము చేసుకొని ఈ కధ వ్రాయుట జరిగింది. ఇది ఎవరిని ఉద్దేసించి వ్రాసినది కాదు, కేవలము మనుష్యులకు " నవ్వు ముఖ్యము " కనుక కాస్త చదువుకొని ఆనంద పడతారని ఆసిస్తూ ఇది వ్రాయుట జరిగింది దీనిలొ హిరో ఒకరు " వ్యాఘ్రెస్వర్  " ప్రేక్షకుడుగా  "బ్రహ్మానదం" ఇందు రెండు  సంఘటనలు ఉదహరిస్తున్నాను .

మన  హీరొ గోవిందు పబ్లిక్ రోడ్ లో ఉన్న బస్సు స్టాప్ లో తీరుబాటుగా  పేపరు చదువుతున్నాడు, కాసేపు తూర్పుకు తిరిగి మరీ చదివేవాడు.  కాసేపు నడుస్తూ చదివేవాడు చూసే వారికి  ఇతని ప్రవర్తన వింతగా ఉండేది, ఎవరన్నా కదిలించారను కో అంతే వలలో చిక్కిన పక్షిలాగా, వడ్డున పడ్డ చేపలాగా, పెళ్ళానికి చిక్కిన మొగుడ్ లాగా గిలగిల కోట్టు కుంటారని అనుభవజ్ఞులకు తెలుసు.

ఇదిగో మాస్టారు ఒక్కసారి పాపారు ఇస్తారా అని అడిగాడు బ్రహ్మానందం, అటు  ఇటు చూసి నన్నే అడిగేది నీవు అన్నాడు వ్యాఘ్రెస్వర్ , అవును సార్ ఏమిటి అడగటం తప్పా, అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అది నీకు తెలుసా, తెలుసు. అయితే నిజంగా పాప్రు అడుగుతున్నావా , అవునండి ఎదో పేపరు కొద్దిగా చదువుదామని, అవును సార్ మీ లాంటి వారు ఇక్కడ ఎక్కవగా ఉండుట వల్లే దేశం ఈ స్థితి లోఉంది.   

ఇంతకీ ఈ పేపరులో  ఏమి చదువుతావు, చదవన్ సార్ చూస్తాను, " ఆబ్బా "  అంత చూసే బొమ్మలేమీ ఉంటాయి, లక్ష తొంభై ఉంటాయి అన్ని మీకు చెప్పాలా,  మీరు పేపరు  ఇస్తే ఇవ్వండి లేదా ఇవ్వనని చెప్పండి అన్నాడు. అబ్బో కుర్రోడివైన పట్టుదలగా మాట్లాడుతున్నావే, ఇంతకీ నీవు చూసెదేమిటి " మాహీరొ సినమా ఏ హాల్లో ఉందొ తెలుసు కొనేందుకు అన్నాడు.

తెలుసుకొని సినమా చూస్తావా, లేదా ఏమన్నారు మీరు "సినమా చూడక అక్కడ దాక పోయి బ్లాక్ టిక్కెట్లు అమ్మేవాడిలాగా" కనిపిస్తున్నాన అన్నాడు బ్రహ్మానందం.   


 
మీ సినమా నాయకుడెవరో తెలుసుకోవచ్చా, అతడా సార్, అవునూ ఎవరో చెప్పు అతనే నవ్వుల గోవిందు.
 

ఏమిటి అతని ప్రత్యేకత అట్లా అడిగితే ఎట్లా చెపుతాను , ఇపుడు రామారావు సినమా తీసుకోండి ఒక్కోసినమా రాజుగా, దేవుడుగా ఉంటుంది, అట్లాగే నాగేశ్వర రావు సినమా తీసుకోండి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. మీరు చూస్తెతెలుస్తుంది. ఇంకా వారి సినమాలు వస్తున్నాయ, అదేంటి సార్ మొన్నేగా రామారావు, నాగేశ్వర రావు నటించిన సినమా వచ్చింది.

ఏమిటి కొత్తదే, ఏమిటి సార్ కొత్తడి కాకపొతే పాత దనుకుంటున్నారా, మీరు ఏ యుగంలో ఉన్నారో, మొన్నే చూసాను చాల అద్బుతముగా ఉంది , దానికి రాష్ట్రపతి అవార్డు కుడా ఇచ్చారు.  

ఇంతకీ ఎం చదువుతున్నావు, నేనా డిగ్రీ చదువుతున్నాను, మీ నాన్నగారు ఎం చేస్తున్నారు,  బట్టలషాపులో గుమాస్తా

మీనాన్న కష్టపడి నీకు డబ్బులు పంపిస్తే నీవు సినమాలని, షికార్లని, క్లబ్బులని తిరిగి డబ్బును తగలేస్తావు  కదూ.

ఏంటి సార్ అట్లా అంటారు, నేనేమన్నా మూర్ఖున్నా  చదువుతున్న వాడిని,   మానాన్న కష్టాలు మర్చిపోతానా, మా అమ్మ ప్రేమ మర్చి పోయే వాడిని కాదు సార్, నేను మా తల్లి తండ్రులను సుఖపెడతాను

ముందు పేపరు ఇవ్వండి సినమాకి వెళ్లి ఇంటికి పోవాలి.

ఇంతకుముందు మీ హీరొ సినమాలు ఏమైనా చూసావా, ఎందుకు చూడలేదు  గోల్ మాల్ గోవిందా ఏంతో  బాగున్నది సార్,

ఒకసారి సినమాకి వెళ్ళాను, ఒకటే నవ్వు , నవ్వు ఆపుకోలేక కళ్ళంబడి నీరు వచ్చాయి అంతే చేతిరుమాలు  తడిసి పో యింది తెలుసా, మర్లా వెంటనే  సీరియస్ గా డైలాగు చెపుతాడు, "చెల్లమ్మా నీకు సహాయము చెయ్యలేక పోతిని, నిన్ను కాపాడ లేక పోతిని, నిన్ను ఈ స్తితికి మార్చిన వాన్నీ   పట్టు కో లేక పోతిని, నన్ను క్షమించమ్మా, 
క్షమించమ్మా, నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకు నిన్ను కాపాడు కుంటాను. నేను పెళ్లి కూడా చేసుకోను నీకోసం చెల్లెమ్మా " ఆ మాటలకు చీరలు తడిసినాయి స్త్రీలకు.

సినమా చూసి అంత ఇన్ స్పైర్ కాకూడదు, సినమాను కధలాగా చూడాలి, దానిలో ఉన్న నీతిని గ్రహించాలి, మనసుకు సంతోషము కలగాలి, ప్రశాంతముగా ఇంటికి  పోయిన తర్వాత నిద్రరావాలి.

ఆంటే మాయా బజార్ లాగా సార్, ఏమిటి ఆ సినమా చూసావా, నెనేమ్ పిచ్చోడ్ని కాదు సార్, మా బామ్మ చెప్పంగా విన్నాను.

ఇప్పుడు సినమాలు చూస్తే ఏంతో ఉచ్చాహంగా ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉన్నాయి, రకరకాల సెట్టింగులు, సినమా చూస్తుంటే స్వర్గలోకంలో విహరిస్తున్నట్టు ఉన్నది

నీవు త్రాగుతావా అన్న మాటలకు " తాగనివాడు దున్నపొతుతో సమానమని ఒక కవి అన్నాడు, అందుకనే అప్పుడప్పడు త్రాగుతానండి, మరి సిగేరేట్టు ఇక దాని గురించి నన్నెందుకు  అడుగ తారండి కవులు సిగేరేట్టు దమ్ము మీద దమ్ము లాగి కధలు వ్రాసారని మా బామ్మ చెప్పేది, అందుకనే నేను త్రాగుతున్నాను.

కొంపలదీసి నీవు కధలు వ్రాయుటలేదు కదా, ఇంకా నాకు సమయ మెక్కడుంది సార్, ప్రొద్దున సాయంత్రం ఉమన్స్ కలెజీ చుట్టూ తిరగడం సరిపోతుంది.

ఎందుకో  ఏదైనా పిట్ట పడుతుందని, ఆశ .  ఏ వయసులో చేసేపని ఆవయసులో చేస్తే మంచి పిల్లలు పుడతారని మా బామ్మ చెప్పేది సార్.  మీ వయసులో అమ్మాయల వెంబడి తిరుగుతే చెప్పుతీసుకొని కొడతారు, మమ్మల్నైతే ముద్దుగా పిలిచి క్లబ్బుకు పోదామా పార్కుకు పోదామా అంటారు సార్ అదే సార్ మాకు మీకుతెడా. 
ఆహా 
అవును సార్ 
అబ్బో నీ దగ్గర నేను చాలా నేర్చుకోవాలి

ఇంతకీ  " గోవిందా గోవిందా " సినమా చాసావా

ఎందుకు చూడ లేదు సార్ చాలా బావుంది, దానిలో ప్రెత్యేకత ఏంటి

అమ్మాయిలతో గోవిందుడు ఆడతాడు చూడు, ఒక చెడుగుడు, ఒక కోలాట, ఒక బిళ్ళంగోడు ఆట ఒకరిపై ఒకరు దూకె ఆట, రంగులు కొట్టుకుంటూ జలకాలు ఆడతారు చూస్తుంటే నా మనసు నా మనసులో లేదుసార్ ఆ అమ్మాయల తో ఆడినట్లు ఉన్నది సార్.

ఇంకా ఏమైంది, అమ్మాయిల చీరలు మాయమైనయి, అంతే  బ్లూ ఫిలిం రీల్ కట్ హాలంతా గొడవ మీద గొడవ అదే అమ్మాయిలైతె, ఒక్కటే వీలలు, బూరలు ఎగరేసారు  సార్.

ఇంతకీ మీ హీరొ చూసావా అంటే నన్ను పిచ్చోడ్ని చేస్తారు సార్, రక్తపుతిలకాన్ని స్వయముగా దిద్దాను సార్ నాను పిలిచి కాఫీ టిఫిన్ ఇచ్చినీలాంటి అభిమానులు నాకు కావాలని ప్రొత్చహించారు సార్.

ఆహీరొని "  నేను నేనే "    ఆ అంటూ క్రింద పడ్డాడు.

ప్రక్కనవరు వచ్చి ఏమైంది సార్.

ఇటువంటి కారు కూతలు కూసేవారు ఈ దేశంలో ఉండ కూడదు, ఉన్నాడనుకో ఇతనితో ఉన్నవారు చెడిపోతారు , పచ్చని కాపురములో చిచ్చు పెట్టె రకం, ఆడపిల్లలను చూస్తే చిత్రకార్తి కుక్కల్లాగా వెంటపడే రకం, ఇలాంటి వారి తగిన మందు ఆసుపత్రి మాత్రమే. 

అంతలోకి అంబులెన్సు వచ్చింది, దానిలో నుండి దిగినవారు నమస్కారము పెట్టి ఇతన్ని ఎక్కడకు తీసికెల్ల మంటారు, పిచ్చాసుపత్రికి తీసు కేల్లండి వ్యాఘ్రెస్వర్ పంపారని చెప్పండి. డాక్టర్ కు అర్ధమవుతుంది.   ఇల్లాంటి వారు చాలామంది ఉన్నరు వారినుండి జాగర్తగా ఉండండి ఇటువంటి వారి మాటలు నమ్మకండి, మీ మనస్సు ఏది మంచిదైతే అదే చేయండి, వేరెవరో చెప్పారని చేయకండి, ఇలాంటివారు సినిమా రంగాని చాల చేటు చేస్తారు, ఎంతో కష్టపడి సినమా తీస్తే చూడ కుండా బాగోలేదు, చూడొద్దు అంటారు. ఎంతో మంది జీవితాలు ఒక్క మాటతో పాడు చేస్తారు.

ఇంతకీ మీరెవరు " నేను నేనే "
                                                    

18, జనవరి 2014, శనివారం

106. Tragedy Story-10 ( శ్రద్దాంజలి )శ్రద్దాంజలి

అక్కినేని నాగేశ్వరరావు గారు తెల్లవారుజామున 2.35 నిముషములకు (22-1-2014) పరమపదించినారని తెలిసి వారి ఆత్మ సామ్తిమ్చాలని నివాళులు అర్పిసు రెండు నిముషములు మౌనం వహిస్తూ వారి జీవిత చరిత్రను మరొక్కసారి గుర్తుచేసుకుంటూ నా భావ కవితగా తెలియ పరుస్తున్నాను.

" సీతారమజననమ్ " నందు ఆడవేషముతో సినమా రంగమున ప్రవెసించినావు
" బాలరాజు " వై రాజాది రాజులకు రాజువై  స్థిర స్థాఇగా నిలిచిపొఇనవాడవు     
" ధర్మపత్ని"  సినమాలో నటించి అన్నపూర్ణను ధర్మపత్నిగా చెసుకున్నవాడవు
" ప్రేమ " లో పడటం, ప్రేమించడం నేర్పిన నవలా నాయకుడవు

" భుద్ధి మంతుడు " గా ఉండి సక్రమమార్గమెదొ మాకు తెలియపర్చినవాడవు
" ధర్మదాత " గా మారి అనాధలను ఆదుకొని సహాయము చేసిన వాడవు
" బాటసారి " గా వచ్చి మాకందరికీ దేవుడవై మనసునందు నిలిచిన వాడవు         
" వాగ్దానము " చేసి నీ పేరుతొ ప్రత్యెక అవార్డును ఏర్పాటు చేసిన వాడవు

" అమాయకుడు "గా ఉండి చదువు లేకుండా అద్బుతముగా మాట్లాడిన వాడవు
" మంచిరొజులొచ్చాయి " అన్నపూర్ణ స్టూడియో నిర్మించి సినమాలు తీసినవాడవు     
" కన్నవారి కళలు "నెరవేర్చి, చెయూత నిచ్చి, నటనా సామర్దులుగా చెసినవాడవు   
" శ్రీరంగ నీతులు " చెప్పక కష్టములకు ఓర్పు వహించి అనుకున్నది సాధించిన వాడవు

" ఆలుమగలు " ఎప్పుడు సరదా సరదా గ ఉండాలని నటించి చూపిన వాడవు
" పల్లెటూరి బావ " గా నటించి ప్రపంచానికి తెలుగు పంచకట్టుతెలిపిన వాడవు
" దసరా బుల్లోడు " గా, "పులి"వేషము కట్టి ఊరూరా సంబరాలు చేసిన వాడవు  
" ప్రేమనగర్ " లో నటించి యువతి యువకులకు ప్రేమ పాఠాలను నేర్పిన వాడవు

"బంగారుకానుకలు"  గా పుత్రులకు నటనా వారసత్వము కల్పించివ వాడవు
" దొరబాబు " గా ఉండి సర్వేపల్లి రాధాకృష్ణన్ చేత పురస్కారము పొందిన వాడవు
" భార్యా భర్తలు " ఎలా ఉండాలో, కుటంబరక్షణ గూర్చి సినమా కధ చెప్పినవాడవు  
" మనం " భారతీయులమ్ తెలుగు తల్లి ముద్దు బిడ్డలం అన్నవాడవు

" భక్తజయదెవుని "గా నటించి గోపాలుని లీలా తత్వమును భొధించినవాడవు
" భక్త తుకారం " గా నటించి భక్తిద్వారా పుస్పకవిమానంలో స్వర్గముచెరినవాడవు
" భక్త కబీర్ " గా నటించి రామసేవకు కులమతాలు అడ్డురావని చెప్పినవాడవు
" భక్త చక్రధారి "  గా నటించి ప్రజల హృదయాలలో చిరంజీవిగ ఉన్న వాడవు 


" దేవదాసు " నటించి త్రాగితే మృత్యువు తప్పదని చూపిన వాడవు
" మరోప్రపంచం " రావాలని ప్రతి హృదయములో ఉన్న వాడవు
" సుడి గుండాల " కు చిక్కక అమరజీవివై వెలసినవాడవు
" మేఘసందేశం " గగన సీమలొ ఉంది మాకు పమ్పుతున్నవాడవు

" వెండి తెరపై 70 వసంతాలు నటనతో ప్రజల హృదయాలలో ఉన్న వాడవు
తెలుగు ముద్దుబిడ్డగా ప్రపంచ దేశాలకు తెలుగువారి గౌరవం పెంచిన వాడవు
తెనాలి రామకృష్ణుడు గా, మహాకవి కాళిదాసుగా, అమర శిల్పి జక్కన్నగా
ప్రేమికులకు ప్రెమికుడుగా తారలతో అభినయ కళాకారుడవు"            

" నందమూరి రామారావు గారు , అక్కినేని నాగేశ్వరరావు గారు. అద్భుతమైన
నటనా చాతుర్యముతో ఆద్రుల హృదయాలలో చిరస్తాఇగా నిలిచిపొఇనారు.                                          వీరు ద్రువతారలుగా మారారు, వీరు నటించిన సినమాలు సజీవసిల్పాలు "


తాను , నాగార్జున మరియు మనవడు నాగచైతన్య - రావు ఇటీవల తన సొంత చిత్రం 'మనం' కుటుంబం మూడు తరాల నటించారు (మా ) కోసం షూటింగ్ పూర్తి .

ఒక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు విజేత , అతను తమిళ, హిందీ లో కొన్ని వీటిలో 250 చిత్రాలలో నటించింది .


పురాణ తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వరరావు మర్త్య అవశేషాలు నేడు కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి, సహా చిత్ర నటులతో , పోలీసు గౌరవాలు మధ్య జ్వాలల కు కలవడానికి , మరియు అభిమానులు అతనికి ఉద్వేగపూరితమైన వీడ్కోలు అభినందనలు అందించారు .

నాగేశ్వరరావు ఇద్దరు కుమారులు వెంకట్ మరియు నటుడు నాగార్జున , కుటుంబ సభ్యులు అభిమానులు చే అన్నపూర్ణ స్టూడియోస్ లో  , చితి వెలిగించి నివాళులు అర్పించారు..

నటనలో తన అడుగుజాడల్లో తరువాత వారిని తన మునుమనవళ్లను సహా కుటుంబ సభ్యులు , , చితిని వెలిగించి ముందు వారి గత నివాళులు అర్పించారు.

కేంద్ర మాజీ మంత్రి , కాంగ్రెస్ నాయకుడు టి Subbirami రెడ్డి , రాష్ట్ర మంత్రులు కె.వి. కృష్ణారెడ్డి , D నాగేందర్ , ప్రముఖ నిర్మాత రామానాయుడు మరియు ప్రముఖ హీరో వెంకటేష్ తదితరులు ఉన్నారు .

అక్కినేని కుటుంబసభ్యులు, అభిమానులు గుండె ధైర్యము తెచ్చుకొని చిరంజీవుల ఆశయాలను నిలబెట్టాలని నా ఆలాపన,  ఆరాధన, ఆవేదనతో శ్రద్దాంజలి ఘటిస్తూ నివాళులు అర్పిస్తున్నాను.    

                                                                          

        

105. Love Story-9 (ఆనంద భాష్పాలు)

                                                                              

ఆనంద భాష్పాలు

తెలుగు రచయతల సంఘంలోని  ప్రముఖులు కొందరు ఏర్పాటు చేసిన సన్మాన సభ . సన్మాన  గ్రహీత  " శ్రీ దేవి " వీరు రచించిన "మూగ జీవులు" కధకు జాతీయ అవార్డు రావడం ఒక విశేషం, ఈమె రంగారెడ్డి జిల్లా మరుమూల గ్రామంలో ప్రైవేటు స్కూలులొ " యల్. కే. జి " టిచర్ గా పనిచేస్తున్నారు వీరు చదివింది " బి. ఎ " అయిన పసిపిల్లలను తల్లిగా ఆదరించి, జోలపాడి, బుజ్జగించి అక్షరజ్ఞానం భోధించే టిచర్.
" శ్రీ దేవి " గారిని పిలిచి పుస్పగుఛము ఇచ్చి,శాలువా కప్పి ఆమె  రచించిన అనేక కధలను మెచ్చుకుంటూ  సన్మానము  చేయువారు ప్రశంసా పత్రమును ఇచ్చినారు.

ఈ సన్మానములో ప్రఖ్యాత  కధా రచయత "శ్రీధర్ "గారు మాట్లా తూ  "మూగజీవులమీద వ్రాసిన కధ " ఇంతగా మనసు ను కదిలించేది నేనింతవరకు ఎ కధ చదవలేదు. కధ చదువుతుంటే కళ్ళంబడి నీరు కారింది నాకు. నోరు లేని జీవులను హింసించకుండా కరుణతో సమాదరన చూపాలని సామాజిక చైతన్యం రగిలించిన కధ వ్రాసినందుకు పభుత్వమువారు గుర్తించి అవార్డు ఇచ్చినందుకు నా మనస్పూర్తిగా అభినందనలు అన్న మాటలకు సభకు వచ్చిన వారు అందరు కరతల ద్వనులు చేసారు.

" శ్రీ దేవి " మట్లాడుతూ జరుగుతున్న  సంఘటనలు ఆధారముగా ప్రక్రుతి ననుసరమ్చి మంచిని నలుగురికి పంచాలని భావనతో ప్రతిఒక్కరు మూగ జీవులను రక్షించాలని ఉద్దేశ్యముతో వ్రాసిన కధను ఆదరించిన అభిమానులందరికి వందనాలు అందిస్తున్నాను. 

ముందు వరుసలొ కూర్చున్న భర్త రామకృష్ణ చప్పట్లు కొట్టగా, కూతురు ప్రత్యూష మాత్రము తల్లి సన్మానాన్ని  చూసి సంతోష మొహము పెట్టలేదు, అది గమనించింది "శ్రీ దేవి "

సభ ముగిసింది అనేక ఫోటోలు తీసారు, విడియో తీసారు, ఇదేసమయములో "శ్రీ దేవి "  రచించిన కధల పుస్తకమును ఆవిష్కరించారు.

                                               


ప్రత్యూష కాలేజి చదువు పూర్తి చేసింది,కార్టున్సువేయడం, గ్రాఫిక్ తో  విడియో తీయడం,  చిన్న చిన్న ఫిలిమ్స్ తీయడం అలవాటైంది.

సన్మానం ముందు రోజే  బూజు కర్ర తీసుకొని బూజు దులపడం మొదలపెట్టింది, గూటిలో  ఉన్న ఎప్పటినుంచో పుల్లలద్వార  గూడు  పెట్టుకున్న పక్షులు  గూడు తీయపొఇనప్పుడు అడ్డు వచ్చింది తల్లికి ప్రత్యూష.
అవి పిచ్చుక గూడులు, ఇల్లంతా పుల్లలు పడేస్తున్నాఇ అన్నది. వాటిని తీసివెసిన మల్లి కట్టు కొగలవు అన్నది తల్లి. తల్లి మూర్ఖపు మాటలకు భాదపడింది ప్రత్యూష. 

అమ్మ ఆగూడు కదిలించే హక్కు నికేవరిచ్చారు దానిలో కళ్ళు కుడా తెరువని చిన్న పసి కూనలున్నాఇ.నీకు నిజంగా మూగ జీవులను ఆదరించి లక్షణం లేదు కాని కధలు మాత్రము అద్భుతముగా వ్రాస్తావు. మనం ఆచరిమ్చి నదె వేరొకరికి చెప్పాలని అన్నారు "రామకృష్ణ పరమహంస ".

అమ్మ బూజు కర్ర సంఘటన గుర్తువచ్చి నేను చప్పట్లు కొట్టలేదు అన్నమాటలకు  తల్లి దగ్గరకు తీసుకొని ఆలింగనం చేస్తూ నేను కూడా  అదెఅనుకున్నాను. 

సన్మానం నుంచి ఇంటికి చేరిన ప్రత్యూష గబగబా డాబా పైకి పోయి పావురాలకు మేత వేసింది. తన కెమారాతో  షూట్ చేసింది.            

ప్రత్యూష నీ టాలెంటు ఏదో చూపిమ్చి, నలుగురి మెచ్చే విధముగా నీ కెమెరాకు పనిపెట్టి, ఫిలిమ్సు తీయి, డబ్బు ఎంత ఖర్చు ఐన  వెనుకాడకు, అనుకున్నది సాధించేదాకా, కృషి చెఇ అన్నమాటలకు ఎక్కడలేని ఉత్చాహము వచ్చింది.  


ఒకరోజు ప్రత్యూశ పత్రికా విలెఖరలను, చినిమా ప్రముఖులను, విమర్శకులను మేధావులను , తనకు సహకరిమ్చినవారిని, స్నేహితులను, భమ్ధువులను   మరియు తల్లి తండ్రులను మినీ కాన్ఫరెన్సు హాలుకు అహ్ఫానిమ్చిమ్ది. పట్టుదలతో తను తీసిన విడియో డాక్యు మెంటరీ "ప్రగతి-1" ప్రదర్సిమ్చిమ్ది.
 " నల్లని మేఘాన్ని చీల్చుకొని  భాల భాను కిరణాలు నీటిపై బడి పగలు నక్షత్రాల మెరుపులు విరజిమ్మి చూసినవారికి ఒక అద్బుతము ఒక వైపు",  నదిలో నిలువెల్లా మునిగి స్నానము చేయు భక్తులు దేవుని ప్రార్ధనలు, వింతగా చూస్తున్న ప్రజలు మరోవైపు " ,                                                                     

"కాకులు కబుర్లు చెప్పుకుంటూ కరంటు వైర్ పై కూర్చున్నట్లు ఒక వైపు", ఉద్యోగాల కొరకు నిరుద్యోగులు వరుసగా కూర్చొని అనుభావాలు బ్రతుకు భారముగురిమ్చి చెప్పు కున్నట్లు  మరోవైపు ",                                      

మీనాలను వడిసి పట్టి గాలిలో లొకి ఎగురతున్న తెల్లటి కొంగలు ఒకవైపు, అప్పులవూబిలొ చిక్కి, బాకీలను తీర్చలేక కుటుంబాలు వీధిలొ పడిన పరిస్తితి మరొకవైపు.

పువ్వులపై వాలిన సీతాకొక చిలుకలను ఒకవైపు, అందముగా బంగారుఆభరనముల అలంకరముతొ అద్భుత వస్త్ర ధారనముతొ కుర్రకారులను మనస్సును కొల్లగొట్టే స్త్రీల ప్రవర్తనలు మరొవైపు.

పచ్చని కొమ్మలపై  పక్షులు వాలికిలకిల రావములు ఒకవైపు, సభలలో రంగుల వస్త్రాలతో ఎగురుచూన్న పావురాళ్ళ, వీధిన పడ్డ కుక్కల అరుపులు లా నాయకుల ప్రవర్తనలు మరొవైపు.

మురికివాడల నిర్మూలన, బీదవారికి ఆర్ధిక సహాయము, ప్రజల ఆరొగ్యరక్షణ, అర్ధరాత్రికూడా అందరికి రక్షకులుగా రక్షక భటుల వలయాలు ఒకవైపు, నాయకుల ఆస్తి కోట్లకు మారిని ఎక్కడనుంచి వచ్చింది అని అడగలేని ప్రభుత్వమువారి పరిస్తితి మరొవైపు.

తెలుగింటి ఆడపడుచులు, ప్రతిఒక్కరు కలసి జరుపుకొనే సంక్రాంతి పండుగ గురించి ఒకవైపు,   సంక్రాంతి పండుగకు కోడి పందెములు, ఎడ్ల పందెములు, నిషిద్దమని చెప్పి నాయకు రక్షక భటులు పందెములు కాయటం మరో వైపు,                                 

పూర్తిగా వ్యాక్యానాలతో చిత్రీ కరిమ్చిన ఫిలిమ్ను  ప్రతిఒక్కరు ఊపిరి బిగపట్టి ఏదో లోకములో విహరించినట్లు నిసబ్ధము చేదిమ్చుకొని ఒక్కసారి ధ్వనులు, చప్పట్లు వెలిసాయి ఆ ప్రాంగణములో అమ్దరూ మెచ్చుకున్నారు ప్రత్య్యుష తీసిన చిన్నసినమను.

తల్లి తండ్రులు మాత్రము ముభావముగా కూర్చొని ఉన్నారు అది గమనించింది ప్రత్యూ


అమ్మా ప్రత్యూష నీవు తీసిన ఫిలిం చాలా బాగుంది అన్దరూ చూపిమ్చె విధానమే కనిపించింది ప్రత్యేకత నాకు ఏమి కనిపించలేదు, ఫోటోగ్రాఫిక్లో  ఇంకా మార్పులు రావాలి అందుకనే నేను అమెరికానుండి ప్రెత్యెక విడియో కెమారాను ఖరీదైనా నీకొసమ్ తెప్పిస్తున్నాను దానిని ఉపయోగించి భారతదేశ ప్రగతి ప్రపంచ దేశాలు  గుర్తిమ్చెవిధముగా చిత్రాలు తీయాలని నా ఆకాంక్ష అంటూ ప్రోస్చహిమ్చాడు తండ్రి రామకృష్ణ.

తల్లికూడా కూతురు చేసిన  ఫిలిమ్ను చూసి సంతోషించి ఎప్పుడో నేను చదివిన కధ గుర్తుకొచ్చింది చేపుతావిను దానినిబట్టి నీ ఆలోచనలు నీ నిర్ణయాలు నీకె వదిలెస్తున్నాము ఎట్టి పరిస్తితులలో నిరుస్చాహ పడవద్దు ముందుంది అంతా మంచి కాలం అని గ్రహించు అంటూ కధా ప్రారమ్భిమ్చిమ్ది.

" లక్ష్మన్న పంతులు గారు రాజ్యమును ఏలుతున్నారు, రాజులు కాలము పోయి భ్రామ్మనులు ఏలే కాలము వచ్చింది. ప్రజలను కన్నబిడ్డలుగా, సకల కళలను అభివృద్ధి పరిచే విధముగా, బీద ప్రజలపై  పన్నులు విధిమ్చకుండా కేవలము ధనవమ్తులపై పన్నులు వేసి వేదము చదివిన పండితులను సన్మానిస్తూ ఉండేవాడు.

ఆ రాజ్య్యమునకు దేవుని భక్తుడు " స్వామీజి " ధర్మాలు ప్రభొదిస్తూ ప్రజలను సన్మార్గమున జీవనము స్వర్గముతో సమానమని సంతృప్తి జీవితము దేవునితో సమానమని చెప్పుతున్నాడు.

లక్ష్మన్న పంతులు మారు వేషమున  స్వామీజి ని కలసి పరాయి హక్కు లేకుండా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. వెంటనే లేకే ఉన్నారు ఈ ఊరు చివర ఒక ములమ్మ ఉన్నది కావాలంటే మీరు పరీక్షిమ్చ వచ్చు అనిచెప్పాడు " రాజు అని తెలిసి ".

ఆమె జొన్నలు పండించి, తిరగలితొ త్రిప్పి  పిండి చీసి, దారిన పోయే బాటసారులకు ఉచితముగా పెట్టి తగినంత నీరు అన్దిస్తూ జీవితము గడుపుతున్నది.

రాజు అవ్వదగ్గర పోయి నేను కాదు బీదవాన్ని ఆకలితొఉన్నాను అనగా నాయనా ఉండు నీకు రొట్టెలు పెడతాను తిని నీరు త్రాగి విశ్రాంతి తీసుకొని రెపువెల్లవఛు ఎన్తదూరము నుండి నడచి వచ్చావో అంటు లోపలకు వెళ్ళింది.

రొట్టెలు తీసుకొచ్చిన ముసలమ్మతో రాజు ఇది సుద్ధమైనదేనా? చెప్పు ఇందులో పరాయి హక్కు లేదుకదా ? అని అడిగాడు.

చూదు బాటసారి ఇది పూర్తిగా సుద్ధమైనది కాదు ఇందులో పరాయి  హక్కు వచ్చింది అది చెపుతాను విను " నేను రొట్టెలు చేస్తున్నపుడు పెళ్లి మెళము ఈ వీదిగా పోవటము జరిగింది ఆసమయాన నేను వెలిగించిన దీపపు గాలికి ఆరినది, అప్పుడే వచ్చ్చిన ఎల్లి ఊరెగిమ్పు గ్యాసు లైటుల వెలుగులో చేసాను ఇందులో ప్రై హక్కుగల వెలుతురు ద్వారా తయారు చేయడం జరిగింది ఇది తప్ప నా సంపాదనలో ఎటువంటి దోషము లేదు." ఈ మాత్రపు లోపం కూడా లేక చేయలేక పోయాను ఆకలితొఉన్న వాడికి ఆకలితీర్చాలని ,  అన్న మాటలకు ముసలమ్మ ధర్మభుద్ధిని మెచ్చుకున్నాడు. అమ్మా ఈ వయసులో కూడా  కష్టపడటం దేనికి అనగా ఓపికున్నంతవరకు నలుగురికి సహాయ పడాలి అదే నా మార్గం అన్నది.  


పర్వతము నుండి దావాలనము ఎగసి పడుతున్నది, చీకటిని తరిమి సూర్యొదయము కావడము, ప్రచండ భాను కిరణాలు ధియటర్ ల్లో అంతా వ్యాపించడం వాటి మద్య కధ, స్క్రీన్ ప్లెయ్, ఫోటో గ్రాఫిక్, సంగీతమ్  దర్సకత్వం,  "ప్రత్యూష " అని ఒక్క సారి అందరికి కనబడింది           

అది ఒక చీన్న పల్లెటూరు, సీతారామయ్య, జానకమ్మ  గారు పెద విద్యార్ధులకు" వేదం " భొధిమ్చుతున్నారు.
వీరికి లేక లేక ఒక మొగపిల్లావాడు జన్మించాడు. అతనికి చిరంజీవి అని పేరుపెట్టుకొని గారాబముగా పెంచుతున్నారు. 8 వ సంవమ్చరములొ ఉపనయనము చేసి వేదం నెర్పిమ్చుతున్నారు.

ఒకనాడు ప్రక్కగ్రామమునకు పోవలసి వచ్చినది ఎద్దులబండి మీద బయలు దేరారు ముగ్గురు. అంతలో మబ్బులు పట్టి, చిన్న చిన్న చినుకులు  మొదలు పెట్టి, గాలి వానగా మారింది. కూర్చున్న  ధియటర్ ల్లో ఒక్క సారిగా గాలి వచ్చినట్లు మీద వర్షం పడినట్లు భావం ఏర్పడినది.  ఎద్దుల మేడలో ఉన్న గంట చప్పుడులు, ఎద్దులు విడిపోయి చెల్లా చెదిరి  ధియటర్ లోపలి పై భాగాన పరిగెడుతున్నట్లు, అది అడవి మార్గము కావడమువల్ల చెట్ల కొమ్మలు విరిగి గాలిలో తేలినట్లు, క్రూర మ్రుగముల్లన్ని మీదకు వచ్చినట్లు బ్రమిమ్చె విధముగా 3 D ఎఫెక్ట్స్ వచ్చిన వారి నందరిని ఆశ్చర్యములో ముంచి వేసింది.

గాలివాన వెలిసింది,  కొమ్మలు విరిగి చెట్లు చెదిరి ఉన్నాయి,  పక్షులు చెట్ల కొమ్మలనుండి బయటకు వచ్చి ప్రాణులన్నీ స్వెస్చా వాయువులు తీసుకోవటానికి బయటకు వచ్చాయి,  చిరంజీవి భయము లేకుండా కొమ్మను పట్టుకొని కదలక ఉండటం వళ్ళ  ఎలుగు బంటు తను యదా విదిగా  క్రిందకు దిగింది. చిరంజీవి కూడా దిగి తల్లి తండ్రుల కొరకు వెతుకుట ప్రారంభించాడు. నెమ్మదిగా నడుస్తున్నాడు ప్రక్కనుండి  సింహము భీకర శబ్దము చేస్తూ ఉన్నది. ఆ  శబ్దము అంతా   ధియటర్లో ప్రతిద్వనిస్తుమ్ది,  ఆన్దరూ సినమాను ఆశ్చర్యముగా గుండెను చేతిలో పట్టుకొని చూస్తున్నారు. ఆ శబ్దము భాదతో మూలుగుతున్నట్లు వినబడింది చిరంజీవికి. ఎంత ప్రయత్నమూ చేసినా పైకి రాలేక పోయింది,  "మృగ రాజు ఐన కస్టాలు తప్పలేదు".

నాలుగు వైపులా చూసాడు "అడవిలో ఏనుగులు పట్టేందుకు ఏర్పాటు చేసిన కందకములో సింహము పడింది " అది గమనించాడు ఎట్లా బయటకు తీయాలి అని ఆలోచించాడు.

వెంటనే ఆచరణ పెట్టేడు. దగ్గరున్న విరిగిన కొమ్మలను దగ్గరగా పెట్టేడు, వాటిని చెట్ల తీగలద్వారా కట్టాడు, దానిని కన్దకము వడ్డు దాక తెచ్చాడు,  కందకము వద్ద ఉన్న చట్టుకు చెట్ల తీగలద్వారా వ్రేలాడ దీయుటకు రెన్దవకొనను పట్టుకొని చెట్టుపైకి ఎక్కి కూర్చొని నెమ్మదిగా వాటముగా కన్దకములొకి జార విడిచాడు. ఒక్కసారిగా తడిసిన కొమ్మల బరువుతో కట్టిన కొమ్మల వరుస లోపలకు జారింది.

అంతే ఒక్కసారి కట్టిన కొమ్మల పైకి ఎగిరి నెమ్మదిగా పైకి రాగలగిన్ది " సింహం ", అదే సమయాన ధైర్యముగా చెట్టును దిగి చిరంజీవి కుడా క్రిందకు వచ్చాడు,  ఆ సమయాన మ్యుజికే అద్బుతముగా ఉండటమువల్ల  ప్రతిఒక్కరి గుండె వేగము పెరగటం జరిగింది చిరంజీవిని ఎంచెస్తుమ్దా అని ఎదురుచూస్తున్నారు  " సింహం " ఒక్క అరుపుతో పైకి దూకిన్ది "  ఆ అరుపు ధియటర్ లో ఉన్న వారిమీదకు దూకినట్లుంది " అంతే కెవ్వు మనికెక వినపడింది," అదికేవలము మ్యూజిక్  రికార్డు మాత్రమె " .

ఒక్కసారిగా ఊపిరితీసుకున్నారు అందరు నెమ్మదిగా నడుస్తూ బయలు దేరాడు చిరంజీవి
ఒక్కసారి పక్షుల కిలకిల రావములతొ ధియటర్ మెత్తము అంతా ఆవరించింది అద్బుతమైన సంగీతము  వినబడుతుంది.

కొండలు  నడుమ జాలువారు నది  కనబడుతున్నది, ఆ నది ఒడ్డున చేరారు తల్లితండ్రులు పిల్లవనికొసమ్, వెతుకు తున్నారు. దూరము నుండి తల్లి తండ్రులను చూసడు చిరంజీవి .

చెట్ల మాటు నుండి చిరుతపులి తల్లి తండ్రుల పై దూక బోఇంది,  పెద్దాగా ఆగు ఆగు అంటూ అక్కడ పడి ఉన్న పెద్ద కట్టెను తీసుకొని పులిపై ఉరికాడు, పులి వెంటనే చిరంజీవిపై ఎగిరింది, తల్లి తండ్రుల గజగజ వణుకుతున్నారు భయకంపితులై చూస్తున్నారు.                               

ఇంతలో ఒక మహా సింహం భయంకరంగా గర్జించింది, ఆగర్జనకు చిరుతపులి తొకముదుచుకొని అక్కడనుండి పారి పోయింది. చిరంజీవి ముందు తొకాడిస్తూ నిలబడింది.
  
సింహం వంటి భయంకరమైన మృగం కూడా  ఉపకారము చేసిన వారని మరువలేదు.        

ఒక ఏనుగు పిల్ల వచ్చి వీరి ముందు ఆగింది,  ఏనుగు పైకి ఎక్కి కదలటంతో  "శుభం " కార్డు పడింది.
  "జైహింద్ "  అంటూ జనగణమన పాట మెదలైంది అన్దరూ లేచి నుంచొని భారతమాతకు ఒక్కసారి వందనములు అర్పించారు .
     చిత్రమును చూసిన  తల్లి తండ్రులకు కళ్ళ వెంట జాలువారాయి ఆనంద భాష్పాలు                                       
 
                                              

.

13, జనవరి 2014, సోమవారం

104. Comedy Story-8( ఆధార్ కార్డు )

                                                                              

ఆధార్ కార్డు

చెల్లెమ్మ బావగారున్నారా అంటు లోనికి వచ్చాడు "సోది సుబ్బారావు", చెల్లెమ్మ ఇపుడే తొమ్దరొద్దు  టిఫిన్ చేయకు ఒక అరగంట తర్వాత చేయొచ్చు అన్న మాటలు వింటూ భజగోవిందం లోపల  నుండి హాలులోకి వచ్చాడు.

సుబ్బారావుగారు అమ్దరూ బాగున్నారా, మీ కాలక్షేపము బాగా జరుగుతుందా, ఏమిటి ఈ నాటి స్పెషల్ ఎమీ లేదు మిమ్మలన్ని ఒక్కసారి కలసి ఆధార్ కార్డు పోస్టు లో  వస్తుందట అది వచ్చిందా అని  అడుగుదామని వచ్చాను.

కూకట్పల్లి లో ఉన్న మా మావగారి ఇంటిలో  ఉన్నప్పుడు ఫోటోలు దిగాము అవి ఇంతవరకు రాలేదు.అవి ఎప్పుడొస్తాయో మాకే తెలీదు. ఐతే ఇప్పుడు మీకు గ్యాసు ఇవ్వరూ, ఆధార్ కార్డు లెకపొతె బ్యాకులొ ఎకౌంటు  ఓపెన్ చెయనీయరు, లోన్ ఇవ్వరూ తెలుసానీకు, ముందు ఆధార్ కార్డు సంపాదించు.

చెల్లెమ్మ టిఫిన్ పెట్టమ్మ తిని నేను పోస్టఫీసుసుకు పోవాలి, నాకేమన్న మనియా ర్డర్ వచ్చిందేమో కనుక్కొని, దానితోపాటు ఆధార్ కార్డు వచ్చిందేమోనని కనుక్కొని వస్తాను.

టిఫిన్ బాగుందమ్మా వెల్లొస్తాను భజగోవిందం గారు.అబ్బ ఇప్పుడే పోయి ఎమ్చెస్తావు పోస్ట్మాన్ రావాలికదా "టి "త్రాగి పోవచ్చు అన్నాడు భజ గోవిందం.  

ఆశ్చర్యకరమైన విషయమేది అని భజగోవిందం అడిగాడు సుబ్బారావుని " నన్నే అడిగావు నాకు తెలిసింది చెపుతాను అంతే సరే అదే చెప్పు ,  "ఒక  పమ్జరమును తయారుచేసి దానిలో చిలకను ఉంచటం ఆశ్చర్యము కాదు కానీ పెద్దదిగా ఉన్న మూతలేని పంజరంలో చిలక ఉంచితే అది ఎగిరాకుండా ఉండటమే ఆశ్చర్యం అన్నాడు "  నువ్వు చెప్పింది ఖచ్చితమే అయినా మానవసరీరములొ " నేను " అనే చిలక అలాగా ఉంటుంది నవరంద్రాలు ఉన్న బయటికి పోయే గుణమున్న అది బయటకు పోలేదు, అదే ఆశ్చర్యకరమ్,  అత్యంత ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే ప్రాణము ఎప్పుడు ఉంటుందో , ఎప్పుడు పోతుందో ఎవ్వరూ చెప్పలేరు.

భారత పౌరుడుగా నేను అనే " ఆధార్ " ఉంటే ప్రభుత్వమువారికి సలహాలు ఇవ్వవచ్చు, ప్రజలకు సెవచేయవచ్చు ఎక్కడకు పోయినా నేను భారతీయుడని, తెలుగు వాడ్ని అని  సగర్వగా చెప్పు కొనవచ్చు అన్నాడు భజ గోవిందం.   మీ రిద్దరు మాటల్లో దిగితె కాలమే తెలియదు ఇదిగో "టి " త్రాగండి అన్న మాటలకు ఇద్దరు అందుకొన్నారు " చాలా బాగా ఉన్నది చెల్లి "టి" నాకు పనుంది. వెల్లొస్తాను అంటు బయటకు వచ్చే సాడు సుబ్బారావు.

ఈ సోది స్నేహితుడు ఎక్కడ దొరికాడు అని భార్య అడిగింది భజగోవిమ్దమును.

ఎమిలెదే ఆకలేసింది పెళ్ళాం ఇంట్లో లేదు అందుకనే వచ్చాడు రోజు వస్తున్నాడా ఏమిటి

"రోజూ వస్తే మాత్రము నేను టిఫిన్ చేస్తానా ఏమిటి "అని భార్య లోపలకు వెళ్ళింది.    
          
పేపరు తీసుకొని పడక కుర్చీలొ పడుకొని చదువుతున్నాడు భజగోవిందం

అంతలో బయట ఇంత అన్నం ఉంటే పెట్టమ్మ అన్న మాటలకు " భారతి " ఇంట్లో ఉన్న వేడి వేడి చెపాతీలు పెట్టడానికి తీసుకెల్తున్నది.

:"ఎప్పుడు లేంది బిచ్చగాడికి దానం చెస్తున్నావెంటి" ? ఆశ్చర్యముగా అడిగాడు భర్త

ఆ ఏమిలేదు "వచ్చే జన్మలో మంచి భర్త లభిస్తాడని ",  దీవిమ్చాడు బిచ్చగాడు  మీరు  చెప్పినమాట వింటాడని ఆ .........  అంటు నవ్వుతూచెప్పిమ్ది భారతి.

ఏమే ఇప్పుడు నీకు మంచి భర్తను కాదె అది మీకే తెలియాలి అంటు ఇంట్లోకి పొఇమ్ది "ఆడవాళ్ళ మాటలకు అర్ధాలే వేరు "  ఆడవాళ్ళ కోరికలను, మాటలను  ఆ బ్రహ్మ దెవుడు కుడా అర్ధం చేసుకోలేడు.


పండుగ కాదు, ఎవరూ పిలువలేదు, లేడికి లేచిందే ప్రయానమన్నట్లు ఇపుడు పోవుట అవసరమా అక్కడికి.  అన్ని మీకు విడమరచి చెప్పాలి మా పుట్టింటిలొ ఉన్నప్పుడు ఫోటోలు దిగాము కదా అవి పోస్టులో వచ్చాయో కనుకొని మా అమ్మ నాన్నలు చూసి ఇక్క డున్నట్లుగా వచ్చేస్తా.

నేను లేను గదా అని ఎక్కడపడితే అక్కడ తిని తిరగోద్దు, ముందు డాక్టర్ వద్దకు పోఇ చూపిమ్చుకొండి. నేను కుడా అక్కడకు వస్తాను ఇద్దరం కలసి మల్లి తిరిగోద్దము అన్నాడు భజగోవిందం  బారతితొ " మావారు ఎంత మంచివారో " అంటు బయలు దేరింది.

డాక్టర్ కలిసాడు బజగోవిందం
డాక్టర్ : ఏమిటిసార్ ఎప్పుడొచ్చినా "బి. పి." చాలా ఎక్కువ ఉండేది ఇవ్వాళ నార్మల్ గా ఉందేమిటి "అంటే నా మందులు బాగా పని చేస్తున్నాయన్న మాట ".
భజగోవిందం:  మీ మందుల వళ్ళ కాదు మా ఆవిడా ఇప్పుడు ఇక్కడ లేదుగా పుట్టింటికి పొఇమ్ది. అదీ సంగతి.
డాక్టర్ : ఎమన్నా స్పెషల్ ఉన్నదా
భజగోవిందం: ఎ స్పెషల్ లేదు వెళ్ళింది ఆధార కార్డు కోసం "మీకు ఎమన్నా ఫీజు వస్తుందేమోనని కలలు కనవద్దు "
డాక్టర్ : ఆ ....................
భజగోవిందం: నర్సు డాక్టర్ గారికి:"బి.పి. " పెరిగి నట్లుంది  ఒక్కసారి చూడు. అమ్తూ ఇంటిదారి పట్టాడు భజగోవిందం

" అదేమిటమ్మాయి అప్పుడే వచ్చేశావు అల్లుడుగారు నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూస్తానని మాట ఇచ్చారుగా " కంగారుగా అడిగింది. భారతి తల్లి పార్వతమ్మ.
ఆ పువ్వులు కొనటానికి డబ్బులు తెమ్మని పమ్పిమ్చాడను కుంటున్నావమ్మ అదేమ కాదమ్మా నన్ను పువ్వుల మీద నడిపిస్తున్నాడు మా అయన కాలు కుడా క్రింద పెట్ట నివ్వటలెదు.
నేను ఆధార్ కార్డు కోసం వచ్చాను 

నాన్న బాగున్నావా ఆ బాగున్నాను అల్లుడుగారు కూడా వస్తే బాగుండును కదా వెనుక వస్తానన్నారు నాన్న. ఎప్పుడు బయలు దెరావొ ఏమో కాస్త ఏమ్గిలిపడు అంటు, నేను పోస్టాఫిసు వద్దకు పోయి వస్తాను తలుపులు వేసుకోండి, అమ్ట్ బయటకు నడిచాడు.

ఇక్కడ భజగోవిందం పడక కుర్చీలొ పడుకొని  కలలు కంటున్నాడు.  


యమదూతలు కలలో ఈ భూలోకం చాలా మారి పోయింది చని పొఐనవారిని గుర్తించటం చాలా కష్టమవుతుంది అన్నారు యమభటులు, అందులో ఒకడు అంత కష్ట పడ నవసరము లెదు ఇప్పుడు ప్రతిఒక్కరికి అదార్ కార్డు  ఉంది  దాని పట్టి గుర్తించవచ్చు.

మనకార్డులు అవి ఒక్కటే అని గుర్తించేవారు ఒకరుఉండాలి కదా ఐతే ఆ భజగొవిమ్దాన్ని సాక్షిగా పెట్టుకుందాం

భజగొవిమ్దాన్ని కలిసారు అప్పుడు మరి నాకేంటి అనిచెఇ చాపాడు భజగోవిందం చనిపొఇన కుటుంబ సభ్యులు మిత్రులు ఏమనుకుంటున్నారో అదే నెరవెరుస్తామ్ అని వాగ్దానము చేసినారు.యమదూతలు
చని పొఇనవారు  5 గురు డాక్టర్ 2.లాయర్ 3.డ్రైవర్ 4. టిచర్ 5. మంత్రి అందరిని  గుర్తించాడు భజగోవిందం  

ప్రజలందరూ డాక్టర్ను చూసి "మంచి డాక్టర్ చనిపోయాడు ఎమ్దరికి ప్రానదానము చేసి చనిపోయాడో అని అనుకోవాలి అన్నడు " యమ భటులు తధాస్తు
ప్రజలందరూ లాయరు ను చూసి డబ్బు తీసుకో కుండ కేసులు వాదించి గెలిచాడని అమ్దరూ అనుకోవాలి
 అన్నడు " యమ భటులు తధాస్తు
ప్రజలందరూ డ్రైవర్ని యితడు త్రాగాడు ఎప్రాణి మీద కారు పొనీయలేదు, అమ్మాయల వెంట తిరిగే  వాడు కాదు అను కోవాలి  యమ భటులు తధాస్తు
ప్రజలందరూ నా అంత కోప్ప టిచర్ లేడని, ఎందరో భవిషత్ తీర్చిదిద్దారని  గొప్పగా చెప్పు కొవాలి అన్నాడు  యమ భటులు తధాస్తు
నేను ప్రధాన మంత్రి  అవుదామని కున్న కనీసమ్ నాపిల్లవాడి కోరిక తీర్చమ్ది అని యమభటులను  కోరాడు  ఆటే ఆపిల్లవాడు ఏది అడిగితె అది తీర్చి మేము పోతాము దీనికి ఈ భజగోవిందం స్సాక్షి అన్నారు అట్లాగే             

" నాన్న అప్పుడే చనిపోయావా నా మనవాడి పెళ్లి చూస్తావనుకున్నాను అన్నాడు "

ఎంత పని చేశావయ్యా నిన్నుభూలొకానికి పంపిస్తున్నాము ఈ మంత్రిగారు ఫోటో తప్పు వేసారు ఆధార కార్డు నందు అని చెప్పెదము అన్నారు భజగోవిమ్దమ్తొ చెప్పి వెళ్లారు, వె రే ప్రాణిని తీసుకొని వెళ్తాము అన్నారు. 

అప్పుడు భజగోవిందం అదార్ కార్డు ఒక ప్రాణిని రక్షించింది అన్నాడు  


అంతలో ఒక్కసారిగా తలుపు చప్పుడు వినబడింది వెంటనే లేచి  తలుపు తీసాడు, ఏమిటండి పగలు కూదా నిద్రపోతున్నార ఏమిటి ? కలలు కంటున్నార ఏమిటి ?

అవునే యమభటులు మధ్యవర్తిగా నన్నుమ్చారు వారికి నేను న్యాయం చేసాను నీకు తెలుసా, కొయ కండి కోతలు ఇదిగో మన ఇద్దరి అదార్ కార్డుస్ అంటు చేతిలో పెట్టింది భారతి.

అపుడే సోది సుబ్బారావు అడుగు పెట్టాడు చెల్లెమ్మ బాగున్నావా అన్నాడు.

అంతలో భారతి మీకు కాఫీ పెట్టి తీసుకొస్తాను మాట్లాడుకుంటూ ఉండండి అన్నది.

చూడు సుబ్బారావు ఈ ప్రభుత్వము వారు చాలా కార్డుస్సు పెడుతున్నారు  నీకు తెలుసా      

నాకెందుకు తెల్వదు చిన్నప్పడ్నిమ్చి నేను చూస్తునె ఉన్నాను.

మొదట పోష్ట కార్డులో ఉత్తరము వ్రాయమన్నారు, ఇప్పుడు మెయిల్ చెయ్య మంటున్నారు.

నెంబరింగ్ కార్డు ఉండేది, అది చట్ట విరుద్దమన్నారు ఆవి తీసి వేసారు, మరి ఇప్పుడు "ప్లైన్ కార్ద్సు ఆడుతున్నవారిని, వీదియొ గేమ్సు ఆడుతున్నవారిని ప్రొస్చ హిమ్చుతున్నారు.       

పిల్లలకు ప్రోగ్రస్ కార్డు ఇచ్చేవారు కాని ఇప్పుడు, పుస్తకములో  నూటికి తొంభైతొమ్మిది మార్కులు వేసి
గ్రేడ్ వన్ అని చెపుతున్నారు.

బస్సు ప్రయాణములో కూడా రాఇతీలు ఇస్తున్నారు, స్టూడెంట్స్ పాస్, క్యాట్ కార్డ్ ఇమ్కానెకమైనవి కల్పిస్తున్నారు

అలాగే రైల్వే వారుకూడా  కొందరికి రాఇతీలు ఇస్తున్నారు ఉద్యోగులకు మన్త్లీ పాస్ ఇస్తున్నారు.

ఇంకం  టాక్సు వారు పాన్ కార్డుఖచ్చితముగా అమ్దరూ తీసుకొవాలని నిర్ణయం చేసారు
 
బ్యాంకుకు పోకుండా ఎ. టి. యం.కార్డు ద్వారా డబ్బు తీసుకొవ్తనికివీలు కల్పిస్తున్నారు.

అట్లాగే ఆదార్ కార్డు అనేది భారతదేశం మొత్తం మీద అమలు చేయుటకు ప్రయత్నమూ జరుపుతున్నారు దాని వళ్ళ వాల్ ఉపయోగాలు చాల ఉంటాయని అమ్దరూ చెపుతున్నారు.

ఉద్యోగస్తులకు హెల్త్ కార్డు కు ఆధార కార్డు ఖఛితమని వాదిమ్చుతున్నారు.            

ఇలా చెప్పుకు పొతూ ఉంటే ప్రజల ఉపయోగము కన్నా నాయకుల ఉపయ్యోగము ఎక్కువ కనిపిస్తుంది అన్నాడు సుబ్బారావు

చాలా తెలుసుకున్నావె సుబ్బారావు అన్నాడు భజగోవిందం

నేనొకటే చెపుతున్నాను సుబ్బారావు   


మన ఆలోచన ధోరణే ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంచుతుంది
ఆలోచనలను మార్చుకుంటే ప్రపంచాన్ని మార్చి సక్రమముగా ఉంచవచ్చు
వ్యర్ధాల్లొచనలవళ్ళ  వచ్చును అనర్ధం, చేయగల పని గూర్చి మాత్రమె ఆలోచించు
ప్రభుత్వమువారు చేసే పనులన్నీ మన దాకా రావటము లేదు అనే బదులు, మనం ప్రభుత్వమువారికి ఏమి సహాయము చేస్తున్నాము, తోటివారికి ఎంత సహాయపడుతున్నాము అని,  ఒక్కసారి గుమ్దెమీద చెయ్ వేసుకొని కాలంతో పాటు మంచిని పంచి, దుర్మార్గాన్ని అరికట్టి ము0దుకు సాగాలి

సంకల్ప్ బలం ఉన్నవాడికి ఎ కార్డ్సు ఆపలేవు

సుఘమ్ద పరిమళాలు  వెదజల్లు పుష్ప శుద్ధి 
ఇంట్లో పోపు  గుబాళిమ్చు పాక శుద్ధి
చిమ్తలన్నియు బాపు చిత్త  శుద్ధి
కష్టములన్నియు తీరు కార్య శుద్ధి

ఈ కధ కేవలము కల్పితము ఎవరిని ఉద్దేసించి వ్రాసినది కాదు కేవలము ప్రకృతిలో జరిగిన సంఘటనలను ఆధారముగా వ్రాయుట జరిగినది                             

                     

10, జనవరి 2014, శుక్రవారం

103. Comedy Love Story -7 ( రాధ-కృష్ణ )

                                                     
    


రాధ-కృష్ణ 

శంకర్ శాస్త్రి గారు రాధ-కృష్ణ పురంలో ఉన్న రాధ-కృష్ణ మందిరములో లో నిత్య పూజలు చేయుటకు వచ్చి అక్కడె స్తిరపడినారు.
భక్తులకు మంచి చెడ్డ విషయాలు, మంచిరోజులు గురించి చెప్పేవారు. అవూరిలొ పెళ్లి కానీ, ఉపనయనాలు గాని, గ్రుహప్రవేశములు కాని, సత్యనారాయణవ్రతముకు గాని, ప్రతివిషయములో అవూరి ప్రజలకు తనవంతు సహాయము చేస్తూ ఉండేవాడు, భార్య పార్వతమ్మ కూడా భర్తకు తగ్గ ఇల్లాలు. ఎక్కడ ఎవరు పురిటి నేప్పులతో భాదపడ్డ వారికి సహాయముగా వెల్తూ ఉండేది.

ఆ పుణ్య దంపతులకు లేక లేక ఒక ఆడపిల్ల "9వ నెలలో" పుట్టడం జరిగింది."రాధా" అని పేరు పెట్టినారు. పుట్టినప్పుటి నుండి  అనారోగ్యముగా ఉండేది. అయి నప్పటికి ఆ పాపను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. ఎదుగుతున్న కొద్ది  సన్నగా పొడుగ్గా మారటం జరుగుతున్నది.

"16 సం!!లకే ఆ వూరిలొ అత్యంత పొడుగుగల అనగా 6.5 పొడవుగల అమ్మాయిగా అమ్దరూ గుర్తించారు. తండ్రితోపాటు వేదవిద్య నేర్చుకున్నది, తెలుగు సంస్కృతము కూడా నేర్చుకున్నది. తండ్రితోపాటు రోజు గుడికి పోయి దేవునికి సేవలు చేస్తున్నది.

మసక చీకటిలొ " రాధ "  ఒక స్తంభంలా ఉంటుంది, గడకు చుట్టిన దారపు పోగుల ఉంటాయి ఆమె వంటిపై బట్టలు, పొడుగాటి జడకుప్పెలు పెట్టుకొని నడుస్తుంటే కుర్రకారుకు మతి పోతుంది, కడు చక్కని రంగు ఉన్న, అందమైన మోముగల పొడగరి.

ఆకతాయి కుర్రాళ్ళు అంటారు ఆమెను రబ్బరు బొమ్మ అని, అరటి ఊచ కాళ్ళు గల  కొండపల్లి బొమ్మ అని, చీన్న పిల్లలు ఎగతాలితో అంటారు తాటాకు బొమ్మ అని,  అందరు అన్న మాటలు పట్టిమ్చు కోకుమ్డా నవ్వుతూ పలకరిస్తూ ముందుకు సాగుతుంది.

ఒకసారి గొడుగెసుకొని నడుస్తుంటే గాలి వచ్చి చుట్టేసింది, గాలిలో గొడుగు తో  పాటు ఎగురుతూ చెట్టుకు ఇరు క్కున్నది " రాధ ", చెట్టుపై ఉన్న పామును చూసి కెవ్వుమని అరుస్తూ గాలిలో తెలుతూ క్రింద వున్న కోళ్ళ బుట్టపై పడింది. కోళ్ళన్నీ  ఒక్కసారి పైకి ఎగిరి పారి పోయినాయి. వాటిని పట్టు కోవటానికి చాలా ప్రయత్నిం చింది రాధ.

అంతలో కోళ్ళ మనిషి వచ్చి చాడమ్మాయి అన్నం తినుటం లేదా పూచిక పుల్లలాగున్నావు, రోజూ పాలు, వెన్న తో అన్నం తింటే లావుగా మారుతావు, గడ్డి తిని కుడితి త్రాగే ఆవులాగా నిగనిగ లాడుతావు, బలం రావటానికి మంచి మందు తీసుకొమ్మాయి అన్నాడు.

అన్నం తినడం తగ్గించి పాలు త్రగాడం, వెన్నతో చేసిన రొట్టెలు తినడం మెదల పెట్టింది, మరియు ఆయుర్వేదము లో చెప్పినట్లు క్యారేట్సు చిన్నగా తరిగి పాలతో ఉడికించి ప్రతిరోజూ అల్పాహారముగా తీసుకుంటుంది దీనివల్ల గుండె శక్తి వంతముగా తయారవుతుందని, రక్తహీనత సమస్య కూడా  తగ్గుతుందని రోజూ తీసు కుంటున్నది. వేళ తప్పి తినటం వళ్ళ నాలుగు రోజులు తిరగకుండా అజీర్తి రోగం వచ్చింది. వాంతులు, విరోచనాలు వచ్చి మరీ సన్న బడింది, లేవలేని పరిస్తితి ఏర్పడింది.

కూతుర్ని పార్వతమ్మగారు అరిచి ఏది పడితే అది తింటే రోగం రాక మరోమోస్తుంది. సన్నగా ఉన్నవారు బ్రతుకట లేదా,  వయస్సు పెరిగిన కొద్ది లావుగా మారుతారు, దాని గురించి దిగులు పెట్టుకొని అన్నం తినటం మానకు వేలకు మందులు వేసుకో, దేవాలయమునకు పోయి దేవున్నీ ప్రార్ధించు అన్నది కన్నతల్లి.


యోగాబ్యాసము చేస్తే వళ్ళు వస్తుందని అందరూ  అంటారు,  నీవుకూడా  ప్రయత్నించు అన్నది కన్న ప్రేమ. తల్లి మాట ననుసరించి బయట నేర్చుకొనే బదులు పుస్తకము చూసి యోగాసనాలు వేయటం మొదలు పెట్టింది. అలాగే పద్మాసనం వేసి, శీర్షా శనమ్ వేయటం ప్రాక్టీసు చేసింది, కాని ఒక రోజు శీర్శాసనమ్ వేస్తున్నప్పుడు దభీమని క్రింద పడింది. తలకు దెబ్బ తగిలింది.

హాస్పటల్ కు తీసుకెల్లి కట్టు కట్టించింది కన్నప్రేమ, వెంట ఉండి సకల ఉపచారములు చేసింది పుత్రిక పై ప్రేమతో , మందులు వాడి మరలా ఒక మనిషిగా మార్చింది డాక్టర్ ప్రేమ, అమ్మా నీరసంగా అడిగింది, నేను ఇంతేనా అమ్మ సన్నగా ఉండాల్సిందేనా అన్న మాటలకు కళ్ళు చెమ్మగిల్లే తల్లికి, కన్నీరు కార్చుట తప్ప గొంతు మూగ బొయింది బంగారు తల్లికి, ఏనాడు చేసిన పాపమొ నిన్ను నన్ను వేధిస్తున్నది, ప్రతి జన్మకు ఒక ఉపయోగ మున్నది. ఆ ఉపయోగము తెలుసు కొవటములోనే  ఉంది మానవుని గొప్పతనము.

ఒక రోజు తన స్నేహితురాల పెళ్ళికి వెళ్దామని అనుకున్నది, పైగా ఉల్లిపొరలాంటి నెట్ జార్జేట్ చీర మీద రిచ్చిగా   ఎంబ్రాయిడరి ఉన్న దానిని తీసుకొని కట్టుకున్నది, కొంగును మూడు నాలుగు స్టెప్పులుగా  మడచి పిన్ను పెట్ట కుండా పమిటను వంటి పొరమీద వేసుకొని బయలు దేరుతున్నది. ఆ చీరలొ పూసలు, క్రిస్టల్స్, బంగారపు తీగతో పూలు ఉన్న ఏమ్బ్రాయిడరీ ఉండుట వల్ల, అందమైన రూపములొ ఉన్న పొడగరి కావటము వల్ల, అందాలను విరజిమ్మే పువ్వుల తయారైంది రాధా.

ప్రక్క గ్రామానికి పోవాల్సివచ్చి బస్సు ఎక్కవలసి వచ్చింది, జనం బాగా ఉండుట వల్ల నుంచో వలసి వచ్చింది. అందరూ రాధను చూస్తున్నారే తప్ప ఒక్కరు కూర్చొమని చెప్పలేదు, బస్సు బ్రేక్ వెయటమువల్ల ముందున్న నవయవ్వన యువకుని వళ్ళో పడింది రాధ, అంతే ప్రక్కనున్న లావుగాఉన్న యువతి పట్టుకొని తనతొడపై కూర్చొ పెట్టుకున్నది, నెమ్మదిగా అందముగా ఉన్నావు మరీ ఇంత సన్నగా ఉన్నావు, ఏమైనా తింటున్నావా లేదా, చూడు నేనంత లావుగాఉన్నానో అంటుంటే అందరూ ఒక్కటే నవ్వలే నవ్వులు.

పెళ్లి నుంచి తిరిగోచ్చాకా తల్లి దిష్టి తీసింది, అందరి కల్లు మా అమ్మాయి పైనే అంటు  ఎర్ర నీళ్ళు త్రిప్పి పార బోసింది. అమ్మ నేను కాసేపు పార్కుదాకా పోయోస్తాను అంటుంటే ఆ చీర మార్చుకొనే వేరేదేదైనా  వేసుకొని వెళ్ళు అన్న మాటలకు సరే నని వేరేది మార్చికొని పార్కుకు వెళ్లి ఒక చెట్టు క్రింద ఉన్న బెంచి పై కూర్చుంది .

అంతలో ఒక స్కూలు బస్సు వచ్చి ఆగింది అందులో  విద్యార్ధులు "5 సంవత్చరాల లోపు పిల్లలు చూచుటకు చాలా ముచ్చటగా ఉన్నారు, స్కూలు డ్రస్సు వేసుకొని కోటు వేసుకొని ఉన్నారు, ఎర్రటి జుట్టు తెల్లని మోహము గల పిల్లవాడ్ని దగ్గరకు పిలిచి లేచి నవ్వుతూ  నుమ్చో నుంది, అందులో ఆ సమయమునా చిన్న గౌను వేసుకోవడం  పిల్లవాడు రావడం గౌను పైకి ఎత్తి చూడటం, వచ్చిన వారందరూ ఒక్కటే నవడమ్ క్షణంలో జరిగి పోయినది .

" రాధ సిగ్గుతో తలవమ్చుకొవడమే తప్ప ఏమి చేయలేక పోయింది" నెమ్మదిగా ఇంటికి చేరింది.

ఇంటి ప్రక్కనున్న దేవాలయము నుండి  మైకు వినబడుతుంది " ఈ పవిత్రమైనటువంటి దేహమును సనాతను డై న దేవునకు, నూతనమైన మందిరముగా నిర్మించుకోవాలి, కనుక మీ మనస్సుతోపాటు దేహమును, దేహముతో పాటు మనస్సును, పవిత్రము, పరిశుద్ధము కావించి కొని, మార్గ దర్శకమైన అనుభూతిని అందు కోవటానికి మీరు పూనుకొవాలి".

గతం గతం గతమును మరచి పోవాలి ( "Past is Past, For get the Past )పవిత్రమైన పురుష తత్వాన్ని, స్త్రీ తత్వాన్ని అర్ధం చేసుకొండి, పవిత్ర హృదయముతోనే ముందుకు సాగిపోండి వెనుక ఎవరుఎమన్న పట్టిమ్చు కోకుండా  గమ్యాన్ని చేరుటకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలి అట్టివారికి దేవుడు వెన్నంటి ఉంటాడని అందరి నమ్మకము.

"సంకల్పమే సగం బలము, ఆచరణె మొత్తం బలం అదే నమ్మకం "

ఆ సమయానే తల్లి దగ్గరకు చేరి నేను బాంబు స్టిక్ డాన్సు నేర్చు కుంటాను, నలుగురిని నవ్వించే మిమిక్రీ నేర్చుకుంటాను, పరుగెత్తే పందాలలో పాల్గొంటాను, లాంగ్  జంపు,  పోల్ జంపులో  పాల్గొంటాను అన్న మాటలకు పార్వతమ్మ  నీమాటను ఎప్పుడు కాదన్నాను తల్లి నీకు ఏది ఇష్టమైతే అదే చెయ్.
                
పట్టుదలతో అన్నివిద్యలు నేర్చుకుమ్టున్నది, ఎవరు ఏ మన్న పట్టిమ్చు కోకుండా నవ్వుతూ పలకరిస్తుంది , కలతలు కష్టాలు మరచి పోయి సంతోషముగా ఉన్నది. ఆనందం పెరిగింది, భారత ప్రభుత్వమువారి ప్రోత్చాహము పెరిగింది, మంచి శిక్షణ ఇచ్చే నిపుణుడు దొరికాడు గ్రామీణ  పొటీలలో, జిల్లా పోటీలలో, ప్రధమ స్థానములో రావటము వల్ల నేషనల్ గేమ్శులో కూడా పాల్గొన్నది రాధ.

నేషనల్ గేమ్శు లో :"పరుగు పందెములో" , "లాంగ్ జమ్పులో" ," పోల్ జమ్పులో" , ప్రధమ స్థానములో  వచ్చి గోల్డ్ మెడల్సు సంపాదించింది.  వలంపిక్ గేమ్సులొ పాల్గొనుటకు అనుమతికూడా లభించింది రాధ కృష్ణ పురంలో ఉన్న రాధకు.
రాధ-కృష్ణ  పార్ట్ -5
ఒకరోజు సాయ్యంత్రం వేళ ఇంటి బల్కనీలో నిలుచుంది  రాధ, ఎదుటి ఇంటిలో అందమైన లావుగా, బొద్దుగా, పొడుగ్గా,నల్లగా,   బలంగా ఉన్న యువకుడ్ని చూసి ఒళ్లంతా కల్లుచేసుకొని ఆశ్చర్యంగా చూసింది రాధ.

అదే సమయాన రాధను కన్నులలో రెప్ప మార్చ కుండా  తదేక దృష్టితో, తన్మయత్వముతో, చూశాడు "కృష్ణ" , భువినుంచి దిగివచ్చిన దివ్య సుందరి అతిలోక సుందరి శ్రీ దేవి లాగుంది, పెళ్లి చేసుకుంటే  ఈమెనే  చేసుకోవాలని నిశ్చ ఇంచు కున్నాడు.

ఎదురింటి వారు రాధ తల్లి తండ్రుల వద్దకు వచ్చి మా అబ్బాయి మీ అమ్మాయి వివాహము చేసుకోవాలని పంతం పట్టుకొని కూర్చున్నాడు, మాకు చాల ఆస్తి ఉంది ఒక్కడే కొడుకు, కట్న కానులేమీవద్దు, పెళ్లి కూడా దేవుని సన్నిధిలో చేస్తే చాలు అన్న మాటలకు " శంకర శాస్త్రిగారు, పార్వతమ్మగారు ఆ దేవుడు కల్పించిన పెళ్లి మాకు సంతోషముు శుభలగ్నం చూసి పిల్లల పెళ్లి చేద్దాం "

నెలతిరక్క ముందే " రాధాకృష్ణల వాహము జరిగింది.

రాధ మొదటి రాత్రి భర్తను అడిగింది నేను ఇంత సన్నగా ఉన్నాను గదా నాలో ఏమి చూసి ప్రేమించావు " నాకు నీలొ పట్టు దల కనిపించింది " అందులో అంద గత్తెవు, నేనేమో నల్లని " కృష్ణ ను " యాడాది తిరుగక ముందే రాధ లావుగా మారింది , కృష్ణ సన్నగా మారాడు " రాధాకృష్ణల కీర్తనలు చేసుకుంటూ హాయిగా కాలం గడిపారు ".

ఏమిటే రాధా పగటి కలలు కంటున్నావు అప్పుడే కృష్ణుడితో పెళ్లి అయి కాపురం చేసి నట్లు లావుగా మారినట్లు కలలు కనుచున్నావా. 
అవునమ్మా నాకు కల వచ్చింది ఇంటిఎదురు అబ్బాయి కృష్ణతో పెళ్లైనట్లు. మన ఇంటి ఎదురు ప్లేక్గ్రౌండే  ఇళ్లే లేదుకదా అవును ఇది కలే అవును, ఇది కలే.
                                                            సమాప్తము                                                      

102. *Comedy Love Story-6 ( పూజా ఫలం )

                                                                  పూజా ఫలం                                                                            మోహేశుడు ఆరడుగుల అందగాడు, మాటలతో మనుష్యు లను మభ్య పెట్టి మనసును దోచే మహావీరుడు, స్త్రీలను చూసి వలలో వేసుకోవాలనే తాపత్రయం  గలవాడు, అట్టి మోహేశుకు అందము తక్కువ వున్న వయస్సు లో వున్న ఓ అమ్మాయితో పరిచయ మైనది. ఇద్దరి అభి ప్రాయాలు  కలసినవి, మాట మాట కలసి  పరిణయము నకు  సిద్ధమైనారు.


తక్కువరంగు, తక్కువ చదువు, చురికైన యవ్వనవతి, అదృష్టం కొద్ది పెళ్ళికి సిద్ధమైన రూపవతి, స్నేహితు లందరికీ  తను ప్రేమించిన మోహేశును చూపి నా అంత అదృష్ట వంతురాలు లేదు అని గర్వంగా  అందరికి చెప్పు కుంది.ఒక శుభముహుర్తాన పెద్దల సమక్షమున ప్రభ మోహేశుకు వివాహము జరిగింది. పెద్దలు ప్రతి ఒక్కరూ నూతన వధూ వరులను ఆశీర్వదిమ్చి పెళ్లి భోజనాలతో సంతోషపడి పసందైన జంట అంటు, అందులో అబ్బాయి చాలా బాగున్నాడు అమ్మాయి కన్నా అని కొందరు అనటం కూడా జరిగింది. మొత్తము మీద వివాహ వేడుకల ఘనముగా జరిగినవి.పెళ్లికి వచ్చిన ఆడవారు అందమైన భర్త వచ్చాడని ప్రభను ఆట పట్టించారు. నవ్వులాటగా మోహేశుతో మా ఇంటికి  రండి, మీ అందానికి లొంగి పోతానని అన్నది ఒక పడచు, మావారు లేనప్పుడు రండి మనసంతా రంగరిచి, పంచాలని వుంది అని మరొక పడచు, ఓ అందగాడా మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయి అన్న పడచుల మాటలు అన్నీ విన్న"ప్రభ" ఇక చాల్లే మీ మాటలు మా ఆయనను ఆట పట్టించు చున్నారు నాకు కోపమొస్తుంది అన్నది ప్రభ.స్నేహితులమాటలకు తన భర్తను లొంగ దీసుకుంటారని భయ మేర్పడినది,  ప్రతి ఆడదాని చూపు మావారిపై పడితే  మావారు మారితే నా గతెం కావాలి, ఆడవాళ్ళ మాటలకు భయపడి తన కాపురాన్ని పాడు చేసుకొనే మూర్ఖురాలను నేను కాను, నా భర్తను నా చెప్పు చేతలలోకి తీసుకుంటాను.మోహేశు అన్నాడు  అసూయ నీలో పెరిగింది " ప్రభ " అది తొలగించు, అనుమానం రానీయక మనస్సును బిగించు,  పరుల మాటలు విని పరవశాన్ని పాడు చేసుకోకు, మనువాడిన వాడ్ని ఉడికించి కౌగిట్లో భందించు ఆ మాటలకు సిగ్గుతో తల వంచింది ప్రభ.              పున్నమి రాత్రికి ఏకాంతము కుదిరింది, తన్మయత్వముతో తనువూ తనువూ కలసి యవ్వన ఫలితము పొందే సమయము వచ్చింది, వెన్నెలలలో అందం వికసించి, ముద్దులలలో మునిగి పారవశ్యముతో మనసు మనసు కలసి అనుకోని ఆనందాన్ని పంచుకొని,  జన్మ జన్మల భంధముగా భావించి సుఖాల అంచులలో తేలి నిద్రలో మునిగి పోయారు నవ దంపతులు.ఒక రోజు ప్రభ మొహేశు ఇద్దరుకలసి బస్సులో ప్రయాణము చేస్తున్నారు ఆ బస్సులో మోహేశు యొక్క కాలేజీలో  చదివిన విద్యార్ధులు ఉన్నారు.మోహేశుపెళ్లి చేసుకోన్నావుటా,  మమ్మల్ని వదిలించుకొని ఎ అమ్మాయి బుట్టలో పడ్డావు, చదువుకొనే టప్పుడు ప్రేమకోసం మా వెంట పడ్డావు, మాకు పెళ్లి అయిందని తెలిసి తొకముడిచావు, ఇప్పుడు నీకు కూడ పెళ్ళైమ్దిగా మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు.అమెమాటలకు ప్రభకు బాగా కోపం వచ్చింది. ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడు తున్నావు, ఆ ఏమిలేదు మీరు కోపగించు కోకండి సరదాగా మాట్లాడాను అంతే. 

ఇది లక్జరి బస్సు ముగ్గురు కూర్చొవాలి కొద్దిగా జరగండి, ఇదేమీ  ఇల్లు కాదు అన్న మాటలకు ప్రభ జరిగింది. కూర్చుంటునే " హలో మోహేశ్ నువ్వా నేను గుర్తుపట్టలేదు చాలా మారిపోయావు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు మమ్మల్ని పిలిచేది లేదా మరచిపోతే  ఎట్లా మీ కాలెజీ గరల్సను మరచి పోకోడదు, ఇంతకు మాకు స్పెషల్ పార్టీ  ఎప్పుడిస్తావు, అంటు మోహేశ్ చేయి పట్టుకొని నడుందాకా లాగటం గమనించింది ప్రభ, అంతలో ఏమిటి ఇది ఎవరైనా చూస్తారు అంటు చేయి లాక్కొని ,ముందు  ప్రక్కకు జరుగు అని గట్టిగా అరిచాడు మోహేశ్ అందరూ ఎదో జరిగిందని చూస్తున్నారు.అంతే బస్ స్టాపులో గబగబా దిగింది ప్రభ, వెనకాల మోహేశ్ ఇంటిదాకా నడక ప్రారంభించారు. ఆరోజు పస్తు మరుసటి రోజు యదా ప్రకారముగా కాఫీ త్రాగండి అంటు కాఫీ అందించింది. నేనె తప్పు చేయలేదు నిన్న బస్సులో  " నేనడిగాన" నేనేమి చిన్నపిల్లను కాను అర్ధం చేసు కోగలను. అంటు ప్రక్కన చేరి నాకుమీరు పార్టీ ఇవ్వాలి ఎందుకు మీ వంశాంకురాన్ని మోస్తున్నందుకు, ఇది నిజమా మరి చెప్పవే, ఇంత ఆలస్యముగా చెప్పేది, అందరిని పిలిచి పెద్దపార్టీ ఇస్తాను అంటు ఒక్కసారిపైకి ఎత్తాడు,  మహానుభావా దించు దించు ఒక్కటే నవ్వులు.                              ఏమండి నేనడి గానని ఏమను కోకండి నేను మా అమ్మగారి దగ్గర ఉండి పండంటి మగపిల్లవాడిని కని ఇవ్వాలని  ఉందండి మీరు అనుమతిస్తే ఈ రోజే బయలు దేరుదామను కుంటున్నాను. ఎందుకు అంత తొందర నేను వచ్చి మీ ఇంట్లో దించుతాను. మా అమ్మను నాన్నను చూడాలని ఉంది. మీ ఉద్యోగము సెలవు పెట్టి ఇప్పుడే రా నవసరము లేదు, నేను కబురు చేస్తా మీ సెల్ ఫోన్ మీ జేబులోనే ఉంచు కోండి ఇప్పటికి చాలా ఫోన్స్ పారేశారు.నీ మాటను ఎప్పుడు కాదన్నాను, ఈ రోజే నేను బస్సు ఎక్కించి పంపుతాను. ఈ పైకము చేతి ఖర్చు క్రింద ఉంచు , వేళకు పాలు పండ్లు తీసుకో, నా మనసంతా నీ మీదె ఉంటుంది అని మరువకు, దిగిన వెంటనే ఫోన్చేయి, ఆరోగ్యం జాగర్త అంటు బస్సు కదిలేదాకా ఉండి,  వెను దిరిగాడు మోహేశ్. ఏదో అలోచిస్తూ ఇంటికి చేరాడు.

నిద్రలేస్తూ పాపరు చదివాడు, ఒక్క సారిగా కుప్ప కూలిపొయాడు, పేపరులో బస్సు బెంగులూరు చేరే ముంది గోడకు కొట్టుకొని ఆయిల్టాకర్ పగిలి బస్సు భస్మమైనది,  బస్సులో ఉన్న వారందరూ చనిపోయి నట్లు చదివాడు. ఒకటికి రెండు సార్లు చూసాడు ప్రభ ఎక్కిన బస్సు ఏ నా అనితెలుసుకొని  అంతే  డ్రస్సు మార్చుకొని అద్దె టాక్సీ తీసుకొని యాక్సిడెంటు జరిగిన స్పాటుకు చేరాడు మోహేస్.                         

ఎటు చూసిన చనిపోయిన శెవాలు గుర్తు పట్టలేని విధముగా నల్లగా మాడిపోయి ఉన్నాయ్, టికెట్టు రెసిడెన్సియల్  ప్రూఫ్లు చూపిస్తె శెవాలు అందిస్తామని అక్కడ ఉన్న అధికారులు చెపుతున్నారు. నోటమాట రాలేదు బస్సులో ఉన్నవారి పేర్ల లిష్టులో "ప్రభ" ఉండటం చూసి మరీ ద:ఖం ఆగలేదు. అధికారులను అడిగితె మార్చరీకి పంపాము వచ్చాక మీరు తీసుకొనిపోవచ్చు అనిచెప్పగా కొయ్యగా మారి అట్లాగే నిల్చుమ్డి పోయాడు అప్పుడే జేబులో ఉన్న సెల్ అక్కడే పడి పోయింది.

మొహెశ్ మనసు మనసులో లేదు, నాకే ఎందుకు ఇలా జరిగింది, ఎంతో ప్రేమగా ప్రేమించిన ప్రభ నాకు దూరమైనది. దీనికి కారణము నేనేనా, నేను కూడా ప్రభ తో పొతే ఎంత బాగుండునూ దేవుడున్నాడు మరి నా యందు   దయలేకున్నాడు, కాదు నన్ను పరీక్షిస్తున్నాడు, నాహృదయము చెపుతున్నది నాభార్య కు ఏమీ జరుగలేదు "యిది నిజము"  ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అది తెలుసుకుంటే నాభార్య ఉన్నదని తెలుస్తుంది అంటూ ఆఫీసుకు కూడ పోకుండా అత్తగారికి ఫోన్ చేసిన ఎవ్వరూ తీయక పోవుటవలన చేసేది లేక ఊరుకున్నాడు.


మోహెశ్ కు రోజువారి కార్యక్రమాలు తారుమారైనాయి ఏమి తింటున్నాడో ,  ఏమి చేస్తున్నాడో  ఎవ్వరికి అర్ధం కాక పోవుటవలన ఉన్న ఉద్యోగము పొయినది, ఉన్న ఆప్రాంతము మారినాడు, తన భావాలను కవితలుగా వ్రాసు కుం టున్నాడు.

పరిస్తుతుల చేతుల్లో నలిగి పోయిన నిస్సహాయతవు నీవు
జ్ఞాన భోధ చేసి వద్దు వద్దని భోధించ లేని నిస్సహాయతను నేను
నాకీరోజు గుర్తుకు వస్తుంది మనది వీడలేని భందమన్నావు నీవు
ఆవేశానికి లోనై ఆలోచనలేకుండా నిన్ను ఎన్నో సార్లు తిట్టినానునేను

ఆకలలు నన్ను, మనస్సును, గుచ్చుతూ వెధిస్తున్నాయి
నీ కళ్ళలో అనాడు కలిగిన ఆత్రుత నాకు గుర్తుకొస్తున్నాయి
నానుంచి దూరమైన నీ కళ్ళు నా కాళ్ళలో మెరుస్తున్నాయి               
పోగొట్టుకొన్న హృదయం నాకు దొరికినట్టు అనిపిస్తున్నది

కొన్ని గాయాలు తగ్గినట్లు ఉన్నా,కాని మచ్చ ఎక్కిరిస్తుంది
ఇది కల, నిజమా అని తెలిసే లోపు మాయ కమ్ముకుంటుంది 
పగిలిన అద్దంలో క్షణంలో జీవితము ముగిసి పోతుంది
నీవు వస్తావని నాప్రతిబిమ్బాన్ని చూస్తానని నమ్మకముంది

జీవిత శిఖరాన్ని అందుకోవటానికి నీకోసం వేచి ఉంటా
ఏదైనా అద్బుతము జరిగి మనల్ని కలపాలని ఆశగా ఉంది  
ప్రేమను పొందలేని వ్యక్తి జీవిమ్చుట వ్యర్ధమని నేనంటా
నీ కోర్కలు తీర్చు కోవటానికి వస్తావని నామనసు చెపుతుంది.

ప్రేయసి నీవు వస్తే మల్లి నాకు వెలు గొస్తుంది 
నీకు చేసిన వాగ్దానము నాకు ఇంకా గుర్తుంది      
మనిషి మనిషిగా గుర్తుకు స్త్రీ సహాయము కావాలంది 
మనజీవితము సుఖము చేయాలని దేవుడ్ని కోరాలని ఉంది

రక్తాన్ని మరగిస్తున్నాయి చేసిన బాసలెన్నో 
మీటిన వీణ మరుగాయి అయిన అనురాగాలెన్నో 

వసంతము కరువాయి అయిన కోయిల కూతలెన్నో 
భయము వేమ్బడిస్తుంది అయిన అనుభూతులెన్నో 

చిక్కని చీకట్లో చిక్కి కళ్ళు కాన రాకున్నాను      
మందు టెమ్డలొ మాడి నీడనేది లేకున్నాను
హృదయమే పాషాణముగా మర్చి బ్రతుకుతున్నాను
ఈచీకటి ప్రాణము వెలుగును చూడ లేకుమ్డా ఉన్నది

ఎకాంతము కోసం పొతే వినబడు తుంది గత ధ్వని
చేసిన  తప్పు పదే  పదే గుర్తు  చేస్తుంది ప్రతి ధ్వని
భూమి ఆకాశం ఎప్పుడూ కలవాలని గాలి ధ్వని
తప్పు చేసినవారిలో జ్వలిస్తుంది  శంఖ ధ్వని

గంప క్రింద కోడి అరచి మేలుకో మంది
గొంగళి ప్రక్కకు జరిగింది చలి లేదంది
కొవ్వొత్తి కరిగి వెలుగుని విరజిమ్మిది
ఎండిన చెట్టు వికసించి పూలు కాయలు కాసింది 

మోహేస్ నిరాశ నిస్పృహలో పడి పోయాడు, గడ్డాలు పెంచి పిచ్చోడుగా తిరుగుతున్నాడు, ఎవరు ఏదడిగినా పరద్యానంగా ఉంటున్నాడు, మనస్సుని నిగ్రహించుకొని హనుమంతుని ప్రార్ధించు తున్నాడు.
ఆఫీసు బయట ప్లాట్ ఫాంపై నడుస్తున్నాడు, మంచి హోదాలో ఉండి  దర్జాగా తిరిగేవాడు ఇప్పుడు ఎవ్వరూ గుర్తుపట్టలేని స్తితిలో తిరుగు తున్నాడు, ఆ సమయానా ఎవరో వెనుకనుండి మోహేశ్ అనే పిలుపు విని వెనుతిరిగాడు.

ఎవరవు నీవు అని అడిగాడు మోహేశ్ నన్ను గుర్తు పట్టలేదా నేను మీ పాత అద్దె ఇంటి ప్రక్కవాడిని, ఆ గుర్తుకొచ్చింది బాగున్నావా సుబ్బారావ్ అమ్మయ్య గుర్తుకొచ్చాను దేవుడా నీకు  వంద నమస్కారాలు అంటు మీ ఆవిడ నుండి ఉత్తరాలు వచ్చాయి.

" మా ఆవిడ ఎక్కడుంది ఆత్మగా మారిందిగా, నాలో ఆశలు లేపి అనందం పంచి ఆహుతై పోయి0దిగా , అనురాగం ఆత్మీయత పంచిన "ప్రభ"  ఇక నాకు లేదుగా, ఈ జీవితము ఎ మలుపు తిరుగు తుందో ఎవరూ  చెప్ప లేరుగా "

" నేను అభద్ధం చెప్పటం లేదు, నీవు ఇల్లు మారిన తర్వాత వచ్చాయి ఈ ఉత్తరాలు, నీకు చాలా సార్లు అందించాలని ప్రయత్నించాను చివరకు నాకు ఇక్కడ కనిపించావు, నీకు నమ్మకము లేకపోతే ఈ ఉత్తరాలు చూడు నీకె అర్ధమవుతుంది అంటు చేతిలో పెట్టి వెళ్తూ " పెళ్ళాం మోసం చేసిందేమో,  ప్రేమ పిచ్చోడుగా మారాడు " అంటు వెళ్లి పోయాడు.

 సుబ్బారావు పెట్టిన ఉత్తరాలు గాలిలోకి ఎగిరి పోయాయి, అవి అన్నీ  ఆకాసంలో పావురాలలా మారి చెట్టుపైకి చేరాయి కొన్ని, గడ్డిపై పడ్డాయి కొన్ని,  అక్కడ దగ్గరగా  ఉన్న రామాలయము దగ్గర  మోహేశ్ కూర్చున్నాడు పరద్యానంగా.

" ప్రసాదం అంటు ప్రత్యక్షమయ్యాడు బాల భీముడు, ప్రసాదం గబగబా తింటూ ఉత్తరంలో "ప్రభ" అనే రెండక్షరాలు కనబడగానే కళ్ళు చెమ్మగిల్లాయి, ఈ ఉత్తరం నీకు ఎట్లా వచ్చింది ఎవరు పంపించారు ఈ ప్రసాదమును, అని అడుగగా ఏమో బాబుగారు నాకేం తెలుసు ఆ రామయ్యగారు ప్రసాదం పెట్ట మన్నారు నేను పెట్టాను అంతే,  అన్నాడు బాల భీముడు."

" అంజనేయ నీవు నాతో ఉన్నావయ్య నిన్ను గుర్తించ లేక పోయాను నన్ను క్షమించు తండ్రి "

ఉత్తరం  చదివాడు గబగబా, సర్దాడు బ్యాగును గబగబా, ఎరో డ్రో ముకు పరిగెత్తాడు గబగబా, ప్లేన్ ఎక్కి బెంగులూరు దిగాడు గబగబా, టాక్సీ మాట్లాడుకున్నాడు. చెప్పిన గమ్యానికి చేర్చాడు టాక్సీ వాడు, నెమ్మదిగా నడుస్తూ వెళ్లి అత్తగారి ఇంటి తలుపు గొట్టాడు.

కిటికిలోంచి చూసి "ప్రభ "  ఎవరో గడ్డ మున్న వ్యక్తి తలుపు 
కొడుతున్నాడు అమ్మా తీయవే అన్న మాటలు వినబడుతున్నాయి, తలుపుతీస్తె అల్లుడుగారు మీరా ఎంత మారి పోయారు, లోపలకి రండి లోపలకి రండి, నిదానంగా తడబడు నోటి మాటతో "ప్రభ" ",ప్రభ" ఉన్నదా ..............
ఏమండి ఈ ఆరు నెలల్లో ఇలా చిక్కి పోయారెంటి అంటు వచ్చి గట్టిగ కౌగలిమ్చుకుంది  "ప్రభావతి " ఎంత అందముగా ఉండే వారు ఎట్లా మారిపోయారు, వేలకు తిండి తినమని చెప్పాగా, తినుట లేదా ప్రశ్నల వర్షం కురిపించింది.
"నేను - నీవు"  చేసిన పూజా ఫలం వళ్ళ ఇద్దరం కలవగలిగాము అంటు దగ్గారగా హత్తుకున్నాడు  "మోహేశ్".
అసలు నిన్ను చూస్తాననుకోలేదు. మంచి వారికెప్పుడూ దేవుడు సహాయము చేస్తాడని నాకు నమ్మకము పెరిగింది.
మీరు బస్సు ఎక్కించిన తర్వాత బస్సు కదిలింది. అప్పుడే నాన్న  సెల్ మోగింది.  " అమ్మాయి మేము నీదగ్గరకు వ స్తున్నాము నీవు ఇంట్లో నే ఉన్నావా. నేను బెంగులూర్ బస్సు ఎక్కి పది నిముషాలు అయింది. ఐతే మేము మేడ్చల్ స్టాపు దగ్గర ఉన్నాము . అక్కడ దిగి నీవు ఫోన్ చేయ్,  అక్కడ నుండి మేము కారులో తీసి కెల్తాము అనటం జరిగింది అట్లాగే దిగటం జరిగింది. అక్కడే  ఒక పెళ్లిని చూసుకొని తరువాత బయలు దేరాము అందరం బెంగుళూర్ .
ప్రొద్దున్నే పేపరు చూస్తే  నేను ఎక్కిన బస్సు తగలబడి నట్లు అందరూ  చనిపోయినట్లు తెలుసుకొని చాలా భాదపడినాను,  మిమ్మల్ని కలవాటానికి ఎంతో ప్రయత్నించాను, మానాన్న గారు కూడా మీ ఆఫీసుకు వెళ్లి మీ గురించి సమాచారము అడిగినా తెలియదన్నారు.  నేను ఉట్టి మనిషిని కాదుగదా అని ఇక్కడే ఉండి పోయాను అంతే, అత్తయ్యగారు వచ్చి అంతే జరిగింది , మావయ్యగారుకూడా వచ్చి అన్నారు అంతే జరిగింది . ఇది అంతా ఆ బాల భీముని లీలా , ఎవరండీ ఆ భీముడు పదా చూపిస్తా అంటూ  హనుమంతుని పఠం చూపించాడు మోహేష్  తో పాటు అందరూ నమస్కరించారు అలా ముగిసింది ఈ కధ .
........................................................................................................................................................................