రాధ-కృష్ణ
శంకర్ శాస్త్రి గారు రాధ-కృష్ణ పురంలో ఉన్న రాధ-కృష్ణ మందిరములో లో నిత్య పూజలు చేయుటకు వచ్చి అక్కడె స్తిరపడినారు.
భక్తులకు మంచి చెడ్డ విషయాలు, మంచిరోజులు గురించి చెప్పేవారు. అవూరిలొ పెళ్లి కానీ, ఉపనయనాలు గాని, గ్రుహప్రవేశములు కాని, సత్యనారాయణవ్రతముకు గాని, ప్రతివిషయములో అవూరి ప్రజలకు తనవంతు సహాయము చేస్తూ ఉండేవాడు, భార్య పార్వతమ్మ కూడా భర్తకు తగ్గ ఇల్లాలు. ఎక్కడ ఎవరు పురిటి నేప్పులతో భాదపడ్డ వారికి సహాయముగా వెల్తూ ఉండేది.
ఆ పుణ్య దంపతులకు లేక లేక ఒక ఆడపిల్ల "9వ నెలలో" పుట్టడం జరిగింది."రాధా" అని పేరు పెట్టినారు. పుట్టినప్పుటి నుండి అనారోగ్యముగా ఉండేది. అయి నప్పటికి ఆ పాపను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. ఎదుగుతున్న కొద్ది సన్నగా పొడుగ్గా మారటం జరుగుతున్నది.
"16 సం!!లకే ఆ వూరిలొ అత్యంత పొడుగుగల అనగా 6.5 పొడవుగల అమ్మాయిగా అమ్దరూ గుర్తించారు. తండ్రితోపాటు వేదవిద్య నేర్చుకున్నది, తెలుగు సంస్కృతము కూడా నేర్చుకున్నది. తండ్రితోపాటు రోజు గుడికి పోయి దేవునికి సేవలు చేస్తున్నది.
మసక చీకటిలొ " రాధ " ఒక స్తంభంలా ఉంటుంది, గడకు చుట్టిన దారపు పోగుల ఉంటాయి ఆమె వంటిపై బట్టలు, పొడుగాటి జడకుప్పెలు పెట్టుకొని నడుస్తుంటే కుర్రకారుకు మతి పోతుంది, కడు చక్కని రంగు ఉన్న, అందమైన మోముగల పొడగరి.
ఆకతాయి కుర్రాళ్ళు అంటారు ఆమెను రబ్బరు బొమ్మ అని, అరటి ఊచ కాళ్ళు గల కొండపల్లి బొమ్మ అని, చీన్న పిల్లలు ఎగతాలితో అంటారు తాటాకు బొమ్మ అని, అందరు అన్న మాటలు పట్టిమ్చు కోకుమ్డా నవ్వుతూ పలకరిస్తూ ముందుకు సాగుతుంది.
ఒకసారి గొడుగెసుకొని నడుస్తుంటే గాలి వచ్చి చుట్టేసింది, గాలిలో గొడుగు తో పాటు ఎగురుతూ చెట్టుకు ఇరు క్కున్నది " రాధ ", చెట్టుపై ఉన్న పామును చూసి కెవ్వుమని అరుస్తూ గాలిలో తెలుతూ క్రింద వున్న కోళ్ళ బుట్టపై పడింది. కోళ్ళన్నీ ఒక్కసారి పైకి ఎగిరి పారి పోయినాయి. వాటిని పట్టు కోవటానికి చాలా ప్రయత్నిం చింది రాధ.
అంతలో కోళ్ళ మనిషి వచ్చి చాడమ్మాయి అన్నం తినుటం లేదా పూచిక పుల్లలాగున్నావు, రోజూ పాలు, వెన్న తో అన్నం తింటే లావుగా మారుతావు, గడ్డి తిని కుడితి త్రాగే ఆవులాగా నిగనిగ లాడుతావు, బలం రావటానికి మంచి మందు తీసుకొమ్మాయి అన్నాడు.
అన్నం తినడం తగ్గించి పాలు త్రగాడం, వెన్నతో చేసిన రొట్టెలు తినడం మెదల పెట్టింది, మరియు ఆయుర్వేదము లో చెప్పినట్లు క్యారేట్సు చిన్నగా తరిగి పాలతో ఉడికించి ప్రతిరోజూ అల్పాహారముగా తీసుకుంటుంది దీనివల్ల గుండె శక్తి వంతముగా తయారవుతుందని, రక్తహీనత సమస్య కూడా తగ్గుతుందని రోజూ తీసు కుంటున్నది. వేళ తప్పి తినటం వళ్ళ నాలుగు రోజులు తిరగకుండా అజీర్తి రోగం వచ్చింది. వాంతులు, విరోచనాలు వచ్చి మరీ సన్న బడింది, లేవలేని పరిస్తితి ఏర్పడింది.
కూతుర్ని పార్వతమ్మగారు అరిచి ఏది పడితే అది తింటే రోగం రాక మరోమోస్తుంది. సన్నగా ఉన్నవారు బ్రతుకట లేదా, వయస్సు పెరిగిన కొద్ది లావుగా మారుతారు, దాని గురించి దిగులు పెట్టుకొని అన్నం తినటం మానకు వేలకు మందులు వేసుకో, దేవాలయమునకు పోయి దేవున్నీ ప్రార్ధించు అన్నది కన్నతల్లి.
యోగాబ్యాసము చేస్తే వళ్ళు వస్తుందని అందరూ అంటారు, నీవుకూడా ప్రయత్నించు అన్నది కన్న ప్రేమ. తల్లి మాట ననుసరించి బయట నేర్చుకొనే బదులు పుస్తకము చూసి యోగాసనాలు వేయటం మొదలు పెట్టింది. అలాగే పద్మాసనం వేసి, శీర్షా శనమ్ వేయటం ప్రాక్టీసు చేసింది, కాని ఒక రోజు శీర్శాసనమ్ వేస్తున్నప్పుడు దభీమని క్రింద పడింది. తలకు దెబ్బ తగిలింది.
హాస్పటల్ కు తీసుకెల్లి కట్టు కట్టించింది కన్నప్రేమ, వెంట ఉండి సకల ఉపచారములు చేసింది పుత్రిక పై ప్రేమతో , మందులు వాడి మరలా ఒక మనిషిగా మార్చింది డాక్టర్ ప్రేమ, అమ్మా నీరసంగా అడిగింది, నేను ఇంతేనా అమ్మ సన్నగా ఉండాల్సిందేనా అన్న మాటలకు కళ్ళు చెమ్మగిల్లే తల్లికి, కన్నీరు కార్చుట తప్ప గొంతు మూగ బొయింది బంగారు తల్లికి, ఏనాడు చేసిన పాపమొ నిన్ను నన్ను వేధిస్తున్నది, ప్రతి జన్మకు ఒక ఉపయోగ మున్నది. ఆ ఉపయోగము తెలుసు కొవటములోనే ఉంది మానవుని గొప్పతనము.
ఒక రోజు తన స్నేహితురాల పెళ్ళికి వెళ్దామని అనుకున్నది, పైగా ఉల్లిపొరలాంటి నెట్ జార్జేట్ చీర మీద రిచ్చిగా ఎంబ్రాయిడరి ఉన్న దానిని తీసుకొని కట్టుకున్నది, కొంగును మూడు నాలుగు స్టెప్పులుగా మడచి పిన్ను పెట్ట కుండా పమిటను వంటి పొరమీద వేసుకొని బయలు దేరుతున్నది. ఆ చీరలొ పూసలు, క్రిస్టల్స్, బంగారపు తీగతో పూలు ఉన్న ఏమ్బ్రాయిడరీ ఉండుట వల్ల, అందమైన రూపములొ ఉన్న పొడగరి కావటము వల్ల, అందాలను విరజిమ్మే పువ్వుల తయారైంది రాధా.
ప్రక్క గ్రామానికి పోవాల్సివచ్చి బస్సు ఎక్కవలసి వచ్చింది, జనం బాగా ఉండుట వల్ల నుంచో వలసి వచ్చింది. అందరూ రాధను చూస్తున్నారే తప్ప ఒక్కరు కూర్చొమని చెప్పలేదు, బస్సు బ్రేక్ వెయటమువల్ల ముందున్న నవయవ్వన యువకుని వళ్ళో పడింది రాధ, అంతే ప్రక్కనున్న లావుగాఉన్న యువతి పట్టుకొని తనతొడపై కూర్చొ పెట్టుకున్నది, నెమ్మదిగా అందముగా ఉన్నావు మరీ ఇంత సన్నగా ఉన్నావు, ఏమైనా తింటున్నావా లేదా, చూడు నేనంత లావుగాఉన్నానో అంటుంటే అందరూ ఒక్కటే నవ్వలే నవ్వులు.
పెళ్లి నుంచి తిరిగోచ్చాకా తల్లి దిష్టి తీసింది, అందరి కల్లు మా అమ్మాయి పైనే అంటు ఎర్ర నీళ్ళు త్రిప్పి పార బోసింది. అమ్మ నేను కాసేపు పార్కుదాకా పోయోస్తాను అంటుంటే ఆ చీర మార్చుకొనే వేరేదేదైనా వేసుకొని వెళ్ళు అన్న మాటలకు సరే నని వేరేది మార్చికొని పార్కుకు వెళ్లి ఒక చెట్టు క్రింద ఉన్న బెంచి పై కూర్చుంది .
అంతలో ఒక స్కూలు బస్సు వచ్చి ఆగింది అందులో విద్యార్ధులు "5 సంవత్చరాల లోపు పిల్లలు చూచుటకు చాలా ముచ్చటగా ఉన్నారు, స్కూలు డ్రస్సు వేసుకొని కోటు వేసుకొని ఉన్నారు, ఎర్రటి జుట్టు తెల్లని మోహము గల పిల్లవాడ్ని దగ్గరకు పిలిచి లేచి నవ్వుతూ నుమ్చో నుంది, అందులో ఆ సమయమునా చిన్న గౌను వేసుకోవడం పిల్లవాడు రావడం గౌను పైకి ఎత్తి చూడటం, వచ్చిన వారందరూ ఒక్కటే నవడమ్ క్షణంలో జరిగి పోయినది .
" రాధ సిగ్గుతో తలవమ్చుకొవడమే తప్ప ఏమి చేయలేక పోయింది" నెమ్మదిగా ఇంటికి చేరింది.
ఇంటి ప్రక్కనున్న దేవాలయము నుండి మైకు వినబడుతుంది " ఈ పవిత్రమైనటువంటి దేహమును సనాతను డై న దేవునకు, నూతనమైన మందిరముగా నిర్మించుకోవాలి, కనుక మీ మనస్సుతోపాటు దేహమును, దేహముతో పాటు మనస్సును, పవిత్రము, పరిశుద్ధము కావించి కొని, మార్గ దర్శకమైన అనుభూతిని అందు కోవటానికి మీరు పూనుకొవాలి".
గతం గతం గతమును మరచి పోవాలి ( "Past is Past, For get the Past )పవిత్రమైన పురుష తత్వాన్ని, స్త్రీ తత్వాన్ని అర్ధం చేసుకొండి, పవిత్ర హృదయముతోనే ముందుకు సాగిపోండి వెనుక ఎవరుఎమన్న పట్టిమ్చు కోకుండా గమ్యాన్ని చేరుటకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలి అట్టివారికి దేవుడు వెన్నంటి ఉంటాడని అందరి నమ్మకము.
"సంకల్పమే సగం బలము, ఆచరణె మొత్తం బలం అదే నమ్మకం "
ఆ సమయానే తల్లి దగ్గరకు చేరి నేను బాంబు స్టిక్ డాన్సు నేర్చు కుంటాను, నలుగురిని నవ్వించే మిమిక్రీ నేర్చుకుంటాను, పరుగెత్తే పందాలలో పాల్గొంటాను, లాంగ్ జంపు, పోల్ జంపులో పాల్గొంటాను అన్న మాటలకు పార్వతమ్మ నీమాటను ఎప్పుడు కాదన్నాను తల్లి నీకు ఏది ఇష్టమైతే అదే చెయ్.
పట్టుదలతో అన్నివిద్యలు నేర్చుకుమ్టున్నది, ఎవరు ఏ మన్న పట్టిమ్చు కోకుండా నవ్వుతూ పలకరిస్తుంది , కలతలు కష్టాలు మరచి పోయి సంతోషముగా ఉన్నది. ఆనందం పెరిగింది, భారత ప్రభుత్వమువారి ప్రోత్చాహము పెరిగింది, మంచి శిక్షణ ఇచ్చే నిపుణుడు దొరికాడు గ్రామీణ పొటీలలో, జిల్లా పోటీలలో, ప్రధమ స్థానములో రావటము వల్ల నేషనల్ గేమ్శులో కూడా పాల్గొన్నది రాధ.
నేషనల్ గేమ్శు లో :"పరుగు పందెములో" , "లాంగ్ జమ్పులో" ," పోల్ జమ్పులో" , ప్రధమ స్థానములో వచ్చి గోల్డ్ మెడల్సు సంపాదించింది. వలంపిక్ గేమ్సులొ పాల్గొనుటకు అనుమతికూడా లభించింది రాధ కృష్ణ పురంలో ఉన్న రాధకు.రాధ-కృష్ణ పార్ట్ -5
ఒకరోజు సాయ్యంత్రం వేళ ఇంటి బల్కనీలో నిలుచుంది రాధ, ఎదుటి ఇంటిలో అందమైన లావుగా, బొద్దుగా, పొడుగ్గా,నల్లగా, బలంగా ఉన్న యువకుడ్ని చూసి ఒళ్లంతా కల్లుచేసుకొని ఆశ్చర్యంగా చూసింది రాధ.
అదే సమయాన రాధను కన్నులలో రెప్ప మార్చ కుండా తదేక దృష్టితో, తన్మయత్వముతో, చూశాడు "కృష్ణ" , భువినుంచి దిగివచ్చిన దివ్య సుందరి అతిలోక సుందరి శ్రీ దేవి లాగుంది, పెళ్లి చేసుకుంటే ఈమెనే చేసుకోవాలని నిశ్చ ఇంచు కున్నాడు.
ఎదురింటి వారు రాధ తల్లి తండ్రుల వద్దకు వచ్చి మా అబ్బాయి మీ అమ్మాయి వివాహము చేసుకోవాలని పంతం పట్టుకొని కూర్చున్నాడు, మాకు చాల ఆస్తి ఉంది ఒక్కడే కొడుకు, కట్న కానులేమీవద్దు, పెళ్లి కూడా దేవుని సన్నిధిలో చేస్తే చాలు అన్న మాటలకు " శంకర శాస్త్రిగారు, పార్వతమ్మగారు ఆ దేవుడు కల్పించిన పెళ్లి మాకు సంతోషముు శుభలగ్నం చూసి పిల్లల పెళ్లి చేద్దాం "
నెలతిరక్క ముందే " రాధాకృష్ణల వాహము జరిగింది.
రాధ మొదటి రాత్రి భర్తను అడిగింది నేను ఇంత సన్నగా ఉన్నాను గదా నాలో ఏమి చూసి ప్రేమించావు " నాకు నీలొ పట్టు దల కనిపించింది " అందులో అంద గత్తెవు, నేనేమో నల్లని " కృష్ణ ను " యాడాది తిరుగక ముందే రాధ లావుగా మారింది , కృష్ణ సన్నగా మారాడు " రాధాకృష్ణల కీర్తనలు చేసుకుంటూ హాయిగా కాలం గడిపారు ".
ఏమిటే రాధా పగటి కలలు కంటున్నావు అప్పుడే కృష్ణుడితో పెళ్లి అయి కాపురం చేసి నట్లు లావుగా మారినట్లు కలలు కనుచున్నావా.
అవునమ్మా నాకు కల వచ్చింది ఇంటిఎదురు అబ్బాయి కృష్ణతో పెళ్లైనట్లు. మన ఇంటి ఎదురు ప్లేక్గ్రౌండే ఇళ్లే లేదుకదా అవును ఇది కలే అవును, ఇది కలే.
సమాప్తము
katha baagundi.kathanam baagundi.prati janma upayogakarame ani cheppina tiru inka bagundi.meeru inka manchi kathalu rayali.
రిప్లయితొలగించండిkatha bavundi. chadivincha gala lakshanam kathanam lo vundi. mugimpu vishayam lo inkontha sraddha theesukoni vunte katha inka baavundedemo. chala mandini impress cheyagala prathyeka samardhyam mee kalam lo vundani nenu bhaavisthunnanu.
రిప్లయితొలగించండి