23, జూన్ 2017, శుక్రవారం

విశ్వములో జీవితం,

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

హాస్యం 

మాష్టర్: ఒక విద్యార్థిని పిలిచి ఒక మెరుపుని చూపి నీ అభిప్రాయము చెప్పు అని అడిగాడు 
విద్యార్థి : నిజం చెప్పఁ మంటారా అబద్ధం చెప్పా మంటారా అని అడిగాడు 
మాష్టర్ : నిజమే చెప్పు 
విద్యార్థి : ఆ మెరుపుకు మేఘం కరిగి వర్షం పడుతుంది  
మాష్టర్ : అవును బాగా గుర్తించావు, దానిని బట్టి నీకేం తెలుస్తుంది?
విద్యార్థి : మెరుపును చూస్తే మనకళ్ళు పోతాయని తెలుస్తుంది  కదండీ 
మాష్టర్ : వెరీ గుడ్ బాగా అర్ధం చేసుకున్నావు 
విద్యార్థి : నాకో డౌట్ ఉన్నది చెపుతారా గురువుగారు  
మాష్టర్ : అడుగు చెప్తా 
విద్యార్థి : మెరుపు మెరిసే శబ్దమును మానవ బాంబులతో పోలుస్తారు ఎందుకు,         
మాష్టర్ : నేటి విద్యార్థులు ఎలా మారారో కదా, వీళ్ళదగ్గర చాలా జాగర్త గా ఉండాలి కదా, అయితే నీవు చెప్పు    
విద్యార్థి : " అందరూ ఒక్క క్షణమైనా ఉజ్వలంగా ఉండాలని " కదండీ గురువుగారు 
మాష్టర్ : ఆ ...ఆ ....ఆ .....

మాష్టర్: ఒక విద్యార్థిని పిలిచి ఒక కొవ్వొత్తిని చూపి నీ అభిప్రాయము చెప్పు అని అడిగాడు 
విద్యార్థి : నిజం చెప్పఁ మంటారా అబద్ధం చెప్పా మంటారా అని అడిగాడు 
మాష్టర్ : నిజమే చెప్పు 
విద్యార్థి : ఆ కొవ్వొత్తి వెలుగును వెదజల్లు తున్నదని తెలుస్తున్నది  
మాష్టర్ : వెరీ గుడ్ బాగా అర్ధం చేసుకున్నావు 
విద్యార్థి : నాకో డౌట్ ఉన్నది చెపుతారా గురువుగారు  
మాష్టర్ : అడుగు చెప్తా 
విద్యార్థి : కొవ్వొత్తి కరగటం, స్త్రీలు సర్వస్వము అర్పిస్తారని చెపుతారు ఎందుకండీ 
మాష్టర్ : మనసులో వయసుకు మించినవి అడుగుతున్నాడు అనుకుంటూ  నేటి విద్యార్థులు ఎలా మారారో కదా, వీళ్ళదగ్గర చాలా జాగర్త గా ఉండాలి కదా, అయితే నీవు చెప్పు  
విద్యార్థి :"చివరివరకు వెలుగు నందించమని, స్త్రీలు చివరి వరకు సుఖం అందిస్తారని  " కదండీ గురువుగారు   
మాష్టర్ : ఆ ...ఆ ....ఆ .....
          

మాష్టర్: ఒక విద్యార్థిని పిలిచి ఒక వృక్షాన్ని చూపి నీ అభిప్రాయము చెప్పు అని అడిగాడు 
విద్యార్థి : నిజం చెప్పఁ మంటారా అబద్ధం చెప్పా మంటారా అని అడిగాడు 
మాష్టర్ : నిజమే చెప్పు 
విద్యార్థి : ఆ వృక్షం " సర్వ ప్రాణులకు ఉపయోగ పడుతుంది   
మాష్టర్ : వెరీ గుడ్ బాగా అర్ధం చేసుకున్నావు 
విద్యార్థి : నాకో డౌట్ ఉన్నది చెపుతారా గురువుగారు  
మాష్టర్ : అడుగు చెప్తా 
విద్యార్థి : చల్ల గాలి వీస్తుంది అంటారు, గాలి కనబడదు ఎందుకండీ 
మాష్టర్ : మనసులో వయసుకు మించినవి అడుగుతున్నాడు అనుకుంటూ  నేటి విద్యార్థులు ఎలా మారారో కదా, వీళ్ళదగ్గర చాలా జాగర్త గా ఉండాలి కదా, అయితే నీవు చెప్పు  
విద్యార్థి :" కష్టాల్లో ఇతరులకు సుఖం ఇవ్వమని, కష్టాలు సుఖాలు గాలిలాగా కనబడ కుండా పోతాయి   " కదండీ గురువుగారు   
మాష్టర్ : ఆ ...ఆ ....ఆ .....

విశ్వములో జీవితం, -

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

హాస్యం

మాష్టర్: ఒక విద్యార్థిని పిలిచి ఒక చెట్టును చూపి నీ అభిప్రాయము చెప్పు అని అడిగాడు
విద్యార్థి : నిజం చెప్పఁ మంటారా, అబద్ధం చెప్పా మంటారా, అని అడిగాడు
మాష్టర్ : నిజమే చెప్పు
విద్యార్థి : ఆచెట్టుకు ఆకులు రాలి పోతున్నాయి
మాష్టర్ : అవును బాగా గుర్తించావు, దానిని బట్టి నీకేం తెలుస్తుంది?
విద్యార్థి : వానలు పడ్డాక ఆకులు వస్తాయి కదండీ
మాష్టర్ : వెరీ గుడ్ బాగా అర్ధం చేసుకున్నావు
విద్యార్థి : నాకో డౌట్ ఉన్నది చెపుతారా గురువుగారు
మాష్టర్ : అడుగు చెప్తా
విద్యార్థి : ఆకులు రాలినట్లు మీ జుట్టు రాలింది కదండి, వానలుబడితే బట్టతలపై జుట్టు మొలుస్తుందాండీ:
మాష్టర్ : నేటి విద్యార్థులు ఎలా మారారో కదా, వీళ్ళదగ్గర చాలా జాగర్త గా ఉండాలి కదా, అయితే నీవు చెప్పు  
విద్యార్థి : "ఆకురాలుతూ చెపుతుంది మన జీవితం శాశ్వితం కాదని " కదండీ గురువుగారు
మాష్టర్ : ఆ ...ఆ ....ఆ .....

మాష్టర్: ఒక విద్యార్థిని పిలిచి ఒక పువ్వు ను చూపి నీ అభిప్రాయము చెప్పు అని అడిగాడు
విద్యార్థి : నిజం చెప్పఁ మంటారా అబద్ధం చెప్పా మంటారా అని అడిగాడు
మాష్టర్ : నిజమే చెప్పు
విద్యార్థి : ఆపువ్వు వికసించి పరిమళాలు వెదజల్లు తున్నదని తెలుస్తున్నది
మాష్టర్ : వెరీ గుడ్ బాగా అర్ధం చేసుకున్నావు
విద్యార్థి : నాకో డౌట్ ఉన్నది చెపుతారా గురువుగారు
మాష్టర్ : అడుగు చెప్తా
విద్యార్థి : పువ్వు వికసించడం, స్త్రీలతో పోల్చుతారు ఎందుకండీ
మాష్టర్ : మనసులో వయసుకు మించినవి అడుగుతున్నాడు అనుకుంటూ  నేటి విద్యార్థులు ఎలా మారారో కదా, వీళ్ళదగ్గర చాలా జాగర్త గా ఉండాలి కదా, అయితే నీవు చెప్పు
విద్యార్థి :"ప్రతిరోజూ గౌరవముగా వికసిస్తూ జీవించమని " కదండీ గురువుగారు  
మాష్టర్ : ఆ ...ఆ ....ఆ .....
     
మాష్టర్: ఒక విద్యార్థిని పిలిచి ఒక మేఘాన్ని చూపి నీ అభిప్రాయము చెప్పు అని అడిగాడు
విద్యార్థి : నిజం చెప్పఁ మంటారా అబద్ధం చెప్పా మంటారా అని అడిగాడు
మాష్టర్ : నిజమే చెప్పు
విద్యార్థి : ఆ మేఘం నీరు కార్చటానికి రడీగా ఉన్నది  
మాష్టర్ : వెరీ గుడ్ బాగా అర్ధం చేసుకున్నావు
విద్యార్థి : నాకో డౌట్ ఉన్నది చెపుతారా గురువుగారు
మాష్టర్ : అడుగు చెప్తా
విద్యార్థి : మేఘం నీరుకార్చడం, పిల్లల ఏడుపుతో పోలుస్తారెందుకు
మాష్టర్ : మనసులో వయసుకు మించినవి అడుగుతున్నాడు అనుకుంటూ  నేటి విద్యార్థులు ఎలా మారారో కదా, వీళ్ళదగ్గర చాలా జాగర్త గా ఉండాలి కదా, అయితే నీవు చెప్పు
విద్యార్థి :" చెడుని గ్రహిస్తూ మంచిని పంచమని " ఆకలేసి కన్నీరు కారిస్తే ఆకలి తీరు తుందని  " కదండీ గురువుగారు  
మాష్టర్ : ఆ ...ఆ ....ఆ .....

22, జూన్ 2017, గురువారం

విశ్వములో జీవితం -31

om sri raam - sri matrenama:

అహం  

అనేక మంది కళ్ళకు ఆకాశం ప్రకాశవంతంగా పింక్, ఎరుపు, నారింజ, నీలిమందు మరియు బూడిద రంగుగా కనబడటం జరుగుతున్నది. అలాగే మనచుట్టూ ఉండేవారు అనేక రకాల బుద్ధులు కలిగిన  మనుష్యులు ఉన్నారు,  వారు సంతోషంగా మరియు విచారంగా జ్ఞాపకాలు లాగా ఉంటే తూర్పు నుండి పడమటి వరకు సూర్యునిలో  రోజువారీ మార్గంలో ఎన్ని మార్పులు జరుగుతాయో అన్ని మార్పులు మనలో కూడా జరుగుతాయి. చీకటిలో సూర్యుడు దిగంతంలో పడుకుని ఉంటాడు, అలాగే మనలో అంతరాత్మ శాంతి కొరకు నిద్రకు ఉపక్రమించటం చాలా శ్రేయస్కరము.
  
ఒకప్పుడు అద్భుతమైన కాంతిని అణచి వేయబడిన జాడలు కనిపిస్తాయి అంత మాత్రాన స్వయం శక్తి ఎప్పటికి మారదు మబ్బులు తొలగిన యధా ప్రకారం వెలుగును చిమ్మును, అలాగే మనకి కొన్ని బాధలు వెంబడించిన అవి తొందరలో తొలగిపోతాయని గమనించాలి. నిద్రలో జ్ఞాపకాలు క్షిణించిన వెలుగులో అవి విజ్ఞావంతులుగా మారుస్తాయి. 

మనలో ఉన్న అహంకారముతో కూడిన భౌతిక భావన మాత్రమే మనల్ని చీకటిలో నెట్టి వేస్తుంది, మమకారము పెంచుకొని వెలుగు కోసం ప్రయత్నం చేయాలి. ఎవరికైన ఈ అహంకారముతో సంబంధమున్నచో అట్టి వ్యక్తి విముక్తిని గూర్చి మాట్లాడవలసిన పని లేదు. విముక్తి అనేది తిరుగులేనిది. 

అహంకారము యొక్క బంధనాల నుండి స్వేచ్ఛను పొందాలంటే వ్యక్తి తన యొక్క అసలు సత్యమైన, స్వచ్ఛమైన, శాశ్వతమైన ఎల్లపుడు ఆనంద స్థితిలో ఉండేది, స్వయంప్రకాశవంతమైన వెలుగును పొందాలి. ఎలానంటే రాహుగ్రహము నుండి విముక్తి పొందిన చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడో అలాగా. 

బుద్ది వలన మాలిణ్యముతో కూడిన భౌతిక సంబంధములు ఎలా సృష్టించబడినవో, అవి శరీరానికి కళంకము తెచ్చి, నేను బలవంతుడును, నేను అమాయకుడను, నేను సంతోషముతో ఉన్నాను అనే భావనలు అహంతో చోటు చేసుకొనుట సహజము. 

ఓర్పుతో ఓపికతో స్థిమిమ్ముగా మనం చేసినది ఏమిటి అనుకరించినది ఏమిటి అని ఒక్క సారి ఆలోచించ కలిగే శక్తి మనకు పరమాత్మ ఇచ్చాడు. అహం అనే కాలసర్పం మనల్ని చుట్టి వేస్తుంది
దానిని ఎదుర్కొనుటకు అహం అనే సర్పాన్ని జ్ఞానమనే ఖడ్గముతో నాశనము చేయకల్గిన శక్తి మనలో ఉన్నది.      
 --((*))--

21, జూన్ 2017, బుధవారం

విశ్వములో జీవితం -30

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

గీతాజ్ఞానం 

స్పృహ అనేది మానవాభ్యుదయానికి అవసరమ్, సమయ సందర్భాలను గమనించి కాలమాన ప్రకారముగా కలియుగంలో జీవించాలంటే మొక్క ఎదిగినట్లుగా ఎదుగుతూ నలుగురికి సహాయపడే గుణముతో జీవించాలనే లక్షణం ప్రతి ఒక్కరిలో జీవం పోసుకోవాలి. తక్కువ మాట్లాడి ఎక్కువ విని ధర్మ మార్గాన నడుచు కోవటం వళ్ళనే అసలైన జీవితం కనబడుతుంది.

శ్రద్ధ అనేది పుట్టుకతోనే వస్తుంది, తల్లి తండ్రుల లక్షణాల బట్టి కొంత మారుతుంది. దానికి తోడు స్నేహభావం మనలో ఏర్పడి తెలుసు కోవలసిన కొన్ని విషయాలు తెలుసు కొనుటలో కూడా శ్రద్ధ  వహించ గలరు, ఇది ఒకరు నేర్పరు, స్వయంగా తెలుసుకొని అందులో ఉన్న మంచిని గ్రహించుటకు నిగ్రహ శక్తి ఉపయోగించి ముందుకు పొతే, జరగబోయే విషయాలు కూడా శ్రద్ద వళ్ల గ్రహించ గల శక్తి ఏర్పడుతుంది.  

అందుకే ఆనాడు రామచంద్రుడు భార్యాన్వేషణకు హనుమంతునిలో ఉన్న శ్రద్ధను గ్రహించి అంగులీకము ఇవ్వడమ్, తగు విధముగా హనుమంతుడు సహకరించటం మనం తెలుసుకోగలిగాము.

ఒక సర్కస్ కంపెనీ వాడు జంతువులను ఆడించాలంటే ఎంతో శ్రద్ద, ఓర్పు వహిస్తేనే అవి వినటం జరుగుతుంది, మత్సకారుడు సముద్రముమీద వేట సాగించాలంటే శ్రద్ధతో కెరటాల బట్టి పడవను నడుపుతూ వేట సాగించగలడు, ఇదేవిధముగా ఎంతో మంది శ్రద్ధగా చదివి దేశ సేవకోసం ప్రాణాలు అర్పించినవారు, సహకారం అందిస్తున్నవారు ఉన్నారు. నాలుగు దశలు మారిన తరవాతే సీతాకోక చిలుకగా మారుతుంది. అట్లే శ్రద్ధ వహించిన వానికి జ్ఞానాభివృద్ది కలుగుతుంది.     

శ్రద్దగా చదువుకున్న విద్యార్థికి విద్య వినయమును ఇచ్చును,ఆ వినయము వలన అతడు మంచి యోగ్యత అనగా అర్హత గలవాడు అగును, ఇట్టి పాత్రత వలన ధనము లభించును, ఆధనము వలన బుద్ధియును ఆవిద్యార్దికి కలుగును. దీనికి సరిఅయిన తెలుగు పద్యమిది 

విద్యయొసగును వినయంబు వినయమునను 
బడయ పాత్రత పాత్రతవలన ధనము
ధనము వలనను ధర్మంబు దానివలన 
ఐహికాముష్మికసుఖంబు లందు నరుడు

శ్రద్ధ కలవాడు, ముసలితనము లేనివానివలెను, చావులేని వానివలెను భావించి క్రమంగా విద్యా ధనములను ఉన్నట్లు మలచి వీలున్నంత తొందర్లో తన ధర్మకార్యములను అనగా తనకు శ్రేయస్సును కలిగించే మంచి పనులను పూర్తి చేసుకొనగలడు. శ్రద్ధకు మించిన మరో ఆభరణము లేదు, సమయాన్ని సద్విని యోగం చేసుకొనే శక్తి శ్రద్దకే ఉన్నది.   
            
     

विश्वमूलो जीवितं -29

ॐ श्री राम - श्री मात्रेनम:
 
గీత  జ్ఞానం

మానవులకు సహకరించేది ప్రకృతి, ప్రకృతి ననుకరించి సాగటమే మానవులయొక్క ముఖ్య లక్షణం ణమే.  మనం గమనించాల్సినది అంటి అంటకుండా బురదలో శాఖలు లేకుండా ఉండే కలువ పువ్వును ఆదర్శముగా తీసుకోవాలి ఎందుకనగా ఉషోదయము అయినవెంటనే వికసించే లక్షణం ఉన్నది కలువకు, అదే విధముగా ప్రతి ఒక్కరు ఉషోదయ వెలుగులో మనసును శుద్ధిచేసుకొని మనో నిగ్రహ శక్తితో చేయవలసిన కార్యకమాలు చేయుట ఎంతో మంచిది.

      మొక్కలు నీటి యందు తేలుట గమ్యం లేని ప్రయాణంలా సంచరించుట జరుగు తుంది అది చివరకు భూమి చేరగానే తన బలమంతా కేంద్రీకరించి బ్రతుకుటకు ప్రయత్నిస్తుంది, అదే విధముగా మనము కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటు, వాటి పరిష్కారం చేసుకుంటూ సాగిపోతూ చీకటిలో విశ్రాంతి తీసుకోవం వళ్ళ కొంత మన:శాంతి ఏర్పడుతుంది,సహాయ సహకారముతో కొంత ఉత్సాహము ఏర్పడుతుంది, మరునాడు ఉదయము కళ్ళ కొంత శక్తి తో ముందుకు సాగటం జరుగు తుంది.

శ్రీ కృష్ణ పరమాత్ముడు మనకు బోధ చేసాడు ఏమనగా ఎవరైనా ఈపరిస్థితిలో కూడా అధైర్య పడకూడదు, నిరుత్సాహపడకూడదు, ఇది చేయలేను అది చేయలేను అని మనసులో కూడా అనుకో కూడదు, నిత్యకృత్యాలు ధర్మం తప్పకుండ చేసినవారికి అంతా మంచే జరుగుతుందని భావించ వచ్చు,  కొన్ని పరిస్థితులలో తమ వారినే ప్రశ్నించ వలసిన పరిస్థితి వస్తే నిర భ్యంతరంగా ప్రశ్నించుటవల్ల కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి, మానతప్పు ఎదో ఎదుటివారి తప్పు ఎదో తెలుస్తుంది, ఏవిషయమైనా తెగేదాకా లాగకుండా జాగర్తపడుట మానవుల లక్షణం .
"కొండలపై నుండి ఉరవడిగా నీరు కారుతున్నది అన్నిటిలో ఒక చెట్టు క్రిందకు జారుతూ మరలా కొంత పట్టు దొరికిన వెంటనే వెనుకకు ఎగబాకి వెళ్ళుట గమనించగలరు అట్లాగే ఎవరైనా కొన్ని సంఘటనల ప్రభావము పనిచేసినప్పుడు కోపముతో వెళ్లిన తిరిగి వచ్చుట అనేదే అంత:కరణ శుద్ధికి మూలం మంచి చెడు గ్రహించి    బ్రతకటమే జీవితం 
అనేకమంది మనుషుల షేడ్స్ లో ఆకాశం ప్రకాశవంతంగా పింక్, ఎరుపు, నారింజ, నీలిమందు మరియు బూడిద రంగుగా చూడడం జరుగుతుంది. వారు సంతోషంగా మరియు విచారంగా జ్ఞాపకాలు లాగా ఉంటే తూర్పు నుండి పడమటి వరకు సూర్యునిలో  రోజువారీ మార్గంలో ఎన్ని మార్పులు జరుగుతాయో అన్ని మార్పులు మనలో౦ జరుగుతాయి. చీకటిలో సూర్యుడు దిగంతంలో పడుకుని ఉంటాడు, అలాగే మనలో అంతరాత్మ శాంతి కొరకు నిద్రకు ఉపక్రమించటం చాలా శ్రేయస్కరము.
 
ఒకప్పుడు అద్భుతమైన కాంతిని అణచివేయబడిన జాడలు కనిపిస్తాయి అంత మాత్రాన స్వయం శక్తి ఎప్పటికి మారదు మబ్బులు తొలగిన యధాప్రకారం వెలుగును చిమ్మును, అలాగే మనకి కొన్ని బాధలు వెంబడించిన అవి తొందరలో తొలగిపోతాయని గమనించాలి.     
నిద్రలో జ్ఞాపకాలు క్షిణించిన వెలుగులో అవి విజ్ఞావంతులుగా మారుస్తాయి

19, జూన్ 2017, సోమవారం

విశ్వములో జీవితం-28

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
గీతాజ్ఞానము

నాలుగు చక్రాలతో నడిచే రధము ఒక చక్రముతో నడవలేనట్లుగా అనేక చక్రాలతో నడిచే సంసారం  పురుషాకార శక్తి, దైవ శక్తి అనే "2 " కలసి నడిపితేనే సంసారము మనే నావ ఆటుపోటులను తట్టుకొని గమ్యాన్ని చేరుతుంది. ఓ మనిషి తెలుసుకో మాయా మోహము చేత చేయక యుందురు స్మరణము, నిజాన్ని తెలుసుకోలేరు కామము శాశ్వితము అని భావించెదరు మిడి మిడి జ్ఞానముతో విర్రవీగేదరు. సుఖము ఉన్నప్పుడు దైవము కనబడదు, కష్టము ఉన్నప్పుడు దైవాన్ని దూషించెదరు.

ఒక వేదాంతి ఈవిదముగా పాడుతున్నడు. 

 
కొందరు విధులను చేయుట చేత కాదని
నిధులను కాజేయుచూ అవినీతిగా మెలిగెన్
కృష్ణా

అధములను చూడగా వంత పలుకుతూ
మదిని వేధించు పలుకులు పలికెన్
కృష్ణా

విలువలు మారినప్పుడు వింతలూ చూపుచూ
మలుపులు పెరిగినప్పుడు కోపము పెరుగు చుండెన్
కృష్ణా
సూలములతో పొడిచినట్లు మాటలాడుచూ
మనసును విరుచుటకు ప్రయత్నం ఉండెన్
కృష్ణా

నెయ్యము చేసితి పలువిధములైన ప్రేమలతో
వియ్యము చేసితి నమనసునొప్పింపగా
కృష్ణా
కయ్యము వదలి నెయ్యముతో మెదిలితిని
చెయ్యను చేసిన తప్పులను, వేధింపులను
కృష్ణా

హాసముతో బ్రతికితిని నిత్య జీవితము నందూ
మోహముతో తెలియక మోసములు చేసితిని
కృష్ణా
వీసము విలువ లేని వాని మాటలను గొప్పగా నమ్ముచూ
రోషము తెచ్చుకోక నిజం తెలుసుకొని బ్రతుకుచుండెన్
కృష్ణా 

ఆ పరాత్పరుడు పరమాన్నము ప్రాణులకందరికి అందించును, బ్రతికి నంత కాలము సంతోషముతో, స్పర్శ జ్ఞానము తో, పంచ భూతాల సాక్షిగా  నడుచు కొన వలెను. రోగములు దరిదాపుల్లో రావు, రోచిష్ఠునిచే రోగ నిరోధక శక్తిని వేగము గా పొందవచ్చును.              
        


విశ్వములో జీవితం -29

ఓం శ్రీ రామ్   - శ్రీ మాత్రేనమ:

గీతా జ్ఞానము -4

సముద్ర కెరటాలు వలే పొంగుతూ ఉరుకుతుంది, ప్రజ్వలించే మహాజ్వాలలా ఎగసి పడుతుంది, మంచు ముద్దలా, వెన్న ముద్దలా స్పర్శకు కరిగి పోతుంది,  బాదం కొమ్మలా విరిగి పోతుంది,శిల్పానికి ఎన్ని గాయాలు తగిలిన నిండు రూపంలా ఉంటుంది, ఎక్కడ ఉంటుందో ఎలాఉంటుందో ఎవ్వరు చెప్పలేకపోతున్నారు, అది మనలో ఉండి ఒక ఆట ఆడిస్తుంది అదే " మనసు ".

ఇనుము ఇరిగినా అతికించ వచ్చు మనసు విరిగితే అతుకుట కష్టం, ఇది విశృ0ఖలమైనది మదించిన ఏనుగులా ప్రవర్తిస్తుంది.  

ఓమనిషి తెలుసుకో! తెలుసుకొని మసలుకో!

చిందులు వేయకు చింత చేరినపుడు
చిరుగును పూరించుటకు చూడాలి ఎపుడు
చిన్న దాని చూపులకు చిక్కకు ఎపుడు
చిరుతలా దూకుతూ ధర్మాన్ని కాపాడు ఎపుడు     

వ్యసనాలకు బానిస కాకు ఎపుడు
వ్యధలు వచ్చును బ్రతుకు మారినపుడు
వ్యవహారము చక్క బెట్టుడు ఎపుడు
వ్యవసాయపై నమ్మకముంచాలెపుడు

రెక్కల్లా భావాలు చుడతాయి ఎపుడు
చుక్కల్ని పట్టాలని అశకు పోకు ఎపుడు
ప్రక్కన వారిని తక్కువచేయకు ఎపుడు
మక్కువ కొద్దితిని భాధ తెచ్చుకోకు ఎపుడు

వినయవిధేయత చూపాలి అందరిపై ఎపుడు
మనమున మర్మము గ్రహించాలి ఎపుడు
మనమున దేవుని కొల్చి శాంతిని పొందాలి ఎపుడు
వినమని చెప్పిన వినరు ఎందుకో ఎపుడు

ఈ విధముగా మనసు బుద్ధిననుసరించి జీవిస్తుంది. బుద్ధి వక్రబుద్ధిగా మారితే జీవితమే  దుర్భరం.

మనసులేని మమత ఎందుకు - మనుగడకు రాని మనసు ఎందుకు
మదితలపులు తెలుపని బ్రతుకు ఎందుకు - మతిలేని మనిషికి మనసు ఎందుకు

చెడ్డ మనసుకే ఆవేశం ఎక్కువ - మంచి మనసుకు మక్కువ ఎక్కువ
ఆదాయం లేని మనసుకు ఓర్పు ఎక్కువ - ఆదాయం ఉన్న మనససుకు ఆవేశం ఎక్కువ

మనసు విప్పి మాట్లాడి మర్మము తెలుసుకో - మగువ మనసును బట్టి మనసు మార్చుకో
ఓమనిషి తెలుసుకో - తెలుసుకొని మసలుకో                 

15, జూన్ 2017, గురువారం

విశ్వములో జీవితం - 27

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

గీతా జ్ణానము- 3 

గురువుగారు మనం  అనేక   పుణ్యకార్యక్రమాలు ప్రత్యక్షంగా, మరికొన్ని తెలిసో తెలియకో  పాప కార్యాలు (పరోక్షంగా చీకటిలో)  చేస్తూ ఉన్నాము ఎవ్వరు  గమనించరు  కదా

అదే తప్పు నాయనా
మన కంటి చూపులో మెరుపును వేరేవారు చెపితేగాని నీవు గమనించలేవు, కంటిలోని నలక తీయాలన్నా ఒక అద్ధముకాని, మరో మనిషి గాని కావాలి, చివరికి తడి గుడ్డకాని కావాలి.,
     నీ వైపు నీవు చూడలేవు , నీ వెనుక ఏమి జరుగుతుందో తెలుపలేవు, నీ నీడను నీవు తాకలేవు కానీ మనం చేసే అన్నీ పనులకు సాక్షాలు లేరనుకోకు "14 "  మంది ఉన్నారు వారెవరంటే విను

శ్లో: ఆదిత్య చంద్రౌ అనిలో నాలాశ్చ దౌయ్రుభూమి రాపో హృదయం యమశ్చ !
     ఆహాశ్చ రారిశ్చ ఉకే చ సంధ్యే ధర్మశ్చ జానాతి నరస్య వృత్తం !!

ఆ సాక్షులు ఎవరనగా 1 .సూర్యుడు 2 . చంద్రుడు, 3 .వాయువు, 4 . అగ్ని, 5 . శ్శబ్దము, 6 . భూమి, 7. ఉదకము 8 . తన హృదయము 9. యమధర్మరాజు 10. రాత్రి. 11. పగలు 12. 13. రెండు సంధ్యాకాలములు 14. ధర్మదేవత.

వీరు మానవులయొక్క మానసిక ప్రవృత్తులన్నింటిని ప్రతి క్షణ మందును పూర్తిగా పరిశీలించి తమ పుస్తకములో వ్రాసు కొందురు. సత్యము ఇలా ఉండగా కొందరు ప్రభుద్దులు చీకటిలో ఎవ్వరు లేని సమయాన చేసిన పనులను గమనించ లేదను కుంటారు, దాని ఫలితము ఈజన్మలో కాకపోయినా   మరోజన్మలో నైనా తప్పక తగ్గ శిక్ష అనుభవంచ వలసి ఉంటుంది.

కనుక ప్రతిఒక్కరు  మీ పనులను త్రికరణ శుద్ధిగా చేసుకుంటే మీపేరు సులభంగానే మహాత్ముల వరుసలో ఉంటుంది.         
            
చూడు నాయనా అన్నీ విద్యలు అందరికి అబ్బవు, ఎదుకంటే ఎవరు చేసిన పాప పుణ్యాల ఫలితము వళ్ళ భూమి మీద పుడతారు. కులవృత్తి వదలకుండా ధర్మకార్యములు చేస్తూ జీవితం గడపాలి. 
నేను చెప్పే ఈ నాలుగు మాటలు గుర్తుపెట్టుకొని అనుసరించు.      

"ఎంత బరువైనను  మోయగల  వానికి  బరువనేది  ఉండదు,   శ్రద్దగా భూమి వ్యవసాయం చేసుకొనే వానికి దూర మనేది ఉండదు,  ఇట్లే మంచి విద్య గలవానికి విదేశ మనేది ఉండదు, ప్రియంగా మాటలాడు వానికి పరుడు అనే మాట ఉండదు".

మంచి పనిని గాని, చెడ్డ పనిని గాని,  చేసేవాడును, ఆ పనిని చేయిన్చేవాడును,  ఆపనిని చేయుటకై ప్రేరేపించే వాడును, ఆపనిని అంగీకరించు వాడును ఈ నలుగురు ఆపని వలన గలిగిన పుణ్య పాపములలో సమాన వాటా దారులగుదురు. కనుక మనం మనపూర్వీకులు తల్లితండ్రులు నేర్పిన విద్య ఆధారముగా బ్రతికి బ్రతికించుట అనే ఉద్దేశ్యంగా ఉండాలనేది నాకోరిక
ధర్మానికి ఖర్చుపెట్టా లంటూ
న్యాయాన్ని నిలబెట్టా లంటూ
సత్యాన్ని బతికించా లంటూ
తన చుట్టూ తిప్పు కుంటూ
లోకాలన్నీ తిరుగుతూ ఉంటూ
బ్రతికి బ్రతికించాలనేది పచ్చనోటు       
అలాగే గురువుగారు మీరు చెప్పినవి అనుకరిస్తాము అని లేచారు శిష్యులు.  
 

14, జూన్ 2017, బుధవారం

విశ్వంలో జీవితం -26


 ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
గీతాజ్ఞానమ్ - 2
 
మనలో ఉన్న తెలివిని మనమే గుర్తించ నవసరము లేదు మనము చేసే పనిని దృడ సంకల్పంతో చేస్తే చాలు మనలో ఎటువంటి అవలక్షణాలు ఏర్పడవు, ఆలోచన అనేదే మనకు రాదు ఎందుకనగా మనము ఒక పద్ధతిన అలవాటు పడతాము, ఆపద్ధతిన పోవుటకు ప్రయత్నము చేస్తాము, దానిలో ఒక విధమైన అనుభవము వస్తుంది అలాగే భూమి మీద ప్రాతి ప్రాణికి ప్రతి వస్తువుకీ ఒక విలక్షణమైన స్వభావము ఉంటుంది .

ఉదాహరణకు సూర్యభగవానుడు వెళతప్పకుండా ప్రయాణము చేస్తూ సర్వజీవులకు వెలుగు వేడి నందిస్తూ చీకటిని ఆహ్వానించి తన పని ఈరోజుకు అయినది అని తెలియపరిచి విశ్రాంతి తీసుంటారని
తెలుస్తున్నది, గాలి కనబడకుండా వియటం జరుగుతుంది సర్వజీవివులను రక్షించుతుంది ఇది దాని స్వభావం, కాల్చడం అనేది నిప్పు స్వభావం అనగా ఒక విధమైన జ్వాల  ఏర్పడి కారు చిచ్చుగామారి అడవిని దహించివేస్తుంది, ఆజ్వాలను నీటిపాత్ర క్రింద ఉంచితే నీళ్లను వేడి పరుస్తుంది అనగా జ్వాలను ఉపయోగించుకొనే పద్ధతిని బట్టి ఉంటుంది. పారడ మనేది నీటి స్వభావం అనగా నీరు సముద్రములో కలవవలసినదే కనుక నీటి ఉపయోగాలను ఉపయోగించు కొనే తెలివి మానవులకు ఉన్నది ఆవిధముగా నడుచు కోవటం మంచిది.           

అదే విధంగా ప్రతిదాంట్లో తల దూర్చడం, ఒక విషయం మీద నుంచి మరో విషయానికి దూకడం, విచిత్రమైన కోరికలు కోరడం, వేలాది విషయాల గురించి ఆలోచించడం, ఎన్నెన్నో సమస్యల గురించి దుఃఖించడం, గాలిలో మేడలు కట్టడం, మనకు అప్పగించిన పని గురించి కాకుండా మిగిలిన ప్రతి ఒక్క పని గురించి పట్టించుకోవడం, చేసింది ఒకటి, చెప్పేది మారొకటి, చేయాలనుకున్నది వేరొకటి ఇవి కాక ఇంకా ఎన్నో మానవుల లక్షణాలు ఉన్నాయి   – ఇదీ మనస్సు స్వభావం.

ఇటువంటి మనస్సును నియంత్రించ గలిగితే, మనం ఎంతటి ఉన్నత లక్ష్యాలనైనా సాధించ గలుగుతాం. మన శరీరంలోని ఐదు జ్ఞానేంద్రియాల పాత్ర ఇక్కడ వస్తుంది.

కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం – ఈ అయిదు మనసుకు వాహనాలు. జ్ఞానేంద్రియాలన్ని మనస్సును అన్ని వైపులా లాగుతూ ఉంటాయి. కాబట్టి, వివేకాన్ని ఉపయోగించడం ద్వార ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. ఇలా ఇంద్రియాలను అదుపులో ఉంచడాన్నే సంస్కృతంలో ‘దమం’ అంటారు. నిజానికి ,ఇంద్రియాల సహాయం లేకుండానే స్వతంత్రంగా కూడా ఇష్టమొచ్చిన చోటుకు మనస్సు పోగలదు. అలాంటి సందర్భాలలో బుద్దిని ఉపయోగించి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. ఇలా తిన్నగా మనస్సును నిశ్చలంగా ఉంచే పద్ధతినే ‘శమం’ అంటారు.

ఏకాగ్రతతో కూడుకున్న మనస్సు నిజంగా ఓ సెర్చి దీపం లాంటిది. దూరంగా, చీకటి మూలల్లో పడి ఉన్న వస్తువులను కూడా మనకు కనిపించేలా చేస్తుంది.

ప్రాతి రోజు ప్రతి వ్యక్తి యోగాసనాలు వేయటం, ఇష్టదైవాణ్ని ప్రార్ధనలు చేయటం ధర్మం తప్పకుండా నిత్యకృత్యాలు చేయటం వళ్ళ ఏకాగ్రత పెరుగుతుంది. 
మనిషికి మనషి తోడు ఉంటె మనలోని భావాలను తెలియ పరుచుకొని మనసును తేలిక పరుచు కొని ఏకాగ్రతకు ప్రయత్నం చేయాలి.   

మనం ప్రతి నిత్యం సాధన చేస్తూ మన మనస్సును ఆత్మ జ్యోతి మీద ద్రుష్టి నిలిపివుంటే, పరిసరాలనే కాకుండా చివరకు తన దేహాన్ని సైతం మర్చిపోయి పూర్తిగా మునిగిపోతే, అదే ఏకాగ్రతకు కచ్చితమైన సూచన!.

విశ్వములో జీవితం -25

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
 
గీతా జ్ఞానం -1
మనిషి మనిషికి మధ్య తేడా ఉంటుంది, ఆ తేడా కేవలము రూపములో గాని, గుణములో గాని మాత్రమే కాదు అనేక పద్దతులలో ఉండటంవల్ల మనుషులమధ్య పోలిక గుర్తు పట్టలేము  ఒకే రూపంలో ఉండేవారు, చాలా తక్కువ కానీ భగవంతుఁడు మనుష్యులకు "26 " లక్షణాలు చూపించారు, వాటిని  బట్టి అనుకరించ మన్నారు.

1. ప్రతిఒక్కరు మొదట నిర్భయత్వం తో ఉండాలి అనగా " ఇష్టవస్తువు వియోగము, అనిష్టవస్తువు సంయోగం కలుగునని సంకట మనస్సు నందు సంభవించు పిరికితనముతో కూడిన వికారమునే "భయము"   ఆ భయము లేకుండా ప్రతిఒక్కరు బ్రతకాలి అలాగే ప్రతిష్ఠా భంగము, అవమానము, నింద, రోగము, రాజా దండనము, భూత ప్రేతములు, మరణము మొదలగు వానివలన కలుగు భయాందోళనలు ఏమాత్రము లేకుండటనే అభయం అందురు.సన్మార్గాచరణముతో భయము లేకుండా ప్రతిఒక్కరు జీవితం సాగించాలి

2. శుద్ధ సాత్విక వృత్తి అనగా "మన మనసును పాడు చేసే త్రిగుణాలలో సాత్వికగుణ పద్దతిలో నమ్ముకున్న వృత్తిని అనుకరించుట వలనే" మనసు ప్రశాంతముగా మారును.

3. సత్త్వసంశుద్ది అనగా:అంత:హకరణము నందు రాగ ద్వేషములు, హర్ష శోకములు, మమతా హంకారములు, మొహమత్సరములు, మొదలగు వికారములను నానా రకములైన కలుషిత పాపాత్మక భావములను ఏ మాత్రము లేకుండుటను అంత:కరణమూ పూర్తిగా నిర్మలమై పరిశుద్ధముగా ఉంచుటకు క్రమ పద్ధతిగా సమయాను కూలంగా నడుచు కొనవలెను. 
                     

13, జూన్ 2017, మంగళవారం

విశ్వం లో జీవితం -24

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ: 
*" స్త్రీ "సకలానంద స్వవరూపిణి

నయన మనోహర అరవింద సుకుమారా అపరంజి  మణి !
మనసును దోచే, నవ నవోన్మష రక్తి యుక్తి ముక్తి స్వరూపిణి !
కోరికలు తీర్చి, మనస్సును పంచి, యశస్సును పెంచే, యసశ్విణి  !
మనోధైర్యం, దృఢసంకల్పం కల్పించి, తేజస్సును వృద్ధి పరిచే, తేజస్విణి  !

ధర్మశాస్త్రములుతెలిపి, సమస్యలను పరిష్కరించి ఆదుకొనే అంతర్వాణి! 
మంచి చెడు కొన్ని విషయాలు తెలిసుకోనుటకు, సహాయపడే అన్వేషిణి!
సమయానికి అంతరాత్మను ప్రభోదించి, మంచి సలహా లిచ్చే, ఆత్మజ్ఞాణి !
ఆస్తిని, అదాయమును, పెంచి ఆహారమును అందించే, అన్నప్రదాయిణి !

పరిమళాలు వెదజల్లి,  మనస్సును ఉల్లాసపరిచే, ఇష్ట ఘంధిణి !
రౌద్రరసమును చూపి, శత్రువుల గుండెలలో ఉండే, ఉగ్రరూపిణి !
మనో భిష్టమును నెరవేర్చి, ఉచ్చాహమును పెంచే, ఉజ్వల రాణి !
తెలివితో మంచి మాటలతో తెలియనివి తెలియ పరిచే  ఉపన్యాసిణి !

ఇంటిని, సభను, పిల్లలను,  హుందాగా తీర్చి దిద్దన, అస్థాణి !
కామాందులకు, దుర్మార్గులకు,  దుష్టులకు, చిక్కిన ఆహుతిణి !
అభిమానంతో మనసును ఉల్లాసపరిచి కోర్కెలు తీర్చిన, అభిలాషిణి !
పురాణములు, వేదములు అనర్గాలముగా వర్ణించి చెప్పే, అవృత్తిణి ! 

బలము, ధెర్యము, మనోనిగ్రహ శక్తి పెంచే తేజస్సుగల ఓజస్వి ణి !
ఉపవాసములు ఉండి ఉపాయములు తెలియపరిచే ఉప చారిణి !
భర్త దుర్వసనములులోనైతే వ్యసనములను మాన్పించే ఉపాధ్యాయిణి !
హృదయ బాధను భరించి మన్మధ లీలకు సహకారం కలిగించే విలాసిణి !

అనారోగ్య భర్తను ఆరోగ్య వంతునిగా  మార్చుటకు శ్రమించే ఔషదణి !
నవనీత హృదయ గల వేణి,  మంజుల మధుర వాణి !

12, జూన్ 2017, సోమవారం

విశ్వం లో జీవితం -23

ఓం శ్రీ రామ్ - శ్రీమాత్రేనమ:


మమత 

రావు గారు మిమ్మల్ని చూస్తే నాకు ప్రేమ, కోపము, జాలి కనిపిస్తుంది, మానవత్వాన్ని బట్టి మమతను   స్నేహమును పంచుతున్నావు, అందరు సమాన మంటావు ఎందుకలా మారావు అని అడిగాడు.
కూర్చో " పతి గారు " కాలాన్ని బట్టి నేను నడుస్తున్నాను, అన్ని మతాలలో ఉన్నది ఒక్కటే తోటివారికి సహాయపడు, లేనివాడికి దానం చెయ్, మన: శాంతిగా బ్రతుకు అనేది కదా. 

అది నిజమేననుకో. ఈలా మారటానికి ఏదైనా కధ ఉన్నదా. అదేం అంత పెద్దది కాదు నా అనుభవంలో తారస బడిన కొన్ని సంఘటన చెపుతా విను.

నాకూతురి పెళ్లి నిమిత్తం దాచిన సొమ్మును పెళ్లికి ముందు రోజు బ్యాంకు నుండి తీసుకోని వస్తున్నాను, దారిలో ఒక్క సారిగా కుంభవృష్టి కురిసినట్లు వర్షం పడటం మొదలైనది, నాలో అప్పుడే భయము పెరిగినది, స్కూటర్ ఆగినది, ఇంటికి పోవాలంటి ఇంకా ఆరగంట పడుతుంది గత్యంతరం లోక ఒక ఇంటి తలుపును కొట్టా, 

లోపలనుండి ఒక వృద్ధురాలు టవల్ తో వచ్చి నా తలను తుడవబోయినది, నేను తుడుచు కుంటాను అని తీసుకోని తుడుచు కున్నాను, రొట్టె, వేడి ' టి ' ఇచ్చింది.  వర్షము తగ్గింది ఉంటావా వెళతావా బాబు అని అడిగింది, ఆమెతో పెళ్లి విషయం చెప్పాను, అంతే అప్పుడే నా దగ్గరకు వచ్చి నూతన వస్త్రములు,  కొంత డబ్బు నా చేతిలో పెట్టి ఇవి నీ కూతురికి నా కానుకగా ఇవ్వు బాబు అన్నది. అప్పడని పించింది దేవుడున్నాడు, ఆపదలో ఆదుకొనే వారిని పంపిస్తాడు అనుకుంటూ అక్కడ ఉన్న ఏసుప్రభుకు నమస్కరించి ఆ తల్లికి నమస్కరించి వెనుతిరిగాను. 

తరువాత నా కూతురి పెళ్లి ఘనంగా జరిగింది, కాపురానికి వెళ్ళింది. ఒక్కసారిగా వృద్ధురాలు గుర్తుకు వచ్చి అక్కడకు వెళ్లగా ఆప్పుడో చని పోయింది అని చెప్పారు. ఎవ్వరు పట్టించు కోవటం లేదు, ఎందు కనగా అని విచారించగా ఆమెకు ఇద్దరు పిల్లలు ' కొడుకు కూతురు ' ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదట అన్నారు. అప్పడే నేను ఆమెకు క్రైస్తవ పద్దతిలో ఆమె పుణ్యలోకాలకు పోవుటకు సహకరించాను. అప్పటి నుంచి నేను ఆ ప్రభువుని వేడు కుంటున్నాను, ఆమె చని పోయిన రోజు గుర్తు పెట్టుకొని సమాధి వద్దకు పోయి ప్రార్ధిస్తాను అన్నాడు. 

అవును రావు గారు ఆవృద్దురాలి తరఫున ఎవ్వరు రాలేదా అని అడిగాడు పతి. తర్వాత వారు వచ్చారు, వారు నాకు డబ్బు ఇవ్వ బోయారు, అవి తీసుకో లేదు నేనే వారికి ఆవృద్దురాలికి సంబంధించినవి వారికి ఇచ్చి నేనే వారికి కొంత ధనము ఇచ్చి పంపాను.                                      

 మానవులంతా సమాన మన్న భావన వెళ్ళు  విరియాలి, ఎవరిలోపాలను వారే గ్రహంచి వాటినుంచి బయట పడాలి. మహోన్నత లక్ష్యాలకు అనుగుణంగా మానవాళి వ్యవహరించాలి. అందరిలో అవగాహన, త్యాగనిరతి వికసింప చేయుటమే నా లక్ష్యం అన్నాడు రావుగారు.
అవును రావుగారు నేను కూడా మీతో ఏకీభావిస్తాను,  నీతోపాటు నేను కుడా సేవాదృక్పధముతో సహకరిస్తాను.          

విశ్వము లో జీవితం -22


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:


కోపం 

కోపం అనేది ఎప్పుడొస్తుందో ఎలా పోతుందో తెలుపుట కష్టము, కానీ ఒక్కసారి కోపంగా ప్రవర్తిస్తే కోపిష్టి గా  అందరు అనుకొనే పారిస్థితి కనబడుతుంది, అది భయము వలనో, తప్పు చేయటం వలనో, సరిదిద్దుకోక పోవటం వలనో చెప్పలేము, కోపం మాత్రం వస్తుంది .

దయచేసి కోపము తెచ్చుకొకండి, కోపం తెచ్చుకునే వారిముందు ఈ ఐదు విషయాలలో ప్రతిఒక్కరు జాగర్తగా మాట్లాడలరు 1 .  ఆర్థికపరమైన నష్టము గురించి విపులీ కరించి, వీరివల్ల జరిగింది, వారి వళ్ళ జరిగింది అని చెప్పవలదు. 2 .   మనస్సులోని పరితాపాన్ని  తొందరపడి చెప్పవలదు. త్రీ.  ఆవేశంతో  స్త్రీల  విషయంలో చెడు మాటలు చెప్పుట మంచిది కాదు, 4 .తనకు పరులవలన కలిగిన మోసాలు చెప్పవలదు 5 . అవమానకరమైన విషయాలను చెప్పవలదు, ఈ విషయాలు ఎవరైనా చెప్పిన కోపమున్నవారు ఇంకా కోపం పెరిగిపోతుంది, వారికీ వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్యం మారుతుంది అని గమనించగలరు.

దీనికి కారణం కోపమున్నవారు 1. మానవశ్రేయస్సునకై చెప్పబడిన రీతిగా ప్రవర్తనలు విడిచి వేయుట 2 .చెడు ప్రవర్తనలకు సంబంధించిన దోషములనే సేవించుట 3 .  తన ఇంద్రియాలను అదుపులో పెట్టుకొనక వానినైన విచ్చల విడిగా విడిచివేయుట,  అటువంటి వారి మనస్సులో నిర్లక్ష భావము, అహం కారాము, అనుమానం, వచ్చి కోపం పెరిగి బలహిత పెరిగి అనారోగ్యులుగా మారుతారు.

కోపం ఎన్నో రోగాలకు మూలం. వివేకవంతులు కోపం తెచ్చి పెట్టుకుంటారు. మూర్ఖులు కోపముతోనే జీవితము గడుపుతారు. కోపాన్ని జాయించక పోయినా పర్వాలేదు కనీసం నిద్ర పోయే ముందు కోపంగా ఉండకండి. తనకోపము తనకు శత్రువు అన్నారు సుమతీ శతక కర్త.
కోపమున ఘనత చిన్నదై పోవును అన్నాడు యోగి వేమన . అపార్ధాలకు కోపం తెచ్చుకోవటం ఎందుకు నిగ్రహించు కోవటానికి ప్రతి ఒక్కరు ప్రయత్నిమ్చాలి. కోపంగా ప్రవర్తిస్తే బంధుత్వాలు చెడి పోయే పరిస్థితి వస్తుంది. సంసారంలో చిక్కులు వచ్చినటులే.

ఆయుధము కన్నా కోపము ప్రమాదమైనది. కోపిష్టికి ఆయుధం అందితే కష్టం కానీ కోపంతో పలికే మాటలు కొందరిని మానసిక వత్తిడికి దారితీస్తాయి, దానివల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి.

కొందరు కన్నుమిన్ను గానని నడి యవ్వనంలో ఉండుట, అప్పుడే ధన సంపద కల్గుట, అప్పుడే మంచి ఉద్యోగమూ వచ్చుట, అందమైన భార్య వచ్చుట, ఈ నాల్గింటితో అవివేకము పెరిగి తాను ఏమి మాట్లాడు తున్నాడో  అర్ధం చేసు కోవటం కష్టం, నడమంత్రపు సిరిలా కోపము వారివెంట ఉంటుంది జాగర్తగా ఉండలి.

కోపము వలన తపము చెరచును, ధర్మక్రియలకు భాదయగును, అణిమాది గుణములు పోవును, క్రోధము అంతరంగమున చేరి ఆరోగ్యమును పాడుచేయును, తోటివారిని బాధ కల్గించును. ఆచి తూచి మాటలతో కోపాన్ని తగ్గించాలి, మనిషిని బట్టి మనిషిగా ప్రవర్తించాలి                       
  

విశ్వం లో జీవితం -21


ఓం శ్రీ రాం - శ్రీ మత్రేనమ:
సహజత్వం

గంగా జలంలో చల్ల దనం ఉన్నా స్నానం చేస్తే ఆరోగ్యదాయకం, అందులో సూర్యొదయమ్ సమయాన స్నానం చేస్తే ఇంకా మంచిది, ఎందుకనగా సహాజ కిరణములు ఉత్తేజముగా జలముపై చేరి కిరణ మెరుపులు కానవస్తాయి. ప్రతిఒక్కరు సూర్యుని సహజత్వ వెలుగును ప్రార్ధించాలి.

ఒక దేవాలయంలో మల్లెతీగ పూలతో సువాసనలతో దేవునికే పరిమళాలు పన్చుతున్నది, దేవుడే ప్రత్యక్షమై నీవు చేసిన సేవకు వరము కోరుకో అనగా నాకు స్వేస్చ కావాలని కోరింది (పైకి ఎదగ కుండ ఉండి పోవాలని ఆలోచనతో ) తధాస్తు అని అంతర్ధానం ఆయనారు. ఎంత ప్రయత్నం చేసిన తన పెరుగు దల ఆపలేక పోయింది, పెరగటం అనేది ప్రకృతి సహజత్వం ఆపటం అసంభవం.

వయసులో వచ్చే మార్పులు ఎవ్వరు మార్చలేరు, సహజత్వాన్ని ఆహ్వానిమ్చవలసినదే, కాలమును బట్టి నడుచుకోవలసినదే, అట్లాగే శృంగార రహస్యాలు ప్రత్యేకముగా నేర్చుకో నక్కరలేదు, చదవ నక్కరలేదు, ప్రకృతి సహకరించటం సంభవం అని తెలుసుకోవాలి.

అట్లాగే బిడ్డ పుట్టగానే తల్లికి పాలుపడటం సహజత్వం, అందం పోతుందని పాలు ఇవ్వకుండా ఉంటె కష్టం తల్లి బిడ్డకు, బిడ్డకు పాలు ఇస్తేనే ఇద్దరికీ క్షేమం, సహజత్వాన్ని ఆపుట అనర్ధం.        

సహజత్వం వల్ల గాలి కానరాకుండా సకల ప్రాణులకు గాలి అందిస్తుంది, విద్యత్ కానరాకుండగా వెలుగు అందిస్తుంది, బిడ్డలలో తల్లి తండ్రుల గుణ లక్షణాలు కానరాకుండా వెంబడిస్తాయి.
ఎవరూ వద్దన్నా ప్రేమ మాత్రం సహజత్వంగా అందరిలో ఉంటుంది అది ఎవ్వరు ఆపలేరు. సహజత్వాన్ని మరచి మరోరకంగా అలోచిసే మేధస్సు నాశనమౌతుంది.

సహజంగా మనం బరువులను మోయం కాని అభిప్రాయాల భారం, ఆదర్శాల భారం, మతాల భారం, కులాల భారం, నాయకుల భారం, అనారోగ్యుల భారం మనతలపై ఉంటుంది. ఇది కూడా సహజాత్వమే.     మానవ జన్మకు ఇంకితజ్ఞాణము ఉన్నది కనుక మనం బరువు మోస్తున్నామని మరవాలి, కాలాన్ని బట్టి నడుస్తున్నామని, మనవేనుక ఒకరు నడిపిస్తున్నారని,  తేలిక భావం తో ఉండాలి, అప్పుడే ప్రతి ఒక్కరు సహజత్వంతో బ్రతక గలుగుతారు.                         

కోరిక గుర్రమనై నిగ్రహ శక్తితో సహజత్వాన్ని వదలకండి, నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు అనేది సహజత్వం, సత్యం, ధర్మం, న్యాయానికి ఉన్న ఉన్న లక్షణాలాతో విశ్వములో జీవితం గడపాలి, సేర్వేజానా సుఖినోభవంతు.      

11, జూన్ 2017, ఆదివారం

విశ్వంలో జీవితం -20

ఓం శ్రీ రామ్ శ్రీ మాత్రేనమ:
తనువు పిలుపు

హద్దు మీరవా  , అలక తీర్చవా, అందాన్ని ఆస్వాదించవా, ఆశయాలు నెరవేర్చు కోవటానికి, ఆశలు  తీర్చకోటానికి రావా,  ఆరాటం తగ్గించుకొని అందు బాటులోఉన్న దాన్ని అందుకోవా, మనసు అందించి, మమతను పంచి మధురాతి మధురాన్ని అందుకోవా, మది తలుపు మర్దన చేయకు, వికసించిన పువ్వు పరిమాళాన్ని అందుకోవా, మౌనం వీడవా, మోజుతీర్చవా, మొఖమాటం పడక, మలుపు మార్గం చూపవా, ముత్యపు చిప్పలో ఉన్న ముత్యాన్ని, ప్రకృతి సౌరభంలో పరవసిస్తున్న దాన్ని, ముగ్గులోకి లాగుతున్నానని అంటావా, ప్రాకృతి ధర్మాన్ని అనుసరిస్తున్నానని అనుకోవా,   అధరామృతాన్ని అందించాలని ఆశగా ఉన్నాను అందుకోవా, ఆలసించినా ఆశాభంగం అనుకోవా, వయసులో ఉన్న ఉడుకు రక్తాన్ని చల్లపరిచి పోవా.

మగువ ముఖలితభావాన్ని అర్ధం చేసుకోవా, మండుటెండల్లో మంచుకన్నా చల్లదనాన్ని అందిస్తానని తెలుసుకోవా, అర్ధాన్ని అర్ధం చేసుకొని, అనురాగాన్ని అందుకోవా, ఆదమరచి నిద్రపోక అదును చూసి ఆడుకోవా, ఆలోచన మార్చుకొని మానుకు చుట్టిన మల్లెతీగలా చుట్టుకోవా, అన్యం  పుణ్యం ఎరుగని అమాయకురాలిని గమనించావా, అహం ప్రక్కిన పెట్టి ఆనందాన్ని ఆస్వాదించుటకు ముందుకు రావా, ఆశా నిరాశలమధ్య నలిగి పోతావా, ఆకలి చంపుకొని, ఆరోగ్యం పాడుచేసుకొని ఆలస్యం చేసినా అనుకున్నది పొందలేవని తెలుసుకోలేవా, అడుగు వేసి ఆణువణువూ తనువు తపనలను తగ్గించుకో లేవా, ఆవేశాలకు అడ్డు కట్ట వేసి, అరమరికలు లేని వెన్నవంటి హృదయాన్ని, తేనెవంటి మాటలతో, వెన్నెలలో విహరించటానికి సహకరించావా.

కౌగిలింత ఆత్మీయతకు నిదర్శనమని తెలుసుకో లేవా, ఓ ఆకాశమా మేఘపు జల్లులతో ఈ తనువు చల్లార్చవా, ఓ సముద్రమా నీ కెరటములలో నన్ను ముంచేయవా, ఓ పుడమి తల్లి నా వాంఛ తీరే  మార్గం చెప్పలేవా, ఓ కాలమా నా ప్రశ్నకు సమాధానము చెప్పలేవా, సుమపరిమళాలను అందించాలను కున్నా, నా మాటలలో తప్పులుండవచ్చు నా నడకలో మాత్రం తప్పులుండవు, నా పరుగులో ఆశలుండవచ్చు కానీ నా ధ్యేయం ఆనందం అందించాలని, హర్షం ప్రకటించాలని, నా ధ్యాస ఎప్పుడు నీ మీదనే అందుకే మనసు ఉండ పట్ట లేక వ్రాస్తున్నాను లేఖ. కొంచం ఘాటుగా, కొంచం ఇష్టంగా, కొంచం వ్యగ్యంగా, వ్రాసిన నా భావాలను అర్ధం చేసుకుంటావని నీ ప్రియాతి ప్రియమైన ప్రేయసి లేఖ.                             

9, జూన్ 2017, శుక్రవారం

విశ్వం లో జీవితం - 19


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
ఒకప్పుడు  - ఇప్పుడు

ఒకప్పుడు చదవని వారిని  గుంజిళ్ళు  తీయించేవారు, గోడ కుర్చీలు వేయించేవారు,  పేను బెత్తాలతో ,వీపులు వాచేవి,   
గురువులతో ఇంకా కొట్టండి మా పిల్లలకు చదువు రావాలి అనేవారు తల్లి తండ్రులు.
ఇప్పుడు చదువును కొనుక్కొనే పద్దతి వచ్చింది, డబ్బు కడుతున్నాము కదా దెబ్బ పడకుండా చదువు రావాలి అనే తల్లి తండ్రులు ఉన్నారు, చదువు రాకపోయినా పర్వాలేదు ట్యూషన్ క్లాసుల్లో కూర్చోబెట్టండి అంటున్నారు. ఇప్పుడు గురువులు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది, ఎందు  కనగా దృశ్య, శ్రవణాల ద్వారా చూపించటం జరుగుతున్నది. ఉపాధ్యాయ ఉద్యోగాలకు పంగనామా పెట్టె పరిస్థితి వచ్చింది. ఇటువంటి విద్యా భోధన అవసరమా ?

ఒకప్పుడు నిస్సహాయునకు సహాయము చేసేవారు, ఇప్పుడు ఎవరికన్నా సహాయము చేద్దామంటే అడిగేవారు కనిపించుటలేదు, అందరు మేధావులుగా మారుతున్నారు, సహాయం పొందినవారు మరచిపోతున్నారు, చేసినవారు అడగలేక నోరు మూసుకుంటున్నారు ఈ పరిస్థితి ఎందు కొచ్చిందంటే ధన ప్రభావము పెరుగుట వలన అనేది నిజమేనా ?     

ఒకప్పుడు తెలివికి బలానికి వచ్చేది గెలుపు, ఇప్పుడు ప్రక్కవాడిని మోసం చేసో, అధికారులు డబ్బు ఆశకు లొంగి పోయి, అనర్హతలను అందలం ఎక్కించే పరిస్థితి ఉన్నది ఎందుకో చెప్పగలరా ?

 ఒకప్పుడు పిల్లలకు చెప్పే పాఠం మనకన్నా పెద్దవారివద్ద నేర్చుకోండి అనే పాఠం అనేవారు, ఇప్పుడు పిల్లలకు చెప్పే పాఠం నీ పక్క పిల్లవాడు జాగర్త, ఆ పక్క వాడు బాగా తెలివి మీరాడు జాగ్రత్త అని చెప్పే గుణ పాఠం. పిల్లలు పాఠాలు వినక సెల్ ల్లో  ఆడినా, పిల్లలను  ఏమీ అన కూడని పరిస్థితి ఉపాద్యాలకు ఏర్పడినది. 

ఒకప్పుడు లేనివాడు ఉన్నవాడిని  దోచుకొనేవాడు, ఉన్నవాడిగా బ్రతకాలని కష్టపడేవాడు. ఇపుడు ఉన్నవాడు లేనివాడ్ని చులకన చేయటం, నేనే ఇంత వాడ్ని  అగుటకు ఎంతో కష్టపడ్డాను కడుఁ కధలుగా చెపుతాడు, వాడు ఎలా సంపాదించాడో అందరికీ  తెలుసు కానీ నోరువిప్పలేని పరిస్థితి  అది ఎందుకో మీరేచెప్పగలరా? 
,  
ఒకప్పుడు మనం అనే భావన ఏర్పడి ప్రేమ పరిగేది, ఇప్పుడు ప్రేమగా పిలిస్తే నాకేంటి లాభం, లాభం లేనిచోట ప్రేమ కురిపించటం వ్యర్థం, సమయం వ్యర్ధపరచడం అనవసరం. డబ్బు  ఉన్నచోట ఒకరకమైన ప్రేమ, డబ్బు లేని చోట మరో రకమైన ప్రేమ ఇదేమి లోకం ?  
    
 ఒకప్పుడు నులక మంచమే సుఖ నిద్రకు తార్కాణం ఎందుకంటే ఒకరిమీద ఒకరికి నమ్మకమైన ప్రేమ ఉండేది, ఇప్పుడు రకరకాల పరుపులు మీద శయనించిన నిద్రరాని పరిస్థితి ఎందుకంటే శారీరానికి కష్టం కలుగట లేదు, సాధ్యముకాని,  నమ్మకము లేని ఆలోచనలతో ఉండటం వల్లనే, కాలం మారుతున్న ఆశలు పెరుగుటవల్లా సంపాదన పెరుగుటవల్లా అప్పులు పెరుగుటవల్లా   జీవితం దుర్భరంగా మారుతున్నది. 

అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే బీదవాడు బీదవాడే, ధనవంతుడు ధనవంతుడే , ఎవరి స్నేహం వారిది, ఎవరి ప్రేమ వారిది తారతమ్యం మారేదెప్పుడు, వారు వీరయ్యేదెప్పుడు వీరు   వారయ్యేదెప్పుడు లోకంలో మార్పుకోసం వేచి ఉండేటంతప్ప ఏమీ చేయలేని మధ్యతరగతి మానవులం  ఒకప్పుడు ఇప్పుడు మారలేదు ఎందుకు ?

8, జూన్ 2017, గురువారం

విశ్వములో జీవితం-18

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
 
మహిళ

మహిళలు మహారాణులన్నారు ఒక కవి, మహిళలు మంద మతిని కూడా మహాన్నత వ్యకిగ మార్చే శక్తి మహిళల కున్నదని అంటాడు ఈ కవి. పుడమి తల్లికి ఉన్న ఓర్పు ప్రతి మహిళ యందు అంతర్గతముగా ఉంటుంది, బ్రహ్మాండ లోకాన్ని ఎలే శక్తి ఆదిపరాశక్తికి ఉన్నట్లు సంసారాలను సక్రమ మార్గంలో పెట్టే శక్తి మహిళా మనులకే ఉన్నది.

వీణాది సాధనముల యొక్క రూప సౌందర్యములను తంతువులను మీటుచూ పాడెడి  నైపుణ్యమున్న పాటను వినునట్టి ప్రజలను రంజింప చేయును.
పుష్పము వికసించి పరిమళాలను వెదజల్లగా వాటిని ఆస్వాదించి ఆనంద సౌరభాలల్లో ప్రజలు మునిగి పోయెదరు.
చిరు జళ్లుల్లో తడిసి, తెలియని తన్మయత్వం పొంది, అగ్ని కోసం తపించి ప్రకృతిలో నివసించే ప్రజలు ఆనందంలో మునిగి పోయెదరు.            
మహిళళ యొక్క  మనస్సు దేహాది సర్వవిషయములందును అనురాగము కల్పించి, తాడుచే  పశువులను భంధించినట్లుగా రాగమని పాశముతో భందించి వేయును.
వాయువుచే రప్పించ బడిన మేఘము మరలా వాయువుచే నెట్టవేయబడి నట్లుగా మనస్సుతో బంధించిన మహిళలు మరలా ఆ మహిళలే మనస్సును కించపరిచే విధముగా ప్రవర్తించుదురు.
దానిని ప్రేమ అనుకోన వలెణా ? మగవారిపై అనుమానం అను కోవలెణా?, మగవాని బుద్దిని బట్టి అలా ప్రవర్తించుట వల్లనా ? సంసారము చక్కబెట్టుటకు మహిళలకు పూర్తి స్వాత్రంత్రము ఇవ్వటం జరుగుతున్నందువల్లానా? .   

నూతిలో కప్పు నీలల్లో ఉన్న నాచును తిని ఇదే ఆహారము అని సంతృప్తి పడేది. అట్లాగే భర్త సంపాదనమీద భార్యలు ఆధారపడేవారు ఒకనాడు, ఈనాడు మహిళలు విద్యనభ్యసించి ఉన్నత పదవులను స్వీకరించి మగవాళ్లతో సమానముగా కష్టబడు తున్నారు. కానీ ఇంటి యందు ఉద్యోగము నందు మహిళలే ఎక్కవ కష్ట బడాల్సిన పరిస్థితి వస్తున్నది ఇది అవసరమా ?
          
ప్రతిఒక్కరు లోకవాసనకు, దేహ వాసనకు, శాస్త్ర వాసనకు కట్టు బడి ఉంటారు. "ధన వనితాది విషయము లందు రాగము, స్వగుణ ప్రకటన మందు ప్రీతి, పరగుణ విషయమున ద్వేషము నను నీ మొదలగునవి లోకవాసన యనబడును. దేహము నందు రాగ పూర్వకమగు పోషణాసక్తి దేహవాసన యగును. శాస్త్రాలను పఠించి అదేవిధముగా ప్రవర్తించి, అనుకరించి, మసలు కొనేదే శాస్త్ర వాసన అనబడును. సంసారము చక్క బరుచుటకు మహిళలు లోకాన్ని గ్రహించుట, దేహాన్ని అర్పించుట  శాస్త్రాన్ని అనుకరించుట, సత్యాన్ని ధర్మాన్ని న్యాయాన్ని రక్షించుటకు మహిళలు ఉన్నతోన్నతులు గా వెలసిల్లి మగవానికి చేదోడుగా ఉండుట భారతీయులకు వెన్నతో నేర్పిన విద్య.               

7, జూన్ 2017, బుధవారం

విశ్వం లో జీవితం -17


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

వృద్ధాప్యం.

వయసుకు వస్తుంది వుద్ధాప్యం మనసుకు మాత్రం రాదు, మనసు మమతలను పంచుకోమంటుంది, అనుభవాలను తెలపాలని ఉబలాట పడుతుంది. బాబు బాగున్నావా అని మనవడిని అడిగితె, ఎం తాత ఎం క్కావాలి.     

కళ్ళు కనబడుట లేదా కళ్ళ జోడు తెచ్చి ఇవ్వమంటావా, కాళ్లకు చెప్పులు తెచ్చి ఇవ్వమంటావా, చేతికి కర్ర తెచ్చి ఇవ్వమంటావా, గొడుగు కూడా తెచ్చి ఇవ్వమంటావా, మంచినీళ్ల మరిచెంబు తెచ్చి ఇవ్వమంటావా, ఏమీ వద్దంటే పడక కుర్చీ తెచ్చి ఇస్తా, దానిపై బల్ల కూడా తెచ్చి ఇస్తా, పాపరు, పుస్తకము, కలము తెచ్చి ఇస్తా మమ్మల్ని మాత్రం ఇంకేమి అడుగుకు తాతా అంటాడు కొంటె మనవడు.           

నిండా పది నిండా లేదు వయసు, ఎంతో పెద్ద మాటలు చిన్న పిల్లల నుండి వినవలసి వయసు
ఇదా.

వృద్ధాప్యం ఒక మజిలీ. స్నేహితులతో కాలక్షేపం చేసి లోకాభిరామాయణము విని, కొంత సేపు కూర్చొని, నడిచి నెమ్మదిగా మనసులోని భావాలను పంచుకొని భార్యవద్దకు చేరి ఈరోజు అంతా  ప్రసాన్తముగా జరిగి పోయింది కాళ్లు కడుక్కుంటు ఒక నిట్టుర్పు విడిచి, చెప్పులు మూల విడిచి, కాఫీ ఇస్తావా ఓ శ్రీమతి అని పిలిచి, నాకు నీవు నీకు నేను, అంటూ సంబరపడటమే వృద్ధాప్యం.

మనవుడు తాత వద్దకు వచ్చి నాకు మంచి మాటలు చెపుతావా అని అడిగాడు. మన మనసు మంచిగా ఉంచుకుంటే ప్రతి మాట మంచిగా వినబడుతుంది. మన మనసు ఆలోచనలతో తిరుగుతూ ఉంటె ఎవరు ఏమి చె ప్పిన బుర్రకు ఎక్కదు, అయినా చెపుతాను విను అన్నాడు తాత.

అభయం అందుకో - ఆదుర్దా తగ్గించుకో
అహాన్ని  వదులుకో - ఆశయం నిలుపుకో
ఇష్టాన్ని పంచుకో  - ఈశ్వరుని తలచుకో
ఉదయాన్ని వేడుకో - ఊహల్లో కలుసుకో

ఋణమే టిఇర్చుకో - ఏకమై ఏలుకో
ఒక్కడై తెలుసుకో - ఓర్పుతో మసలుకో  
కళనే నమ్ముకో - గళాన్ని వాడుకో
చపలం వదులుకో - జగడం మానుకో

టక్కరి మానుకో - డబ్బాశ వదులుకో
నడక నేర్చుకో  - నమ్మకాన్ని పెంచుకో 
తప్పులు దిద్దుకో - ధర్మాలు తెలుసుకో
మనసు పంచుకో - బలం పెంచుకో

అట్లాగే తాతయ్య అంటూ వెళ్లి పోయాడు.
             
వయస్సులోని కోరికలన్నింటికీ సెలవిచ్చి, అలసిపోయిన అనుభవాలనీ, ఆరిపోయిన అనుభూతులనూ నెమరువేసుకునే చలివేంద్రం. వృద్ధాప్యం ఒక అవకాశం. వెనక్కి తిరిగి చూసుకుని చేసిన తప్పిదాలకు నవ్వుకుని, దాటిన అడ్డంకులను పరామర్శించి, ఇక దాటనక్కరలేని స్థితికి వచ్చినందుకు ప్రశాంతంగా నిట్టూర్చే ఆటవిడుపు వృద్ధాప్యం..

6, జూన్ 2017, మంగళవారం

విశ్వములో జీవితం -16

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

ప్రేమ
హృదయ లోతుల్లో పరీక్ష జరిగితే గాని ప్రేమ ఉన్నట్లు తెలియదా? సహజంగా మాటల అర్ధం బట్టి
తెలుసుకోలేరా? హృదయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నేనున్నాను అని శబ్దం చేస్తూ గడియారం లా కదులుతూ ఉంటుంది. ప్రేమను శుద్ధి చేయటానికి కొన్ని హృదయాలు తపిస్తూ ఉంటాయి.

సాధకుడు జ్ఞాణమా అజ్ఞాణమా అనేది ఎదో తెలుసు కోలేక పోతున్నాడు, మనసులో ప్రేమ ఉన్నా నోరు విప్పి చెప్పలేక పోతున్నాడు, పరిస్థితుల ప్రభావమా, వాతావరణ ప్రభావమా, ధైర్యము లేక ప్రేమను కుడా వ్యక్త పరచలేని పరిస్థితులలో ఉండుట ఎందుకు ?   అప్పుడు చెప్పాలనుకున్నా కుదరలేదు, ఇప్పుడు చెప్పలేకున్నా, ఇంకా సమయము రాలేదు అని ఊరుకున్న, అదేపనిగా ఆలోచించినా ఎక్కాల్సిన రైలు రావటము పోవటం జరిగి పోతుంది.

నదికి నీరు లేకపోతె నిరుపయోగం, జేబులో ధనము లేకపోతె నిరుపయోగం, రక్త సంభందానికి  ప్రేమ చూపక పోతే నిరుపయోగం, మనిషిని మనిషిగా గుర్తించలేకపోతే ప్రేమ ఉన్న లేనట్లే కదా ?

ప్రతియొక్కరు గమనించాలి మమతా కన్నా మనసు మిన్నా, మనసుకున్న ప్రేమ మిన్నా,ప్రేమ ఉంటె జీవిత మంతా సుఖమేనన్నా.

మృగాలకన్నా మనుష్యులు మిన్నా, ఎందుకంటే అవి భావాన్ని వ్యక్త పరచలేవు, మనమయితే భావంతో అటు ప్రేమను కుడా తెలియ పరచగలము.

వయసు కన్నా వలపు మిన్నా అన్నారు పెద్దలు, ఎందుకంటే వయసు కాదు సంతృప్తి పరచేది,  వలపు ఉంటేనే ఇరువురి మధ్య ప్రేమ పెరుగుతుంది.

ఆదర్శాలు కన్నా ఆదరణ మిన్నా, ఎందుకంటే ఎన్నైనా చెప్పవచ్చు ఆచరించని వాడు, ఇతరులను ఆదరించి గౌరవించుట లోనే ప్రేమ కనబడుతుంది. 

వెలయాలి కన్నా ఇల్లాలు మిన్నాఅన్నారు ఎందుకంటే ధనం ఉంటేనే వెలయాలి ఉంటుంది, ధనము లేకున్నా ఇల్లాలు సుఖమనే ప్రేమను పంచి ఆరోగ్యవంతునిగా చేస్తుంది.

సంపద కన్నా సంతృప్తి మిన్నా అన్నారు, ఎంత సంపద ఉన్నా ఆశ చావక పొతే అంతా నరకమే, సంపద లేకున్నా ఉన్న దానితో సంతృప్తి పడితే దానిలో నిజమైన ప్రేమ కనిపిస్తుంది.

పిల్లలను కనటం కన్నా ప్రేమను పంచటం మిన్నా అన్నారు ఎందుకంటే వయసులో ఉన్న ప్రేమ ప్రభావము వళ్ళ పిల్లలు పుడతారు, వయసుడికిన తర్వాత కూడా పిల్లలు ప్రేమను పంచగలిగితే ఆ మనుష్యుల యొక్క జీవితం నిశ్చ కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది.            
                         .    
నా జీవితం నా అదృష్టం, నా తప్పులు నాకు పాఠాలు, మన జీవితమే ఒక అద్దం లాంటిది, మనం నవ్వితే నవ్వుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది, కానీ ప్రేమకు రూపం లేదు అర్ధం చేసుకొనే మనస్తత్వం ఇచ్చాడు దేవుడు, నిదానంగా,  నిలకడగా ఆలోచిస్తే ప్రేమ లేని మనుష్యులు ఈ లోకంలో లేరు, వారిని గుర్తించి ప్రేమను పొందటంలో ఉన్నది మానవ జన్మ సార్ధకం.
        

5, జూన్ 2017, సోమవారం

విశ్వములో జీవితం -15

ఓం శ్రీ రామ్  - శ్రీ మాత్రేనమ:
నిజాయితి?
క్యాలండర్ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకో తెలుసా రాబోయే పుట్టిన రోజు, పెళ్లి రోజు గూర్చి ఆలోచనలు మనసుకు చేరి ఎంత ఖర్చు పెట్టాలి ఎంతమందిని పిలవాలి ఎక్కడ చేయాలి అని ఆలోచిస్తారే తప్ప  ఒక బీదవానికి చదువు సహాయము చేద్దామని, ఆలోచన చేయరు ఎందుకు ? ఇది నా సంపాదన నాయిష్టం అని అనుకుంటారు కదా ! మనం చేసే పని ఇతరులను తృప్తి పరిచే విధముగా ఉండాలని గమనించారు ఎందుకు?.     

ఆసక్తి కరమయిన విషయాలు, బుద్ధిపూర్వకంగా చిట్కాలు, సమావేశాలు, సమీక్షలు జరుపుతారు ఆచరణకు వచ్చేటప్పటికల్లా ఆర్ధిక వనరులు తక్కువని, తాహాతుకు మించి పోకూడదని సర్దుకొని జీవనం గడుపుతారు.

సాంకేతిక పాపంపంచంలో కేవలము టెక్నాలజీని నమ్ముకొని ముందుకు పోతున్నారు, అది ఎప్పుడు చెడునో ఎవ్వరు చెప్పలేరు. ఒక గొర్రె గట్టు దాటిందనుకో మిగతా గొర్రెలన్నీ గట్టు దాటుతాయ్
కష్టంలో నుంచి సుఖం పుడుతుంది. సుఖం అలవాటు చేసి కష్టపడ మంటే ఎంతో కష్టం. మనిషి మేధస్సు ను ఉపయోగించుకోండి. సమయము ఎక్కువ తీసుకున్న శాస్వితంగా పని జరుగుతుంది. ఒక్క రోజు విధ్యుత్ ఆగిపోతే లక్షల ఉద్యోగలు ఏమి చేయలేక ఉన్నారు, ఇటువంటి సాంకేతిక విద్యమనకవసరమా?            

సాంకేతికత ప్రపంచాన్ని మరింత అసమానంగా చేస్తుంది. కేవలం టెక్నాలజీ దీనిని పరిష్కరించగలదు
సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చెడుగా నడపబడుతున్న లేదా అవినీతి రాష్ట్రాల్లో అసమానత పెరుగుతుంది - అయితే ఈ రాష్ట్రాలను అస్థిరమివ్వడానికి సాంకేతికతను కృతనిశ్చయంతో కూడా ఇది సులభం. భవిష్యత్ విజయం ఏది?

దేశం ఒకసారి వేగంగా ముందుకు పోతున్నది మరియు ధరలను తగ్గించి ప్రజలకు సేవచేయాలని సంకల్పంతో ఉన్నది . ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని ప్రాజెక్టులు ఎందుకు ఎక్కువ సమయం తీసుకుంటారో ప్రజలకు అందుబాటులో తేలేకపోతున్నారు  ఇప్పుడు నిపుణులు ఆలోచిస్తున్నారు.

సలహా సాధారణంగా నిర్లక్ష్యం చేయుట మరియు నియమాలు మామూలుగా జరుగుట వలన,  ఈ చిన్న ముత్యాలను కేవలం "సూచనలు" గా పరిగణిస్తున్నారు తప్ప ఆచరణకు నోచుకోవటంలేదు .

మానసిక ఉల్లాసానికి  సంగీతాన్ని వింటున్నాను.  మేల్కొలపడానికి మరియు సంగీతాన్ని ఆన్ చేస్తున్నాను, మ్యూజిక్ వింటూ నేను నిద్రపోతున్నాను, నిజాయితీగా నేను సంగీతాన్ని వింటున్నాను, పార్కులో ఉన్నప్పుడు మరియు వీధిలో నడుస్తున్నప్పుడు మరియు నేను  సంగీతానికి నా చెవులు తెరిచి ఉంచుతాను. అతి వినోదం అనర్ధం అన్నట్లుగా అదేపనిగా విన్న శ్రవణ నాడులు చెడిపోతాయి అని గమనించలేకపోతున్నారు నేటి యువ ప్రపంచం.  

స్వార్ధం, కృరత్వం,  ఆధిపత్యం ఎక్కవగా పెరుగుతున్నది.
దాన్ని తట్టుకొవాలంటే జ్ఞానోదయం కలిగించే విద్య నేర్చుకోవాలి.

ఒకరోజు అనుకోకుండా ఒక స్కూలు వద్దకు పోయాను
నేను పక్కనే ఒంటరిగా బెంచ్ మీద కూర్చున్న నాలుగేళ్ల బుడ్డోడు నన్ను ఆకర్షించాడు .....
వెళ్లి పక్కన కూర్చుని " ఏమ్మా ఇంకా అమ్మ రాలేదా తీసుకెళ్ళడానికి "? అని అడిగాను ...

" అమ్మలేదు " అన్నాడు అదోలా... నాకు మనసు చివుక్కుమంది..

" ఓహ్ నాన్న వస్తారా అయితే నిన్ను తీసుకెళ్ళడానికి " అనడిగా.
.
" నాన్న లేడు" అన్నాడు అదే భావంతో ...

నా మనసనే కడలి కల్లోలమై కన్నీరు కెరటాల్లా రాబోతుండగా ..

" మరి ఎవరు తీస్కేల్తారు "అని అడిగా .....

బేలగా చూస్తూ " మమ్మీ గానీ డాడీ గానీ వస్తారు" అన్నాడు వాడు టక్కున.

ఎందుకు పిల్లలు చెడిపోతున్నారో నాకు అర్థమైనది, దానికి కారణం తల్లి తండ్రులే ఆధునిక విద్య మోజులో పడి మాతృ భాషను మరుస్తున్నారు. టివి లలో అసభ్యకరమైన దృశ్యాలు చూడకుండా జాగర్త పడక సహకరిస్తున్నారు ఇది అవసరమా ?   . మీ పిల్లలకు కనీసం మీ పేర్లయినా తెలుగులో నేర్పించండి.... మనసంస్కృతి సాంప్రదాయాన్ని నిలపెట్టండి.  దేశప్రగతికి తోడ్పడండి, నిజాయితిగా బ్రతకండి.   విశ్వములో జీవితం -14

ఓం శ్రీ రామ్ - ఓం శ్రీ మాత్రేనమ:
 
మాటల శైలి

ఒకడున్నాడు, చెప్పిన మాట చెప్పకుండా గబా గబా చెప్పుకు పోతాడు, అతని మాటలు వింటున్నారా లేదా అని కూడా ఆలోచించాడు, మాటలలో ఎక్కడ దొరుకుతానో అని భయం మాత్రం ఉంటుంది. ఆ భయం కనబడకుండా నవ్వించటానికి తన ప్రయత్నం చేస్తాడు. అందరూ అతన్ని వాగుడు కాయ అని అంటారు.    

కొన్ని పరిస్థితులలో మాటలు కుండ పగలకొట్టినట్లు ఉన్నాయి, మాటల్లో తెగింపు కనబడుతుంది. పిరికి వానికి కూడా కొంత ధైర్యము తెప్పిస్తుంది అతని మాటలు, ఆలోచనలో కొంత మంచి విషయం  బయట పడుతుంది, ఎట్టి పరిస్థితుల్లో చెడుమాట కనబడదు, ప్రతిఒక్కరు ఆలోచించే విధముగా అంటుంది.

జ్ఞాపకంతో చిన్న నాటి విషయాలు కధలుగా చెప్పుతాడు, చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళను కూడా మాటలలో మరచిపోయేటట్లుగా మార్చేస్తాడు. అతని మాటలు ఎప్పుడు వినయ్ పూర్వకముగా, ఆప్యాయతగా, ఎంతో స్నేహ పూర్వకంగా మనసును కట్టేసే విధముగా ఉంటాయి.

తలకుల బెళుకుల సోయగాలు చూపుతాడు, అజ్ఞానులను విజ్ఞానులుగా మారుస్తాడు, అనారోగ్యు లను తనమాటలతో ఆరోగ్యవంతులుగా మారుస్తాడు.  తెలిసిన మంచి విషయం చెప్పేందుకు తపిస్తాడు, చేదు విషయాన్ని చెప్పకుండా దాటేస్తాడు.

తన మాటల శైలితో పోరాటాన్ని ఆపుతాడు, దుఃఖాన్ని తొలగిస్తాడు, సుఖాన్ని కపిస్తాడు.  

మన కలల్లో చూసే ప్రదేశం, సమయము, వస్తువులు తెలుసుకొనేవాడు మొదలగునవన్నియూ అసత్యములే, సత్యములని భ్రమలో ఉండటం అనవసరం,   అదే విధముగా మనము ఎఱుక స్థితిలో అనుభవించే ఈ ప్రపంచము అంతా ఆ వ్యక్తి యొక్క జ్ఞాన -అజ్ఞాన ఫలి తాలే. ఎందువలనంటే ఈ శరీరము, శరీర భాగాలు, ఒక్కసారి కొన్ని మాటలకూ కదలటం జరుగుతుంది. కొందరి  ప్రాణాలు రక్షించటం జరుగుతుంది, మరికొందరి ప్రాణాలు భయంలో ముంచుతాయ్, అదేవిధముగా  అహం పెరిగి వారు ఏమి మాటాడుతునాన్రో తెలియక నోటికివచ్చినట్లు పేళుతుంటారు వారి నుండి తగు జాగర్త పటటమే అందరికి మంచిది. పవిత్రమైన, స్వచ్ఛమైన, ఉన్నతమైన బ్రహ్మావాక్కు ఫలితాలు ప్రతిఒక్కరు గ్రహించాలి.                 

4, జూన్ 2017, ఆదివారం

విశ్వములో జీవితం -13


ॐ श्री राम - श्री मात्रेनम:
ఋణం
అర్ధం పరమార్ధం కొరకు ప్రతిఒక్కరు కలియుగంలో తమవంతు సహాయా సహకారములు అందించుటే మానవ జన్మ సార్ధకం. దీనికి ప్రకృతి సహాయ సహకారములు అందిస్తున్నది. కాలముల బట్టి మన ప్రవర్త మార్చుకుంటూ సమయమును బట్టి ధర్మాన్ని విశదీకరించుటే మానవుల ముఖ్య లక్షణం.

ధనము, యవ్వనము, పుత్రులు, బంధువులు ఎవ్వరూ, స్థిరముగా ఉండలేరు. స్థిరముగా ఉండేది  మనం నేర్చుకున్న విద్య మాత్రమే, మనల్ని కన్న తల్లి తండ్రులే.

ఇంద్రియ భోగ వాంఛలు మనస్సు చేసే సంకల్పాలు, వాటిని అనుసరించటం తప్ప అదుపు ప్రయత్నం చేయలేము. ఆయినప్పటికీ భగవంతునిపై ప్రేమ ఉన్నట్లయితే మన:శాంతి కలుగు తుంది. భగవంతునిపై ఒక తపన భావంతో ఉండాలి. ఎట్లాగంటే ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు స్వదేశానికి వెళ్లాలని తపన లాగా, పెళ్లైన అమ్మాయి అత్తారింటికి వెళ్లిన పుట్టింటికి వెల్లాలని కోరిక లాగా, సముద్రము వడ్డును దాటే ప్రవహించాలని పొంగులాగా, దేవునిపై నిరంతరమూ నమ్మకంతో ముందుకు సాగాలి. జననము, మృత్యువు, ముసలి తనము రోగము తప్పవు అని తెలుసుకోవాలి.

భక్తి సాంగత్యానికి ఏడూ రకాల వ్యక్తులు మన:శాంతికి అడ్డు పడతారు.
1 . మాయావాదులు, నాస్తికులు,
2 . ఇంద్రియ భోగాలు,
3 . ఇంద్రియభోగాలంటే ఇష్టాపడేవారు,
4 . స్త్రీలు,
5 . స్త్రీలంపటులు
6 . కుహనాభక్తులు
7 . అసభ్యవ్యవహారము కలిగిన మూర్ఖులు.

మానవులుగా మరీనా ప్రతిఒక్కరు మూడు రుణాలు తీర్చాలి.
1 . దేవతా ఋణం : యజ్ఞాలు యాగాలు, నిత్యపూజలు దేవునికి నైవేద్యాలు అభిషేకాలు చేయాలి.
2 .ఋషి ఋణం : వేదాధ్యనం, విద్యాదానం, ప్రతి ఒక్కరు చేయాలి,
3 . పితృఋణం : తల్లి తండ్రుల ఋణం తీర్చుట ప్రతి ఒక్కరి లక్ష్యం గా మారాలి 


3, జూన్ 2017, శనివారం

విశ్వములో జీవితం -12
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

రక్ష
మనసు శుభ్రముగా ఉంచుకొని మన చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయుటకు సహకరించండి. మన జీవితకాలం ఒంటరి అని భావించకండి, ఫలితాలు ఆశించకుండా ప్రేత్యేక శ్రద్ధతో ముందుకు ఇంకా విద్యా సాధనతో, భక్తి సాధనతో  ముందుకు సాగటమే మానవుల లక్ష్యం. మనలో ఉన్న శక్తి ప్రభావం కీర్తికి ఆదర్శం.

ఒక్క అడుగు ముందుకు ధైర్యంతో వేసావంటే వెనకడుగు వేసేది లేదు, మెత్తటి షూస్ వేసుకుంటే చీలమండల రక్షణ ఉంటుంది. సాక్సు లేకుండా వాడినా పర్వాలేదు, మురికి సాక్సు వేసుకుంటే చర్మమునకు హాని కలుగు తుంది.    

తటస్థ వైకిరి ఎప్పుడూ ఉండ కూడదు, విజయ లక్ష్యం తో ముందుగు సాగాలి, సాంప్రదాయం సహకారం ఉంటుంది. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. 

ఆటో మిషన్ల కంపెనీల ప్రభావము పెరుగు తున్నది, నిరుద్యోగ సమస్యకు కారణ మవుతున్నది. చదువుకున్న వారికి సహకారం లోపిస్తున్నది, మేధావుల ప్రభావము ఎలా ఉంటుందో ఎవ్వరూ ఊహించ లేకున్నారు, దేశప్రగతి ఒక వైపు మరోవైపు దేశ ప్రజల ఉన్నతిని గమనించి ప్రభుత్వము పరంగా సహకరించాలి.                    

చంద్రమండలపై నివసించటానికి అగ్రరాజ్యాలు ప్రయత్నిస్తున్నాయి. ఇది కూడా అభివృద్ధికి సాంకేతం
సరిఅయిన వసతులు లేక గ్రామాలలో అంగ వైకల్యులుగా మారు తున్నారు, పట్టణాలలో ఆధునిక సౌకర్యములున్న నిర్లక్ష ప్రభావము, ఆర్ధిక ప్రభావము వళ్ళ అంగ వైకల్యులుగా మారుతున్నారు. దీని పట్టించు కొనే వారెవరు.      

సంగీత్ సాధనాలు మనస్సుకు తాత్కాలిక ఉపశమనం అందిస్తాయి, పెద్దల మాటలు మనసును ఆలో చింప చేస్థాయి. ఏది ఏమైనా మానవుల జీవితం  ఒక చిక్కు ప్రశ్న గా మిగిలి పోతున్నది. ఎవరో వచ్చి ఎదో చేస్థారని ఎదురు చూసి మోసపోకుమా, ప్రతి జ్ఞాపకం మనసుని కదిలిస్తుంది కానీ మనసు జ్ఞాపకాన్ని కదిలించలేదు, వెలుగులో ఒంటరిగా బ్రతకవచ్చు కానీ చీకటిలో కలసి బ్రతకటంలో ఉన్న సుఖం మ్మారెక్కడా కానరాదు, రహస్యాలు పంచుకుంటూ, ఇచ్చి పుచ్చు కుంటూ ఉండేది   నీవు నేర్చిన విద్య నీకు శ్రీరామ రక్ష      


విశ్వములో జీవితం -11

ఓం శ్రీ రామ్ - ఓం శ్రీ మాత్రేనమ:
Anaesthesia: What We Still Don't Know About the 'Gift of Oblivion'

వ్యసనాలు

ప్రజల మానసిక రోగానికి, మనసు వత్తిడి లోను కావటానికి కొందరిలో కొన్ని అలవాట్లు,
మత్తు మందులు అధికంగా వాడటం ఒక కారణం కూడా అవుతున్నది. అనారోగ్యమని తలంచి అదేపనిగా మందులు వాడటం కూడా ఒక కారణం అవుతున్నది.

తల్లి తండ్రులకు సేవ చేయటానికి. ఉద్యోగ భద్రత కొరకు పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి, హృదయం కలత చెందకుండా జాగర్త పడాలి. మనస్సు నిరుత్సాహము చెందకుండా, ఇతరులను నిరుత్సాహము పరచ కుండా బ్రతకాలి.           

అనేకమైన వత్తిడులు సంభవించి నప్పుడు ఆక్సిజనేట్ గ్లూకోజ్ యొక్క మీ మెదడును మరింత దృష్టి సారిస్తుంది, సంభాషణల మధ్య పనుల మధ్య తరతమ్యము కనబడును. స్థాన బ్రన్సమ్ వళ్ళ వచ్చిన  ఆలోచనలు మారును.    
.
శాంతి, ప్రేమ మరియు నిజాయితి అనేవి మూడు కన్నులు ఇవి సరిగా పని చేయవు, అసహ్య కరమైన భావోద్వేగాలు మరియు భౌదిక మానసిక ఆటంకాలకు లోనవుతారు.    

ధూమ పానము, మత్తు మందు (గంజాయి) అలవాటు చేసుకుంటే ఆరోగ్యం ఖచ్చితముగా చెడు నని తెలుస్తున్నది.
 
ఈ అలవాట్లు స్నేహము వలన, పరిసర ప్రాంతాలవలన, కుటుంబంలో కొన్ని సంఘటనల వల్లన, తల్లి తండ్రుల అలవాటు వలన కొందరు మారుతారని తెలుస్తున్నది  

నేటి మీడియా,  రాజకీయాలు ప్రభావము, ఆర్ధిక ఇబ్బందులు మరియు సంసారంలో సంఘటనలు వళ్ళ మారతారని తెలుస్తున్నది. ఎన్ని వత్తిడులు ఉన్నా దృఢసంకల్పము మార్చకూడదు ఎవ్వరూ  

సోమవారం నుండి శుక్రవారం వరకు మీ ఆలోచనలు పరి పరి విధాలుగా మారుతాయి అందుకే మిగతా రెండు రోజులు ప్రశాంతి కొరకు బ్రతకాలన్నారు.   

కొన్ని రోగాలకు మత్తు మందు ఇవ్వ వలసిన పరిస్థితి ఉన్నది. అది తగు మోతాదు ఇచ్చిన ఆరోగ్యము బాగు పడుతుంది. మోతాదు మించిన ఆరోగ్యం పాడవుతున్నది.

ఏది ఏమైనా వ్యసనాలకు బానిసలుగా మారటం తేలిక, పట్టుదలతో వ్యసనాలనుండి మారటం ప్రతి  వక్కరి కర్తవ్యం.