24, జూన్ 2017, శనివారం

విశ్వములో జీవితం -34

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
6 Things You Need to Recover From Every Day
హాస్యం

*భర్త : ఏమిటోయ్ చాలా ఉషారుగా ఉన్నావు ఈరోజు
భార్య : నేను ఒకటి అడుగుతా చెప్పండి
భర్త: నీ వడిగిన దానికి నే నెప్పుడన్నా కాదన్ననా
భార్య: మీరు ఎదో ఆలోచిస్తున్నట్టున్నారు అది మాత్రం కాదు
భర్త : మరి ఏమిటే
భార్య: పగలు వెలుగు చూపే వారు ఎవరు?
భర్త : ఆ మాత్రం తెలియదా " సూర్య భగవానుడు "
భార్య: రాత్రి వెలుగు చూపే వారెవరు ?
భర్త :  చంద్రుడు లేక పోతె నీవే
భార్య: మీ ఆలోచనలు ఎప్పుడు ఇలా ఉంటాయి ఏమిటండి
భర్త: భార్య పక్కనుంటే చికట్లో వెలిగే కదే
భార్య : అదిసరే ఇంకోసారి ఆలోచించండి
భర్త : నువ్వే చెప్పు నేను ఆగలేకున్నా
భార్య: ఆత్మ విస్వాసం చీకట్లో దారిచూపించేది
భర్త: అవునా .....   ఆ .....  అవునూ ... అవునూ

ఇదండీ లోకం ( హాస్యం)

*భర్త : ఏమిటోయ్ చాలా ఉషారుగా ఉన్నావు ఈరోజు
భార్య : చేతులు చాపి చూపింది
భర్త: ఈ రోజుకు నాకు పని పెట్టావన్నమాటా
భార్య: తప్పదు కదండీ అంటూ, అయ్యే జారిపోతుందండి పైకి లాగండి
భర్త : ఎవ్వరూ లేరు నేనేకదా
భార్య: వేరే వారయితే కళ్ళు మూసుకుంటారు, మీరయితే లొట్టలేస్తూ పిలిచావా అని అడుగుతారు
భర్త : అది కాదే
భార్య : ఏది కాదు అన్నీ  సమకూరుస్తున్నా ఈమాత్రం చేయలేరా
భర్త : తప్పదంటూ సర్ది "ఎవరు పెట్టుకోమన్నారో ఈ గోరింటాకు "
భార్య: మీకు తెలియదా మంచి మొగుడొస్తాడని అంటారు
భర్త : అంటే నేను మంచి మొగుణ్ణి కాదా .........
భార్యా : నేను వేరే చెప్పాలా
భర్త : ఆ ........   ఆ  ........      

ప్రాంజలి ప్రభ : ఇదండీ లోకం ( హాస్యం)

*భర్త : ఏమిటోయ్ చాలా ఉషారుగా ఉన్నావు ఈరోజు
భార్య :  పనిచెయ్యాలి కొద్దిగా ఆలస్యమైందనుకో కేకలే
భర్త: ఎప్పుడు ఉండేది కదే ఇలా కూర్చొని ఉండి చూడు ఆ టీవీ చూడవే గుర్రాలు ఏవిధముగా పరిగెడుతున్నాయో
భార్య: కాసేపాగి నా కడుపులో ఎలుకలు పరిగెడుతుంటాయి, గోలచేస్తారు మీ విషయమ్ము నాకు తెలియదా
భర్త : ఈరోజు శెలవ్
భార్య: అయితే ఆ టివిలో వంటలొస్తాయి లొట్టలేసుకుంటూ చూడండి నేను వంటకు సెలవ్ పెడుతున్నా
భర్త : నే నేదో నవ్వులాటకు అన్నా అంతే
భార్య : ప్రక్కన కూర్చొని సెల్ తీసి హోటల్క్ ఫోన్ చేసి టిఫిన్ తెమ్మన్నది
భర్త : టిఫిన్ బిల్ చూసి ఆ. ఆ. ఇంత రేటా ....
భార్య: బిల్లు ఇచ్చి పంపండి, నేను ఆకలి చంపుకొని    ఉండలేను, నేను తింటున్నాను
భర్త : మరి నాకే బుద్ధి తక్కువై సెలవు అని చెప్పాను  .........
భార్య: బుద్ధి యెక్కువై చెప్పారు, ఒక్క రోజు అన్నా అరవ కుండా ఇద్దరం తిందామనవచ్చు కదా
భర్త : అంటే నేను రోజు నిన్ను అరుస్తున్నాన
భార్య : అదివేరేచెప్పాలా
భర్త :  ఆ ........   ఆ  ........