ఓం శ్రీ రామ్ - ఓం శ్రీ మాత్రేనమ:
వ్యసనాలు
ప్రజల మానసిక రోగానికి, మనసు వత్తిడి లోను కావటానికి కొందరిలో కొన్ని అలవాట్లు, మత్తు మందులు అధికంగా వాడటం ఒక కారణం కూడా అవుతున్నది. అనారోగ్యమని తలంచి అదేపనిగా మందులు వాడటం కూడా ఒక కారణం అవుతున్నది.
తల్లి తండ్రులకు సేవ చేయటానికి. ఉద్యోగ భద్రత కొరకు పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి, హృదయం కలత చెందకుండా జాగర్త పడాలి. మనస్సు నిరుత్సాహము చెందకుండా, ఇతరులను నిరుత్సాహము పరచ కుండా బ్రతకాలి.
అనేకమైన వత్తిడులు సంభవించి నప్పుడు ఆక్సిజనేట్ గ్లూకోజ్ యొక్క మీ మెదడును మరింత దృష్టి సారిస్తుంది, సంభాషణల మధ్య పనుల మధ్య తారతమ్యము కనబడును. స్థాన బ్రన్సమ్ వళ్ళ వచ్చిన ఆలోచనలు మారును.
.
శాంతి, ప్రేమ మరియు నిజాయితి అనేవి మూడు కన్నులు ఇవి సరిగా పని చేయవు, అసహ్య కరమైన భావోద్వేగాలు మరియు భౌతిక మానసిక ఆటంకాలకు లోనవుతారు.
శరీరం ప్రకృతి పరమైన ఒక ఉపకరణం అని తెలిస్తే.. దేహాపరమైన అనుభవాలు, అనుభూతులు కేవలం భావనామాత్రమేనని అర్ధం అవుతుంది. అప్పుడు దేహాత్మభావన తగ్గుతుంది. అదే ప్రకృతిని, ప్రపంచాన్ని విస్మరించేలా చేస్తుంది. బ్రహ్మీభావన దృశ్యమానమైన ప్రపంచాన్ని విస్మరించేందుకు ఉపయోగపడుతుంది. మనలోని సత్యరూప స్మరణద్వారా నేనుబ్రహ్మమును అనే భావాన్ని కూడా త్యజించేస్తాము. ఏదీ భావించని ఆత్మమాత్రంగా ఉన్నరోజు తన సత్యరూపభావన అనేది కూడా లేకుండా కేవలం ఉనికిగా ఉండటం మాత్రమే ఉంటుంది. కేవలంగా ఉండిపోవడమే కైవల్యం !
ధూమ పానము, మత్తు మందు (గంజాయి) అలవాటు చేసుకుంటే ఆరోగ్యం ఖచ్చితముగా చెడు నని తెలుస్తున్నది.
ఈ అలవాట్లు స్నేహము వలన, పరిసర ప్రాంతాలవలన, కుటుంబంలో కొన్ని సంఘటనల వల్లన, తల్లి తండ్రుల అలవాటు వలన కొందరు మారుతారని తెలుస్తున్నది.
నేటి మీడియా, రాజకీయాలు ప్రభావము, ఆర్ధిక ఇబ్బందులు మరియు సంసారంలో సంఘటనలు వళ్ళ మారతారని తెలుస్తున్నది. ఎన్ని వత్తిడులు ఉన్నా దృఢసంకల్పము మార్చకూడదు ఎవ్వరూ.
సోమవారం నుండి శుక్రవారం వరకు మీ ఆలోచనలు పరి పరి విధాలుగా మారుతాయి అందుకే మిగతా రెండు రోజులు ప్రశాంతి కొరకు బ్రతకాలన్నారు.
కొన్ని రోగాలకు మత్తు మందు ఇవ్వ వలసిన పరిస్థితి ఉన్నది. అది తగు మోతాదు ఇచ్చిన ఆరోగ్యము బాగు పడుతుంది. మోతాదు మించిన ఆరోగ్యం పాడవుతున్నది.
ఏది ఏమైనా వ్యసనాలకు బానిసలుగా మారటం తేలిక, పట్టుదలతో వ్యసనాలనుండి మారటం ప్రతి వక్కరి కర్తవ్యం.
నిర్భయంగా ఉండండి:
దేనికి భయపడవద్దు. మీరు అద్భుతమైన పనులను చేయబోతున్నారు. భయపడిన మరుక్షణం మీరు ఎందుకూ పనికిరారు. ఈ ప్రపంచంలో ఘోరమైన బాధలన్నింటికి అసలు కారణం భయమే. అన్నిటికన్నా గొప్ప మూడనమ్మకం భయమే. భయమే మన దుఃఖానికి ఏకైక కారణం. నిర్భయత్వం క్షణం లో మనకు స్వర్గాన్ని కొని తేగలదు కాబట్టి లెండి! మేల్కోండి! గమ్యాన్ని చేరుకునే వరకు ఆగండి.
--((*))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి