19, జూన్ 2017, సోమవారం

విశ్వములో జీవితం -29

ఓం శ్రీ రామ్   - శ్రీ మాత్రేనమ:

గీతా జ్ఞానము -4

సముద్ర కెరటాలు వలే పొంగుతూ ఉరుకుతుంది, ప్రజ్వలించే మహాజ్వాలలా ఎగసి పడుతుంది, మంచు ముద్దలా, వెన్న ముద్దలా స్పర్శకు కరిగి పోతుంది,  బాదం కొమ్మలా విరిగి పోతుంది,శిల్పానికి ఎన్ని గాయాలు తగిలిన నిండు రూపంలా ఉంటుంది, ఎక్కడ ఉంటుందో ఎలాఉంటుందో ఎవ్వరు చెప్పలేకపోతున్నారు, అది మనలో ఉండి ఒక ఆట ఆడిస్తుంది అదే " మనసు ".

ఇనుము ఇరిగినా అతికించ వచ్చు మనసు విరిగితే అతుకుట కష్టం, ఇది విశృ0ఖలమైనది మదించిన ఏనుగులా ప్రవర్తిస్తుంది.  

ఓమనిషి తెలుసుకో! తెలుసుకొని మసలుకో!

చిందులు వేయకు చింత చేరినపుడు
చిరుగును పూరించుటకు చూడాలి ఎపుడు
చిన్న దాని చూపులకు చిక్కకు ఎపుడు
చిరుతలా దూకుతూ ధర్మాన్ని కాపాడు ఎపుడు     

వ్యసనాలకు బానిస కాకు ఎపుడు
వ్యధలు వచ్చును బ్రతుకు మారినపుడు
వ్యవహారము చక్క బెట్టుడు ఎపుడు
వ్యవసాయపై నమ్మకముంచాలెపుడు

రెక్కల్లా భావాలు చుడతాయి ఎపుడు
చుక్కల్ని పట్టాలని అశకు పోకు ఎపుడు
ప్రక్కన వారిని తక్కువచేయకు ఎపుడు
మక్కువ కొద్దితిని భాధ తెచ్చుకోకు ఎపుడు

వినయవిధేయత చూపాలి అందరిపై ఎపుడు
మనమున మర్మము గ్రహించాలి ఎపుడు
మనమున దేవుని కొల్చి శాంతిని పొందాలి ఎపుడు
వినమని చెప్పిన వినరు ఎందుకో ఎపుడు

ఈ విధముగా మనసు బుద్ధిననుసరించి జీవిస్తుంది. బుద్ధి వక్రబుద్ధిగా మారితే జీవితమే  దుర్భరం.

మనసులేని మమత ఎందుకు - మనుగడకు రాని మనసు ఎందుకు
మదితలపులు తెలుపని బ్రతుకు ఎందుకు - మతిలేని మనిషికి మనసు ఎందుకు

చెడ్డ మనసుకే ఆవేశం ఎక్కువ - మంచి మనసుకు మక్కువ ఎక్కువ
ఆదాయం లేని మనసుకు ఓర్పు ఎక్కువ - ఆదాయం ఉన్న మనససుకు ఆవేశం ఎక్కువ

మనసు విప్పి మాట్లాడి మర్మము తెలుసుకో - మగువ మనసును బట్టి మనసు మార్చుకో
ఓమనిషి తెలుసుకో - తెలుసుకొని మసలుకో                 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి