26, జూన్ 2017, సోమవారం

విశ్వములో జీవితం

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

వ్యక్తి

ఒక నిరుద్యోగి నాకు ఉద్యోగము రావటము లేదు అని సందేహముతో బ్రతకుట వ్యర్ధము అని వంతెనపై నుంచి నీళ్ళలోకి దూకాడు, అపుడే అటువైపు పోతున్న వ్యక్తి అతని రక్షించాడు.
నన్ను ఎందుకు రక్షించారు అని అడిగాడు నిరుద్యోగి.

నేను చెప్పేది విన్నాక నిన్ను నేను మరల వంతెన పైకి తీసు కెళ్తాను అక్కడ నుండి దూకి నిక్షేపముగా చావవచ్చు.

చూడు బాబు నీవు అనామకులలో ఒకడివి అని ఊహించు కున్నావు ఎందుకనగా
"ఒక కరెక్టు వ్యక్తిని కలుసుకోబోయే ముందు, పది మంది అనామకుల్ని విధి పరిచయం చేస్తుంది. మొదటి వ్యక్తి దగ్గరే పారిపోయేవారు అనామకులు గానే మిగిలిపోతారు"

" అంతా నాకు తెలుసు నాకు తెలియంది లేదు అనుకున్నావు, అనుకున్నది సాధించలేకపోయావు ఎందు కనగా 'అంతా తనదే' అన్నది మమకారము.'అంతాతనే' అన్నది అహంకారము.నీలో ఆవహించింది నేనే చదువుకున్నాను నాకు ఉద్యోగము రాలేదని దిగులు పడ్డావు, నీకన్నా చదువుకున్న వాడితో పోల్చకో లేక పోయావు. .
    
నేడు బాగుంటేనే రేపటి గురించి ఆలోచించగలవు, నీ ప్రయాణానికి మలుపులున్నా గమనించలేక పోయావు, మంచి మార్గం ఎదో తెలుసుకో లేక పోయావు, మొండిగా మారి పయనించలేక వెనుకడుగు వేశావు.      

నీవు చేసిన పనినీ ఎవరో తప్పు పట్టరాని చేతకాని వాడిగా ఊహించుకున్నావు,  నీవు చేసిన పని వేరొకరికి నచ్చలేదని విషయం నీవు తెలుసు కోలేక పోయావు, కన్నా తల్లి తండ్రులను గురువును చెప్పిన మాటలు గుర్తించలేక పోయావు.    

నీవు గెలిచే వాడవని ఊహించలేక పోయావు, "ఓడి పోయే వారు ఒక్కసారే ఓడిపోతారు.గెలిచేవారు తొంబై తొమ్మిది సార్లు ఓడిపోతారు.వందసార్లు ప్రయత్నిస్తారు కాబట్టి"...

జరిగి పోయిన వణ్ణి మనకు అనుభవాలు ."నిన్నటినుంచి పాఠం గ్రహించి,రేపటి గురించి కలలుకంటూ ఈ రోజుని ఆనందించు.కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్దం చేసుకోకు.ఇవ్వటంలో నీకు అనందం వుంటే ఇస్తూ ఆనందించు....

చావాలను కుంటే నిరభ్య0తరంగా చావవచ్చు అన్నాడు వ్యక్తి.
నాతప్పు తెలుసుకున్నాను మీఋణం తీర్చు కోగలను, తల్లి తండ్రులను ఆదుకోగలను, స్వయంశక్తితో బ్రతికి బ్రతికించుకోగలను.      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి