22, జూన్ 2017, గురువారం

విశ్వములో జీవితం -31

om sri raam - sri matrenama:

అహం  

అనేక మంది కళ్ళకు ఆకాశం ప్రకాశవంతంగా పింక్, ఎరుపు, నారింజ, నీలిమందు మరియు బూడిద రంగుగా కనబడటం జరుగుతున్నది. అలాగే మనచుట్టూ ఉండేవారు అనేక రకాల బుద్ధులు కలిగిన  మనుష్యులు ఉన్నారు,  వారు సంతోషంగా మరియు విచారంగా జ్ఞాపకాలు లాగా ఉంటే తూర్పు నుండి పడమటి వరకు సూర్యునిలో  రోజువారీ మార్గంలో ఎన్ని మార్పులు జరుగుతాయో అన్ని మార్పులు మనలో కూడా జరుగుతాయి. చీకటిలో సూర్యుడు దిగంతంలో పడుకుని ఉంటాడు, అలాగే మనలో అంతరాత్మ శాంతి కొరకు నిద్రకు ఉపక్రమించటం చాలా శ్రేయస్కరము.
  
ఒకప్పుడు అద్భుతమైన కాంతిని అణచి వేయబడిన జాడలు కనిపిస్తాయి అంత మాత్రాన స్వయం శక్తి ఎప్పటికి మారదు మబ్బులు తొలగిన యధా ప్రకారం వెలుగును చిమ్మును, అలాగే మనకి కొన్ని బాధలు వెంబడించిన అవి తొందరలో తొలగిపోతాయని గమనించాలి. నిద్రలో జ్ఞాపకాలు క్షిణించిన వెలుగులో అవి విజ్ఞావంతులుగా మారుస్తాయి. 

మనలో ఉన్న అహంకారముతో కూడిన భౌతిక భావన మాత్రమే మనల్ని చీకటిలో నెట్టి వేస్తుంది, మమకారము పెంచుకొని వెలుగు కోసం ప్రయత్నం చేయాలి. ఎవరికైన ఈ అహంకారముతో సంబంధమున్నచో అట్టి వ్యక్తి విముక్తిని గూర్చి మాట్లాడవలసిన పని లేదు. విముక్తి అనేది తిరుగులేనిది. 

అహంకారము యొక్క బంధనాల నుండి స్వేచ్ఛను పొందాలంటే వ్యక్తి తన యొక్క అసలు సత్యమైన, స్వచ్ఛమైన, శాశ్వతమైన ఎల్లపుడు ఆనంద స్థితిలో ఉండేది, స్వయంప్రకాశవంతమైన వెలుగును పొందాలి. ఎలానంటే రాహుగ్రహము నుండి విముక్తి పొందిన చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడో అలాగా. 

బుద్ది వలన మాలిణ్యముతో కూడిన భౌతిక సంబంధములు ఎలా సృష్టించబడినవో, అవి శరీరానికి కళంకము తెచ్చి, నేను బలవంతుడును, నేను అమాయకుడను, నేను సంతోషముతో ఉన్నాను అనే భావనలు అహంతో చోటు చేసుకొనుట సహజము. 

ఓర్పుతో ఓపికతో స్థిమిమ్ముగా మనం చేసినది ఏమిటి అనుకరించినది ఏమిటి అని ఒక్క సారి ఆలోచించ కలిగే శక్తి మనకు పరమాత్మ ఇచ్చాడు. అహం అనే కాలసర్పం మనల్ని చుట్టి వేస్తుంది
దానిని ఎదుర్కొనుటకు అహం అనే సర్పాన్ని జ్ఞానమనే ఖడ్గముతో నాశనము చేయకల్గిన శక్తి మనలో ఉన్నది.      
 --((*))--