27, జులై 2013, శనివారం

71. Parent's Day (Premaamrutam-3, )

జూలై - 28 - 2013 (పేరెంట్స్ డే) తల్లి  తండ్రులకు శుభాకాంక్షలు

 
చేతులు పట్టుకొని తోలి నడక నేర్పినవారు
కంటిలో నలుక పడ్డ నాలుకతో తీసినవారు
అడిగిన వాటికి లేదన కుండా   కొన్నవారు
నాకోసం సర్వస్వం అర్పించిన జనకులు మీరే

 నాకుగుర్తుంది మా అమ్మ ఎప్పుడు అనేది కన్నయ్యా
మానాన్న ఎప్ప్పుడే అనేవాడు ముద్దుగా బడుద్ధాయి
నాన్న వీపు పెక్కి ఏనుగు ఆట ఆడిన ఆనందమాయ్
అమ్మ నాన్న నన్ను పార్కులో ఆడించిన రోజులున్నాయి   

జీవితములో ఎలా బ్రతకాలో నేర్పింది నాన్న
అనారోగ్యంలో ఉన్నప్పుడు మందు తెచ్చింది నాన్న
బ్రతుకు పాఠాలు నేర్పి మనిషిగా చేసింది నాన్న
 బంగారు బాటలో నడిచే మార్గం చూపిమ్ది నాన్న

మా అమ్మ పాడిన జోలపాట నాకు గుర్తున్నది ఇందు పొందు పరుస్తున్నాను


రావోయి రావోయి రతనాల పాపాయి, మాఇంట దీపమొయీ
మాటలొచ్చిన వేల ఈ తల్లి తండ్రులను మరువకోయీ
చిట్టి కధలు, పోట్టికధలు, వింటూ ఊకొడుతూ చిన్నారి ఓయీ
బుడి బుడి నడకల బోసి నవ్వుల గారాల బిడ్డ ఓయీ  

గోరంత నవ్వులతో కొండంత వెలుగును పంచా ఓయీ
మాయింట పుట్టి మమతలు పంచిన అపరంజి ఓయీ
అల్లరిచెస్తూ, చిరునవ్వులు నవ్వించే చిద్విలాసుడ ఓయీ
ముసిముసినవ్వులతో మనసును దోచే మొహనరూపుడ ఓయీ

ఆదిత్య హృదయానంద సత్య వ్రత ధర్మ భద్ధుడ  ఓయీ
సురులు మునులు భూసురులు దీవెనలు ఉన్నఓయీ 
కాటుకకన్నులలో వెలుగును పంచే భాను చంద్రుడఓయీ
చిరంజీవివి, జితేంద్రుడవు, అందరికి అభయ ప్రదాత ఓయీ

చిలకల గుంపును చూసి చిన్న  చిన్న పలుకులు నేర్చినా ఓయీ
పాదాలకు  కనకపు మువ్వలతో తిరుగు తుంటే ఆనంద మొయీ
చింతకాయలు వంటి జడలు గలిగి, చెవులకు జూకాల సబ్ధమొయీ
    పలు నటనలతో ప్రతి ఒక్కరికి ఆనందాన్ని పంచిన బాలుడ ఓయీ   


అల్లరి చేష్టలతో, అలసి పోయి, ఆద మరచి నిద్రించ ఓయీ
ఒక్కమారు హర్షముతో, ఒక్క మారు ఏడ్పుతో ఉన్నాఓయీ
ఉదయ కిరణాలతో మేలు కొలిపే ప్రభాసుడ ఓయీ  
అందరి ఆశలు తీర్చి, ఆదు కొనే అభయుడ ఓయీ 

 
నవ జీవన కళలు తెలిపే నందుడ ఓయీ
చిత్ర విచిత్ర సంఘటనలతో కాలం గడప ఓయీ
మా మనస్సులో పరిమళాలు వెదజల్ల  ఓయీ
నీవు మా ఆశల అనురాగ ఆనంద జ్యోతి ఓయీ










అమ్మ సేవ ఇంతని చెప్పే స్తోమత నాకు లేదు
అమ్మను  వేలెత్తి  చూపిన వారు  బ్రతక లేదు
అమ్మను పూజించినవారు సంతోషము తరగదు
జనకులను పూజించినవారికి మనసు మారదు

 
ఆడకుండా అన్నీ సమకూర్చేది అమ్మ
సహనం తో సహయము చేసేది అమ్మ
తన కొచ్చిన  విద్యను  పంచేది  అమ్మ
కష్టపడి కుటుంబాన్ని సరిదిద్దేది అమ్మ  

   
అమ్మ మాకోసం నిద్రపోని రోజులెన్నో
తిండి తినక మా కోసం ఉప వాలెన్నో
మా ఆరోగ్యంకోసం దేవునికి  పూజలెన్నో  
 మా పిల్లకు కుడా ఓర్పుతో చేసిన సేవలెన్నో


అమ్మలగన్న అమ్మను కొలిచేది మా   అమ్మ
అడిగినవారికి లేదనకుండా ఇచ్చేది      అమ్మ
ఆత్మీయులను అవసరానికి ఆదుకొనేది అమ్మ
అర మరికలు లేకుండా  పలకరించేది     అమ్మ

 
అవని యందు అత్యంత పవిత్ర  మైనది     అమ్మ
అనురాగము పంచి ఆత్మీయతను పెంచేది అమ్మ
మా అందరి విద్యా, పేరు ప్రతిష్టలు, పెంచేది అమ్మ
మనిషిని బట్టి, మనసును బట్టి, మాట్లాడేది అమ్మ
 

 
మా అమ్మను అందరూ అనుకొనే వారు ఈ విధముగా

 
ఇంటి కొచ్చిన అతిధులను ఆరగింపనిదే అడుగు వేయనిచ్చేది కాదు
పండుగలలో మా అమ్మ సలహా అడగందే పొయిలోనిప్పు వెలిగేదికాదు
క్రొత్తగా పెళ్ళైన వారు మా అమ్మఆశీర్వాదం పొందందే కదిలేవారుకాదు
అమ్మొమ్మ, తాతయ్యకు, మందు లిచ్చి భర్తకు  సేవచేయని రోజు లేదు

 
అమ్మ మడికట్టు కట్టి పూజ చేస్తే దేవుడే దిగి వచ్చు నట
అమ్మ ఎంకికట్టుతో పొలం పనిచేస్తే సిరిలక్ష్మి దిగివచ్చనట
అమ్మ పడకటింట చేరితే శ్రుంగార లక్ష్మిగా మారేనట  
అమ్మ పట్టు చీరతో నడిచివెల్తే  సంతాన లక్ష్మి దిగి వచ్చెనట 



తల్లి తండ్రులు ఫలానా తప్పులు చేసారనే భావాన ఉండకూడదు
తల్లి తండ్రులు అదేపనిగా తిడుతున్నారని మాట అన  కూడదు
అమ్మన్నాన్నలు ఏమ్మిచ్చారని ఎప్పుడూప్రశ్నలు వేయకూడదు 
      అంతామాకు తెలుసని తల్లి తండ్రులను తక్కువ చేయ కూడదు 




అమ్మలో అందరూ అష్టలక్ష్మిలు ఉంటారని గమనించగలరు
 
ధర్మమార్గమున నడిపించి ఆదిన అక్షరమును దిద్దించిన ఆదిలక్ష్మి
అన్నార్తులకు లేదన కుండా ధాన్యమును పంచిన ధాన్య లక్ష్మి 
ప్రతివిషయమును అర్ధం చేసుకొని ధైర్యమను కల్పించే ధైర్య లక్ష్మి
కొండంత బలముగా నేనున్నానని  అందరిని ఆదు కొనే గజ లక్ష్మి

 
కొడుకులను, కూతుర్లను, సక్రమ మార్గమున పెంచిన సంతాన లక్ష్మి 
వెనుకడుగువేయకు విజయము మనదే అనిప్రోశ్చహించే  విజయలక్ష్మి
తల్లి తండ్రి గురువు అన్నీతానై మంచి బుద్ధినిచ్చి విద్యలు నేర్పేవిద్యలక్ష్మి
కుటుంబము సక్రమముగా ఉండే విధముగా  సిరులు పంచె  ధన లక్ష్మి   
   

    
 

    మా అమ్మ పాడిన జోలపాట నాకు గుర్తున్నది ఇందు పొందు పరుస్తున్నాను
 
కలత పడ వద్దు, కన్నీరు కార్చవద్దు బాబు
కమనీయమైన కలువ పూలవలె ఉండాలి బాబు
చంచల బుద్ధి వద్దు,  చపలత్వం వద్దుబాబు
చామంతి పూలవలె ఉపయోగ పడుతుండు బాబు
సత్యం లేదనివద్దు, సహాయము చేయలేదని కోవద్దుబాబు
సువాసనలు వెదజల్లే సంపెంగ పూల వలే
ఉండాలి బాబు
ఉన్నది సొంతమనుకోవద్దు, లేనిదానికోసం ఆరాట పడవద్దుబాబు
దేవునికి అలంకరించే దండలో దారం వలే ఉం
డాలి బాబు
టక్కరి బుద్ధి వద్దు, టక్కుటమారి విద్య వద్దు బాబు
పక్షులవలె సమ్చారముచెస్తూ, ధర్మాన్ని భోధిస్తూ ఉండాలి బాబు
వగల మారి వద్దకు పోవద్దు, విచ్చల విడిగా తిరగొద్దు బాబు
వరి బియ్యం దానం చేసి బీదలను ఆదు కోవాలిబాబు
రవ్వంత ఆశ వద్దు, రంకులు పెట్టే తనం వద్దు బాబు
ఆరాధనతో,  శ్రవణానందముతోరంజిల్లుతు ఉండు బాబు
సందేహము వద్దు, సమరము వద్దు, మనకు బాబు
          సమస్యలను పరిష్కరిస్తూ సమయస్పూర్తిగా ఉండాలి బాబు 

నవనీతపు మాటలు నమ్మోద్దు, నాయకుల వద్ద చేరోద్దు బాబు
నమ్ముకున్న వారిని నయవంచకులనుండి రక్షించాలి బాబు
పగలబడి నవ్వొద్దు, పగ సాధించాలని అనుకోవద్దు బాబు
పనసపండులా భార్య  పిల్లలను కాపాడు కోవాలి బాబు
ముద్దే సాస్వితమను కోవద్దు,ముందరికాళ్ళభందంఅని మరువొద్దు
బాబు ముసి ముసి నవ్వులకు మోసపోక, ప్రకృతి ననుసరించి బ్రతకాలి బాబు
తన్నవద్దు,ఎవ్వరితో తన్నులుతినవద్దు, తన్మయత్వంతోఉండ్డోద్దు
బాబు తపనతో తపించ వద్దు, తరుణి కోసం తాపత్రయ పడవద్దు బాబు
తప్పులు చేయక, తప్పులు ఎంచ కుండా, తెలివగా బ్రతకాలి బాబు
ఎక్కువ నిద్ర పొతూ, తక్కువ మాట్లాడుతూ ఉండాలి బాబు
మనసు ప్రశాంతముగా ఉంటే,  సాధించలేనిది లేనేలేదు బాబు
మన వారెవరో పరాయి వారెవరో గమనించి లోకంలో బ్రతకాలి బాబు మనసెరిగి మనిషినిబట్టి మనుగడ సాగిస్తూ శాంతముగా ఉండాలి
బాబు                  
                                                  

70. L.O.V.E (Premaamrutam-2, )


1.  గూట్లో  దీపం వెలిగించు నోట్లో  ముద్దను దించు
        ఒంట్లో శక్తిని పెంపొందించి ఈ  మత్తును  దించు  
        మనసుకు ఉతేజ పరుచు ఇది కొత్త అని పించు
        అలవాటుగా మారి ఇంకా ఇంకా కావాలని పించు  

                             
2.      మాట కటువు మనసు వెన్న
            నీటి  బుడగను పట్ట లేమన్న
            ఒట్టితీసి గట్టు మీద పెట్టమన్న
            కలియుటకు  పంతం  వద్దన్న

                                                      

3.     అవన్నీ వట్టి ఊక దంపుడు కబుర్లు
          ఇద్దరిమద్య ఏమీలేదు వట్టి పుకార్లు
          ఇద్దరం కలసి తిరిగాం  వట్టి  షికార్లు      
          కేవలం ముద్దుకే వచ్చాయి చక్కర్లు     

                                                                                                                                                            


 4.  సూదిలో దారం ఎక్కిచ్చాలి రా బావ
        మల్లె పూలు సద్ది సరి చేసుకో  బావ 
        సూది కదిలించను దారం ఎక్కించు బావ
        సందులో పని కుదిరిందనక పెట్టు బావ 

                                       
  5. కలలు కనగానె సరిపోదు మనసు అర్ధం చేసుకో
       మనసులోని కోర్కలను  తీర్చే మార్గం చూసుకో
       పట్టుచీర,నెక్లెస్, మల్లెపూలు నీవు తెచ్చావనుకో
       నీ సంతోషము కొరకు నా సర్వస్వము   దోచుకో  

                                                      
   
6.  శ్రుతిమించి  రాగాను పడి ఇబ్బంది పెట్టమాకు
        కళ్ళు గగుర్పాటు తెచ్చే పనులు చేయ  మాకు
        ఇప్పుడే మొగ్గ విచ్చిన పువ్వును అని మరువకు
        పువ్వును నలిపై, ఇక్కడ  కోచ్చాక   సిగ్గు పడకు 

                                        
 
7.   స్త్రీ బ్రతుకు గతించిన కాల స్మ్రుతులతో
        స్త్రీ బ్రతుకు భవిషత్ గురించి ఆలోచనలతో
        స్త్రీ బ్రతుకు వర్తమానంలో ఆశ, నిరాశలతో
        స్త్రీ బ్రతుకు కల్పవల్లిగా మరే జీవితాశయంతో
                                                       


8.   అదృశ్యంగా కదులుతూ కదిలించే గాలి శక్తి   
        నడుస్తూ ప్రాణులకు దాహం దీరుస్తూ నీటి శక్తి
        ఉన్నచోట తన ఉనికిని తెలియ పరిచే అగ్నిశక్తి
        కోపం తగ్గించి, తాపాన్ని చల్లార్చే భార్యామణి శక్తి
                                                      


9.   నీ చేతులు తాకితే నా మది తెలిపొయె   
         నీ కవ్వింతలకు నా గుండె బరువాయె 
         నీ చూపుకు మన్మదబాణాలు తగిలాయె
         నీ మాటతో నాగుండె పరుగెత్తే గుఱ్ఱమాయె 

                                                       
10.    చెయ్యొద్దు    చెలి నా  జీవితాన్ని ఒక ఆటగా
         నవ్వొద్దు   కోమలి  నా    భావానికి   తోడుగా
         కొట్టద్దు కామిని   శక్తి  లేద్దన్న ఒక్క మాటగా
         నీవు తిట్టద్దు నాకన్నా నీకు డబ్బు కావాలిగా  
                           
                           


11.        నా హృదయంలో ఉంది నీ రూపు
              నీవు ఎందుకు చూస్తావు ప్రక్కవైపు
              మరువ  లేను నీవు పంచిన వలపు
              నీకు ఏదికావాలన్నా ఇస్తాను తెలుపు
                                                     


  12.       నీ బుగ్గలు బూరెలై పొంగుతూ   వుంటే
              నీ ఊరువులు ఒకటై ఉరకలు వేస్తుంటే  
              నీ పిరుదుల కదలికలు మతి పోతుంటే
              నిన్ను చూస్తూ ఉంటే నా
కలనిజమైనట్టే 

                                                       

  13.      జాలిగుండె లేని పాషాణంగా మారావు మమత
            ఎందుకు నామీద తాపం, కశి, కక్ష, కోపం, ఎవగింత
            సహచర్యం నోచుకోలేని ఈ బ్రతుకెందుకు మమత 
            ఏ మన్న మరువలేను నీవు ఉంటావు నామనసంత 

                                                     
14.  నీ  చిరునవ్వుతో యుద్ధాలు      ఆప     వచ్చు
       నీ   చిరునవ్వులు శత్రువుపై సంధించ   వచ్చు
       నీ   చిరునవ్వుతో కుటుంబకలహం తీర్చవచ్చు
       నీ   చిరునవ్వుతో భర్తను   బుట్టలో వేయవచ్చు
                                                     


 15.   అరచేతిలో  వైకుంఠం  అని   చెప్పమాకు
         ఆర్భాటాలతో  ఎగిరెగిరి  క్రింద పడమాకు
         ఆశల వలయంలో చక్కి అవమానపడకు     
         ఉన్న దానిని సుఖపెట్టి హాయిగా బ్రతుకు 

                                                                               
16.    పెళ్ళనేది    నూరెళ్ళ       పంట
          ఇరువురు కలసి  బ్రతకా లంట
          ఇది సుఖ-దుఖాల పల్లకి నంట 
          పరువాలు దోచే సమయమంట
                                                      


17.    రవి కాంచని చోట కవి ఊహలు గాంచు
          మమతలు లేనిచోట మనసు   గాంచు
          వయసు పెరిగే చోట  వలపు    గాంచు
          పతివ్రత ఉన్న చోట  సుఖం     గాంచు   

                                                                                 
18.        గడబిడ పడక దడ  దడ లడించక
             జడ తలగడగా పడక అడ్డు  తడక
             నడక తడబడక ఛడమడా లాడక
             ఢమ ఢమ లాడించి ఢంకా  తట్టక      
                                                         


 19.       సిగ్గు ఎగ్గు లేక తగ్గు తగ్గు అంటూ ముగ్గులోకి లాగకు
             ఛెంగు ఛెంగు అంటూ గ్గుర్ గ్గుర్  అంటూ గోడుగేత్తకు
             గుగ్గిలం లా భగ్గు భగ్గు మంటు తొంగి తొంగి చూడకు
             దగ్గు తగ్గించి దగ్గర చేరి ధగ ధగ మెరుపు  ఆడించకు    
                                                    




  20.      కొంగు జార్చక  కోక విడువక కొంగలా ఒంటికాలుపై ఉండక   
             కోకో అంటూ ఆడక కొక్కొరకో కొక్కొరకో అని కోడిలా అరవక
             కోడె దూడలా పరుగులు పెట్టక, కోడె త్రాచులా బుసలుకొట్టక
             కోరి కోరి కోరుకున్న మొగుడి కోరికను కలలో కుడా  తీర్చక

  




21. నా  ఆశలన్ని  నీలో  చిగురించాలి  మళ్లీ
       నా ఇంటిలో నీవే దీపం వెలిగించాలి మళ్లీ          
       నా వాళ్ళల్లో నీవే మార్పు తెప్పించాలి మళ్లీ
       నా మనసు ప్రశాంతముగా ఉన్నది ఈనాడు మళ్లీ

 
22.  అప్పగిస్తున్నాను నిన్నే నమ్మి నిత్యం కొలిచే రాముణ్ని
       అన్నమాట జవ దాటని  ఆశలు  తీర్చె నా కులదైవాన్ని
       అనురాగం పంచి ఆత్మీయతను పెంచే ఆత్మభందువున్ని
       కలకాలము పచ్చగా నాలుగు కాలాలు నీవు ఉంటావని   

 
23.  కాలు జార కుండ  రెండు కళ్లతో చూస్తూ కాపాడారున్నాన్నా 
        లోకం తెలియని అమాయకురాలు అనుకున్నారు నాన్నా
        ఆశలు లేని కొంగు చాటుపెరిగిన బిడ్డఅనుకున్నారు నాన్నా
        దిగులుపడకండి ప్రేమను జయించాలనుకున్నాను నాన్నా

 
24.  ఏ నాడైన ఒక్కమాట అనలేదుగా  తల్లీ
        మా ఆశలు నీరు కారుస్తావెందుకు తల్లీ
        బ్రత కాటానికి ప్రేమ  ఒక్కటే  కాదు తల్లీ           
        అర్ధ బలం, ప్రేమ, అంగబలం ఉండాలి తల్లీ 

 
25.  మీ రెక్కడున్న మీ ఆశలు చిగురించాలని మా దీవనెలు
        ఆవేశములో ఉన్నారు మీరు కోటి కోర్కెలుగల పక్షులు
        అనుభవముతో అర్ధం చేసుకొని బ్రతకాలని మా  ఆశలు
        మరువకండి మిమ్మల్ని  కాపాడేది  మీ   తల్లి తండ్రులు  




26.బంగారు కొండ మా యింటికి సరిఐన అండ
కలాకండ మా ఇంటి వారందరికీ ఇష్టం ఉండ
మాఊరు  పొలాలు సస్య శ్యామలంగా ఉండ
కొత్తగా పెల్లయినవారు ముద్దుల్లో మునుగుచుండ

 
27.కప్పుకో దుప్పటి చలేస్తే, వేడికోసం వలువలు విప్పేస్తే
కోరుకో కౌగిలీ గిలిస్తే, తన్మయత్వంతో తనువు అర్పిస్తే
బంగారు కలలు పండే సమయమువస్తే, పతి కోరిక తీరిస్తే,
     ప్రేమ ప్రేమగా ప్రేమిస్తే, ప్రేమాలయములో కోరిక తీరుస్తా  




28.మల్లెల పరిమళాలకు, మమతలు కోవలవటం
వసంతం విస్తరనకు, తనువు తనువు కలవడం
ఆనందపు  భోగాలకు, ఆర్భాటాలు  అనవసరం
ప్రణయ రాగాలకు, సప్తస్వర దీవెనలు అవసరం 

 

29.సుందరమో, సుమధురమో, సుధామధురమో
మందరమో, మధురామృతమో, మృధుత్వమో
తాపశమో, తమకమో, తరుణులతాపత్రయమో
           పాశమో, పవనమో, పరువాల పారవశ్యమయమో  







30.స్త్రీలు శాంతముగా ఉంటే,   జీవితం రస భరితం
స్త్రీలు రౌద్రముగా ఉంటే,  జీవితం నరక మయం
స్త్రీలు శృంగారముగా ఉంటే, కొత్త కోర్కల  వనం
స్త్రీలు కన్నీరు కారుస్తుంటే, దిద్దు కోవాలి లోపం     

 
31.నిముషం కూడా ఆగదు, చెప్పేది వినదు
నిజం గురించి ఆలోచించదు, వేగం తగ్గదు
మనసు నిలబడదు, మాటకు ఎదురులేదు
  ఆరాటం ఆగదు, ఆర్భా
ములు మానదు 

 
32.నీ  లోని   బలహీనత  బయట పెట్టద్దు
నీ   శక్తిని  పెంచే ప్రయత్నం వదలొద్దు
మంచిని పెంచు చెడును అలోచించద్దు
దేవుని ప్రార్ధించు, ఏకాగ్రత  మరువద్దు


 
33.విరిశే   చల్లని వెన్నెల  లో   మనసు ప్రశాంతం
కలసి   ఉండే  శుభ  సమయం  లో   ఏకాంతం
ఆశలు తీరె ఈ వీళలో పొందాలి మధురామృతం
                   ప్రేమలో మధుర  స్వప్నాలు నేర వేరే సమయం                 



34.వెన్నెల్లో చిందులు వేసే మనసు తత్త్వం
వసంత మాసంలో వచ్చే పుష్పసౌదర్యం
శ్రావణంలో కురిసే ముత్యాల వానలపర్వం
క్రొత్త జంటను మైమరి పించే  శీతలత్వం

 
35.గంధపు చెక్కను మోసే గాడిదకు పరిమళం తెలియనట్లు
దేశంకానిదేశంలో ఉన్నవారికి ఏ విషయాలు తెలియనట్లు
పిల్లలు కన్న తల్లికి శృంగారం మంటే  ఏమీ   తెలియనట్లు
వాగ్దానాలు చేసే నాయకులకు తీర్చటం ఎమీ తెలియనట్లు 




    36.అంద చందాలతో ఆకర్షించుట ఏమిటో
భామల వయ్యారాల కదలిక  లెమిటో
కాటుక కన్నులతో  కనుసైగ  లేమిటో
కనువిందు చేసే వస్త్రధారణ    ఏమిటో 

 
37.శృంగార చేష్టల మర్మ మేమిటో
అంగాంగ ప్రదర్సనలు  ఏమిటో
అందం చూపి మతి పోగొట్టుట ఏమిటో
చిందులతో ఆకర్షించుట ఏమిటో   

 
   
 38.
రోగ  మోక్కటైతే మందోక టన్నట్టు
దీప మోకటైతే వెలుగంతా ఉన్నట్టు
రూపము ఏదైనా కాపురం చేసినట్టు
ప్రేమ ఉన్నచోట సుఖాలే   ఉన్నట్టు    

 

39.కష్టాలెప్పుడూ  కలిసే   వస్తాయి
సుఖాలెప్పుడు చెప్పక వస్తాయి
ప్రాణాలెప్పుడు చెప్పక పోతాయి
ప్రేమ లెప్పుడు చెప్పక కలుస్తాయి

 
40.తృప్తి లేని వానికి సుఖ మెక్కడ
ప్రేమ లేనివాడికి భంధ  మెక్కడ
సుఖం లేనిచోట సంసారమెక్కడ
జీవితాలు  అవుతాయి    తక్కెడ