4, జులై 2013, గురువారం

66. Gnanaamrutam-3 ( Aatmajnaana Saadhanalu )



             మనవుల యోక్క జనన-మరణాలు, మంచి-చెడులు, భగవంతుడు ముందుగా నిర్ణ యించి భూలోకములో బ్రతకమని నుదిటి  మీద వ్రాత వ్రాసి కర్మ భందాన్ని సద్వినియోగము చేసుకోమని, ధర్మ మార్గమున బ్రతకమని దీవిస్తాడు.  భగవంతుడు పక్షపాతం లేనివాడు..  ప్రతిఒక్కరు భగవంతుడు సర్వవ్యాపకుడుగా గుర్తించి, సర్వ కార్యాలయందు భగవంతుని ధ్యానించి ముందుకు సాగాలని మనపెద్దలు మనకు చెప్పారు .     
                  ఆ పరమాత్మ సన్నిధి చేరుటకు సరళయోగము, ఖటిన యోగము అనే రెండు రకాలున్నాయి.  సరళ యోగానికి  అరణ్యవాసానికి గాని, శారీరక క్లేశము గాని అవసరము లేదు, కేవలము చిత్తవృత్తిని తన వశం లో ఉంచుకొని దానిని సన్మార్గంలో ఉంచు కోగాలిగితే  మహా ఫలాన్ని, అందుకో కలుగుతారు, మహా ఫలితాన్ని చూడ గలుగుతారు. మనస్సులో చిన్మయ రూపుడైన పరమాత్మను తలుస్తూ  యదా విధి కార్య క్రమములు నిర్వహించిన వారు తీర్ధ యాత్రలకు పోనవసరములేదు,  ఉపవాసములు చేయ నవసరములేదు, మనిషిని మనిషిగా గౌరవించటమే జీవితమునకు అతి ముఖ్యమని గుర్తించాలి.  


                 ప్రతిఒక్కరు చాలా మంచి వారు.  కాని ఇంద్రియాలను జయించే  శక్తి మాత్రమూ ఎవ్వరికీ  లేదు.   వాసన తగలగానే ఇది మధురం అని వెంటనే తినాలని అనుకుంటాము,  ఆత్మారాముడు అలుగ కుండ ఏదో ఒక పదార్ధము తినందే మన శరీర అవయవాలు కదలవు.  తగిన ఆహారము తీసుకొని, తగిన వ్యాయామము చేసి, మనో నిగ్రహశక్తిని పెంచే మార్గాలను అనుకరించి సముద్రములో పడవలాగ ముందుకు సాగుతూ పోవాలె తప్ప ఒక్క సారిగా సముద్రపు ఒడ్డును చేరలేము .

                   సద్వర్తుల ఆలోచనలు, సద్వర్తుల అనుశీలన వలన ఫలం లభిస్తుంది.  మనస్సు పరి  శుద్ధమై, నిర్మలమైనపుడు సాధకునకు సర్వ తీర్ధములు దర్శనమిస్తాయి.  మనశరీరములో ఉన్న  నాసికా రంద్రములలో గంగా యమునా నదులు, చెవులలో వాయువు, ఉదరములో అగ్నిగుండం, పీఠములొ భూమి, తలలో ఆకాశము ఉన్నట్లు గమనిమ్చగలరు. ఆకాశములో నక్షత్రములులాగ తళ  తళ  మెరుస్తూ రాత్రిలో కోరికలు పుట్టి పగలు మాయమవుతూ ఉంటాయి.  

                సంతోషమే మనుష్యలకు సగము బలము, ప్రతి విషయాన్ని అతిగా అలో చించ కుండా యీ  పని  మనము చేయగలం అనుకున్నప్పుడు ముందుకు దిగాలి, లేదా ఎవరితోనైనా చే యించ గలమని అనుకున్నప్పుడు పనిలో దిగాలి.  గాలిలో దీపము పెట్టి దేవుడా నివే దిక్కు అని దేవుడ్ని ప్రార్ధించడం ఎంత వరకు సహజం ఒక్క సారి ఆలోచిమ్చుకొని. తగిన వారి సలహా మేరకు మనస్సుకు హాని కలగని ఏపని ఐనా చేయుటకు ముందుకు రాగలరు.  


                జ్ఞాణామృతము ప్రతిఒక్కరు  పొందాలంటే కొన్ని విషయాలు తెలుసుకొని వాని ప్రకారముగా అనుకరిస్తే  ఆత్మజ్ఞానము (వివేకము మనస్సు ఏకమై ) సిద్ధిస్తుంది.  మహా ఫలము లభిస్తుంది.  యోగ స్క్షిణ కూదా పొందాలి ఇల్లు వదలి వెల్లనవసరములేదు, సంసారము చెస్తూ నియమాను సారముగా దేవుని ప్రార్ధించిన మనస్సు ఆనందములో మునిగి పొతుంది.

                   కొన్ని నియమాలుప్రతిఒక్కరు పాటిస్తే హృదయములో వాటి ప్రభావము, యోగ ఫలము తప్పక లభించా గలదు
                      
 
                         

        


1.  ప్రతిఒక్కరు సంకోచము చెందకుండా,  చేసినపని చేసినట్లు,ఉన్నదిఉన్నట్లుఅంగీకరించాలి.                                                                                                                                                               
     భయమునకు మూలము పాపము.     పాపిఐనవాడు  ఎప్పుడూ 
   సంకుచిత రహితుడుగా ఉంటాడు.పాపరహితుడు ఎలాంటి శంకా  ఉండదు.అతడు ఎప్పుడు అడ్డులేని     వాడై వైకుంఠదామమునకు 
 వెళ్ళటానికి   అధికారి అవుతాడు.  అతని     హృదయములో                 సచ్చిదానందమయ స్వరూపమైన వైకుంఠము రాజమానమై ఉంటుంది.
                                                      


2.  సుఖం దొరుకుతుంది కదా అని దాని కొరకు ఆశ  చూపవద్దు. 

     సుఖమనేది మనం కల్పిం చు కోనేది  మాత్రమే, మనతోటివారు  
      సుఖముగావుంటే,  మనము     సుఖముగా ఉన్నట్లే, స్వర్గము      
     ఎక్కడో ఉన్నదని ఆశతో అందుబాటులో ఉన్నదానిని చులకనగా 
     చూడటమ్ సమంజసం కాదు.  మేఘాలను చూసి ఉన్న నీరు      
     పారబోసినట్లు అవుతుంది . 





                                                                              






3.  ఎట్టి పరిస్తితులలలో  ఒకే వైపు భావాల మీద ఆధార పడవద్దు.  
     మనిషికి   ఓర్పు సహనము ఉండాలి.  ఎదుటివారు చెప్పే భావాలు     
      ఓపికతో వినాలి దానికి    సమాధనముగా మీ ఉద్దేశ్యము చెప్పాలి 
      కాని  నేపట్టిన కుందేలుకు మూడే  కాళ్ళు అని వాదించిన ఆ 
      సమయమునా     ఎవరూ  నోరెత్తక ఒక పిచ్చివానిక్రింద జమ కట్టిన కట్ట 
      గలరు.
                                                      

4.   అసంతుష్టుడైన వ్యక్తి ఎవరినీ సంతుష్టుని చెయ్యలేడు.   
      సంతుష్టుడైనవాడే  అందరిని సంతోష పరచగలడు.  
      " ఓ నదిలో రాత్రిపూట బోటు షికారుకు కొందరు బయలు దెరారు.  
      బోటు అనుకో కుండా  ఆగిపొయింది.  బోటులో ఉన్న ఒక వ్యక్తి లేచి 
      కోపముగా కాప్టెన్ అడిగాడు ఎందుకు కదులటలేదు.  దారి సరిగా  
      కనిపించటం లేదు, అందుకే ఈ రాత్రి అంత ఈ బోటులోనే ఉండాలి.   
       ఆదేమిదారి కనిపించడం  లేదంటావ్  పైన నక్షత్రాలు నిపిస్తున్నాయిగా 
      వ్యంగంగా అన్నాడు.  వెంటనే కాప్టెన్     ఇక్కడ షార్క్ చేపలు 
      ఉన్నాయి   అవి దాడి చేస్తే మీరు తప్పకుండా ఆ నక్షత్రాల విప్పే 
      వెల్లవచ్చు. అన్న మాటలకు ఆ అనటం తప్ప ఏమీ    చేయ లేక 
      పోయినాడు".   
                                                     

5.  నాలుక పాప కధలు చేప్పడానికి అలవాటు పడుతుంది.   దువలన   
     దానిని నియంత్రించాలి.  " అత్తా గారిపై ఉన్నది లేనిది కల్పించి భార్య, 
     భర్తతో చెపితే కోపముతో నిజా నిజాలు   తెలుసుకోకుండా     కన్న తల్లి 
      అని అలో చిమ్చ కుండా ఇంటినుండి బయటకు నెట్టిన ష్యులున్నారు.  
      రంకులు నేర్చినది  తగాదాలు పెట్టుట ఒక లెక్క అన్నాడు ఒక కవి.  
      ముసలి కన్నీరు కార్చి మనసును వేదించిన  వారేమ్దరున్నారో,  పై పై 
      అందాలకు లొంగి మోసపోయే వారుమ్దురూ, మాటలు సుతిమెత్తగా 
      ఉంటాయి   వాటివల్ కొందరి గొంతులు తెగి పడిపోతాయి. నమ్మించి 
      చిలకపలుకులు పలికి మోసగించడం వారి  అలవాటు. " ప్రతిఒక్కరు 
      మాటలు తగ్గించి చేతలు చూపించాలి ".                                             

 6.  అన్ని అనర్ధాలకు మూలము ఆలస్యమే, అందువలన ఎన్ని    
      ప్రయత్నాలు  చేసి అయినా ఆలస్యాన్ని   పరిత్యజించాలి.
      రైలు బయలు దేరే  సమయము తెలుసుకొని గంట ముందుగా 

       బయలు   దేరితే గమ్యం చేరుటకు      సులభము.  రైళ్ళు  
      ఆలస్యముగా నడుస్తున్నాయి తొందరెందుకు నిదానంగా 
       పోదామనుకుంటె నీ వు ఇంకా ఆలస్యము చేయుటకు అవకాసము 
       ఇచ్చిన వాడగుటకు కారణమవుతావు.  తాబేలు, కుందేలు,  పరుగు 
      పందెము వేసుకున్నాయి.  కుందేలుకు గర్వము పెరిగి నేను 
       తాబేలును  జయించగలను అని ధీమాతొ బయలు దేరింది, తాబేలు 
       మాత్రము నా ప్రయత్నమూ నేను చేస్తాను గెలుపు  ఓటమిలు  
      దేవుడిపై   ఉంటాయి  మనము నిమిత్త మాత్రులం అని నమ్మింది అని 
      నేమ్మదిగా బయలుదేరింది. కుందేలు వేగంగా గమ్య స్తానమునకు 
       కొంత  దూరంలో ఉంది వేనుకతిరిగి చూసి తాబెలు  చాలాదూరములొ 
      ఉంది కాసేపు విశ్రాంతి తీసుకొని పోదాము అని చెట్టుక్రింద ఓకే కునుకు 
      తీసిమ్ది. తాబేలు నెమ్మదిగా వచ్చి గెలిచింది. అందుకే అందరు 
       ఆలస్యాము అమృతం విషం అన్నారు. 
                                                      

7.  నీ గురించి నీవు చులకనగా, ప్రపంచం గురించి లోతుగా ఆలోచించు.
     నీ గురించి నీవు చెప్పుకొనవసరములేదు, నీ ఉ చేసే పనులవల్ల వారే 

     గుర్తిస్తారు.  గోప్పలుకు పోయితిప్పలు తెచ్చు కోవటం ఎందుకు, డబ్బా 
     రేకుల సుబ్బారాయుడు  అనిపిమ్చుకోవట మేమ్దుకు, "  ఎప్పుడూ 
     నీ చెయిపైనా,  అవతలవారి చేయి క్రింద ఉండే టట్టు చూసుకో "  అంటే 
    నీవు ఎప్పుడు ఇతరులకు దాన      ధర్మాలు చెస్తూ వారికి సహాయం చేసే 
     వానిగా ఉండా లి.  నివే ఒకరి దగ్గరకు వెళ్లి చెయి  చాచి అడుక్కొనే 
     పరిస్థితులు తెచ్చుకోకు.   
      " ధనం విలువైంది.  ధనం కన్నా కాలం విలువైంది.  కాలం కన్నా
ప్రపంచ విలువైంది." దానం పొతే   మళ్ళి  కష్టపడి 

       మ్పాదిమ్చుకొనవచ్చు. కాలం పొతే తిరిగిరాదు.  కాలాన్ని వృధా         చేసుకొనరాదు. మరి     ప్రాణం ఉన్నదే అది పొతే ఇక వాచ్చే అవకాశమే ఉండదు. ప్రళయమే వచ్చి, భూకమ్పాలు వచ్చి, తుఫానులు వస్తే ప్రాణులనేవారు మిగలరు.    

8.   ఈ  ప్రపంచము ధర్మాధర్మ ములకు పరీక్షాస్థలము, అందువలన సావధాన చిత్తులై, ధర్మా ధర్మః  పరీక్ష  చేసి పనులను చెయ్యాలి.
      " భారతం ఒక మహాకావ్యమ్ అందులోని ధర్మములు గాని,  పాత్రలుగాని,  మరెక్కడా  లేవు,    రసవత్తరమైన గాధలతో, నీతులతో పంచమ వేదంగా పేరు గాంచినది.  మన జాతి నిలుపుతూ   వచ్చినవి 

    రామాయణ, మహాభారతాలు, ఆ గాధలను చదువడమొ లేక ఏదో విధముగా వినడమో  లేని భారతీయు లుండరు.  " తింటే గారెలే తినాలి వింటే భారతం వినాలి " అనే సామెతగా గ్రంధాలలోని విషయమును 
    తెలుసుకొని ధర్మమార్గమున నడుచుడకు ప్రతిఒక్కరు ముందుకు రావాలని ఆకాంక్షా . 
            నేరస్తులకు న్యాయస్థానం ఉరి శిక్ష వేయటం, దేసద్రోహులను, యుద్ధములో శత్రువును కాల్చి    చంపటము హింసగా  కనపడినా ఎంతో మంది  ప్రాణాలను రక్షించటానికి,  దేశాన్ని కాపాడటానికి కనుక 
    అట్టివి హింస గాదు.  ఎంతో మందిని రక్షించటానికి  దయతో చేసే కార్యముగా భావించాలి అనటం.
         శ్రీ కృష్ణ పరమాత్ముడు అధర్మ జరుగుచున్న చోట అవతరించి ధర్మాన్ని నిలబెడుటాడని భారతీయుల     నమ్మకం.
          "ధర్మభద్ధ మైన
హింస-దయతో సమానం అన్నరు మహానుభావులు 


  

 9.  సంపూర్ణ  జీవితములో  కోరికల నుండి దూరముగా ఉండు.
                సృష్టిలో వివిధ వస్తువులమీద ఆకర్షణ, కోరిక పెరుగుతుంది.  పసిపిల్లలు బొమ్మలు కొనమని కోరుకుంటారు, కొనకపోతే మారాం చెస్తారు. యువకులకు అందమైన యువతులను చూసి ఏదో మాట్లాడాలని, తెలియని కోరిక పుడుతుంది . లోభికి ధనామ్ పైనను, సంసారికి వివిధ సౌకర్యాల పైనను, స్త్రీలకు ఆభారణాలపైనను మనసు ఆకర్షించి ఒక విధమైన కోరిక పుడుతుంది.
           కొరికల వల్ల సమాజములో కీర్తి ప్రతిష్టలు పెరుగవచ్చు, ఒక్కోసారి అవి పోవచ్చు.
రామాయణములో సీత బంగారులేడి కావాలని కోరింది. భర్తగా కోరిక తీర్చాలని రాముడు బంగారులేడి వెంబడి వెళ్ళిన  రాక్షసమాయలో పడ్డ సీత ఎంత భాధపడిమ్దో మనకు తెలిసిన కధ.
           కుమ్తీ దేవికి కోరిక కలిగి, పిల్లవాని కనాలని సూర్యభగవానుని ఆరాధించి కర్ణుని కని నీళ్ళలో వదిలిన సంఘటన భారతములో అతి ముఖ్య మైనది. కర్ణుడు ఏవిధముగా బ్రతికాడో మనకు భారతంలో తెలుస్తున్నది. 
           కోరికలను అదుపులో పెట్టుకొని, జీవితములో కోరికవల్ల మనస్సు కలత చెందవచ్చు, తలకు మించిన భారమనవచ్చు, ఏదైనా కోరిక తీర్చాలంటే  లోతుపాతులు , లోటుపాటులు ఆలోచించి పై మెరుగులకు ఆశపడక మంచి చెడు గమనించి తీర్చగలకోరికలను తీర్చుకుంటూ, తీర్చలేని కొరికల మీదకు పోకుండా జాగర్త వహించవలెను. ఒకరుతిండి లేక  భాద పడుతుంటే, వేరొకరు మొగుడు పూలు తెచ్చి నా కోరిక తీర్చలేదని భాద పడిందట.  
            " ఒకరు కూటికి గడవక ఏడుస్తుంటె-ఒకమ్మ పూల కేడ్చిందట" 

                                                                                 
10.  చేసిన దానికి ఎప్పుడు పశ్చాత్తాప పడకు
        జీవితం పట్ల సానుకూలత ఉండే వ్యక్తి  తానూ చేసే ప్రతి పనిలో సంతృప్తినీ, ఆనందాన్ని పొందుతాడు.  అలా  తానూ చేసే వాటిలో  ఆనందం, సంతోషం చూసుకోవటం అనేది సంతృప్తి కరమైన జీవితానికి ఎంతో అవసరం.  ప్రతి మనిషి ఉషోదయం చూసి మురిసి పొవలి.  కొత్త ఆలోచనలతో ముందుకు పొవాలి.  జరిగి పోయిన  విషయాలకు ప్రత్యేకముగా పశ్చాతాప పడనవ నవసరములేదు. వాటికి సమధానము కాలము చెపుతుంది.  మనిషి ఆలోచన సరళిలో మార్పు రావాలి. అపుడు బ్రతుకు భారమని పించదు, చికాకు అనేది రాదు. అరమాత్మకు  ఇష్టుడుగా నిలబెడుతాడు. పరమాత్మను తనలోను ఇతరులలోనూ చూడ గలుగె నేర్పును గ్రహిస్తాడు.  జీవితములో అనుకున్నది సాధించటానికి అనుకూల వాతావరణం ఏర్పడటం జరుగుతుంది .
     కొంతమంది మోసగాళ్ళు మనవద్దకు  చేరి ఎంతో వినయ విధేయతలు, గౌరవ  ప్రపత్తులు చూపుతూ మన శ్రేయోభిలాషులవలె మీసాలు తుంటారు. అట్టి వారిమనో భావాలను పసికట్టి మనజాగ్రత్తలో మనం ఉండాలి  వాటినే " అవన్నీ నక్క వినయాలు అంటారు "  
11.  మనుష్యులలో అసూయ ఏనాడు రాకూడదు.
        ధర్మాధర్మాలు, సుఖదుఖాలు, జనన మరణాలు మొదలైన భావాలు మనస్సులోకి రాకుండా విడిచినవాడు,  కోరికలు, సందేహాలు,  ఊహలు, మొదలైన వాటిని భుద్ధిచేత గ్రహించినవాడు, ద్రుశ్య  వాసనలన్ని వదిలినవాడు, మహాత్యాగిగా గుర్తింప పడుతాడు.  అహంకారము, మానము, మాత్సర్యము లేని వాడై నిశ్చితంగా కార్యాలు నిర్వహించువాడు నిష్కాకుడు, దుఖములోను ఆనమ్దములొను సమభావము కలవాడు. దీనినీ ద్వేశిమ్పనివాడు, దెనినీ కోరనివాడు,లభిమ్చినదానినే మహా ప్రసాదముగా భావించి తిని సుఖ నిద్ర పోయేవాడే నిజమైన మానవుడు. మనో నిగ్రహమువల్ల యోగాబ్యాసం వలన చిత్త  శాంతి కలుగునని భగవద్గీత చెబుతుంది. 
        అంతా చేసి అసూయతొ అవతలి వానిపై నిందమొపి ఎమీ ఎరుగని దానిలా,  అమాయకునిలా,ఎంతో భాదపడుతున్న దానిలా వాపోతారు.  అవసరమైతే సుఖం కోసం ప్రాణాలుకూడా  తీస్తారు కొమ్దరు. అందుకే అన్నారు " మొగుడ్ని కొట్టి మొరపొయినట్టుంది అన్నదట ".        
                                

      12.  ఏనాడు ఎడబాటు వల్ల  దుఖపడ కూడదు.
        మనం వస్తువులను ఎంతో ప్రేమిస్తాము, అవి అనుకోని విధముగా పగిలిన విపరీతమైన కోపము ప్రవర్తిస్తాము ఎందుకు, నిగ్రహ శక్తి లోపించటంవల్ల, జ్ఞాపకాలను ఒక్కసారి మరువలేక  పోవటమువల్ల జరుగును.    
        భారతములో కుంతీ  దేవి కన్న  కోడుకును నీటిలొ దిలేసి ఎడబాటుకు ద:ఖపడిందా .


పెళ్లి ఐన వెంటనే తల్లి తండ్రులను మరచి, అత్తిల్లే స్వర్గమని భావించి, కొత్త కోడలు ఇంటిలో అడుగు పెడుతుమ్ది.  చిన్నప్పటినుంచి పెంచి పెద్ద చేసిన తల్లి తండ్రుల ఎడబాటుకు భాధపడక కొత్త  లోకంలోకి బంగారు కలలతో వచ్చిన కొత్త కోడలిని భాదపెట్టె వారు లేకపోలేదు,  కొత్తకోడలు అత్తింటికి రాగానే అన్యోన్యతను ఆదరణను చూపక చిందులు,  ఆమె తెచ్చిన సారే చీరలమ్దలి లోపలు ఎత్తిచూపడమ్ అత్తలు, ఆడబడుచులు, మరో సూర్యాకాంతాలు   అని పించే వారున్నారు .  ఆత్మా గౌరవమును చంపుకొని మనస్సాంతి  లేక ఎదబాటుగా ఉండి  జీవనము జరుపుతున్న వారు ఎందరో.
            నేడు భార్యాభర్తలు కష్టపడి పనిచేస్తున్నారు,  అత్తలు కుడా కొద్దిపాటి లోపంకాని, భాధకాని కలగకుండా ఎంతో జాగ్రత్తగా కంటి పాపలాగా చూచు కుంటాము అనే అత్తలున్నారు, మరేమీ భయ పడ నవసరములేదు అని తల్లి తండ్రులకు భరోసా ఇస్తున్నారు .
            :" కంటి పాపలాగా కాపాడుకుంటాము, కంటి రెప్పలాగా కాచుకుంటాము "    
           
13. నిరసనలు, ఫిర్యాదులు మనకి మంచివి కావు,  కాని దర్మాన్ని నిల బెట్టటానికి కృషి మాత్రం చేయాలి.                                                                                                                      దేశమునకు  నమ్మిన బంటువు  కావాలిలోయ్,  దేశ గౌరవమును పలు దేశాలలో పెంచే విధముగా మన ప్రవర్తన ఉండాలోయ్,  దేశమంటే  శ్రమజీవుల నిలయమని మరువకోయ్,   దేశములోని ప్రతి ఒక్కరు సమయాన్ని దుర్వినియోగ పరచకుండా సవినియోగము చేసుకొని మనస్తత్వం పెంచుకోవాలి,  ప్రలోభాలకు లొంగక, అరచేతిలో స్వర్గం చూపిస్తామని అన్నవారిని నమ్మక,  నీ మనసాక్షిని ఒక్కసారి గుర్తుతెచ్చుకొని, నీమిద ఆధారపడిన వారున్నారని గమనించి, నలుగురికి సహాయము చేయుట యందు ముందుకు రావాలి.  ఇతరులు చెప్పే మంచిని ఆలకించి,తక్కువ సమయములో ధర్మమార్గమున ఎక్కువ సంపాదనకు ప్రతిఒక్కరు కృషి చ్యాలి, స్నేహవారధిని పెంచుకొని,  కూడు, గుడ్డ,  లేని వారికి సహాయము చేయాలి,  నిర్మానాత్మకముగా, గౌరవముగా  ఉండే మాటలు మాట్లాడాలి,  అదనపు భాద్యతలతో అతిగా ఆలోచించ కుండా, పని వేగముగా చేయాలని తోటివారిని వేదిమ్చక, సమయస్పూర్తితొ పనిచెఇమ్చుకొవాలి,  ప్రకృతిలో ఉండే మార్పుల  అనుసరించి, మనిషి వ్యక్తిత్వం బట్టి, దేశానికి పనికొచ్చే విధముగా , అంకిత భావముతో, సహకారముతో దేశాభివృద్ధికి తోడ్పడుతూ  నిరసనలు, ఫిర్యాదులు జోలికి పోకుండా జీవిత నౌకను ముందుకు సాగిస్తూ బ్రతకాలి .
             కొందరు అప్రతిష్ట పాలై   అందరిచేత  అసహిమ్చుకోబడుతూ  చాలాకాలం బ్రతికే కంటే, బ్రతికి వున్నా నాలుగునాల్లు  అమ్దరూ మెచ్చుకొనే  జీవితమ్  కలవారి జన్మ ధన్యం, అందుకే
" కాకయి, కలకాలం బ్రతికేకంటే, హంసయి కొద్ది రోజులు బ్రతకటం మేలు " 

14.   ప్రేమ,వాంఛ అనే భావాలు నీకు దారి చూపిమ్చె దుస్తితి ఏనాడు 
   రానీయకు.
         వ్యక్తుల మద్య  పరస్పర  ప్రేమాభిమానములు కలిగి టేనే అన్యోన్య్టగా చెప్పవచ్చు.  సద్భావన, సహకారం, కష్ట  సుఖాలలో పాలు పంచుకొని ఒకరికి ఒకరు తోడుగా ఉండి, మంచి విషయాలను చర్చింమ్చుకుంటూ, కుటుంబమంతా అన్యోన్య్టతనే పెట్టని ఆభరణముగా మలుచుకుంటే అది ఆదర్శ కుటుంబము కాగలదు.  సుఖ శాంతులతో గలదు.  ప్రెమిమ్చికున్న పిల్లలను కలుపుటే పేద్దల వంతు, పిల్లల చేత  ఒక్క మాట అనిపించుకున్న పెద్దరికం అంతా గంగలో కలిపి నట్లవుతుంది.  వాంఛలు తీర్చుకొనుటకు అడ్డదారులు పట్టి పిల్లలకు చిక్కి వారి చేత మాట అనిపించు కొని బ్రతికే  బ్రతుకుకు విలువ ఎక్కడ ఉంటుంది.  అందుకనే పిల్లల  ముందు పెద్ద పెద్ద విషయాలు మాట్లాడ కూడదంటారు పెద్దలు.          
మనమేదైనా మాట్లాడినా,  పనిచేసినా,   ఆ ఆ సందర్బానికి,  సమయానికి,  తగ్గట్టు ఉండాలి.  లేనిచో మిన్నకున్నను మేలే.  అసందర్భంగా మాటలు, చేతలు, ఉమ్దకుమ్డా జాగర్త పడాలి. మనం చెప్పేది నిజమే కదా అని వాదిమ్చుకుంటూ  పొతే అవతల కొందరికి ఇబ్బంది కరముగా భాధకరముగా వుందా వచ్చు .  చాలామందితో విరోధముకూడా  రావచ్చు.  నిజం చెప్పువారు పరిస్థితి ఇరకాటములో పడుతుంది . అఅందుకే " యదార్ధవాది లోక విరోధి "  అన్నారు.    

15.  ఎ విషయములో ఇది కావాలి, ఇది వద్దు, అనే ఎంపిక ఉండకూడదు.
        మనం ఒక ఫంక్షన్ కు వెళ్ళాము అక్కడ త్రాగటానికి మమ్చినీళ్ళు దొరకలేదు, అక్కడ బావినీరు ఉంచారు.  మరి అవ త్రాగాలే  తప్ప నాకు బిస్లరీ వాటర్ కావలి అని మోర బెట్టు కుంటే ఎవరికీ నష్టం గొంతు పిడసి కట్టి భాద పడేది మనం సామెత చెప్పినట్లు చెరువుమీద అలిగి ముడ్డి కడుగుకోవటం మరిచాడుటా ఆవాసన ఎవరికి.      
        సమయా సమయాలను బట్టి మన  ప్రవర్తన మారాలి. అత్తగారి సాధింపులు, వేధింపులు ఇప్పుడు పనికి రావు.   నీవుతెఛిన లడ్డులు గుండ్రాళ్ళ ఉన్నాయి అంటే పాపం ఆ కొత్తకోడలు ఎంచేస్తుంది, నేను చేయలేదు అత్తగారు మా  వంటవారు చేసారు, మీకు ఏవిధముగా కావాలంటే ఆవిధముగా వంటవాళ్ళ చేత చెఇస్తాను కాని అదేపనిగా నన్ను విసిగించకండి  అనే పద్ధతిలో మారాలి.
        "గోరంత తప్పును కొండంత చేసి నోరు పారెసుకొనెవారెమ్దరొ"
        మహాభారతములో జనకమహారాజు కామాన్ని తట్టుకోలేక మాద్రిని కలిసి ముని శాప ఫలితముగా మృత్యువును పొందాడు, మాద్రి కూడ భర్తతో సహగమనం చేసింది ఇది కోరిక కలిగినందుకు ఫలితము.
         రామాయణములో ద
రధ మహారాజుకు వేట అంటే వల్లమాని ప్రేమ దాని వాడుకోలేక జంతువులనే వేటాడేవాడు .  ఒకసారి నీటిలొ మునిగిన శబ్దము విని సబ్ధభేది మంత్రము నుపయోగించి భాణము వేయగా శ్రవణ కుమారుడు విలపిమ్చుటను మహారాజు చూసి భాదపడిన  
శ్రవణ కుమారుడి మరణమును ఆపగలిగినాడా, వృద్ధ దంపతులను రక్షించ గలిగి నాడా చివరకు సాపమునకు గురి అయినాడు. 
             పట్టుదలకు, పంతాలకు పొతే ప్రతి ఇంట్లో  నరకము కనిపిస్తుంది.  అమ్దరూసుఖముగా ఉండాలి అంటే  అనువుగాని చోట అధికులమని అనకుండ ఉన్నదానిలో మనకు నచ్చింది ఇష్టముగా, నచ్చని దాని జోలుపోకుండ వేరొకరికి ఇబ్బంది కలుగకుండ ప్రవర్తించువారే  నిజమైన భారతీయ పౌరులు.
 


   16.  నువ్వు ఎక్కడ ఎలా బ్రతుకుతున్నావని ఆలోచించవద్దు.

         కర్తవ్యము స్వీకరిమ్చుము.  దీక్షతో  ధర్మమము  నిలుపు.  కర్మము కాలానికి విడువుము.  
మనము ఉదయము లేచి సాయంత్రముదాకా  శ్రమించి రాత్రికి కొంత విశ్రాంతి తీసుకొని ఉదయము యధావిధిగా విధులకు పోతూ కాలమంతా సంపాదనకు, సుఖమునకు ఖర్చు చేయు చున్నాము.
ఇసుకలో బాలలు గుజ్జనగూళ్ళు కట్టుకొని శ్రమించినంత  ఆనందం క్షణాలలో పొంది అ తదుపరి నాశనం చేసినట్లు, ఆ పరమాత్మ ఈ సృష్టిని ఇచ్చా మాత్రముగా జరుపుచూ లీలా మాత్రముగా అనంద మొందుచు అ తదుపరి ముగింప చేయును.  ఈ లోకంలో స్థిరము, శాశ్వతము, నిత్యమన్నది కన బడదు.  
               గురుభోధనలద్వారా, శ్రవణ నాడులద్వార విషయ వివర మేరిగి,  సమర్ధుల ద్వారా సందేహ నివారణ మొంది, అపార శాస్త్ర విజ్ఞానాభిలాషతో  శక్తి కొలదీ జ్ఞానమును పొంది,  అజ్ఞాణనము నుండి  బయటపడి సర్వజ్ఞు డివై  ప్రకాశించాలని,   సర్వము తెలుసుకొనుటకు కృషి చేయుటయే మానవుల లక్ష్యముగా తీసుకోవాలని నా ఆకాంక్ష.  

                  "ప్రతిభ" అనేది ఎవరి సొత్తు కాదు.  ప్రజల హృదయాలలో ఉండేవారే నిజమైన ప్రతిభావంతులు.
                 తమ అనుభవాలను, మంచి విషయములను, తోటివారితో పంచుకున్నవారు, తమ కున్నంతలో,   ఇతరులకు సహాయ పడువారు ధన్యులు అంటారు .
                 " మంచిని, సంచిని, పంచినవాడే పంచినవాడు"
  

17.  ఎ మాత్రం అవసరములేని వస్తువులను నీవిగా దాచి ఉమ్చకు
        మీ  పిల్లలను, పెంచి,  విద్యాబివృద్ధి చేయించి, కొత్త ఉపాధి కల్పించి, వివాహము చేసిన తర్వాత 
వారునీ వారు కారు.  వారిని వుండమని బలవంతము చేసిన ఫలితము తక్కువ ఉండును.
మారుతున్న కాలాననుసరించి మనము మారాలి కాని మొండి పట్టు పట్టి ఈ " రోలు రోకలి " మాతాత గారి కాలము నుండి  నుండి మాఇంటిలో ఉంది మీరు అమెరికాకు వెళ్ళేటపుడు తీసుకెల్లండి  అంటే
ఆధునిక పరికరములువఛక పాట వస్తువులు ఎవరు తీసు కేల్తారు. ఇతర దేశాల్లో ఒక దేశము నుండి  వేరొక దేశము మారేటప్పుడు అక్కడ ఉన్న వస్తువులన్నీ అక్కడే వదిలి రావాలే తప్ప విమానములో ఎక్కిమ్చుకొచ్చిన ఖర్చు,   మనం ఉన్న దేశంలో కొత్తవస్తువునే కొనవచ్చును.  
               వయసు మల్లిని వారిని పాత వస్తువుగా గుర్తిస్తూ వారిని  పోషించటానికి భాద పడుతున్నారు. వయసు మల్లిని వారిని భాద్యతగా గుర్తించి వారికి అన్ని సదుపాయాలూ చేయాలి  ఒకనాటికి వారి స్థితికి పోతామని మరువకండి. 

        ఎంతటి  మహా గ్రంధమైన చదవకపోతే, దానిలో ఉన్న జ్ఞాన సంపదను గ్రహ్మిచక  పొతే ఉన్న ఒకటే లేకున్నా ఓకటే, అది పాత పుస్తకమైపోతుంది.  చదవని వారికి ఎంత పాత దైనా అది కొత్తగా ఉంటుంది, అది గ్రహించలేక పాత వస్తువుగా గుర్తిమ్చి  బయట పారేస్తున్నారు.           కొందరు ఎంతో సంపద ఉండి ఎమీ అనుభవిమ్చరు.  ఎన్నో పుస్తకాలు ఉండి  ఒక్కటీ  చదవరు.  పూజలు చేస్తారు మనసు దైవము మీద ఉండదు.  గంధపు చెక్కల వాసన మోసిన గాడిదకు  తెలియనట్లు కొందరికి పాత వస్తువులు విలువ తెలుసికొని ఉంచుతారు,  తెలియక కొందరు పారవేస్తారు                                                                               " గంధపు చెక్కలు మోసినంత మాత్రాన గాడిదకు సుగంధము రాదు "     

18.  ఆచారములు, నమ్మకాలు అంటు అర్ధములేని పనులు చేయుకు        మడి, ఆచారము అంటు దేవుని పూజ మేమే చేయాలంటూ కొందరు వాదనలు జరుపుతుంటారు.  వేదం చదివినవారు, వాక్ చాతుర్యము ఉన్నవారు దేవునికి పూజార్హులు అని అమ్దరూ అటు ఉంటారు.   అమ్మవారికి పూజలంటూ జంతు బలులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం ప్రజల బలహీనతలను అధారము చెసుకొని కొందరు సన్యాసులు ప్రజల ధనము దొచుకొనెవిధముగా ఆచారాలు సృష్టించి ఇవే అనాదిగా ఉన్నాయి అని వాదన చేస్తున్నారు. 
               మానవునికి కష్ట సుఖాలలో, సుఖ ధుఖాలలో సుఖమే కావాలి అందరికి.  శ్రమలేకుండా ధనం రావాలి,  క్రుషి లేకుండా సుఖ సంతోషాలు అమర్చినట్లుగ జరగాలి.  అన్ని జీవితములొ వడ్డించిన విస్తరిలా ఉండాలని దేవుణ్ణి  ప్రార్దిమ్చుతారు.  మూదనమ్మకముగా రక్త తర్పణాలు, జంతు బలులు చేస్తున్నారు.   మూడ నమ్మకాలతొ, ఆచారాలతో,  కాలం  వ్యర్ధ చేస్తున్నారు.  కష్ట పడకుండా గాలిలో దీపమ్ పేట్టి  దేవుడా  నివే నాకు దీక్కు  అని మోర పెట్టు కుంటున్నారు.
               మనుష్యులు ముఖ్యముగా తన స్వీయ భాద్యతలు  నెరిగి, మంచి ప్రవర్తనలు ద్వారా ఇతరరుల దు:ఖాలలో విచారాన్ని , సుఖాలలోసుఖాన్ని, పంచుకోనేటట్లుగా ఉండాలి.  ధర్మా దర్మాలు తెలుసుకొని  స్త్రీ పురుషులు మధ్య ఎటువంటి వివాదములు లేకుండా సమ్మన ప్రతిపత్తితో చూస్తూ,  ప్రతిఒక్కరు అన్ని విషయాలలో తృప్తి పడితే అందరూ సుఖ శాంతులతో ఉండగలరు.      
 
కొందరు ప్రతిదీ  ఇట్టే  మంత్రం చదివితే అంతా అయిపోతుందని  ఎ ప్రయత్నము   చేయకుండా అంతా దేవుడి మీద భారమేసి కూర్చుంటారు.  ఆ మంత్రాల శక్తి కుడా మానవ ప్రయత్నం చెసిన వానికే  ఫలిస్తుమ్దిది.  కనుక ఎట్టి  సందర్భములో మానవ ప్రయత్నము  మానకూడదు, అందుకే  అంటారు                                                                            " మత్రాలకు చింతకాయలు రాలుతాయా?"
                                                      


  19.   అనవసరముగా ఆయుధాలను ప్రోగు చేయకు శిక్షణ ఇవ్వకు
        పొటీ  ప్రభుత్వమును నడుపుటకు తమ సొంత బలగమును పెంచుకొనుటకు, ధనవంతుల గుండెలో నిద్ర పోవుటకు, అక్రమం ఎక్కడ జరుగుతుంటే అక్కడ ప్రత్యక్షమగుటకు, వృద్దులను, స్త్రిలను అవమానిమ్చినవార్కి  ఖతిన దండన విధించుటకు, కడు బీదవారికి ఆర్ధికముగా ఆడుకొనుటకు, ఇళ్ళ యందు జరిగే ప్రతి వేడుకకు భాహుమతులిచ్చేందుకు, దేవాలయములో జర్గే పూజలకు తమవంతు సహాయముగా పండ్లు, పూలు, అందించి, అక్కడ వచ్చిన వారి రక్షణగా ఉమ్డెందుకు, అనాడు  ఆయుధాలు  ఉపయోగిమ్చారు.
             ఈ నాడు కొందరు తమ రాజకీయ స్వలాభాము కోరకు బాంబులను  తయారుచేసి  అన్యం పుణ్యం ఎరుగని అమాయకులను బలికొంటున్నారు. ఆధునిక పరికరములద్వార రిమోట్ బాంబులను తయారుచేసి అధిక జనాభా ఉన్న కూడలి యందు, ప్రజలు ఎక్కువగా సంచరించు మార్కట్ యందు, చివరికి దేవాలయములందు,  బాంబులు పెట్టి అవి పేల్చి ప్రజల భయందోలన సృష్టించి, అధికార పీఠములు కదిలించాలని కొదరు విదేశీ  శక్తులతో చేతులు కలిపి పోయేది నేనుకాదు అమాయక ప్రజల ప్రాణాలు, వారు అసలే పిరికివారు  " వారు ఒక గొఱ్ఱే  ఎటుపోతే అన్ని గొఱ్ఱేలు ఆటే పోతాయి " అన్నట్లు 
            మారణాయుధములు తయారు చేసే కమ్పెనీలు మనకు వసరమా, అణుబాంబు విస్పోట నము జరిగితే జరుగు అనర్ధము మనం గుర్తించాలి, ముక్యముగాగా గూడాచారి వ్యవస్థ చక్కగా పనిచేస్తే ఏ  ఆయుధములుతొ పనిలేదు, ఇన్ని ఎంకొంటర్లు జరుగ నవసరములేదు.
"గిడిని, గుడిలోని లింగాన్ని మింగే నాయకులకు రక్షణగా  ఆయుధాలతో  రక్షక భటులను ఉంచుతున్న ప్రభుత్వాలు ఉంటే ప్రజల్లో తిరుగుబాటుకు ఆయుధాలు సేకరించి కొన్ని దళాలుగా మారి గ్రామ రక్షణకు ముందుకు వస్తున్నారు ఇది అవసరమా?
           ధైర్యమున్నవారికి  ఎటువంటి ఆయుధముతో పనిలేదు, నీ యొక్క శ్రద్ధ, స్వయక్రుషి, నీ ఆత్మ  రక్షణకు ఆయధము అవుతుంది. మనం చేసిన మంచే అధర్మాన్ని ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది " భగవత్ గీతలొ చెప్పినట్లుగా మీరు కష్ట పడండి రక్షించెవాడిని నేనున్నాను "     


20.  అనవసరమైన మాటలకన్న మౌనమే మేలు         ఎక్కువగా మాట్లాడేవారు అభాద్దాలు చెపుతారు, శాంతి కొరకు ఎంతవరకు అవసరమో అంతవరకే కొద్దిగా మట్లాడాలి.  ఒక మనిషి యొక్క శక్తులన్నీ కూడా  వాని ఏకాగ్రత మీద ఉంటాయి. ఏకాగ్రతలో ఉన్న వ్యక్తికీ ఎమీకనబడవు, వినబడవు. అమ్తూ స్వామీ వివేకానందుడు చెప్పేవాడు.
ఒక జాలరి గాలం వేసి ఒడ్డున కూర్చొని ఉండగా అతని వద్దకు ఓకే మనిషి వచ్చి ఇదారి రామాపురం పోతుందా మరొక్కసారి రామాపురం పోతుందా అని గట్టిగా అడిగాడు, ఉలుకు పలుకు లేకుండా ఉమ్డుటవల్ల  ముందుకు నడిచాడు, గాళానికి చాప చిక్కగానే కొత్తవ్య్క్తిని బిగ్గరగా ఏమయ్యా ఇక్కడికి రా నిన్నే పిలిచేది , బిగ్గర పిలువగా ఆటను దగరకు రాగా నేను ఏకాగ్రతలో ఉన్నప్పుడు మీరు చెప్పినవ నాకు వినబడవు అని మర్యాదపూర్వకముగా చెప్పి దారివివరాలు చెప్పి పపిమ్చాడు.
             కొందరు మాటలతో కాలాన్ని తినెస్తారు. వారు చెప్పా మాటలో నితి  నిజాయితీ ఉండవు, డబ్బాలో రాయి వేసి ఊపితె వచ్చే శబ్దం లాగా చెప్పుకుమ్తూ పోతుంటారు.  అలాంటి వారితో స్నేహము చేయుట తప్పు. చేసేది శివ పూజలు దూరెది దొమ్మరి గుడిసెలు అంటారు. మాట కట్టు బడి వుండి హరిశ్చంద్రుడు, సిబి చక్రవర్తి, ధదీచి మహా పురుషులైనారు.
              పొరపాటున మాట తూలి మనకు మనమే ఆపద తెచ్చి పెట్టుకుంటాం, ఆపదను తప్పుకోలేక క్రిందా మీద పడతాం అందుకే " కొరివితో తల గోక్కున్నట్లు " అంటారు.
              మన మాట మంచి తనము, ధనము,  ఉన్నప్పుడే మనచుట్టూ చుట్టాలు స్నెహీతులు చేరుతారు, మాట తప్పిన వారి ఇంట ఎవ్వరు ఉండరు  అందుకే  " నీళ్ళున్నప్పుడే కప్పలు చెరువులో చేరతాయి "       అంటారు .    
 

21. గురువు ఇచ్చిన ఉపదేశమును మనసుతో విని పాటించాలి
      త్రిమూర్తులకన్నా, తల్లితండ్రులకన్నా గురువే గొప్ప అన్నది శాస్త్రవచనం, అందుకే గురువుకి మించి నవారు లేరని అందురు.   ఒక శిల్పి దారి వెంబడి ఉన్న రాయిని తోలచి  అందమైన దేవుని విగ్రహము చేసి శిష్యులకు తెలియ పరిచారు.  శిష్యులు ఊరి పెద్దలు కలసి దేవాలయము కట్టారు.
తల్లితండ్రుల నుండి జన్మ లభిస్తుంది, అది కేవలము భౌతిక శరీరము, గురువు వళ్ళ విద్యాభివృద్ధి కలిగి గొప్పవారగు తున్నారు.
              సుదర్సను
నె రాజుకు పుట్టిన కుమారులు దుర్మార్గులు, దుష్టులు, అట్టివారిని విష్ణుశర్మ అనే పండితుడు రాజ కుమారులకు మిత్రలాభము, మిత్ర భేదము, మరికొన్ని నీతి కధలు చెప్పి రాజనీతి పారంగాతులుగా మార్చారు.    
                                                                
22. ప్రేమ ఉంటే ప్రతిదీ జయించ గాలుగుతారు       ప్రేమద్వారా  క్రోధమును  జయించు
       శుభముద్వారా  అశుభమును జయించు
       నిస్వార్ధత ద్వారా స్వార్ధతను  జయించు
       సత్యము ద్వారా అసత్యము  జయించు

       ప్రతి మనిషి మనో చిత్త  బుద్ధులను ప్రకాశింప చేసి, ఆనంద రూపుడవటములోని అంతరార్ధాన్ని గ్రహిస్తే  ఈ నిరాశ,  నిస్పృహలు, నిర్వేదం నిన్నేడు అంటావు.   కాని మానవులు మనో భుద్ధి చిత్తాం హ కారాలు అంత రామ్తరాలలో  నిలిపే గూఢచార చర్యకు, కూలి క్రుంగి పోతున్నాడే తప్ప  సద్ధర్మ  నిరతుడు కావటములేదు.  పెడమార్గాల, నీచకృత్యాలకు  నిలయుడౌ తున్నాడే  తప్ప సద్ధర్మ నిరతుడు కావటములేదు, ప్రకాశింప లేక పోతున్నాడు .
                ప్రతి విషయము బొమ్మ బొరుసు వంటిది. కాలాను గునముఆ మన మనస్సును ఆధీనములొ ఉంచుకొని, ప్రేమించడం మొదట నేర్చు కోవాలి,  ప్రేమించటం వళ్ళ మనిషిలో ఉన్న కోపము, అహంకారము, గర్వము, పోయి భుద్ధ్మంతులుగా మారుతారు.
               వయసు పెరిగిన కొద్ది దేహములో మార్పులు వస్తూ ఉంటాయి, రోగాలు పెరుగు తుంటాయి, ఓపిక తగ్గుతుంది, చూపు తగ్గు తుంది, ఆలోచించే శక్తి తగ్గు తుంది, జ్ఞాపక శక్తి తగ్గు తుంది .
                ప్రతిఒక్కరు సత్య శోధనము, తత్వ శోధనములు, ఆనందాను భూతులను అలవోకగా ప్రేమద్వారా జయించగలరు. 
                 దరిదావులు లేనిది, చెప్పలేనిది, ఊహకందనిది, పరమ రహస్యమైనది, దీనిని నిత్యా, సత్యా, సాస్వతాన్వేషికులు "మిధ్య" అంటారు. స్త్రీ సహాయముతో పురుష ప్రయత్నము జరుగ కుండా  ఉండదు.  ఒకరికొకరు శాంత చిత్తులై, బుద్ధులు ఏకంచేసి, ఎకాగ్రతనొంది, త్రికరున శుద్ధిగా అర్ధం చేసుకొని బ్రతికేవారు నిత్య ప్రకాశ వంతులు.         
 
22.  తరుముకు వచ్చే కాష్టాలలాగా ప్రకోపించే కోపాన్ని అదుపు చేయగల వాడే నిజమైన సారధి.
        మానవులలో కోపము రాని వారు,  పౌరుషము లేనివారు,  అలుక చేయనివారు, పట్టు  పట్టని వారు, వాదనలు చేయనివారు, మూర్ఖులుగా వాదించే వారు, కామానికి లొంగని వారు ఎవరూ కానరారు . అందరు లక్షణాలు  కలవారే ఉందురు,  కేవలము కాంతి కిరణాలను పట్టు కోవాలని ప్రయత్నిమ్చేవారే,  నీడను చూసి భయపడేవారే, ఎమీ లెకపోయిన గౌరవ ప్రాతిష్టలు అంటూ గొప్పలు చెప్పేవారు.  వీరిని అదుపులో పెట్టె సారధి కావాలి. 

          మానవ సంబంధాలలో సహనానికి ముఖ్య స్థానం ఇవ్వాలి,   ప్రతికుటుంబములో కొన్ని విషయాలలో భార్య భర్తలమద్య  కోప తాపాలు పొడ సూపు తాయి,  ప్రతి ఒక్కరు ఆగ్రహం వదిలి నిగ్రహం పెంచు కోనవలెను, సమస్యలు రాకుండా కలసి మెలసి ఉండాలి.
         " ఓర్పు కలవాడు ఓరుగల్లును ఏలగడు "  అనే వాడుకలో  సామెత ఉన్నది
            ఓర్పు శాంతికి విజయానికి ఒక చక్కని బాట
            ద:ఖం వస్తే ఇంట్లో  మనసు    చికాకుల బాట
            కోపం వస్తే శాపనార్ధాలు,  బూతులు    బాట
            మొహం పెరిగితే ముందు వెనుక చూడక ఆట

                                                      
23.  పాప పుణ్యములు మనము చేసుకొన్నవే, ఒక వ్యక్తి  రెండవ వ్యక్తిని పవిత్రునిగా చేయలేడు.
        శక్తి మంతుడిలో అభిమానం, అహంకారం పాలు ఎక్కువైనపుడు కుటుంబాన్ని, సమాజాన్ని, చివరకు దేశాన్ని కూడా ముక్కలు చేయటానికి వెనుకాడడు.  శక్తికి తో ధనము కుడా తోడైతే అతనికి ఆశకు అంతే  ఉండదు. తను చేసేదే పుణ్యమని, అడ్డు వచ్చిన వారిని తొలగిమ్చుటే న్యాయమని వాదిస్తాడు.  అటువంటి మూర్ఖునికి కాలమే చెప్పాలి  తప్ప ఎవరూ తప్పును తప్పని చెప్పలేరు.  అతనితో పాటు వుంటే కొంత ధనము వస్తుందని " నందిని పంది  అన్న, పందిని నంది అన్న" ఒప్పు కుంటారు అది లోక సహజంగా మారింది.
                
                దారిద్ర్యంలో సంతోషము అనుభవించుట ఎంత కష్టమో
                 పిసినారిలో దాన శీలత్వమ్ కలిగించడం ఎంత కష్టమో
                 రామాయణంలో రావణుని అహం తొలగించట ఎంత కష్టమో   
          శక్తి, ధనం ఉన్నవానిలో క్షమాగుణాన్ని కలిగించడం ఇంకా కష్టం

          మనసులో ఉన్న మాటను ఆ బ్రహ్మాకూడ అర్ధ చేసుకోలేడని సామెత, మూర్ఖుని పవిత్రునిగా మర్చడం కూడా  కష్టమే,  నాలుగు గోడల మధ్య నేను చీకటి వ్యాపారము చేస్తున్నాను అనుకుంటే, ఎవ్వరూ చూడ లేదనుకుంటే పొరపాటు, ఊరకనే  అన్నారా " గోడకు చేవులున్నాయని" , కొన్ని విషయాలు మనము బయటకు చెప్పక ముందె కాకమ్మ కధలు అల్లి ప్రజలను నమ్మిస్తారు, అవి కొత్త చిక్కులు తెచ్చి పెడతాయి.  అందుకే తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయి, దేవుడనే వాడున్నాడు అని మరువ కూడదు.  అందుకే ప్రతిఒక్కరు అంటారు " దుర్యోధనునిలో ఉన్న దురాలోచన, తన ప్రాణంతో పాటు  ఎవ్వరి ప్రాణాలు నిలుపలేదు" కాబట్టి మనం చేసే పనిలో పాపపుణ్యాలు ఉన్నాయా అని అలోచిమ్చిచి పున్య కార్యాలు చేస్తే లోకం కుటుంబం సుఖముగా ఉంటుంది    
 
                                                                                                              














కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి