22, ఫిబ్రవరి 2014, శనివారం

114. Mythol'ogical Story-18 (ఆశ్రమము)

త్రిమూర్తులలలో ఉన్న  మహాశివుడు గుణ రహితుడు, దయామయుడు, భోలా శంకరుడు, చంద్రశేఖరుడు, గంగాధరుడు,కంట్టము చుట్టు కర్ణములపై  సర్పాలను ధరించువాడు, అగ్నిశిఖ నేత్రము కలవాడు,  సుందరమైన గజ చర్మము వస్త్రముగా ధరించు వాడు, త్రైలోక్య సారభూతుడు, నిత్యమూ శ్రీ రామ జపము చేయువాడు, కోరినవార్కి కోరిన వారాల ఇచ్చే నిత్యమూ ప్రార్ధిమ్చుతూ ఉంటే మోక్షము సిద్ధించు తుంది.అవ్యమైన కర్మలు నిస్ప్రయొజనాలు. 
                                   
                                                   


మనమందరమూ కలియుగంలో జీవిస్తున్నాము  ఏది పుణ్యమో ఏది పాపమో తెలిసికొనే పరిస్తితిలో లేము,  నా వారు బాగుంటే నాకు చ్చాలు అనుకుంటూ ఉన్నాము. నేనోక్కడ్ని లోకంలో ఏమి చేయలేను అనుకుంటాము,  అట్లా అనుకోవడం మన తప్పు కాదు, మనకున్న సమయములో మన చుట్టూ ఉన్న వారి మనస్సు నొప్పించకుండా, వారి వలన మనస్సు భాద పడకుండా ఉన్నదానిలో  ఉండటమే జివతమని భావిస్తాము. పగలంతా కష్టపడి అలసి పోతాము. కాల చక్రములో తిరుగుతూ కోర్కల వలయములో చిక్కుతూ, ఆరోగ్యమును కాపాడుకుంటూ కాలము వెల్ల పుచ్చు తుంటాము.  ఇది అంత నేనే చ్చేస్తున్నాను అనుకుంటాము, మన వెనుక ఒక దేవుడున్నాడని ఆ పరమాత్ముడే  నడిపిస్తున్నాడని అనుకునే వారెందరు.  ప్రతిఒక్కరు తెల్లవారుజామున లేచి ఇష్ట దైవాన్ని కొలిచి నిశ్చ కృత్చాలు నేరవేర్చగలరని ఆరోగ్యము చెడకుండా, ఆనందము వదలకుండా, ప్రేమే అన్నింటికి ఆధారమని భావించి, ఓర్పుతో, ఓదార్పుతో, శివనామ  జపముతో  అమృత భాష్యా లను అందరికి పంచుతూ కుటుంబాన్ని సరిదిద్ది, లోకరక్షణకు కృ షి చేయవలేనని, నిశ్చము శివ నామము, అభిషేకములు , పూజలు చేస్తూ ఉంటే మనస్సు ప్రశాంతముగా ఉంటుదని మనపెద్దలు, మునులు, ఋషులు చెప్పిన వాక్యములు నీను చెపుతున్నాను.  ఎందరో మహానుభావులు శివును గురించి కావ్వాలు గ్రంధాలు, కీర్తనలు వ్రాశారు వారి అందరికి నా పాదాభి వందనాలు. నాకు తెలిసినవి కొన్ని మీకు తెలియ పరచాలని ఇందు పొందుపరుస్తున్నాను ఇందులొఉన్న మంచిని గ్రహించి ఆ దేవదేవుని కృపకు పాత్రులవుతారని ఒక చన్న ఆశతో వ్రాస్తున్నాను.  తప్పులున్న క్షమించ గలరని వేడు కుంటున్నాను.  " ఓం నమ: శీవాయ: సిద్ధం నమ: " 
                                                           
                                                                              
                                                 
  
                                                 
లింగాష్టకమ్
బ్రహ్మమురారి సురార్చితలింగం, నిర్మలభాషిత శోభితలింగమ్,
జన్మజ దు:ఖ వినాశకలింగం,  తత్ప్రణమామి సదా శివలింగమ్,.........1.
దేవముని ప్రవరార్చితలింగం, కామదహన కరుణా కరలింగమ్,
రావణ దర్ప  వినాశణలింగం, తత్ప్రణమామి సదా శివలింగమ్,  .........2.
సర్వసుగంధ  సులేపితలింగం,  భుద్దివివర్ధన కారణ లింగమ్,
సిద్ధ  సురాసుర వందితలింగం, తత్ప్రణమామి సదా శివలింగమ్,  ......3.      
కనకమహామణి  భూషితలింగం, ఫణిపతి వేష్టిత శోభితలింగమ్,
ధక్షసుయజ్న వినాశనలింగం,  తత్ప్రణమామి సదా శివలింగమ్,  ......4.
కుంకుమ చందన లేపితలింగం, పంకజహార సు శోభితలింగమ్,
సంచితపాప వినాశనలింగం, తత్ప్రణమామి సదా శివలింగమ్,  ..........5
దేవగణార్చిత సేవితలింగం, భావైర్భక్తిభిరేవచలింగమ్,
దినకరకోటి ప్రభాకరలింగం, తత్ప్రణమామి సదా శివలింగమ్,  ............6
అష్టదళో పరివేష్టితలింగం, సర్వ సముద్భవ  కారణ లింగం
అష్టదరిద్ర వినాశనలింగం, తత్ప్రణమామి సదా శివలింగమ్,  ..............7
సురగురుసురవర ఫూజితలింగం, సురవన పుష్ప  సదార్చితలింగమ్,
పరమపతిం పరమాత్మకలింగం, తత్ప్రణమామి సదా శివలింగమ్,  .....8
లింగాష్టకమిదం పుణ్యం య: పఠెచ్ఛివసంన్నిధౌ,

శివలోక మవాప్నోతి శివేన సహమోదతే,
ఇతి శ్రీ లింగాష్టకం  

                                                                                
                                                                                 
     శివాష్టకమ్
ప్రభుం ప్రాణ నాథం విభం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజాం,
భవద్భవ్య భుతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశాన మీడే.
గళే  రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాదిపాలమ్,
జటా జూట గంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశాన మీడే.
ముదామాకరం మండనం మండయంతం మహా మండలం భస్మభూషధరం తమ్,
అనాదిం హ్యపారం మహామోహమారం  శివం శంకరం శంభుమీశాన మీడే.
వటాధోనివాసం మహాటాట్టహాసం మహాపాప నాశం  సదాసుప్రకాశం,
గిరీశం గణేశం సురేశం  మహేశం శివం శంకరం శంభుమీశాన మీడే..  
గిరీంద్రాత్మజానం గృహీతార్ధదేహం, గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం,
పరబ్రహ్మాది భిర్వంద్వమానం శివం శంకరం శంభుమీశాన మీడే.
కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదామ్భొజనమ్రాయకామం దదానమ్,
బలీవర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశాన మీడే.
శరచ్చంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం,
అపర్ణా కలత్రం సదాసచ్ఛరిత్రం  శివం శంకరం శంభుమీశాన మీడే.
హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం,
స్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశాన మీడే.
స్వయం య: ప్రభాతే నరస్సూల పాణే  ఫటేత్ స్తోత్ర రత్నం త్విహ ప్రాప్య్యరత్నం
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం  విచిత్రై స్సమారాధ్య మోక్షం ప్రయాతి.
ఇతి శ్రీ కృష్ణజన్మఖండే శివాష్టక స్తోత్రం సంపూర్ణం. 

                                                

అలసిపోయిన  బాటసారి చెట్టు నీడను ఆశ్ర యించినట్లు
జలప్రవాహములొ కొట్టుకుపోయేవానికి చెక్క దొరికినట్లు
పెను తుఫాను వళ్ళ  భీతి చెందినవాడు ఇంటికి చేరినట్లు    
పొరుగూరినిమ్చి వచ్చి ఆతిధి గృహస్తుని ఆశ్ర యించినట్లు
దరిద్రుడు, పండితుడు ధర్మాత్ముడైన రాజును ఆశ్ర యించినట్లు 
అంధకారములొ అలమటిమ్చేవాడు దీపాన్ని ఆశ్ర యించినట్లు
మంచుతో ఉన్న చలికి వనికేవాడు అగ్నిని సమీపిమ్చి నట్లు  
సర్వభయాలు పోగొట్టి సమస్త సుఖాలు చెకూర్చె శివపార్వతుల 
పాదపద్మాలు కడిగి ఆశ్ర యించి ప్రార్దిమ్చుతున్నాను.
                                               

భగవంతుడు, గుణరహితుడు, దయామయుడు, పసిబిడ్డ ఏడుపుకు తల్లి ఏవిధముగా తల్లడిల్లి పోతుందో అదేవిధముగా కలియుగాన్ని భక్తులను రక్షించుటకు పార్వతీ పరమేశ్వరులు తల్లడిల్లి పొతూ ఉంటారు.
ప్రార్ధన చేసినవారిని ఆదుకొని ఆనందాన్ని ప్రసాదిమ్చుతారు.

సుఖ:దుఖాలు కల్పించేది సర్వేశ్వరుడని గమనించాలి. ప్రకృతిని జీవరాసిని అనుక్షణం రక్షించేది పరమేశ్వరుడని గ్రహించాలి. మానవులు సుఖం వచ్చినప్పుడు ఆనందం పెరుగుతుంది అది భగవంతుడు కల్పిమ్చాడని గ్రహించలేరు ద:ఖం వచ్చినప్పుడు కుమిలిపొతూ కష్టాలు తొలగించమని పరమేశ్వరుడిని ప్రర్ధిమ్చటం మానవులకు సహజం.

హ్రుదయ శాంతి పొందాలంటే అరిషడ్వర్గాలను దూరమ్గా ఉంచాలి. దైవం మానవుల వెన్నంటి ఉమ్టుందని  గమనించాలి. సూర్యుడు సంచరిస్తున్నప్పుడు నీడ మారుతుమ్దిది. అదేవిధముగా మనమనస్సు కూడా  మరుతూ ఉంటుంది. చంద్రుడు సమ్చరిస్తు న్నప్పుడు చీకటిలొ వెన్నల కురిపిస్తూ ఆనందసుఖాలు అనుభవించమని, ఉదయమున చేసినవన్నీ మరచి హాయిగా నిద్రపొమ్మని ఆ భగవమ్తుడు మానవులకు  కల్పించాడు.దెవునియొక్క లీలలు ధర్మమార్గమున నడిచే భాకులు గమనించగలరు.
తనలోని జ్ఞానముతో ప్రాపంచిక సుఖాలకు అతీతముగా దైవ ప్రేరణకు కృషి చేయాలి. మనుషుల్లో దేవుడున్నాడని గుర్తించి, సమస్త సృష్టి దైవము వళ్ళ జరిగిందని గ్రహించి,  ప్రతిది దైవము వళ్ళ ఏర్పడినదని అమ్దరూ గుర్తించాలి.
మానవులయొక్క ఉన్నత స్తితిని పెంచేది, ఆరోగ్యముగా ఉంచేది, మనసు పరి పరి విధాలుగా మదన పడ కుండా ప్రతిఒక్కరిని, (కన్న బిడ్డలను కాపాడే తల్లి తండ్రులు లాగా) కాపాడే వారు ప్రార్వతి పరమేశ్వరులు ఒక్కరే .
ఈ శివరాత్రి సందర్భముగా (27-02-2014) ప్రతిఒక్కరు    ఓం నమశ్శివాయ, ఓం నమశ్శివాయ, ఓం నమశ్శివాయ అని జపం చేస్తారని ఆశిస్తున్నాను.       

అనగనగా ఒక అడవిలో ఒక ఆశ్రమము ఉన్నది, దానిలో విద్యార్ధులు ధర్మము గురించి తెలుసుకుంటున్నారు.  
ఒక నాడు గురువగారు ప్రక్క గ్రామములో ఉన్న దేవాలయమునకు వెళ్ళవలసి వచ్చి అక్కడకు శిష్యులతో బయలుదేరారు. వెళ్ళేటప్పుడు జ్ఞాన భోధ శిష్యులకు చేసేవాడు.
                                                   


ప్రతిరోజూ సూర్య భగవానును చూసి ఈవిధముగ ప్రార్ధన చేసేవారు గురువుగారు " దేవా నీ అనురాగము సాటిలేనిది. మమ్మల్ని ఎప్పుడు కనిపెట్టి వుంటావు. నీ దగ్గర కృతజ్ఞత ప్రకటించటానికి నాదగ్గర మాటల్లేవు, కానీ నా మనసును నువ్వు అర్ధం చేసుకుంటావని నాకు తెలుసు అనేవాడు.

గ్ర్రామమునకు పోతున్నప్పుడు మద్యలో ఉన్న గ్రామం వారివల్ల  ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చింది. వాళ్లకు తిండి, నీల్లు ఇవ్వకు పోగా తమ గ్రామంలో  విశ్రాంతి తీసు కోవటానికి  కూడా  వాళ్ళు అనుమతివ్వలేదు. దానివల్ల గురువు, శిష్యులు  చాలా ఇబ్బంది పడ్డారు.తిండి తినక, నీరుత్రాగక, మూడు రోజులు విశ్రాంతి లేక అమ్దరూ నీరసిమ్చి పోయారు.

గురువుగారు ఈ గ్రామములో వారు మనకి నీరు కుడా ఇవ్వకు పోవటానికి కారణమేమిటి. మనమేమి తప్పు చేసాము అడిగారు శిష్యులు.

ఇక్కడ ఎక్కువమంది బ్రాహ్మణులు నివసిమ్చుతున్నారు. వీరిలొ కొందరు శివ భక్తులు, మరికొందరు విష్ణు భక్తులు ఉన్నారు. వాదనకు దిగారు మాదేవుడు గొప్ప మాదేవుడు గొప్ప అని  వాదిమ్చు కుంటున్నారు. మనం సర్వాతర్యామి భక్తులన్న వారు నమ్మక ఆకడకు పొతే మీరు విష్ణు భక్తులు కాదు అన్నారు. ఇక్కడకు వస్తే వీరు శివభక్తులు కాదు అన్నారు. అందువల్లే మనకు మూడు రోజులనుంచి ఈకద వారు తిండి, నీరు ఆశ్రయమియ్య లేదు.

ఇక్కడ మంచివారు లేరా.

ఉన్నారు కాని వారి మంచిని గౌరవిమ్చె వారు లేరు.

మనము ఉపవాసముతో ప్రాణాలు విడుచుట ఏ కాని మరొమార్గము కానరావటము లేదు అన్నారు శిష్యులు.

ఆ పరమాత్ముడు మనల్ని ఉపవాసము చెయమన్నాడు అను కోవటం తప్ప ఏమి చేయలేము.
మరలా ఆకాశము వైపు చూసి "దేవా నీ అనురాగము సాద్తిలెనిది. మాపట్ల నీకు ఎంతో శ్రద్ధ మమ్మల్ని కనిపెట్టి ఉండటంలో  నీలొ కరుణ కదలాడుతుంది.మేము మీదయకు తగినవాల్లము కాము. నిజానికి నీపట్ల కృతజ్ఞత ప్రకటించ టానికి  నాదగ్గార మాటల్లేవు. కాని కృతజ్ఞత నిండిన నా మనసును అర్ధం చేసుకుంటావని ఆశిస్తాను.

గురువుగారి మాటలకు శిష్యులు ఆశ్చర్యము చెంది మూదు రోజులనుంచి తిండి లేక అల్లాడుతుంన్నాం, గ్రామస్తులు మనల్ని అవమానపరిచి తరిమి కొడుతున్నారు. ఈన్ని జరిగిన " దేవా మీరు దయగల వాడవని "  అన్న మాటలు ఉపసహరిమ్చు కుంటే  బాగుండు నన్నారు.

మీరట్లా అనకూడదు, నా విశ్వాసం నాది, మీ విశ్వాసం మీది.  నా విశ్వాసానికి నియమ నిభందనలు లేవు . నా కృతజ్ఞత ఎ ప్రయోజనాలను ఉద్దెసిమ్చిమ్ది కాదు. దేవుడేదో ఇచ్చాడని అయన పట్ల కృతజ్ఞత ప్రకటిస్తున్నానని  అనుకోవద్దు. నా అలవాట్లు నావి అన్నారు గురువుగారు.

దేవుడు మనకు ఈ భూమిపై ఉనికిని కల్పించాడు.  ఆయన పట్ల కృతజ్ఞత ప్రకటించ టానికి అదిచాలు.  ఎందు కంటే ఆ ఉనికి నేను కష్టపడి సాధించుకున్నది కాదు.  ఆయచితముగా వచ్చిన అదృష్టము అది.   

మనం గడిపిన ఈ మూడు రోజులు గొప్ప భక్తితో ధర్మమార్గమున ఉన్నాము, మనలో ఎటువంటి కోపము రాలేదు. ముఖ్యముగా నాలో కోపము రాలదు. ఫలితముగా నా ఉద్దేశ్యములో ఎటువంటి వ్యతిరేకత లేదు.
నా క్రుతజ్ఞతలొ ఎటువంటి మార్పు లేదు. అందలో ఈ రోజు మహాశివరాత్రి ఈ రోజు ఉపవాసముతో శివుని ఆరాధిస్తే పుణ్యము వస్తుందని పురాణాలు చెపుతున్నాయి కనుక మీరు కోపము తెచ్చుకోకుండా ఉండండి. ఆ దేవుని క్రుపకు పాత్రులు కండి అన్నడు గురువుగారు.

ఇదొక అగ్ని పరీక్ష దాన్నించి ఎట్లాంటి ఆటంకం లేకుండా నేను బయట పడ్డాను అంతకు మించి నాకేం కావాలి.
జననం లోను మరణంలోను నేను ఉనికిని సన్దర్సిస్తాను. ఇది ఆ దేవునిపై ఉన్న నాకు నమ్మకము.
ఇది పూర్తిగా వ్యక్తి గత విషయమని తలంచాలి. యదార్ధముతొ నాకున్న సన్నిహిత సంబంధం ఇక్కడ ఒక మహాసమన్వయ ముంది. మహా శాంతి ఉంది. నీను చాలా విశ్రాంతిగా ప్రశాంతముగా ఉన్నను.

దేవుడు నాకు ఇది ఇచ్చాడని ఇది ఇవ్వలేదని ఆయన పట్ల నిర్లక్ష భావముతో ఉండ కూడదు.లేచిన తర్వాత , పడుకొనేముందు కనీసము ఆ రుద్ర మూర్తిని తలుచు కొంటే మనము తెలిసి చేసిన పాపాలు తెలియకుండా చేసినపాపాలు పోతాయని నా అనుభవపూర్వకముగా చెపుతున్నాను.
ఆ మాటలకు శిష్యులు అమ్దరూ నిర్ఘాంతపోయారు.

అంతలో కొందరు మనష్యులు వచ్చి మాతప్పు తెలుసుకున్నాము " శివకేశవులు ఒక్కరే ". మా ఆతిధ్యము స్వీకరిమ్చి ఈ గ్రామంలో ఉన్న శివాలయములో పంచాక్షరి మంత్ర జపము చేస్తున్నాము మీరు మాతో కలవండి మాతప్పులు క్షమించండి.

కొందరి హృదయాలలో ఆ సర్వాంతర్యామి, అనుగ్రహమూర్తిగా, ఉగ్ర రౌద్ర మూర్తిగా,సంహార మూర్తిగా,  తాండవ మూర్తిగా, దక్షినామూర్తిగా, లింగోద్భవ మూర్తిగా,  భిక్షాటన మూర్తిగా,  అర్ధనారీస్వర మూర్తిగా, సరభ మూర్తిగా, కాలారి మూర్తిగా, కామాన్ని జైమ్చిన కామాంతక మూర్తిగా భక్తులహృదయాలలోస్తిరనివాసముగాఉన్నాడు.                                                                                              


ఓం నమ: శివాయ, ఓం నమ: శివాయ , ఓం నమ: శివాయ , ఓం నమ: శివాయ  , ఓం నమ: శివాయ .    
                                                   


                                                    

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

113. Politics story -17 (Leader)
మహాభారతం పంచమవేదం, శాంతి పర్వం పాలనా సరస్వం, అంపశయ్య సాక్షిగా భీష్మడు భోదించిన రాజనీతి పాండవులకెకాదు ప్రతిఒక్కరు అర్ధం చేసుకోవలసిన ధర్మ సూత్రాలు కొన్ని ఇందు పొందు పరుస్తున్నాను.

భీష్మ పితామహుడు ఉత్తమనాయకుడు ఎలా ఉండాలి, ప్రజలతో సమాజములో  ఎలా ప్రవరిమ్చాలి, నాయకులు కీలక నిర్ణయాలను తీసుకొనె టప్పుడు  ఎలా అలోచిమ్చాలి, సమర్ధులైన అధికారులను తూలనాడ కుండా ఎలా ప్రవరిమ్చాలొ తెలియపరిచాడు.         
                                                    

భీష్మ పితామహుడు నాయకుడిని మయూరముతొ పోల్చాడు.

1.నెమలి ఇంపైన కూతలతొ ఆకట్టుకున్నట్టే  - పాలకుడు  

   ప్రియభాషణతో     ప్రజలు హృదయాల్ని గెలవాలి.
2. నెమలి నెత్తిన సిగ  ఉన్నట్టే - రాజు (అధికార పదవిలో ఉన్న  

    నాయకుడు ) ధర్మాన్ని సిరసావహిమ్చాలి.
3. నెమలి నాట్యంతో వీక్షకుల్ని ఉత్చాహపరిచినట్టే,-  ప్రతిభా 

    పాటవాలతో  సిబ్బందిలో చైతన్యాన్ని నింపాలి.
4. నెమలి విష నాగుల్ని వేటాడి నట్టే - రక్షక భటులు దుర్మార్గులను, 

    దొంగలను పట్టుకొవాలి.
5. నెమలి జనాన్ని ఆకర్షించి నట్లు - జనాకర్షణ పధకాలు అమలు 

      జరపాలి.
                                              


1. నదీ ప్రవాహం  ఒడ్డును  కొసెస్తూ విస్తరించి నట్టు,  శత్రువుల్ని కూడా    

   క్రమ క్రమంగా బలహీన పరచాలి.  దెబ్బ తెలియకూడదు, గాయం   

మానకూడదు.

2. ధర్మాల్లొకెల్ల ఉత్తమధర్మమ్ - నిజం చెప్పడం.  పాపాలోకెల్ల     

  మహాపాపం అబద్దాలాడటం.

3. మృదువుగా మాట్లాడాలి, మృదువుగా వ్యవహారాన్ని చక్కబెట్టాలి,     మృదువుగా హెచ్చరించాలి,   మృదుత్వాన్ని  మిమ్చిన పదునైన ఆయుధం లేదు.

4. ఉన్నమ్తలొ నలుగురికి పెట్టి తినే వాడు, ఇహం లోను పరం లోను గౌరవం పొందుతాడు. 

5. సమ్పద, స్నెహసమ్పద  రెండింటిలో దేన్ని ఎమ్చు కుంటారని అడిగితె, స్నేహమే కావాలంటారు విజ్ఞులు.

6. జ్ఞాన జ్యోతి చాలా గొప్పది.  మనసులోని చీకట్లనూ  అది తొలగిస్తుంది.

7. జీవితమ్ సముద్రం. చంచలమైన ఇమ్ద్రియాలే నీళ్ళు, అరిషడ్ వర్గాలే మొసళ్ళు , ధైర్యమే తెప్ప.

8. క్రొధమె మనిషి పతనానికి తోలి మెట్టు.  ఆ క్రోధం కారణంగానే కార్త వీర్యార్జునుడు చేతిలో  రావణుడు,  రాముడి చేతిలో పరశు రాముడు ఓడిపోయారు.

9. దేశానికి మంచి జరిగినా చెడు జరిగినా అందుకు పాలకుడిదె పూర్తి భాద్యత.

10. అహింస సత్యం, దయ ఇంద్రియ నిగ్రహ - వీటిని మించిన తపస్సు లేదు.

11. తీరని ఆప్పు, ఆరని నిప్పు, ఎప్పుడూ  ప్రమాదమే.

12 నాయకుడనే వాడూ  ముఖస్తుతికి లొమ్గ కూడదు.  పొగడ్తలతో దగ్గర కావాలనుకునే వారిని దూరమ్గా ఉంచాలి       
 


                                                                                

కలియుగంలో జరుగుతున్న కొన్ని ధర్మాలు
 బాబు కారు  ఆపు అక్కడ  ఏదో యాక్సిడెంటు జరునట్లు ఉన్నది. నాన్న నీకన్తా చాదస్తం లొకమ్లో ఎన్నో జరుగుతున్నాయి అన్ని మనం చూడటమే తప్ప ఏమి చేయలేము, అట్లా అనకు ఎపుట్టలో  ఏ
పాముందో ఎవరికి తెలుసు, ఎగున్డేలో ఏమూల ప్రాణం ఉన్నదో ఎవరికి తెలుసు.  కొన ఊపిరిలో ఉన్న వారిని బ్రతి కిమ్చటమే మనలక్ష్యం.
నాన్న నీవు డాక్టర్ కావుగదా.
నీను డాక్టర్ కానవసరములేదు, మానవతా ద్రుక్పదముతో ఆకలేసిన వారికి అన్నము, దాహమేసిన వారికి నీరు, ఆపదలో ఉన్న వారిని ఆదు కోవటమే కదా మనకు నేర్పిన సంస్కృతి.
నాన్న అక్కడ ఎవరో త్రాగి కారు నడపటం వళ్ళ అమయక ప్రాణి విలవిల లాడుతున్నాడు. ప్రెక్షకుల్లాగా అన్దరూ చూస్తున్నారు. కొన ఉపిరి ఉన్నట్లున్నది అన్నాడు.
ముందు అక్కడకు పోదాం పదా అని అతనిని లేపి తన కారులో ఎక్కించుకొని డాక్టర్ వద్దకు తీసు కెల్లారు.
మీరు తేవటము  వళ్ళ  ఇతను బ్రతక గలిగాడు
annaadu డాక్టర్.  అంతలో పొలీసులు వచ్చి ఇది యాక్సిడెన్టుకేసు తెచ్చినవారు ఎవరు వారి వివరాలు చెప్పండి వ్రాసుకోవాలి అన్నారు.
 త్రాగి నడిపిన వాడి కారు నెంబరు, ముందు వారిని అరెస్టు చేయండి. ఇది నా చిరునామా అని ఇచ్చాడు.
 ఏది పేరున్న రాజకీయనాయకుడి కారు అన్నారు.                       
 ఇక్కడేం జరగలేదు మనదారి మనం పోదాం పదా అని వెన్నక్కి పొలీసులన్దరూ వల్లిపోయారు.                   
విధి నిర్వాహనములో రాజకీయ నాయకులు ఆడ్డు పడితే దేశం అధోగతి పాలు కాక మరి ఏమవుతుంది. 
                                                     

ఎంతో మంది కృషి ఫలితముగా ఒక సినమా వస్తుంది, ఆ సినమాను ప్రక్షకులు బాగుంది అనేటప్పడికళ్ళ  థియటర్ లో ఉండ కుండా పోయే విధానాలు అమలు జరుపుతున్నారు. కేవలము డబ్బే ప్రాధాన్యత చూపుతున్నారు. కళా దృష్టిని  గౌరవించి ప్రజలకు ప్రత్యెక ప్రదర్సనలు ద్వారా తక్కువ టికెట్టు ద్వారా చూపలేని ప్రభుత్వాలు, పొట్ట కూ టికొసం ఉన్న విద్యను (నాటకములు, తోలుబొమ్మలాటలు, హరికథలు,) అభివృద్ధి పరుచు కొవటానికి  అవకాశములు కల్పించలేని ప్రభుత్వాలు, విద్యార్ధులు ఎంతో కష్టపడి తమ విద్యను ప్రదర్శించిన ప్రొత్చహిమ్చని ప్రభుత్వాలు, తెలుగు విద్యను అభివృద్ధి పరచలేక పరభాషా విద్యకు కోట్లు కర్చు చేసే ప్రభుత్వాలు ఉన్న్నమ్త కాలం ఈ దేశం బాగు పడదు. నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనే వాదన చేసేనాయకులు న్నమ్త కాలమ్ ఈ దేశం ప్రపంచ దేశాలలో వేనుకపడిపోతుమ్ది. నాయకులు సంపాదన ఎట్లా వచ్చింది అని అడిగే హక్కు లేని ప్రభుత్వాలకు ప్రజలకు మేలు చేసే హక్కు కూడా లేదు.  
మంత్రి మండలి ఏర్పాటు కోసం మనదగ్గర  బోలెడంత  కసరత్తు జరుగుతుమ్దిమ్ది. కులాల కోటాలూ అధిష్టానం వాటాలూ  - పదవుల్ని పనస తొనల్ల పమ్చెసు కుంటారు.ఎక్కడా అర్హతల ప్రస్తాపన ఉండదు ఎఫరూ గునగునాల్ని పట్టించుకోరు. మంత్రుల ఎన్నికల్లో చాలా చాలా జాగర్తలు చుసుకొవా లంటారు. పొరపాటున గత చరిత్రలని త్రవ్వి చూడరు. (ఎంత డబ్బు వెనకేసుకున్నాడు), ఎంత డబ్బు మనకి కమీషన్ పార్తీ ఫఫ్న్డుగా ఇచ్చారు అని మాత్రం చూస్తారు.
భీష్ముడు మాత్రం జ్ఞానవంతులను, నిస్వార్ధ పరులను, ఏమ్చుకోవాలని సలహా ఇచ్చారు. మంత్రం అంటే ఆలోచన మంచి ఆలోచనలు ఉన్నవారే మంత్రులనిపిమ్చు కుంటారు. సిఫార్సులు కూడదంటారు, భందుప్రీతి వద్దంటారు,   నైపుణ్యానికి పెద్ద పీట వెయా లంటారు, కష్టపడే వారిని ప్రొచహిమ్చ మంటారు,
అధికార దర్పాలకు  పొమ్గి పోనివాడు, భాద్యతల నిర్వాహణలో అవమానాల్ని కూడా  భరించ కలిగె వాడు  ఉత్తముడు.                                   

        విధి నిర్వాహణలో ప్రజలకొరకు ప్రాణాలు అర్పిమ్చిన వాడు నిజమైన ఉద్యోగి.
అల్పులకు అధికారమిస్తే ఏమి జరుగుతుందో పాత కధ ద్వారా మీకు తెలియ పరుస్తా.

అనగనగా ఒక అడవిలో ఒక మహర్షి ఆశ్రమము నిర్మిచుకొని విద్యార్దులుకు  రాజకీయమ్ అంటే ఏమిటి? దాని   గురించి వివరముగా భోధ చేస్తున్నాడు. ముందుగా జంతువులను ప్రేమించడం నేర్చుకోవాలని తెలియపరిచాడు. అక్కడ రకరకాల జంతువులు ఆ ఆశ్రమములో నిర్భయముగా చమ్చరిస్తూ ఉండేవి. వాటిలో ఒక కుక్క కూడా
ఉంది.  మహర్షి ఎక్కడికెళ్ళినా తోక ఊపు కుంటూ వెనకాలే బయల్దెరెది.ఆయనా ఆదరించేవాడు. ఓ పులికి కన్ను కుట్టింది.అవకాసం దొరికినప్పుడల్లా కుక్కను వేధించేది. చంపేస్తానని బెదిరించేది.  అదంతా గమనించాడు మహర్షి.  కుక్క మనసులోని భయాన్ని పోగొట్టడానికి దాన్ని పెద్ద పులిగా మార్చాడు.భయం తగ్గి పోగానే కుక్క నిజరూపములొకి వచ్చింది.
ఏనుగుని చూసి భయపడి నప్పుడు ఏనుగుగా మార్చాడు, పామును చూసి భయపడి  నప్పుడు  కుక్కను పాముగా మార్చాడు. సింహము చూసి భయపడి  నప్పుడు  సింహముగా మార్చాడు.
సింహములా మార్చినప్పుడు  కుక్కలొ దుర్భుద్ది మెదలైమ్ది. ఎమ్తకాల మీ తాత్కాలిక రూపాలు శాస్వితంగా సింహముగా ఉంటె  ఎంత బావుండు అన్న ఆలోచన కలిగింది. అదనుచూసి మహర్షిని చంపేస్తే ఇక పాత రూపమ్ లోకి వెళ్ళాల్సిన అవసరమే ఉండదని పన్నాగం పన్నింది.
తపస్వి తలపును గ్రహించాడు ఎలాంటి అర్హతలూ లేని ఓ వీది కుక్కకు అంతటి శక్తిని ప్రసాదించడం తనతప్పె అని తెలుసుకున్నాడు.  పాత రూపాన్నిచ్చి ఆశ్రమము నుండి బయటకు తరిమే వేసాడు.            

                                                   
   స్వార్ధ పూరితమైన సమాజాన్ని (చవిటి భూమిని) ధర్మమార్గమన (నాగలితో ) దున్ని, అరిషడ్ వర్గాలనే (కలుపు మొక్కలను) తీసి మమతలనె (విత్తనాలను ) చల్లి, చమట బిందువులను రాల్చి(కాయ కష్టం చేసి ) ఆకాసము (నందు) మేఘమును రప్పించి (ప్రభుత్వము ద్వారా ) అప్పులు పుట్టించి కుటుంబ కష్టంతో పంట చెతికిరాగా అధికారమనే అహంకార విష సర్పాలు (బ్యాంకు లోను ఇచ్చినవారు, రోజువారి అప్పు ఇచ్చినవారు, ప్రభుత్వ  సొమ్మును తమ సొమ్ముగా ఇచ్చినవారు) జ్వాలాసమూహలకు పండించిన పంట భగ్గు మననట్లు నోరెత్త లేని పరిస్తితి ఏర్పడింది. చేతకానివారుగా మార్చింది. మీరు ఇక్కడ బ్రతకలెరు అని వాదించింది, ఇక్కడ పంట పమ్దిమ్చలెరని వెళ్లి వేరొకచోట బ్రతకమన్నది.     
సమాజాన్ని మార్చడం దేవుడెరుగు సాటి మానవుడుగా బ్రతకడనికి రాజకీయము అడ్డు వస్తుంది. అందుకనే రాజకీయ నాయకుడుగా మారితే రోజుకు లక్ష రూపాయలు సంపాదించవచ్చని నేటి నాయకులు చెపుతున్నారు.
ఏది ఎమన్నా రాజకీయములొ బ్రతకాలంటే రాజకీయనాయకుడు/నాయకురాలు కడుపునా పుడితే ఎమ్మి అర్హత లెకపొఇన నాయకుడవచ్చు అని జరుగుతున్న సంఘటనలు మనకు కళ్ళకు కట్టినట్లు చూపుతున్నవి.

నేటి రాజకీయము/ బీష్ముడు చెప్పిన రాజకీయము  గురించి తరువాత భాగములో కొంత తెలుసు కుందాము.              

10, ఫిబ్రవరి 2014, సోమవారం

112. Philos'ophy story -2/16 (Wel come)


ప్రతి ఒక్కరు సంధ్య సమయములో సూర్యనమస్కారాలు చేస్తే ఆరోగ్యమునకు ప్రశాంతత మనసుకు "శాంతి" కలుగుతుంది.
 

పుణ్య ప్రదేశాలైన గంగ యమునా నదుల మద్య భాగములో ఉన్న మహానుభావులు, ఋషులు, మునీస్వరులు ఆదిత్యుని ప్రార్ధించు తూ నన్ను అనుగ్రహించే బుద్ధి కలవారై, నా యశస్సు చిరకాలం ఉండేలా వృద్ది చేయుటకు, నా మనస్సు భక్తి  భావముతో అందరికి సహయముచెసె విధముగా సహకరిమ్చెవారికి పూన: పూన: నమస్కారాలు .
 

త్రిమూర్తులకు, ఆదిశక్తి స్వరూపులకు, ప్రకాసవంతములైన  దేవతలకూ, ప్రజాపత్యాది బుషులకు, మునులకూ, జ్ఞాన్నాన్ని ప్రసాదించే గురువులకు, తల్లితండ్రులకు, ప్రకృతిలో భూమి ఆకాశము మద్య ప్రదేసములో  శాంతము కలిగించే ప్రతిఒక్కరికి నా నమస్కారాలు.  
 

నమస్కారము తారక మంత్రము వంటిది, అవతలి వ్యకి మనపట్ల శత్రుత్వం భావన కలిగి  ఉన్నా సరే, అతనిలోని ఆ బావాన్ని సమూలమ్గా,  పోగొట్టగల శక్తి ఈ నమస్కారములొ ఉంది. 

నమస్కారముద్వారా సమర్ధత సిద్ధి పొందవచ్చు, ఏ దేవతకు నమస్కరించిన ఆ నమస్కారాలన్నీ " ఆ పరమాత్మకే" దక్కుతాయి, 

ప్రతిఒక్కరిని సాక్షాత్ పరమాత్మ స్వరూపముగా భావించి చిన్న పెద్ద భెధములేకుండా, కులమత భేదములు లేకుండా, వర్ణ వివక్షత లేకుండా,  నమస్క రిమ్చట మనేది ప్రతిఒక్కరి విధి.
అదే ముఖ్య ధర్మ0.
 

మనుషులు చేసే పాపాలన్నింటికి "కామ క్రొధాలు "  కారణం కాబట్టి, అలాంటి కర్మలకు కారణమైన కామానికీ, క్రొధానికి వాటి అధిదేవతలకూ నమస్కారమని కూడా సన్ధ్యొ పాసనలొ చెప్పడం కద్దు.
 

మనల్ని భరిస్తున్న  భూమికి,  పైనున్న ఆకాశానికి,  వందనం చేయడం త్రికాల సంద్యా వందనం లోని మన సాంప్రదాయం.
 

ప్రాపంచిక  వాంఛల విషయాసక్తి తొలగించుటకు, మనస్సుకు శాంతి కలిగించుటకు, మనో నిబ్బర శక్తి  పెరుగుటకు, ప్రతిఒక్కరిని గౌరవించి, స్త్రీ పురుష భెధము లేకుండా వారిలో ఉన్న మంచి బుద్ధిని గ్రహించి వారే దెవతామూర్తులుగా గ్రహించి పాదాభి వందనం చేయుట ముఖ్య ధర్మం.  
                                                

ప్రాణాయామంతో ఇంద్రియ దోషాల్ని, పరమాత్మ యందు మనసు నిల్పి  వాళ్ళ పాపాల్ని ఇంద్రియ నిగ్రహంతో  విషయ  వాంచల్ని, ధ్యానం తో  ":కామ క్రోధాది అరిషడ్ వర్గాల్నీ నశింప చేసుకోవాలి. సంపదలు, ప్రాణం, జీవితమ్  యవ్వనం ఇవన్ని నస్వరమైనవి, కానీ ధర్మం ఒక్కటే శాశ్విత మైమ్నది.  మానవుడు ధర్మాన్ని అర్దిమ్చాలి, ఏ ప్రాణిని హింసించకుండా భూతదయ కలిగి పరలోక సామ్రాజ్యాన్ని పాలిమ్చడానికి ధర్మ సంగ్రహాన్ని కొన సాగిస్తుం డాలి.

ధర్మం కోసం అర్ధ కామాల్ని వదులుకొనె వారు ఉత్తములు, ధర్మాన్ని అనుసరిస్తూ అర్ధం, కామాన్ని అనుభవవిస్తూ  ఉండేవారు  మధ్యములు అనగా ( కలియుగ స్త్రీ - పురుషులు), అర్ధ కామాలకొసమ్ ధర్మాన్ని విడిచి పెట్టేవారు అధములు.
 

కర్తవ్యం అన్న మాటకంటే ధర్మం అన్న మాటకు  విస్తృత మైన అర్ధం ఉంది. ధర్మం వల్లనే ప్రపంచం నడుస్తున్నది. సర్వలోకులకు అదే ఆధారం, కర్తవ్య శక్తికి సంభంధం  ఉంది. భోగాలాలసుడై ధర్మానికి కొద్దిగా ఎడమైన కర్తవ్యాన్ని విస్మరిమ్చ కూడదు.
 

ప్రతి ఒక్కరు తెలుసుకొనే కొన్నిధర్మ సూత్రలు                 
1. పౌష్టికాహారాన్ని తీసుకోని, దెహ దారుడ్యాన్ని పెంపొందిస్తే
    సుఖం, తోడై మనస్సు ప్రసాంతముగా, మారి పవిత్రులవుతారు.

2. ఓటమిని ఓర్చుకొని, గెలుపుమార్గాలు తెలుసుకొని ప్రయత్నిస్తే  
    విజయం సాధించి, యువతకు మార్గదర్శక గురువు లవుతారు.

3. వినయ విధేయత, సంసిద్ధత, పనిమీద శ్రద్ధ, మంచిమాట,  

    ఓర్పువహిస్తే   
    సేవకులుగా ఉన్నా, నాయయకులుగా మారే, యోగ్యత    

    కలవారవుతారు.

4. శక్తిని వ్యర్ధమైన మాటలతో, వృద్ధా చేయక,  అన్దరినీ నవ్విస్తె నవ్విస్తే
    గుండె సవ్వడి, రక్త ప్రసరణ, సక్రమముగా ఉండి 

    ఆరోగ్యవంతులవుతారు.

5. బలహీనుల మని భావించక, ప్రతి విషయంలో బలవంతులుగా భావిస్తే
    ప్రకృతిలో, కాలాన్ని అనుసరించి ఉంటె  ప్రపంచాన్నే గెలిచిన వారవుతారు.     

6.ఎవిషయములోను  ఆలోచన రాకుండక సొంత నిర్ణయాన్ని అమలుపరిస్తే
   ప్రతిఒక్కరిని ఉచ్చాహాముతో శ్రామికులుగా మారిస్తే, అఖండ సామర్ద్యులవుతారు.

7, కుల,మత, వర్ణ వివక్షత, లేకుండా అన్దరూ కలసి జీవిస్తె జీవిస్తే
    ధనకనక వస్తువాహనాలతొ, అష్ట సిద్ధులతొ, ఆరోగ్యవంతులవుతారు. 

8. భౌతిక సుఖంతో, ఆద్యాత్మికజ్ఞానంతో, సామర్ద్యం వృద్ధి పరిస్తే
    ధర్మపరాయనులు, భొగజీవులు, మొక్షానికి అర్హులవుతారు.
 

9. ధనం లేదని, పదవిలేదని, పిల్లలు లేరని, శాంతి లేదని విలపిస్తే
    సుఖ దుఖాలు సాస్వితమ్ కాదని, ముమ్దున్నవన్ని మంచి     

    రోజులనిభావించగలరు

10. శ్రావనమాసపు మమ్గలవారాలు, శుక్రవారాలు మహాలక్ష్మిని పూజిస్తే 
     ఇహం లోను, పరం లోను, సకల సుఖాలు కలిగి ప్రశాంతత     

      ఉంటుందంటారు.  
                                                 

   ప్రేమ ఉన్న హృదయం ఉంటె ప్రపంచానికి ఆశ్రమం ఇవ్వగలగు తుంది (ఒక చిన్న కథ చదవండి)

అది ఒక మారుమూల గ్రామం, అక్కడ ఒక పేదవాడు భార్యతో తన " 8 " సంవస్చరాల పాపతో ఒక చిన్న గుడిసెలో ఉండేవాడు. ప్రతిరోజూ కూలి పనిచేసుకొని బ్రతికేవాడు. తనకున్నదానిలొ ఇతరులకు దానం చేసేవాడు. ఇతర్లను ఆదుకొనేవాడు.
ఒకరోజు చీకటి పడింది, భోంచేసి భార్యాభర్తలు, పాపను పడుకోబెట్టి నిద్రకు ఉపక్రమించారు. అంతలో అనుకొనివిధముగ ఉరుములు మెరుపుపులతొ వర్షము ప్రారంభమైనది.
తలుపుతీయండి వానలో తడుస్తున్నాను అని అరుపులు వినబడినాయి. పేదవాడు భార్యతో బయట బాగా వర్షము పడుతున్నది, ఎవరో తలుపు తటుతున్నాడు, బహుశా పరిచయములేని స్నేహితుడై ఉంటాడు అన్నాడు.
భర్త తత్వము తెలిసిన ఇల్లాలు కనుక " ఈ గుడిసె మనముగ్గురము పడుకోవటానికి సరిపోతుమ్ది ఇంకొకరు వస్తే  ఇరుకవుతుమ్ది అన్నది.
అలా అనకు నీ మనసు పెద్ద దైతే ఈ గుడిసె కూడా రాజభవనము అవుతుంది. నీ మనసు సంకుచిమైతె రాజభవనము కూడా గుడిసెలా అవుతుంది. ఎదురు చెప్ప కుండా వెళ్లి తలుపు తీయి అన్నాడు పేదవాడు, అందులో వర్షమునకు వణికి పోతున్నాడు సాటి మనిషిని ఆదుకోవటం మనిషి ధర్మం  అన్నాడు. తలుపు తీయగ తడిసిన వ్యకి లోపలకు వచ్చి , పొడి గుడ్డతో తల తుడుచుకొని వారు పెట్టిన అన్నం తిని, చిన్న "చలి మంట" రగుల్చుకొని దాని చుట్టూ నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు.
  

వర్షంలో ఎవరో తలుపు కొట్టడం వినబడింది.  భార్య మాట్లాడలేదు. ఆశ్రమం పొందిన వ్యక్తి "ఇక్కడ మన నలుగురికి మాత్రమె స్తలము ఉన్నది. బయట ఇద్దరు ఉన్నట్లు తెలుస్తున్నది, మనం కూర్చొవాలి కాబట్టి తలుపు తీయక పోవటం మేలు అన్నాడు. " అంతలో పాప "నాన్న నన్ను ఇంటి దూలానికి చీర ఊయల వేసి దానిలో ఉంచండి నేను అక్కడ పడుకుంటాను"  బయట వారిని లోపలకు పిలవమని కోరింది చిన్నారి పాప.పాప చెప్పినట్లుగా ఊయల వేసి అందులో ఉంచారు.

అయ్యా అలా అనకు "ఇంట్లో ప్రేమ ఉన్నది " నీవు వచ్చావు కాబట్టి ప్రేమ తరగిపొలెదు". ప్రేమ అనేది ఇచ్చే కొద్ది పెరుగుతుంది కాని తరిగేది కాదు, పైగా వాళ్ళు లొపలకి  వచ్చారనుకో మనందరం దగ్గరగా ఇరుక్కొని కూర్చొవచ్చు, వెచ్చగాను ఉంటుంది. నీవు తలుపుకు  దగ్గరలో ఉన్నావు కాబట్టి వెళ్లి తలుపు తీయి అన్నాడు. అందులో బాల వాక్కు  బ్రహ్మ వాక్కు అని నీకు తెలియదా అని అన్నాడు పేదవాడు.

తలుపుతీయగా ఇద్దరు లోపలకొచ్చి తలతుడుచు కొని దగ్గరగా ఇరుక్కొని కూర్చొని ఉన్నారు వర్షము తగ్గలేదు. మాట్లాడుకుంటూ వారు నిద్రలోకి జారుకున్నారు.
       
అంతలో ఎవరో పండు ముసలివారు తలుపు కొడుతున్నట్లు తెలుసుకొన్నారు అన్దరూ. అందరకి మెలుకువ వచ్చింది. ఇంటి యజమాని తప్ప అన్దరూ తలుపు తీయటానికి వప్పుకోలేదు.

పేదవాడు "గొప్పవాళ్ళ ఇంటి ముందు  మసలి వారమై మనం వెళ్లి నిలబడితే వాళ్ళు మనల్ని జంతువులకన్న హీనంగా చూస్తారు, నోటికి వచ్చిన  దూషనకూడా చేస్తారు.

కాని ఇది పేదవాడి గుడిసె దీని యందు (జంతువు వచ్చి తలుపు కొట్టిన ముసలివారు వచ్చి తలుపు కొట్టిన ) అందరిని నేను సాటి మనుష్యులుగా చూస్తాను కాబట్టి దయచేసి తలుపు తెరవండి అన్నాడు.

తలుపు తెరిస్తే బయట మనిషి లోపలకు వస్తారు, కాని ఇందు ఒక్క మనిషి బయటకుకు పోతేగాని కాలీ ఏర్పడదు అన్నారు.
పేదవాడు పరవాలేదు అన్దరూ కూర్చొని ఉండండి. నేను బయటకు వెళ్లి బయట వారిని లోపలకు పంపెదను అన్నాడు.
ప్రేమ ఉన్న హృదయముంటే ప్రపంచానికి ఆశ్రమ ఇవ్వగలుగుతుంది అన్నాడు పేదవాడు 

ప్రేమ ఉన్న చోట ధర్మం నాలు పాదాలతో ఉంటుందని నా ఆకాంక్ష.

" నేను వ్రాస్తున్నవి మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు తెలుపగలరు, ప్రేమను అందరికి పంచగలరు తెలుగు భాష అభివృద్దికి సహాయపడగలరు ఇది చదివినవారు " షేర్ " చేయగలరు "
            
       

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

111. Philos'ophy story -1/15 (Circle )

ప్రత్యక్షదైవమైన  సూర్యభగవానునికి నమస్కరించి నాకు తెలిసిన యుగ ధర్మాలను ఇందు పొందు పరుస్తున్నను,  తప్పులు దొర్లిన నాకు తెలియ పరిస్తే సరి దిద్దుకొని ధర్మాన్ని తెలియపరుస్తాను, ఎందరో మహానుభావులు అందరికి వందనాలు అర్పిస్తూ,  నా సంకల్పబలం నెర వేరాలని ఆ భగవంతుని  ప్రార్ధిస్తున్నాను, అందరి మనస్సు ప్రశాంతముగా ఉండాలని దేవుణ్ణి కోరుతున్నాను                                         

గురువుగారు ధర్మం గురించి ధర్మ భొధలు గురించి తెలియపరచండి అన్నారు శిష్యులు
శిష్యులు అడిగినదానికి సావధానముగా వినండి, కొన్ని పిట్ట కధలతో ధర్మ భొధను మీకు తెలియపరుస్తా.   

ధర్మచక్రం  నింగి పై నిరంతరం పరిబ్రమిస్తూ ఉంటుంది. ప్రక్రుతిలో సూర్య చంద్రులు ఉన్నంతకాలం  కాలాను గునంగా, ఋతువులు   మాదిరిగా, మనుష్యుల జీవితాలలో సుఖ:దుఖాలు, పాపా పుణ్యాలు, రాగ ద్వేషాలతో  ధర్మ చక్రం నడిపిస్తుంది.    

జ్ఞామెది, అజ్ఞాన మేది, అనేది తెలుసు కోవటము లోనే సగము జీవితము వ్యర్ధమై పోతుంది.
సుఖాలకోసం, కోరికలు తీర్చు కోవటం  కోసం సగములో సగము  జీవితము నిద్రలో మినిగి పోతుంది.


       " అజ్ఞానము అవివేకముతో
     అవివేకము అభిమానముతో
     అభిమానము క్రోధముతో
     క్రోధము కర్మతో
     కర్మ జన్మతో
     జన్మ దు:ఖముతొ కూడి  యున్నవని
     తెలుసుకోవటమే ధర్మం "
మానవులు జీవితకాలములొ ధనము కోసం, పిల్లల సుఖం కోసం ధర్మం తప్పకుండా నడుచుటకు ప్రయత్నిస్తూ ఉంటారు. కాని కొందరు.   
    
" పుణ్య ఫలమును కావాలని ఆసింతురు, కానీ పుణ్యకార్యము చేయుటకు పూనుకొరు,
       పాప ఫలము అక్కరలేదని అందురు కాని పాపా కార్యము చేయుటకు పూను కొందురు."
     
కొన్ని ధర్మ సూక్ష్మాలు తెలియపరుస్తున్నాను, " గుణం, స్త్రీ తత్త్వం, కరుణ, సంకల్పం గురించి "    
కులం కన్నా గుణమే  ప్రధానం, ధర్మాన్ని ఆచరించడం, సత్యాన్ని పలకడం, పరుల హితాన్ని కోరడం అందరికి ఉండవలసిన గుణాల ధర్మం.స్త్రీలు అత్యున్నత సత్యాలను భోధించే వారనీ, పురుషులు సాటిగా ఆదరణ పొందారనీ వెదాలూ, ఉపనిషత్తులు  చాటి చెపుతున్నాయి, అదే స్త్రీ ధర్మం.

దేశాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా ఎక్కడ  గొప్పతనం ఉన్నా,అక్కడ శిరస్సు వంచి ప్రణమిల్లమని భగవత్గీతలో ఒక  ధర్మం.

జీవితంలో విజయాలను పొందడానికి ప్రతిభ కన్నా, అవకాశాల కన్నా గురితప్పని ఏకాగ్రత, లయ తప్పని దీక్ష తరగని ఓర్పు అవసరమనేది కలియుగ ధర్మం.  

                                                                              

మన పూర్వీకుల వ్రాసిన కథను మీకు వివరిసున్నాను. పూర్వం  వింధ్య పర్వత ప్రాంతలో చిదానందుడు అను ఆధ్యాత్మిక  గురువు " ప్రక్రుతి ఆశ్రమము " నందు శిష్యులకు విద్య నేర్పేవాడు. అక్కడ కొండ జాతికి చెందిన  శుచి కేతుడనే బాలుడు, శిష్యులకు, గురువుగారికి సేవలు చేస్తూ ఉండేవాడు. పర్వత ప్రాంతాలలో ప్రయాణించే బాట సారులకు నిండు మనసుతో నీరు, ఫలాలు అందించేవాడు.  గురువుగారు చెప్పెవన్ని కూడా  పనులు చెస్తూ వినేవాడు.  రాత్రి పూట  ఏరోజుకారోజు విన్నది మరలా గుర్తుకు తెచ్చుకొనేవాడు. శిష్యులు హేళన చేసినా పట్టించు  కొనెవాడు కాడు, తెల్లవారుజామున లేచి అందరికి నీరు తోడి, ఆశ్రమము సుబ్రమ్ చేసి దేవుని పూజకు పూలు, పండ్లు, ఏర్పాటు చేసేవాడు.

ఆదేసపు రాజు గురుకుల విద్యార్ధులను పరీక్షీమ్చి భాహుమతి ఇవ్వగలరని, ఆశ్రమ గ్రురువులకు తమ వ్విధ్యార్ధులను పంపమని, కోరగా,  రాజుగారి అహ్వానాన్ని గొరవిస్తు చిదానన్దుదు తన శిష్యులను పాల్గొనమని మీ విద్యానైపున్యమును అందరిముందు ప్రదర్శించి ఆశ్రమ ప్రతిష్టను నిలు పండి. మీతోపాటు శుచి కేతును కూడా తిసుకొని వెళ్ళండి.  అని ఆజ్ఞాపించారు గురువుగారు.

రాజకొలువులో  ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తున్నవారిని మేధావులను శిష్యులందరు చూసి భయపడసాగారు.  అందరిని ప్రశ్నిస్తూ చిదానన్దుని శిష్యులను కూడా ప్రశ్నించాడు.  

" చిరంజీవులారా నేను భగవంతుని ప్రేమిస్తున్నాను, మీకు సమ్మత మెనా "
 

శిష్యులందరు సమ్మతమెనట్లు తలఉపారు. కాని ద్వారముదగ్గర ఉన్న శుచికేతు మాత్రము " ప్రభూ మీరు భగవంతుని ప్రేమిస్తే చాలదు. ఆ భగవంతుడు మీమ్మల్ని ప్రెమిమ్చె టట్లు నడుచుకోవాలని జవాబు చెప్పాడు.
 

ఇంతకూ మీరెవరు అని రాజు అడుగగా నేను చిదానన్దుని శిష్యుడ్ని అని తెలియపరిచాడు.
ఐతే నాధర్మ సందేహాలకు నివే చెప్పాలి అది నీకు సమ్మతమెనా చెప్పలేకపోతే నీకు శిక్ష పడుతుంది.
 

మీ సమాధానాలు నేను చెప్పటం లేదు,  మాగురువుగారు చెప్పినట్లు  భావించండి అన్న మాటలకు శభ అంత ఆశ్చర్యముగా చూస్తున్నారు.
రాజు " భగవంతుడు నన్ను  ప్రేమిమ్చేతట్లు ఎలా నడుచుకోవాలి నీవె చెప్పు అని ప్రశ్నించాడు "

"ఇతరులబాగు కోరటంద్వారా, సర్వజీవుల యందు, దయ,  ప్రేమ కలిగి వుండటం ద్వారా,  తోటి మానవులతో సోదర భావం కలిగి జీవిమ్చడం ద్వారా, భగవంతుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. కష్టాల సమయములో కాకుండా నిరంతరం దేవునిని ప్రార్ధిమ్చుతూ ఉండడం ద్వారా భగవంతుని ప్రేమ పొందుతారు మీరు అన్నాడు".
రాజు " ఈ ప్రపంచములో దేనినైనా సాధించాలంటే మార్గ  మేది  ?    
" శాంతం ప్రభు "
 
శాంతము గోప్పతన్నాని మనం చెప్పలేము, మరి శాంతము మనిషికి ఎలా వస్తుంది?
శాంతము కష్టాలకు గల మూల కారణములను తొలగిస్తే వస్తుంది అన్నాడు.
 
లోకములోకెల్ల శత్రువులెవరు ?
అందరిలో జీవాత్మ భావాన్ని కూలదొసె గురువే శత్రువు.
 
లోకములో కెల్ల మిత్రులెవరు ?    
అందర్నీ సమానముగా చూసె గురువే లోకంలో కెల్లా మిత్రుడు.

లోకములూకేల్ల  దాత  లెవరు ?
క్షణకాలంలో  కెల్లా  బ్రహ్మపదాన్ని  ప్రసాదించే  గురువే లోకాంలోకెల్లా  దాత.
రాజు చిరంజీవి భగవన్తునిమీద, గురువు మీద నీకున్న  నమ్మకమును తెలియపరిచినావు.
నేను ఇచ్చే బహుమతి స్వీకరిమ్చు అని రాజు భహుమతి అందించాడు, ఈ భాహుమతి నా గురువుగారికి చెందవలసినది, నేను తీసుకోవటం సమమ్జసముకాదు అన్న మాటలకు రాజు  గురువుగారితో  పాటు శిష్యులందరికీ సన్మానించారు. విద్యాలయ పరువు ప్రతిష్టను కాపాడినవానిని హేళన చేయకండి తెలుసుకోండి ప్రత్యక్షముగా నేను విద్యనేర్పక పోఇనా పరోక్షముగా సహకరిమ్చానని  నాకు సంతోషముగా ఉన్నది. ధర్మాన్ని బ్రతికిమ్చినన్దుకు సంతోషముగా ఉన్నది అన్నాడు గురువు.
ధర్మ ప్రభోదాలు, ఆద్యాత్మిక విషయాలు, ధర్మమార్గాన ప్రతి ఒక్కరు నడవాలంటే స్తిరభావమ్ కలిగి, అర్ధం చేసుకొని, పూర్వీకులు ఋషులు, వేదాలలో వివరించిన ధర్మ సూక్తులు, మనస్సుకు మనొనిబ్బరమ్గా మనుగడ సాగిస్తూ ప్రతిఒక్కరు  ధర్మ ప్రచారం చియాలని, మానవులకు జీవనాధారము కలిగించే జీవ నాడిగా మారాలని నా ఆకాంక్ష. 
           

                                                                              
              
                 3, ఫిబ్రవరి 2014, సోమవారం

110. comedy story - 14 {నేను నేనే (2)}నేను నేనే (2)
వ్యాఘ్రెస్వర్ తెల్లని లాల్చి ఫైజమా ధరించి నడిరోడ్డులో ఉండి, రోడ్డు మీదకు ఎన్ని ఇల్లు ముందుకు వచ్చాయో, ఇంటి నెంబర్లతో సహా,షాపులు ముందు ఎన్ని వేహికల్సు ఆపారో, నో పార్కింగ్ అన్నచోట ఎన్ని కార్లు ఆపారో

నెంబర్లతో సహా, చిన్న బుక్ లో నాట్ చేస్తున్నాడు.అతివేగముగా కారు నడుపుతూ  ఎడమవైపుకు పోవాల్సింది కుడివైపుకు వచ్చి ఒక్క సారి బ్రేక్ వేస్తూ వ్యాఘ్రెస్వర్ ముందు ఆపాడు. 

నీకు పొయ్యే  కాలం వచ్చిందా, ఈ  కారు క్రింద పడాలని ఉందా, ఈ కారు ఎవరిదో తెలుసా అని గాటిగా అరిచాడు దిగిన డ్రైవర్.

ఇంతకు నీవు తప్పు దారి వచ్చి నన్ను వోట్రింమ్చటం ఒక తప్పు, ప్రొద్దున్నే త్రాగి నడపటం మరోతప్పు, ఈ కారు ఎవరిదో   తెలుసానటం మరో తప్పు, తప్పు మీద తప్పు చేసింది నీవు, అన్ని తప్పులు పెట్టుకొని నన్ను తొలగ మంటావెమ్దుకు అని నెమ్మదిగా అన్నాడు.

ఐతే నేను ఫోన్ చేస్తాను మా సార్ కి.

నీవు ప్రైమ్ మినిస్టర్ కు ఫోన్ చేస్తావో, చీఫ్ మినిస్టర్ కు ఫోన్ చేస్తావో, హోం మినిస్టర్ కు చేస్తావో, ఇంట్లో నీభార్యకు చేస్తావో, లేదా నీ రెండో  భార్యకు చేస్తావో, అని నేను అడిగానా, నా దగ్గ్గర ఆపి నన్ను చంపాలని అనుకున్నావు కదూ,

లేదు ఏదో భుద్దితక్కువై  రాంగు రూటు వచ్చాను, అందులో కొద్దిగా త్రాగివున్నాను, నన్ను క్షమించండి, ఈ రోడ్డుకు ఎప్పుడు  రాను, నన్ను వదిలెయ్యండి అన్నాడు డ్రైవర్.

నీ వళ్ళ నాలెక్క తప్పింది, మాల్లీ  మొదటినుంచి లెక్కపెట్టాక నేను కదులుతాను, నీవు ఎన్ని చెప్పిన నేను కదలనంటే కదలను అన్నాడు వ్యాఘ్రెస్వర్.

సరే మీలెక్క మీరు చూసుకోండి, ప్రక్కకు తొలగి లేక్కవేసుకోండి  అన్నాడు, నీవు వెనక్కన్న పో, లేదా నామిదనుమ్చి అన్న పొనీ, ఏదోఒకటి చేయి అనే కానీ నేను మాత్రం కదలను అన్నాడు.

నేను ముందుకు నడిపానంటే నీవు గుర్తుపట్ట కుండా పోతావు అదినీకు తెలుసా.

నేనేమన్నా అడుక్కొనే వాడినా, లేదా అదిరిసె పరుగెత్తే జంతువునా, నీ లాంటి మామూలు మనిషిని, నీలాగా త్రాగిమాత్రము లేను, నీవు మాతము త్రాగి ఉన్నావు , అసలు నీకు లైసంసు మంజూరు చేసిన వాడ్ని తీసు కొచ్చి జైల్లో పెట్టాలి, ఒక త్రాగుబోతుని డ్రవర్ గా పెట్టుకున్న మీ యజానిని జైల్లో పెట్టాలి.

నేనే వెనక్క్  వెళుతున్నాను అంటూ డ్రైవర్ వెనక్కి నడిచాడు,

ఆగు నన్ను కదలమని నీవు పోతావేమిటి,

సరే వెళ్ళు నీవు అడ్డం తోలగరు కదా "నేను ఒక్కసారి చెపితే వంద సార్లు చెప్పినట్లు " అన్నాడు.                          

ఐతే మీ మీదకు పొనిస్తా,  పొనీ నేనేమి భయపడను అన్నాడు

డ్రెవర్ కోపంగా ఒక్కసారి వ్యా ఘరెస్వర్ ప్రక్కకు లాగాడు,
                                                  


పెద్దగా అరుస్తూ నామీద దాడి చేయటానికి వచ్చాడు, నన్ను కాపాడండి, కాపాడండి అని గట్టిగా అరిచాడు, చుట్టూ ప్రక్కలవారు ఒక్కసారి మూగారు            

ఆ దోవలో లారి మిద చాలామంది జండా కర్రలు తీసుకోని ఊరెగిమ్పుకు, బహిరంగ సభకు పోతున్నారు, లారి ఆపి ఎం జరిగింది అంటూ అన్దరూ దిగారు, ఒక్క సారిగా జనం మూగరు, డ్రైవర్ది తప్పు అని పెద్దాయనకు క్షమాపణ చెప్పమని  వాదిస్తున్నారు కొందరు, ఇదిగోతప్పు నువ్వే చేసావు మేము కళ్ళార చూసాము ఆయన తోయటం, క్రిందపడి తగలరాని చోట తగిలితె ఆ నేరం ఎవరిదీ, ఆ శిక్ష ఎవరికి పడాలి, ఆయన ఘట్టి కాయం కాబట్టి నీవు తోసిన క్రింద పడలేదు ముందు క్షమాపణ చెప్పు అని వెరొకన్నారు.

క్షమాపణ నేను ఎందుకు చెప్పాలి, అసలు ఇక్కడ ఎం జరిగిందో మీకెం తెలియదు అర్ధం చేసుకోండి అన్నాడు  డ్రెవర్.

అంతలో ఒకరు ఈ కారెవరిది, ఈ కారు ఓనర్ ఎవరు చెప్పు ఫోన్ నెంబర్ చెప్పు పిలిపిస్తాను అంటూ వేరొకరు. త్రాగి నడుపుతావా అన్నాడు మరొకడు, ముందు కారుకు గాలితీయండి అంటూ తీసారు ఒకరు, జండా కర్రలతొ కారును బాదారు మరొకరు, రాళ్ళతో కారుపై విసిరారు కొందరు, అప్పుడే గమ్పలతొ కోడి పిల్లలను అమ్ముకునేవాడు రావటం, గంపజారి క్రింద పడటం కోడిపిల్లలు చెల్లాచెదరి పోవటం వాటికోసం వేతకటానికి పరిగెత్తటం, అవకసవాదులు బాంబు పేలింది అంటూ షాపులు మూఐమ్చడం, అందుకున్న వస్తువలను దొంగతనంగా తీసుకెళ్ళడం, డ్రైవర్ని కొందరు కొట్టడం ఒక్క  నిముషములో ప్రజల్లో కోపం పెరిగి ఎమ్చెస్తున్నారొ తెలియక ఆ రోడ్డంతా నిర్మానుష్యంగా మార్చారు, ఒకే స్కూటర్ మీద ఆరుగురు  ఎక్కివెగమ్గా పోతూ గోడకు గుద్దుకొని క్రింద పడ్డారు.

                                                      


వ్యాఘ్రెస్వర్  మాత్రమూ నింపాదిగా బ్రహ్మనందం గారు ఇక్కడ కూర్చొని కాస్త మాట్లాడు కుందాం రండి పదినిముషాలు ఐతే పోలీసోల్లు వస్తారు అంతా సర్దు మనుగు తుంది అన్నాడు.

ఏమయ్యా ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పడిగాడుట నీలాన్టి పెద్ద మనిషి

వాళ్ళ గొడవ మనమెందుకు హాయిగా ఒక జోకు చెప్పుతా నవ్వుకుందాం  విను, అవునయ్యా నీకేం చెపుతావు " రోమ్ " నగరం తగలబడి ఏడుస్తుంటే గిటారి వాయిస్తూ కూర్చున్నాడుట ఎవరొ, ఇది పాత  కధ కదా

పొలీసోల్లు వస్తూన్నారు మనం ఇక్కడ కూర్చున్నాము,  మనజోలికిరారు, నీవెమ్ భయపడకు వాళ్ళ పని వారు చూసుకొని పోతారు.

పొలిసు వాన్ రావటం వ్యాన్ నుండి కొందరు దిగడం వ్యాఘ్రెస్వర్కు నమస్కారం చెప్పడం ఒక్కసారిగా జనాన్నిచేదర గొట్టడం నిముషములో జరిగి పోఇంది. ఇక్కడ పుకార్లు వ్యాపించకుండా జాగర్త చేయండి.
అసలే ప్రజలు ఎలాంటి వారంటే "ఒకగోర్రే ఎటుపోతే మిగతా గొర్రలు అటేపోతై " అనే సామెతలాగా మారుతారు.   

పొలీసు విజిల్సుకు జనం పరుగెత్తారు, అందులో ఒకడు ఈ పొలీసోల్లు అంతా అఐపోయిన తరవాత  వస్తారు 
అన్నాడు, ముందు వాణ్ని ఎక్కించండి ఇట్లాంటి  వారు బయట ఉంటే పుకార్లు ఎక్కిస్తారు "ఇదిగో అంటే అదిగో పులి అని భయపెడతారు " మరియు ఆ తాగుబోతు డ్రైవర్ ను కూడా   ఎక్కించండి. ఎవ్వరు ఎదురు తిరిగెగితె వారిని వ్యానులో ఎక్కించండి. 

 ఇప్పుడు చూసావుగా ,ఒక్క త్రాగుబొతు వళ్ళ ఎంత నష్టమో,

 త్రాగినవాడు ఇంట్లో ఉంటె త్రాచుపాము ఉన్న
ట్టే త్రాగుటకు బానిసైతే అ కుటుంబము వీధిన పడినట్టే
 పిల్లల బ్రతుకు ఇష్టా రాజ్యమై, అగమ్య  గోచర మఇనట్టే
 పట్టుదలతో నేను త్రాగానని నిగ్రహిమ్చు కుంటే కాపురాలు బాగుపడినట్టే     

కొద్దిగా గ్యాసు వాసనే కదా అని ఊరుకుంటే ఇల్లు పేలి పొఇనట్టే
చిన్నమంటే కదా అని అజాగార్తగా ఉంటె కారు చిచ్చు ఐననట్టే   
అభద్దపు మాట చీనదైన, పెద్ద దిన కాపురాలుకూలి పోయినట్టే
త్రాగుడుకు బానిస ఐతే కుటుంబ గౌరవము గంగలో కలసి నట్టే     
                                                                   
"కామానికి రావణుడు, వాలి, కీచకుడు, ఏమైనారో తెలుసుకొ !
 జూదమునకు  నలమహారాజు, ధర్మరాజు ఏమైనారో తెలుసుకొ!
 మత్తుకు బానిసై శుక్రాచార్యులు, ఇంద్రుడు ఏమైనారో తెలుసుకొ!
 వేటవల్ల దశరధుడు, పాండురాజు, ఏమైనారో తెలుసుకొ!
 పలుకు ప్రల్లదనువల్ల శిశుపాలుడు, దూర్వాశుడు ఏమైనారో తెలుసుకొ!
 వృధా వ్యయం చేసి రాజులు, మహారాజులు, ఏమైనారో తెలుసుకొ!
 కామానికి బలి కాకుండా జీవతము సరిదిద్దుకొ !
 జూదము అనేది మనస్సులోకి రానీక సంసారం సరిదిద్దుకొ !
 ఇల్లు,వళ్ళు గుల్లచేసే మత్తు పానీయం త్రాగాట ఎందుకొ !
 కోపముతో అనరాని మాటలు పలికి భాదపడుట  ఎందుకొ !  
 నలుగురుకు సహాయపడుతూ జేవితం సాగించు ముందుకు !

అందుకే అందరికి నేను చెపుతాను

నవ్వుల కుటుంబమురా,  చింతలేని కుటుంబమురా !
నడ మంత్రపు సిరికోసం పాకులాడకురా,  నవ్వుల పాలవకురా  !
నవ జీవనం గడుపరా, నవ్వుతు, నవ్విమ్చుతూ ఉండురా!
స్త్రీ లకు నవ్వులు నాలుగందాల ప్రతిభకు నిదర్సనంరా !
నవ్వుల కవ్విమ్పులతో  సాగుతుందిరా, సంసార నావరా !
నవ్వులతో వెక్కిరిమ్చకురా, నవ్వినా నాపచేను పండునురా !
నవ్వులు ఆరోగ్యానికి పట్టురా,  నవ్వులతో భాద దూరమగునురా !
నవ్వుల మధ్య వచ్చును నవ యవ్వనం అని మరువకురా !
నడకసాగిస్తూ నమ్ముకున్నవారిని నవ్విస్తూ నడవాలిరా !
స్త్రీలను అతిగా నవ్వించకురా ఆనందభాష్పాలు రాలునురా !
సిరిమల్లె పూవల్లె ఉండురా, చిన్నారి పాపల్లె నవ్వరా !
కన్నవారిని సవ్వులు పాలు చేయకురా, సేవిస్తూ బ్రతకరా !
నవ్వుతూ, నవ్విస్తూ, నమ్ముకున్నవారి నవరత్నాలు పంచరా !
నవ్వుతూ బ్రతకాలిరా,  నవ్వుతూ చావాలిరా !
నవ్వుతూ జీవితమ్ ఆనంద డోలికల్లో మునగాలిరా
అదే జీవిత పరమానందం బ్రహ్మానందం అని గమనిమ్చురా  
                                                

కొద్దిగా త్రాగినవానికె ఇంత  పెద్ద కధ నడిచింది, నాకు సెలవిస్తె వెల్లొస్తాను వ్యాఘ్రెస్వరా  
అంతా ప్రశాంతముగా ఉంది వచ్చినపని మరిచాను నో పార్కింగులో ఉన్న వాహనాలను గురిమ్చాలా
                                               
అంతలో వెనకొచ్చి బ్రహ్మానందం అక్కడ పడిన చెప్పులు కుడానా అన్నమా
లకు ఒకటే నవ్వు