పుణ్య ప్రదేశాలైన గంగ యమునా నదుల మద్య భాగములో ఉన్న మహానుభావులు, ఋషులు, మునీస్వరులు ఆదిత్యుని ప్రార్ధించు తూ నన్ను అనుగ్రహించే బుద్ధి కలవారై, నా యశస్సు చిరకాలం ఉండేలా వృద్ది చేయుటకు, నా మనస్సు భక్తి భావముతో అందరికి సహయముచెసె విధముగా సహకరిమ్చెవారికి పూన: పూన: నమస్కారాలు .
త్రిమూర్తులకు, ఆదిశక్తి స్వరూపులకు, ప్రకాసవంతములైన దేవతలకూ, ప్రజాపత్యాది బుషులకు, మునులకూ, జ్ఞాన్నాన్ని ప్రసాదించే గురువులకు, తల్లితండ్రులకు, ప్రకృతిలో భూమి ఆకాశము మద్య ప్రదేసములో శాంతము కలిగించే ప్రతిఒక్కరికి నా నమస్కారాలు.
నమస్కారము తారక మంత్రము వంటిది, అవతలి వ్యకి మనపట్ల శత్రుత్వం భావన కలిగి ఉన్నా సరే, అతనిలోని ఆ బావాన్ని సమూలమ్గా, పోగొట్టగల శక్తి ఈ నమస్కారములొ ఉంది.
నమస్కారముద్వారా సమర్ధత సిద్ధి పొందవచ్చు, ఏ దేవతకు నమస్కరించిన ఆ నమస్కారాలన్నీ " ఆ పరమాత్మకే" దక్కుతాయి,
ప్రతిఒక్కరిని సాక్షాత్ పరమాత్మ స్వరూపముగా భావించి చిన్న పెద్ద భెధములేకుండా, కులమత భేదములు లేకుండా, వర్ణ వివక్షత లేకుండా, నమస్క రిమ్చట మనేది ప్రతిఒక్కరి విధి.
అదే ముఖ్య ధర్మ0.
మనుషులు చేసే పాపాలన్నింటికి "కామ క్రొధాలు " కారణం కాబట్టి, అలాంటి కర్మలకు కారణమైన కామానికీ, క్రొధానికి వాటి అధిదేవతలకూ నమస్కారమని కూడా సన్ధ్యొ పాసనలొ చెప్పడం కద్దు.
మనల్ని భరిస్తున్న భూమికి, పైనున్న ఆకాశానికి, వందనం చేయడం త్రికాల సంద్యా వందనం లోని మన సాంప్రదాయం.
ప్రాపంచిక వాంఛల విషయాసక్తి తొలగించుటకు, మనస్సుకు శాంతి కలిగించుటకు, మనో నిబ్బర శక్తి పెరుగుటకు, ప్రతిఒక్కరిని గౌరవించి, స్త్రీ పురుష భెధము లేకుండా వారిలో ఉన్న మంచి బుద్ధిని గ్రహించి వారే దెవతామూర్తులుగా గ్రహించి పాదాభి వందనం చేయుట ముఖ్య ధర్మం.
ప్రాణాయామంతో ఇంద్రియ దోషాల్ని, పరమాత్మ యందు మనసు నిల్పి వాళ్ళ పాపాల్ని ఇంద్రియ నిగ్రహంతో విషయ వాంచల్ని, ధ్యానం తో ":కామ క్రోధాది అరిషడ్ వర్గాల్నీ నశింప చేసుకోవాలి. సంపదలు, ప్రాణం, జీవితమ్ యవ్వనం ఇవన్ని నస్వరమైనవి, కానీ ధర్మం ఒక్కటే శాశ్విత మైమ్నది. మానవుడు ధర్మాన్ని అర్దిమ్చాలి, ఏ ప్రాణిని హింసించకుండా భూతదయ కలిగి పరలోక సామ్రాజ్యాన్ని పాలిమ్చడానికి ధర్మ సంగ్రహాన్ని కొన సాగిస్తుం డాలి.
కర్తవ్యం అన్న మాటకంటే ధర్మం అన్న మాటకు విస్తృత మైన అర్ధం ఉంది. ధర్మం వల్లనే ప్రపంచం నడుస్తున్నది. సర్వలోకులకు అదే ఆధారం, కర్తవ్య శక్తికి సంభంధం ఉంది. భోగాలాలసుడై ధర్మానికి కొద్దిగా ఎడమైన కర్తవ్యాన్ని విస్మరిమ్చ కూడదు.
ప్రతి ఒక్కరు తెలుసుకొనే కొన్నిధర్మ సూత్రలు
1. పౌష్టికాహారాన్ని తీసుకోని, దెహ దారుడ్యాన్ని పెంపొందిస్తే
సుఖం, తోడై మనస్సు ప్రసాంతముగా, మారి పవిత్రులవుతారు.
2. ఓటమిని ఓర్చుకొని, గెలుపుమార్గాలు తెలుసుకొని ప్రయత్నిస్తే
విజయం సాధించి, యువతకు మార్గదర్శక గురువు లవుతారు.
3. వినయ విధేయత, సంసిద్ధత, పనిమీద శ్రద్ధ, మంచిమాట,
ఓర్పువహిస్తే
సేవకులుగా ఉన్నా, నాయయకులుగా మారే, యోగ్యత
కలవారవుతారు.
4. శక్తిని వ్యర్ధమైన మాటలతో, వృద్ధా చేయక, అన్దరినీ నవ్విస్తె నవ్విస్తే
గుండె సవ్వడి, రక్త ప్రసరణ, సక్రమముగా ఉండి
ఆరోగ్యవంతులవుతారు.
5. బలహీనుల మని భావించక, ప్రతి విషయంలో బలవంతులుగా భావిస్తే
ప్రకృతిలో, కాలాన్ని అనుసరించి ఉంటె ప్రపంచాన్నే గెలిచిన వారవుతారు.
6.ఎవిషయములోను ఆలోచన రాకుండక సొంత నిర్ణయాన్ని అమలుపరిస్తే
ప్రతిఒక్కరిని ఉచ్చాహాముతో శ్రామికులుగా మారిస్తే, అఖండ సామర్ద్యులవుతారు.
7, కుల,మత, వర్ణ వివక్షత, లేకుండా అన్దరూ కలసి జీవిస్తె జీవిస్తే
ధనకనక వస్తువాహనాలతొ, అష్ట సిద్ధులతొ, ఆరోగ్యవంతులవుతారు.
8. భౌతిక సుఖంతో, ఆద్యాత్మికజ్ఞానంతో, సామర్ద్యం వృద్ధి పరిస్తే
ధర్మపరాయనులు, భొగజీవులు, మొక్షానికి అర్హులవుతారు.
9. ధనం లేదని, పదవిలేదని, పిల్లలు లేరని, శాంతి లేదని విలపిస్తే
సుఖ దుఖాలు సాస్వితమ్ కాదని, ముమ్దున్నవన్ని మంచి
రోజులనిభావించగలరు
10. శ్రావనమాసపు మమ్గలవారాలు, శుక్రవారాలు మహాలక్ష్మిని పూజిస్తే
ఇహం లోను, పరం లోను, సకల సుఖాలు కలిగి ప్రశాంతత
ఉంటుందంటారు.
ప్రేమ ఉన్న హృదయం ఉంటె ప్రపంచానికి ఆశ్రమం ఇవ్వగలగు తుంది (ఒక చిన్న కథ చదవండి)
అది ఒక మారుమూల గ్రామం, అక్కడ ఒక పేదవాడు భార్యతో తన " 8 " సంవస్చరాల పాపతో ఒక చిన్న గుడిసెలో ఉండేవాడు. ప్రతిరోజూ కూలి పనిచేసుకొని బ్రతికేవాడు. తనకున్నదానిలొ ఇతరులకు దానం చేసేవాడు. ఇతర్లను ఆదుకొనేవాడు.
ఒకరోజు చీకటి పడింది, భోంచేసి భార్యాభర్తలు, పాపను పడుకోబెట్టి నిద్రకు ఉపక్రమించారు. అంతలో అనుకొనివిధముగ ఉరుములు మెరుపుపులతొ వర్షము ప్రారంభమైనది.
తలుపుతీయండి వానలో తడుస్తున్నాను అని అరుపులు వినబడినాయి. పేదవాడు భార్యతో బయట బాగా వర్షము పడుతున్నది, ఎవరో తలుపు తటుతున్నాడు, బహుశా పరిచయములేని స్నేహితుడై ఉంటాడు అన్నాడు.
భర్త తత్వము తెలిసిన ఇల్లాలు కనుక " ఈ గుడిసె మనముగ్గురము పడుకోవటానికి సరిపోతుమ్ది ఇంకొకరు వస్తే ఇరుకవుతుమ్ది అన్నది.
అలా అనకు నీ మనసు పెద్ద దైతే ఈ గుడిసె కూడా రాజభవనము అవుతుంది. నీ మనసు సంకుచిమైతె రాజభవనము కూడా గుడిసెలా అవుతుంది. ఎదురు చెప్ప కుండా వెళ్లి తలుపు తీయి అన్నాడు పేదవాడు, అందులో వర్షమునకు వణికి పోతున్నాడు సాటి మనిషిని ఆదుకోవటం మనిషి ధర్మం అన్నాడు. తలుపు తీయగ తడిసిన వ్యకి లోపలకు వచ్చి , పొడి గుడ్డతో తల తుడుచుకొని వారు పెట్టిన అన్నం తిని, చిన్న "చలి మంట" రగుల్చుకొని దాని చుట్టూ నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు.
వర్షంలో ఎవరో తలుపు కొట్టడం వినబడింది. భార్య మాట్లాడలేదు. ఆశ్రమం పొందిన వ్యక్తి "ఇక్కడ మన నలుగురికి మాత్రమె స్తలము ఉన్నది. బయట ఇద్దరు ఉన్నట్లు తెలుస్తున్నది, మనం కూర్చొవాలి కాబట్టి తలుపు తీయక పోవటం మేలు అన్నాడు. " అంతలో పాప "నాన్న నన్ను ఇంటి దూలానికి చీర ఊయల వేసి దానిలో ఉంచండి నేను అక్కడ పడుకుంటాను" బయట వారిని లోపలకు పిలవమని కోరింది చిన్నారి పాప.పాప చెప్పినట్లుగా ఊయల వేసి అందులో ఉంచారు.
అయ్యా అలా అనకు "ఇంట్లో ప్రేమ ఉన్నది " నీవు వచ్చావు కాబట్టి ప్రేమ తరగిపొలెదు". ప్రేమ అనేది ఇచ్చే కొద్ది పెరుగుతుంది కాని తరిగేది కాదు, పైగా వాళ్ళు లొపలకి వచ్చారనుకో మనందరం దగ్గరగా ఇరుక్కొని కూర్చొవచ్చు, వెచ్చగాను ఉంటుంది. నీవు తలుపుకు దగ్గరలో ఉన్నావు కాబట్టి వెళ్లి తలుపు తీయి అన్నాడు. అందులో బాల వాక్కు బ్రహ్మ వాక్కు అని నీకు తెలియదా అని అన్నాడు పేదవాడు.
తలుపుతీయగా ఇద్దరు లోపలకొచ్చి తలతుడుచు కొని దగ్గరగా ఇరుక్కొని కూర్చొని ఉన్నారు వర్షము తగ్గలేదు. మాట్లాడుకుంటూ వారు నిద్రలోకి జారుకున్నారు.
అంతలో ఎవరో పండు ముసలివారు తలుపు కొడుతున్నట్లు తెలుసుకొన్నారు అన్దరూ. అందరకి మెలుకువ వచ్చింది. ఇంటి యజమాని తప్ప అన్దరూ తలుపు తీయటానికి వప్పుకోలేదు.
పేదవాడు "గొప్పవాళ్ళ ఇంటి ముందు మసలి వారమై మనం వెళ్లి నిలబడితే వాళ్ళు మనల్ని జంతువులకన్న హీనంగా చూస్తారు, నోటికి వచ్చిన దూషనకూడా చేస్తారు.
కాని ఇది పేదవాడి గుడిసె దీని యందు (జంతువు వచ్చి తలుపు కొట్టిన ముసలివారు వచ్చి తలుపు కొట్టిన ) అందరిని నేను సాటి మనుష్యులుగా చూస్తాను కాబట్టి దయచేసి తలుపు తెరవండి అన్నాడు.
తలుపు తెరిస్తే బయట మనిషి లోపలకు వస్తారు, కాని ఇందు ఒక్క మనిషి బయటకుకు పోతేగాని కాలీ ఏర్పడదు అన్నారు.
పేదవాడు పరవాలేదు అన్దరూ కూర్చొని ఉండండి. నేను బయటకు వెళ్లి బయట వారిని లోపలకు పంపెదను అన్నాడు.
ప్రేమ ఉన్న హృదయముంటే ప్రపంచానికి ఆశ్రమ ఇవ్వగలుగుతుంది అన్నాడు పేదవాడు
ప్రేమ ఉన్న చోట ధర్మం నాలు పాదాలతో ఉంటుందని నా ఆకాంక్ష.
" నేను వ్రాస్తున్నవి మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు తెలుపగలరు, ప్రేమను అందరికి పంచగలరు తెలుగు భాష అభివృద్దికి సహాయపడగలరు ఇది చదివినవారు " షేర్ " చేయగలరు "
baga rasaru.namaskaramu prayojanamulu bagunnavi.dharma sutralu baga vunnavi.
రిప్లయితొలగించండి