16, ఫిబ్రవరి 2014, ఆదివారం

113. Politics story -17 (Leader)




మహాభారతం పంచమవేదం, శాంతి పర్వం పాలనా సరస్వం, అంపశయ్య సాక్షిగా భీష్మడు భోదించిన రాజనీతి పాండవులకెకాదు ప్రతిఒక్కరు అర్ధం చేసుకోవలసిన ధర్మ సూత్రాలు కొన్ని ఇందు పొందు పరుస్తున్నాను.

భీష్మ పితామహుడు ఉత్తమనాయకుడు ఎలా ఉండాలి, ప్రజలతో సమాజములో  ఎలా ప్రవరిమ్చాలి, నాయకులు కీలక నిర్ణయాలను తీసుకొనె టప్పుడు  ఎలా అలోచిమ్చాలి, సమర్ధులైన అధికారులను తూలనాడ కుండా ఎలా ప్రవరిమ్చాలొ తెలియపరిచాడు.         
                                                    

భీష్మ పితామహుడు నాయకుడిని మయూరముతొ పోల్చాడు.

1.నెమలి ఇంపైన కూతలతొ ఆకట్టుకున్నట్టే  - పాలకుడు  

   ప్రియభాషణతో     ప్రజలు హృదయాల్ని గెలవాలి.
2. నెమలి నెత్తిన సిగ  ఉన్నట్టే - రాజు (అధికార పదవిలో ఉన్న  

    నాయకుడు ) ధర్మాన్ని సిరసావహిమ్చాలి.
3. నెమలి నాట్యంతో వీక్షకుల్ని ఉత్చాహపరిచినట్టే,-  ప్రతిభా 

    పాటవాలతో  సిబ్బందిలో చైతన్యాన్ని నింపాలి.
4. నెమలి విష నాగుల్ని వేటాడి నట్టే - రక్షక భటులు దుర్మార్గులను, 

    దొంగలను పట్టుకొవాలి.
5. నెమలి జనాన్ని ఆకర్షించి నట్లు - జనాకర్షణ పధకాలు అమలు 

      జరపాలి.
                                              


1. నదీ ప్రవాహం  ఒడ్డును  కొసెస్తూ విస్తరించి నట్టు,  శత్రువుల్ని కూడా    

   క్రమ క్రమంగా బలహీన పరచాలి.  దెబ్బ తెలియకూడదు, గాయం   

మానకూడదు.

2. ధర్మాల్లొకెల్ల ఉత్తమధర్మమ్ - నిజం చెప్పడం.  పాపాలోకెల్ల     

  మహాపాపం అబద్దాలాడటం.

3. మృదువుగా మాట్లాడాలి, మృదువుగా వ్యవహారాన్ని చక్కబెట్టాలి,     మృదువుగా హెచ్చరించాలి,   మృదుత్వాన్ని  మిమ్చిన పదునైన ఆయుధం లేదు.

4. ఉన్నమ్తలొ నలుగురికి పెట్టి తినే వాడు, ఇహం లోను పరం లోను గౌరవం పొందుతాడు. 

5. సమ్పద, స్నెహసమ్పద  రెండింటిలో దేన్ని ఎమ్చు కుంటారని అడిగితె, స్నేహమే కావాలంటారు విజ్ఞులు.

6. జ్ఞాన జ్యోతి చాలా గొప్పది.  మనసులోని చీకట్లనూ  అది తొలగిస్తుంది.

7. జీవితమ్ సముద్రం. చంచలమైన ఇమ్ద్రియాలే నీళ్ళు, అరిషడ్ వర్గాలే మొసళ్ళు , ధైర్యమే తెప్ప.

8. క్రొధమె మనిషి పతనానికి తోలి మెట్టు.  ఆ క్రోధం కారణంగానే కార్త వీర్యార్జునుడు చేతిలో  రావణుడు,  రాముడి చేతిలో పరశు రాముడు ఓడిపోయారు.

9. దేశానికి మంచి జరిగినా చెడు జరిగినా అందుకు పాలకుడిదె పూర్తి భాద్యత.

10. అహింస సత్యం, దయ ఇంద్రియ నిగ్రహ - వీటిని మించిన తపస్సు లేదు.

11. తీరని ఆప్పు, ఆరని నిప్పు, ఎప్పుడూ  ప్రమాదమే.

12 నాయకుడనే వాడూ  ముఖస్తుతికి లొమ్గ కూడదు.  పొగడ్తలతో దగ్గర కావాలనుకునే వారిని దూరమ్గా ఉంచాలి       
 


                                                                                

కలియుగంలో జరుగుతున్న కొన్ని ధర్మాలు
 బాబు కారు  ఆపు అక్కడ  ఏదో యాక్సిడెంటు జరునట్లు ఉన్నది. నాన్న నీకన్తా చాదస్తం లొకమ్లో ఎన్నో జరుగుతున్నాయి అన్ని మనం చూడటమే తప్ప ఏమి చేయలేము, అట్లా అనకు ఎపుట్టలో  ఏ
పాముందో ఎవరికి తెలుసు, ఎగున్డేలో ఏమూల ప్రాణం ఉన్నదో ఎవరికి తెలుసు.  కొన ఊపిరిలో ఉన్న వారిని బ్రతి కిమ్చటమే మనలక్ష్యం.
నాన్న నీవు డాక్టర్ కావుగదా.
నీను డాక్టర్ కానవసరములేదు, మానవతా ద్రుక్పదముతో ఆకలేసిన వారికి అన్నము, దాహమేసిన వారికి నీరు, ఆపదలో ఉన్న వారిని ఆదు కోవటమే కదా మనకు నేర్పిన సంస్కృతి.
నాన్న అక్కడ ఎవరో త్రాగి కారు నడపటం వళ్ళ అమయక ప్రాణి విలవిల లాడుతున్నాడు. ప్రెక్షకుల్లాగా అన్దరూ చూస్తున్నారు. కొన ఉపిరి ఉన్నట్లున్నది అన్నాడు.
ముందు అక్కడకు పోదాం పదా అని అతనిని లేపి తన కారులో ఎక్కించుకొని డాక్టర్ వద్దకు తీసు కెల్లారు.
మీరు తేవటము  వళ్ళ  ఇతను బ్రతక గలిగాడు
annaadu డాక్టర్.  అంతలో పొలీసులు వచ్చి ఇది యాక్సిడెన్టుకేసు తెచ్చినవారు ఎవరు వారి వివరాలు చెప్పండి వ్రాసుకోవాలి అన్నారు.
 త్రాగి నడిపిన వాడి కారు నెంబరు, ముందు వారిని అరెస్టు చేయండి. ఇది నా చిరునామా అని ఇచ్చాడు.
 ఏది పేరున్న రాజకీయనాయకుడి కారు అన్నారు.                       
 ఇక్కడేం జరగలేదు మనదారి మనం పోదాం పదా అని వెన్నక్కి పొలీసులన్దరూ వల్లిపోయారు.                   
విధి నిర్వాహనములో రాజకీయ నాయకులు ఆడ్డు పడితే దేశం అధోగతి పాలు కాక మరి ఏమవుతుంది. 
                                                     

ఎంతో మంది కృషి ఫలితముగా ఒక సినమా వస్తుంది, ఆ సినమాను ప్రక్షకులు బాగుంది అనేటప్పడికళ్ళ  థియటర్ లో ఉండ కుండా పోయే విధానాలు అమలు జరుపుతున్నారు. కేవలము డబ్బే ప్రాధాన్యత చూపుతున్నారు. కళా దృష్టిని  గౌరవించి ప్రజలకు ప్రత్యెక ప్రదర్సనలు ద్వారా తక్కువ టికెట్టు ద్వారా చూపలేని ప్రభుత్వాలు, పొట్ట కూ టికొసం ఉన్న విద్యను (నాటకములు, తోలుబొమ్మలాటలు, హరికథలు,) అభివృద్ధి పరుచు కొవటానికి  అవకాశములు కల్పించలేని ప్రభుత్వాలు, విద్యార్ధులు ఎంతో కష్టపడి తమ విద్యను ప్రదర్శించిన ప్రొత్చహిమ్చని ప్రభుత్వాలు, తెలుగు విద్యను అభివృద్ధి పరచలేక పరభాషా విద్యకు కోట్లు కర్చు చేసే ప్రభుత్వాలు ఉన్న్నమ్త కాలం ఈ దేశం బాగు పడదు. నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనే వాదన చేసేనాయకులు న్నమ్త కాలమ్ ఈ దేశం ప్రపంచ దేశాలలో వేనుకపడిపోతుమ్ది. నాయకులు సంపాదన ఎట్లా వచ్చింది అని అడిగే హక్కు లేని ప్రభుత్వాలకు ప్రజలకు మేలు చేసే హక్కు కూడా లేదు.  
మంత్రి మండలి ఏర్పాటు కోసం మనదగ్గర  బోలెడంత  కసరత్తు జరుగుతుమ్దిమ్ది. కులాల కోటాలూ అధిష్టానం వాటాలూ  - పదవుల్ని పనస తొనల్ల పమ్చెసు కుంటారు.ఎక్కడా అర్హతల ప్రస్తాపన ఉండదు ఎఫరూ గునగునాల్ని పట్టించుకోరు. మంత్రుల ఎన్నికల్లో చాలా చాలా జాగర్తలు చుసుకొవా లంటారు. పొరపాటున గత చరిత్రలని త్రవ్వి చూడరు. (ఎంత డబ్బు వెనకేసుకున్నాడు), ఎంత డబ్బు మనకి కమీషన్ పార్తీ ఫఫ్న్డుగా ఇచ్చారు అని మాత్రం చూస్తారు.
భీష్ముడు మాత్రం జ్ఞానవంతులను, నిస్వార్ధ పరులను, ఏమ్చుకోవాలని సలహా ఇచ్చారు. మంత్రం అంటే ఆలోచన మంచి ఆలోచనలు ఉన్నవారే మంత్రులనిపిమ్చు కుంటారు. సిఫార్సులు కూడదంటారు, భందుప్రీతి వద్దంటారు,   నైపుణ్యానికి పెద్ద పీట వెయా లంటారు, కష్టపడే వారిని ప్రొచహిమ్చ మంటారు,
అధికార దర్పాలకు  పొమ్గి పోనివాడు, భాద్యతల నిర్వాహణలో అవమానాల్ని కూడా  భరించ కలిగె వాడు  ఉత్తముడు.                                   

        విధి నిర్వాహణలో ప్రజలకొరకు ప్రాణాలు అర్పిమ్చిన వాడు నిజమైన ఉద్యోగి.
అల్పులకు అధికారమిస్తే ఏమి జరుగుతుందో పాత కధ ద్వారా మీకు తెలియ పరుస్తా.

అనగనగా ఒక అడవిలో ఒక మహర్షి ఆశ్రమము నిర్మిచుకొని విద్యార్దులుకు  రాజకీయమ్ అంటే ఏమిటి? దాని   గురించి వివరముగా భోధ చేస్తున్నాడు. ముందుగా జంతువులను ప్రేమించడం నేర్చుకోవాలని తెలియపరిచాడు. అక్కడ రకరకాల జంతువులు ఆ ఆశ్రమములో నిర్భయముగా చమ్చరిస్తూ ఉండేవి. వాటిలో ఒక కుక్క కూడా
ఉంది.  మహర్షి ఎక్కడికెళ్ళినా తోక ఊపు కుంటూ వెనకాలే బయల్దెరెది.ఆయనా ఆదరించేవాడు. ఓ పులికి కన్ను కుట్టింది.అవకాసం దొరికినప్పుడల్లా కుక్కను వేధించేది. చంపేస్తానని బెదిరించేది.  అదంతా గమనించాడు మహర్షి.  కుక్క మనసులోని భయాన్ని పోగొట్టడానికి దాన్ని పెద్ద పులిగా మార్చాడు.భయం తగ్గి పోగానే కుక్క నిజరూపములొకి వచ్చింది.
ఏనుగుని చూసి భయపడి నప్పుడు ఏనుగుగా మార్చాడు, పామును చూసి భయపడి  నప్పుడు  కుక్కను పాముగా మార్చాడు. సింహము చూసి భయపడి  నప్పుడు  సింహముగా మార్చాడు.
సింహములా మార్చినప్పుడు  కుక్కలొ దుర్భుద్ది మెదలైమ్ది. ఎమ్తకాల మీ తాత్కాలిక రూపాలు శాస్వితంగా సింహముగా ఉంటె  ఎంత బావుండు అన్న ఆలోచన కలిగింది. అదనుచూసి మహర్షిని చంపేస్తే ఇక పాత రూపమ్ లోకి వెళ్ళాల్సిన అవసరమే ఉండదని పన్నాగం పన్నింది.
తపస్వి తలపును గ్రహించాడు ఎలాంటి అర్హతలూ లేని ఓ వీది కుక్కకు అంతటి శక్తిని ప్రసాదించడం తనతప్పె అని తెలుసుకున్నాడు.  పాత రూపాన్నిచ్చి ఆశ్రమము నుండి బయటకు తరిమే వేసాడు.            

                                                   
   స్వార్ధ పూరితమైన సమాజాన్ని (చవిటి భూమిని) ధర్మమార్గమన (నాగలితో ) దున్ని, అరిషడ్ వర్గాలనే (కలుపు మొక్కలను) తీసి మమతలనె (విత్తనాలను ) చల్లి, చమట బిందువులను రాల్చి(కాయ కష్టం చేసి ) ఆకాసము (నందు) మేఘమును రప్పించి (ప్రభుత్వము ద్వారా ) అప్పులు పుట్టించి కుటుంబ కష్టంతో పంట చెతికిరాగా అధికారమనే అహంకార విష సర్పాలు (బ్యాంకు లోను ఇచ్చినవారు, రోజువారి అప్పు ఇచ్చినవారు, ప్రభుత్వ  సొమ్మును తమ సొమ్ముగా ఇచ్చినవారు) జ్వాలాసమూహలకు పండించిన పంట భగ్గు మననట్లు నోరెత్త లేని పరిస్తితి ఏర్పడింది. చేతకానివారుగా మార్చింది. మీరు ఇక్కడ బ్రతకలెరు అని వాదించింది, ఇక్కడ పంట పమ్దిమ్చలెరని వెళ్లి వేరొకచోట బ్రతకమన్నది.     
సమాజాన్ని మార్చడం దేవుడెరుగు సాటి మానవుడుగా బ్రతకడనికి రాజకీయము అడ్డు వస్తుంది. అందుకనే రాజకీయ నాయకుడుగా మారితే రోజుకు లక్ష రూపాయలు సంపాదించవచ్చని నేటి నాయకులు చెపుతున్నారు.
ఏది ఎమన్నా రాజకీయములొ బ్రతకాలంటే రాజకీయనాయకుడు/నాయకురాలు కడుపునా పుడితే ఎమ్మి అర్హత లెకపొఇన నాయకుడవచ్చు అని జరుగుతున్న సంఘటనలు మనకు కళ్ళకు కట్టినట్లు చూపుతున్నవి.

నేటి రాజకీయము/ బీష్ముడు చెప్పిన రాజకీయము  గురించి తరువాత భాగములో కొంత తెలుసు కుందాము.              

2 కామెంట్‌లు: