13, జులై 2017, గురువారం

విశ్వంలో జీవితంOm sri ram - sri maatrenama:

ప్రాంజలి ప్రభ 

కొడుకు కొడుకు అంటాడు ఒకడు
కోడలొచ్చాక మారాడు అంటాడు  
చదువే కూడు పెడుతుం దంటాడు
చదివాక ఉద్యోగం లేదని తిడతాడు

గెలుపే ధ్యేయమై ఉండాలనే వాడు
ఓర్పులేదని అదేపనిగా తిడతాడు 
ప్రేమలో కష్టం తేలిసు కోమన్నాడు 
పెద్దలను మరువక ప్రేమించాలన్నడు  

సమయం వ్యర్థం చేయద్దంటాడు 
ప్రకృతే మార్గం చూపుతుందంటాడు
వేయికిరణాల వెలిగేటి సూరీడు
వేకువ కాగానె కదిలేను చూడు


ప్రాంజలి ప్రభ - శక్తివై (కవిత)

ఆర్భాట ఆరాటం ఎక్కువై
ఆనంద ఆరోగ్యం కళ్ళలై
ఆవేశ నిర్మల భావుడై  
ఆస్రిత అర్పిత ఆర్తివై

కారుణ్య విన్యాసం తక్కువై
నిగ్రహ నిర్మోహ శక్తివై
 
సంభాష చాతుర్య పరుడై
సందర్భ సౌగంధం కరువై
సందేహ నిశ్శబ్ద శబ్దివై
సంఘర్ష నివృత్త ప్రాణివై

విస్వాస సంధాన కర్తవై
విశ్రాన్తి  విశ్లేష వెల్లువై
విశాల హృదయ సాక్షివై
విశృత విశ్లేష   వ్యక్తివై

ప్రాంజలి ప్రభ- వర్చస్సు


మొఖం లో ఉంటుంది వర్చస్సు
వర్చస్సే పెంచును ఆకర్షణ
ఆకర్షణే ఇరువురి ఏక మార్గం
మార్గం చూపే ముఖ పుస్తకం FB    

మనమధ్య తెలియని అంతరం
సుఖ, దు:ఖ, చీకటి, వెలుగుల వలయం
ఉన్నా చూడలేనిది, చూసిన చెప్పలేనిది,   
చెప్పినా వినలేనిది ఆకర్షణ అదే WALL

చూసిన వస్తు వంతా కొనలేము
కొన్న దంతా అను భవించలేము
ఎవరో చూస్తారు, ఏడుస్తారు, అణుకుంటాం
మన మంచిని ఆకర్షించేది like   

కొంగు కొంగు ముడి వేస్తేనే పెళ్లి
కలసి మూడోవారు వస్తేనే సంసారి
పగలు మాట పెరుగు రాత్రి ఏకమగు
అందరు కలసి ఉండే జీవితమే TAG  

అవునంటే కాదని కాదంటే అవునని
నవ్వుతూ ఎడిపించి ఏడుస్తూ నవ్వించి
వచ్చి రాని భాష తో ప్రేమను పంచి
వాగ్దానంతో ప్రేమను తెలిపేదే CHAT

ప్రణయా నందము- 1

1.      నిత్యా సత్య సమాన సంతసముగా ప్రాంతోజ్వలోధ్యాస భూ
         పర్యా వర్య సమంజసంగ శరద్రాత్రేం తాపసం ఉజ్వలం
         సర్వాంగం ఉడుకే ప్రభాస రతి యోషా కామ లీలా వినో
         దంబే విశ్వముకే సమంత తనువే తాజేరి నాసక్తి మై  
               
2.      అచ్చోటే తలపే అనంత సొగసై తన్మాత్ర సాంగత్య మే
         హెచ్ఛా నంద పడే రతిం సమముగా సంయుక్త ఆలింగణం
         శృ0గారంబు రసంబు నిర్వచన సంస్క్రుత్యుజ్వలం బాత్మ, యం 
          గాంగీ భావన  కర్మపాక ఫల సిద్ధాంతంబు ప్రాణంబగున్3.      సంగీతానుపమాన రాగా కలనా సారస్వతానంద ము
         ప్పొంగ దీని బేథింపూడి రసికులై పోషింపుడీ సంస్కుతిన్
         అంమృత్వా రసమూ లెలేత అధరం మౌనంగ పొందేందుటన్
         స్నేహానందముగా ప్రియాతి ప్రియమే స్వర్గాన్ని సొంతంచెయున్

4.       తియ్యని మోవి పానకము దేపకు నానుచు లేత చెక్కులన్      
          జెయ్య్ ఘటించి, తానట రచించిన చిత్రపు బత్రభంగముల్ 
          నెయ్యము మీర గాంచి రతి నేత ప్రియంపడ జక్రయుగ్మము
          న్గుయ్యన నీవి గుబ్బలను గుచ్చి సతీమణి వాని యక్కునన్

.        నిముసము వీడ లేవుగద! నీవు ననుం బ్రియ నాకు నీ యెడ:     
         మమత య టే సెలంగుగద! మానసమం దిటు లొప్ప బీజ భూ
           త మది యగోచరం బగుగదా! మనకిర్వురకా? జగంబు స
           ర్వమునను బ్రెయసీప్రియుల భావము ళిట్టులనే యొసంగునా?

6.       ఆనందం వెలుగే సునంద సుమ మాధుర్యాన సంగీతమే
          అన్యూన్యా పలుకే సరాగ చిరునవ్వే సంతసం చంద మే
          తన్మాయా కులుకే పెదాల మెరుపే సమ్మోహ సారాజ్య మే
          సన్మానం తనువే  కరాలు కలిసే కార్యం సకార్యం క్ర మే 


7.        వివరింపుడి నా మదిలో
           దవిలిన ఈ సందియము దాటక ననద
           త్సువిలాసిని ప్రశ్నమునకు
           నవిరళసంతోష మోసగ నత డిట్లనియెన్           

8.        బేల నీ ప్రశ్న మిద్ది లోకాలకెల్లఁ
           మేలు సేకూర్చు వివరింతు గీలకమ్ము
           తలప స్త్రీ పురుషులకు సంధాన కరణి
           ప్రణయ బంధ మవిచ్ఛిన్నఫణితి డనరు

Pranjali Prabha - ప్రణయా నందము- 5

9.    ప్రణవానందసహోదర  మ్మమలదాంపత్య ప్రభోధమ్ము స
       ద్గుణరూపమ్ము విచిత్రసృగ్విలస నాంకూఱైక బీజమ్ము క
       ష్టనిరోధ మ్మమృతత్వద మ్ముభయనిష్ఠ మ్మద్వితీయమ్ము త
       త్ప్రణయానందము నిత్యసత్యమయి విశ్వశ్రేయ మిచ్చు సతీ

10. శృంగారం నడకే తపింప చేయుటే హృద్యాన మాధుర్య మే  
      బంగారం వెలుగే మదీయ కునుకే ఉల్లాస ఉత్సాహ మే
      శృంగాంరం నవనీత ముద్ద నయనా నందంవలే మోహ మే 
      మాగానే మనసే వరించి  మమతే సంతుష్ట సంభావ్య మే
Pranjali Prabha - ప్రణయా నందము- 5
11. మనసే లాలస మోముభారతికి మంత్రజ్వాలమయ్యేను న
      వ్వులులే ఆ జప తాపమే రతికి నిత్యానంద సందర్భ మే
      ఎవరో మోక్షము నిచ్చువారనిన మీకెలా వృధా బ్రాంతియే
      తనువే ఒక్కరు గావలే మమత పండించె కేకాగ్రం సుమా

12. అదియే పద్మజ మోము భారతికి నాట్యస్థానముం జేసె వ
      య్యదియే వెన్నుని పేరెదన్  సిరికి సిద్దాంతంబుగా గూర్చె న
      య్యదియే శంకరుసామెయిన్ సలిపె నిత్యావాసముం గౌరి క
      య్యది యాబ్రహ్మాపిపీలికాంత భువన వ్యాప్తంబు శాతోదరీ

13. ప్రణయ మియ్యది గురుభగవత్ప్రసక్తమై
                  భక్తి నామమున శోభను వహించు
      ప్రణయ మియ్యది ప్రియభావాల నుప్పొంగి  
                  అనురాగ నామధేయమున మించు
      ప్రణయ్ మియ్యది సుతప్రభృతులపై బర్వి
                  వాత్సల్య మనుపేర వన్నె గాంచు
      ప్రణయ మియ్యది దీనభాధార్తులగురించి
                  దీపించి దయనాగ దేజు నించు

      ప్రణయ జన్యు పదార్ధ మీ ప్రకృతి యెల్ల
      వికృతి సెందని ప్రణయమే విశ్వమూర్తి
       ప్రణయ మున్నంతవరకు విశ్వము నిజమ్ము
      ప్రాణయనాశంబె ఈ జగత్పలాయ మబల 

14.  ఆర్యోక్తీ ప్రణయం ప్రశాంత భరణం, వెన్నంటి మేల్కొల్పు  లే
       ధీర్యోక్తీ మనసే ప్రబంధ శరణం, విశ్వమ్ము వేదంబు లే
       గర్వోక్తీ మబలే జగత్ప్ర లయమే,  వ్యాప్తంబు కార్యమ్ము లే
       స్వరోక్తీ యను రాగ నామ మదిలో, వాత్సల్య ముప్పొంగు లే

15.  బ్రహ్మాండా భ్రమలే భయాలు, నిజమే శాశ్విత సంతోష మే
       బ్రహ్మాండా వెతలే జయాలు,  మనసే మార్పుకు భావాలు లే
       బ్రహ్మాండా సెగలే వినోద ప్రణయం, సాజ్య సుభోజ్యాలు లే
       బ్రహ్మాండా తలపే మహానంద సేవ,  స్త్రీపుర్ష సంభావ్యు లే            
ప్రాంజలి ప్రభ

మహా తల్లివి నీవు
సమస్త దేవతలు
నీలో నింపుకున్న దానవు
నీ పాలతో శక్తి నిచ్చావు
నిత్యమూ పూజింప దగిన దానవు
కనీస గౌరవము లేకున్నావు 
ప్రగతికి అడ్డుగా అనే లోకంలో ఉన్నావు
బయటకు రాలేక కొష్టం లో ఉన్నావు

స్నేహాన్నే ద్రోహం చేసే
 లోకంలో ఉన్నావు
ప్రేమనే మోసం చేసే
కుళ్ళు లోకంలో ఉన్నావు
యంత్రాలొచ్చాయి నీ సంతతికి
పనిలేక చిక్కి పోతున్నాయి
ఎరువు లొచ్చాక పేడ
విలువ తగ్గి పోయింది

ప్రోటీన్ ఉన్న పాలు ఎవరిక్కావాలి
కుత్రిమ పాలతో సర్దుకునే
లోకంగా మరింది

క్షణిక సుఖం కోసం వెంపర్లాడుతున్నది
మానవత్వం మంటల పాలవుతున్నది
రాక్షసత్వం పెచ్చు పెరిగి పోతున్నది  
కబేళాలకు పంపి తినేలోకమవు తున్నది 
లజ్జ హీన చర్యలకు నీవు బలి అవటం
చేతకాని తరమవు తున్నది

మేము నిన్ను పూజిస్తాం
మా మహర్దశకు నీవే ఆధారం
నీకు పిల్లలకు పౌష్టిక ఆహారం
అందించి మీజాతిని బతికించు కుంటాం
తరతరాల చరిత్రను నిలబెడతాం
ఈ కవితపై అభిప్రాయం తెలపగలరు 

10, జులై 2017, సోమవారం

విశ్వంలో జీవితం - 40

Om Sri Ram - ri matrenama:

ప్రాంజలి ప్రభ - కలలు ఎరుగవు (కవిత)

కలలు కల్లాకపటం ఎరుగవు
మనుష్యులను హెచ్చరిస్తూ ఉంటాయి
కష్టాలు  ఎప్పుడో తెలపవు
మనుష్యుల మతి మారుస్తూ ఉంటాయి

నిజాలు ఎందుకో చెప్పలేవు
చెప్పిన నమ్మలేని స్థితిలో ఉంటాయి
వర్షం ఎక్కడపడునో చెప్పలేవు
పడ్డ చోట యుద్దవాతావరణాలుంటాయి

గుండెలో గగుర్పాటు చెప్పలేవు
ఆహ్లాద రాబందులు కమ్ము కుంటాయి
చల్ల కొచ్చి ముంత దాచలేవు
మొహమాటానికి పొతే జరుగుతుంటాయి

కళ్ళతో అందాన్ని చెప్పలేవు
నోటితో చెప్పిన కళ్ళు నమ్మలేమంటాయి
స్నేహం కోసం ఎదురు చూడవు 
స్నేహం మనసు భాధను తగ్గించలేనంటాయి


ప్రాంజలి ప్రభ - యుద్ధం (కవిత )

రాజ్యాల మధ్య కాదు
రాబందుల మధ్య కాదు
చేస్తున్నారు యుద్ధం  
కేవలం విద్య విద్యార్థుల మధ్య
విద్యాసంస్థలు చేస్తున్న యుద్ధం
చెంబుడు బుర్రలో
బిందెడు విద్యను క్రుమ్మరిస్తూ
భరించాలని యుద్ధం
అధిక ధనం పొందుతున్నాం కదా
ఆరవ తరగతిలో 10 లెక్కలు
7  వ తరగతిలో ఐ ఐ టి
8  వ తరగతిలో రాష్ట్ర విజ్ఞానం
9  వ తరగతి లో ప్రపంచ విజ్ఞానం
10 వ తరగతికి పోటీ పరిజ్ఞానం
జన్మ త: సిద్దులు ఉన్నవారు
జన్మత: జ్ఞాపక శక్తి ఉన్నవారు
అంతవిద్య భరించలేరు
విధ్య తగ్గించి ఆరోగ్యాన్ని పెంచేవి 
చెప్పాలని చేయాలి యుద్ధం
మార్కుల మధ్య , రాంకుల మధ్య
చేస్తారు ఎందుకు యుద్ధం
మనిషిని మనిషిగా గుర్తించ విద్య
నలుగురితో మంచిగామాట్లాడే విద్య
పరభాషకాన్న మాతృభాష బోధించే విద్య
బండెడు మోత విద్య కన్నా
మెదడుకు తగ్గవిద్య నేర్పమని
చేయాలి యుద్ధం
విద్య తో పాటు సకల కళలు నేర్పాలని
చేయాలి యుద్ధం
వయసుకు తగ్గ విద్య నేర్పాలని
చేయాలి యుద్ధం       
జాగర్త మితిమీరిన విద్య
మనసుతో చేస్తుంది యుద్ధం 


ప్రాంజలి ప్రభ - ఎవ్వని భావం (కవిత ) 

ఎవ్వని పేరు విన్న 
పులకించునో 
నెమ్మది ప్రస్ఫుటముగా 

ఎవ్వని యాస విన్న 
తలపించునో 
నెమ్మది బహిర్గతముగా 

ఎవ్వని నీతి విన్న 
కురిపించునో 
కళ్ళవెంబడి కన్నీరుగా 

ఎవ్వని కోరిక విన్న 
గుండె నిండునో 
తనువంతా తపించునుగా

ఎవ్వని క్రియలు విన్న 
మనసు నిండునో 
మమత లూరించునుగా 

ఎవ్వని తోడును గన్న 
నిగ్రహ ముండునో 
చెప్ప లేకుండుట యేగా 

ఎవ్వని కళలు గన్న 
కవ్వింపు చెందునో 
కను మరుగుటయే గా  

ఎవ్వని కన్నులు గన్న
కాంక్షలు ఏర్పడునో 
హృదయ వేదనము లేగా   

ఎవ్వని నవ్వులు గన్న 
గుండె చెదరకుండునో 
నిర్మలత్వంతో బ్రతుకుటేగా
  

--((*))--

ప్రాంజలి ప్రభ - దృక్పధం (కవిత) 

పొద్దు వాలే బ్రతుకు
చీకటి కమ్మె కడకు
వయసు పెర్గే ఉడుకు
మనసు కదిలే చిటుకు


చెప్పి రాదు మనకు
కళ్ళ వెంట చినుకు
నిజం ఉండదు కలకు
తనువు ముదురు మనకు


కట్టె కాలే బ్రతుకు
కనబడని కులుకు
ఆశతో వెంట పడకు
అలుపనేది ఎరుగకు  

          
పాశానికి చిక్కకు
కాలానికి మొక్కకు
వెలుతుర్నినమ్మకు

మనసు గా ఉంచకు
 

మమతలు ఎరుగకు
మది తొలచు కినుకు
కంటికి ఉండదు కునుకు    
జీవితసాఫల్యమునకు
 

దైవప్రార్ధన మటుకు
ఎట్టి పరిస్థితిలో వదలకు
నమ్మకమే వృద్ధ్యాప్యమునకు
సేవలు అందించాలి కొడుకు
 

ప్రేమ ఉండాలి బిడ్డలకు
సేవలందించాలి చివరకు 
భయమనేది రానీయకు
ప్రేమ తప్పదు దృక్పదమునకు 
 

7, జులై 2017, శుక్రవారం

విశ్వములో జీవితం-39

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
ప్రాంజలి ప్రభ - మురళీ రవళి

జగమంతా ఆనందాన్ని ఇస్తూ
మనసంతా రంజింప చేస్తూ
మమతల కోవెలలో జీవిస్తూ
అనురాగం పంచె మురళీ రవళి

వెదురు బొంగుతో రాగాలాపన చేస్తూ
మూగపోయిన గుండెను హెచ్చరిస్తూ
తెరలు తెరలుగా గాలిలో సంచరిస్తూ
మనసును శాంతి పరిచే మురళీ రవళి

చద్ది తిను నాడే ముద్దులు కురిపిస్తూ
వళ్ళంతా ఉన్న గాయాలను సరిచేస్తూ
కళ్లతో కాంతి రేఖలను కుమ్మరిస్తూ
స్వరాలతో మరిపించే మురళీ రవళి  

ప్రకృతి అంతా కలవరిస్తూ  
తనువు లంతా పులకరిస్తూ
పశు పక్షాదులు పులకిస్తూ
తన్మయంతో మరిపించే మురళీ రవళి

నీటి అలలు లా ప్రవహిస్తూ
గాలిలా మనసును దరిచేస్తూ
విశ్వమంతా విహరిస్తూ
జీవితాల్లో వసంతం తెచ్చే మురళీ రవళి

కల్పాంతరం వరకు మోస్తూ
సర్వ ప్రాణులకు ప్రాణం పోస్తూ  
అపశృతి లేని సంగీతం ఇస్తూ
పరమాద్భుతమును చూపే మురళీరవళి
--((*))--
ప్రాంజలి ప్రభ - జీవగడ్డ

అమ్మపాలు పొంగే జీవగడ్డ
శ్రీలు పొంగిన జీవగడ్డ
స్త్రీ సిరి అందించిన జీవగడ్డ
వేదం ఉద్భవించిన గడ్డ

మనోజ్ఞ దీక్షాశయము గడ్డ
స్వతంత్ర శుభాశయము గడ్డ  
జ్ఞానాన్ని పంచే జీవ గడ్డ
మానసిక క్షోభ తొలగించే గడ్డ

దయా కరుణ చూపే గడ్డ 
ఆత్మ గీతం అందించు గడ్డ
కన్నీరు తుడిచే గడ్డ
కారుచీకట్లు తరిమే గడ్డ

భోగభాగ్యాలందించు గడ్డ
బంధాలను నిలిపే గడ్డ
భాద్యతలను పంచే గడ్డ
అంతర్జాతీయ గుర్తింపు గడ్డ

కలువల కన్నుల గడ్డ 
బోసి నవ్వుల బిడ్డల గడ్డ
మరువలేను మా గడ్డ
అందరి అమరావతి గడ్డ 

ప్రాంజలి ప్రభ - "కల్తీ "

కలలో కల్లోలం కల్తీ
యదలో అనురాగం కల్తీ
ముసుగు ప్రేమలో కల్తీ
మదనుడి మాయ కల్తీ

మగువ చూపులు కల్తీ
మగణి మాటలు కల్తీ  
మన్మధుని పోలిక కల్తీ
మదాలసా రూపం కల్తీ

పట్టు బిగువుల కల్తీ
విని చెప్పు మాటలు కల్తీ
మంచా చెడా తేల్చలేని కల్తీ
అవును కాదనుటలో కల్తీ

ఆకలి ఉన్న లేదనుటలో కల్తీ
దాహమున్న తీరదనుటలో కల్తీ
తపన ఉన్నా లేదనుటలో కల్తీ
తనువు తపించలేదనుటలో కల్తీ

నిద్రలో జారే దాకా కల్తీ
బ్రతుకంతా కల్తీ
ఆలోచన ఆచరణలు కల్తీ
దేవుని దండాల్లో కల్తీ

తినే తిండిలో కల్తీ
త్రాగే నీటిలో కల్తీ
మనసు మాట కల్తీ
వేదిక ఉపన్యాసం కల్తీ

అమ్మ పాలలో ఉండదు కల్తీ
కల్తీల వళ్ళ ఉన్నది వెల్తి
రోగాలతో మాయమవుతుంది శాల్తీ
శక్తి తగ్గాక తెలుసుకోలేరు కల్తీ

కళ్ళు తెరవండి కల్తీని అడ్డుకోండి
కష్ట పడండి కల్తీ జోలికి పోకండి
కల్తీ వల్ల అందరికి నష్టమండి  
కల్తీ మానండి ఆరోగ్యంగా జీవించండి 

భార్య ఎప్పుడు సంతోష పడుతుంది సరదాగా నా కవిత

నీ మాటలే నాకు ఆజ్ఞ 
నీ బాటలే నాకు ఆదా
నీ వాటాతో నాకు ఆఱు 
నీ కోటయే నాకు ఆత్మ 

నీ ఆటలే నాకు ఇష్టి
నీ పాటలే నాకు ఇంచు
నీ వేషాలే నాకు ఇంద్ర
నీ చేష్టలే నాకు ఇంది

నీ కొరికే నాకు ఇంపు
నీ పిలుపే నాకు ఇచ్ఛ
నీ వలపే నాకు ఇజ్య
నీ తలపే నాకు ఇభ్య

నీ కొలువే నాకు ఉక్తి
నీ కళలే నాకు శక్తి
నీ విలువే నాకు ముక్తి
నీ తెలివే నాకు యుక్తి          

ప్రాంజలి ప్రభ - ప్రభోధము 

నామములో ఉన్నది మర్మము
మర్మములో ఉన్నది జ్ఞానము
జ్ఞానమే మనకు బోధించు భాష్యము
మదిలో చేరి కల్పించు ప్రశాంతి.

మనస్సులో ఉండాలి దృఢ సంకల్పము
ఇది మనకు కల్పించు నిగ్రహ చిత్తము
పృథ్విపై చిత్తము చూపును మార్గము
ఆ మార్గాలే కల్పించు ప్రశాంతి    

పృథ్విలో ప్రతిఒక్కరు చేయాలి ధ్యానము
ధ్యానముతో మనసుకు పెరుగు విజ్ఞానము
విజ్ఞానము వళ్ళ మనకు పెరుగు బలము
మానసిక బలమే అందించు మనకు అన్నము
అన్నము కల్పించు ప్రశాంతి    

అన్నముతో కావల్సినది జలము
జలము వల్లే కనబడును తేజస్సు
తేజస్సు కంటే గొప్పది అంబరము
అంబరము అందించు ప్రాశాంతి

ఆకాశమే అందించు జ్ఞాపకము
జ్ఞాపకమే పెంచు స్మరణ శక్తి
స్మరణ శక్తే పెంచును ఆశ
ఆశ బ్రతుకులో ఉన్నది ప్రాశాంతి

కోరిక వల్లే ఉద్భవించు ప్రాణ శక్తి
ఇరువురి మధ్య ఏర్పడును ఆత్మ శక్తి
ఆత్మ శక్తిని కల్పించును పరమాత్మ శక్తి
పరమాత్మ శక్తే విశ్వానికి పంచి రక్షించు

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:   
--((*))--

గణిత స్నేహము 

నాలుగు దిక్కులు మన కవసరము
ఏదిక్కుకు పోయిన కలుపు స్నేహము 
సమమా లేదా అసమమా చెప్పలేము 
అందుకే నేను అంటా ఒక చతురస్త్రము 

మాతా జనకులకు తెలపాలి ప్రేమవిషయము 
సఖ్యత సంపద సంతృప్తి అందరికి అవసరము 
ద్వందాలను కలిపేదే మూడవది స్నేహము 
స్త్రీపురుషుల మధ్య స్నేహప్రేమయే త్రికోణము   

స్త్రీ పురుషులా అనేది ఉండదు భేదము 
ప్రేమతో ప్రారంభిస్తే అది ప్రణయము 
ద్వేషముతో ప్రారంభిస్తే అది ప్రళయము 
స్నేహం దూరంగా ఉంటె రేఖ దగ్గరైతే వసంతం 

స్నేహము అనేది అనంతము 
అది సాగును నిరంతరము 
అది కలుపు తుంది బంధము 
అందుకే దానిని పోల్చుతా వృత్తము 
  

1, జులై 2017, శనివారం

విశ్వములో జీవితం -38

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

Pranjali Prabha
పీతాంబరం అనుభవాలు, ఏకాంబరం ఛలోక్తులు - 1

పీతాం : ఏమోయ్ బాగున్నావా     :
ఏకాం:  ఎద్దులా ఎదురు కనబడితే బాగున్నావా అని అడుగుతావా
పీతాం : ఏమోనోయ్ నీ మొఖం చూస్తే అలా కనబట్లా       :
ఏకాం:  మరి ఎలా కని పిస్తున్నానోయ్
పీతాం : నేను ఎమన్నా అంటే కోపం వస్తుందెమొనోయ్      :
ఏకాం:  పర్వాలేదు దులిపేసుకొనే అలావాటు అయ్యిందిలేవోయ్
పీతాం : నా దగ్గర మాత్రం నీ మాటలతో దులుపుకురా        :
ఏకాం:  ఇంట్లోవాళ్ళకన్నా ఎక్కువ విసిగించకురా
పీతాం : పులి లాగుండే వాడివిరా ఇప్పుడు ........       :
ఏకాం:  ఆ ఇప్పుడు పిల్లి అంటావురా .........
పీతాం : లేదురా మీసాలు లేని పులే అంటాను రా         :
ఏకాం:  మీసాలు తిప్పుతూ ఏమన్నావు, సివంగినా  
 పీతాం : ఎబ్బే నేను అన్లేదే నీవే అన్నావు          :
ఏకాం:  ఆ .. ఆ ... సివంగినా   ఆ .. ఆ ... సివంగినే  
 దారినపోయేవాడు మీలో సివంగి ఎవరు పులి ఎవరూ
మేమిద్దరం పులులం నీవే సివంగివి అంటూ గర్జించారు
దేవుడా రక్షించు, దేవుడా రక్షించు ........  ............
--((*))--

Pranjali Prabha
పీతాంబరం అనుభవాలు, ఏకాంబరం ఛలోక్తులు - 2

ఏకాం:  మంచి మనిషి అంటే ఎవరో తెలుసా ?
పీతాం: బహుశా నన్ను చూసే నీ వడిగావు కదూ
ఏకాం : అంత లేదు
పీతాం: నీవు మాత్రం కాదు అది నాకు తెలుసు
ఏకాం: ఎన్నాళ్లకు నన్ను మనిషి కాదన్నావు
పీతాం : నీవు చెపుతావా, నన్ను చెప్ప మంటావా
ఏకాం: సరే నీవు చెప్పు
పీతాం: ఎప్పుడు ఆన్ లైన్ లో కి వచ్చి ఐ.లవ్ యు అనే వాడు కదూ
ఏకాం: పెళ్ళైన వాళ్ళని అడిగాడనుకో బూతులు బూతులు కదా
పీతాం: అట్లయితే విసుక్కోకుండా అన్నిటికి లైక్ చేసే వాడు కదూ
ఏకాం: వీడెవడో లైకులు పిచ్చోడు అంటారు కదా
పీతాం:చాలా హుందాగా కామెంట్స్ పెట్టె వాడు కదూ
ఏకాం: కొద్దిగా మంచి వాడను కుంటానులే కదా
పీతాం: ఇంటికి ఎవరు వెళ్లిన వైఫా అందిస్తాడు  కదూ
ఏకాం: ఏమి టీ వైఫ్ అందిస్తాడంటావ్
పీతాం: అర్ధం చేసుకోలేవు ఇంటర్నెట్ కనెక్షన్ కలుపు తాడు కదూ
ఏకాం:  అబ్బో ఇంకా ఇంకా చాలా మంచోడు కదా
పీతాం: జీవితంలో ఒకే ఎకౌంట్ చుట్టూ తిరుగుతాడు కదూ
ఏకాం; ఎకౌంట్ అంటే ఎవరూ
పీతాం: ఎకౌంట్ అంటే తెలీదా "పెళ్ళాం"
ఏకాం : ఆ పెళ్ళాం చుట్టూ తిరిగే వారమా మనం
పీతాం : నన్ను కలపకు  
ఏకాం : ఓహో మర్చిపోయా నీకు రెండో ఎకౌంట్ ఉంది కదా
పితాం: ఇంతకీ ఎవరు మంచి మనిషో తెలిసిందా
ఏకాం: తెలియలా
పితాం: తెలుసుకో " పోయినోళ్ళందరూ మంచోళ్ళు "
ఏకాం: అంటే ఉన్నోలందరు ఎవరు ?
పీతాం: నేను పోతున్న ఆలోచించు
ఏకాం: ఆ .. ఎవరబ్బా..  ఆ .. ఎవరబ్బా అంటూ జుట్టు పికుంటున్నాడు
--((*))--

Pranjali Prabha
పీతాంబరం అనుభవాలు, ఏకాంబరం ఛలోక్తులు - 3

ఏకాం:  నా మానవుడు ఎప్పుడూ స్మార్ట్  ఫోన్ తో ఆడుకుంటాడు తెలుసా?
పీతాం:  అవునవును, బిల్లు కట్టకపోతే, ఇంటర్నెట్ కనెక్షన్ రాకపోతే తెలుస్తుంది
ఏకాం : ఎప్పుడు టామ్ అండ్ జర్రి, భీం చూస్తూ ఉంటాడు  తెలుసా ?  
పీతాం:  ఫిలిం లో చూసినట్లు ప్రవర్తించారనుకో అప్పుడు తెలుస్తుంది నీకు
ఏకాం:  ఎప్పుడూ కృష్ణుని లీలలు చూస్తూ ఉంటాడు తెలుసా ?
పీతాం : ఆమ్మో ఇప్పటి నుండి చిన్న పిల్లలకు భక్తి వచ్చిందనుకో కష్టాలున్నట్లే నీకు
ఏకాం:  అసలు నీ ఉద్దేశ్యం ఏమిటి, ఫోన్  చూపిన్చవచ్చా కాదా ముందు చెప్పు
పీతాం: పూర్వం ఇవి చూసే నీవు పెరిగావా
ఏకాం:  ఆధునిక సదుపాయాలు పెరిగాయి ఎంజాయ్ చేయాలి కదా
పీతాం:  కాదనను, పిల్లలకు చూపి కళ్ళజోడు తెప్పించటం అవసరమా
ఏకాం:  ఫోన్ లాగాననుకో ఇంట్లో సైరన్ మోగుతుంది తెలుసా
పీతాం: పూర్వం లాలి పాట పాడే వారు, పాడు తప్పేముంది
ఏకాం:  అంటే పాత అలవాట్లే మంచివంటావా
పీతాం:  భూమి గుండ్రముగా ఉంటుంది, అంటే పాత అలవాట్లు లాలి పాటలు మంచివేకదా    
ఏకాం:   మహాప్రభూ నీకో నమస్కారం, ఫోన్ అలవాటు మాన్పించి లాలి పడతా
పీతాం:  ఎలా పాడాలో ఆలోచించావా
ఏకాం:    ఎందుకు ఆలోచించాలా
పీతాం:  పాడు
ఏకాం;  లాలీ లాలీ వాడ్సప్ లాలీ, లాలీ లాలీ రెడ్మి లాలీ, లాలీ లాలీ జావా లాలీ,
:  లాలీ లాలీ అమెజాన్వా లాలీ, లాలీ లాలీ యు ట్యూబ్  లాలీ, లాలీ లాలీ టాకింగ్టాం  లాలీ,
పితాం: చాలా చక్కగా పాడుతున్నవ్  
ఏకాం: అసలు నేను ఎవరనుకుంటున్నవ్
పితాం:  ఏమో నాకేం తెలుసు
ఏకాం:  తెలియదన్న వానికి చెప్పే అలవాటు నాకు లేదు వస్తా
పీతాం:  ఎందు కైనా మంచిది పిల్లల పెంపకం టి.వీ. చూడు
ఏకాం:  నా తంటాలు నేను పడతా వస్తా  
--((*))--

Pranjali Prabha
పీతాంబరం అనుభవాలు, ఏకాంబరం ఛలోక్తులు - 4


పీతాంబరం : అంత కష్ట పడినందు వళ్ళ, ఫలితమేమైనా ఉన్నదా 
ఏకాంబరం : కష్ట బడితే సుఖనిద్ర అన్నారు పెద్దలు 
పీతాం: కాయకష్టం చేయమన్నారు, కలం కష్టం అనలేదుగా 
ఏకాం : శ్రమిస్తే జీవిస్తాం, అదృష్టాన్ని చూస్తాం, దేశాభివృద్ధికా సహకరిస్తాం కదా  
పీతాం :  ఫలితమ్ కనబడక పొతే ఎం చేస్తావ్ 
ఏకాం : బాహ్య పరిస్థితులు అంతర్గత పరిస్థితులను పరిశీలిస్తాం
పీతాం : నా ఉద్దేశ్యం 20 % పనిలో 80 % విశ్రాంతి ఉండాలి, మన:శాంతి ఉన్నప్పుడు ఆలోచనలు బాగుంటాయి కదా
ఏకాం : అవును నీవు ఎప్పుడు ఇల్లు కాపురం అంటావు అందుకే నియాలోచనలు అక్కడ ఉన్నాయి   
పీతాం : కుటుంబమే దేశము, దేశ శ్రేయస్సే మన సౌభాగ్యం, మీ దృష్టిని, నైపుణ్యాలను, సామర్ధ్యాలను విస్తరిస్తూనే ఉండాలంటాను     
ఏకాం : శ్రమించాలంటే సహకరించ కుండా టెక్నలాజి వచ్చింది అది అవసరమా ?
పీతాం : జనాభా తక్కువ ఉన్న వారికి అవసరం, అయినా వాడుటలో తప్పేముంది
ఏకాం : నిరుద్యోగం పెరుగుతున్నది కదా, దానికి పరిష్కారం చెప్పవే  
పీతాం : కష్టపడ్డ వాడికి నిరుద్యోగం అనలేడూ, భద్దకస్తుడి అట్లా అంటాడు   
ఏకాం : నన్ను మాటలతో మాయ చేస్తున్నావు
పీతాం : మాటల మాయలో చిక్కి ఓట్లు వేసి నాయకులను గెలిపిస్తున్నారు
ఏకాం : అవును వారు చేసే పనికి నోరు విప్పలేక తలపట్టుకున్నారు ఎందుకు
పీతాం : ఎందుకో నీవే గ్రహించు : 
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుష్యులోయ్ పాట పాడుతూ బయలు దేరాడు ఏకాంబరం 
--((*))--పీతాంబరం అనుభవాలు, ఏకాంబరం ఛలోక్తులు - 2

పీతాం : జీవితంలో మంచి మనుష్యులను నొప్పించకు      :
ఏకాం:  ఎందుకు అంటావ్
పీతాం : వారు వజ్రం లాంటి వారు చేజారినా పగిలి పోరు, జారి పోతారు         :
ఏకాం:  వారిని ఎలా గుర్తించేది
పీతాం : నన్ను చూస్తే నీ కేమని పిస్తుంది          :
ఏకాం:    నిన్ను మంచోడిగా గుర్తించాలా ఎందుకు
పీతాం : అదేమిటి మంచి సలహాలు ఇస్తున్నా కదా          :
ఏకాం:  మూల కూర్చున్న ముసలమ్మ కూడా ఇస్తుంది, దానితో పోల్చమంటావా
పీతాం : .ముసలమ్మతో పోల్చకురా .......       :
ఏకాం:  మరి అటు ఇటూ కానీ వారితో పోల్చమంటావా   .........
పీతాం : నీతో మాట్లాడాలంటే కష్టము రా          :
ఏకాం:  నీవు మంచి వాడివేరా నా సమయాన్ని మింగేస్తావుగా    
 పీతాం : ఏమన్నవ్ ఏది చూపించు .....          :
ఏకాం:  ఆ .. ఆ ... చూపించనా   ఆ .. ఆ ... చూపించు    
 దారిన పోయేవాడు సమయాన్ని ఎలా చూపు తారండి
మేమిద్దరం కలిసామ్ మా మాటలు చాటుగా వింటావా
అంటూ సమయాన్ని చూప్పిస్తాం అంటూ దాడి చేశారు  
దేవుడా రక్షించు, దేవుడా రక్షించు ........  ............
--((*))--

పీతాంబరం అనుభవాలు, ఏకాంబరం ఛలోక్తులు - 3

పీతాం : మంచిని కోరుకొనే వారిని దూరం చేసుకోకు       :
ఏకాం:   అంటే తల్లి, తండ్రి, పెళ్ళాం పిల్లలు కదరా
పీతాం :చెడు కోరే వారి నీ దగ్గరకు రానీయకు          :
ఏకాం:  అంటే స్వార్ధ పరులు, నమ్మక ద్రోహులు కదురా
పీతాం : ఇవన్నీ నీకెందుకు చెపుతున్నానో తెలుసా          
ఏకాం:    అదేరా తెలిసిన విషయమే చెపుతున్నావ్ , ఆరిగి పోయిన రికార్డుకు విలువ లేదురా  
పీతాం : అంటే పెద్దల్ని పట్టించు కోవురా            :
ఏకాం:  వాళ్ళు ఇప్పుడు నన్ను పట్టించు కొని, పీడించకుంటే బాగుండునురా  
పీతాం : ఋణాను బంధాన్ని వదిలించు కో లేవురా .......       :
ఏకాం:  వేరే మార్గం ఏదన్న ఉంటె చెప్పురా    .........
పీతాం : అదిగో వారిలా ఉండటమే ..............          :
ఏకాం:  వారు గుడ్డి మూగ,  చెవిటి వారురా ............    
 పీతాం : వారి ప్రవర్తన గమనించురా .....          :
ఏకాం:  ఆ .. ఆ ... అట్లాగే మారాలా  ఆ .. ఆ ... తప్పదా    
 దారిన పోయేవాడు వీళ్ళ మూగ సైగలను చూసి చేతిలో డబ్బు పెట్టాడు  
మేమిద్దరం చాలా రోజులకు కలిసామ్ ఎదో మూగగా మాట్లాడుకుంటూ ఉంటే
అడుక్కొనేవాళ్ళని డబ్బులేస్తావురా ...........   ..........  
దేవుడా రక్షించు, దేవుడా రక్షించు ........  ............
--((*))--

పీతాంబరం అనుభవాలు, ఏకాంబరం ఛలోక్తులు -4

పీతాం : నీ కో విషయం చెప్పాలిరా  
ఏకాం:   దేని గురించి
పీతాం : ఆషాడ మాసంలో కొత్తగా పెళ్లైన  జంట గురించి
ఏకాం:    ఆ ఇప్పుడు ఎవ్వరు దూరంగా ఉంటున్నారు
పీతాం :  ఎందుకన్నారో ఒక్కసారి గుర్తించాలి కదరా        
ఏకాం:   ఆ తెలిసేందేదో చెప్పు, నేను కూడా అందరికి చెప్పాలిగా    
పీతాం :  కొత్తగా పెళ్ళైన యువతి యుక్తవయసులో ఉంటుంది. యుక్తవయసులో ఉన్న స్త్రీలలో          గర్భవతి అయ్యే చాన్సు ఎక్కువ శాతం ఉంటుంది. అత్తా కోడలు ఒక చోట ఉండ కూడదని అంటారు.
అందుకనే ఒకరికొక్కరు  
ఏకాం:    అలా ఎందుకురా చేయడం పాపం కదురా
పీతాం :  ఎందుకంటే ఆషాడ మసంలో గర్భం దాల్చిన స్త్రీ ఖచ్చితంగా మండు వేసవిలో డేలివరి అవుతుంది అంటే మార్చి, ఎప్రిల్, మే మాసంలలో.అనగా అనేక శిశు మరణాలు వేసవిలో సంబవించినవి. ఎవరికైనా తొలి సంతానం మరణం బాధాకరమైన విషయమని, దినిని నివారించే క్రమంలో మన పూర్వీకులు ఎంతో శోధించి తెచ్చిన అచారమే ఆషాడ మాసం ఆచారం
ఏకాం:   .ఆ ఇప్పుడు ఎవరు పట్టించు కుంటున్నారు, పెళ్ళయిన  వెంటనే విడి కాపురం పెడుతుంటే
పీతాం : అందారూ నీ కొడుకుల్లాంటి వారనుకుంటున్నావా
ఏకాం:    ఏమన్నవో ఎప్పుడో జరిగిన విషయం గుర్తుచేస్తావ్
 పీతాం : ఎదో మాట వరుసకన్నా అంతే
ఏకాం: పేరుకు ఆచారమైన దీనిలో శాస్త్రీయత ఉంది. అయితే నేడు అనేక వైద్యసదుపాయలు అందుబాటులో ఉన్నాందున కొత్తపెళ్ళికూతురు నిరభ్యంతరముగా అత్తవారింట్లో ఉండవచ్చు, భర్తతో కలిసి ఉండవచ్చు. అత్త ను చూసిన ఏమి కాదు.
   
 దారిన పోయేవాడు వీళ్ళ మాటలు విని నిజమా నండి అట్లయితే మాఅత్తగారింటికి పోవచ్చా
ఏకాం: మీ ఆత్తగారు ఎలాంటి వారు .............
వ్యక్తి : జయ విజయాలకు కన్నా ఎక్కువ లంఖిణి కన్నా తక్కువ
 ఆ అంటం ఇద్దరి పని అయింది ...................


కళామిత్ర(కలంపేరు)
డా.నూనె. అంకమ్మరావు. ఆంధ్రోపన్యాసకులు
రాఘవ డిగ్రీ కళాశాల,ఒంగోలు
ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య,అధ్యక్షుడు
చరవాణి:9397907776


ప్రాంజలి ప్రభ - ప్రభోధము 

నామములో ఉన్నది మర్మము
మర్మములో ఉన్నది జ్ఞానము
జ్ఞానమే మనకు బోధించు భాష్యము
మదిలో చేరి కల్పించు ప్రశాంతి.

మనస్సులో ఉండాలి దృఢ సంకల్పము
ఇది మనకు కల్పించు నిగ్రహ చిత్తము
పృథ్విపై చిత్తము చూపును మార్గము
ఆ మార్గాలే కల్పించు ప్రశాంతి    

పృథ్విలో ప్రతిఒక్కరు చేయాలి ధ్యానము
ధ్యానముతో మనసుకు పెరుగు విజ్ఞానము
విజ్ఞానము వళ్ళ మనకు పెరుగు బలము
మానసిక బలమే అందించు మనకు అన్నము
అన్నము కల్పించు ప్రశాంతి    

అన్నముతో కావల్సినది జలము
జలము వల్లే కనబడును తేజస్సు
తేజస్సు కంటే గొప్పది అంబరము
అంబరము అందించు ప్రాశాంతి

ఆకాశమే అందించు జ్ఞాపకము
జ్ఞాపకమే పెంచు స్మరణ శక్తి
స్మరణ శక్తే పెంచును ఆశ
ఆశ బ్రతుకులో ఉన్నది ప్రాశాంతి

కోరిక వల్లే ఉద్భవించు ప్రాణ శక్తి
ఇరువురి మధ్య ఏర్పడును ఆత్మ శక్తి
ఆత్మ శక్తిని కల్పించును పరమాత్మ శక్తి
పరమాత్మ శక్తే విశ్వానికి పంచి రక్షించు

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:   
--((*))--

భార్య ఎప్పుడు సంతోష పడుతుందో మిరే చెప్పండి ?
 సరదాగా నా కవిత

నీ మాటలే నాకు ఆజ్ఞ 
నీ బాటలే నాకు ఆదా
నీ వాటాతో నాకు ఆఱు 
నీ కోటయే నాకు ఆత్మ 

నీ ఆటలే నాకు ఇష్టి
నీ పాటలే నాకు ఇంచు
నీ వేషాలే నాకు ఇంద్ర
నీ చేష్టలే నాకు ఇంది

నీ కొరికే నాకు ఇంపు
నీ పిలుపే నాకు ఇచ్ఛ
నీ వలపే నాకు ఇజ్య
నీ తలపే నాకు ఇభ్య 

నీ భాష్యమే నాకు సూక్తి 
నీ చూపులే నాకు రక్తి 
నీ  నవ్వులే నాకు భుక్తి 
నీ  మరులే నాకు ఉక్తి  

నీ కొలువే నాకు ఋక్తి
నీ కళలే నాకు శక్తి
నీ విలువే నాకు ముక్తి
నీ తెలివే నాకు యుక్తి 
--((*))--