7, జులై 2017, శుక్రవారం

విశ్వములో జీవితం-39

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:




ప్రాంజలి ప్రభ - మురళీ రవళి

జగమంతా ఆనందాన్ని ఇస్తూ
మనసంతా రంజింప చేస్తూ
మమతల కోవెలలో జీవిస్తూ
అనురాగం పంచె మురళీ రవళి

వెదురు బొంగుతో రాగాలాపన చేస్తూ
మూగపోయిన గుండెను హెచ్చరిస్తూ
తెరలు తెరలుగా గాలిలో సంచరిస్తూ
మనసును శాంతి పరిచే మురళీ రవళి

చద్ది తిను నాడే ముద్దులు కురిపిస్తూ
వళ్ళంతా ఉన్న గాయాలను సరిచేస్తూ
కళ్లతో కాంతి రేఖలను కుమ్మరిస్తూ
స్వరాలతో మరిపించే మురళీ రవళి  

ప్రకృతి అంతా కలవరిస్తూ  
తనువు లంతా పులకరిస్తూ
పశు పక్షాదులు పులకిస్తూ
తన్మయంతో మరిపించే మురళీ రవళి

నీటి అలలు లా ప్రవహిస్తూ
గాలిలా మనసును దరిచేస్తూ
విశ్వమంతా విహరిస్తూ
జీవితాల్లో వసంతం తెచ్చే మురళీ రవళి

కల్పాంతరం వరకు మోస్తూ
సర్వ ప్రాణులకు ప్రాణం పోస్తూ  
అపశృతి లేని సంగీతం ఇస్తూ
పరమాద్భుతమును చూపే మురళీరవళి
--((*))--
ప్రాంజలి ప్రభ - జీవగడ్డ

అమ్మపాలు పొంగే జీవగడ్డ
శ్రీలు పొంగిన జీవగడ్డ
స్త్రీ సిరి అందించిన జీవగడ్డ
వేదం ఉద్భవించిన గడ్డ

మనోజ్ఞ దీక్షాశయము గడ్డ
స్వతంత్ర శుభాశయము గడ్డ  
జ్ఞానాన్ని పంచే జీవ గడ్డ
మానసిక క్షోభ తొలగించే గడ్డ

దయా కరుణ చూపే గడ్డ 
ఆత్మ గీతం అందించు గడ్డ
కన్నీరు తుడిచే గడ్డ
కారుచీకట్లు తరిమే గడ్డ

భోగభాగ్యాలందించు గడ్డ
బంధాలను నిలిపే గడ్డ
భాద్యతలను పంచే గడ్డ
అంతర్జాతీయ గుర్తింపు గడ్డ

కలువల కన్నుల గడ్డ 
బోసి నవ్వుల బిడ్డల గడ్డ
మరువలేను మా గడ్డ
అందరి అమరావతి గడ్డ 

ప్రాంజలి ప్రభ - "కల్తీ "

కలలో కల్లోలం కల్తీ
యదలో అనురాగం కల్తీ
ముసుగు ప్రేమలో కల్తీ
మదనుడి మాయ కల్తీ

మగువ చూపులు కల్తీ
మగణి మాటలు కల్తీ  
మన్మధుని పోలిక కల్తీ
మదాలసా రూపం కల్తీ

పట్టు బిగువుల కల్తీ
విని చెప్పు మాటలు కల్తీ
మంచా చెడా తేల్చలేని కల్తీ
అవును కాదనుటలో కల్తీ

ఆకలి ఉన్న లేదనుటలో కల్తీ
దాహమున్న తీరదనుటలో కల్తీ
తపన ఉన్నా లేదనుటలో కల్తీ
తనువు తపించలేదనుటలో కల్తీ

నిద్రలో జారే దాకా కల్తీ
బ్రతుకంతా కల్తీ
ఆలోచన ఆచరణలు కల్తీ
దేవుని దండాల్లో కల్తీ

తినే తిండిలో కల్తీ
త్రాగే నీటిలో కల్తీ
మనసు మాట కల్తీ
వేదిక ఉపన్యాసం కల్తీ

అమ్మ పాలలో ఉండదు కల్తీ
కల్తీల వళ్ళ ఉన్నది వెల్తి
రోగాలతో మాయమవుతుంది శాల్తీ
శక్తి తగ్గాక తెలుసుకోలేరు కల్తీ

కళ్ళు తెరవండి కల్తీని అడ్డుకోండి
కష్ట పడండి కల్తీ జోలికి పోకండి
కల్తీ వల్ల అందరికి నష్టమండి  
కల్తీ మానండి ఆరోగ్యంగా జీవించండి 

భార్య ఎప్పుడు సంతోష పడుతుంది సరదాగా నా కవిత

నీ మాటలే నాకు ఆజ్ఞ 
నీ బాటలే నాకు ఆదా
నీ వాటాతో నాకు ఆఱు 
నీ కోటయే నాకు ఆత్మ 

నీ ఆటలే నాకు ఇష్టి
నీ పాటలే నాకు ఇంచు
నీ వేషాలే నాకు ఇంద్ర
నీ చేష్టలే నాకు ఇంది

నీ కొరికే నాకు ఇంపు
నీ పిలుపే నాకు ఇచ్ఛ
నీ వలపే నాకు ఇజ్య
నీ తలపే నాకు ఇభ్య

నీ కొలువే నాకు ఉక్తి
నీ కళలే నాకు శక్తి
నీ విలువే నాకు ముక్తి
నీ తెలివే నాకు యుక్తి          

ప్రాంజలి ప్రభ - ప్రభోధము 

నామములో ఉన్నది మర్మము
మర్మములో ఉన్నది జ్ఞానము
జ్ఞానమే మనకు బోధించు భాష్యము
మదిలో చేరి కల్పించు ప్రశాంతి.

మనస్సులో ఉండాలి దృఢ సంకల్పము
ఇది మనకు కల్పించు నిగ్రహ చిత్తము
పృథ్విపై చిత్తము చూపును మార్గము
ఆ మార్గాలే కల్పించు ప్రశాంతి    

పృథ్విలో ప్రతిఒక్కరు చేయాలి ధ్యానము
ధ్యానముతో మనసుకు పెరుగు విజ్ఞానము
విజ్ఞానము వళ్ళ మనకు పెరుగు బలము
మానసిక బలమే అందించు మనకు అన్నము
అన్నము కల్పించు ప్రశాంతి    

అన్నముతో కావల్సినది జలము
జలము వల్లే కనబడును తేజస్సు
తేజస్సు కంటే గొప్పది అంబరము
అంబరము అందించు ప్రాశాంతి

ఆకాశమే అందించు జ్ఞాపకము
జ్ఞాపకమే పెంచు స్మరణ శక్తి
స్మరణ శక్తే పెంచును ఆశ
ఆశ బ్రతుకులో ఉన్నది ప్రాశాంతి

కోరిక వల్లే ఉద్భవించు ప్రాణ శక్తి
ఇరువురి మధ్య ఏర్పడును ఆత్మ శక్తి
ఆత్మ శక్తిని కల్పించును పరమాత్మ శక్తి
పరమాత్మ శక్తే విశ్వానికి పంచి రక్షించు

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:   
--((*))--

గణిత స్నేహము 

నాలుగు దిక్కులు మన కవసరము
ఏదిక్కుకు పోయిన కలుపు స్నేహము 
సమమా లేదా అసమమా చెప్పలేము 
అందుకే నేను అంటా ఒక చతురస్త్రము 

మాతా జనకులకు తెలపాలి ప్రేమవిషయము 
సఖ్యత సంపద సంతృప్తి అందరికి అవసరము 
ద్వందాలను కలిపేదే మూడవది స్నేహము 
స్త్రీపురుషుల మధ్య స్నేహప్రేమయే త్రికోణము   

స్త్రీ పురుషులా అనేది ఉండదు భేదము 
ప్రేమతో ప్రారంభిస్తే అది ప్రణయము 
ద్వేషముతో ప్రారంభిస్తే అది ప్రళయము 
స్నేహం దూరంగా ఉంటె రేఖ దగ్గరైతే వసంతం 

స్నేహము అనేది అనంతము 
అది సాగును నిరంతరము 
అది కలుపు తుంది బంధము 
అందుకే దానిని పోల్చుతా వృత్తము 
  





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి