ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
Pranjali Prabha
పీతాంబరం అనుభవాలు, ఏకాంబరం ఛలోక్తులు - 1
పీతాం : ఏమోయ్ బాగున్నావా :
ఏకాం: ఎద్దులా ఎదురు కనబడితే బాగున్నావా అని అడుగుతావా
పీతాం : ఏమోనోయ్ నీ మొఖం చూస్తే అలా కనబట్లా :
ఏకాం: మరి ఎలా కని పిస్తున్నానోయ్
పీతాం : నేను ఎమన్నా అంటే కోపం వస్తుందెమొనోయ్ :
ఏకాం: పర్వాలేదు దులిపేసుకొనే అలావాటు అయ్యిందిలేవోయ్
పీతాం : నా దగ్గర మాత్రం నీ మాటలతో దులుపుకురా :
ఏకాం: ఇంట్లోవాళ్ళకన్నా ఎక్కువ విసిగించకురా
పీతాం : పులి లాగుండే వాడివిరా ఇప్పుడు ........ :
ఏకాం: ఆ ఇప్పుడు పిల్లి అంటావురా .........
పీతాం : లేదురా మీసాలు లేని పులే అంటాను రా :
ఏకాం: మీసాలు తిప్పుతూ ఏమన్నావు, సివంగినా
పీతాం : ఎబ్బే నేను అన్లేదే నీవే అన్నావు :
ఏకాం: ఆ .. ఆ ... సివంగినా ఆ .. ఆ ... సివంగినే
దారినపోయేవాడు మీలో సివంగి ఎవరు పులి ఎవరూ
మేమిద్దరం పులులం నీవే సివంగివి అంటూ గర్జించారు
దేవుడా రక్షించు, దేవుడా రక్షించు ........ ............
--((*))--
Pranjali Prabha
పీతాంబరం అనుభవాలు, ఏకాంబరం ఛలోక్తులు - 2
ఏకాం: మంచి మనిషి అంటే ఎవరో తెలుసా ?
పీతాం: బహుశా నన్ను చూసే నీ వడిగావు కదూ
ఏకాం : అంత లేదు
పీతాం: నీవు మాత్రం కాదు అది నాకు తెలుసు
ఏకాం: ఎన్నాళ్లకు నన్ను మనిషి కాదన్నావు
పీతాం : నీవు చెపుతావా, నన్ను చెప్ప మంటావా
ఏకాం: సరే నీవు చెప్పు
పీతాం: ఎప్పుడు ఆన్ లైన్ లో కి వచ్చి ఐ.లవ్ యు అనే వాడు కదూ
ఏకాం: పెళ్ళైన వాళ్ళని అడిగాడనుకో బూతులు బూతులు కదా
పీతాం: అట్లయితే విసుక్కోకుండా అన్నిటికి లైక్ చేసే వాడు కదూ
ఏకాం: వీడెవడో లైకులు పిచ్చోడు అంటారు కదా
పీతాం:చాలా హుందాగా కామెంట్స్ పెట్టె వాడు కదూ
ఏకాం: కొద్దిగా మంచి వాడను కుంటానులే కదా
పీతాం: ఇంటికి ఎవరు వెళ్లిన వైఫా అందిస్తాడు కదూ
ఏకాం: ఏమి టీ వైఫ్ అందిస్తాడంటావ్
పీతాం: అర్ధం చేసుకోలేవు ఇంటర్నెట్ కనెక్షన్ కలుపు తాడు కదూ
ఏకాం: అబ్బో ఇంకా ఇంకా చాలా మంచోడు కదా
పీతాం: జీవితంలో ఒకే ఎకౌంట్ చుట్టూ తిరుగుతాడు కదూ
ఏకాం; ఎకౌంట్ అంటే ఎవరూ
పీతాం: ఎకౌంట్ అంటే తెలీదా "పెళ్ళాం"
ఏకాం : ఆ పెళ్ళాం చుట్టూ తిరిగే వారమా మనం
పీతాం : నన్ను కలపకు
ఏకాం : ఓహో మర్చిపోయా నీకు రెండో ఎకౌంట్ ఉంది కదా
పితాం: ఇంతకీ ఎవరు మంచి మనిషో తెలిసిందా
ఏకాం: తెలియలా
పితాం: తెలుసుకో " పోయినోళ్ళందరూ మంచోళ్ళు "
ఏకాం: అంటే ఉన్నోలందరు ఎవరు ?
పీతాం: నేను పోతున్న ఆలోచించు
ఏకాం: ఆ .. ఎవరబ్బా.. ఆ .. ఎవరబ్బా అంటూ జుట్టు పికుంటున్నాడు
--((*))--
Pranjali Prabha
పీతాంబరం అనుభవాలు, ఏకాంబరం ఛలోక్తులు - 3
ఏకాం: నా మానవుడు ఎప్పుడూ స్మార్ట్ ఫోన్ తో ఆడుకుంటాడు తెలుసా?
పీతాం: అవునవును, బిల్లు కట్టకపోతే, ఇంటర్నెట్ కనెక్షన్ రాకపోతే తెలుస్తుంది
ఏకాం : ఎప్పుడు టామ్ అండ్ జర్రి, భీం చూస్తూ ఉంటాడు తెలుసా ?
పీతాం: ఫిలిం లో చూసినట్లు ప్రవర్తించారనుకో అప్పుడు తెలుస్తుంది నీకు
ఏకాం: ఎప్పుడూ కృష్ణుని లీలలు చూస్తూ ఉంటాడు తెలుసా ?
పీతాం : ఆమ్మో ఇప్పటి నుండి చిన్న పిల్లలకు భక్తి వచ్చిందనుకో కష్టాలున్నట్లే నీకు
ఏకాం: అసలు నీ ఉద్దేశ్యం ఏమిటి, ఫోన్ చూపిన్చవచ్చా కాదా ముందు చెప్పు
పీతాం: పూర్వం ఇవి చూసే నీవు పెరిగావా
ఏకాం: ఆధునిక సదుపాయాలు పెరిగాయి ఎంజాయ్ చేయాలి కదా
పీతాం: కాదనను, పిల్లలకు చూపి కళ్ళజోడు తెప్పించటం అవసరమా
ఏకాం: ఫోన్ లాగాననుకో ఇంట్లో సైరన్ మోగుతుంది తెలుసా
పీతాం: పూర్వం లాలి పాట పాడే వారు, పాడు తప్పేముంది
ఏకాం: అంటే పాత అలవాట్లే మంచివంటావా
పీతాం: భూమి గుండ్రముగా ఉంటుంది, అంటే పాత అలవాట్లు లాలి పాటలు మంచివేకదా
ఏకాం: మహాప్రభూ నీకో నమస్కారం, ఫోన్ అలవాటు మాన్పించి లాలి పడతా
పీతాం: ఎలా పాడాలో ఆలోచించావా
ఏకాం: ఎందుకు ఆలోచించాలా
పీతాం: పాడు
ఏకాం; లాలీ లాలీ వాడ్సప్ లాలీ, లాలీ లాలీ రెడ్మి లాలీ, లాలీ లాలీ జావా లాలీ,
: లాలీ లాలీ అమెజాన్వా లాలీ, లాలీ లాలీ యు ట్యూబ్ లాలీ, లాలీ లాలీ టాకింగ్టాం లాలీ,
పితాం: చాలా చక్కగా పాడుతున్నవ్
ఏకాం: అసలు నేను ఎవరనుకుంటున్నవ్
పితాం: ఏమో నాకేం తెలుసు
ఏకాం: తెలియదన్న వానికి చెప్పే అలవాటు నాకు లేదు వస్తా
పీతాం: ఎందు కైనా మంచిది పిల్లల పెంపకం టి.వీ. చూడు
ఏకాం: నా తంటాలు నేను పడతా వస్తా
Pranjali Prabha
పీతాంబరం అనుభవాలు, ఏకాంబరం ఛలోక్తులు - 3
ఏకాం: నా మానవుడు ఎప్పుడూ స్మార్ట్ ఫోన్ తో ఆడుకుంటాడు తెలుసా?
పీతాం: అవునవును, బిల్లు కట్టకపోతే, ఇంటర్నెట్ కనెక్షన్ రాకపోతే తెలుస్తుంది
ఏకాం : ఎప్పుడు టామ్ అండ్ జర్రి, భీం చూస్తూ ఉంటాడు తెలుసా ?
పీతాం: ఫిలిం లో చూసినట్లు ప్రవర్తించారనుకో అప్పుడు తెలుస్తుంది నీకు
ఏకాం: ఎప్పుడూ కృష్ణుని లీలలు చూస్తూ ఉంటాడు తెలుసా ?
పీతాం : ఆమ్మో ఇప్పటి నుండి చిన్న పిల్లలకు భక్తి వచ్చిందనుకో కష్టాలున్నట్లే నీకు
ఏకాం: అసలు నీ ఉద్దేశ్యం ఏమిటి, ఫోన్ చూపిన్చవచ్చా కాదా ముందు చెప్పు
పీతాం: పూర్వం ఇవి చూసే నీవు పెరిగావా
ఏకాం: ఆధునిక సదుపాయాలు పెరిగాయి ఎంజాయ్ చేయాలి కదా
పీతాం: కాదనను, పిల్లలకు చూపి కళ్ళజోడు తెప్పించటం అవసరమా
ఏకాం: ఫోన్ లాగాననుకో ఇంట్లో సైరన్ మోగుతుంది తెలుసా
పీతాం: పూర్వం లాలి పాట పాడే వారు, పాడు తప్పేముంది
ఏకాం: అంటే పాత అలవాట్లే మంచివంటావా
పీతాం: భూమి గుండ్రముగా ఉంటుంది, అంటే పాత అలవాట్లు లాలి పాటలు మంచివేకదా
ఏకాం: మహాప్రభూ నీకో నమస్కారం, ఫోన్ అలవాటు మాన్పించి లాలి పడతా
పీతాం: ఎలా పాడాలో ఆలోచించావా
ఏకాం: ఎందుకు ఆలోచించాలా
పీతాం: పాడు
ఏకాం; లాలీ లాలీ వాడ్సప్ లాలీ, లాలీ లాలీ రెడ్మి లాలీ, లాలీ లాలీ జావా లాలీ,
: లాలీ లాలీ అమెజాన్వా లాలీ, లాలీ లాలీ యు ట్యూబ్ లాలీ, లాలీ లాలీ టాకింగ్టాం లాలీ,
పితాం: చాలా చక్కగా పాడుతున్నవ్
ఏకాం: అసలు నేను ఎవరనుకుంటున్నవ్
పితాం: ఏమో నాకేం తెలుసు
ఏకాం: తెలియదన్న వానికి చెప్పే అలవాటు నాకు లేదు వస్తా
పీతాం: ఎందు కైనా మంచిది పిల్లల పెంపకం టి.వీ. చూడు
ఏకాం: నా తంటాలు నేను పడతా వస్తా
--((*))--
Pranjali Prabha
పీతాంబరం అనుభవాలు, ఏకాంబరం ఛలోక్తులు - 4
పీతాంబరం : అంత కష్ట పడినందు వళ్ళ, ఫలితమేమైనా ఉన్నదా
ఏకాంబరం : కష్ట బడితే సుఖనిద్ర అన్నారు పెద్దలు
పీతాం: కాయకష్టం చేయమన్నారు, కలం కష్టం అనలేదుగా
ఏకాం : శ్రమిస్తే జీవిస్తాం, అదృష్టాన్ని చూస్తాం, దేశాభివృద్ధికా సహకరిస్తాం కదా
పీతాం : ఫలితమ్ కనబడక పొతే ఎం చేస్తావ్
ఏకాం : బాహ్య పరిస్థితులు అంతర్గత పరిస్థితులను పరిశీలిస్తాం
పీతాం : నా ఉద్దేశ్యం 20 % పనిలో 80 % విశ్రాంతి ఉండాలి, మన:శాంతి ఉన్నప్పుడు ఆలోచనలు బాగుంటాయి కదా
ఏకాం : అవును నీవు ఎప్పుడు ఇల్లు కాపురం అంటావు అందుకే నియాలోచనలు అక్కడ ఉన్నాయి
పీతాం : కుటుంబమే దేశము, దేశ శ్రేయస్సే మన సౌభాగ్యం, మీ దృష్టిని, నైపుణ్యాలను, సామర్ధ్యాలను విస్తరిస్తూనే ఉండాలంటాను
ఏకాం : శ్రమించాలంటే సహకరించ కుండా టెక్నలాజి వచ్చింది అది అవసరమా ?
పీతాం : జనాభా తక్కువ ఉన్న వారికి అవసరం, అయినా వాడుటలో తప్పేముంది
ఏకాం : నిరుద్యోగం పెరుగుతున్నది కదా, దానికి పరిష్కారం చెప్పవే
పీతాం : కష్టపడ్డ వాడికి నిరుద్యోగం అనలేడూ, భద్దకస్తుడి అట్లా అంటాడు
ఏకాం : నన్ను మాటలతో మాయ చేస్తున్నావు
పీతాం : మాటల మాయలో చిక్కి ఓట్లు వేసి నాయకులను గెలిపిస్తున్నారు
ఏకాం : అవును వారు చేసే పనికి నోరు విప్పలేక తలపట్టుకున్నారు ఎందుకు
పీతాం : ఎందుకో నీవే గ్రహించు :
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుష్యులోయ్ పాట పాడుతూ బయలు దేరాడు ఏకాంబరం
--((*))--
పీతాంబరం అనుభవాలు, ఏకాంబరం ఛలోక్తులు - 2
పీతాం : జీవితంలో మంచి మనుష్యులను నొప్పించకు :
ఏకాం: ఎందుకు అంటావ్
పీతాం : వారు వజ్రం లాంటి వారు చేజారినా పగిలి పోరు, జారి పోతారు :
ఏకాం: వారిని ఎలా గుర్తించేది
పీతాం : నన్ను చూస్తే నీ కేమని పిస్తుంది :
ఏకాం: నిన్ను మంచోడిగా గుర్తించాలా ఎందుకు
పీతాం : అదేమిటి మంచి సలహాలు ఇస్తున్నా కదా :
ఏకాం: మూల కూర్చున్న ముసలమ్మ కూడా ఇస్తుంది, దానితో పోల్చమంటావా
పీతాం : .ముసలమ్మతో పోల్చకురా ....... :
ఏకాం: మరి అటు ఇటూ కానీ వారితో పోల్చమంటావా .........
పీతాం : నీతో మాట్లాడాలంటే కష్టము రా :
ఏకాం: నీవు మంచి వాడివేరా నా సమయాన్ని మింగేస్తావుగా
పీతాం : ఏమన్నవ్ ఏది చూపించు ..... :
ఏకాం: ఆ .. ఆ ... చూపించనా ఆ .. ఆ ... చూపించు
దారిన పోయేవాడు సమయాన్ని ఎలా చూపు తారండి
మేమిద్దరం కలిసామ్ మా మాటలు చాటుగా వింటావా
అంటూ సమయాన్ని చూప్పిస్తాం అంటూ దాడి చేశారు
దేవుడా రక్షించు, దేవుడా రక్షించు ........ ............
--((*))--
పీతాంబరం అనుభవాలు, ఏకాంబరం ఛలోక్తులు - 3
పీతాం : మంచిని కోరుకొనే వారిని దూరం చేసుకోకు :
ఏకాం: అంటే తల్లి, తండ్రి, పెళ్ళాం పిల్లలు కదరా
పీతాం :చెడు కోరే వారి నీ దగ్గరకు రానీయకు :
ఏకాం: అంటే స్వార్ధ పరులు, నమ్మక ద్రోహులు కదురా
పీతాం : ఇవన్నీ నీకెందుకు చెపుతున్నానో తెలుసా
ఏకాం: అదేరా తెలిసిన విషయమే చెపుతున్నావ్ , ఆరిగి పోయిన రికార్డుకు విలువ లేదురా
పీతాం : అంటే పెద్దల్ని పట్టించు కోవురా :
ఏకాం: వాళ్ళు ఇప్పుడు నన్ను పట్టించు కొని, పీడించకుంటే బాగుండునురా
పీతాం : ఋణాను బంధాన్ని వదిలించు కో లేవురా ....... :
ఏకాం: వేరే మార్గం ఏదన్న ఉంటె చెప్పురా .........
పీతాం : అదిగో వారిలా ఉండటమే .............. :
ఏకాం: వారు గుడ్డి మూగ, చెవిటి వారురా ............
పీతాం : వారి ప్రవర్తన గమనించురా ..... :
ఏకాం: ఆ .. ఆ ... అట్లాగే మారాలా ఆ .. ఆ ... తప్పదా
దారిన పోయేవాడు వీళ్ళ మూగ సైగలను చూసి చేతిలో డబ్బు పెట్టాడు
మేమిద్దరం చాలా రోజులకు కలిసామ్ ఎదో మూగగా మాట్లాడుకుంటూ ఉంటే
అడుక్కొనేవాళ్ళని డబ్బులేస్తావురా ........... ..........
దేవుడా రక్షించు, దేవుడా రక్షించు ........ ............
--((*))--
పీతాంబరం అనుభవాలు, ఏకాంబరం ఛలోక్తులు -4
పీతాం : నీ కో విషయం చెప్పాలిరా
ఏకాం: దేని గురించి
పీతాం : ఆషాడ మాసంలో కొత్తగా పెళ్లైన జంట గురించి
ఏకాం: ఆ ఇప్పుడు ఎవ్వరు దూరంగా ఉంటున్నారు
పీతాం : ఎందుకన్నారో ఒక్కసారి గుర్తించాలి కదరా
ఏకాం: ఆ తెలిసేందేదో చెప్పు, నేను కూడా అందరికి చెప్పాలిగా
పీతాం : కొత్తగా పెళ్ళైన యువతి యుక్తవయసులో ఉంటుంది. యుక్తవయసులో ఉన్న స్త్రీలలో గర్భవతి అయ్యే చాన్సు ఎక్కువ శాతం ఉంటుంది. అత్తా కోడలు ఒక చోట ఉండ కూడదని అంటారు.
అందుకనే ఒకరికొక్కరు
ఏకాం: అలా ఎందుకురా చేయడం పాపం కదురా
పీతాం : ఎందుకంటే ఆషాడ మసంలో గర్భం దాల్చిన స్త్రీ ఖచ్చితంగా మండు వేసవిలో డేలివరి అవుతుంది అంటే మార్చి, ఎప్రిల్, మే మాసంలలో.అనగా అనేక శిశు మరణాలు వేసవిలో సంబవించినవి. ఎవరికైనా తొలి సంతానం మరణం బాధాకరమైన విషయమని, దినిని నివారించే క్రమంలో మన పూర్వీకులు ఎంతో శోధించి తెచ్చిన అచారమే ఆషాడ మాసం ఆచారం
ఏకాం: .ఆ ఇప్పుడు ఎవరు పట్టించు కుంటున్నారు, పెళ్ళయిన వెంటనే విడి కాపురం పెడుతుంటే
పీతాం : అందారూ నీ కొడుకుల్లాంటి వారనుకుంటున్నావా
ఏకాం: ఏమన్నవో ఎప్పుడో జరిగిన విషయం గుర్తుచేస్తావ్
పీతాం : ఎదో మాట వరుసకన్నా అంతే
ఏకాం: పేరుకు ఆచారమైన దీనిలో శాస్త్రీయత ఉంది. అయితే నేడు అనేక వైద్యసదుపాయలు అందుబాటులో ఉన్నాందున కొత్తపెళ్ళికూతురు నిరభ్యంతరముగా అత్తవారింట్లో ఉండవచ్చు, భర్తతో కలిసి ఉండవచ్చు. అత్త ను చూసిన ఏమి కాదు.
దారిన పోయేవాడు వీళ్ళ మాటలు విని నిజమా నండి అట్లయితే మాఅత్తగారింటికి పోవచ్చా
ఏకాం: మీ ఆత్తగారు ఎలాంటి వారు .............
వ్యక్తి : జయ విజయాలకు కన్నా ఎక్కువ లంఖిణి కన్నా తక్కువ
ఆ అంటం ఇద్దరి పని అయింది ...................
కళామిత్ర(కలంపేరు)
డా.నూనె. అంకమ్మరావు. ఆంధ్రోపన్యాసకులు
రాఘవ డిగ్రీ కళాశాల,ఒంగోలు
ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య,అధ్యక్షుడు
చరవాణి:9397907776
రాఘవ డిగ్రీ కళాశాల,ఒంగోలు
ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య,అధ్యక్షుడు
చరవాణి:9397907776
ప్రాంజలి ప్రభ - ప్రభోధము
నామములో ఉన్నది మర్మము
మర్మములో ఉన్నది జ్ఞానము
జ్ఞానమే మనకు బోధించు భాష్యము
మదిలో చేరి కల్పించు ప్రశాంతి.
మనస్సులో ఉండాలి దృఢ సంకల్పము
ఇది మనకు కల్పించు నిగ్రహ చిత్తము
పృథ్విపై చిత్తము చూపును మార్గము
ఆ మార్గాలే కల్పించు ప్రశాంతి
పృథ్విలో ప్రతిఒక్కరు చేయాలి ధ్యానము
ధ్యానముతో మనసుకు పెరుగు విజ్ఞానము
విజ్ఞానము వళ్ళ మనకు పెరుగు బలము
మానసిక బలమే అందించు మనకు అన్నము
అన్నము కల్పించు ప్రశాంతి
అన్నముతో కావల్సినది జలము
జలము వల్లే కనబడును తేజస్సు
తేజస్సు కంటే గొప్పది అంబరము
అంబరము అందించు ప్రాశాంతి
ఆకాశమే అందించు జ్ఞాపకము
జ్ఞాపకమే పెంచు స్మరణ శక్తి
స్మరణ శక్తే పెంచును ఆశ
ఆశ బ్రతుకులో ఉన్నది ప్రాశాంతి
కోరిక వల్లే ఉద్భవించు ప్రాణ శక్తి
ఇరువురి మధ్య ఏర్పడును ఆత్మ శక్తి
ఆత్మ శక్తిని కల్పించును పరమాత్మ శక్తి
పరమాత్మ శక్తే విశ్వానికి పంచి రక్షించు
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
--((*))--
భార్య ఎప్పుడు సంతోష పడుతుందో మిరే చెప్పండి ?
సరదాగా నా కవిత
నీ మాటలే నాకు ఆజ్ఞ
నీ బాటలే నాకు ఆదా
నీ వాటాతో నాకు ఆఱు
నీ కోటయే నాకు ఆత్మ
నీ ఆటలే నాకు ఇష్టి
నీ పాటలే నాకు ఇంచు
నీ వేషాలే నాకు ఇంద్ర
నీ చేష్టలే నాకు ఇంది
నీ కొరికే నాకు ఇంపు
నీ పిలుపే నాకు ఇచ్ఛ
నీ వలపే నాకు ఇజ్య
నీ తలపే నాకు ఇభ్య
నీ భాష్యమే నాకు సూక్తి
నీ చూపులే నాకు రక్తి
నీ నవ్వులే నాకు భుక్తి
నీ మరులే నాకు ఉక్తి
నీ కొలువే నాకు ఋక్తి
నీ కళలే నాకు శక్తి
నీ విలువే నాకు ముక్తి
నీ తెలివే నాకు యుక్తి
--((*))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి