27, ఫిబ్రవరి 2015, శుక్రవారం

Pranjali/Daily-Poet-News (1-03-2015 to 15-03-2015)

Om Sri Raam                                   Om sri Raam                                 Om Sri Raam

                                                         
             ప్రాంజలి                   
సర్వేజనాసుఖినోభవంతు
 ఓం శాంతి: - ఓం శాంతి: -  ఓం శాంతి: -  


వియోగ భావ ప్రకంపనలు 

చినుకుల్లో తడిసిన చూపులు 
వంటికి వణుకుడు గాలులు
దప్పిక తీరక పెదాల కదలికలు 
కళ్ళకు నిద్ర లేక ఎదురు చూపులు 

మనసులో కదిలిన జ్ఞాపకాలు 
హృదయంలో పెరిగిన దడలు 
శ్వాసలో మలయ మారుతాలు
పలకరిమ్చేవారులేక పడిగాపులు 

ఉరికేత్తలేని వయస్సు కోరికలు 
కోర్కను చంపుకోలేని ఆరాటాలు 
ధైర్యము సన్నగిల్లి ఏర్పడే బిడియాలు 
అర్ధం చేసుకోలేని గత స్మృతులు

తెరలు తెరలు తరుము కొస్తున్న ఊహలు
అలా అలా నేమ్మిగా అలుముకున్న ఆలోచనలు
వెంబడిస్తున్న గుర్తుకురాని ప్రకృతి అనురాగాలు
చందనలేపనాలు లేక కమ్ముకున్న మసక రాత్రులు 

మదితోలచి నినువగచి మనసు వికలమై 
మనసు విరిగి మమతలు కరిగి మనమై 
 మల్లెల సుఘందాలకు మనసు భారమై 
మనసు మనసులో లేక జీవితమ్ నరకమై 

వెంబడిస్తున్న విరహ  వేదనలు = తరుముకొస్తున్నమనసు కోరికలు   
--[{(*)]}--



 ప్రణయ సుందరి 

నా  యద ఊహల్లొ  విరిసేవులే
నా  రస కేళిలో మురిసావులే  
నా సరస ప్రేమను పొందావులే
నా స్మృతులను దాచుకున్నావులే 

 నాకు కనిపించవే ఒకసారి
నా మనసు గుర్తించవే ఈసారి
నా ప్రణయ దేవతవు నీవె సిరి
 నా సిరే నా కలలో సుందరి

 నాది మూగ ప్రేమా కాదు
నాది అమర ప్రేమా కాదు
నా ప్రేమ వాడే  పువ్వు కాదు
నా ప్రేమ ప్రాణం లేనిది కాదు 

నా కనులలో  కనుపాపవై
నా హృదయంలో  శబ్దానివై
నా మనసులో  జ్ఞాణా నివై
నా మదిలో  విరితాపవై 

నా ఆలాపన ఒక రాగమై
నా ఆవేదన ఒక వేదమై 
నా ఆత్రుత ఒక కిరణమై 
నా నిస్సహాయత వరమై

నా ఆరాధన నీకు కనబడ లేదా సతి
 నా తో ఉన్న అనుభూతులు గుర్తులేదా సతి 
నా  ఆవేసపు మాటలు మరచిరావా సతి
ఒర్పులో, ఒదార్పులో,  నీవే నాకు గతి 

చిన్నతప్పును- పెద్దదిగాచేసి - భాద -పడకు = 
పచ్చని - సంసారాన్ని- పాడు- చేసుకోకు
--{({*})}--




  చరా చర జగత్తు

ఉషోదయంతో మనసు ఊరట
శుభోదయంతో వయసుకు పీట
నవోదయంతో నలసుల ఆట
ప్రేమమయంతో ప్రకృతిలో బాట

యుగ యుగానికి మమతల మూట
తరతరాలకు  తరగని, చెరగని  తోట
ప్రణయ తరంగాలతో ప్రేమికుల మాట
నవ జీవనంతో నందనవనం  బాట

ఉంచాలి చీకటిని తరిమే వెలుగు బాట
కళ్ళకుకప్పిన మబ్బుతెరలు తరుముట
హృదయ భావములను వ్యక్తీ కరించుట
             జాతికి, నీతికి భద్ధులై జీవితం గడుపుట            
అందాల జగతికి శుభోదయం = ఆనందాల సన్నిధికి ఉషోదయం
--((*))--






  మహిళకు విధి రాత వ్రాసిన విధాత

బోసి నవ్వుల పాప తల్లితండ్రుల పేరు నిలబెడుతుంది
తెలివైన మాటలతో, నవ్వుతూ, హృదయాన్ని జయిస్తుంది
పదునైన మేధతో, నిగ్రహశక్తితో, ప్రపంచాన్నే జయిస్తుంది
సృష్టి కార్యంలో తనవంతు ధర్మంగా సహకరించేది మహిళ 

పురుషునికన్న మహిళ మెదడు చిన్నదిగా కుదించి
 ఆలోచనలు ప్రకంపనలుగా మహిళ మనస్సు తొలచి
తోడుగా సమాచారాన్ని విశ్లేషించి మహిళకు సహకరించి
మహిళకు సమస్యలను తట్టుకొనే సహజ శక్తినిచ్చిన విధాత 

మహిళే కళ్ళముందు కనిపించే కలియుగ సృష్టి కర్తవని 
మహిళే నొప్పి భరిస్తూ కొత్తప్రాణికి జన్మ నిస్తున్నదని
మహిళే కళాకాంతులు కోల్పోయి శూలవ్యదను భరిస్తున్నదని
మహిళకు భర్తభాదలు భరించి, ఓర్పువహించే శక్తినిచ్చిన విధాత  

మహిళగా కన్న తల్లి మమకారం పంచి సంతోషిస్తావని 
మహిళే సంసారిగా మారి పిండాన్ని నవమాసాలు మోస్తావని 
భూమిని చీల్చి వచ్చే మొక్కలాగా, వడుదుడుకులతో ఎదుగుతావని 
తననుతాను చీల్చుకొని బిడ్డకు జన్మనిచ్చే శక్తిని ఇచ్చిన విధాతా

వంపు సొంపులు శరీరాకృతి దెబ్బ తింటుందని తెలుసుకొని
తన సహజ సౌకుమార్యాన్ని భర్తకు పణంగా పెట్టాలనుకొని 
భర్త కోరిక తీరుస్తూ వంశాంకుర బీజాన్ని మోస్తావని 
 మాతృత్వం కోసం గర్భదారణకు సిద్ధపడే శక్తి నిచ్చిన విధాత

పసిబిడ్డ ఎడుపులోని ఆకలి సంకేతాన్ని అర్ధం చేసుకొని
ఆత్రుతతో గుండెకు హద్దుకొని అనురాగం పంచుతావని 
మురిపాలను బిడ్డకు అందిస్తూ, కొసరి తినిపించే శక్తి ఉంటుందని
ప్రేమతో, చైతన్యవంతమైన శక్తిని బిడ్డకు పంచె శక్తి నిచ్చిన విధాత  

మహిళకు అర్ధభాగమేకాని, భార్యగా సర్వం అంకితభావంతో పనిచేస్తావని 
భాగస్వామిగా, నాయకురాలుగా, ఉద్యోగస్తునిగా చక్కగా నిర్వహిస్తావని
భర్తకు, పిల్లలకు ప్రేమనుపంచి గృహిణిగా పరిపూర్ణ భాద్యతలు వహిస్తావని
నిగ్రహించుకొని, బ్రతుకు సార్ధకం చేసుకొనె శక్తిని  ఇచ్చే విధాత

 పాప పుట్టిందని భాద ఎందుకు, బ్రతుకు సార్ధకం చేసేది ఆ పాపేనని 
తల్లి తండ్రుల పరిస్తితి అర్ధంచేసుకొని ఆపత్కాలంలో ఆదుకొనేది పాపేనని
ఎదేశంలోనైన పుట్టినిల్లు, మెట్టినిల్లు సంతోశాలతో నింపేది పాపే నని    
   పురుష అహంకారం అనగత్రొక్కి, ప్రేమదేవతగా ఉండే శక్తినిచ్చిన విధాత 

ఆనాడు - పురుషుడిలో - స్త్రీ - ఒకభాగమని - అన్నారు = 
ఈనాడు - స్త్రీ - లోనే - పురుషుడు - ఒకభాగమని - అంటున్నారు
మహిళా దినోస్చవ సందర్బముగా అందరికి  నా శుభాకాంక్షలు
--({{*}})--

  --  బస్సు --

అందరి ఆదరణను నోచుకుంటున్నది బస్సు 
అనుకున్న సమయాన గమ్యాన్ని చేర్చేది  బస్సు 
తీర్ధయాత్రలును త్రిప్పి తిరిగి తీసుకొచ్చేది బస్సు 
పాఠసాలకు  పిల్లలను తీసికెల్లి తెచ్చేది బస్సు

 కూరలను, నిస్చవసర సరుకులను, మోసేది బస్సు 
పెళ్లిళ్లకు, ఉశ్చవాలకు, ఉపయోగ పడుతున్న బస్సు  
అత్యధిక వేగముతో ఆగకుండా గమ్యం చేర్చే బస్సు 
యంత్రములను, బరువైన వస్తువలను తీసుకెల్లె బస్సు 

 నిండు గర్భినీగ కదులు తున్న బస్సు 
గజ్జల గుర్రం లాగా గలగలా మంటున్న బస్సు 
పుడమి తల్లిలా ఓర్పుతో ప్రయాణీకులను మోసే బస్సు
చల్లదనంతో, చక్కదనంతో చక్కగా పరుగెత్తే బస్సు 

నిద్రించుటకు వీలుగా, కడుపులో చల్ల కదలకుండా నడిచే బస్సు 
వృద్ధులను, పెద్దలను, యువతీయువకులను తీసుకెల్లే బస్సు     
ఉద్యోగులు కుటుంబాన్ని బ్రతికించి, బ్రతుకుటకు ఉపయోగపడే బస్సు
ఆదాయాన్ని పెంచి ఉపాది సంస్కరణలు కల్పించేది బస్సు 

ఆనాడు-రధచక్రాలను - శ్రీ కృష్ణుడు- సారద్యం- వహించారు  = 
ఈనాడు - ప్రజల- మేప్పు - పొందినబస్సును- శ్రీ కృష్ణ లీలలు సారద్యం వహింస్తున్నారు  
--{[[*]]}--

   ఎవడే వాడెవడే  

నిద్ర  లేవగానే గుమ్మం ముందుటాడే
నేముగ్గేయ్యబొతుంటే చూస్తు ఉంటాడే
సంతకెలితే ఊయాల ఊగుదామంటాడే 
హాస్టల్ కెల్తేనన్నుసైకిల్ తోవెంబడిస్తాడే 

చదువు కుందామంటే కలలోకి వస్తాడే 
మెల్లగా తాకి నన్ను ఇబ్బంది పెడతాడే 
కిళ్ళీ కొట్టు కాడ బుల్లీ అంటూ ఉంటాడే  
కుక్కపిల్లలాగా తొకాడిస్తు వెంటవస్తాడే

మలుపు తిరిగేకాడ కూచుకోనిఉంటాడే
ఏదోఒకటి నాతో మాట్లాడటానికి వస్తాడే
నాకు అక్కరలేనివి కొని సంబరపడుతాడే
ఎవడేఅమ్మాయి నిన్నువెంబడించే వాడెవడే 
  
మల్లె పూల దండ తెచ్చి పెట్టు కోమంటాడే 
మంచి ఘంధం తెచ్చి పూసు కోమంటాడే  
రవ్వలగాజులను తెచ్చి వేసు కోమంటాడే
నాతోనేఇంటికివచ్చి వెనక్కి తిరిగి పోతాడే 

అమ్మ నా కీ చదువద్దు కాపురానికి పంపవే 
పెళ్ళిచేసుకొని దూరంగా ఉండటం కష్టం కదే
ఎవరే నిన్నువెమ్బడించేది ముందు చెప్పవే
ఇంకెవరూ నీ తమ్ముడు నా మేగుడే ఆ ఆ ఆ

దూరముగా ఉంటె వాడే - దగ్గర ఉంటె మావారే 
--II ***II--



  గుఱ్ఱం కాళ్ళకు నాడాలు కొడితే పరుగెత్తించ వచ్చు
 పరుగెత్తే మనస్సును  కళ్లాలతో బిగించవచ్చు
పరుగెత్తే పాదాలకు రక్షగా షూస్ ధరించవచ్చు
నొప్పిలేకుండా పరుగేత్తిమ్పచేసే షూస్ ధరించు 

 గ్రహించు 
పిచ్చి గీతలనకు, గీతలోని అర్ధం గ్రహించు 
చరిత్రలేదనకు, చరిత్రలోగొప్పను గ్రహించు 
పాడు బ్రతుకనకు, బ్రతుకు పరమార్ధం గ్రహించు 
సిరి-స్త్రీ  దూషించకు, దానిలో ఉన్న గొప్పను గ్రహించు 

వట్టి భావాలనకు, అంతర్మధనంతో వ్రాసినవని గ్రహించు 
పండుగలేందుకనకు, ఆత్మీయత అనురాగమని గ్రహించు 
కళలనెందుకనకు, మనిషిలోని మేధస్సును గ్రహించు 
పూలవాసనెందుకనకు, మనసు ఊహల్లొ తెలునని గ్రహించు 

కధలెందుకనకు, కధలో ఉన్న ధర్మాన్ని గ్రహించు 
వర్ణాలెందుకనకు, వర్ణాలను బట్టి వస్తువును గ్రహించు 
చదువెందుకనకు, సంస్కారము నేర్చుకోగలమని గ్రహించు 
రాయిపైదెబ్బలెందుకనకు, చక్కని దేవుని విగ్రహమని గ్రహించు 

అర్ధరాత్రిస్వాతంత్రంఅనకు, స్వేస్చ వచ్చిందని గ్రహించు 
మానవత్వంలేదనకు, మంచి మనసుతో చూదాలని గ్రహించు 
ఆదరణకరువైందనకు, పలకరింపులోనే ఆదరణను గ్రహించు
సుఖం లేదనకు, తల్లితండ్రుల ప్రేమలోనే సుఖం ఉందని గ్రహించు 
        
ప్రతి-విషయంలో-మంచి-చెడు-గ్రహించు =  తెలుసుకున్నది-తక్కువ తెలుసుకోవాల్సింది- ఇంకాఉందని- గ్రహించు  
                           --oo{*}oo--                                     
మహిళా దినోస్చవం
08-03-2015 శ్రీమతి  ఒక దివ్య మణి

 నయన మనోహర కలువల అపరంజి  మణి

మనసును దోచే, నవ నవోన్మష రక్తి స్వరూపిణి
కోరికలు తీర్చి, యశస్సును పెంచే, యశశ్విణి 
మనోధైర్యం, తేజస్సును వృద్ధి పరిచే, తేజస్విణి 
ధర్మశాస్త్రములు తెలిపి, ఆదు కొనే అంతర్వా ణి 
కొన్ని విషయాలు తెలిసుకోనుటకుసహాయపడే అన్వేషిణి
మనసును మెప్పించిన, వారి కోర్కెలు తీర్చిన, అభిలాషిణి
అంతరాత్మను ప్రభోదించి, అవసరమునకు సలహాఇచ్చె, ఆత్మజ్ఞాణి
ఆస్తిని, అదాయమును,పెంచి ఆహారమును అందించే అన్నప్రదాయిణి 
పురాణములు, వేదములు అనర్గాలముగా వర్ణించి చెప్పే, అవృత్తిణి   
ఇంటిని, సభను, పిల్లలనుహుందాగా తీర్చి దిద్దన, అస్థాణి
కామాందులకు, దుర్మార్గులకు, దుష్టులకు, చిక్కిన ఆహుతిణి
పరిమళాలు వెదజల్లి, మనస్సును ఉల్లాసపరిచే, ఇష్ట ఘంధిణి
రౌద్రరసమును చూపి, శత్రువుల గుండెలలో ఉండే, ఉగ్రరూపిణి
మనో భిష్టమును నెరవేర్చి, ఉచ్చాహమును పెంచే, ఉజ్వల రాణి             తెలివితో తెలియనివి తెలియపరిచే ఉపన్యాసిణి
ఉపవాసములు ఉండి ఉపాయములు తెలియపరిచే ఉపచారిణి
భర్త దుర్వసనములకు లోనైతే వ్యసనాల్ని మాన్పిమ్చే ఉపాధ్యాయిణి
ఉరోభాధను భరించి ఉష్ణమును పెంచి ఉన్మాదునికి ఊరట కలిగించే విలాసిణి
బలము, ధెర్యము, మనోనిగ్రహ శక్తి పెంచే తేజస్సుగల ఓజస్విణి
అనారోగ్య భర్తను ఆరోగ్య్యవంతునిగా మార్చుటకు శ్రమించే ఔషదణి        నవనీత హృదయ వేణి , మంజుల మధుర వాణి 

స్త్రీ - తోడుంటే -జీవితాంతం- సుఖమయం =  స్త్రీ -తప్ప- ఎవరు-తోడున్న- జీవితమ్ నరకం  

--^^^*^^^--




 అమ్మా నన్ను మన్నిం చమ్మ

పాపములు  చేసితి నమ్మ, పాపాత్ముడిగా మారితినమ్మ

పాశములకు చిక్కితినమ్మ, పడచులవెంట తిరిగితినమ్మ

పల్లికిలిస్తూ మాట్లాడితినమ్మ, పక్కలో బల్లెములా ఉన్నానమ్మ

పయన మెటో తెలియదమ్మ, పసివాడిగా మారితినమ్మ

అమ్మ, అమ్మా నన్ను మన్నిం చమ్మ, కరుణించంమ్మ


పదినెలలు నను మోసి కని  పెంచితివమ్మ

పరుస వేదికి మనసు  చిక్కి చెడితి నమ్మ

పరువమె సాస్వితమని తలచి చెడినానమ్మ

పరమపద సోపాన పాముకు చిక్కినానమ్మ

అమ్మ, అమ్మా నన్ను మన్నించమ్మ, కరుణించంమ్మ


ప్రియసి ప్రేమ కోసం విలపించినానమ్మ

ప్రియాతి ప్రియములు తెలియ దమ్మ

ప్రియా   అంటే ప్రేమను కున్నానమ్మ

ప్రియమణి అని తెలిసి మోసపోతినమ్మ

అమ్మ, అమ్మా నన్ను మన్నించమ్మ, కరుణించంమ్మ


ప్రేమను ప్రేమగా గుర్తించ లేదమ్మ

ప్రేమను అలుసుగాచేసి ఆడించిదమ్మ

ప్రేమ రక్తి ముందు ఒడి పోతినమ్మ

ప్రేమను పొందలేక విలవిల్లాడితినమ్మ

అమ్మ, అమ్మా నన్ను మన్నించమ్మ, కరుణించంమ్మ


ప్రోద్బలం తో పోరు సలిపి చెడితి నమ్మ

ప్రోశ్చాహంతో మంచి చెడు తెలియలేదమ్మ

ప్రోవుదారి లేక ముల్ల దారిన పడితినమ్మ

ప్రోష్టిగా మారి వంశాన్ని చెడగొట్టితినమ్మ


అమ్మ, అమ్మా నన్ను మన్నించమ్మ, కరుణించంమ్మ


ధన,- మదగర్వంతో - కొందరు - తూలనాడటం - సహజం  = ఎన్నితప్పులు- చేసిన- పశ్చాతాపముతొ- ఉన్నవారిని- కరుణించటం- అమ్మ- లక్షణం




--<<*>>--



06-03-2015 -హోలీ
వాడ వాడల చలి మంటలు, కామం అనే హోలికా దహనం
పూర్ణిమ నాడు సముద్ర కెరటాలు ఉప్పొంగి సంతోషించడం
చరాచరప్రాణుల హృదయాలు సంతోషంతో ఉప్పొంగిపోవడం
పౌర్ణమిలలో ఉత్తరాదివారికి హోలీ ఫాల్గుణ పూర్ణిమ ప్రేత్యేకం

చంద్రుడి కాంతి పుంజాలతో కళ కళ లాడేది కువలయం
శ్రద్దగా సంబరంగా రంగులు చల్లుకొనే హోలీ ఆనందోస్చవం 
ఆత్మభందువులు ఆదుకున్నట్లు అందరూకలసి ఆడేఉస్చవం
చలికాలాన్ని వెనక్కు నెట్టి హర్షోల్లాసాలతో వసంతుడి విజయం

శిశిరం సమాప్తమై ప్రకృతి పరవశించే వసంతం ఆరంభం    
ప్రకృతిలో తల్లి తండ్రులతో ముద్దు బిడ్డలు ఆడే ఉస్చవం
ప్రాణికోటికి మంచిరోజులు వస్తాయని ఉంటాయని నమ్మకం
గుండెలో ఆత్మ విశ్వాసం నింపే హోలీ మంఛి  తరుణం 

క్షీరాబ్ధి కన్యకగా అవతరించిన లక్షీ దేవిని పూజించె సరైన సందర్భం
హరిహర   పుత్రుడుగా అయ్యప్పస్వామి అవతరించిన పుణ్య దినం  
మధురమీనాక్షి సుందరేశ్వరులకు పెళ్లి రోజైన  మహా ఫాల్గుణ దినం
అహంకారం వదలి అందరు ఆనందంతో జరిపే హొలీ  పండుగ దినం 

రొజూ పరుగెత్త క పోయిన హొలీ నాడు పరుగెత్తాలి అందరం 
రంగులతో ఆడక పోయిన, పెద్దల తోడుఉండాలి సహకారం
రంగులలో స్టైల్ తగ్గుతుందని అనుకోకుండా హోలీఆడటం
అనుభూతుల తో, ఆనందపు సందడి తో  హోలీ ఆడటం

సహజమైన పువ్వులు ఆకులులతో చేసిన రంగులను వాడాలి
రసాయనికరంగులు వంటికి అంటిన అవకాడో స్క్రబ్ నురుద్దాలి 
చర్మానికి దురదగాఉంటె తగ్గటానికి కాలమైలోషణ్ ను వాడాలి 
హొలీ పండుగ సంబరాన్ని ఫోటోల రూపంలొ భద్రపరుచుకోవాలి 

మనసులోఉన్న- దురుద్దేశం- అగ్గిలో- వేసి- బుగ్గి- చేయి = స్వార్ధం-కామం - వీడి- అందరు- కలుసుకొని -హోలీ-జరుపుకోవాలోయి   
--((***))--





    నిరీక్షణ 
నింగిపై  మబ్బులు కమ్ము కొన్తున్నాయి  
చీకటి రాకాసి వెలుగును మింగేస్తున్నాది
తపన కోర్కలు నన్ను వెంబడిస్తున్నాయి 
కళ్ళవెలుగులతో నిన్ను చూడాలనున్నది

ఆధరాలు ఆతృతతో వణుకు తున్నాయి
మనసు నినుతలచి నిరీక్షించడం జరిగింది
నీమాటలు నన్నుగమ్మత్తు పరుస్తున్నాయి
వలపుతో కలసి జీవించాలని ఆశగాఉన్నది

నీ జ్ఞాపకాలు నా మనసును తొలుస్తున్నాయి
నీ ఎడబాటు నన్ను వేదనకు గురిచేస్తున్నది  
అట్టహాసం, ఆర్బాటం, అలంకారం,  లేదోయి 
నిస్వార్ధం తో నీ ప్రేమ పొందాలని ఉన్నది

ప్రేమ ముంగిట ఇక్కట్లు, చీకట్లు తప్పవోయి      
దారి లేని  నీకు తోడుగా ఉండాలని ఉన్నది 
ఎరుపెక్కిన కళ్ళతో చూస్తూ ఉండాలుందోయి
నీ మధుర స్మృతులు మనస్సు  తొలుస్తున్నది 

నిన్ను తలుస్తుంటే అదిక్షేపాలు ఎక్కువయ్యాయి
హృదయ చీకట్లలలొ ప్రేమను పంచాలని  ఉన్నది
ప్రపంచములో ప్రియసిగా  ఒక్కతినే మిగిలానోయి
ప్రేమ గెలుస్తుందని ఆ దేవుని అభయహస్తం ఉంది      

నిరీక్షనలోనే- ఉన్నది - నిజమైన -ప్రేమ = ఓర్పుతో - ఓదార్పు - కొరకు- వేచి - ఉండేదే  - ప్రేమ
--//*\\--



  పాప  బాల్యం

పాప ను చేతి స్పర్సతో జో కొట్టు 
పాపను చేతితో ఊపుతూ పట్టు 
పాపను ఊయలలొ పడుకోబెట్టు 
పసి పాప నిద్రలో ఈత కొట్టు  

గాలి సవ్వడి పరదా ప్రక్కకు నెట్టు
ఊయల ఊగుతూ గజ్జఘల్లన్నట్టు
ఉలిక్కిపడి చేతులతో కాళ్ళు పట్టు
బోసి నోరు పాప  కెవ్వు మన్నట్టు

దిష్టి తగలకుండా హనుమంతుని బిళ్ళ కట్టు
దిష్టి పూసను పాప  మొలలో గట్టిగా కట్టు
పాప నుదుట పెట్టె సింధూర తిలకం బొట్టు
బుగ్గన కాటుక పెట్టి జోలపాటలతో తల్లి జో జో కొట్టు

చనుబాలు కోసం పాప తాపత్రయ పడ్డట్టు
తల్లి పాల్లిల్లు అందించి పరవ సించి నట్టు
పాలు త్రాగుతూ పాప ఊంగా ఊంగా అన్నట్టు
జొలపాదూతూ పాపను తల్లి జో జో కొట్టు

ఇల్లంతా సంతోషాలతో పట్టు
ఆనంద కోలాహలంతో ఉన్నట్టు
బోసినవ్వును చూసి నవ్వినట్టు
నవ్వులతో సిరులు  పంచినట్టు

 బాల్యంలో- తోడు- ఉండేది- పరమాత్ముని- నీడ = యవ్వనంలో- తోడు - ఉండేది- పరమాత్ముని- ప్రేమ  
==[(*%*)]==

  హృదయ  తత్వం
ఎదుట ఉన్నవారే, సర్వస్వం అనుకో 
గడచినవి ఎవీ, నీకు గుర్తుకు రావు 
శత్రువుని, మిత్రుడుగా ఊహించుకో 
కమ్ముకున్న మబ్బు తెరలు, నీకు ఉండవు

మాయ నిన్ను వెంబడించిన దనుకో 
పరమాత్ముని లీలలని, నీవు ఊహించలేవు  
పాకుడు నేల మీద, జారి పడ్డవనుకో
మూత బడిన, కళ్ళు తెరుచు కోవు 

హృదయానికి ప్రేమ, శాస్వితమనుకో
జీవితం అంటే ఏమిటో తెలుసుకో గలవు 
కమ్ము కున్న ఆకర్షణలను వదిలించుకో 
నిశ్చల, నిర్మల, అక్షరుడవుతావు 

దుమ్ముతో, సుడిగాలి, వర్షించిందనుకో 
కడిగిన ముత్యంలా, మారుతావు 
కళ్ళెదుట హృదయ, దేవత ఉందనుకో 
హృదయంలో ప్రతిష్టించుకొని, పూజిస్తావు

జీవితము -ఒక- బొంగరమనుకో =  ఆడించి- నట్లు- ఆడుతావు
--((!!))--


                                                                                                                                             

ఎడారి ప్రేమ 

అంధ  కారంలో  జీవించమంటావు
ఆశలు చంపుకొని బ్రతకాలంటావు 
చచ్చిన పాములా ఉండమంటావు
కదలలేని ఎద్దులా బ్రతకాలంటావు 

నా   హృదయాన్ని  మర్దన చేసావు 
బీటలు  మారి  బీడుగా మార్చేసావు  
మంచులాఉన్న కరగోద్దంటున్నావు 
మాటలతో వడగాలి సృష్టిస్తున్నావు

నీ జాలి గుండెతో నన్ను ఎప్పుడు తరింప చేస్తావు
నా మీద నీవు ఎప్పుడు కరుణ రసం  కురిపిస్తావు
ఈ చీకట్ల ను తొలగించి వెలుగు ఎపుడు  తెస్తావు
ఈ ఎడారి ప్రేమకు నీవు దప్పికఎప్పుడుతీరుస్తావు 
 
ఎడారికి- వేడి- తోడు,- ప్రేమకు- మనిషి- తోడు,- పిల్లలకు-శునకం-తోడు,
                                                                           --[[{O }}]]--

                            

                                                                      కళ్ళు 
అంతర్జాలంలో కళ్ళు చిక్కుకొని  అంతర్ధానం  మైనాయి
ఆనందంగా ఆకళ్ళు ఆనందభాష్పాలు రాలుస్తున్నాయి
ప్రతి ఇంట్లో ఆకళ్ళు ప్రతి ఒక్కరిని ముచ్చటి పలకరిస్తాయి 
ఈశ్వరుని లీలగ ప్రపంచమంతా సంచారంచేస్తూ ఉంటాయి 

కొందరి కళ్ళు పూల పరిమళాలను విరజిమ్ముతాయి
కొందరి కళ్ళు ఆప్యాయత అనురాగం చూపు తాయి
కొందరి కళ్ళు ఖటిన పాషాణ గుండెను కరిగిస్తాయి 
కొందరి కళ్ళు  నవ్వులతో నవ్విస్తూ  ఏడిపిస్తాయి                                                    
కొందరి చూపుల్లో ప్రేమను క్రుమ్మరిస్తాయి
కొందరి చూపుల్లో ఆత్మీయత గుర్తుకొస్తాయి
కొందరి చూపుల్లో భయాలు కనబడతాయి
కొందరి చూపుల్లో ఆద్యాత్మికధారలు కురుస్తాయి 

కొన్ని చూపులు మరణాలకు  గురిచెస్తాయి 
కొన్ని చూపులు గరళాన్నిమింగింప చేస్తాయి
కొన్ని చూపుల్లో కుచిత కుతంత్రాలు కనబడతాయి
కొన్ని చూపులే కుటుంబ కలహాలకు దారితీస్తాయి

మూర్ఖమనస్సుతో చూస్తె, ఆకళ్ళే కనబడకుండా పోతాయి
కళ్ళ ముందున్నది తన్ని,  వెతికితే ఉన్న కళ్ళు పోతాయి
ఎదురుగా అధిక వెలుగు వస్తే, కళ్ళు మూయక తప్పదాయి   
కళ్ళ ముందున్న తల్లితండ్రులను పూజించుట కర్తవ్యమాయే
  
 కళ్ళనుబట్టి -మనస్సును- గ్రహించుట- కష్టం
 - చూపున్న- చూడలేని-మనుష్యులను- తెలుసుకోవటం- తేలిక      

  --::{[*]}::--
భారీగా పెరిగిన ప్రజాప్రతినిధుల జీతాలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకు సముచిత గౌరవాన్ని కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం వారి జీతాలను భారీగా పెంచింది. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాప్రతినిధుల వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటించారు. ప్రజాప్రతినిధుల గౌరవాన్ని పెంచడానికి వారి వేతనాలను పెంచుతున్నామని తెలిపారు. పెరిగిన జీతాలు ఏప్రిల్ 1నుంచి అమలులోకి రానున్నాయి. ప్రభుత్వం పెంచిన జీతాల వివరాలిలా ఉన్నాయి. 
జెడ్పీ చైర్మన్లకు నెలకు రూ.7,500 నుంచి రూ.1,00,000
జెడ్పీటీసీలకు రూ. 2,250 నుంచి రూ.10,000
ఎంపీపీలకు రూ.1500 నుంచి రూ.10,000
ఎంపీటీసీలకు రూ.750 నుంచి రూ.5,000
సర్పంచ్‌లకు రూ.1500 నుంచి రూ.5,000
మేయర్లకు రూ.14,000నుంచి నుంచి రూ.50,000
డిఫ్యూటీ మేయర్లకు రూ. 8,000 నుంచి 25,000
మున్సిపల్ కార్పోరేటర్లు రూ.4,000 నుంచి రూ.6,000
స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ చైర్మన్లకు రూ.10,000 నుంచి రూ.15,000
స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ డిఫ్యూటీ చైర్మన్లకు రూ.5,000 నుంచి రూ.7500
స్పెషల్ గ్రేడ్ కౌన్సిలర్లకు రూ.2,200 నుంచి రూ.3,500
ఇతర మున్సిపల్ చైర్మన్లకు రూ.8,000 నుంచి రూ.12,000
ఇతర వైస్ చైర్మన్లకు రూ.3200 నుంచి రూ.5,000
కౌన్సిలర్లకు రూ.1800 నుంచి రూ.2500 వరకు పెంచుతున్నట్టు ప్రకటించారు

 కవితలు ఎవరిని ఉద్దేసించి వ్రాసినవి కావు 
ఇట్లు తమవిదేయుడు 
మల్లాప్రగడ రామకృష్ణ