28, ఫిబ్రవరి 2017, మంగళవారం


ప్రాంజలి ప్రభ - సుందరకాండ (1)
మూలం : వాల్మీకి రామాయణము: (రచన మల్లాప్రగడ రామకృష్ణ)
అథ: సుందరకాండ ప్రారంబ: - ప్రధమ: సర్గ:
210 సంస్కృత  శ్లోకాల ఆధారముగా తెలుగు- వచస్సు   
O -- O -- O

హనుమంతుడు సముద్రమును లంఘించుట, మైనాకుడు అతనిని గౌరవించుట, సురసను హనుమంతుడు ఓడించుట, సింహికను వధించుట, దక్షిణ తటముచేరి అచట లంక శోభను చూచుట.
O -- O -- O

హనుమంతుడు  - సముద్ర లంఘన - ప్రయత్నము

జాంబ వంతుడు, వానరులందరు, కలసెను, సీతాన్వేషినిమిత్తం దక్షిణదిక్కు అంతా చూసెను
వానరరాజు, ఇచ్చిన సమయంలో సీతకొరకు వెతికెను, కానరాక దిగులుతో అందరూ ప్రాణార్పణం చేయ తలంచెను, అందరితో అంగదుడు, జటాయువును తలస్తూ విలపించ సాగెను, కార్యార్దమై జటాయువు భాత్రు సంపాతి అంగదుని కలిసెను.

సంపాతి దక్షిణదిక్కున లంకలో సీత రావణుని బందీలొ ఉందని చెప్పెను, సంపాతికి సీత జాడ తెలుపగా రెక్కలు వచ్చి వెళ్ళేను,

అందరు కలసి, సముద్ర వడ్డుకు చేరి సముద్రాన్ని దాట తలచెను, వానరులు సముద్రాన్ని దాటగల శక్తి గూర్చి తెలుపెను, అంగదుడు, జాంబవంతుడు సంశయములో పడెను, జాంబవంతుడు హనుమతుని శక్తిని తెలిసినవాడు, హనుమంతుని సకి హనుమంతునకు తెలియదు, ఎవరైనా గుర్తు చేస్తే, అమోఘ బల సంపన్నుడు, కార్య దీక్ష పరుడు, మనమందరము      
హనుమంతుని శక్తి గుణ గణాలను పొగుడుదాము, సీతా అన్వేషణకు సహకరిద్దాం

సముద్రాన్ని దాటుటకు అందరు  హనుమంతుని ప్రేరేపించెను

రామనామ జపంతో, హనుమంతుడు మహేంద్రగిరిపై ఉండెను, జాంబ వంతా దులందరూ కలసి హనుమంతుని పొగడెను, తనశక్తి తనకే తెలియక ప్రొత్సాహముతో  శక్తిని పెంచుకోనెను. 

చారులు సంచరించే మార్గానా సముద్రంపై పోవుట నిశ్చయించెను, పచ్చిక బీల్లపై ఉన్న హనుమంతుడు ఆకు పచ్చని వర్ణముతోను, పచ్చిక బీల్లపై ఉన్న నీటి బిందువులు వైడూర్య మణులవలె మెరుపులతోను, దూరముగా ఉన్న  జలము పై సూర్య కిరణాల ప్రభావ వెలుగులతోను
ధీరుడైన హనుమంతుడు మహేంద్రగిరిపై సీఘ్రముగా సంచరించెను

మహేంద్రగిరిపై చిత్రవర్ణములుగల ధాతువుల తోను, యక్షులు, కిన్నరులు, గంధర్వులు, దేవతా మూతృల తోను, స్వేచ్చ జీవులుగా సింహాలు, ఉత్తమ గజాల సంచారముల తోను
హనుమంతుడు మహ హృదములో ఐరావతం వలే ప్రకాశించెను

సకల విద్యలు నేర్పిన గురువు గారగు సూర్యనికి నమస్కరించెను, బాల్యంలో భాధపెట్టిన దేవతల రాజైన ఇంద్రునికి నమస్కరించెను, సకల సృష్టికర్త ఐన బ్రహ్మదేవునకు, సకల భూతములకు నమస్కరించెను.

మారుతి కడలిపై గగన సీమలొ ప్రయాణం చేయ తలంచెను

ప్రాంజలి ప్రభ - సుందరకాండ (2)సుందరకాండ ప్రధమ సర్గ - 2 వ భాగము

మారుతి తూర్పునకు తిరిగి తండ్రి ఐన వాయుదేవునకు నమస్కరించెను, దక్షణ దిక్కుకు తిరిగి వెళ్ళుటకు శిరస్సు పైకి ఎత్తి ఆబోతువలె ప్రకాశించెను, హనుమంతుడు పౌర్ణమినాడు సముద్రుడు పొంగినట్లుగా శరీరాన్ని పెంచెను, వానరులన్దరూ చూచుచుండగా రామకార్యము కొరకు ఆకాశమార్గమున ప్రయాణం చేసెను.

పాదాల కదలి కలకు చెట్లపై ఉన్న పక్షులు భయ పడెను, వక్షస్థల ఘాతముతో చెట్లు కూలి పోయెను. సింహం విజ్జ్రుమ్భించి నట్లు విజ్జ్రుమ్భించ గా మృగాలు మరణించెను, మద్యమ జ్వాలలతో కూడిన అగ్ని నుండి ధూమము బయలు దెరెను.

కొలుచుటకు శక్యము కానంత పెద్దదిగా శరీరమును పెంచెను, చేతులతోనూ, పాదములతోను, పర్వతమును గట్టిగా నొక్కెను, పర్వతము ఒక్కసారి ఊగగా చెట్లపైఉన్న పూవ్వులన్ని రాలెను, హనుమంతునిపై పుష్పాభిషేకమువల్ల పుష్పముల కొండవలె  ఉండేను.

పర్వతముపై మదించిన ఏనుగులు మదోదకమును కార్చు చుండెను, పర్వతముపై ఉన్న ప్రాణులన్నీ వికృతమైన స్వరముతో అరచు చుండెను, సమస్త వర్ణ శిలలమద్య అగ్ని పుట్టివర్ణ దూమములు వచ్చు చుండెను,
భూ ప్రకమ్పనల మద్య హనుమంతుడు బయలు దేరుటకు నిశ్చయించెను

తొకలపై స్వస్తిక్ చిహ్నములుగల సర్పములు నిలిచెను, విషము క్రక్కుచు దంతములతో శిలలను కరచెను
శిలలు అగ్నిజ్వాలకు దగ్ధమై వేయి ముక్కలై ఎగెరెను, గిరిపై ఓషధ చెట్లు ఉన్న, శాంతింప చేయలేక పోయెను
                                                                                 
                                                                                       ఇంకా ఉన్నది -3

ప్రాంజలి ప్రభ - సుందరకాండ ప్రధమ సర్గ - 3 వ భాగము

భూతాలు పర్వతమును బద్దలు చేయు చున్నాయని తలచెను, తినుచున్న లేహ్యములు, భక్ష్యములు, మాంసములు విడిచెను,  
 మునులు, యక్షులు,  విద్యాధరులు వారి స్త్రీలతో పైకే ఎగిరెను,
అణిమా సిద్దులుగల విద్యాధరులు హనుమంతునిచూసి ఆరాదించెను. 

మెడలో హారములతోను ,  పాదములకు అందెలతోను, భుజములకు దండ కడియములతో,చేతులకు కంకణములతోను, విద్యాదరస్త్రీలు ఆశ్చర్యపడుచు, భయముతో తమ ప్రియులతోను, విద్యాధరులు పర్వతముపై నిలిచి హనుమంతుని గూర్చి సంభాషించెను. శోభగల హనుమంతుడు భుజమును,  కంఠంను వంచెను,
తేజస్సును,వీర్యమును,బలమును, పెంచి ఊపిరి బిగపట్టెను,  
నేత్రములు పెకిఎత్తి, పాదములతో గిరిని అదిమి  పై ఎగెరెను,  
మహాబలశాలీ, వానర శ్రేష్టుడు చేతులను చేర్చి సముద్రముపై చేరెను.     

  మకరములకు నివాసమైన సముద్రమును దాట దలచెను,
పర్వతమువంటి శరీరముగల హనుమంతుడు ఒక్కసారి కదలెను,
రోమములు దులుపుకొని, మహా మేఘము వలె ఘర్జించెను,
రామునికోరకు, వానరులకోరకు సముద్రముపై లంఘించెను. 
 ఇంకా ఉన్నది ---4
ప్రాంజలి ప్రభ - సుందరకాండ ప్రధమ సర్గ - 4 వ భాగము
హనుమంతుని సముద్రలంఘనము
గగనమునుండి   దేవలోకమునకుపోయిఅక్కడ సీతనువెదికెదను 
కాన raa నిచో లంకకు పోయి రావణుని నగరముతోసహా తే గలగు తాను  
ఆకాశము నుండి వానర వీరులందరికి మారుతి అమృత మాటలు పల్కెను 
గమ్భీరముగా జెప్పుచూ నొక్క యూపు lo లొ సముద్రముపై కెగసెను  

 
అతని తొడల వేగమునుండి వచ్చిన గాలికి చెట్లువ్రేళ్ళతో సహా పైకి ఎగేరెను
దూరమునకు పోవు భందువులను పంపినట్లుగా కొంతదూరము పోయెను 
మరలి చెట్లు అన్ని సముద్రములో రెక్కలు తెగిన పర్వతముల వలే పడెను
మహ సముద్ర మంతా పగటి పూట నక్షత్రాలతో నిండిన ఆకాశంవలె ప్రకాశించెను

హనుమంతుని రెండు బాహువులు పాము పడగలువలే కనిపించెను 
అతని రెండు నేత్రములు పర్వతముపై రెండు అగ్నిజ్వాల లవలే  ప్రకాశించెను 
   అతని వాలము ఇంద్ర ద్వజము వలే ధగ ధగ మెరుయు చుండెను
అతని ముఖము సంద్యారాగముతో కూడిన సూర్యబింబమువలె నుండెను

హనుమంతుని  ఎఱ్ఱనైన పిరుదులు బ్రద్దలైన ధాతుశిలలవలె నుండెను
అతని జంకల నుండి వచ్చేవాయువు మేఘము యురుము వలె నుండెను 
ఉత్తరము నుండి దక్షణ దిక్కు వైపు పోవు ఉల్క వలే ప్రయాణించు చుండెను   
 రామభాణము ఎంత వేగముగా పోవునో అంతే వేగముగా పోచుండెను
---5

ప్రాంజలి ప్రభ - సుందరకాండ ప్రధమ సర్గ - 5 వ భాగము

 
హనుమంతుడు  త్రాడును తెంచుకొని పరుగెడుతున్న ఎనుగువలె నుండెను,
అతని ముఖము చుట్టు తోక ఉండగా సూర్యునివలె ప్రకాశించు చుండెను,
 అతని నీడ సముద్రము పై పడి ఒక పెద్ద నౌక వలె కనబడు చుండెను,
వక్షస్తలమునుండి వెడలిన గాలిచే కెరటములు రెండంతలు ఎగసి పడు చుండెను. 

 ఉత్తరమునుండే వచ్చే వాయువు హనుమంతునికి ఎగురుటకు  తోడ్పడెను, 

 తాకాలని కేరటములు పైకి ఎగిరి పెద్ద గుంటగా ఏర్పడి పైకి ఎగురు చుండెను,
భూమి యందు ఉన్నసముద్రమును మారుతి త్రాగుచున్నట్లుగా కన బడెను,
హనుమంతుడు ఆకాశమున తలపైకి ఎత్తిన ఆకాశాన్ని  మ్రింగి నట్లుండెను. 

 ఆధారము లేకుండ  రెక్కల పర్వతమువలె హనుమంతుడు ప్రకాశించు చుండెను,
మేఘ పంక్తులలోకి పోవుచూ బయటకు వచ్చుచూ గరుత్మంతుడివలె ఉండెను,
ఎరుపు,నలుపు,తెలుపు,పచ్చ, మేఘాలల్లో హనుమంతుడు ముచ్చటగా నుండెను,
హనుమంతున్ని చూసిన ఋషీశ్వరులు, దేవతలు, గంధర్వులు పరాక్రమమును  ప్రశంసించెను. 

కొండంత ఎత్తుగా లేచుచున్న సముద్ర తరంగములను వక్షస్థలముతో 'డి' కొని ఎగేరెను,  
 హనుమంతుని తో వచ్చే గాలి, మేఘముల గాలి, సముద్రపు గాలి కలసి భీకరశబ్దముగా వినబడెను,
సముద్రములో ఉన్న తరంగాలన్ని భూమి ఆకాశాన్ని తాకు చున్నట్లుగా ఉండెను,
ఎగసిపడుతున్న సముద్ర తరంగాలను లెక్క పెట్టు చున్నాడా అన్నట్లు దాటు చుండెను. 
----6
మింగళములు, మొసళ్ళు, వస్త్ర విహీనులయన మనుష్యుల్లా  ఉండెను సర్పములు హనుమంతుని చూసి గరుత్మంతుడని భావించి భయ పడెను 
హనుమంతుడు ఆకాశములో మేఘముల కన్న ముందుకు పోవు చుండెను
మేఘాలచే కప్పబడుచు బయాకువచ్చు చూ ఉండే చంద్రుడిలా ప్రకాశించు  చుండెను


 అతని నీడ సముద్రము మీద పది యోజనాలతో విస్తీర్ణముగను 
ముప్పది యోజనాల పొడవుతో ఉండెను
 దేవా దాన గంద్రర్వులు పుష్ప వృష్టిని కురిపించెను 
హనుమంతుని చూసి దేవగణాలన్ని పరమా నందమును పొందెను   
రామకార్యార్ధమై  వేడలుచున్న హనుమంతునకు సూర్యుడు తపించ కుండెను  
తండ్రియగు వాయుదేవుడు సువాసన కలిగిన  చల్లని గాలిని  వీచు చుండెను
సముద్రుడు హనుమంతునకు సహాయ పడనిచో అందరు నన్ను నిందించెదరని తలపోసేను
హనుమంతునకు సముద్రుడు శక్తి కొలది సాయపడి కృతజ్ఞతను తెలపా లనుకొనెను
.......7
ప్రాంజలి ప్రభ - సుందరకాండ ప్రధమ సర్గ - 7 వ భాగmu
హనుమంతుడు కొంత సమయం అలసట తీర్చుకొనుటకును 
రామకార్య కోసం పోతున్న హనుమంతునకు అల్పాహారం ఇచ్చుటకును 
సముద్రుడు  కర్తవ్యంగా భావించి సహాయము చేయుటకును 
 మైనాకున్ని మారుతికి సహాయం చేయమని సముద్రుడు కోరెను 

 
మైనాకా హనుమంతుడు సీతాన్వేషణ కొరకు  సముద్రముపై పోవు చుండెను 
 ఇక్ష్వాకు వంశీయులన్న  అందులో రాముడు నాకు పూజ్యులును 
పాతాలద్వారమువద్ద ఉన్న నీవు పైకి లేచి హనుమంతునకు సహాయ పడుమనెను 
త్రిలోక పూజ్జ్యుడైన హనుమంతునికి ఆతిధ్యం ఇవ్వటం మనిద్దరి కర్తవ్యం అనిపల్కెను 
 
  మైనాకా  పూర్తిగా అన్ని దిక్కులు ఎగరగల సామర్ద్యం ఉన్నావును 
వానర శ్రేష్టుడైన హనుమంతునికి సహాయము చేయమనికోరెను 
శ్రీరాముని ధార్మికత్వమును, స్తీతాదేవి  యోక్క పాతివ్రత్యమును 
పవన పుత్రుని యోక్క కార్య దక్షతను తలచుకొని పైకి లెమ్మనెను 
-----8

ప్రాంజలి ప్రభ - సుందరకాండ ప్రధమ సర్గ - 8 వ భాగmu సూర్యుడు  మేఘములను చీల్చుకొని వెలుగును యిచ్చినట్లును 
సముద్రము చీల్చుకొని బంగారు మైనాక శిఖరము పైకి వచ్చెను 
వృక్ష లతా గుల్మములతో నిండిన మధురఫలాలున్న శిఖరమయ్యేను 
నల్లనైన ఆకాశము మైనాక పర్వతము వల్ల ఎర్రగా మారిపోయేను 

హనుమంతుడు పర్వతము అడ్డురావడం విఘ్నమని భావించెను 
వేగమును రెట్టిమ్పుచేసి హృదయముతో పర్వతమును గట్టిగా కొట్టెను 
పర్వతము ప్రక్కకువరగగా  మైనాకుడు హనుమంతుని శక్తిని పొగడెను
వానరొత్తమా పర్వతముపై విశ్రాంతి తీసుకొని ఫలాలు భుజించి వెల్ల మని కోరెను 

 మైనాకుడు హనుమంతునితో వినమ్రతతో విన్నవించు చు న్నాను 
నీకు ఆతిద్య మివ్వాలని తలంచి నేను, సముద్రుడు కలసి ప్రార్దిమ్చుతున్నాను 
నేను నీకు పినతండ్రిని కృత యుగంలో జరిగిన సంఘటనను తెలిపెదను  

పూర్వము పర్వతములకు రెక్కలు ఉండేవి, మీదపడతాయని ఋషులు భయపడెను
దేవతలరాజగు ఇంద్రుడిని ఋషులు,  పర్వతముల నుండి రక్షించ 
మనెను
ఇంద్రుడు వజ్రాయుధముతొ పర్వతముల రెక్కలను నరుకు చుండెను 
అప్పుడే నీ తండ్రి వజ్రాయుదానికి గురికాకుండా సముద్రములోనన్ను   పడ వేసెను
...9
ఆ విశ్వాసమును పురస్కరించుకొని నేను నీకు ఆతిద్యమిస్తున్నాను
నీ తండ్రి ఋణము, సముద్రుని కోరిక నీ మూలముగా తీర్చగలుగు తున్నాను 
కావున కొంత తడువు నాపై విశ్రాంతి తీసుకొని వేల్లగలవని కోరు చున్నాను
నా యందలి కంద మూల ఫలాదులు నారగించి కార్యమును సాధించ మనెను 

దేవతలలో ప్రధానుడైన వాయుదేవుని కుమారుడవును 
వేగము, బలము, బుద్ధి మొదలగు గుణములున్న వాడవును 
  నీవు ధర్మమను కాపాడుటకు నిగ్రహ సమర్దుడవును 
నమ్మినవారికి మన:శాంతిని కల్పించిన మహాను భావుడవును

నీ తండ్రి నాకు చేసిన మహోపకారానికి బ్రత్యుపకారముగాను 
  ఈ నారేక్కలును నీతండ్రి కాపాడినాడు, నీతండ్రిఅంతవాడవును 
కావున మహాత్మా సముద్రునకు, నాకు సంతోషము కల్గించమనెను  
మారుతి మైనాకునితో మిత్రమా నీ మధుర వినయ భాషలకు సంతోష పడితిననెను     

    నీ యాదరాభిమానము పొందలేదని చింతవలదనెను 
ప్రత్యేకముగా ఇంకావేరుగా నాకాతిద్యముతో పనిలేదనెను
 ఆతిద్యమిచ్చినట్లుగా భావిస్తున్నాను, నేను లంకకు పోవలెను 
నేను ప్రతిజ్ఞ చెసి ఉన్నాను కావున నేమాత్రమును నేనాగ రాదనెను 


పర్వతమును తాకి హనుమంతుడు వేగముగా పైకి ఎగిరెను 
హనుమంతుని చూసి సముద్రుడు మైనాకుడు శుభాశీర్వాదములు నొసగెను
దుష్కరమైన యా పనిని జూచి సర్వ దేవతా గణములు సంతోషించెను
దేవేంద్రుడు గొప్ప ఆనందముతో మైనాకుని జూచి మెచ్చుకొనెను

దేవేంద్రుడు పలికే
హిరణ్యనాభ నీవు చేసిన పనికి చాలాసంతోషించితిని  నేను
నావలన నీకపకీర్తి జరుగదు, నీవు స్వేచ్చగా తిరగ వచ్చును 
హనుమంతునకు సహాయ పడిన వాడవై నా భయమును తీర్చినవాడవును 
రామ కార్యార్ది యైన వానర సహాయమునకు నే నభయ మిచ్చు చున్నాను 

   
 సురస  హనుమంతుని బరీక్షించ బొవుట  

నాగమాత అను సురసను  దేవతలు కలసి మాట్లాడెను 
నీవు ఒక్క క్షణకాలం హనుమంతుని విఘ్నం కలిగించమనెను 
నిన్ను జయించి ప్రయాణముసాగించునో, భయముతో వేనుతిరుగునో చూడాలనుకున్నామనెను 
 ఆమాటలకు సురస నేను క్షణకాలం ఆపుతానని దేవతలకు మాట ఇచ్చెను 

సురస రాక్షస రూపం ధరించి పెద్ద నోరు తెరిచి హనుమంతునకు అడ్డముగాను 
నిల్చొని ఓ వానరా నీవు నాకు  ఆహారముగా దేవతలు నాకు అవకాసం ఇచ్చెను 
నీవు నా నోటిలో ప్రవేశించి నా ఆకలి తీర్చి, దేవతలకోర్కను తీర్చమనెను 
ఆంజనేయుడు సురస మాటలకు యుత్చాహముగా చెప్పే ఈ విధముగా
అనెను 
 అమ్మా " ఒట్టు పెట్టుకొని చెపుతున్నాను "  నేను రామ కార్యార్ధమై  లంకకు పోవుచున్నాను, 
మాతా అయోధ్యాధిపతి యైన ధశరధ మహారాజు కుమారుడు శ్రీరాముడు  ప్రతిజ్ఞాపరిపాలకుడై  లక్ష్మణుని తోడను,
 భార్య యైన  సీతాదేవి తోడను దండ కారణ్యములలొ బ్రవేసించెను,
  ఆ శ్రీరాముడు ధర్మభద్దుడై రాక్షసులతో భద్ధ వైరము గల వాడగుటచే  రావణుడు రామలక్షణులు లేని సమయమున సీతను నపహరించెను . 

నేను రామాజ్ఞచే సీతాన్వేషణ తత్పరుడు నై లంకకు బోవుచున్నాను, సీతాదేవి యొక్క క్షేమవార్తను దెలిసి కొని రామునకు జెప్పి మరలవచ్చి నీ నోటిలొ బ్రవేసించెదును. 
దయతో నన్నిప్పటికి  విడువుము.నమస్కరిస్తూ చెపుతున్నాను, అనివేడు కొనగా ఆ మాటలు విని యా సురస యిట్లు అనెను .

ఆమాటలకు ఓయీ హనుమంతా నా కడ్డమైన వానిని తినమని బ్రహ్మవరము దానిని నేనతిక్రమించలేను, 
నీకు శక్తి యున్నచో నానోటిలో ప్రవేశించి పొమ్మనెను 
ఒ సురసా నేను పట్టేంత నోరు తెరువుము, శరీరమును పదియోజనాలు పెంచెను 
   సురసకన్న హనుమంతుడు పెరగగా నూరుయొజనాల  వరకు  పెంచేవిధముగా హనుమంతుడు శ్రీరమును పెంచెను 
క్షణంలో అంగుళ రూపంగా మారి సురస నోటిలో దూకి అంతే  వేగముగా బయటకు వచ్చెను. 

హనుమంతుడు సురస నోటిలోనుంచి రాహుముఖము నుండి చెంద్రుడు వచ్చినట్లు వచ్చెను 
సురస నిజరూపముతొ నాయనా, నీవు సుఖముగా వెళ్లి శుభముగా రమ్ము, నీకు కార్య సిద్దగును 
లంకాసౌధముచూసి, నాశనముచేసి, సీతా దేవిని శ్రీరామునితొ గలిపి సిద్ధుడవగు మనెను
హనుమంతుడు సర్వ భూతములు బ్రశంసింపగా గగనంలో వేగముగా పోవు చుండెను  
హనుమంతుడు - సింహికను జంపుట
ఆకాశమునందు పక్షులు, కైశికాచార్యులు,హంసలు సంచరించు చుండెను 
సింహములుమీద, పెద్దపులులుమీద, ఐరావతములు మీద దేవతామూర్తులు సంచరించుచుడెను    
సర్పములు లాగా అనేక విమానాలు మహావేగాముతో ప్రక్కన సంచరించు చుండెను 
ఆకాశములో అగ్ని గోళాలు డీ కొన్న శబ్ధాల్లో  హనుమంతుడు పయనించెను 

 దేవతలకోరకు హవిస్సులను మోసుకొని పోవుచున్న అగ్ని కనబడు చుండెను
గ్రహములు, అశ్విన్వాది నక్షత్రములు, సూర్యుడు, తారాగణములు ప్రకాశించు చుండెను
మహర్షిగానములతోను, గంధర్వులతోను, నాగులతోను, యక్షులతోను నిండి ఉండెను 
హనుమంతుడు ఆకాశములో సంచరిస్తున్నప్పుడు ఆకాశము చాందినీ గుడ్డవలె నుండెను

ఆకాశమర్గములొ పోవుచున్న హనుమంతుడిని సింహిక చూసెను 
చాలాకాలము తర్వాత మంచి భోజనము దొరికిందని ఆనందించెను 
సింహిక అనే రాక్షసి ఆలోచించి హనుమంతుని నీడను ఆకర్షించెను
హనుమంతుని వేగము ఎదురుగాలికి ఓడ ఆగినట్లు తగ్గి పోయెను

హనుమంతుడు తలవంచి క్రిందకు చూడగా సముద్రముపై పెద్ద జంతువును చూసెను
నీడను చూచి ఆకర్షించే జంతువు సుగ్రీవుడు  చెప్పిన సింహిక ఇదే ననుకొనెను
సింహికను చూసి హనుమంతుడు తన శరీరమును వర్షాకాలమునందు మేఘము వలె పెంచెను
సింహిక కుడా శరీరమును పెంచి  పెద్దగా పెద్దగా గర్జించి హనుమంతుని వైపు పరుగెత్తెనుహనుమంతుడు  సింహిక యొక్క శరీరములొ ఉన్న మర్మస్తానములను చూసెను 
వజ్రమువంటి దేహముగల హనుమంతుడు శరీరము చిన్నది చేసి అమె నోటిలోకి దూకెను 
పౌర్ణమియందు రాహువుచే మ్రింగ బడుచున్న చంద్రుడు వలే ఉండెను
హనుమంతుడు ఆమె ముఖములో పడగా సిద్ధిలు, చారుణులు  భయపడెను

హనుమంతుడు వాడి ఐన  గోళ్ళతో మర్మస్తానములను చీల్చివెసెను 
తక్షణమే మనోవేగాములో సమాణవేగాముతో ఆకాశం పై కి ఎగిరెను 
సిద్ధులు పల్కెను హనుమంతుడు ఉపాయముగా ధైర్యముగా సింహికను చంపెను
సిద్ధులు, గంధర్వులు నీకిష్టమైనా పనిని మంగళ ప్రదం అగుగాక  అని దీవించెను

"ఓ వానరోత్తమ నీకు ఉన్నట్లు ఎవనికి  ' ధైర్యము, సూక్ష్మద్రుష్టి, బుద్ధి, నేర్పు అను నాలుగు లక్షణాలు ఎవరకి ఉండునో వారు ఎ కార్యము చేయ వలసి వచ్చిన వైఫల్యము ' మనస్సు ప్రశాంతముగా ఉంటుందని సిద్ధులు, గంధర్వులు పలికెను

హనుమంతుడు ఆవలి ఒడ్డు  సమీపించి అక్కడ ఉన్న వృక్ష పంక్తిని చూసెను
వృక్షములతో ఉన్న ద్వీపమును, పర్వతప్రాంతము నందలి వనములు చూచెను 
సముద్రమును, తీరము నందలి జల ప్రాయ  ప్రదేశములను, నదులను చూసెను 
మేఘమువలె ఉన్నతనశరీరమును చూసి అందరు కుతూహల పడుదురని అనుకొనెను

పూర్వము త్రివిక్రముడే వామనుడుగామారి బలిచక్రవర్తిని అనగత్రొక్కెను
నేను నా రూపమును ఉపసంహరించుకొని సహజ రూపను మారెదను
 యజ్ఞానమువల్ల కలిగిన మోహము వీడి జ్ఞాని వలే ప్రవర్తిమ్చవలెను 
హనుమంతుడు అక్కడ నుండి త్రికూట పర్వతముపై ఉన్న లంకా పురమును జూచెను  

సర్వవస్తు సంమృద్దముగా, విచిత్రమైన రంగులు కలిగి ఉండెను 
మొగలి డొంకలు, విరిగిచేట్లు కలిగి, ఎత్తైన కొబ్బరి చేట్లుకలిగి 
ఉండెను
 ధగ ధగ మెరుస్తూ ఆకాశమును తాకుతున్న భవనాలు కలిగి
ఉండెను
ఉన్న లంకాపురమును లంబ పర్వతముపై నుంచి చూసెను 

హనుమంతుడు పెద్ద పెద్ద తరంగముల పంక్తులతో నిండినదియును 
దానవులకు, పన్నాగులకు నివాసమైనది యును, చుట్టూ సముద్రము, రక్షణ కవచముగా ఉన్నదియును,అగు లంకాపట్టనము హనుమంతునకు అమరావతి నగరమా అనిపించెను
25, ఫిబ్రవరి 2017, శనివారం

శుభోదయ పద్యాలు

 ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
https://scontent.fblr3-1.fna.fbcdn.net/v/t34.0-0/p280x280/16924100_716058545238306_1736053662_n.gif?oh=40259ff5cba004fd2a12319fef2d8028&oe=58B356D4
ఓం శ్రీ గణేశాయనమ:

శా:: నీవేనా మదిలో తలంచి కొలిచా శ్రీమాత విఘ్నాల రా
      జా నీవే సహనం సహాయ పడుటే నీ నిత్య లక్ష్యమ్ము గా
       నీవే వేద విధాతగా కొలవగా ప్రత్యక్ష సద్బోధ లే 
       నీవే దిక్కు మమా మదీయ పలుకే కర్తవ్య భావాలుగా   


శుభోదయ పద్యాలు (1)

శా :: బ్రహ్మాండాన్ని ఒకే మనస్సు తెలిపే భాంధవ్య భావార్ధ సం
        దేహాన్నంత ఒకే తపస్సు మెరుపే సౌందర్య సౌభాగ్య పం
        చే హృద్భోదనలే వయస్సు మురిపంచే మాననీ లక్ష్య మే
        దేహాంతం వరకూ సహాయ పరుడే ఉత్తేజ ఓంకారుడే   

శుభోదయ పద్యాలు (2)

శా :: మాతామానసమే సద్బుద్ధి జననం సర్వాంత విస్తారమే
        మాతా తత్వములే మనో గుణములే విస్వాంత  విస్తారమే
        మాతా భోధలుయే సువిద్య విధిగా జన్మాంత విస్తారమే
        మాతా శక్తులు యే ప్రపంచ వెలుగూ మర్గాల విస్తారమే 

శుభోదయ పద్యాలు (3)

శా :: ఆశా పాశముకే నవ భావములే తాకట్టు పెడ్తావు రా
        విశ్వాసం మరచీ భయాన్ని తలచీ ప్రేమించ కుంటావురా
        ఐశ్వర్యం కొరకే నిజాన్ని మరచీ తప్పుల్లే చేస్తావురా
        ప్రశంశే గుణమూ  మనస్సు మమతే భాధ్యతె భావించు రా       

శుభోదయ పద్యాలు (4)

 శా ;; మాయా మర్మమునే జయించి మనసే స్వశ్చత భావాలుగా
          సైయ్యాటే అనుటే ఉద్రిక్త సమరం స్వేశ్చాసుఖానందమే
         ప్రాయంలో తలపే వయస్సు ఉరకే సంతోష రాగాలు గా
         ధ్యేయంతో తరుణం సమంజ సముగా సంధించి జీవించుటే

శుభోదయ పద్యాలు (5)

శా :: సీతాకోక వలే మృదుత్వ  కుసుమా సౌందర్య ఆకర్ష నే
        ఆత్రంతో అడుగే అనర్ధ మగుటే  అర్ధాంత రాకర్ష నే
        ఆత్మీయం వలనా శుఘంధ మెరుపే ఆనంద మాధుర్య మే
        సాత్వికం వలనా సద్బుద్ధి మనసే సందర్భ సౌఖ్యాలు లే

శుభోదయ పద్యాలు (6)

శా ::అంతా సంశయమే శరీర ఘటనంబంతా విచారంబె లో
       నంతా దు:ఖపరం పరాన్వితమె మేనంతా భయభ్రాంతమే
       ఆంతా నంత శరీర శోషణ మెదుర్వ్యా పారమే దేహికిన్
       చింతామార్గమునే తపించి నలిగీ పొందేను ప్రేమమ్మునన్

 
శుభోదయ పద్యాలు (7)

శా :: నిన్ను నమ్మినరీతి నమ్మనొరులన్ నీకన్న నా కెన్న లే
        రన్నల్ దమ్ములు తల్లీ దండ్రులు గురుండాపత్సహాయుండు, ఆ
        వెన్నెల్ నన్ను సదా వేధించె తనువే నీకోస ప్రత్యేక మే
       ఎన్నేన్నో కతలే మనం వొ టొకటే ప్రేమమ్ము మార్గమ్ము గా

శుభోదయ పద్యాలు (8)

శా ::నీతోడూ కొరకే నెనింత పలికే నీప్రేమ పొందేందు కే 
       నీతోనే దరహా సమాడ దలిచా ప్రేమమ్ము పంచేందు కే
       పంతాలే మరచీ సువిద్య  మనసే మార్చక పొందాను లే
       బ్రాంతిన్ జెం దకయే వినోద పర మార్ధం బె భందాని కిన్

శుభోదయ పద్యాలు (9)

శా ::సంస్కారం మనలో తరంగ మువలే జీవించి ఉత్తేజ మే
       సంస్కృతా మృతమే మనస్సు పలుకే నిత్యా విధానాలుగా
       మస్తిష్కా మమతే సమన్వ యమునే ఆదర్శ భావాలుగా     
        సుసౌఖ్యం భువిలో నిరంత రముగా వెంటాడి వేధించునే


శుభోదయ పద్యాలు (10) 

శా :: చెప్పేదేమిటి ? రోతలేటివి ? మనో రోగస్తుండై.దేహియే
        చెప్పిందేమిటి ? పూతలేటివి? మదో పూతంబు లే దేహముల్
        చూపిం దేమిటి ? చూడలేనివి ? సదా మౌనం గ్రహించెందు కే       
        చెప్పాలేనిది ? చూపలేనిది ? యదా దాగుండె ప్రేమా మృ తం

శుభోదయ పద్యాలు (11 )

శా:: ఆలున్ బిడ్డలు దల్లి తండ్రులు ధనం బంచు న్మహాబంధనం
       కల్లోళం తలపే ప్రియంగ విధియే సోదించి సాధించుటే
       తల్లీ తండ్రి మనల్ని పెంచు తరుణం ఏంతో మనో ధైర్య మే
       ఆలోచన్నె నిజం చేసేందుకు మనం చిక్కాలి భందాని కే

శుభోదయ పద్యాలు (12 )

శా:: స్త్రీ సౌఖ్యం మద నాంత రంగములలో ఉత్తేజ పొందేందు కే
       కాసంతై  తరుణాన్ని బట్టి పలుకే జీవించు మార్గమ్ము కే
       వీసంభై చిరకాల వాంఛ కరుణా వాశ్చల్య పంచేందు కే
       దోసంబుల్ చెయకా మంచిని మదిలో ఊహించి ప్రేమించు టే

శుభోదయ పద్యాలు (13 )      

శా:: భావా నందముతో కవిత్వ మదియున్ సంభాషణాలే త
       న్నే వైద్యుo డు చికిత్య విద్య కధలే పాఠాలుగా చెప్పె స
       త్యా వాదే గురువూ సమాన అభిమానం చూపే శాంతోషమే
       సేవా తత్పరమే మనో నిబ్బరమే విద్యార్ది  బోధామృతం

శుభోదయ పద్యాలు (14)

శా:: సందేహం వలదే భరించె మనసే మానంకు ఉన్నాది లే 
       ఈదేహం మగువా సమత్వ మమతా సామాన్య ప్రేమా కదా
       మాందవ్యామ్ తలపే మనస్సు మఖిలం మానాభిమానం కదా 
       సద్బోదా సక్రమం సమంత పిలుపే సంతృప్తి కల్పించె లే

శుభోదయ పద్యాలు (15)

శా :: కన్నూఆ శయమే సమన్వ యముగా చేయాలనే ఆశతో
        నన్నూ వేదనతో తపించె విధమే కర్తవ్య భావాల తో 
        తన్మాత్రా తనువే వేదించు నయనం కల్లోలమే చేయుటే 
        ఉన్మాదీ మలుపే వితండ నయనం ప్రపంచ హాహాకరం


శుభోదయ పద్యాలు (16)

శా :: నీ నా సందొడబాటు మాట వినుమా దానాలు చేసేందు కే
        మానాన్నా మదిలో  సుదా మధురమే నన్నింత వాడిన్నిచే
        సే, నా తల్లికి సంత తంబు మదివేడ్కం గొల్తు నీవున్ సహా

         యాన్నీచేయవలే సదుద్దె శమునే చెప్పెందుకే పిల్చెనే 


శుభోదయ పద్యాలు (17)

శా :: జ్ఞానంతో తనువే విశ్రాంతి సముదాయం చేరి ఉండుట, అ
        జ్ఞానంతో ఎవరూ నిజాన్ని తెలిపే సంఘాన్ని గుర్తింప లే
        కున్నారే, మనసే గ్రహించ లేకయే గాడాoధ  కారంతొ నే
        యున్నారే, వెలుగే శరీర తలపే చింతావిచారం బు లే

శుభోదయ పద్యాలు (18)*

శా:: మత్తుల్లో మనిషీ ఎలాంటి సలహా పాటించకేచిక్కి, వో
       వత్తిళ్లే వనితా సుఖాల వదనామృతం కొరే వ్యక్తి , వో
       గుత్తాధీ నుడుగా నరాలు కుదిపే లక్ష్యాలనే చూపి వో
       సత్యాన్ని మరచీ చలించు మనసే మౌనాన్ని చుట్టే కదా

శుభోదయ పద్యాలు (19)


శా:: శ్రీవిద్యుత్కలితా జనంజనమహా ప్రాబల్య సౌభాగ్యమే
       శ్రీవిద్యా జనితా సుదీర్ఘ కలలే స్త్రీ సౌఖ్య సౌభాగ్య భో
       ధావిర్భావమునే వచించి మదినే శాంతింప చేయున్ కదా
       శ్రావ్యానం దముయే సుఖాల తరుణం నిత్యావసారా నిధే     

శుభోదయ పద్యాలు (20)

శా::ప్రాయంబే మనకూ అనేక కలలే కష్టాలు ఓదార్పు లే
      వ్యయం తప్పదులే వయస్సు మలుపే వాంఛాఫలం దక్కుటే
      మాయా జాండమనల్నిమంచి చెడులే జీవత్వ నిస్వార్ధతే
      ధైయంగా మననమ్మకాన్ని ఒక్కటే భావ్యం గ జీవించుటే          

శుభోదయ పద్యాలు (21)
 
శా:: నీపేరుణ్ నినునే తలంచి మనసే అర్పించి నీ చుట్టు నే
       ఒప్పింపా తలపూ వివేక మునందు ఉంచాను పట్టించు కో
       ఈ పేదన్ విడిచీ ధనంవ లననే  ప్రపంచ చూసావు లే
       నాప్రేమమ్ము ననే నువుమర్చి ననూ నీకోస మేనే నులే

శుభోదయ పద్యాలు (22)

శా:: ఘంటారా వములే ప్రసాద పిలుపే నైవేద్య సంకల్పమే
      ఇంటింటా ఉపకా రసేవ తలపే నిత్యాన్న భావాలులే
      చిట్కాలే మన ఆశయాల్కి నవనీతంగా ఉపాయాలుగా
      తంటాలే వయసొచ్చినంత వెలుగే ప్రేమాభ్యు భావాలతో

శుభోదయ పద్యాలు (23)

శా:: పంతంతో కదిలే మనస్సు నిలిపే ధ్యేయంగ ఉండాలిగా
      కాంతిన్ పంచితినీ ప్రధాన నళినీ తొల్గించె రేతస్సు గా
      సంతోషిమ్ చితినీ వివేక తరుణం ధర్మాన్ని రక్షించె గా
      శాంతిన్ బొందితినీ క్రమంగ సహనం కల్పించే మార్గం ఎగా       

శుభోదయ పద్యాలు (24)


శా::నిప్పేలే తనువే తపించే పలుకే సందర్భ బంధాలుగా
      తెప్పించే సిరినే అనేది నటనే అన్యాయ భావమ్ముగా
      ఒప్పించే తెలివే అనునిత్యమునే ఉండాలి సామాన్యగా
      చెప్పంగా మదిలో మంచిని నిలిపే తన్మాత్ర ఉత్సాహమే
     

శుభోదయ పద్యాలు (25)

శా:: విద్యుత్ ధర్మమునే స్వధర్మముగా ఉత్సాహ సంకల్పమే
       విద్యుత్ తత్వమునే సమాజ సహకార నిత్య ఉత్సాహమే
       సద్భోధా విధమే మనందరికి దివ్యా మాన సోల్లాసమే
       సద్బోదా సక్రమం సుఖాల పిలుపే సంతృప్తి కల్పించె లే

శుభోదయ పద్యాలు (26)

శా:: తోడేలేని మనస్సు ఊరటను పొందీ సంతసమ్మూ కదే             
       ఆడే ఆటలలో నిజాయి తిశ్రమే కాంక్షించే ఆటే కదా
       పాడే పాటలలో ఒహద్దు నయనాల్లో చూపు సంగీతమే
       తాడేలే అనియూ సుసర్పముననే పట్టేందు కష్టాలులే  


    

22, ఫిబ్రవరి 2017, బుధవారం

Internet Telugu Magaine for the month of 2/2017/56


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

*ప్రేమికుల రోజు
రచన: మల్లాప్రగడ రామకృష్ణ

పంచశరు బారికి చిక్కితి నీకు దక్కితి
ధ్యానము నిల్వదాయె
మది దారుణ కోరికలు తొందరించె
మనసు మనసు ఏకము
కొరకు మది పులకిచె
మరువలేని  బంధం మన మమేకం
నీ యందు నాచిత్తము
ఆనవరతము నిచ్చియున్నది
నీ యానా బిడియం లేదు
కన్నె వలపు పిలుపుకు
తడవని మగధీరుడు ఎవరు
మహిలో ఉండలేరు
ఉండినా మానవుల మధ్య
జీవనం గడప లేరు
అండగా మదను డుండగా
తన విరి సరములకు పదునుండగా
మగమహారాజును ముగ్గులో 
లాగు ధెర్యము మగువకు ఉండగా
మదన సౌందర్యము ఆస్వాదించని
వారెవరో తెలుపగలరా
వలపు పిలుపు - మది తలపు
నది ఉరవడి - కడలి నురుగు
గాలి ఆకు రాలు - సొగసు చిరుజి మరుగు

కొత్త కోరిక కలుగు
- హృదయతాపము చల్లార్చు
వలపును ప్రేమగా మలచు కుంటే
భవిషత్తు మరియు భద్రం
ప్రేమికులరోజు తొందరపడితే అనర్ధం

సర్వస్తరతు దుర్గాణి - సర్వో భద్రాణి పస్యతు
సర్వ కామానవాప్నోతు - సర్వ సర్వత్ర నందతు            

అందరి ఇక్కట్లు  అన్నీ తొలగాలి
అందరికీ శుభం కలగాలి
అందరి ఆశలూ నెఱవేరాలి
అందరూ సంతోషముగా ఉండాలి

ప్రతి ఒక్కరికి ప్రేమికుల రోజున
సర్వం సుఖ జీవనం సర్వోన్నతి  
ఇదే ప్రాంజలి ప్రభ శుభాకాంక్షలు
--((*))--

* ఓ దేవుడా

గుండెకు తోడుగా ఊరట నిచ్చావు
ఎండకు నీడగా  తరువు నిచ్చావు
మంటకు తోడుగా చలిని ఇచ్చావు
జంటకు తోడుగా బిడ్డను ఇచ్చావు

మాటకు తోడుగా ఏడుపు పంచావు
పాటకు తోడుగా నాట్యము నేర్పావు
ఆటకు తోడుగా నేర్పరి  చూపావు
బాటను నీటుగా చేయుట తెల్పావు       

కోపము తోడుగా ఆకలి కల్పించావు
శాంతము తోడుగా ప్రేమను కల్పించావు  
వేషము తోడుగా ఆకర్ష నందించావు
భాషకు తోడుగా కవిత్వ మందించావు
 
చీకటి తోడుగా వీలుగు నందించావు
భాధకు తోడుగా సంతోషం ఇచ్చావు
బంధము తోడుగా భాద్యత నిశ్చావు
దేశము తోడుగా సేవలందించావు

--((*))--*కవిత - అడ్డు

కాలానికి ప్రవాహానికి లేదు అడ్డు
కుతూహలానికి ఏడుపుకి లేదు అడ్డు  
దాహానికి తాపానికి లేదు అడ్డు
పరిమళాలకి వెన్నెలకి లేదు అడ్డు

పుట్టి నింట మెట్టి నింట లేదు అడ్డు
ప్రేమకు ఇరువురి మధ్య లేదు అడ్డు
పువ్వులకు నవ్వులకు లేదు అడ్డు
సుఖ కష్ట  ఫలితాలకి లేదు అడ్డు 

అవకాశానికి అన్వేషణకి లేదు అడ్డు
మమకారానికి మౌనానికి లేదు అడ్డు
వెలుగుకి అంధకారానికి లేదు అడ్డు
తల్లితండ్రుల ప్రేమలకి లేదు అడ్డు 
--((*))_-

* సంకల్పం (కవిత)

అవ్యక్తపు ఊహలకు
ఆకారం కల్పించాలని
ఆకారానికి ప్రాణం పోయాలని
అందరికీ ఉపయోగపడాలని

వ్యక్తిని ఉత్తేజ పరచాలని
ఉతేజంలో మంచిని గ్రహించాలని
మంచే శాస్వితమని
అనృతము ఎప్పటికైనా అపాయమని

మదిలోసాగే ఘర్షణలకు
కను విప్పు కల గాలని
విద్యా శక్తే ఆయుధాలని  
ప్రకృతి నను సరించాలని

బలహీనతలను
తెలుసుకోవాలని
భయాలను
దరి రానీయాకూడ దని   

మనలో ఉన్న శక్తులను
దాచి పెట్టకూడదని
వెలికి తీయాలని
నలుగురికి ఉపయోగపడాలని

మర్యాద నటనలు మాని
మోసపూరిత ఆలోచనలు మాని
ఎవరికీ భయపడకూడదని
అసలు నిజం కక్కేయాలని

ప్రజాసామ్య విలువలను
రక్షించాలని
తల్లి తడ్రి గురువే దైవాలని
మనలోమార్పులు పరమాత్మ లీలలని
    
గ్రహించి మన ఆలోచన
దేశాన్నిబట్టి ప్రకృతిని బట్టి
వాతావరణాన్ని బట్టి కుటుంబాన్ని బట్టి
నిర్ధారించు కొనేదే  సంకల్పం 
--((*))--  

*ఆకాంక్ష

కాలచక్రం తిరుగు తున్నది
జీవనకాలం తరిగిపోతున్నది
దీక్ష దక్షత తగ్గు తున్నది
కర్మసాక్షులేవరో తెలియకున్నది 

క్షణకాల౦ సంతోషం క్షణకాల౦ దు:ఖం
అనిగ్రహించి బ్రతకమన్నది 
కాలాన్ని సంపాదనను లెక్క
వేయక ముందుకు సాగమన్నది

వారాంతపు సెలువుల్లేవు
పండగ పబ్బాల సెలవు లెరుగడు
అనారోగ్యమన్న మాటా లేదు
మూడువందల అరవై ఐదు రోజులూ
తరగని ఉత్సాహంతో తన విధిని
తాను నిర్వహించుకు పోయే
కర్మవీరుడీ కర్మసాక్షిగా ఉండాలన్నది

అలసటన్నదిలేని నిర్విరామ
కృషీవలుడుగా లోకబాంధవుడు
తన విధినిర్వహణకై
యెంతో తహతహ లాడుతూ
ఎల్ల వేళళ కర్తవ్య దిక్షపరుడుగా
సాగాలన్నది లోకనీతి  .

దినదిన గండం నూరేళ్ళాయుష్షు
లా యేడాదిలో పావుభాగం
అనుపస్థితితో విధులను నిర్వర్తించే
మానవులకు మార్తాండుడే
స్ఫూర్తిగావాలని, 

మానవులకు మనోధైర్యాన్ని
పెంచే హనుమంతుడే
స్పూర్తికావాలని
ఓర్పుతో దయా కరుణ చూపాలని
యెలుగెత్తి చాటడానికి
ప్రతిఒక్కరు మేలుకోవాలని
నా ఆకాంక్ష
 
--((*))--


నా క్షేమాన్ని కాంక్షించావు,.
మనసు బతికించుకోమన్నావు
నవ్వును అతికించుకోవద్దని శాసించేవు.
మనసారా హాయిగా నవ్వే వరమంటూ
తూనీగా లా ఆనంద విహారం..
నా హక్కని.హితాన్ని..కోరావు

...
కష్టం లో తలుచుకో మన్నావు..
తోడు గా నేనున్నానన్నావు...
అసలు నువ్వెవరో? నేనెవరో?
నీకెందుకు నేనంటే..
అంతు లోతు అభిమానం?

చీకట్లో వెలుగు దివ్వె లా నాతోడై
వేకువ దారినడిపించేవు.
నేస్తమా!!!! నీకు నేనేమవుతాను?
ఈ అనుబంధం....నీకుతెలుసా?
నువ్వు ఆత్మీయ బంధువు వా?...

జీవనగతిలో..నీకూ నాకూ పొత్తుకుదరదే..
కాకుల లోకం లో కోకిలమ్మ మనలేదే..
చెలిమికి భాష్యం బహుగొప్ప దే
దానికి కూడా లింగబేధ మున్నదే
అంతులేని ఉత్సహo నింపి....
కొత్త ఆశలూచి..కొసవరకూ..వస్తావని
కోటికలలు కంటున్నా..
వెతలను వెనక్కు నెడుతున్నా.
అప్పుడే గుర్తొచ్చిందేమో!.
చిట్టచివరి లో...వొంటిగ వదిలేసావ్..
మౌనo గా..మరో వైపు..అడుగేసావ్.

నా కలలే చెదరిపోయే..నాఊపిరి..నిలచిపోయే....
కారణమేదైన గాని.
కనికరమే లేని...లోకo..
పనీ.పాటూ లేని జనం
స్నేహానికి....ఆత్మీయతకు...
మనిషి అయితే చాలదని
అందర్నీపిలుస్తుంది
హద్దుగీసి...నిలుస్తుంది.
ఆడా.?.మగా.?.అని ఆరా తీస్తుంది...

--((*))--
* ఊహలు

నా ఊహలు చాటున
అర్ధాంగి అర్ధాన్ని తెలుసుకోవటం
అర్ధం కానిదేదో దాగిఉంది
అప్పటికే నా ఊహ లన్నీ
ఆశలుగా నీలుగుతూ
వెంబడిస్తూ
కలవర పెడుతూ
శోకంలో ముంచుతున్నాయి
ఎక్కడి నుండో
మాటల మెరుపు
భళ్ళున బయట పడి
ఆశలను మాయలో తేల్చి
సంతోషాన్ని నింపి
నిజ కోరిక తీర్చే
ఊహలు మటుమాయం
--((*))--

జీవితనౌక

హృద యార్ధం తెలుసుకోవటం
హృదయ స్పందన అర్ధమవటం
హృదయాంతరాల ప్రభోధం
స్త్రీ పురుష హృదయాలని
నమ్మి బతకటమే జీవితం

హృదయం లేని తెలివి అనర్ధం
మనస్సు లేని మమతా వ్యర్థం
ప్రేమ పంచని నవ్వులు స్వార్ధం
ఆసయం లేని విద్య అపార్ధం

కోపంతో పట్టుదలకు పొతే అనర్ధం
మాటవిలువ తెలుసు కోకపోతే వ్యర్థం
ఉండి లేదని పించేది స్వార్ధం       
బుద్ధిలేదని అనుకోవటమే అపార్ధం

పెద్దల మాటాలు వినకపోతే అనర్ధం
విద్య విలువ తెలుసుకోకపోతే వ్యర్థం
బ్రతకాలని వర్షం కురుయుట స్వార్ధం
స్త్రీలను తక్కువ చేయటం అపార్ధం
 
--((*))--
 
మామా నీమీద ఉన్నది ప్రేమా
నన్ను ఇప్పుడు పట్టించు కోవా
నీ మాటే నాకు వేదవాక్కు మామ
నీ మాటకు జవదాటను మామా

మన మధ్య ఉన్నది గుర్తించే ప్రేమా
నేను ఎప్పుడూ మరవ లేదు సుమా
నా తలపులు ఎప్పుడూ నీచుట్టూనే మామా
నీవుమరచిన నామనసులో ఉన్నావు మామా

మనమధ్య ఉన్నది భందుత్వం మా
కాదు కాదు అంతకన్నా ఎంతో ఉన్నాతమైన
ప్రేమాను రాగాల భంధము మామా
ఆ చందామామ చల్లని చూపులతో
లోకాలు చూసినట్లు నీవు నన్ను
ఎప్పుడూ చల్లగా చూస్తావు మామా
మనమధ్య ఉన్నది జన్మ జన్మల
భంధము కదా మామా   
--((*))--

*మామూలే అంతా మామూలే 

నీతిని అవినీతి మింగేయడం 
పాము తన గుడ్లు తనే తినడం 
ధర్మాన్ని అధర్మం చుట్టెయ్యడం 
ప్రాణం కోసం కోతి బిడ్డను వదలడం 

సత్యాన్ని అసత్యం కమ్మేయ్యడం 
బ్రతుకు తెరువు కోసం అబద్ధమాడటం 
ప్రశ్నించే వాడ్ని వేధించడం 
చేసినతప్పు బయట పడుతుందని భయం 

స్త్రీ అతి మంచిగా పలకరించడం 
మారు అనుమానాల నిలయం  
స్త్రీ నవ్వుతూ పలకరించడం 
తప్పుగా ప్రేమించిందను కోవడం 

అన్యాయం అన్న వాడిని బలిచేయడం 
దౌర్జన్యం ధర్మ మని వాదించడం 
తప్పు చూపినవాణ్ణి తరిమికొట్టడం 
పెద్దలను పోషించక ఆశ్రమంలో ఉంచడం 
మామూలే అంతా మామూలే 
--((*))--