10, ఫిబ్రవరి 2017, శుక్రవారం

నడక (కవిత)


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:


నడక (కవిత)(ప్రాంజలి ప్రభ.కం) 
రచన : మల్లాప్రగడ రామకృష్ణ

మనిషి గా నేను నడిచి  - నిజం తెలిసి కదులుతూ 
గమ్యం మేదో తెలుసుకోని - కాలాన్ని బట్టి సాగిపోతా 

మార కుండా మరవ కుండా -  చెడ కుండా చెరప కుండా
తాక కుండా తడవ కుండా - ఆగ కుండా కదలి పోతా

మంచి చెడ్డ చూసు కుంటూ - పాత కొత్త నాకు అంటూ
చేత  కాదే నాకు అంటూ - అడ్డు లన్నీ దాటు కుంటా

సెగలు చేష్టలు కలిసితే - పొగరు పోతులు కలిపితే
ఎదురు దెబ్బలు తగిలితే - కుదురు మాటలు పలుకుతా

పది ఒంపులు తిరిగితే - ఎది రింపులు కలిగితే
బెది రింపులు కలిగితే - మది సొంపులు చిలుకుతా

కలంతో ఆగక -నయనాన్ని చూపక
భయంతో ఆగక  - పయనాన్ని ఆపనూ

పన్ను పోటు ఉంది చూసి - కన్ను కొట్టి మారి పోక
వెన్ను చూపి పారి బోక - నన్ను నేను మర్చి బోకా

పరు వాన్ని ఆప బోక - మరణాన్ని చూడబోక
పయ నాన్ని ఆప బోక - సమయాన్ని నష్ట బోకా

ఎదురు నిలుచి సాగుతా  - మరులు గొలిపి సాగుతా 
తెలివి తెలిపి సాగుతా  - కళలు చూపియు సాగుతా

--((*))--  


నడక -1 (కవిత)(ప్రాంజలి ప్రభ.కం) 
రచన : మల్లాప్రగడ రామకృష్ణ

అదిరించిన, అదిరి బోక - బెదిరించిన బెదిరి బోక
ఎదిరించిన, చెదిరి బోక - మరిగించిన, కరిగి బోనూ

ఎంత దూరమైనా సాగిపోతూ - గాధలనే సొంతమ్ చేసు కుంటూ  
ఎన్నో మలుపులు తిరిగుతూ - అలుపు ఎరుగక ముందుకు సాగుతా

సొలసిపోక, అలసిపోక -  ఓడ్డు చేరాలని తపనతో   
భయ పడే జీవిలా మారక - ధైర్యమే ఆయుధంగా సాగుతా 

దిక్కెవరు లేరని అనుకోక - తోడు లేరని అసలు అనుకోక  
స్నేహం లేదని అనుకోక - మంచి మనసుతో నడుస్తానూ 

నన్ను గుర్తించలేదని అనుకోక - మన్నన చూపేవారు లేరను కోక  
రోదించనూ, భాదించనూ  - భాదపడనూ భాధను వ్యక్తం చేయనూ  

కష్టాలకు లొంగక  - కలతలు అందక
వేదనలకు చిక్కక - నష్టాలకు కుంగక కదులుతా     

పట్టుదల వదలక - నిగ్రహశక్తి మరువక
ప్రఘాఢమైన నమ్మకంతో - కదలి సాగుతా  

చీల్చుకుంటా వచ్చే సూర్య కిరణాల్లా
చీకటి తరిమే చల్లని వెన్నెల కిరణాల్లా
ప్రతిఒక్కరికి స్వాస అందించే కొమ్మలా 
గమ్యాన్ని చేరే నదీమ తల్లిలా సాగుతా

ఎదురు నిలుచి సాగుతా  - మరులు గొలిపి సాగుతా 
తెలివి తెలిపి సాగుతా  - కళలు చూపియు సాగుతా

--((*))-- 
 


అర్ధం ఏది ?

నా కలల అర్ధం ఏమిటో
నాలో ఆవహించిన బలహీనతా
నన్ను ఆవహించిన భయాందోళనా
నా నిద్రా భంగం చేసింది
నా ఊపిరితో ఆడుకుంటున్నాయి 
ఎందుకు కారణం ఏమై ఉంటుంది

కనికరం లేని లోకంలో ఉన్నందు కా
పని పాటూ లేని జనులతో కలిసినందుకా

స్నేహానికి .. ఆత్మీయతకు
కొలమానం లేదు ఎందుకు
పరిచితులు అపరిచితులు
మానవత్వం ఉన్న వారని
అనుకొని బతకటమే లోకనీతి   
ఆడ మగా మధ్య భేదం చూడక
ప్రేమలు సొంతము చేసుకోవటమా
   
మనసు బతి కించుకొని మనుగడకు
మార్గం వెతక మంటున్నారు
పెదాలు కళ్లచూపులతో చూపే నవ్వు 
హృదయ సౌందర్యముగా నవ్వే
మేని కలయిక వరాల నవ్వు 
నవ్వుకు హితం తప్ప
కల్ముషం లేకుండా ఉంటె చాలుకదా
--((*))--


*పంచభూతాలు

భూమి తపించేరోమ కూపాలు
భూమిలో కదిలే జలవనరులు   
భూమి లో నిక్షిప్త ఖనిజాలు
భూమే స్త్రీహృదయాంతరాలు

ఆకాశం అనంత నిలయాలు
ఆకాశం ప్రచండ ధూలి వలయాలు
ఆకాశం సూర్య చంద్ర వెలుగులు
ఆకాశం నక్షత్ర గ్రహ మండలాలు

నిప్పు లైనా అగ్నిపర్వతాలు
నిప్పు కరిగించు మంచుగడ్డలు
నిప్పు చల్లబడే హృదయతపనలు
నిప్పు నీరు కలయికే జీవితాలు  
   
నీరు తగ్గించు హృదయతాపాలు
నీరు కడలి చేరుటకు ఉరకలు
నీరు సార్వప్రాణుల స్పందనలు
నీరు ప్రకృతికి మూలాధారాలు 

గాలికి కదిలే తాటి మువ్వలు
గాలికి రాలే ఎండు టాకులు
గాలికి హృదయ సవ్వడులు
గాలికి మెరుపులే మనసులు
--((*))--
*వ్యాపారము 

ఓ నేస్తమా ఓ నేస్తామా
చేద్దాము చేద్దాము పని నేస్తమా

కష్టాలను వదిలించు కుందాము
నష్టాల నుండి  గట్టెక్కు దాము
మనధైర్యమే మనకు గెలుపు మార్గము

కలకాదు ఇది వాస్తవము
మన తొందర పాటు వల్లె నష్టము
కొందర్ని గుడ్డిగా నమ్మి దెబ్బతిన్నాము        
ఓర్పుతో మార్పుకు పయత్నిమ్చుదాము

ఓ మిత్రమా ఓ మిత్రమా
చేద్దాము చేద్దాము పని మిత్రమా

ఆటుపోట్లు మయమే ఈ వ్యాపారము
పోటీని గమనించి సాగాలి వ్యాపారము
అవకాశ వాదులను దరి చేర్చకుము
మనమధ్య ఉన్న స్నేహమే విజయము

రేపటి పనులన్నీనేడే చేద్దాము
నేర్పరి గలవారిని ప్రోస్చహించుదాము
పన్నులుకట్టి వ్యాపారాన్ని పెంచుదాము
వడ్డించిన విస్తరికాదు ఇది ధర్మకాటా 

ఓ మిత్రమా ఓ మిత్రమా
చేద్దాము చేద్దాము పని మిత్రమా
--((*))--
 *మిత్రులెల్లరులకూ.....శుభోదయం


చెట్ల మధ్యన మెరుపు
ఆకుల్లో ఆనందోత్సవం
కదలికలో  ఉత్తేజం
ఇది భాను మహత్యం 

గమ్యం లేని ప్రయాణం
అనంత సౌక్యం కోసం
నిరంతర సంచారం
నడినెత్తి ఎక్కి
జారుకుం టూ కదలికేగా 

తనదారి తా వెడలె
సూర్యుడే నిన్న
అంతలోనే బెంగ
పెంచుకున్నాడో
మనకొరకె మరల
 తిరిగి వచ్చేను ......

నూతనంగా తాను
ముస్తాబు తోడ
ధరణి నేలగ వచ్చె
ద్యుమణి యె తాను

బాలభానుని గాంచి
నింగికెందుకొ సిగ్గు
సింధూరవర్ణాన్ని తాను
తనువంత దాల్చె

గోరు వెచ్చని కాంతి
పుడమితాకంగా
భూతల్లి తనువంత
పులకరించింది

ద్వాంతమే అంతమై
కాంతివిరియంగా
నిద్రదేవిని ఉషస్సు
తట్టిలేపింది

మానవుల హృదయం
విచ్చుకుంది
కర్తవ్యబోధ తెలిపింది
కాలనిర్ణయం గుర్తు చేసింది

మేలుకో మిత్రమా
మేలుకొనుమింక
జగతి నేలుకొనంగ
మేలుకోనువ్వూ.......

మిత్రులెల్లరులకూ.....శుభోదయం

*బ్రతుకు - బ్రతికించు

మానవుల్లో కల్లోలం
ఇది ఏమి రాజ్యం రోజుకో వింత
బ్రతుకు తెరువుకు
ఎందుకీ పరిక్షలంతా

గందరగోళం ఎందుకు చేస్తారు
స్థిమితంగా ఆలోచిన్చ నీయరంతా
తొందర పెడతా రెందుకు
శాంతముగా ఉండ నీయరంతా

వేగంతో నేను పరుగెత్త లేను
మెల్లగా నడచి తలిసుకో నియ్యరంతా
చేత కాని వాడవని అంటారు
నాలోఉన్న తెలివిని తెల్ప నీయరంతా

నాకు పేర్లు పెడతారు
మీలాంటి మనిషినేనని అర్ధం చేసు కోరంతా
వెసులు బాటును తట్టుకొని ఉన్నా
మానవత్వాన్ని గుర్తించ లేకున్నారంతా

నేను వితండ వాదిని కాను       
ధర్మాన్ని రక్షించటాని అందరిని కోరుతా
కర్తవ్యం మరచి నిద్రపోను
గ్రుడ్డివాడన్నా న్యాయం కోసం నిలబడతా

నా తత్వాన్ని అర్ధం చేసుకోరు
భందాన్ని నిలుపుటకు ఇస్తా చేయూతా
లోకం బట్టి నడవాలని తెలుసు
నమ్మకముంది సహాయం చేస్తుంది మాతా

నా అభిప్రాయం ఒక్కటే
నాలో ఉన్న తెలివితో దేశానికి సహాయపడతా
మనో నిగ్రహ శక్తిని పెంచుటకు
కవిత్వం తో నిద్రని లేపుతా

మిత్రులారా జీవితమొక
బంగారు పంజరం - మేడిపండు
ఆశల వలయంకి చిక్కి
అవు తాము బందీలం 

నా లో ఉన్న ఓర్పు, నేర్పు 
దేశాభ్యుదయానికి
సహకరిస్తూ సాగుతా
మీరు కూడా గమనించండి
అని పెద్దల సాక్షిగా చెపుతా
--((*))-- 
 చాణిక్య నీతి

1 . "లాలయేత్ పంచ వర్షాణి;
దశ వర్షాణి తాడయేత్;
ప్రాప్యేతు షోడశే వర్షే ;
పుత్రం మిత్ర్ వదాచరేత్."

కుమారుని 5సంవత్సరముల వరకూ లాలిస్తూ ముద్దు చేయాలి.10 స//ల వయసున దండించాలి.16 వత్సరముల ప్రాయమున,తనయుని ఆతని జననీ జనకులు "మిత్రుని వలె"భావించి,వ్యవహరించాలి.

2 . "కు రాజ రాజ్యేన ;
కుతః ప్రజా సుఖం."
దుష్టుడైన ప్రభువు పాలనలో,ప్రజలకు సుఖము ఎక్కడుంటుంది?"

3 . "భ్రమన్ సంపూజ్యతే రాజా!"
నిరంతరము సీమలలో సంచారము చేయుట చే,ప్రభువు పూజించ బడును.

4 . "రాజా రాష్ట్ర కృతం పాపం ;
రాజ్ఞః పాపం పురోహితః."

రాజు చేసిన పాపము పురోహితుడు లేక మంత్రిది ఔతుంది.అమాత్యుడు సరైన మంచి సలహాలను ఇస్తూ,చక్రవర్తిని సన్మార్గములో పెడుతూండలి.అలాగే రాజు దుర్మార్గుడు ఐతే ప్రజలు,ఆతనిని దండించ వచ్చును"అని ఈ శ్లోక భావము.

5 . "బలం విద్యా చ విప్రాణాం;
రాజ్ఞాం సైన్యం బలం తథా;"

బ్రాహ్మణులకు విద్య బలము.అలాగే రాజుకు సైన్యమే బలము."సైన్య బలగాలు దృధముగా,సమర్ధనీయంగా,శౌర్య ప్రతాప పాటవాలకై,వ్యాయామ,సాధనలతో పటిష్ఠముగా ఉండాలని.ఘంటా పధముగా చెప్పాడు చాణుక్యుడు.

6 . "అసంతుష్టా ద్విజా నష్టః ;
సంతుష్టాశ్చ మహీ భృతః."

మహి పాలురు తమకు కలిగిన రాజ్య సంపదతో"ఇంతే చాలును!"అని సంతుష్ఠి చెందరాదు.(నేటి ఆధునిక ప్రాజా స్వామిక ప్రభుత్వ వ్యవస్థలకూ,నేటి చారిత్రక,సామాజిక పరిణామ జనితమైన రాజ్య నిర్వహణా క్రమములో ఈ సూక్తి వర్తించదు.)

7 .  "అత్యాసన్నా వినాశాయ ;
దూర స్థాన ఫల ప్రదాః ;
సేవ్యతాం మధ్య భాగేన ;
రాజా వహ్ని ర్గురుః స్త్రియః."

రాజులతో అతి సమీపములోకి చేర రాదనీ,కొంత దూరములో ఉండి,వారి సేవ చేయాలనిన్నీ ప్రభువులతో అతి చనువు కూడదనీ "కౌటిల్యునీ అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తూన్నది

8 . "విత్తేన రక్ష్యతే ధర్మః ;
విద్యా యోగేన రక్ష్యతే;
మృదునా రక్ష్యతే భూప@ ;
సత్ స్త్రియా రక్ష్యతే గృహం ."

ధనము చేత "ధర్మము" రక్షించ బడును.యోగము చేత విద్య రక్షించ బడును.సత్ స్త్రీల చేత గృహము సురక్షితమగును.మృదుత్వముచే భూపాలురు రక్షితులు అగుదురు.

--((*))--
I am . I work with Accounts Officer  but as a poet I write some times, want to share my thoughts with friends and people so here I am... I appreciate your comments, views, and suggestions...

శివకేశవుల అబేధాన్ని తెలిపే గమ్మత్తైన శ్లోకం....
పూర్వం ఒక రామ భక్తుడు.... రాముడంటే వల్లమాలిన ప్రేమ. శివుడి పేరు ఎత్తడు.
ఒకసారి ఓ పండితుడి దగ్గరికి వెళ్లి "రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇవ్వండి" అన్నాడు.
ఆ పెద్దాయనకీ తెలుసు ... ఇతడికి శివుడు అంటే పడదని. సరే ఒక కాగితం మీద మంచి శ్లోకం ఒకటి వ్రాసి ఇచ్చాడు.
"విష్ణువుని స్తుతిస్తూ వ్రాసాను. మీ విష్ణువు సంతోషిస్తాడు. చదువుకో" అంటూ.
గవీశపాత్రో నగజార్తిహారీ
కుమారతాతః శశిఖండమౌళిః।
లంకేశ సంపూజితపాదపద్మః
పాయాదనాదిః పరమేశ్వరో నః॥ ఆశ్చర్య పోయాడు చదవగానే.
అందులో ఏమని చెప్పబడింది? పరమేశ్వరః నః పాయాత్ అని. అంటే పరమేశ్వరుడు మనలను కాపాడు గాక అని అర్ధం . తక్కిన పదాలన్నీ ఆ పరమేశ్వరునికి విశేషణాలు. అర్ధం చూడండి...
గవీశపాత్రః ... గవాం ఈశః గవీశః .... ఆవులకు ప్రభువు అయిన వృషభం. అది వాహనం గా కలవాడు గవీశపాత్రః. అంటే సదాశివుడు.
నగజార్తి హారీ ... నగజ అంటే పార్వతీ దేవి ... ఆవిడ ఆర్తిని పోగొట్టిన వాడూ ... అంటే సాంబశివుడే.
కుమారతాతః .... తాతః అనే సంస్కృత పదానికి తండ్రి అని అర్థం ... కుమారస్వామి యొక్క తండ్రి అయినవాడు శివుడే నిస్సందేహంగా.
శశిఖండ మౌళి: ... అంటే చంద్రవంక శిరసున ధరించిన వాడూ.
లంకేశ సంపూజిత పాద పద్మ: ... లంకాధిపతి అయిన రావణునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడూ.
అనాదిః ... ఆది లేని వాడూ ... అంటే ఆదిమధ్యాన్తరహితుడు అయినవాడూ,
అటువంటి పరమేశ్వరః నః పాయాత్ .... వృషభ వాహనుడూ, పార్వతీ పతి, కుమార స్వామి తండ్రీ, చంద్రశేఖరుడూ, రావణునిచే సేవింప బడిన వాడూ అనాది అయిన పరమేశ్వరుడు మనలను కాచు గాక అనేది తాత్పర్యం.
అర్ధం తెలియగానే మతి పోయింది. వ్రాసిన వాని మీద పిచ్చ కోపం వచ్చింది. అది పట్టుకుని తెగ తిరిగాడు.
చివరికి ఒకాయన "అది విష్ణువుని కీర్తించేదే ... ఏమీ అనుమానం లేదు" అని అతడిని ఓదార్చాడు.
ఇది మరో ఆశ్చర్యం.
అనాది అనే మాటలో ఉంది అంతా. కిటుకు చూడండి ....
పరమేశ్వరుడు ఎలాటివాడూ అంటే అనాదిః అట. అంటే ఆది లేని వాడు. అంటే పరమేశ్వరలో ఆది అక్షరం లేనివాడు.
ఇప్పుడు ఏమయ్యింది? రమేశ్వరః అయ్యింది. అంటే లక్ష్మీపతి అయిన విష్ణువే కదా!
గవీశపాత్రః ... లో గ తీసెయ్యండి .. వీశపాత్రః అవుతుంది. విః అంటే పక్షి అని అర్ధం. వీనామ్ ఈశః వీశః ... పక్షులకు రాజు అంటే గరుడుడు, ఏతా వాతా గరుడ వాహనుడైన విష్ణువు.
నగజార్తి హారీ ... మొదటి అక్షరం తీసెయ్యండి .... గజార్తి హారీ ... గజేంద్ర మోక్షణము చేసిన విష్ణువు.
కుమారతాతః .... ఆది అక్షరం తీసేస్తే ... మారతాతః .... మన్మధుని తండ్రి అయిన విష్ణువు.
శశిఖండ మౌళి: ... మొదటి అక్షరం లేకపోతే శిఖండమౌళిః... నెమలిపింఛము ధరించిన విష్ణువు.
లంకేశ సంపూజిత పాద పద్మ: ... మళ్ళీ ఆది లేనిదిగా చెయ్యండి ... కేశ సంపూజిత పాద పద్మ: ... క అంటే బ్రహ్మ, ఈశః అంటే రుద్రుడు ... అంటే బ్రహ్మ రుద్రేంద్రాదులు బాగుగా పూజించిన పాదపద్మములు కల విష్ణువు.
అతడు మనలను కాపాడు గాక ....
గరుడ వాహనుడూ, గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడూ, మన్మధుని తండ్రీ, నెమలి పింఛము దాల్చిన వాడూ, బ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడిన పాద పద్మములు కలవాడూ అయిన రమేశ్వరుడు .... విష్ణువు మనలను కాచు గాక అనే తాత్పర్యం .
ఇప్పటికి అతడు శాంతించాడు.
సమన్వయించుకోకపోతే జీవితాలు దుర్భరం ఔతాయి. సర్వదేవతలలో విష్ణువుని దర్శించగలిగితే వాడు వైష్ణవుడు. సర్వ దేవతలలో శివుని దర్శించగలిగితే వాడు శైవుడు. ఇది మన భారతీయ కవితా వైభవము.
భవదీయః
విద్వజ్జనవిధేయః
నారాయణభట్ల.చైతన్యశర్మ