ఓం శ్రీరామ్ - శ్రీ మాత్రేనమ:
*ద్విపద (కవిత )
ఒకనాటి పుణ్యము - నిత్య ప్రశాంతత
ఒకనాటి పాపము - వక్ర బుద్ధియు
ప్రతిరోజు ఆనందం - మంచి గుణం
ప్రేమ నమ్మకం - సుఖ సంసారం
ఆనాటి విషయం - ఏనాటికీ మారదు
జరిగే విషయం - ఏనాటికీ తెలియదు
మంచి విషయం - ఏబుర్రకీ ఎక్కదు
చెడ్డ విషయం - బుర్రఎక్కక తప్పదు
పుడమిలో లేరు - ధర్మబోధ చేయువారు
నిజము చెప్పువారు - కృపచూపే వారులేరు
తెలుగు భావమువేరు - ఇంగ్లీష్ భావంవేరు
బంధానికి ఎవరెవరు - ప్రేమకు ఎవరోకరు
ఈరోజుకారోజు పనిని - సమయంబట్టి చేయాలి
ఓర్పువున్న లేకున్నా - మనిషినిబట్టి చేయాలి
మనసున్న లేకున్నా - పని తల్లినిబట్టి చేయాలి
అనారోగ్యంతో ఉన్న - పెద్దలకు సేవచేయాలి
భార్య భర్త - మెలి కలయికే
బిడ్డ నవ్వు - తోలి ఊహలకే
మంచి చెడు - కాల నిర్ణయాలకే
జరిగింది జరగబోయేది - దేవుని సేవలకే
జ్ఞానంపంచెడి మాతృశ్రీ - సత్య స్వరూపి
విద్యనేర్పెడి గురువు - న్యాయ స్వరూపి
మార్గంచూపెడి తండ్రి - ధర్మ స్వరూపి
సంపదచూపెడి నేత - బ్రహ్మ స్వరూపి
--((*))--
*ఛందస్సు (ఉన్నా రేరీ )
లోకంలో మనో సహనం - దాన గుణం ఉన్న వారు లేరే
కష్టం సమ తుల్యముగా - దాన ధర్మాలూ చేయాలని ఉన్నా
అహం కారమే సమతా - మానవతా కాన రాకయే ఉండే
కానీ మాట మృదువుగా - ఉండేడి వారే ని దానం చేసే
జ్ఞాణాన్నీ కలిగీ గర్వం లెక ఉండేది వాడే ఎక్కు
వా జ్ఞానం సమయానందమ్ము మనో బుద్ధి భోధించేవా
రే సత్యం తెలిపే వ్యక్తి అరుదే నిండుగా బోధించే
ఐశ్వర్యం మనసా వాచా పలుకే వేదంగా ఉన్నా రేరీ
--((*))--
ఛందస్సు (మోసగత్తె)
II UUU UIUI
సుడి గుండం లా చుట్టే శావు
మది అంటూ గాళ మే శావు
ఎద పొంగే ఆయుధమ్ వల్లె
చిరు గుండె ల్లో ఒట్టే శావు
నయనాలల్లో తెల్పుతావు
పయణాలల్లో ముంచు తావు
శయనంలల్లో తప్పు కుంటు
తమకం వళ్ళో ఒప్పు కోదు
నిలువెల్లా నన్ను చుట్టావు
మనసెల్లా వల్క పోశావు
తను వెల్లా చిందు లేశావు
వయసల్లా వంపు తిప్పావు
నను మూర్కం గా కొట్టావు
నను మత్తెక్కిం చెశావు
నను నమ్మించ్చే చెశావు
నను మోసంతో చెశావు
--((*))--
ఛందస్సు (మాతృశ్రీ ) (కొత్తది )
III-UI-UI - IIIIU
కలిమి లేము లందు - మన కొరకే
మనసు తో మనందు - సహా కరుణే
వయసు తో నిమిత్త - అను కరణే
దయతొ నవ్వుపంచు - చిరు నగువే
పరుల తోడ భాద - సుఖ మదిలో
దరికి చేరి సేవ - పరి మళమే
మనసు నొప్పి తెల్ప- క లతవలే
ఉదయ భావ తెల్పి - మెలుకొలిపే
మరులు గొల్పె తేట - అనుకువలే
మమత పంచె ప్రేమ - సుమలతలే
హితము కోరె ఓర్పు - సహనములే
మదిని పంచె నేర్పు - కలదియులే
పవలు రేయి తాను - కనులకలే
సెగలు పొంగి ఒక్క -రొకరి కలే
యదను చెప్పు కోక - తలపు కలే
చివరి దాక ఓర్పు - నిజము కలే
వనము నేలు నేత - కొలుచుటకే
సమయ పాల నేత - నిలుచుటకే
మనము నిత్య పూజ - తలచుటకే
సకల సేవ భావ - తెలుపుటకే
--((*))--
ఛందస్సు (సమత) (కొత్తది )
IIUII-UIIUU
కమణీయము మానసమళ్లే
అనురాగము దీవనవళ్ళే
దయనీయము పెంపకమళ్లే
సహజీవన సాహసమళ్లే
చిరకాలము ప్రేమలవళ్లే
నళినీ నిలయం వలపళ్లే
చిరుజీవుల నవ్వులవళ్లే
మదికోరిక తీరును అట్లే
నవరాగము ఆదరణమళ్లే
సుమభాదలు తిరుటవళ్లే
సుఖరోగము ఆశల వళ్లే
విధి భాదలు కర్మలవళ్లే
సహనం దయ సేవ సుమాలే
సుఖదం సుమ భావ భగాలే
విరహం మమ ప్రాప్త బొగాలే
సమరం మమ తప్పుల వల్లే
ఎవరో ఒక సాహాసమళ్లే
ఎచటో సమసేవల వళ్లే
సమయా సమ సాధనవళ్లే
సమతా మమతా పొంగే
--((*))--
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
*లోక-మాయ (కవిత )
పూచాయి పూలు - స్త్రీల కళ్ళు మెరిసాయి
పరిమాళాల పూలు - మనసును మెరిపించాయి
గులాబీ పూలు - హృదయాన్ని కదిలించాయి
పారిజాత పూలు - దేవుడికని చెపుతున్నాయి
పడుకుంది పాము - చీమల పుట్టాయి
భద్ద కస్త మనిషి - భూమికి బరువాయి
వేశ్య వృత్తి మనిషి - వేదనకు చేరువాయి
వృతి ధర్మ వ్యక్తికీ - జీవితమే బరువాయి
కొమ్మపై కోయిల - ఱాయి చూస్తున్నది
విస్తరేసి యువతి - వింత చూపు తుంది
కమ్ముకున్న చీకటి - వెలుగును పిలుస్తుంది
విచ్చుకున్న మనసు - కోర్కతిర్చ మంటుంది
రాత్రిలో నడక - వెన్నెల కొట్టింది
మనసులో మమత - మంచిని కోరింది
వేడిలో యువత - వేగము కావాలంది
వేదనలో నడక - దారి మారిపోతుంది
నీటిలో నీడలు - చేప బెదిరింది
స్త్రీల కళ్లకే - హృదయం కదిలింది
మెలి ముసుగుకే - అందం కనబడింది
మనిషి నీడను - పట్ట లేవంటుంది
దీపాలు వెలిగాయి - నిశి నిలిచింది
మనసులు వెలిగాయి - మనసు చితికింది
ఆశలు తొలగాయి - ఆకర్షణ పిలిచింది
సంపాదన పెరిగాయి - నిద్ర కరువైనది
కొలనులో నెల నీడ- విరి కదిలింది
మనసులో ప్రేమ లీల - తొలచి వేసింది
కాకి ముక్కుకు దొండ పాండే - ఇత్తడి పుత్తడైనది
బ్రతికే మార్గం - ప్రేమ పక్షులకు సొంత మైనది
పాకింది పచ్చిక- పల్లె మెఱుస్తుంది
విరిసింది పైరు - పుడమి తల్లి మెరిసింది
ఉరికింది కోడె దూడ - స్వేశ్చ దొరికింది
గోమాత పాలే - పళ్లే నంతా మురిపించింది
మెరిసింది మెఱుపు - శరత్తు కమ్మింది
కురిసింది వర్షము - పుడమి పురి విప్పింది
వీచింది చల్లనిగాలి - నెమలి నాట్యమాడింది
జారింది పిడుగు - ప్రాణాన్ని తీసుకెళ్లింది
గుడిపైన పక్షులు - గంట ఊగింది
హృదయం రెక్కలు - మంట చూపింది
సమయం ఊహలు - ఆశ రగిలించింది
పుడమి భాద్యత - గంట మోగించింది
జడివాన కురుస్తుంది - గుడి మెఱుస్తుంది
మొగలి వాసన వస్తున్నది - మంచు మెఱుస్తున్నది
కమలం వికసిస్తుంది - కిరణం మెఱుస్తున్నది
పైరు కోత కొచ్చింది - రైతు నేత్రం మెరుస్తున్నది
శరీరం కూలింది - విరి చూస్తున్నది
మనసు చెడింది - విధి ఎక్కిరిస్తున్నది
వయసు నలిగింది - మది మరులుకొన్నది
బ్రతుకు పండింది - బాధ్యత పెరిగింది
--((*))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి