ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ఓం శ్రీ గణేశాయనమ:
శా:: నీవేనా మదిలో తలంచి కొలిచా శ్రీమాత విఘ్నాల రా
జా నీవే సహనం సహాయ పడుటే నీ నిత్య లక్ష్యమ్ము గా
నీవే వేద విధాతగా కొలవగా ప్రత్యక్ష సద్బోధ లే
నీవే దిక్కు మా మదీయ పలుకే కర్తవ్య భావాలుగా
శుభోదయ పద్యాలు (1)
శా :: బ్రహ్మాండాన్ని ఒకే మనస్సు తెలిపే భాంధవ్య భావార్ధ సం
దేహాన్నంత ఒకే తపస్సు మెరుపే సౌందర్య సౌభాగ్య పం
చే హృద్భోదనలే వయస్సు మురిపంచే మాననీ లక్ష్య మే
దేహాంతం వరకూ సహాయ పరుడే ఉత్తేజ ఓంకారుడే
శుభోదయ పద్యాలు (2)
శా :: మాతామానసమే సద్బుద్ధి జననం సర్వాంత విస్తారమే
మాతా తత్వములే మనో గుణములే విస్వాంత విస్తారమే
మాతా భోధలుయే సువిద్య విధిగా జన్మాంత విస్తారమే
మాతా శక్తులు యే ప్రపంచ వెలుగూ మర్గాల విస్తారమే
శుభోదయ పద్యాలు (3)
శా :: ఆశా పాశముకే నవ భావములే తాకట్టు పెడ్తావు రా
విశ్వాసం మరచీ భయాన్ని తలచీ ప్రేమించ కుంటావురా
ఐశ్వర్యం కొరకే నిజాన్ని మరచీ తప్పుల్లే చేస్తావురా
ప్రశంశే గుణమూ మనస్సు మమతే భాధ్యతె భావించు రా
శుభోదయ పద్యాలు (4)
శా ;; మాయా మర్మమునే జయించి మనసే స్వశ్చత భావాలుగా
సైయ్యాటే అనుటే ఉద్రిక్త సమరం స్వేశ్చాసుఖానందమే
ప్రాయంలో తలపే వయస్సు ఉరకే సంతోష రాగాలు గా
ధ్యేయంతో తరుణం సమంజ సముగా సంధించి జీవించుటే
శుభోదయ పద్యాలు (5)
శా :: సీతాకోక వలే మృదుత్వ కుసుమా సౌందర్య ఆకర్ష నే
ఆత్రంతో అడుగే అనర్ధ మగుటే అర్ధాంత రాకర్ష నే
ఆత్మీయం వలనా శుఘంధ మెరుపే ఆనంద మాధుర్య మే
సాత్వికం వలనా సద్బుద్ధి మనసే సందర్భ సౌఖ్యాలు లే
శుభోదయ పద్యాలు (6)
శా ::అంతా సంశయమే శరీర ఘటనంబంతా విచారంబె లో
నంతా దు:ఖపరం పరాన్వితమె మేనంతా భయభ్రాంతమే
ఆంతా నంత శరీర శోషణ మెదుర్వ్యా పారమే దేహికిన్
చింతామార్గమునే తపించి నలిగీ పొందేను ప్రేమమ్మునన్
శుభోదయ పద్యాలు (7)
శా :: నిన్ను నమ్మినరీతి నమ్మనొరులన్ నీకన్న నా కెన్న లే
రన్నల్ దమ్ములు తల్లీ దండ్రులు గురుండాపత్సహాయుండు, ఆ
వెన్నెల్ నన్ను సదా వేధించె తనువే నీకోస ప్రత్యేక మే
ఎన్నేన్నో కతలే మనం వొ టొకటే ప్రేమమ్ము మార్గమ్ము గా
శుభోదయ పద్యాలు (8)
శా ::నీతోడూ కొరకే నెనింత పలికే నీప్రేమ పొందేందు కే
నీతోనే దరహా సమాడ దలిచా ప్రేమమ్ము పంచేందు కే
పంతాలే మరచీ సువిద్య మనసే మార్చక పొందాను లే
బ్రాంతిన్ జెం దకయే వినోద పర మార్ధం బె భందాని కిన్
శుభోదయ పద్యాలు (9)
శా ::సంస్కారం మనలో తరంగ మువలే జీవించి ఉత్తేజ మే
సంస్కృతా మృతమే మనస్సు పలుకే నిత్యా విధానాలుగా
మస్తిష్కా మమతే సమన్వ యమునే ఆదర్శ భావాలుగా
సుసౌఖ్యం భువిలో నిరంత రముగా వెంటాడి వేధించునే
శుభోదయ పద్యాలు (10)
శా :: చెప్పేదేమిటి ? రోతలేటివి ? మనో రోగస్తుండై.దేహియే
చెప్పిందేమిటి ? పూతలేటివి? మదో పూతంబు లే దేహముల్
చూపిం దేమిటి ? చూడలేనివి ? సదా మౌనం గ్రహించెందు కే
చెప్పాలేనిది ? చూపలేనిది ? యదా దాగుండె ప్రేమా మృ తం
శుభోదయ పద్యాలు (11 )
శా:: ఆలున్ బిడ్డలు దల్లి తండ్రులు ధనం బంచు న్మహాబంధనం
కల్లోళం తలపే ప్రియంగ విధియే సోదించి సాధించుటే
తల్లీ తండ్రి మనల్ని పెంచు తరుణం ఏంతో మనో ధైర్య మే
ఆలోచన్నె నిజం చేసేందుకు మనం చిక్కాలి భందాని కే
శుభోదయ పద్యాలు (12 )
శా:: స్త్రీ సౌఖ్యం మద నాంత రంగములలో ఉత్తేజ పొందేందు కే
కాసంతై తరుణాన్ని బట్టి పలుకే జీవించు మార్గమ్ము కే
వీసంభై చిరకాల వాంఛ కరుణా వాశ్చల్య పంచేందు కే
దోసంబుల్ చెయకా మంచిని మదిలో ఊహించి ప్రేమించు టే
శుభోదయ పద్యాలు (13 )
శా:: భావా నందముతో కవిత్వ మదియున్ సంభాషణాలే త
న్నే వైద్యుo డు చికిత్య విద్య కధలే పాఠాలుగా చెప్పె స
త్యా వాదే గురువూ సమాన అభిమానం చూపే శాంతోషమే
సేవా తత్పరమే మనో నిబ్బరమే విద్యార్ది బోధామృతం
శుభోదయ పద్యాలు (14)
శా:: సందేహం వలదే భరించె మనసే మానంకు ఉన్నాది లే
ఈదేహం మగువా సమత్వ మమతా సామాన్య ప్రేమా కదా
మాందవ్యామ్ తలపే మనస్సు మఖిలం మానాభిమానం కదా
సద్బోదా సక్రమం సమంత పిలుపే సంతృప్తి కల్పించె లే
శుభోదయ పద్యాలు (15)
శా :: కన్నూఆ శయమే సమన్వ యముగా చేయాలనే ఆశతో
నన్నూ వేదనతో తపించె విధమే కర్తవ్య భావాల తో
తన్మాత్రా తనువే వేదించు నయనం కల్లోలమే చేయుటే
ఉన్మాదీ మలుపే వితండ నయనం ప్రపంచ హాహాకరం
శుభోదయ పద్యాలు (16)
శా :: నీ నా సందొడబాటు మాట వినుమా దానాలు చేసేందు కే
మానాన్నా మదిలో సుదా మధురమే నన్నింత వాడిన్నిచే
సే, నా తల్లికి సంత తంబు మదివేడ్కం గొల్తు నీవున్ సహా
యాన్నీచేయవలే సదుద్దె శమునే చెప్పెందుకే పిల్చెనే
శుభోదయ పద్యాలు (17)
శా :: జ్ఞానంతో తనువే విశ్రాంతి సముదాయం చేరి ఉండుట, అ
జ్ఞానంతో ఎవరూ నిజాన్ని తెలిపే సంఘాన్ని గుర్తింప లే
కున్నారే, మనసే గ్రహించ లేకయే గాడాoధ కారంతొ నే
యున్నారే, వెలుగే శరీర తలపే చింతావిచారం బు లే
శుభోదయ పద్యాలు (18)*
శా:: మత్తుల్లో మనిషీ ఎలాంటి సలహా పాటించకేచిక్కి, వో
వత్తిళ్లే వనితా సుఖాల వదనామృతం కొరే వ్యక్తి , వో
గుత్తాధీ నుడుగా నరాలు కుదిపే లక్ష్యాలనే చూపి వో
సత్యాన్ని మరచీ చలించు మనసే మౌనాన్ని చుట్టే కదా
శుభోదయ పద్యాలు (19)
శా:: శ్రీవిద్యుత్కలితా జనంజనమహా ప్రాబల్య సౌభాగ్యమే
శ్రీవిద్యా జనితా సుదీర్ఘ కలలే స్త్రీ సౌఖ్య సౌభాగ్య భో
ధావిర్భావమునే వచించి మదినే శాంతింప చేయున్ కదా
శ్రావ్యానం దముయే సుఖాల తరుణం నిత్యావసారా నిధే
శుభోదయ పద్యాలు (20)
శా::ప్రాయంబే మనకూ అనేక కలలే కష్టాలు ఓదార్పు లే
వ్యయం తప్పదులే వయస్సు మలుపే వాంఛాఫలం దక్కుటే
మాయా జాండమనల్నిమంచి చెడులే జీవత్వ నిస్వార్ధతే
ధైయంగా మననమ్మకాన్ని ఒక్కటే భావ్యం గ జీవించుటే
శుభోదయ పద్యాలు (21)
శా:: నీపేరుణ్ నినునే తలంచి మనసే అర్పించి నీ చుట్టు నే
ఒప్పింపా తలపూ వివేక మునందు ఉంచాను పట్టించు కో
ఈ పేదన్ విడిచీ ధనంవ లననే ప్రపంచ చూసావు లే
నాప్రేమమ్ము ననే నువుమర్చి ననూ నీకోస మేనే నులే
శుభోదయ పద్యాలు (22)
శా:: ఘంటారా వములే ప్రసాద పిలుపే నైవేద్య సంకల్పమే
ఇంటింటా ఉపకా రసేవ తలపే నిత్యాన్న భావాలులే
చిట్కాలే మన ఆశయాల్కి నవనీతంగా ఉపాయాలుగా
తంటాలే వయసొచ్చినంత వెలుగే ప్రేమాభ్యు భావాలతో
శుభోదయ పద్యాలు (23)
శా:: పంతంతో కదిలే మనస్సు నిలిపే ధ్యేయంగ ఉండాలిగా
కాంతిన్ పంచితినీ ప్రధాన నళినీ తొల్గించె రేతస్సు గా
సంతోషిమ్ చితినీ వివేక తరుణం ధర్మాన్ని రక్షించె గా
శాంతిన్ బొందితినీ క్రమంగ సహనం కల్పించే మార్గం ఎగా
శుభోదయ పద్యాలు (24)
శా::నిప్పేలే తనువే తపించే పలుకే సందర్భ బంధాలుగా
తెప్పించే సిరినే అనేది నటనే అన్యాయ భావమ్ముగా
ఒప్పించే తెలివే అనునిత్యమునే ఉండాలి సామాన్యగా
చెప్పంగా మదిలో మంచిని నిలిపే తన్మాత్ర ఉత్సాహమే
శుభోదయ పద్యాలు (25)
శా:: విద్యుత్ ధర్మమునే స్వధర్మముగా ఉత్సాహ సంకల్పమే
విద్యుత్ తత్వమునే సమాజ సహకార నిత్య ఉత్సాహమే
సద్భోధా విధమే మనందరికి దివ్యా మాన సోల్లాసమే
సద్బోదా సక్రమం సుఖాల పిలుపే సంతృప్తి కల్పించె లే
శుభోదయ పద్యాలు (26)
శా:: తోడేలేని మనస్సు ఊరటను పొందీ సంతసమ్మూ కదే
ఆడే ఆటలలో నిజాయి తిశ్రమే కాంక్షించే ఆటే కదా
పాడే పాటలలో ఒహద్దు నయనాల్లో చూపు సంగీతమే
తాడేలే అనియూ సుసర్పముననే పట్టేందు కష్టాలులే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి