22, ఫిబ్రవరి 2017, బుధవారం

Internet Telugu Magaine for the month of 2/2017/56


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

*ప్రేమికుల రోజు
రచన: మల్లాప్రగడ రామకృష్ణ

పంచశరు బారికి చిక్కితి నీకు దక్కితి
ధ్యానము నిల్వదాయె
మది దారుణ కోరికలు తొందరించె
మనసు మనసు ఏకము
కొరకు మది పులకిచె
మరువలేని  బంధం మన మమేకం
నీ యందు నాచిత్తము
ఆనవరతము నిచ్చియున్నది
నీ యానా బిడియం లేదు
కన్నె వలపు పిలుపుకు
తడవని మగధీరుడు ఎవరు
మహిలో ఉండలేరు
ఉండినా మానవుల మధ్య
జీవనం గడప లేరు
అండగా మదను డుండగా
తన విరి సరములకు పదునుండగా
మగమహారాజును ముగ్గులో 
లాగు ధెర్యము మగువకు ఉండగా
మదన సౌందర్యము ఆస్వాదించని
వారెవరో తెలుపగలరా
వలపు పిలుపు - మది తలపు
నది ఉరవడి - కడలి నురుగు
గాలి ఆకు రాలు - సొగసు చిరుజి మరుగు

కొత్త కోరిక కలుగు
- హృదయతాపము చల్లార్చు
వలపును ప్రేమగా మలచు కుంటే
భవిషత్తు మరియు భద్రం
ప్రేమికులరోజు తొందరపడితే అనర్ధం

సర్వస్తరతు దుర్గాణి - సర్వో భద్రాణి పస్యతు
సర్వ కామానవాప్నోతు - సర్వ సర్వత్ర నందతు            

అందరి ఇక్కట్లు  అన్నీ తొలగాలి
అందరికీ శుభం కలగాలి
అందరి ఆశలూ నెఱవేరాలి
అందరూ సంతోషముగా ఉండాలి

ప్రతి ఒక్కరికి ప్రేమికుల రోజున
సర్వం సుఖ జీవనం సర్వోన్నతి  
ఇదే ప్రాంజలి ప్రభ శుభాకాంక్షలు
--((*))--

* ఓ దేవుడా

గుండెకు తోడుగా ఊరట నిచ్చావు
ఎండకు నీడగా  తరువు నిచ్చావు
మంటకు తోడుగా చలిని ఇచ్చావు
జంటకు తోడుగా బిడ్డను ఇచ్చావు

మాటకు తోడుగా ఏడుపు పంచావు
పాటకు తోడుగా నాట్యము నేర్పావు
ఆటకు తోడుగా నేర్పరి  చూపావు
బాటను నీటుగా చేయుట తెల్పావు       

కోపము తోడుగా ఆకలి కల్పించావు
శాంతము తోడుగా ప్రేమను కల్పించావు  
వేషము తోడుగా ఆకర్ష నందించావు
భాషకు తోడుగా కవిత్వ మందించావు
 
చీకటి తోడుగా వీలుగు నందించావు
భాధకు తోడుగా సంతోషం ఇచ్చావు
బంధము తోడుగా భాద్యత నిశ్చావు
దేశము తోడుగా సేవలందించావు

--((*))--*కవిత - అడ్డు

కాలానికి ప్రవాహానికి లేదు అడ్డు
కుతూహలానికి ఏడుపుకి లేదు అడ్డు  
దాహానికి తాపానికి లేదు అడ్డు
పరిమళాలకి వెన్నెలకి లేదు అడ్డు

పుట్టి నింట మెట్టి నింట లేదు అడ్డు
ప్రేమకు ఇరువురి మధ్య లేదు అడ్డు
పువ్వులకు నవ్వులకు లేదు అడ్డు
సుఖ కష్ట  ఫలితాలకి లేదు అడ్డు 

అవకాశానికి అన్వేషణకి లేదు అడ్డు
మమకారానికి మౌనానికి లేదు అడ్డు
వెలుగుకి అంధకారానికి లేదు అడ్డు
తల్లితండ్రుల ప్రేమలకి లేదు అడ్డు 
--((*))_-

* సంకల్పం (కవిత)

అవ్యక్తపు ఊహలకు
ఆకారం కల్పించాలని
ఆకారానికి ప్రాణం పోయాలని
అందరికీ ఉపయోగపడాలని

వ్యక్తిని ఉత్తేజ పరచాలని
ఉతేజంలో మంచిని గ్రహించాలని
మంచే శాస్వితమని
అనృతము ఎప్పటికైనా అపాయమని

మదిలోసాగే ఘర్షణలకు
కను విప్పు కల గాలని
విద్యా శక్తే ఆయుధాలని  
ప్రకృతి నను సరించాలని

బలహీనతలను
తెలుసుకోవాలని
భయాలను
దరి రానీయాకూడ దని   

మనలో ఉన్న శక్తులను
దాచి పెట్టకూడదని
వెలికి తీయాలని
నలుగురికి ఉపయోగపడాలని

మర్యాద నటనలు మాని
మోసపూరిత ఆలోచనలు మాని
ఎవరికీ భయపడకూడదని
అసలు నిజం కక్కేయాలని

ప్రజాసామ్య విలువలను
రక్షించాలని
తల్లి తడ్రి గురువే దైవాలని
మనలోమార్పులు పరమాత్మ లీలలని
    
గ్రహించి మన ఆలోచన
దేశాన్నిబట్టి ప్రకృతిని బట్టి
వాతావరణాన్ని బట్టి కుటుంబాన్ని బట్టి
నిర్ధారించు కొనేదే  సంకల్పం 
--((*))--  

*ఆకాంక్ష

కాలచక్రం తిరుగు తున్నది
జీవనకాలం తరిగిపోతున్నది
దీక్ష దక్షత తగ్గు తున్నది
కర్మసాక్షులేవరో తెలియకున్నది 

క్షణకాల౦ సంతోషం క్షణకాల౦ దు:ఖం
అనిగ్రహించి బ్రతకమన్నది 
కాలాన్ని సంపాదనను లెక్క
వేయక ముందుకు సాగమన్నది

వారాంతపు సెలువుల్లేవు
పండగ పబ్బాల సెలవు లెరుగడు
అనారోగ్యమన్న మాటా లేదు
మూడువందల అరవై ఐదు రోజులూ
తరగని ఉత్సాహంతో తన విధిని
తాను నిర్వహించుకు పోయే
కర్మవీరుడీ కర్మసాక్షిగా ఉండాలన్నది

అలసటన్నదిలేని నిర్విరామ
కృషీవలుడుగా లోకబాంధవుడు
తన విధినిర్వహణకై
యెంతో తహతహ లాడుతూ
ఎల్ల వేళళ కర్తవ్య దిక్షపరుడుగా
సాగాలన్నది లోకనీతి  .

దినదిన గండం నూరేళ్ళాయుష్షు
లా యేడాదిలో పావుభాగం
అనుపస్థితితో విధులను నిర్వర్తించే
మానవులకు మార్తాండుడే
స్ఫూర్తిగావాలని, 

మానవులకు మనోధైర్యాన్ని
పెంచే హనుమంతుడే
స్పూర్తికావాలని
ఓర్పుతో దయా కరుణ చూపాలని
యెలుగెత్తి చాటడానికి
ప్రతిఒక్కరు మేలుకోవాలని
నా ఆకాంక్ష
 
--((*))--


నా క్షేమాన్ని కాంక్షించావు,.
మనసు బతికించుకోమన్నావు
నవ్వును అతికించుకోవద్దని శాసించేవు.
మనసారా హాయిగా నవ్వే వరమంటూ
తూనీగా లా ఆనంద విహారం..
నా హక్కని.హితాన్ని..కోరావు

...
కష్టం లో తలుచుకో మన్నావు..
తోడు గా నేనున్నానన్నావు...
అసలు నువ్వెవరో? నేనెవరో?
నీకెందుకు నేనంటే..
అంతు లోతు అభిమానం?

చీకట్లో వెలుగు దివ్వె లా నాతోడై
వేకువ దారినడిపించేవు.
నేస్తమా!!!! నీకు నేనేమవుతాను?
ఈ అనుబంధం....నీకుతెలుసా?
నువ్వు ఆత్మీయ బంధువు వా?...

జీవనగతిలో..నీకూ నాకూ పొత్తుకుదరదే..
కాకుల లోకం లో కోకిలమ్మ మనలేదే..
చెలిమికి భాష్యం బహుగొప్ప దే
దానికి కూడా లింగబేధ మున్నదే
అంతులేని ఉత్సహo నింపి....
కొత్త ఆశలూచి..కొసవరకూ..వస్తావని
కోటికలలు కంటున్నా..
వెతలను వెనక్కు నెడుతున్నా.
అప్పుడే గుర్తొచ్చిందేమో!.
చిట్టచివరి లో...వొంటిగ వదిలేసావ్..
మౌనo గా..మరో వైపు..అడుగేసావ్.

నా కలలే చెదరిపోయే..నాఊపిరి..నిలచిపోయే....
కారణమేదైన గాని.
కనికరమే లేని...లోకo..
పనీ.పాటూ లేని జనం
స్నేహానికి....ఆత్మీయతకు...
మనిషి అయితే చాలదని
అందర్నీపిలుస్తుంది
హద్దుగీసి...నిలుస్తుంది.
ఆడా.?.మగా.?.అని ఆరా తీస్తుంది...

--((*))--
* ఊహలు

నా ఊహలు చాటున
అర్ధాంగి అర్ధాన్ని తెలుసుకోవటం
అర్ధం కానిదేదో దాగిఉంది
అప్పటికే నా ఊహ లన్నీ
ఆశలుగా నీలుగుతూ
వెంబడిస్తూ
కలవర పెడుతూ
శోకంలో ముంచుతున్నాయి
ఎక్కడి నుండో
మాటల మెరుపు
భళ్ళున బయట పడి
ఆశలను మాయలో తేల్చి
సంతోషాన్ని నింపి
నిజ కోరిక తీర్చే
ఊహలు మటుమాయం
--((*))--

జీవితనౌక

హృద యార్ధం తెలుసుకోవటం
హృదయ స్పందన అర్ధమవటం
హృదయాంతరాల ప్రభోధం
స్త్రీ పురుష హృదయాలని
నమ్మి బతకటమే జీవితం

హృదయం లేని తెలివి అనర్ధం
మనస్సు లేని మమతా వ్యర్థం
ప్రేమ పంచని నవ్వులు స్వార్ధం
ఆసయం లేని విద్య అపార్ధం

కోపంతో పట్టుదలకు పొతే అనర్ధం
మాటవిలువ తెలుసు కోకపోతే వ్యర్థం
ఉండి లేదని పించేది స్వార్ధం       
బుద్ధిలేదని అనుకోవటమే అపార్ధం

పెద్దల మాటాలు వినకపోతే అనర్ధం
విద్య విలువ తెలుసుకోకపోతే వ్యర్థం
బ్రతకాలని వర్షం కురుయుట స్వార్ధం
స్త్రీలను తక్కువ చేయటం అపార్ధం
 
--((*))--
 
మామా నీమీద ఉన్నది ప్రేమా
నన్ను ఇప్పుడు పట్టించు కోవా
నీ మాటే నాకు వేదవాక్కు మామ
నీ మాటకు జవదాటను మామా

మన మధ్య ఉన్నది గుర్తించే ప్రేమా
నేను ఎప్పుడూ మరవ లేదు సుమా
నా తలపులు ఎప్పుడూ నీచుట్టూనే మామా
నీవుమరచిన నామనసులో ఉన్నావు మామా

మనమధ్య ఉన్నది భందుత్వం మా
కాదు కాదు అంతకన్నా ఎంతో ఉన్నాతమైన
ప్రేమాను రాగాల భంధము మామా
ఆ చందామామ చల్లని చూపులతో
లోకాలు చూసినట్లు నీవు నన్ను
ఎప్పుడూ చల్లగా చూస్తావు మామా
మనమధ్య ఉన్నది జన్మ జన్మల
భంధము కదా మామా   
--((*))--

*మామూలే అంతా మామూలే 

నీతిని అవినీతి మింగేయడం 
పాము తన గుడ్లు తనే తినడం 
ధర్మాన్ని అధర్మం చుట్టెయ్యడం 
ప్రాణం కోసం కోతి బిడ్డను వదలడం 

సత్యాన్ని అసత్యం కమ్మేయ్యడం 
బ్రతుకు తెరువు కోసం అబద్ధమాడటం 
ప్రశ్నించే వాడ్ని వేధించడం 
చేసినతప్పు బయట పడుతుందని భయం 

స్త్రీ అతి మంచిగా పలకరించడం 
మారు అనుమానాల నిలయం  
స్త్రీ నవ్వుతూ పలకరించడం 
తప్పుగా ప్రేమించిందను కోవడం 

అన్యాయం అన్న వాడిని బలిచేయడం 
దౌర్జన్యం ధర్మ మని వాదించడం 
తప్పు చూపినవాణ్ణి తరిమికొట్టడం 
పెద్దలను పోషించక ఆశ్రమంలో ఉంచడం 
మామూలే అంతా మామూలే 
--((*))--