28, నవంబర్ 2013, గురువారం

86. sumtrupti


ఫేస్ బుక్ లో కొంతమంది పురుషపుంగవులు మహిళల తో చాట్ లో అసహ్యమైన పదజాలం,ఆశ్లీల ఫోటో లను పంపడం,ప్రేమిస్తున్నాను అని వేదించటం,కోరిక తీర్చమనటం,,ఆమె ఫోటో,సెల్ నెంబర్ ను పంపమని వేదించటం చేస్తున్నారు ,,ఆమె ఎదురుగా లేదు కదా,,నన్ను ఆమె గుర్తుపట్టలేదు కదా,,పోలీస్ వారికి కంప్లైంట్ ఇచ్చినాకు ఏమి కాదులే,పట్టుకోలేరులే అనుకునే వారికి ఈ పోస్ట్ ,,,
క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్(వాడుకభాషలో నిర్భయ చట్టం)ప్రకారం పై నేరములు చేసిన వారికి 3 సంవత్సరాలవరకు జైలు శిక్ష ,జరిమానా,,
ఇలాంటి నేరము చేసిన వారిని సులభంగా పట్టుకొనుటకు కొత్త టెక్నాలజీ వచ్చింది,,మీ సెల్ ఫోన్ ,,సిమ్ కార్డు ద్వార,కంప్యూటర్ లేదా లాప్ టాప్ ల యొక్క IP నెంబర్ ద్వార, బయట సైబర్ కేఫ్ ల ద్వార పంపితే దాని IP అడ్రెస్ ద్వార నేరగాళ్ళను పట్టుకోనవచ్చు...సైబెర్ కేఫ్ లలో కూడా సీక్రెట్ కెమెరా ల ద్వార మీ ఫోటో కూడా తెలిసిపోతుంది,,,వీటి ద్వార ఒక శుభదినమున సకల మర్యాదలతో మీకోసం మీ ఇంటి ముందు పోలీసులు వుంటారు,,కాబట్టి స్త్రీలను గౌరవించి ,మన గౌరవాన్ని ,భవిష్యత్తు ను కాపాడుకోవలసినడిగా హెచ్చరిక,,,,

సాధారణంగా చాలామంది భోజనం చేసిన తరువాత వెంటనే స్మోక్ చేయడం, స్నానం చేయడం, నిద్రపోవడం వంటివి చేస్తుంటారు. అలా చేయడం వలన వాటి ప్రభావం జీర్ణశక్తిపై పడే అవకాశం ఉన్నది. ప్రతి మనిషి భోజనం చేసిన తరువాత కొన్నిరకాల పనులకు ఖచ్చింతంగా దూరంగా ఉండాలి.. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. స్మోక్ : ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది. తిన్న వెంటనే ఓ దమ్ము కొట్టకపోతే వారికి ఏదోలా ఉంటుంది. ఇది ఖచ్చితంగా చెడు అలవాటే. భోజనం చేసిన వెంటనే కనుక స్మోక్ చేస్తే.. క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. సో, స్మోక్ చేసే అలవాటు ఉన్నవారు.. భోజనం చేసిన తరువాత సిగరెట్ వైపు చూడకుండా ఉంటేనే బెటర్.
2. ఫ్రూట్స్ : భోజనం తరువాత ఏదైనా ఒక పండు తినాలి అంటారు. కాని, అది ముమ్మాటికీ ముప్పే అంటున్నారు వైద్యులు. భోజనం చేసినతరువాత కనుక పండ్లు తీసుకుంటే.. కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది.. కాబట్టి పండ్లు తినాలి అనుకునేవారు భోజనానికి రెండు గంటల ముందో లేదా తరువాతో తీసుకోవాలి.
3. టీ : భోజనం చేసిన వెంటనే టి తాగకూడదు. ఒకవేళ టి తీసుకుంటే.. దానివలన పెద్దమొత్తంలో యాసిడ్ విడుదల అవుతుంది. యాసిడ్ లు ఎక్కువ విడుదల అయితే, తీసుకున్న ఆహరం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అంతేకాకుండా.. ఈ యాసిడ్స్ వలన జీర్ణాశయం దెబ్బతినే అవకాసం కూడా ఉన్నది.
4. బెల్ట్ లూస్ చేయకూడదు: భోజనం చేశాక..పొట్ట టైట్ గా ఉందని చెప్పి బెల్ట్ లూస్ చేస్తుంటారు. అలా చేయడం వలన ఆహారం సరిగా జీర్ణం కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
5. స్నానం : తిన్న వెంటనే స్నానం చేస్తే.. రక్తం చేతులు కాళ్ళకు.. మొత్తం ఒంటికి ప్రవహిస్తుంది.. ఉదరభాగం వద్ద రక్త సరఫరా తగినంత లేకపోవడంతో..ఆహారం జీర్ణం కావడానికి సమయం తీసుకుంటుంది. జీర్ణశక్తి కూడా తగ్గిపోతుంది.
6. నిద్ర : తిన్న వెంటనే నిద్రపోవడం అన్నది కూడా ఒక చెడు అలవాటే.. తిన్న వెంటనే నిద్రకు ఉపక్రమిస్తే.. తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక గాస్ట్రిక్ మరియు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి తిన్న తరువాత నిద్రపోవాలి అనుకుంటే.. ఒక అరగంట అటు ఇటు తిరగడం మంచిది

Like

15, నవంబర్ 2013, శుక్రవారం

83. Subhodayam-1



శుద్ధిగాని మనము చూడలేదు వెలుఁగు
బద్ధకించునెడలఁ బనులు గావు
వృద్ధి గోరెడి వాఁడు విసుగొందఁ బోకుండ
శ్రద్ధతోడఁ బనుల సలుపుచుండు
నిద్దురందునయిన నియమమ్ము దప్పక
బుద్ధిమంతుఁడెపుడు పూన్కినుండు
హద్దులందునిలిచి యన్నింటి నొనరించు
క్రుద్ధుఁడవక యుండి కొంచెమైన
ఆ.వె
సమయపాలనెఱిఁగి చక్కఁగాఁ బాటించు
నిముషమైనఁ గాని విముఖుఁడవక
ప్రముదమొప్ప సలుపుఁ బనులన్ని యిష్టమై
కుమలఁడెపుడు మదిని సమతనుడిగి
సీ.
అవకాశములనన్ని నందిపుచ్చుక వేగ
నివటిల్లు హాయిగాఁ బవలు రేయి
సువిశాల దృష్టితోఁ జూడఁగల్గుటచేత
నవిరోధభావమే యన్నిటందు
భువినెల్ల జీవులన్ బొలుపైన నెయ్యమే
నవతనీయఁడెపుడు లవము గూడ
అవినీతి పరులతో నందఁబోకే పొత్తు
నవినాశి పథమునే యనుసరించు
ఆ.వె
మానితమగుచుండు మనుగడతో నుండి
దానధర్మములను దనియుచుండు
దీన జనులఁ బ్రోచుఁ దృప్తినున్నంతలోఁ
గానఁబడఁగ శివుడె కర్మలందు
--((**))--