15, నవంబర్ 2013, శుక్రవారం

83. Subhodayam-1



శుద్ధిగాని మనము చూడలేదు వెలుఁగు
బద్ధకించునెడలఁ బనులు గావు
వృద్ధి గోరెడి వాఁడు విసుగొందఁ బోకుండ
శ్రద్ధతోడఁ బనుల సలుపుచుండు
నిద్దురందునయిన నియమమ్ము దప్పక
బుద్ధిమంతుఁడెపుడు పూన్కినుండు
హద్దులందునిలిచి యన్నింటి నొనరించు
క్రుద్ధుఁడవక యుండి కొంచెమైన
ఆ.వె
సమయపాలనెఱిఁగి చక్కఁగాఁ బాటించు
నిముషమైనఁ గాని విముఖుఁడవక
ప్రముదమొప్ప సలుపుఁ బనులన్ని యిష్టమై
కుమలఁడెపుడు మదిని సమతనుడిగి
సీ.
అవకాశములనన్ని నందిపుచ్చుక వేగ
నివటిల్లు హాయిగాఁ బవలు రేయి
సువిశాల దృష్టితోఁ జూడఁగల్గుటచేత
నవిరోధభావమే యన్నిటందు
భువినెల్ల జీవులన్ బొలుపైన నెయ్యమే
నవతనీయఁడెపుడు లవము గూడ
అవినీతి పరులతో నందఁబోకే పొత్తు
నవినాశి పథమునే యనుసరించు
ఆ.వె
మానితమగుచుండు మనుగడతో నుండి
దానధర్మములను దనియుచుండు
దీన జనులఁ బ్రోచుఁ దృప్తినున్నంతలోఁ
గానఁబడఁగ శివుడె కర్మలందు
--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి