20, జూన్ 2014, శుక్రవారం

147. Romantic Story-51 ( దాంపత్యానికి దారులు )

                                      ఓం... శ్రీ... రాం ...                ఓం... శ్రీ... రాం ...            ఓం... శ్రీ... రాం ...                                  
   
దాంపత్యానికి దారులు

పిల్లలకు తల్లి తండ్రులు  వివాహము చేయుటకు తమ వంతు కృషి చేస్తారు, తమకు నచ్చినదని  మంచి సంబoధం  అని పెళ్లి చేస్తారు. పెళ్లి అనే బoధం ఏర్పడిన తర్వాత మనసులో ఉండే కోరికలు బయటకు వస్తాయి, ఆ కోరికలను సఫలీక్రుతమ్ చేయుటలో కొందరు  సంత్రుప్తి చెందుతారు, మరికొందరు జీవిత మంతా  ఇదేనా అనుకుంటూ సంసారాన్ని నేట్టు  కుంటు వస్తారు.

కొందరు (తల్లి తండ్రులు) పిల్లలకు స్వేచ్చ నిస్తున్నారు. ఆ స్వేచ్చ వళ్ళ వారి జీవితాన్ని వారే సమర్ధ వంతముగా నిర్వహించుకో గలమని ధైర్యము చేస్తున్నారు.  అదే ప్రేమ, ఆ ప్రేమ మనిషిని ఆలొచిమ్పనీయదు. తనకు కనపడ్డ వారు అందగాడు/అమ్దకత్తె, ఆ నమ్మకముతోను బ్రత కగాలుగుతారు, దెవునిపై నమ్ముకం  పెట్టి జీవిస్తారు.

ప్రేమవళ్ళ చిన్నవస్తువైనా కంటికి దగ్గరగా ఉంచు కుంటే అది ప్రపంచాన్నే కనిపించ కుండా చేస్తుంది.
దాన్నే కాస్త దూరంగా  ఉంచితే దాని ప్రభావము తగ్గు తుంది, ప్రేమ ఉన్న చోట భంధం ఏర్పడుతుంది.  

                         నా ఉద్దేశ్యంలో అంత్యప్రాస భావాలు

మాటలతో మనసు మార్చినావే
మురి పాల నందిమ్చే  కుండవే
ముత్యాలను అందించే  కో ట వే
మాయమాటలతో నన్నుదోచినావే
                                            
                    
                                                                                        
నాదరిచేరినాతొసుఖాలుపంచుకోవే  
నవ్వులతో మనస్సును  మెప్పించవే
మమతలను  పంచుకుందాము రావే
నన్నుగడువు అడుగక తొందరచేయవే

కలువ పూలు కన్నులుకల దానివే
పూల కురులతో  మై మరి పిమ్చవే
ఎత్తుల అందాలతో  మత్తెక్కిమ్చ వే          
మకరందాన్ని అమ్దిమ్చి సుఖపడవే

నా బ్రతుకుకు నీవు జీవ నాడివే
కట్టు బాటుకు ఆయువు  పట్టువే  
నేను నిల బడటానికి నా  శక్తి వే
నా ప్రాణానికి   పసుపు  తాడువే

చక్కని చుక్కవై  చెంతకు చేరవే
చీకటిలొ చల్లని వెన్నెల పంచేవే
చిందులు వేయక కోర్కలుతీర్చవే
చీకటి  పడింది చంద్రుని   చేరావే      

గుండెలోని అనురాగం చిమ్దిమ్చవే
చేసిన బాసలు చెపుతా  వినుకోవే
కోయిల పాటలు వినిపిమ్చ  రావే
నా ఊహల పట్టపు రాణివి  నీ వే    

వైవాహిక భంధం పరీక్షలకు తట్టుకొని బ్రతకాలి
ఇద్దరి ఆలోచనలు, అభి ప్రాయాలు ఒకటవ్వాలి
ఒకరిపై  ఒకరికి గౌరవభావంతో  ప్రేమ ఉండాలి
భాద్యతలు  పెరిగిన అర్ధం చేసుకొని స్థిరపడాలి

ఒకరికి కోపం వస్తే రెండవవారు శాంతం ఉండాలి
ఒకరికి భయం వస్తే, నిర్భయంగా ఉండు అనాలి
ఒకరికి జ్ఞాపకం లోపిస్తే గుర్తు చేసి సర్దుకుపోవాలి
ఒకరిరికి అనమానం వస్తే తక్షణం పరిష్కరించాలి         

ఒకరి ఆర్ధిక పరిస్థితిని ఒకరు  అర్ధం చేసుకోవడం
ఎదుటి వ్యక్తిలో లైంగిక  ఆత్మ విశ్వాసం పెంచడం
ముద్దులతో చిలిపి చిలిపి  కౌగిళ్ళతో ఉడికిమ్చడం
మానసిక సమస్యరాకుండ సుఖపడి సుఖపెట్టడం 

స్పర్శకు మనసులో తెలియని జలదరింపు
స్పర్స ప్రణయ సామ్రాజ్యానికి   పలకరింపు
స్పర్స పన్నీటి జల్లులా  చేరి   పులకరింపు
స్పర్స భాగస్వామికి చెప్పుకో లేనంత వలపు

చేతితో కురులు సవరించి నుదుటపై పెట్టు ముద్దు
వేల్లతో మీటితె కరంటుపాకి తన్మయత్వపు ముద్దు
చిలిపిచేష్టలతో,కవ్విమ్పులతో,కోరికతో పెట్టె ముద్దు
నకసిక పర్యంతం ప్రతి బాగాన్ని తాకి పెట్టె  ముద్దు

శృంగారం లో సంతోషం ఉంటే రుగ్మత  ఎందుకు
కంటి చూపుతొ  పెదాలుఅందిస్తే కోపం ఎందుకు
ఆలింగనంలో చుంబన  క్రీడకు భయ  మెందుకు
సంతోషముతో సుఖపెట్టి సలహా ఇస్తే దిగులెందుకు

నీకునేను, నాకునీవు అని భరోసా ఇస్తే వేయి ఏనుగుల బలం
విస్వాసం తో తనువూ తనువూ కలిస్తే  ఉండు సంసార   బలం
కల్మషంతో కలిస్తే,  కోపంతో  అనుభవిస్తే  పెరుగు ద్వేష బలం
    
శృంగారరాసాస్వాదంపొందితేపెరుగునుబుద్ది,ఆరోగ్యబలం
                                                  

 శృంగార  మంటే  తనువుల  కలయకే కాదు
ఒకరికి  గాయమైతే  వేరొకరికి  నిద్ర ఉండదు
ఒకరికి రోగమున్నమరొకరికి ప్రేమ తరుగదు
లైంగిక శక్తి తగ్గినా ప్రేమశక్తి ఎప్పటికి మారదు

ఎవరో చూస్తారని, చూసినవారెమంటారని చేయకు  సంసారం
ఏదో అదృశ్యశక్తి వెంబడించి నట్లు చేయకుఎప్పుడు వ్యభిచారం
భయంభయంగా అన్య మనస్సుగా ఎప్పుడుచేయకు శృంగారం
లైంగిక  జీవితాల లోకి ఎవ్వరు రారు చేయాలి సుఖ సంసారం

తలుపులు మూసుకొని,    మనసులు   తెరుచుకొని
చీకట్లు  కమ్ముకొని,    మేనిలో   మెరుపు తెచ్చుకొని
భౌతికంగా కలుసుకొని, మానసికంగా ఒక్కరయ్యారని
తనువులు కలుసుకొని, ఆమె అతడ్ని సుఖపెట్టునని

ప్రేమ ఉన్న చోట కోపము మచ్చుకైనా రాదు
లైంగిక  భావాలున్న చోట సిగ్గు  అడ్డు రాదు
శృంగారసుఖం ఉంటే మనస్సు ఎటూ  పోదు
సర్వం అర్పించే చోట భయము  ఉండ రాదు

పడక గదిని  జయించిన వాడు  ప్రపంచాన్ని గెలుస్తాడు
భార్యను సంతోష  పెట్ట లేని  వాడు  కాపురం చేయలేడు
తృప్తిగా జీవిమ్చెవాడు ఎప్పటికి మనస్సు మార్చుకోలేడు
పిల్లలను చదివిస్తూ భార్యకోరిక తీర్చువాడు మఘధీరుడు

శృంగారం మనసుకు,   ఆరోగ్యానికి  గొప్ప వ్యాయామమే
కండర పుష్టి ఉండటం వళ్ళ స్త్రీ పురుషులలో పని వేగమే         
పసందైన కసరత్తు స్త్రీ పురుషుల జీవ ప్రక్రియకు మార్గమే
మన్మధ భానంలా సంసారంలో నిత్య సంతోషాల నిలయమే

భావ ప్రాప్తి కలుగ కుండా ఆకలి తీర్చు కోవద్దు
అన్య మనస్సుతో నగ్న కోరికలుతీర్చు కోవద్దు
శృంగారఅనుభూతులను బుగ్గిపాలు చేయవద్దు
భాగాస్వామికి శృంగారమంటే  వెగట పుట్టిమ్చవద్దు

మానసిక  రుగ్మతులకు  కారణం  శృంగార   లోపం
మనసు మనసు కలవకపోవటం అనుభందం లోపం
చేదు అనుభవాలు వస్తే ఇరువురి మద్య భావ లోపం
ఆవేశంతో అన్న మాటలు  నమ్మి  విడిపోయే  లోకం

పోష్టిక  ఆహారం  తింటే  కామోద్దీపక శక్తి  పెరుగు
ఇల్లాలు  దగ్గరుండి అన్నం  పెడితే ఛాతి  పెరుగు
ములక్కాడలపులుసు తింటే కామోద్రేక శక్తి పెరుగు
కామసాస్త్ర ప్రభావం వళ్ళ " స్త్రీ పురుషులు " కరుగు           

మద్యం త్రాగటం వళ్ళ కాలేయం కాల్పుకు గురి అవుతుంది
ధూమపానమ్ వళ్ళ కాన్సర్  ఖచ్చితంగా వచ్చి తీరుతుంది
మత్తు మందు మనుష్యులను పిచ్చి  వారిగా  మారుస్తుంది
పైవాటికి బానిస అయిన వాడికి అంగస్తంభన సమస్య ఉంటుంది

బొంగరం  తన చుట్టూ తను తిరుగుతుంది, స్వార్ధ పరుడు నిరంతరం తన బాగోగులను ఆలోచిస్తాడు
జోకర్ సర్కస్ బోను చుట్టూ తిరిగి నవ్విస్తాడు,  తన  కుటుంబం బాగుండాలని నవ్వుతూ ఉంటాడు
భూమి తనచుట్టూ తిరిగి సూర్యుని చుట్టూ తిరిగినట్లు, కుటుంబం మేలు తోటివారి మేలు ఆలోచిస్తాడు
సూర్య కిరణాలు సర్వ జీవులకు అందించినట్లు, తన సర్వస్వాన్ని  ఇతరుల  హితానికే సమర్పిస్తాడు     

దంపతులు  పిల్లలు  పుట్ట  కుండా  ఆధునిక  పద్దతులు (కండోమ్స్ మరియు నోటి మాత్రలు)   వాడుతున్నారు. వానివల్ల కొంత కాలము పిల్లలు పుట్ట కుండా ఆపవచ్చు, కాని వాటి వళ్ళ వచ్చే అనేకమైన రోగాలకు భాద్యులు ఎవరు, నడుం నేప్పులని, శరీరం పెరిగిందని, లావుగా ఉన్నామని, పౌష్టిక ఆహారాన్ని తీసు కో కుండా, ఇష్టమైనప్పుడు  భోజనాలు చేయడం, లేదా తేలిక ఆహారము తీసు కోవటం    ఇప్పటివారికి అది మామూలు అయినది.

సైన్సు బాగా పెరిగింది, సంసారుల మద్య తేకండి , ప్రేమానురాగాలు  ఉండవచ్చు, అనుభందం ఉండవచ్చు, శక్తి ఉండవచ్చు,మమతలు ఉండవచ్చు, మనుష్యులను అర్ధం చేసుకొనే శక్తి ఉండవచ్చు, పిల్లలను కనే వయసు ఉండవచ్చు, కాని కాలం మీ చేతుల్లో లేదు. ఎప్పు డూ  మీరు ఆరోగ్యముగా ఉంటారని నమ్మకము లేదు, మనం తినే ఆహారము అటువంటిది.  వయస్సులో ఉన్నప్పుడే పిల్లలను కనీ ఆరోగ్యముగా ఉండటమే నేను చెప్పే దాపత్యానికి దారులు.            
 
            

19, జూన్ 2014, గురువారం

146. Children story-50 (Little Heart)

                                     ఓం... శ్రీ... రాం ...                ఓం... శ్రీ... రాం ...            ఓం... శ్రీ... రాం ...                                   

పసి హృదయము

అదొక పెద్ద హాస్పటల్, అంతా ప్రశాంతముగా ఉన్నది.  అంత పరిసుబ్రముగా  ఉన్నది.  అక్కడ విజిటింగ్ హౌర్స్  లో తప్ప వేరే  టైం లో ఎవ్వరిని లోపలకు పంపరు.  ఎమర్జన్సీ కేసులను ప్రత్యేకముగా చూస్తారు.
అదిఒక హాస్పటల్ గా ఉండదు,  ఒక ప్రశాంతి నిలయముగా ఉంటుంది.  అక్కడ పనిచేసే డాక్టర్ హస్త వాచి  మంచిదని చిన్న రోగానికి, పెద్దరోగానికి,  ప్రతిఒక్కరు  అక్కడ మనుషుల్లో వచ్చే మార్పుల  వళ్ళ వచ్చే రోగాలకు,  బిపి, షుగర్, తైరాఐడ్ మరిఒయు ఎక్సరే  అన్ని టెస్టులు చేయించు కొని తగిన మందులు వాడుతారు.
ఇదే హాస్పటల్ లలో పది నెలలు నిండి ప్రసవ వేదనతో భాదపడుతున్నది, సుబ్బారావుగారి భార్య లక్ష్మి దేవి.
నెప్పులు వస్తున్నాయి,  ఆగి పొతున్నాయి, సుబ్బారావుగారు మాత్రము నార్మల్  డిలివరి చేయాలని డాక్టర్ ను కోరారు.
మేము  శ్రాయశక్తులా ప్రయత్నం చేస్తాము.
అంతా మామీద నమ్మకం పెట్టుకొం
డి, మీ ఇshta దైవాన్ని నమ్ము కొండి అని చెప్పారు డాక్టర్లు.
అర్ధరాత్రి ఖచితముగా 12 గంటలకు మగపిలవాడికి  జన్మనిచ్చింది.  పుట్టిన వెంటనే పిల్లవాడు కెవ్వుమని ఏడవలేదు, డాక్టర్లు ఎంత ప్రయతం చేసినా ఏడవలేదు. నార్మల్ దిలివారి ఐఇమ్ది, తలీ పిల్లోడు క్షేమం అన్నారు. 
అంతలో డాక్టర్ సెల్ నుండి రామ్ రామ్ అనే సౌండ్ వినగానే కెవ్వు మని ఏడ్చాడు.
డాక్టర్లు కూడా  చాలా ఆశ్చర్యపోయారు రామ శబ్దం వినగానే ఏడవటం ఒక విమ్తనిపిమ్చిమ్ది వారికి.

డాక్టర్ సలహా ప్రకారముగా  తల్లి పిల్లవానికి తీసుకొవలసిన జాగర్తలు తెలుసుకొని హాస్పటల్ నుండి ఇంటికి చేరారు.
ఆపిల్లవానికి ఒక శుభముహూర్తాన చిరంజీవి అని నామకరణం చేసారు.
కాలంతో పాటు క్రమ క్రమముగా పెరిగి 5 సంవశ్చరాల బాలుడుగా మారాడు.
తల్లి తండ్రులకు తలలో నాలుకలా తయారయ్యాడు.  స్కూల్లొ చేర్పించారు.  స్కూల్లొ తను చదవక, ఇతరులను చదవనీయడు.
ఆటలలో అందరికన్నా ముందు ఉంటాడు. చదువులో మాత్రము వెనకపడి పోతున్నాడు.  

చిరంజీవి ఎప్పుడు మొదటి బెమ్చీలొ కుర్చుమ్డేవాడు.   పిల్లలతో మాట్లడు తుంటాడు,   ప్రోగ్రెస్ లో మాత్రము ఎమీ ఉండదు,
ఒకనాడు పిల్లలు క్లాసురూమ్లోకి ఒక తేలు వచ్చింది. అది ఆరడుగుల బల్ల క్రిందకు చేరింది. బల్లను ఎవ్వరు కదిలించలేక పోయారు, అప్పుడే చిరంజీవి వచ్చి ఒక్క  చేత్తో ఎత్తి ప్రక్కన పెట్టాడు, తేలును చంపారు,  మరొకసారి స్కూలు బస్సు ఆగిపోతే అందరు దిగి తోయండి అన్నాడు డ్రైవర్.  మీరమ్దరూ కూర్చోండి  నేనొక్కడనే తోస్తాను అని చిరంజీవి  బస్సును  తోసాడు అంతే ఎంతో వేగంతో ముందుకు జరిగింది ఇంజన్ స్టార్ట్ అయింది.
ఒకసారి  స్కూల్లొ కబాడీ పెద్దవాళ్ళు  ఆడుతున్నారు. వాళ్ళలో నన్ను చేర్చుకోమని అడిగాడు చిరంజీవి
ఒక గ్రూపు వారు మాత్రము చిరంజీవిని కూడా చేర్చుకున్నారు.
అ గ్రూపులో  వారు అందరు  పట్టు పడ్డారు. ఒక్క చిరంజీవి మాత్రమే ఉన్నాడు.
చిరంజీవి రామ్, రామ్,   రామ్,  అంటూ కూత పెట్టుతూ అవతల కోర్టులోకివేల్లాడు. అమ్దరూ  కలసి పట్టు కున్నారు.
అంతే అందరిని పట్టుకొని ఒక్క గంతులా పైకి ఎగిరి రేఖను తాకాడు చిరంజీవి. అందరికి  ఆశ్చర్య  మేసింది. 
అంతలో చిరంజీవి స్నేహితుడు ఎడుస్తూ వచ్చాడు, మానాన్న అమ్మ ఎరువులు మందు త్రాగి పడి పోయారు అన్నాడు. అప్పులు తీర్చలేక త్రాగారని అందరు అన్నారు. వెంటనే   చిరంజీవి కొన్ని  ఆకులను చేతిలోకి తీసుకొని  పసరును నోటిలోకి పోసాడు వెంటనే అంతా ఓక  గుటకలాగా మొత్తం కక్కి పోసారు ఇద్దరు, అప్పుడే నిద్రనుండి లేచిన వార్లలాగా మేము బ్రతికె ఉన్నామా అని అడిగారు. అందరికి అది ఒక కలలాగా కనిపించింది.  అ హడావిడిలో చిరంజీవి నెమ్మదిగా జారుకున్నాడు, ఇంటి దారి పట్టాడు.   

సుబ్బారావుగారు బాగున్నారా, బాగున్నాను పంతులు గారు. మీ గురించి మా అబ్బాయి గొప్పగా చెపుతున్నాడు, మీ అబ్బాయి ఎలా చెప్పాడో గాని స్కూల్లొ మాత్రము ఎ సబ్జెక్టు లో మార్కులు రావటములేదు, కేవలము తెలుగులో మాత్రం అందులో నా సబ్జెక్టు లో మాత్రం బాగా వచ్చాయి. ఇట్లా unte ఉమత కష్టం కదండి అన్నడు మాస్టర్.
మీరు మీ అబ్బాయి కలసి ఒక రోజు స్కూలు కు రండి. మీ అబ్బాయి చేసే ఘనకార్యాలు వినగలరు అన్నాడు.  
అమాటలకు సుబ్బారావుగారు, భార్య లక్ష్మి మన చిరంజీవి ఎప్పుడు బాగుపడతాడు, ఈ అల్లరి ఎప్పుడు మాను కుంటాడు, మంచిగా ఎప్పుడు చదువుకుంటాడు అనుకుమ్టు పిల్లవాడ్ని పిలిచారు.
మీ మాష్టర్ వచ్చారు నీవు స్కూల్లొ బాగుగా చ
దువుట లేదుట, నిన్ను మీ న్నాన్న గారిని రామ్మనమం టున్నారు  వారు రేపు వెళ్ళండి అన్నది తల్లి లక్ష్మి.
స్కూలుకు వెళ్లారు సుబ్బారావుగారు కొడుకుతో. హేడ్మాష్టారుగారు, మరియు వేరే టిచర్లు అందరు కాన్ఫరెన్స్  హాల్లో కూర్చొని ఉన్నారు. తక్కువమార్కులు వచ్చిన పిల్లల తల్లి తండ్రులను పిలిచి వారికి మీ పిల్లలు చదవకపోతే టి.సి. ఇచ్చి పంపుతాము అని గట్టిగా చెప్పారు. అదేసమయాన సుబ్బారావుగారికి కూదా అదే మాటలు చెప్పారు. అప్పుడే చిరంజీవి కలగ చేసుకుంటూ నేను నాలుగుమాటలు మాట్లాడవచ్చ అని అన్నాడు. అమ్దరూ ఆశ్చర్య పోయారు. ఇంత చిన్న పిల్లవాడు ఏమి మాట్లాడుతాడు అని వెనక్కి వెళ్ళేవారు కూడా ఆగి వింటున్నారు.
గురువులకు, పెద్దలకు, నాకన్నా పెద్ద విద్యా ర్ధులకు, ఇక్కడున్న ప్రతిఒక్కరిని నన్నుదీవిమ్చాలని ప్రార్ధిమ్చుతూ  నామాటలు తెలియపరుస్తున్నాను.
కాల  చక్రం తిరుగు తుమ్టుంది, పిల్ల
మెదడు చాలా చిన్నది. ప్రతిఒక్కరు ఒకరు లేక ఇద్దరే  పిల్లలను కంటున్నారు. మేము కష్ట పడుతున్నాము, మా పిల్లలు కష్టపడ  కూడదని, బాగుగా పిల్లలను చదివించాలని, ఎంత డబ్బు కర్చు చేసి అయినా ట్యూషన్ పెట్టి నూటికి తొంభైతొమ్మిది రాలేదని భాదపడుతున్నారు.
అందులో మన తల్లి భాషను వదలి అణ్యభాషను ప్రొశ్చహిమ్చు తున్నారు.  అదే గొప్పది అనుకుంటున్నారు, ఇపుడు మన ప్రభుత్వము హిమ్దీకి ప్రాధాన్యత  ఇస్తున్నారు.
ఎ భాష అయినా పిల్లల మనసుకు హత్తుకొనే విధముగా ఉండాలి,  కేవలము అందరు ఆ0గ్లము ఒక గొప్ప చదువనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం మీరె చెప్పడి అన్నాడు, ఆమాటలకూ అందరు ఆశ్చర్య పోయారు.
ఇతరదేశాలలో విద్యాలయాలు వారానికి కేవలము 5 రోజులుమాత్రమే ఉంటున్నాయి, మిగాతా రెండు రోజులు ఉత్చాహముగ కాలము గడుపుతారు,  మనదగ్గర ఆదివారము కుడా ప్రవేట్ క్లాసులు పెట్టి చదవమని వత్తిడి చేస్తున్నారు అది ఎంతవరకు సమంజసం.
దీనికితొడు స్కూలు  యాజమాన్యం కూడా  ఒరియంటేషన్  క్లాసులని, పౌండేషన్ కోర్సులని, వ్యక్తిత్వవికాస కోర్సులని,   ఈ చిన్న పిల్లలకు అవసరమ్మ అని నేను అడుగుతున్నాను అన్నాడు ఆ చిన్న పిల్లవాడు.
నేను అనేది  పిల్లలపై ఎటువంటి వత్తిడి చేయకా వారిని స్వేచ్చాగా చదువుకోనేవిదానము అవసరము, వారి ఆలోచనలు బట్టి, వారి కోరికలు బట్టి తల్లితండ్రులు సహాయము చేయాలి, ఆటలు ఆడుకొనే విధముగా సహకరించాలి. 
నాలో ఏదో శక్తి ఉన్నా
ని మీరమ్దరు అనుకుంటున్నారు. నాలో ఎటువంటి శక్తి లేదు, ఈపని సాధించాలని,పట్టుదల, మనోనిగ్రహ శక్తి మాత్రం  ఉన్నది అన్నాడు చిరంజీవి. నేను చేసినవి ఘనకార్యాలు కాదు, కేవలము పట్టుదలతో చేసినవి, మానవతాద్రుక్పదంతో చేసినవి.
మహోన్నతమైన సంస్కృతి కలిగినది మన భారతదేశం, వేద, సాస్త్ర, పురాణాలు,ఇతిహాసాలు, కాసిమజలీ కధలు, పద్య కావ్యాలు    రామాయణ, భారత, భాగవత  గ్రందాలు మనకు అందు బాటులో  ఉన్నాయి. అవి పాట్య పుస్తకాలుగా పెట్టి ప్రతిఒక్కారికి సత్యం,, ధర్మం. న్యాయం,  గురించి తెలుసుకో గలుగుతారు  అన్నాడు చిరంజీవి.
మనచేతులతో మనమే ఆ పుస్తకాలను భూస్తాపితమ్ చేస్తున్నాము, మన తెలుగుభాషను అవమానిమ్చుటకు ఆంగ్ల భాషను ప్రోస్చ హిచు తున్నాము ఇది అవసరమా.
మనం గీతాచార్యుని భోదలను విందామని అనుకుంటాము  కానివీలు పడదు, ఆకలితో అలమటిమ్చేవారి ఆక్రందనలు మనం వినిపిమ్చుకొం.
సర్వజీవులలో   భగవంతుడున్నాడని అందరికి తెలుసు, కాని పొరుగువారి భాదను పట్టించుకోము.
దప్పికతో భాదపడుతున్న జీవుని మరచి, శివునకు అభిషేకము చేయుటకు ముందుకు వస్తాము ఎందుకు.
పిల్లలను చదువు చదువు అనె వత్తిడి  చేసే మనసు గురువులకు, తల్లి తండ్రులకు ఉండ కూడదు, అటువంటి వారు ఉన్నా అట్టి వారు పిల్లల ద్రష్టిలో శత్రువులుగా మారుతారు అన్నాడు చిరంజీవి.
ఇంకా చెప్పాలని ఉన్నది మీ అమూల్యకాలన్ని నేను వ్యర్ధము చేసననిభావిమ్చాకుమ్డా నేను చెప్పిన విషయాలు అందరు గమనించగలరని భావిస్తూ  ఇంతటి తోముగిస్తున్నాను
అమరు ఒకటే చప్పట్లు కొట్టారు
పిల్లవాడు చిన్నవాడైనా  గట్టిమాటలు చెప్పాడు అన్నారు.  


నాన్న  నాకు  దాహ  మేస్తుమ్ది, మమ్చినీరు కావాలి అన్నాడు చిరంజీవి, నాన్న మా మాస్టార్ ఎమన్నా చెప్పరా మనము ఇంటికి పోదామా అన్నాడు ఆ పసి బాలుడు, ఆమాటలకు అందరు ఆశ్చర్యపోవటం తప్ప ఏమి చేయలేక పోయారు. మీ అబ్బాయికి మంచి తెలివి తేటలు లున్నాయి మీ పిల్లవాడిలో ఏదో మార్పు  వచ్చింది. అని అందరు అన్నారు.
పిల్లవాడ్ని మేచ్చుకున్న్నారే తప్ప ఏమి అనలేదు,  వెంటనే ఇంటికి బయలు దేరాడు చిరంజీవితొ తండ్రి.
ఇంట్లోకి వెళ్ళగానే ముందు మనవాడికి దిష్టి తీయాలి   అంటూ భార్యకు చెప్పాడు, కాళ్లు చేతులు, కడుక్కొని దిష్టి తీసినతర్వాతె లోపలకు రానిచ్చిమ్ది ఇద్దర్ని ఆ ఇల్లాలు.
మనబ్బాయిలొ మార్పు   ఎమన్నా గమనించావా అన్నాడు.
గమనిమ్చానండి  మనం కొండ గట్టు ఆంజనేయస్వామి ఆలయము వేల్లినప్పడి నుండి  వాడిలో ఏదో మార్పు   వచ్చింది నేను మొన్ననే గమనించాను, మీకు చెపుదామనుకున్నాను కాని చెప్పలేదు అన్నది ఆ ఇల్లాలు.
మనబాబు తెల్లవారుజామున సూర్యొదయమ్ కాకముందే లేస్తాడు. సుబ్రముగా కాళ్ళు, చేతులు, మొఖము, కడుక్కొని కొన్ని ఆసనాలు వేస్తాడు, తర్వాత తలారా స్నానము చన్నీళ్ళు చేస్తాడు. ఎందుకురా అంటే చేస్తే మంచిదమ్మా, నీవు నాన్న లేచి తెల్లవారుజామునా స్నానం చేసి  ఆ స్వామివారిని ప్రార్దన చేస్తే మంచిదమ్మా అన్నాడు.  
ఎందుకు మీరు రేపు తెల్లవారుజామున మనాబ్బాయి చేసేవి ఏమిటో మీరె కళ్లారా చూడచ్చు  అందుకని మీరు ముందు  లేవాలి    
నేనేలేచి మన బాబును లేపుతా అన్నడు ఆ తండ్రి.
చిరంజీవి అనుకున్న ప్రకారము అమృత ఘడియలలో లేవటం స్నానము  చేసి సుర్యాసనాలు వేయటం, పద్మాసనం వేసి హనుమంతుని ధ్యానం చేయటం (హనుమంతుని దండకం చదవటం) వీల్లుగమనించారు.
                                                               
శ్రీ ఆంజనేయ  దండకము


శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం  ప్రకీర్తి  ప్రదాయం భజేవాయుపుత్రం  భజేవాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మాతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్నీ నామ సంకీర్తనల్ చేసి నీరూపు వర్ణించి నీ మీదనే దండకం బొ క్కటిన్ జేయు నూహించి నీ  మూర్తి గావించి  నీ సుందరంబెంచి నీ దాస దాసుండనై రామ భక్తుండనై నిన్ను నేగొల్చెదన్ నీ కటాక్షంబునన్  జూచితే వేడుకల్ జేసితే నామోరాలించితే నన్ను రక్షించితే  అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంచ నేనెంత వాడన్  దయాశాలివై జూచితే  దాతవై బ్రోచితే దగ్గరం బిల్చితే తొల్లి సుగ్రీవుకున్మంత్రివై స్వామి కార్యంబు నందుండి  శ్రీ రామ సౌమిత్రులం జూచి వారిన్ విచారించి సర్వేశు పూజించి  యబ్బానుజం బంటు గావించి  యవ్వాలినిన్  జంపి  కాకుస్థ తిలకుందయా దృష్టి వీక్షించి  కిష్కింధ కేతెంచి శ్రీ రామ కర్యార్ధమై లంక కేతెంచియున్  లంకిణిన్ గొట్టియున్ లంకయున్ గాల్చియున్ భూమిజన్ జూచి యానంద ముప్పొంగ యా యుంగరం బిచ్చి యా రత్నమున్ దెచ్చి శ్రీ రామునకున్నిచ్చి సంతోషునిన్ జేసి సుగ్రీ వునిన్   అంగదున్   జాంబవంతాది నీలాదులం గూడి  యాసేతువున్ దాటి వానరల్మూకలై  పెన్మూకలై దై త్యులం  ద్రుంచగా రావణుండంత కాలాగ్ని యుగ్రుండుడై   కోరి బ్రహ్మాండమైనట్టి  యా శక్తినిన్ వేసి యా లక్ష్మణున్ మూర్ఛ   నొందింపగా    న ప్పడే బోయి సంజీవియుం  దెచ్చి  సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాది  వీరాళితో  పోరి చెండాడి  శ్రీ రామ భాణా గ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ నవ్వేళలం నవ్విభీషుణు న్వేడుకన్ దోడు కన్వచ్చి పట్టాభిషేకంబు జేయించి  సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీ రాముతో జేర్చి నయోధ్యకున్  వచ్చి  పట్టాభిషేకంబు సంరంభమై యున్న నీ కన్న  నాకె వ్వ రున్  గూర్మిలేరంచు మన్నించినన్ శ్రీ రామ భక్తీ ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనల్  జేసితే పాపముల్భాయునే  భయములున్దీరునే , భాగ్యముల్ కల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సమ్పత్తులున్   గల్గునే   వానరాకార, యో భక్త మందార యో పుణ్య  సంచార యో వీ ర   యో శూర నీవె సమస్తంబు  నీవే  మహా ఫలంమ్ముగా వెలసి యా తారక బ్రహ్మా మంత్రంబు పఠించుచున్  స్థిరమ్ము గా వజ్ర దేహంబునుం దాల్చి శ్రీరామ శ్రీ రామ యంచున్  మన: పూతమై యెప్పుడున్ తప్పకన్  తలతు నీ  జిహ్వా యందుండి నీ దీర్ఘ దేహంబు త్రైలోక్య సంచారివై రామనామాంకిత ధ్యానివై  బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్ రౌద్ర నీజ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార ఓంకార హ్రీంకార శబ్దంబులన్  భూత ప్రేత పిశాచ శాకినీ డాకిని గాలి దయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలం బడం కొట్టి నీ ముష్టి ఘాతంబులన్ భాహు దండంబులన్ రోమ ఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభా బాసితంబైన  నీ దివ్య తేజంబునన్ జూసి రారా నాముద్దు నరసింహ  యంచున్ దయాద్రుష్టి వీక్షించి  నన్నేలు నా స్వామి  నమస్తే సదాబ్రహ్మచారీ నమస్తే, వాయు పుత్రా     నమస్తే నమస్తే నమోనమ:  
అక్కడే తల్లి తండ్రులు కూడా  స్నానం చేసి వచ్చి ధ్యానం  చేస్తూ కూర్చున్నారు. 
అమ్మ  నాన్న నేను మీకు చెప్పేంత వాడ్ని కాను కాని అందరు కనీసము పది నిముషాలు ఆదేవుడ్ని ప్రార్ధన చేస్తే ధైర్యము, సంతోషము , మన స్  శాంతి  ఉంటుంది .
నేను చెప్పేది కాలాన్ని సద్వినియోగము చేసుకున్నవారికి ఆరోగ్యము, ఆనందము, సంతోషము, ఎటువంటి భయము లుండవు.ఆనాడు.
 Time - కాలము
1.Think of It and Bewar of It.
1. సమయము విలువ తెలుసుకొని జాగర్త పడాలి
2.Identify your Time killers.
2.సమయాన్ని వృదాచేసే సమయాన్ని గమనించాలి
3.Maintain The List of Things to do
3.చేయవలసిన కార్యక్రమాల పట్టికను తయారు చేయాలి
4.Establish priority.
4.ముందుగా చేయవలసినవి చేయాలి.

బుద్ధి మంతులు  ఎవరైనా గడచిపొయిన వాటిని గురించి సోకిమ్చారు,
భవి షత్తును గురించి చిమ్తిమ్చారు, వర్తమానంలోనే తన కర్తవ్యాలను నిర్వహిస్తారు అన్నాడు ఆ చిరంజీవి.
తల్లి తండ్రులు బాల వాక్కు బ్రహ్మ వాక్కు అని భావించి ఆ పసి హృదయపు  ఆమాటలు  వింటున్నారు.
మంచిని గౌరవించి, దేవుణ్ణి ప్రార్ధించి మనస్సు ప్రశాంతముగా ఉమ్చుకోవాలనే ఉద్దేశ్యముతో ఈ కధ వ్రాయటము జరిగింది.                


                                                              

16, జూన్ 2014, సోమవారం

145. Family Comedy Story-4 (Timepass)

   
ఏమండి మిమ్మల్ని పిలుస్తుంది, ఎవరే నన్ను పిలిచేది నీవు తప్ప, నేను కాదండి ప్రకృతి గాలి, మీతో  పాటు నడిచే స్నేహ భంధం.
ఇది రోజు ఉండేది కదా.
ఇదిగో మీరు లుంగి  కట్టుకొని వెళ్ళకండి, అసలే మీరు లపల చెడ్డి వేసుకోరు,  ఎ కుక్కలు వేమ్బడి మ్చాయనుకో లుంగి లాగాయనుకొ అంతే  చూసినవారు ఢమా  అని  పడిపోతారు.
మనుష్యలకు అంత బలహీనతె అన్నాడు.
చాల్లెండి మీ మాటలు,  ఆ నిక్కరు, ఆ " టి " షర్టు వేసుకొని, కాస్త  ఆ బట్ట తలకు దువ్వుకొని పోయి అలా అలా  నడిచి రండి అన్నది శ్రీమతి శ్రీ లత.
కాస్త టి  ఇస్తావా, నడవాలంటే ఓపిక రావాలి కదే,  నాకు నిద్రోచ్చిమ్దనుకో నేను ఎ చెట్టు క్రింద  పడుకున్నాననుకో మా అయన  కనబడలేదని నీవు వెతకాల్సి వస్తుంది అన్నాడు నవ్వుతూ శ్రీ పతిగారు.
ఎందుకు అంత దూరమ్ అలోచిమ్చుతారు, మీకు" టి " ఇస్తున్నానుగా  అన్నది. ఇందులో పంచదార ఏది, మీలొ షుగర్ ఉందికదా అది సరిపోతుమ్దిలెండి అన్నది.  భలే చెప్పవే నాలో సుగారుమ్దని" టి"  లో షుగర్ వేయవ  
ఈ తీ త్రాగే బదులు ఇంత వేపాకు రసం త్రాగటం మంచిది అన్నాడు.
అవునండి నేను మరిచాను రేపటినుంచి మీకు వేపాకు రసం ఇస్తాను,  అది త్రాగి వెళ్ళండి, అదే మీకు మందు, కాసేపు ఉండండి మన పెరటిలో ఉన్న లేత వేపాకు కోసుకొని వస్తా నూరి రసం ఇస్తా. ఉండండి.
నేను వాకింగ్ కు బయలు దేరుతున్నాను, ఇప్పుడే అదికూడా  త్రాగాననుకో బాత్ రూం పాడు చేయాలి అని అంటు, శ్రీమతి బుగ్గమీద చిటి కేస్తూ బయట రోడ్డు మీద నడుచుటకు బయలుదేరాడు.

వాకింగ్ చేసుకొని లోపలకు రాబోతున్నాడు, ఆగండి మీరులొపలకు రాకండి.
ఏమిటే నీవు అనేది,  మీరు బయటంతా తిరిగొచ్చారు,  కాళ్ళు కడుక్కొని లోపలకు రండి,  స్నానం చేసి కూడా  లోపలకు  రమ్మంటావా ఆ రండి అట్లాగే  ఆ తడిసిన గుడ్డలతో అందరికి మీ విస్వరూపం ప్రదర్శిస్తూ లోపలకు రండి సిగ్గు లేక పొతే  సరి  అన్నది.
కాళ్ళు,  మొఖము,  చేతులు,  కడుక్కొని లోపలకు వస్తున్నా కాస్త కాఫీ  ఇస్తావా అన్నాడు శ్రీ పతిగారు శ్రీలతతో.

దానికేం తక్కువలేదు మీరు అడగం గానే అన్ని ఏర్పాట్లు  చేయాలి.    కాదంటే  అలిగి చెట్టు ఎక్కి కూర్చుమ్  టారు మీరు.
అంత లేదే ఏదో కోపము వచ్చినప్పుడే అన్నాడు శ్రీ పతిగారు.  ఇదిగోనండి కాఫీ అని చేతిలో పెట్టింది. పంచదార కూడా వేసాను . మీరు మాత్రలు వాడుతున్నారుగా ఒక్క పూటకు ఎమీ కాదని ఇచ్చాను అన్నది.  మా ఆవిడ చాలా మంచిది. నన్ను అర్ధం చేసు కుంటుంది.
సరేలే ఈరొజన్న వాకింగ్ సక్రమముగా చేసారా,  ఏదన్న తగాదా సృష్టించారా అన్నది.
ఈరొజు జరిగిన సంఘటనలన్నీ నీకు చెపుతా,  ఏదన్న తగాదాలు వస్తే దాని పరిష్కారము నీ దగ్గర ఉన్నదికదా అన్నాడు.
నేను, సుబ్బారావు, పుల్లారావు (ముగ్గురం)  నడుస్తూ పోతున్నాము. 
మాలో సుబ్బారావుకు పూలు కోసే అలవాటు,  పూలు కోస్తున్నాప్పుడు  ఒక ఇంటి యజమాని తన పెంపుడు కుక్కను మాపైకి వదిలాడు. అంతే  పూలు అక్కడే పారబోసి కాలికి బుద్ధి చెప్పాడు సుబ్బారావు,  వాడితో మేము ఉన్నందున మేము కూడా  పరిగెత్తాల్సి  వచ్చింది.  మేము ఆగినప్పుడు అది కూడా  ఆగుతుంది. మేము కదిలితే అదికూడా  కదులుతుంది. పుల్లారావు ఒక రాయి తీసి దాని కాలిమీద కొట్టాడు, అంతే  కోపంతో అది వచ్చి వాడ్ని కరచింది.
అలా ఎంత దూరము పొయామో మాకు తెలియదు. చివరకు అటుతిరిగి ఇటు తిరిగి వచ్చాము అంతే అన్నాడు శ్రీ పతిగారు.
మరేం సంఘటనలు జరుగలేదా అని అడిగింది. జరుగలేదా అంటే జరిగింది ఒక సంఘటన.
తిరిగి వచ్చేటప్పుడు పుల్లరావును డాక్టర్ వద్దకు  సుబ్బారావు తీసికెల్లాడు.  నేను తిరిగి వచ్చేటప్పుడు ఒక మద్య యువతి వాకింగ్ చేస్తూ నన్ను కొన్ని మాటలు అన్నది, నెనుకూడా ఆమెను కొన్ని మాటలు అన్నాను.
మీరెమన్నరొ ఆమెతో ఎం తగాదా తెస్తారో ఈరొజు అన్నది,  ఆ కుక్క గలవారు మన ఇంటి మీదకు వచ్చినా రావచ్చు మీరు బయటకు రాకండి,  ఆయినా మీకు అమ్మాయకు సరిగిన సంభాషణలు చెప్పండి మహాశయా నంది శ్రీ లత.
హలో హలో అని పిలిచింది  ఒక మద్య వయసు స్త్రీ 
అ స్త్రీ తో  ఏమి మాట్లాడారో చెప్పండి.  ఇంతకు ఆమె ఎవరు, మీకు ఆమె ఎప్పటి నుంచి పరిచయము, నాకు ముందు చెప్పండి.  
నీ ఆడ బుద్ధి పోనిచ్చావు కాదు అన్నాడు.
సరే ఎమాట్లాడారో చెప్పండి అన్నది.  అసలు నన్ను చెప్పనిస్తేగా అన్నాడు శ్రీపతి రావు.
నేను మామూలుగా నడుస్తూ పోతున్నాను.
అంకుల్ బాగున్నారా, నేను మీ పక్కింటి కి కొత్తగా వచ్చాము, నాకు నడవటం అలవాటు, కాని మీరు చాలా స్మార్టు గా ఉన్నారు.
మీ బట్ట తల, పెద్ద మీసాలు, చాలా బాగున్నయి.  మద్య వయసుకుర్రోడులా ఉన్నారు అన్నది.
నీవెం తక్కువు తిన్నావా ముసి ముసి నవ్వులతో ముద్దోస్తున్నావు,  ముందర కాళ్ళకు భంధం వేస్తున్నావు,
నీ వాలు  చూపు వల్లా, నడుం ఊపుడు  వల్లా, నీ జడ ఊపుడు  వల్లా, నేను తేలికగా పడిపోతానా  అన్నాను రోషంతో
మీరు నడుస్తుంటే ఒక సింహం నడుస్తున్నట్లు వున్నారు, ఒక మహారాజులా నాకు కనిపిస్తున్నారు  అన్నది.
నీలి కన్నులు చూపులు, పాల పొమ్గుల ఊపుల తో నన్ను ఇరకాటం పెట్టకు అన్నాడు శ్రీపతి అంటు వేగంగా నదుచు కుంటు  బయలు దేరాడు.
నా చూపులకె భయపడి పోతున్నావా అన్నది  ఇమ్తకీ నా వయస్సు ఎంతో తెలుసా కేవలము పది  హీను సమ్వచ్చరాలు  అన్నది.    
మరలా నవ్వుతూ దానిని తిరగేయండి అదే నా వయసు అన్నది.
అప్పటి నుంచి ఆమె చూపులు నామీద ఎటువంటి ప్రభావము చూపుతాయొనని  భయమేస్తున్నదే భార్యామణి గారు అని చెప్పాడు.
చూడండి  రేపడ్నిమ్చి మీరు వాకింగ్ చేయుట లేదు, తగాదాలకన్న ఆడగాలి మహా డేంజర్
ఏమిటే నా శీలమ్ మీద నీకు నమ్మకం లేదా,  మీ మీద నాకు నమ్మకమే అయినా ఆడదాని చూపూకు రాజ్యాలే పోయినట్లు చూసారుగా. 
అంతలోనే వీదిలొ నుండి ఎవరో పిలుస్తున్నట్లు  తెలుసు కుంది  శ్రీ లత, వెంటనే బయటకు వెళ్లి చూసిమ్ది.
అక్కయ్యగారు బావగారు చాలా గట్టివారు,  నేను ఎన్ని మాట్లాడినా నా మొఖం చూడ కుండా మాట్లాడారు, అలామ్టి వారితో మీరెట్లా   కాపురం  చెస్తున్నారండి  అన్నది.
ఇమ్తకూనీవవెరమ్మ అన్నది. అయ్యో   చెప్పటం మరిచాను మీ ప్రక్క ఇంట్లోకి క్రోత్తగా వచ్చాము, మా వారు, నా పిల్లలు అమెరికాలో ఉన్నారు.  మీ వారిని చూసాక మావారు గురుకోచ్చారు, కాస్త  ఆటపట్టించాను మీరేమను కోవద్దండి  అమెరికాలో ఇది మామూ లు, నేను కూడా  ఒక నెలరోజుల్లో అమెరికాకు వెళుతున్నాను  అని చెప్పింది.
శ్రీ లత గుండె మీద భారం తగ్గిమ్దను కుంది, అమ్మో నేలరోజు లుమ్డాలి, అమో ఈ మొగుడ్ని పట్టు కోవటం కష్టం  అను కున్నది.
ఆమె వెళ్ళాక లోపలనుమ్డి వచ్చాడు శ్రీ పతిగారు, అంతా చూసారా, విన్నారా అన్నది.
వెంటనే తలకాయ ఊపాడు.
సరే వెళ్లి కూరలు తెండి అన్ని కూరలు తక్కువ ధరకు తేవాలి అనిచెప్పి పంపించింది. 
కూరలు అప్పుడే తెచ్చారా అన్నది.  ఆ తెచ్చాను ఇవిగో చూడు అని సంచి చూపించాడు.  అబ్బో చాలా కూరలు తెచ్చారే  మీరు రేటు తక్కువా ఏమిటి అని అడిగింది. 
మీ ఆడవాల్లకున్న జబ్బే  ఇది.  తెస్తేనేమో వాటిలో పుచ్చులు ఏరుతారు,  మంచివి చూసి తాగూడదా అంటారు, తెకపోతే అది ఎందు  తాలేదు అని మరీ  అంటారు.  తెస్తే తప్పు,  తాకపోతే మరోతప్పు.  అసలు ఈ కూరల  విషయంలో ఆడవాల్లకు వదిలేయాలి.
ఏమిటండి పెద్ద ఉపన్యాసము ఇస్తున్నారు మీరు అన్నది భార్యామణి.
మీరు తెచ్చిన వాటిలో సగానికి సగం పాడై  పొయి నాయి, నేను ఏమైనా అన్నానా అన్నది.
నీవు అంటావేమోనని నేనే ముందు అన్నాను.
అఘోరించారు, వీటిని ఫ్రిజులో పెట్టండి, ఇదన్న వచ్చా మీకు అన్నది.
ఎమీటే  మరీ చాతకాని వాడిలా గుర్తిమ్చుతావు అన్నాడు.
నేను అనుకుంటున్నాను  అద్దం పగల గొట్టారు,  జాగర్తగా పెట్టాలండి  ఇందులో   అని నెత్తి నోరు బాదుకున్న మీరుచెసెది చేస్తారు, పిల్లిలా తప్పుకుంటారు అన్నాది.    
మీ తెలివి నాకేం అర్ధం కావటం లేదు, ఏ మండి  మీరు ఒక్క వారం రోజులు మా డాక్టర్ అన్నయ్య ఇంటిలో ఉండి రండి. 
ఆ అన్నయ్యది పెద్ద హాస్పటల్, అక్కడ ఉండి అకౌంట్స్  చూస్తు నేర్చుకొండి  అన్నది.
నిన్ను వదలి నేను ఎక్కడకు పోలేనే, కొట్టుకున్న తిట్టుకున్నా మనిద్దరం కలసి  ఉంటే అదో సరదా కదే అన్నడు శ్రీపతి గారు.
మాటలకేం తక్కువలేదు, చేతలే అర్ధం కావు అన్నది.
ఆయనా ఫోన్ చేస్తా,  మా అన్నయ్యకు,   మన ఇద్దరం కలసి వెల్దములె అన్నది.
మా ఆవిడా ఎంతో మంచిది, ములగ చెట్టు  ఎక్కించకండి కింద పడిపోతా అన్నది నవ్వుతూ,
చూసావా నీ నవ్వు ఎంతో బావుంది,
ఈ నవ్వు మొహం చూసె నీకు చిక్కి పోయానే,  లేకపోతె వేరే అమ్మాయిని చేసుకొనే వాడ్ని.
ఎమన్నారుమీరు,  ఇంకో దాన్ని తెచ్చుకుంటార, ఎదీ మల్లి అనండి అన్నది కోపంగా,  కోపం తగ్గించుకొని దగ్గర చేరి
ఏమండి మిమ్మల్ని అంత హింస పెడుతున్నానా నేను అని భాదపడుతూ అన్నది. ఏదో కాస్త ఉడికించాలని కవ్విస్తాను నేను
అవునే ఇదేనే ప్రేమ భందం, నీకు నేను నాకు నీవు.
ఉండండి మీకొసమ్ పాయసం చేశా తీసుకొస్తా అన్నది.  ఒకేసారి రెండు కప్పుల్లో తీసుకురా అన్నాడు.
నేను పూజ చేయందే ముట్టను కదండి అన్నది, మరి నా షుగర్ కదా నేను తినవచ్చ అన్నాడు
పాయసం కప్పు చేతిలో పెదుతూ , తిని ఈ మాత్రలు వేసుకోండి అన్నది.
నా ఆరోగ్యం గురించి చాలా ముండుజాగార్తలు తీసు కుంటావే  నీవు, ఎం జాగార్తలో ఏమో నీ మాటలు నన్ను ఉక్కిరి బిక్కిరి చెస్తున్నా యి, నా పని కావటములేదు అమ్తూ లోపలకు నడిచింది శ్రీమతి.  ఏమండి మా అన్నయ్య గారు మిమ్మల్ని నన్ను రమ్మన మని టిక్కెట్లు పంపించారు వెళ్దామా, అమ్మగారు ఆర్డర్ రావటం, అన్నయ్యగారు ఆర్డర్ ఇవ్వడం, ఈ భర్తగారు తిరస్కరించడం అనేది ఉంటుందా,  అందులో నీవు అన్న తర్వాత మరొవిధముగా జరుగుతుందా అన్నాడు శ్రీపతి గారు.
ఎందు  కండి  అట్లా అంటారు మీ కిష్ట ముంటెనే  వెళ్తాము, లేకపోతె ఎ పుణ్యక్షేత్రముకన్న వెళ్దాం అన్నది.
ముందు మీ అన్నయ్య గారి ఇంటికి వెళ్దాం తరువాత సంగతి ఇప్పుడెందుకు,  మరి సర్దు బయలు దేరుదాము అన్నడు.
లేడికి లేచిందే ప్రయానమన్నట్లు ఉంటే కష్టం భర్తగారు,  ముందు  ఆ టిక్కేట్ల మీద  టైం ఎప్పుడో చూడండి అన్నది.
ఆ కళ్ళజోడు లేదే, మీకు మతిమరుపు కూదా వచ్చింది, మీనెత్తిమెదె ఉంది చూడండి.
అవునే నేను మరిచిపోయాను, ఆ ఉండు చూసిచెపుతాను అని తీసి చూసి రాత్రి పది గంటలకు గుంటూరు బస్సు అన్నాడు.
గుంటూర్ పొవటం,  నెల  రోజులు ఉందామని బయలు దేరి కేవలము పది  రోజుల్లో నే తిరిగి రావటం జరిగింది.
మీరు ఇంటికి వెళ్ళే  లోపు,  మీకు ఒక కొరియర్ వస్తుంది దానిలో మీకు తీర్ధ యాత్రకు ముందుగా కాశి   ప్రయాణమునకు రైల్ టిక్కట్లు కొని పంపుచున్నాను అని ఫోన్ చేసాడు బావగారికి అనగా శ్రిపతిగారికి.
ఏమేవ్ మీ మీఅన్నయ్య మనకోసం కాశి యాత్రకు టిక్కెట్లు కొని పంపిమ్చుతున్నారుట. నీవెమన్న అడిగావా అని  అన్నడు భర్త గారు.
అయ్యో రామా నాకేం పనండి, నీమీద ఒట్టు, నేనేమి అడగలేదు నాకు ఆ విషయము అసలే తెలియదు,  ఆయనా నేనెందుకు కొనమంతానండి, చెట్టంత మొగుడు ప్రక్క నుండగా  అన్నది.
వెటకారము వద్దు.  మీ అన్నయ్య  ఎమూడ్లో ఉన్నాడో  కాని అంతా మనమంచికే కదా, ఇద్దరం  కలసి శివుని దర్శనం చేసుకుందాం అన్నాడు.      

అపుడే కొరియర్ తెచ్చిన లెటర్ తీసుకున్నది శ్రీ లత,
ఉత్తరం చదువుతున్నది. చెల్లెమ్మ నీవె అర్ధామ్తరముగా ఉమ్డ కుమ్డ వెళ్ళటం నాకు నచ్చలేదు, బావగారు నీవు సుఖముగా ఉండటమే నాకు కావలసినది, అందుకనే మీరు ఇద్దరు తీర్ధ్ యాత్రలు చేయుటకు ముందుగా కాశికి టిక్కేట్లు కొని ఇందులో పంపు చున్నాను. మీరు సుఖముగా ప్రయాణం చేసిరండి.
మీరు ఎప్పుడైనా ఇక్కడకు రావచ్చు,  ఎమ్డుకంటే ముందుగా తెలియ పరిస్తే మంచిది.
మీ వారి విషయంలో తెలివో లేక అతి తెలివో నాకర్ధం కాలేదు.  ఇక్కడున్న రోజులు మూడు పువ్వులు ఆరుకాయలుగా  సాగుతున్న నా  హాస్పటల్  ఒక్క సారిగా కుప్పకూలుటకు సిద్దముగా ఉన్న పాక మాడాలా మారి పోవుటకు సిద్దమైనది.
మా అయన చేసిన పని ఏమిటి అని నీవు అడగవచ్చు,  అది కూడా  నేనే చెపుతున్నాను.    
మీ వారు మంచి తెలివిగలవాడని నేను అకౌంట్స్ సెక్షన్  లో పర్య వేక్షణ చేయమన్నాను.
మాదగ్గర విజిటింగ్ వచ్చే పేరు మోసిన డాక్టర్లు కొద్దిగా ఆలస్యము వస్తే వారికి క్రమ శిక్షణ గురించి క్లాసు తీసుకున్నడు.
డాక్టర్లు రావటం తగ్గించారు,  అట్లాగే అకౌంట్స్ బిల్లుల్లో తేడా ఎందుకు అందరికి సమానముగా ఉండాలి అని మా అకౌంట్స్  తో వాదన దిగాడు. అక్కడనుంచి నేనుతోలగిమ్చాను.
మీరు కాంపౌండర్ వద్ద ఉండి కొన్ని విషయాలు తెలుసుకొని జాగర్తగా ఉండండి అని చెప్పాను.
అంతె  మూడు  రోజులు అన్నివిషయాలు తెలుసుకొన్నాడు మీవారు.
ఎరోగానికి ఏమందు వాడుతారు, ఎ ఇంజక్షన్  చేస్తారో గమనించాడు, ఆ మందుల రెట్లు, రోగానికి ఎంత ఫీజు వసూలు చేస్తారు తెలుసుకున్నాడు.
కాంపౌండర్ వద్ద ఉండక వచ్చిన రోగులవద్దకు చేరి మందుల విషయాలు, ఫీజు మరియు  అన్ని విషయాలు తెలియపరిచాడు.
రోగులు రావటం మానివేశారు.
ఇటువంటి భర్తతో నీవు ఎట్లా భరిస్తున్నావు చెల్లి.
ఇట్లా వ్రాసినందుకు నీవు భాదపడ వద్దు. 
ఈ  వయసులో కూడా  నీతి నిజాయతి అంటే కష్టం కదా, అందుకే నీకు ఉత్తరం ద్వారా అన్ని విషయాలు తెలియపరిచాను. నన్ను క్షమించు.  ఇట్లు మీ అన్నయ్య.
ఈ ఉత్తరము అందిన వెంటనే నకు ఫోన్ ద్వారా నా మీద కోపం లేదని చెప్పగలవు.
అప్పుడే ఫోన్ మ్రోగింది అన్నయ్యా నేనే నీకు ఫోన్ చేద్దామనుకున్నా, నీవె ఫోన్ చేసావు,  నీవు వ్రాసిన ఉత్తరము చూసాను.
నలబై సంవత్సరాలనుండి మావారి  మనస్సు నేనే అర్ధం చేసుకోలేక పోయాను, నీవె చెప్పిన విషయాలకు నేను ఏమి అనుకోవటములేదు, ఎందు కంటే,  నాకు ఏది మామూలె.
భార్యగా భర్త  చేసేపనులను సమర్ధించటం తప్ప ఎదురు తిరిగి నా కాపురాన్ని పాడుచేసుకొను.
కొందరికి కొన్ని బలహీనతలు ఉంటాయి, మావారి బలహీనత ఏమిటో నాకు తెలుసు నేను దారిలో పెట్టుకోగలను.
తీర్ధ యాత్ర చేసినతర్వాత మీదగ్గరకొచ్చి ఒక సంవస్చరం ఉమ్డ గలము  అన్నయ్య.
ఫోన్ లో మీరు వచ్చేముందు చెప్పండి, మీరొచ్చాక మేము తీర్ధ యాత్రకు పోతాము అన్నాడు అన్నయ్య నవ్వుతూ.                         
           
                         

                                                      

15, జూన్ 2014, ఆదివారం

144.Thief story -48 ( రైల్లో మాయగాళ్ళు )

                                    ఓం... శ్రీ... రాం ...                ఓం... శ్రీ... రాం ...            ఓం... శ్రీ... రాం ...                                    

రైల్లో మాయగాళ్ళు
 
పూర్వపు భాగ్యనగరం ఈనాడు  హైదరాబాద్ మరియు సికింద్రాబాద్,  జంట నగరాలుగా వృద్ధి చెందింది.  మొన్నటి దాకా ఆంద్రప్రదేశ్ కు   రాజదానిగా ఉన్న ప్రాంతము.  ఇప్పుడు రెండు రాష్ట్రాలగా (తెలంగాణ  మరియు ఆంద్రప్రదేశ్ ) విడి పోయింది,  ఇరువురికి ప్రత్యక ఏర్పాటులు చేస్తున్నట్లు గవర్నర్ తెలియ పరిచారు. ఎందు కంటే ఇరు రాష్ట్రాలకు ఒక్కరే గవర్నర్. (ఇంకా విభజన ఏర్పాట్లు చేస్తున్నారు)

ఈ నగరంలో అతి పురాతనమైన రైల్యే స్టేషన్ కచిగూడ, ఇక్కడ అనేక ఎక్ష్ప్రెస్స్  రైళ్ళు వస్తూ పోతుంటాయి. ఇక్కడ ప్రయాణీకుల  రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఉదయం  7.30 గంటలకు బయలుదేరే  ఇంటర్ సిటి ఎక్ష్ప్రె ప్రెస్   టికెట్టుకోసం "క్యు " లో నిలబడ్డాడు అమాయక చక్రవర్తి రామచద్రం.  శ్రీ పురుషులుకు ఒకే లైన్లో టికెట్టు ఇవ్వటం వళ్ళ కొంత ఆలస్యము అవుతున్నది. అందులో ప్లాట్ ఫోరం టికెట్టు కూడా  అక్కడే ఇవ్వటం వళ్ళ ఆలస్యమవుతుంది. ఆఖరికి నిజామాబాద్ కు టికెటు తీసుకున్నాడు.    
ఆ లైన్లోనే నా పర్సు కొట్టేశారు అనే ఒకతను బీద పలుకులు పలుకగానే మానవ ద్రుక్పధముగా  ఆలోచించి అతనికి కూడా  టికెట్టు తీసుకొని కొంత పైకము కర్చులకు ఇచ్చి ఆదుకున్నాడు రామ చంద్రం. రైలు మూ డో  ప్లాట్ ఫారం మీద ఉండటం వళ్ళ వంతెన ఎక్కి పైకి వెళ్ళాడు రామ చంద్రం,  రైల్వే కూలి ద్వారా తన సూట్  కేసును రైల్లో పెట్టించాడు. మోసినందుకు చిల్లరలేక వంద రూపాయల నో టు ఇచ్చాడు, ఒకరికొకరు తొసు కుంటు,  నెట్టు కుంటు రైలు ఎక్కుతున్నారు, రైల్లోకి తినుబండారాలు అమ్మేవారు ఎక్కుతున్నారు.  సీత్లు ఖాలిలేక నుమ్చున్నవారు ఎక్కువయ్యారు. ఇందుకంటే ఇది పగలు ప్రయాణము అన్ని సీట్లే  ఉంటాయి.      

ఒక్క సారి స్టేషన్  వాతావరణం వేడెక్కింది.   రైలు బయలు దేరింది. నెమ్మదిగా కదిలింది. కొద్ది దూరమ్ వేల్లగాని ఆగింది.  ఎందు కంటే ఎవరో మినిష్టర్ ఎక్కాలని ఆపినట్లు తెలిసింది.   బయట చిన్న చిన్న జల్లుల వర్షం పడుతుంది.  ప్రయాణీకులు పరిగెత్తుతూ ఎక్కలేక వెనుక పడుతున్నారు, యాక్సలేటర్ వచ్చినా అందుకోలేక పోతున్నారు.
ప్రయాణీకులమ్దరు సామానులు సర్దుకుంటు, లేక్కవేసు కుంటు వాటికి గొలుసులు కట్టు కుంటు, పిల్లలను ఉన్న ఖాలీ స్తలములో  పడుకోబెట్టి వాదన దిగేవారుమ్దురు,  సీట్లు  లేక నుంచొని ప్రయాణము చేస్తున్నారు కొందరు, బయట నుండి సీతల పవనాలు, లోపల నుండి  వేడి నిట్టుర్పులు,  ఫాన్ శబ్దాలు,  వేగం పరిగింది కాకి అరుపు కన్నా,  అరుపు పెరిగింది.  కొద్ది సేపటికే మూసీనది పరిమళం ప్రయాణీకులకు ఆహ్లాదము కలిగిమ్చుటలేదు, ఆవేదన కలిగి స్తుంది.       
రామ చంద్రంకు గుండెలో సన్నగా నెప్పి మొదలైంది. ప్రక్క సీటులొ ఉన్న ఒక యువకుడు పెద్దాయన పరిస్తితిని గమనించి చేతితో గుండెను వ్రాస్తూ, నెమ్మదిగా నీల్లు త్రాగించాడు. ఒళ్లంతా నీరు కారుతున్నట్లు చెమటలు, గుండె నెప్పితొ గిలగిల లాడి  పొతున్నారుఅయన,  చటుక్కున గుర్తు కొచ్చింది ఆ యనకు మాత్రలు... అయ్యో మాత్రలు లేవే చీటి  ఉంది అని నిరుచ్చాహ పడ్డాడు, అలాగే ఈ రైల్లో  అనాదిగా చనిపోతానని భయము ఏర్పడింది. 
యువకుడు ఇక్కడ ఎవరైనా డాక్టర్ రున్నార అని అన్ని బొగీలలొ వెతకటం  మొదలపెట్టాడు. అప్పుడే ఒక డాక్టర్ వచ్చి రామ చంద్రంను పరీక్ష చేసి కొన్ని మందులు, ఇంజక్షన్ చేసి  కాస్త విశ్రాంతి తీసుకుంటే  తగ్గుతుంది అన్నాడు. యువకుడు ఆయన ప్రక్క నే ఉండి  సేవలు చేసాడు. నెమ్మదిగా రామ చంద్రం నిద్రలోకి జారుకున్నాడు.
యువకుడు రామచంద్రం బ్యాగ్ తీసి అడ్రస్ కార్డు తీసుకొని ఒక ఉత్తరము పెట్టి నెమ్మదిగా తరువాత స్టేషన్లో దిగిపోయాడు యువకుడు, రాలు వేగములో ఎవరిదారి వారు ఉన్నారు, కొందరు తెచ్చిన టిఫేన్లు తింటున్నారు, కొందరు పనికిరాని మాటలు మాట్లాడుకుంటున్నారు, కొందరు రాజకీయము గురించు మాట్లాడు కుంటున్నారు.   

ఒక పెద్ద ముత్తైదువ తనకున్నా అనుభవాలను తనచుట్టూ ఉన్నా వారికి హిత భోధ చేస్తుంది, ఆవిడ చెప్పే మాటలు వింటున్నారు కొందరు. గుహల యందున్న, కోవెల యందున్న, సహధర్మ చారి ప్రక్క నున్న దుష్ట గుణం మారదువెర్రి కుక్కల వలే, కంటశోషతో పలికే ఊకదంపుడు ఉపన్యాసాలు ఎవరికి ప్రయోజనం లేదుజాతి,కులం,వర్ణం,గోత్రం, భాషా రూపాలన్ని ప్రకృతిలోబ్రతుకుటకు మార్గాలు తప్పా వేరుకాదు నీటిలొగాని, గాలిలోగాని, భూమి మీదగాని" స్త్రీ "  మీద ఉన్న ఆకర్షణ, ప్రేమ భావం  మారదువెంటనే  ఒక కొంటే కుర్రోడు  తిండి ఎందుకు, వస్త్రా లెందుకు, తీర్ధ యాత్రలెందుకు అని అడిగాడు, భలే అడిగావు బాబు  అన్నది.మిడి మిడి జ్ఞానమున్నవారికి,  సక్రమ మార్గమున నడి పించాలని, వారికి జ్ఞాన భోధ చేయాలని  కొందరు సంచారము చేస్తారు, వస్త్రము   వేసుకోకపోతే మనం మృగాలతో  సమానమవుతాము, తిండి తిని కామ, క్రోధ, లోభ, మద, మాత్చార్యాలు అదుపులో పెట్టుకుంటూ సాగేదే జీవితము. ముఖ్య ముగా విద్యార్ధులు మాత్రము విద్యే  దైవముగా, విద్యే సర్వస్వముగా భావించి చదువుకోవాలి, తెలియనివి తెలుసుకొని ఉన్నతులుగా మారాలి. పెద్దలను గురువులను, తల్లి తండ్రులను  గౌరవించాలి. 
తిండి ఉంటే  మనిషికి కండ పెరుగుతుంది
కండ ఉంటే భుద్ది, గుణం, శక్తి పెరుగుతుంది
మేధస్సు పెరిగేతే ధర్మ మార్గం నడవటం జరుగుతుంది
సత్యం, ధర్మ, న్యాయం  ఉన్నచోటే దేశం బాగు పడుతుంది

ఆశక్తిగా వింటున్నవారికి భోధ చేస్తూ మేము ఆశ్రమము నడుపుతున్నాము, అందు అన్నదానమునకు, వృద్ధుల సంరక్షణకు కొంత పై కము  సేకరిస్తున్నాము, మీకు తోచినంత సహాయము చేయమని అడిగింది పెద్ద ముత్తడువు, ఒక రసీదు పుస్తకము తీసి చూపిమ్చి సహాయము అడిగింది. రైల్లో ఉన్నవారు ఎవరికీ తోచినంత వారు అందించారు. 
ఆవిడ  ధర్మ మార్గము గురించి ఉపన్యాసము చెపుతున్నది, రైలు కదులుతున్నది.  

అప్పుడే కొందరు పొలీసులు రైలు ఎక్కారు, వారు చెపుతున్నారు మీ సామానులు భద్రతా మీరె చూసుకొవాలి, కొందరు తిరుగుతున్నారు వారిని వారిని పట్టు కోవాలని మేము వచ్చాము అన్నారు. అప్పటిదాకా  చెపుతున్న పెద్దావిడ ఒక్కసారి ఆపింది. కారణం తెలియలేదు. పొలీసులను చూసి వెంటనే స్టేషన్లో దిగి పోయింది.
టి. సి . వచ్చి టికెట్లు అడుగుతున్నాడు. కొందరు చూపిస్తున్నారు.  టికెట్టు తీసుకోలేదు అని ఒకతను అన్నప్పుడు పెనాల్టితో సహా పైకమ కట్టించుకొని రశీదు ఇస్తున్నాడు. టిక్కెట్  పైకము కట్టలేని వారిని పొలీసు వాల్లకు అప్ప చెపుతున్నాడు.
ఆ రైల్లోనే లంగా ఒనీ వేసుకొని రెండు జల్ల సీతలాగా అమాయక మోహము తో ఉన్న ఒక అమ్మాయిని టికెట్టు అడిగాడు టి.సి., అమ్మాయి టికెట్టు కోసం వెతుకుతున్నది.
చదువుకున్నవారు టికెట్టుకోనరు, గట్టిగా అడిగితె అడవాల్లైతే ఏడుస్తారు, మొగవాల్లయితే దబా ఇస్తారు అని అన్నడు టి.సి
ఆ అమ్మాయిని చూస్తు అదేపనిగా ఓ కొంటే కుర్రోడు టి. సి. తో వాదన దిగాడు,  టికెట్టు కొనక పొతే డబ్బులు కడతారు మీరు నోరు జారకండి  అన్నాడు.  అయితే నీవు కట్టావయ్య అన్నాడు, ఆ కడతామండి, ఎందుకు కట్టం అన్నాడు రోషంతో కట్టాడు .
అక్కడే ఉన్న అమ్మాయి  మీ ఋణం ఉమ్చుకోలెండి మీ అడ్రస్ నాకివ్వండి మీకు  పైకము పంపుతా అన్నది. సరే ఇదిగో అని ఒక కార్డు ఇచ్చి నేను దిగిపోతున్నాను అని తిగి పోయాడు ఆ యువకుడు.
అయ్యో నా బ్యాగు పోయింది ఎవరో తీసుకెల్లరు. ఆ స్టేషన్లో దిగిన వారెవరొ అన్నది. బ్యాగు పోయిందని ఒక్కటే ఏడుపు మొదలు పెట్టింది చుట్టు  ప్రక్కలవారు  ఓదార్చటానికి ప్రయత్నించారు.  అందులో నా సర్తిఫికె ట్సు ఉన్నాయి అవి లేకపోతె నా జీవితమే  నాసన మయి పొతుమ్ది,  నాకు ఉద్యోగము రాదు,  నా చదువు వ్వ్యర్ధ మై పొతుమ్ది. అని గట్టిగా ఎడుస్తున్నాది.     ప్రక్కవారు జాలిపడి నీవు  ఎక్కడ దిగాలి అని అడిగారు   ఏడుపు తప్ప వేరే మాట చెప్పదు.
రైల్లో ఒకాయన చేతిలో డబ్బులేమైనా ఉన్నాయా అన్నప్పుడు ఒక్కటే ఏడుపు,
చేతిలో డబ్బులు కూడా  లేవేమో అంటు వంద రూపయల నోటుఇచ్చాడు. ఊరికినె అల్లా చూస్తారె మీరు కూడా  ఏమైనా  ఇవ్వండి అన్నాడు అ వచ్చిన పెద్ద మనిషి.
ఎవ్వరి డబ్బులు నా కక్కరలేదు, నేను అడుక్కొనే దానిని కాదు అని ఏడుపు మెదలు పెటింది. ఇచ్చిన డబ్బులన్నీ తీసుకొని జాకెట్లో పెట్టు కొని పక్కగా కూర్చొమ్ది
అప్పుడే పొలీసులు రావటం, కేసు బుక్  చేయటం, సాక్షులు సంతకం పెట్టటం వెంటనే జరిగి పోయాయి. 
                   
స్టేషన్ చేరగానే కొందరు నా బ్యాగు కనబడుట లేదు, నా బ్యాగు కనబడుటలేదు అని అంటున్నారు.
రామ చంద్రానికి స్పృహ వచ్చింది.  నన్ను రక్షిమ్చినవానికి ధన్యవాదాలు అని మనసులో అనుకున్నాడు. వెంటనే బ్యాగ్ తీసి  డైరి చూస్తె దానిలో ఒక లెటర్ ఉంది.
దానిలో నేను మాయగాన్ని కాదు,  నా అవసరానికి నేను మీదగ్గర ఉన్న మీ ఉమ్గరము, మీ మేడలో గొలుసు, మీ బ్యాగులో ఉన్న కొంత డబ్బును తీసుకొని వెళ్తున్నాను,  భవిషత్తులో కలుసుకుంటే మీ డబ్బులు మీకు అంద   చేయగలను అన్యధా భావించద్దు, ఆ సమయాన మీ ప్రాణాల్ని కాపాడాలని  అని పించింది.  అప్పుడే అనుకున్న ఇంటిలో ఉన్న మరోప్రాణా న్ని రక్షించుటకు మీ డబ్బులు వాడలనుకొన్న, నన్ను మన్నించండి, నన్ను మాయగాడు అన్న, దొంగ  అన్న  నేను భాద పడను, నా పరిస్తితి ఈ విధముగా చేయిం చింది.
పోలిస్ స్టేషన్లో  కంప్లైంట్ చేయుట తప్ప  బ్యాగులు పోయిన  ప్రయాణీకులకు వేరే మార్గం లేదు.
వాల్లముందే  రెండు జల్ల యువతి, యువకుడు  పోవటం చూసి నోరు విప్పలేక పోయారు, ఎమ్డుకంటే వారిదగ్గర ఏమీలేవు, దోచుకున్నవి దాచుకోవాటానికి దారులెన్నో.
పెద్ద ముత్తఇదువును పొలీసులు పట్టు కెల్లటం చూసారు ప్రయాణికులు, పొలీసులు చెప్పారు మాయమాటలు చెప్పి ఆడపిల్లలను మాయం చేసే మాయలేడి అన్నారు
మన జాగార్తలో ఉంటే ఎమీ పోవు అన్నారు ఒక సన్యాసి, అప్పుడే ప్రక్కన ఉన్న అబ్బాయి మీ జోలి కూడా  పోయిందని ఇందాక ఏడ్చారు కదండి అన్నాడు.
అవును చెప్పటానికే నీతులు ఆచరణకు పనికిరావు అన్నాడు                
 
                               

12, జూన్ 2014, గురువారం

143. Romantic Story-47 (Love is Life)

ప్రేమే జీవితంప్రతిఒక్కరి మనస్సు ప్రశాంతముగా ఉండా లంటె  ప్రేమ ఉండాలి,   ఇరువురి మద్య  ఉండేదే ప్రేమ,   ప్రేమ  రెండక్షరాలు   ఆయినప్పటికి ప్రతిఒక్కరి జీవితములొ  వివిధ  దశలలో  ప్రేమ  ఏర్పడు  తున్నది.    ప్రేమకు సంభందించిన కొన్ని భావాలను ఇందు పొందు పరచాలని ఒక చిన్న కధని కధగా వ్రాస్తున్నాను. పెద్దలు ఏదన్న తప్పు ఉంటే క్షమించమని కోరుచున్నాను.

భూమిపై నివసించే ప్రాణులలో ముఖ్యమైన వారు మానవులు,  మానవులలో ప్రేమ పెరుగుటకు మూల కారకుడు మన్మధుడు అని మన పురాణాలు  చెపుతున్నాయి.   సకల ప్రాణులను,  మన్మధుని సృ ష్టించిన బ్రహ్మ దేవునకు,  లయ కారకుడైన శివునకు, స్థితి కారకుడైన విష్ణువునకు,  ప్రకృతిని సృష్టించి సకల ప్రాణులను ఆదుకొని స్త్రీల యొక్క విశిష్టత తెలియ పరిచిన ఆదిపరాశక్తికి, సకల దేవతలుకు, నా హ్రుదయపూర్వక వందనములు, అభివందనములు.

ఆకాశములోని మేఘాలు గాలికి ఎగిరి పరస్పరం కలుసు కుంటూ,  విడి పోతున్నట్లు, భూమి,   సూర్య చంద్రులు పరిబ్రమనకు అడ్డు లేకుండా జరుగుతూ తిరుగుతూ ఉంటుంది .  అదే విధముగా ప్రపంచములో ఉన్న సకల ప్రాణి కోటి కలుసుకుమ్టు విడిపోతూ కాల చక్రములో కదులుతూ ఉంటారు.   కాలం విచిత్రమైనది మానవులను కొంతకాలము  సుఖముతోను, సంతోషముతోను, సాగించి దుఖములో ఉన్న ప్రేమ అనేది ఉన్నది,  ఆ ప్రేమ సర్వస్వమని,  ఆ ప్రేమ  వల్లనే సకలము బ్రతుకుతున్నారని తెలుసుకోలేక పోతున్నారు. కొందరు ద్వె ష ముతొ ఉన్నా వారిని ప్రేమతో జయించ వచ్చని ప్రేమే జీవితమని వ్రాస్తున్నాను.              

బావా నీ చుట్టూ తిరిగే ఎ ఆడది నిన్ను ప్రేమిమ్చాలేదా,  ఈ  వేదాంత ధోరణి  ఈ వయసులో ఎందుకు,  హాయిగా చెట్ట పట్టాలు వేసుకొని చేరువు గట్ల వెంబడి , చేల గట్ల వెంబడి  తిరిగి వద్దాము,  రా బావా అని అడిగింది. సిగ్గు విడిచి,  అడుగు తున్నమ్దుకు కోపమా , లేదా నీకు ఆడదంటే నే  కోపమా,   అని నెమ్మదిగా అడిగింది.   బావా గులాబి పువ్వు పెట్టు కున్నాను చేసావా.
    
నేను ఎప్పుడు అంతులేని గమనాన్ని,   అవధిలేని కాలాన్ని ప్రేమిస్తున్నాను.  కాలాను గుణంగా,  మనుష్యుల మనస్సు,  గుణమును బట్టి ప్రేమిస్తున్నాను.   గులాబి పూవు అందమైనది  దానిని  నాప్రేమకు  తగిన విధముగా ఉప యోగించు కుంటున్నాను.
వీటి కన్న అంతులేని విశ్వాసం నీ ప్రేమ పై ఉన్నది,   అందుకే నిన్ను మరిమరీ ప్రేమిస్తున్నాను, నాప్రేమ మెరిసే మిణుగురు పురుగు కాదు,   నీపై నాప్రేమ మెరిసే నక్షత్ర కాంతిని మించినది.

ఎం బావా  ఎదురుగ్గా అందమైన చుక్కను  పెట్టుకొని ఎవరైనా ఊరు కుంటారా ,  ఒక  ముద్దివ్వ మని వెంట పడరూ,  నీ వేమొ కనీసమ్ మీద చేయి కీడా వేయవు,  లేదా  భయమా  నీకు  బావా,   ఎది నీ చేయి అంటూ లాక్కొని తన హృదయానికి హద్దుకున్నది, అబ్బ ఎంత వేడిగా ఉన్నది అన్నది.  

ప్రేమ  ప్రేమ అంటూ ఎవరి గురించే మాట్లాడుతున్నావు,  నీ ప్రక్కన అందమైన ఈ రెండు జల్ల సరోజ పెట్టు కొని  పర ద్యానంలో ఉన్న బావను చూసి.

నాప్రేమ వర్షాకాలంలో తాత్కాలికంగా రంగులు విరజిమ్మి అందముగా ఏర్పడే   ఇంద్ర ధనుస్సు కాదు,   భయాన్ని సృష్టించి , మేఘ గర్జనలు చేస్తూ మెరసె మెరుపు కాదు,   నా ప్రేమ సూర్య తెజస్సుకన్న తీక్షనమైనది.   చంద్రుని వెన్నెల కన్నా,   పున్నమి జాబిలి కన్నా చల్లనిది.

బావా నేను పోతున్నా నీవు,  తీరుబాటుగా కూర్చొని కవిత్వాలు వ్రాసుకో,  ఎ గొ ట్టం వాడు వచ్చి నన్ను తన్నుకు పోతాడు అప్పుడు కూర్చొని ఎడుద్దానివి అన్నది సరోజ.

అప్రయత్నంగా బయట ప్రపంచముపై  నాదృష్టి లాగుట లేదు.  నా దృష్టి ఎప్పుడు నీ చుట్టూ  తిరుగు తుమ్టుంది. విశాల సృష్టి నిలువు టద్దముగా నాకు కనబడుతుంది.  అందులో నీ వోక్కదానివే నా ప్రేమ కోసం తపిస్తున్నావు, నీ ప్రేమ కోసం నేను తపిస్తున్నాను.  నా ప్రేమ వేసవిలో అందించే చల్లటి  నీరు లాంటిది.  వెన్నెల కాంతిలో, పుష్పపరిమలాల  మద్యలో, మనసును ఆహ్లాద పరిచి ఆనంద పరిచేది నా ప్రేమ.  మన ఇద్దరి మద్య జన్మ జన్మల భంధం ఉంది,  నా మనసు నీదని, నీ మనసు నాదని, అద్దంలో ప్రతిబింబముగా సాస్వితముగా నిలిచిపోతుంది.         

సరోజ ఉమ్డబట్టలేక ఒక్కసారిగా బావాను గట్టిగా చేతులతో  కౌగలిమ్చు కుంది (భందిమ్చిమ్ది).

అంతే  బావలో ఎక్కడలేని ఆవేశము పెరిగిగింది, తనచేతులతో వళ్ళంతా నిమిరాడు. ఇంత సుఖము నేనెప్పుడు చూడలేదే, నీ ప్రేమ నా సొంతమే కదా అన్నాడు బావా.

ఆ ఇప్పడి దాకా సొంతము,  ఇటువంటి వెర్రి బాగోలోడ్ని నేను ఎందుకు చేసుకొంటా.  ఏదో టచ్ ఎలా ఉంటుందో  చూసా అంతే అంటూ ఒక్క తోపు తోసి వెనక్కు వెళ్ళింది సరోజ.
   
వసంతములో వికసించే పుష్పాలకన్నా, దేవతా కణ్యలకన్నా,  బంగారు కాంతులతో వెలసి యున్న పుత్తడి బొమ్మ కన్నా, హేమంతంలో చల్లదనం పెంచే మంచు కన్నా,  మొగలిరేకులు, సంపెంగ పూలు, పారిజాత పూల వాసన కన్నా,  పాలల్లో కరిగే పంచదార బొమ్మ కన్నా,  సముద్రములో కలసి పోయే సకల ప్రాణుల కన్నా,  నీ ప్రేమ  నాకేంతోమిన్న.  నీ స్పర్స నాలో ఆ శ లు రేపుతున్నది.

అబ్బో ఒక్క స్పర్సకే  ఇంత కవిత్వమా,  నా మొత్తం శరీరం చూపించా ననుకొ ఇంకా ఎంత కవిత్వం రాస్తావు బావా.

జీవితమ్ బొంగరంలా తిరగటానికి, కట్టు బాటులో కట్టడి ఉండటానికి, బానిస బ్రతుకు నుండి  బయట పడటానికి, వర్తమానంలో పుణ్య  కార్యాలు చేయటానికి, పెద్దలను, గురువులను ఆదరించ టానికి, నీ ప్రేమ నాకు ముఖ్యం.నీ శరీరం  కాదు.

బావా  నా ప్రేమ అంతా  నీమెదె ఉన్నది,  ఇందా ఈ ముద్దుకు నీ దాహం తీర్చుకొ అని పెదవులు అందించింది.

తన్మయత్వంలో సుఖం అనుభవించి మరలా ఇట్లా అన్నడు బావా

గంగ నీటిలో తీయదన్నాన్ని మించిన దాహార్తిని తీరుస్తావు,  భూమాతను మించిన సహనంతో నన్ను ఆదు కుంటావు,  ఆశల వలయములొ చిక్కకుండా తృప్తిగా సహకరిస్తావు,  అవసరానికి సరి ఐన సలహా ఇచ్చి ఆదు కుంటావు,  ఆదమరచి నిద్రించిన తట్టి లేపి సక్రమ మార్గమున నడిపించే దానవు నీవు,  అందుకే నీ ప్రేమ నాకే సొంతం. నీ ముద్దులతోనన్ను కవ్వించకే మదన సుందరి.

బావా నీ ప్రేమకో దండం, నీకో దండం నా దారిన నేను పోతున్నాను తీరు బాటుగా కూర్చొని వ్రాసుకో,  ప్రేమ దోమ అంటూ తిరుగు, ఏదో తలక మాసింది దొరికుతుంది దానిని కట్టుకో,  వెల్లోస్తా అని బావను వెనక్కి  తోసి  వెళ్ళింది.

ఎందుకే  అలా   తోస్తావే నీ ప్రేమను  నేను  కాదన్నానా,

ఆ కాదనలేదు, అలా ఆని అవునను లేదు, పిట పిటలాడే  పిట్టను ప్రక్కను పెట్టుకొని ఈ కవిత్వ మెమ్దుకు బావా     
సిగ్గు విడిచి సిగ్గును చూపిమ్చిన ఈతనిలొ మార్పు  రాదు,   ఏదో ప్రేమ పిచ్చి,  ఎవరో ప్రేమించి వదిలేసారు,  ఆమె ప్రేమ కోసమే వ్రాస్తున్నాడు ప్రేమా ప్రేమా అంటూ ఏదో పిచ్చి కవితలు.

సరోజ అక్కడ ఏమ్చేస్తున్నావు అ పిచ్చి వాడితో అన్నాడు  కన్న తండ్రి  ఒక్క ఆరుపుతో
అంతే ఒక్క గంతున పరుగెత్తిమ్ది.

అగ్ని జ్వాలలు జీవితములొ తారస  పడినా, భయము చెందక చల్లటి అమృతమును అందిస్తావు. రా ప్రేయసి నీ వెక్కడున్న నాప్రేమ చావదు , నీ చుట్టూ తిరుగు తుంటుంది అంటూ చెరువు గట్టు వెంబడి నడుస్తున్నాడు రాము.

గట్టు మీద పోతున్న ఒక పల్లె పడుచును చూసి " నా సీత "  అని బ్రమిమ్చి ఈ విధముగా అన్నాడు.

నీ  అందెల  సవ్వడి  నా  గుండెల పై చేస్తుంది అలజడి,  నీ ముగ్ధ మోహన రూపానికి అందాల పాపిడి,  నీ కనురెప్పల సైగలు,  నీ పెదవి విరుపులు నా హృదయాన్ని తోలచి వేస్తున్న ప్రేమ  జలపాత  ఉరవడి,   నీ వంటిపై పావడా కదలికకు నాలో రేకెత్తిస్తుంది, తెలియని కలల సవ్వడి,  నీ కర్ణములు ఆనుకొని మెలికలు తిరిగిన కేశములు  'రా రా  '  నా కురులు సరిచేసి,  కురులలలో ఉన్న సంపెంగ, మల్లి,  విరజాజి, గులాభి,  సౌరభాలను ఆస్వాదించి,  వలపును పెంచి,  వయ్యరాలలో ముంచి, వయసును ఊరడిమ్చి,  వేణునాదంతో మనసును కరగించి,  ఆనంద డోలికల్లో ముంచి తనువూ తనువూ తన్మయ పరిచేదే ప్రేమంటె  ప్రేమ.
అంటూ ఆమెను   దగ్గరకు లాగ  బోయాడు,  అమ్మో  పిచ్చోడు అంటూ,  కుండను ప్రక్కన పడేసి వెనక్కు పరుగెత్తిమ్ది పల్లె పడచు,

రాము ఏమిటి అలా  వున్నావు అని అడిగాడు స్నేహితుడు గోపి, నా ప్రియురాలు నాకు పరీక్ష పెట్టింది. నేను గెలిస్తేనే నన్ను వివాహము చేసు కుంటా నంటుంది అన్నడు.  నీ  ప్రియురాలు ఏది.
ఉంది నేను గెలిచిం తర్వాత  వస్తానంది అన్నడు.

నెల సాక్షిగా, నింగి సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, దేవతలసాక్షిగా, నాప్రేమ నీ కేనని  ప్రమాణము చేస్తున్నాను, నా ప్రేమను నిజం చేసుకోవాలంటే  నీవు ఎటువంటి పరిక్షలు పెట్టినా, నేను జయించి నీ ప్రేమను పొందుతాను, నా ప్రేమలో ఎటువంటి కల్మషము లేదు,
స్వచ్చమైన తేట నీరులాగా తీయదనాన్ని  నీకు అందిస్తా,  అరికాలి నుండి శిరస్సు దాకా ఎగబాకే రక్తంలా నీపై నాకు ఉంది విశ్వాసమైన ప్రేమ.
మరి గెలువ లేదా నీ ప్రేమ అన్నడు.  నా ప్రేమ గెలిచింది, నేను గెలిచాను,  కాని నా మాట,  నారూపం,  ఆమెకు నచ్చి,  నచ్చలేదు అని చెపింది,  అందుకే నేను పనికిరానని నా ప్రేమను  తిరస్కరించింది 

చిట్లిపొయిన చిగురు టాకులు, ఎండి పొయి  రాలిపోయిన ఆకులు,  నాలో రేకెత్తు  తున్న వింత కోర్కలు, నా మనసులో ఉన్న నిన్ను మాత్రం కదిలించలేవు,  కొమ్మ కొమ్మా రాచుకొని రాలిపోయిన పూల రేకులు, మత్తును పెంచి  మైమరిపించే గాలికి రాలే పారిజాతాలు నీ పై ఉన్న ప్రేమను వేరుచేయలేవు. అంటూ గట్టిగా ఆమెను అడిగాను, నా ప్రేమను పొందితే నీవు సుఖ పడతావు అన్నాను, కాని నా   'సీత  '  ఒప్పు కోలేదు,  నన్ను పోషించి స్తోమత నీకున్దా, నీకు   ఆస్తి ఎంత అని అడిగింది. నేను నా ప్రేమను మాత్రమె తెలియపరచ గలిగాను, ఆస్తి గురించి  చెప్పలేక పోయాను అయినా నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాను   

నాలో పెరిగే రుణ భారాలు, నీ ప్రేమకు అంతరాయము కలిగించవు,  ఆర్ధికంగా మార్పులు వచ్చినా, అనర్ధాలు నన్ను వేమ్బదిమ్చినా, నీపై ఉన్న ప్రేమ మాత్రము చెక్కు చెదరదు,  తూర్పున ఉదయించే  సూర్యుడు  పడమర  ఉదఇమ్చ వచ్చు,  అగ్నిజ్వాల నీరుగా మారినా మారవచ్చు,  మూర్ఖుడు  బుద్ధిమంతుడుగా మారినా మారవచ్చు, కాని నాప్రేమ నీ పై తరగనిది, విడి పోనిది, సాస్వితమైనది.
అని గట్టిగా చెప్పను. నన్ను ఒక పనికి రాని  విత్తనముగా భావించి బయటకు నేటి వేసింది నా ప్రియురాలు.

విత్తనం చేతిలో పట్టుకుంటే ఫలితము ఉండదు,   దానిని నేలలో పాతితే గాలి నీరు తోడై చీకటిలొ నుండి వెలుగులోకి మొక్కగా  వస్తుంది.   అంటే  ప్రేమ అనే బీజమ్ చీకటిలో మానవులలో ఏర్పడుతుంది.  ఆ ప్రేమ ఎన్ని సునామీలు వచ్చినను, ఎన్ని భూకమ్పములు వచ్చినను మారదు.  ఎందు కంటే ఆ పరమాత్ముడు వయసుకు తగ్గ ప్రేమను మానవులలో కల్పించాడు.
ఇంట్లోవాల్లను  కూడా  గట్టిగా అడిగించాను, నేను మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకొని సుఖ పెడతాను అని ఒట్టు పెట్టి చెప్పినా వినలేదు, నా తల్లి తండ్రులను అవమానించి పంపించారు గోపి, మరి నా ప్రేమ గెలిచేదేప్పుడు అని అడిగాడు రాము. 

రాము ప్రేమించినవరందరూ పెళ్ళిళ్ళు చేసుకోలేదు,  ప్రేమను సద్వినియోగము చేసుకొని సుఖపడుతున్నవారు కొందరు,  సద్వినియోగము చేసుకోలేక,  అటు ప్రేమను పొందలేక,   కుడితిలో పడ్డ ఎలుక లాగా భాద పడుతూ ఉన్నారు మరికొందరు, వేరొకరికి చెప్పుకోలేరు,   ధైర్యము  చేయలేరు,  పిరికి వారుగా బ్రతుకు తుంటారు కొందరు.  మరికొందరు ప్రేమను చంపుకొని జీవితము గడుపుతున్నారు. కొందరు మాత్రమే చేసుకున్నారు. మరికొందరు ప్రేమను త్యాగం చేస్తున్నారు,    నీవు భాద పడుటలో అర్ధం లేదు అన్నాడు గోపి
ఇప్పుడు నీకు ఒక తోడూ కావాలి
ప్రకృతిలో అవయవాలకు తోబుట్టువులుగా వ్యాధులు   కూడా   వస్తాయి,   చేతికి,  కాళ్ళకు గాయాలు అవుతాయి,  జలుబు, దగ్గు , ఆయాసము పెరుగుతాయి, పన్నుపోటు, వెన్నుపోటు పెరుగుతుంది.  ఇన్ని ఉన్న మనిషిలో ప్రేమ మారదు,  హృదయములో ఉన్న ప్రేమకు ఎటువంటి రోగములు రావు, ఎప్పుడు నేను నీ వెంట  ఉన్నాను అని శబ్దం చేస్తూ వుంటుంది ప్రేమ. ఆ ప్రేమను నీవు చేసుకొనే  అమ్మాయిలో   చూసు కో  రాము అన్నాడు   గోపి 
ప్రేమ అనేది అనేక రకాలు, తల్లిపై, చెల్లి, ఇల్లాలుపే, స్నేహిడుపై ఉంటుంది. అందరిపై ప్రేమ ప్రేమ అని వెంబడిస్తూ ఉన్దగూడదు,
అన్నడు గోపి 
ఫోటోను వెలుగులో తీస్తారు, దానిని చీకటి గదిలో డెవలప్ చేస్తారు, అదేవిధముగా దేవుని సృష్టి చీకటిలొ ప్రారంభమై వెలుగులో బ్రతకమని, ప్రేమను నలుగురికి పంచుటకు భూలోకమునకు చేరారు,  ప్రేమ అనేది మనసును దోచిన వారిపై అధికముగా  ఉంటుంది, మిగిలిన వారిపై సూర్య చంద్రుల ప్రయాణములా ఉంటుంది ప్రేమ.
నీ ప్రియురాలు ఉండే అడ్రస్సు నాకు చెప్పు,  ఇప్పడే నాకు తోచిన సహాయము చేస్తాను అన్నాడు గోపి రాముతో.
తనజేబులో ఉన్న కాగితము ఫోటో చూపించాడు రాము.

అంతే  ఆ ఫోటోను చూసి మూర్చ పోయాడు గోపి. ఎందు కంటే రాము ప్రేమించినది,  తను చేసుకో పొయ్యేది  ఆమే అని తెలుసుకొని 
గోపి, రాము  ప్రేమలు గురించి ఆలోచిస్తూ స్త్రీల గురించి ఈ విధముగా నుకున్తున్నాడు. (నేను పెళ్లిని త్యాగం చేయాలి రాముడు  సీతను కలపాలి అదే నా ద్యేయం  అని అనుకున్నాడు గోపి )

" కొందరు ప్రేమను పంచుకోలేక విధిని ఎదిరించలేక ప్రాణ త్యాగం చేస్తున్నారు.
కొందరు ప్రేమను జయించ కోలేక పెద్దలుచేప్పినవారిని వివాహము చేసుకొని,  ప్రేమను పంచలేక జీవఛవములాగా బ్రతుకుతున్నారు, మరికొందరు దైర్యము చేసి, విడాకులు తీసుకొని ప్రేమిమ్చినవారిని వివాహము చేసుకొని సుఖపడుతున్నారు.
కొందరు ఆచారాలను, ఎదిరించి ప్రేమే సర్వస్వమని భావించి పెళ్లి చేసుకొని జీవితాన్ని నందనవనంగా మార్చుకుంటున్నారు.
కొందరు సంసార సుఖము లేక నిత్యమూ తగాదాలతో, అనుమానాలతో, ప్రేమను పంచుకోలేక ద్వేషంతో విడిపోతున్నారు.
కొందరు అత్తమామలు, భర్త పెట్టె హింసను భరించలేక, తల్లి తండ్రులకు చెప్పుకోలేక స్వతంత్రంగా బ్రతుకు తున్నారు.
కొందరు బ్రతుకు తెరువుకోసం శరీరాని అమ్ముకొని జీవిస్తున్నారు.
ఎక్కువమంది సంప్రదాయముగా వివాహము చేసుకొని సంసారమే సుఖ దాయకమని భావించి, పెద్దలు, గురువులు, దీవెనలు పొమ్దుతూ కుటుంబ మంతకు  ప్రేమను పమ్చుతూ జీవిస్తు ఉంటారు ".

విద్య, తపస్సు, ధనం, వయస్సు, రూపమ్,  కులం, ఇవి మంచివారికి సుగుణాలు, అవి మానవులకు ప్రేమను పెంచుటకు ఉపయోగ  పడును. ఈ సుగుణాలే  కొందరని  అహంకారులకు, దోషాలుగా మార్చును,   అటువంటి  వారిలో  ప్రేమ అనేది ఒక కక్షగా మారుతుంది. అటువంటివారు మాటలతో, చేతలతో, కిమ్చ పరుస్తూ  పైసాచికముగా ఆనందాన్ని పొందుతారు. ఆది పత్యాన్ని ప్రదర్సించడానికి తహ తహ లాడుతారు, ఇటు వంటి వారిని ప్రేమతోనే జయించాలి  అనుకున్నాడు గోపి.
వెంటనే గోపి సీత వద్దకు పోయి నేను చెప్పిన చోటుకు నీవు రావాలి, నేను చెప్పినట్లు చేయాలి అన్నాడు.

దూరదర్సినిలొ దృశ్య, శబ్ద తరంగాలు విద్యుత్ తో కలసి మన కంటి చూపుకు ఆనందము కలిగించే దృశ్యాలు  మానవ మేధస్సుకు ప్రతిరూపముగా మన మనస్సును చెరుతాయి,  మన ఆలోచనలను పెమ్చుతాయి,  అనుకోని విధముగా దూరదర్సినిపై ప్రేమ పెరిగి,  దృశ్యాలాపే లీనమై పోతారు, కన్నవారిని, తోడు ఉన్నవారిని ప్రేమించిన వారిని గుర్తు పట్టలేరు అన్నాడు గోపి.

రాము సీతను చూసాడు, తనలోని ప్రేమ అంత ఆమె వద్ద క్రుమ్మరించాడు.
సీత రామును ఘాడంగా కౌగలించుకొని  నీవు వేరేపెల్లి చేసుకున్నవని,  నేను నచ్చ లేదని చెప్పారని  మానాన్నగారు చెప్పారు, గత్యంతరం లేక నేను ఈ పేల్లికి ఒప్పుకున్నాను అన్నది.  మన ఇద్దరినీ ఎవ్వరువిదదీయలెరు అన్నది "సీత "
ప్రేమపై భావ కవితలు

ప్రేమ అనేది ప్రళయము కాదు, కాని ప్రణయ మవుతుంది
ప్రేమ అనేది ఆకర్షణ కాదు,  హృదయ స్పందన మవుతుంది
ప్రేమ అంటే భోగం కాదు,  హృదయ త్యాగం అవుతుంది
ప్రేమ ప్రేమను ప్రెమిస్తూ  అందరిని ప్రాణం పోసి బ్రతికిస్తుంది.
         
ప్రేమకు మరణం లేదు, వయస్సుతో పనిలేదు
ప్రేమ ఒక కావ్యం కాదు, యావ్వనంతో పనిలేదు
ప్రేమ పాషానం కాదు, మనస్సును వదలలేదు
ప్రేమ తప్పస్సు కాదు, ఎవ్వరికి కనిపించ లేదు

ప్రేమ మంచులా కరగదు, పాషానంగా మారదు
ప్రేమ ప్రాణం పోయుట మరువదు, ప్రాణాలు తీయదు
ప్రేమ స్వార్ధానికి తావివ్వదు, ప్రేమ ప్రలోభాలకు లొంగదు
ప్రేమ చీకటిని చేరనివ్వదు, ప్రేమ తెజస్సు నివ్వగలదు

ప్రేమ అనేది ఇష్టపడి పని చేస్తే సంతుప్తి పెంచుతుంది
ప్రేమ కాలాన్ని బట్టి పనిచేస్తే మేధాశక్తిని పెంచుతుంది
ప్రేమ వళ్ళ మానవుల్లో, దైర్యము, వ్యక్తిత్వము పెరుగుతుంది
ప్రేమతో దేవుణ్ణి  ప్రార్ధిస్తే అందరికి మనశాంతి పెరుగుతుంది

ప్రేమ చద్రుని చల్లదన్నాని, శంఖం లా కాంతిని ఇస్తుంది
ప్రేమ పాలలాగ తీయదన్నాని, వజ్రము లా వెలుగు నిస్తుంది
ప్రేమ కంటి పాపలాగా కాపాడుతుందని, పాపలా నవ్వుతుంది
ప్రేమ వలపును పెంచి, ఆరోగ్యానిచ్చి, సుఖ నిద్ర పంచుతుంది.

మన ఇద్దరం పెళ్ళిచేసుకుందాం, మన ప్రేమను నిజం చేద్దాం అన్నది సీత, రాము అన్నాడు గోపితో
నీవు మా ఇద్దరినీ కలిపి గొప్ప పని చేసావు,  మా ప్రేమ సాస్వితముగా నిలబడి పోతుంది.  నేను ప్రేమ పిచ్చి వాడును  కాను  అన్నా డు.
అంతలో బావా అంటూ సరోజ వచ్చింది.
గోపి నీవెమను కోకుండా ఉంటె   నా మరదలను నీవు పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు రాము ప్రేమతో

సీతారాములు, గోపి సరోజల పెళ్లి గొప్పగా జరిగింది.                                                                                                     

ప్రేమ వళ్ళ సుఖం
ప్రేమ వళ్ళ ఆనందం
ప్రేమ వళ్ళ అనుభందం
ప్రేమ వళ్ళ మోక్షం           

ప్రేమించినవాడు పిచ్చివాడు కాకూడదు, ప్రేమను  జయించాలి
అదే నిజమైన  ప్రేమ  జీవితమ్