16, జూన్ 2014, సోమవారం

145. Family Comedy Story-4 (Timepass)

   
ఏమండి మిమ్మల్ని పిలుస్తుంది, ఎవరే నన్ను పిలిచేది నీవు తప్ప, నేను కాదండి ప్రకృతి గాలి, మీతో  పాటు నడిచే స్నేహ భంధం.
ఇది రోజు ఉండేది కదా.
ఇదిగో మీరు లుంగి  కట్టుకొని వెళ్ళకండి, అసలే మీరు లపల చెడ్డి వేసుకోరు,  ఎ కుక్కలు వేమ్బడి మ్చాయనుకో లుంగి లాగాయనుకొ అంతే  చూసినవారు ఢమా  అని  పడిపోతారు.
మనుష్యలకు అంత బలహీనతె అన్నాడు.
చాల్లెండి మీ మాటలు,  ఆ నిక్కరు, ఆ " టి " షర్టు వేసుకొని, కాస్త  ఆ బట్ట తలకు దువ్వుకొని పోయి అలా అలా  నడిచి రండి అన్నది శ్రీమతి శ్రీ లత.
కాస్త టి  ఇస్తావా, నడవాలంటే ఓపిక రావాలి కదే,  నాకు నిద్రోచ్చిమ్దనుకో నేను ఎ చెట్టు క్రింద  పడుకున్నాననుకో మా అయన  కనబడలేదని నీవు వెతకాల్సి వస్తుంది అన్నాడు నవ్వుతూ శ్రీ పతిగారు.
ఎందుకు అంత దూరమ్ అలోచిమ్చుతారు, మీకు" టి " ఇస్తున్నానుగా  అన్నది. ఇందులో పంచదార ఏది, మీలొ షుగర్ ఉందికదా అది సరిపోతుమ్దిలెండి అన్నది.  భలే చెప్పవే నాలో సుగారుమ్దని" టి"  లో షుగర్ వేయవ  
ఈ తీ త్రాగే బదులు ఇంత వేపాకు రసం త్రాగటం మంచిది అన్నాడు.
అవునండి నేను మరిచాను రేపటినుంచి మీకు వేపాకు రసం ఇస్తాను,  అది త్రాగి వెళ్ళండి, అదే మీకు మందు, కాసేపు ఉండండి మన పెరటిలో ఉన్న లేత వేపాకు కోసుకొని వస్తా నూరి రసం ఇస్తా. ఉండండి.
నేను వాకింగ్ కు బయలు దేరుతున్నాను, ఇప్పుడే అదికూడా  త్రాగాననుకో బాత్ రూం పాడు చేయాలి అని అంటు, శ్రీమతి బుగ్గమీద చిటి కేస్తూ బయట రోడ్డు మీద నడుచుటకు బయలుదేరాడు.

వాకింగ్ చేసుకొని లోపలకు రాబోతున్నాడు, ఆగండి మీరులొపలకు రాకండి.
ఏమిటే నీవు అనేది,  మీరు బయటంతా తిరిగొచ్చారు,  కాళ్ళు కడుక్కొని లోపలకు రండి,  స్నానం చేసి కూడా  లోపలకు  రమ్మంటావా ఆ రండి అట్లాగే  ఆ తడిసిన గుడ్డలతో అందరికి మీ విస్వరూపం ప్రదర్శిస్తూ లోపలకు రండి సిగ్గు లేక పొతే  సరి  అన్నది.
కాళ్ళు,  మొఖము,  చేతులు,  కడుక్కొని లోపలకు వస్తున్నా కాస్త కాఫీ  ఇస్తావా అన్నాడు శ్రీ పతిగారు శ్రీలతతో.

దానికేం తక్కువలేదు మీరు అడగం గానే అన్ని ఏర్పాట్లు  చేయాలి.    కాదంటే  అలిగి చెట్టు ఎక్కి కూర్చుమ్  టారు మీరు.
అంత లేదే ఏదో కోపము వచ్చినప్పుడే అన్నాడు శ్రీ పతిగారు.  ఇదిగోనండి కాఫీ అని చేతిలో పెట్టింది. పంచదార కూడా వేసాను . మీరు మాత్రలు వాడుతున్నారుగా ఒక్క పూటకు ఎమీ కాదని ఇచ్చాను అన్నది.  మా ఆవిడ చాలా మంచిది. నన్ను అర్ధం చేసు కుంటుంది.
సరేలే ఈరొజన్న వాకింగ్ సక్రమముగా చేసారా,  ఏదన్న తగాదా సృష్టించారా అన్నది.
ఈరొజు జరిగిన సంఘటనలన్నీ నీకు చెపుతా,  ఏదన్న తగాదాలు వస్తే దాని పరిష్కారము నీ దగ్గర ఉన్నదికదా అన్నాడు.
నేను, సుబ్బారావు, పుల్లారావు (ముగ్గురం)  నడుస్తూ పోతున్నాము. 
మాలో సుబ్బారావుకు పూలు కోసే అలవాటు,  పూలు కోస్తున్నాప్పుడు  ఒక ఇంటి యజమాని తన పెంపుడు కుక్కను మాపైకి వదిలాడు. అంతే  పూలు అక్కడే పారబోసి కాలికి బుద్ధి చెప్పాడు సుబ్బారావు,  వాడితో మేము ఉన్నందున మేము కూడా  పరిగెత్తాల్సి  వచ్చింది.  మేము ఆగినప్పుడు అది కూడా  ఆగుతుంది. మేము కదిలితే అదికూడా  కదులుతుంది. పుల్లారావు ఒక రాయి తీసి దాని కాలిమీద కొట్టాడు, అంతే  కోపంతో అది వచ్చి వాడ్ని కరచింది.
అలా ఎంత దూరము పొయామో మాకు తెలియదు. చివరకు అటుతిరిగి ఇటు తిరిగి వచ్చాము అంతే అన్నాడు శ్రీ పతిగారు.
మరేం సంఘటనలు జరుగలేదా అని అడిగింది. జరుగలేదా అంటే జరిగింది ఒక సంఘటన.
తిరిగి వచ్చేటప్పుడు పుల్లరావును డాక్టర్ వద్దకు  సుబ్బారావు తీసికెల్లాడు.  నేను తిరిగి వచ్చేటప్పుడు ఒక మద్య యువతి వాకింగ్ చేస్తూ నన్ను కొన్ని మాటలు అన్నది, నెనుకూడా ఆమెను కొన్ని మాటలు అన్నాను.
మీరెమన్నరొ ఆమెతో ఎం తగాదా తెస్తారో ఈరొజు అన్నది,  ఆ కుక్క గలవారు మన ఇంటి మీదకు వచ్చినా రావచ్చు మీరు బయటకు రాకండి,  ఆయినా మీకు అమ్మాయకు సరిగిన సంభాషణలు చెప్పండి మహాశయా నంది శ్రీ లత.
హలో హలో అని పిలిచింది  ఒక మద్య వయసు స్త్రీ 
అ స్త్రీ తో  ఏమి మాట్లాడారో చెప్పండి.  ఇంతకు ఆమె ఎవరు, మీకు ఆమె ఎప్పటి నుంచి పరిచయము, నాకు ముందు చెప్పండి.  
నీ ఆడ బుద్ధి పోనిచ్చావు కాదు అన్నాడు.
సరే ఎమాట్లాడారో చెప్పండి అన్నది.  అసలు నన్ను చెప్పనిస్తేగా అన్నాడు శ్రీపతి రావు.
నేను మామూలుగా నడుస్తూ పోతున్నాను.
అంకుల్ బాగున్నారా, నేను మీ పక్కింటి కి కొత్తగా వచ్చాము, నాకు నడవటం అలవాటు, కాని మీరు చాలా స్మార్టు గా ఉన్నారు.
మీ బట్ట తల, పెద్ద మీసాలు, చాలా బాగున్నయి.  మద్య వయసుకుర్రోడులా ఉన్నారు అన్నది.
నీవెం తక్కువు తిన్నావా ముసి ముసి నవ్వులతో ముద్దోస్తున్నావు,  ముందర కాళ్ళకు భంధం వేస్తున్నావు,
నీ వాలు  చూపు వల్లా, నడుం ఊపుడు  వల్లా, నీ జడ ఊపుడు  వల్లా, నేను తేలికగా పడిపోతానా  అన్నాను రోషంతో
మీరు నడుస్తుంటే ఒక సింహం నడుస్తున్నట్లు వున్నారు, ఒక మహారాజులా నాకు కనిపిస్తున్నారు  అన్నది.
నీలి కన్నులు చూపులు, పాల పొమ్గుల ఊపుల తో నన్ను ఇరకాటం పెట్టకు అన్నాడు శ్రీపతి అంటు వేగంగా నదుచు కుంటు  బయలు దేరాడు.
నా చూపులకె భయపడి పోతున్నావా అన్నది  ఇమ్తకీ నా వయస్సు ఎంతో తెలుసా కేవలము పది  హీను సమ్వచ్చరాలు  అన్నది.    
మరలా నవ్వుతూ దానిని తిరగేయండి అదే నా వయసు అన్నది.
అప్పటి నుంచి ఆమె చూపులు నామీద ఎటువంటి ప్రభావము చూపుతాయొనని  భయమేస్తున్నదే భార్యామణి గారు అని చెప్పాడు.
చూడండి  రేపడ్నిమ్చి మీరు వాకింగ్ చేయుట లేదు, తగాదాలకన్న ఆడగాలి మహా డేంజర్
ఏమిటే నా శీలమ్ మీద నీకు నమ్మకం లేదా,  మీ మీద నాకు నమ్మకమే అయినా ఆడదాని చూపూకు రాజ్యాలే పోయినట్లు చూసారుగా. 
అంతలోనే వీదిలొ నుండి ఎవరో పిలుస్తున్నట్లు  తెలుసు కుంది  శ్రీ లత, వెంటనే బయటకు వెళ్లి చూసిమ్ది.
అక్కయ్యగారు బావగారు చాలా గట్టివారు,  నేను ఎన్ని మాట్లాడినా నా మొఖం చూడ కుండా మాట్లాడారు, అలామ్టి వారితో మీరెట్లా   కాపురం  చెస్తున్నారండి  అన్నది.
ఇమ్తకూనీవవెరమ్మ అన్నది. అయ్యో   చెప్పటం మరిచాను మీ ప్రక్క ఇంట్లోకి క్రోత్తగా వచ్చాము, మా వారు, నా పిల్లలు అమెరికాలో ఉన్నారు.  మీ వారిని చూసాక మావారు గురుకోచ్చారు, కాస్త  ఆటపట్టించాను మీరేమను కోవద్దండి  అమెరికాలో ఇది మామూ లు, నేను కూడా  ఒక నెలరోజుల్లో అమెరికాకు వెళుతున్నాను  అని చెప్పింది.
శ్రీ లత గుండె మీద భారం తగ్గిమ్దను కుంది, అమ్మో నేలరోజు లుమ్డాలి, అమో ఈ మొగుడ్ని పట్టు కోవటం కష్టం  అను కున్నది.
ఆమె వెళ్ళాక లోపలనుమ్డి వచ్చాడు శ్రీ పతిగారు, అంతా చూసారా, విన్నారా అన్నది.
వెంటనే తలకాయ ఊపాడు.
సరే వెళ్లి కూరలు తెండి అన్ని కూరలు తక్కువ ధరకు తేవాలి అనిచెప్పి పంపించింది. 
కూరలు అప్పుడే తెచ్చారా అన్నది.  ఆ తెచ్చాను ఇవిగో చూడు అని సంచి చూపించాడు.  అబ్బో చాలా కూరలు తెచ్చారే  మీరు రేటు తక్కువా ఏమిటి అని అడిగింది. 
మీ ఆడవాల్లకున్న జబ్బే  ఇది.  తెస్తేనేమో వాటిలో పుచ్చులు ఏరుతారు,  మంచివి చూసి తాగూడదా అంటారు, తెకపోతే అది ఎందు  తాలేదు అని మరీ  అంటారు.  తెస్తే తప్పు,  తాకపోతే మరోతప్పు.  అసలు ఈ కూరల  విషయంలో ఆడవాల్లకు వదిలేయాలి.
ఏమిటండి పెద్ద ఉపన్యాసము ఇస్తున్నారు మీరు అన్నది భార్యామణి.
మీరు తెచ్చిన వాటిలో సగానికి సగం పాడై  పొయి నాయి, నేను ఏమైనా అన్నానా అన్నది.
నీవు అంటావేమోనని నేనే ముందు అన్నాను.
అఘోరించారు, వీటిని ఫ్రిజులో పెట్టండి, ఇదన్న వచ్చా మీకు అన్నది.
ఎమీటే  మరీ చాతకాని వాడిలా గుర్తిమ్చుతావు అన్నాడు.
నేను అనుకుంటున్నాను  అద్దం పగల గొట్టారు,  జాగర్తగా పెట్టాలండి  ఇందులో   అని నెత్తి నోరు బాదుకున్న మీరుచెసెది చేస్తారు, పిల్లిలా తప్పుకుంటారు అన్నాది.    
మీ తెలివి నాకేం అర్ధం కావటం లేదు, ఏ మండి  మీరు ఒక్క వారం రోజులు మా డాక్టర్ అన్నయ్య ఇంటిలో ఉండి రండి. 
ఆ అన్నయ్యది పెద్ద హాస్పటల్, అక్కడ ఉండి అకౌంట్స్  చూస్తు నేర్చుకొండి  అన్నది.
నిన్ను వదలి నేను ఎక్కడకు పోలేనే, కొట్టుకున్న తిట్టుకున్నా మనిద్దరం కలసి  ఉంటే అదో సరదా కదే అన్నడు శ్రీపతి గారు.
మాటలకేం తక్కువలేదు, చేతలే అర్ధం కావు అన్నది.
ఆయనా ఫోన్ చేస్తా,  మా అన్నయ్యకు,   మన ఇద్దరం కలసి వెల్దములె అన్నది.
మా ఆవిడా ఎంతో మంచిది, ములగ చెట్టు  ఎక్కించకండి కింద పడిపోతా అన్నది నవ్వుతూ,
చూసావా నీ నవ్వు ఎంతో బావుంది,
ఈ నవ్వు మొహం చూసె నీకు చిక్కి పోయానే,  లేకపోతె వేరే అమ్మాయిని చేసుకొనే వాడ్ని.
ఎమన్నారుమీరు,  ఇంకో దాన్ని తెచ్చుకుంటార, ఎదీ మల్లి అనండి అన్నది కోపంగా,  కోపం తగ్గించుకొని దగ్గర చేరి
ఏమండి మిమ్మల్ని అంత హింస పెడుతున్నానా నేను అని భాదపడుతూ అన్నది. ఏదో కాస్త ఉడికించాలని కవ్విస్తాను నేను
అవునే ఇదేనే ప్రేమ భందం, నీకు నేను నాకు నీవు.
ఉండండి మీకొసమ్ పాయసం చేశా తీసుకొస్తా అన్నది.  ఒకేసారి రెండు కప్పుల్లో తీసుకురా అన్నాడు.
నేను పూజ చేయందే ముట్టను కదండి అన్నది, మరి నా షుగర్ కదా నేను తినవచ్చ అన్నాడు
పాయసం కప్పు చేతిలో పెదుతూ , తిని ఈ మాత్రలు వేసుకోండి అన్నది.
నా ఆరోగ్యం గురించి చాలా ముండుజాగార్తలు తీసు కుంటావే  నీవు, ఎం జాగార్తలో ఏమో నీ మాటలు నన్ను ఉక్కిరి బిక్కిరి చెస్తున్నా యి, నా పని కావటములేదు అమ్తూ లోపలకు నడిచింది శ్రీమతి.  ఏమండి మా అన్నయ్య గారు మిమ్మల్ని నన్ను రమ్మన మని టిక్కెట్లు పంపించారు వెళ్దామా, అమ్మగారు ఆర్డర్ రావటం, అన్నయ్యగారు ఆర్డర్ ఇవ్వడం, ఈ భర్తగారు తిరస్కరించడం అనేది ఉంటుందా,  అందులో నీవు అన్న తర్వాత మరొవిధముగా జరుగుతుందా అన్నాడు శ్రీపతి గారు.
ఎందు  కండి  అట్లా అంటారు మీ కిష్ట ముంటెనే  వెళ్తాము, లేకపోతె ఎ పుణ్యక్షేత్రముకన్న వెళ్దాం అన్నది.
ముందు మీ అన్నయ్య గారి ఇంటికి వెళ్దాం తరువాత సంగతి ఇప్పుడెందుకు,  మరి సర్దు బయలు దేరుదాము అన్నడు.
లేడికి లేచిందే ప్రయానమన్నట్లు ఉంటే కష్టం భర్తగారు,  ముందు  ఆ టిక్కేట్ల మీద  టైం ఎప్పుడో చూడండి అన్నది.
ఆ కళ్ళజోడు లేదే, మీకు మతిమరుపు కూదా వచ్చింది, మీనెత్తిమెదె ఉంది చూడండి.
అవునే నేను మరిచిపోయాను, ఆ ఉండు చూసిచెపుతాను అని తీసి చూసి రాత్రి పది గంటలకు గుంటూరు బస్సు అన్నాడు.
గుంటూర్ పొవటం,  నెల  రోజులు ఉందామని బయలు దేరి కేవలము పది  రోజుల్లో నే తిరిగి రావటం జరిగింది.
మీరు ఇంటికి వెళ్ళే  లోపు,  మీకు ఒక కొరియర్ వస్తుంది దానిలో మీకు తీర్ధ యాత్రకు ముందుగా కాశి   ప్రయాణమునకు రైల్ టిక్కట్లు కొని పంపుచున్నాను అని ఫోన్ చేసాడు బావగారికి అనగా శ్రిపతిగారికి.
ఏమేవ్ మీ మీఅన్నయ్య మనకోసం కాశి యాత్రకు టిక్కెట్లు కొని పంపిమ్చుతున్నారుట. నీవెమన్న అడిగావా అని  అన్నడు భర్త గారు.
అయ్యో రామా నాకేం పనండి, నీమీద ఒట్టు, నేనేమి అడగలేదు నాకు ఆ విషయము అసలే తెలియదు,  ఆయనా నేనెందుకు కొనమంతానండి, చెట్టంత మొగుడు ప్రక్క నుండగా  అన్నది.
వెటకారము వద్దు.  మీ అన్నయ్య  ఎమూడ్లో ఉన్నాడో  కాని అంతా మనమంచికే కదా, ఇద్దరం  కలసి శివుని దర్శనం చేసుకుందాం అన్నాడు.      

అపుడే కొరియర్ తెచ్చిన లెటర్ తీసుకున్నది శ్రీ లత,
ఉత్తరం చదువుతున్నది. చెల్లెమ్మ నీవె అర్ధామ్తరముగా ఉమ్డ కుమ్డ వెళ్ళటం నాకు నచ్చలేదు, బావగారు నీవు సుఖముగా ఉండటమే నాకు కావలసినది, అందుకనే మీరు ఇద్దరు తీర్ధ్ యాత్రలు చేయుటకు ముందుగా కాశికి టిక్కేట్లు కొని ఇందులో పంపు చున్నాను. మీరు సుఖముగా ప్రయాణం చేసిరండి.
మీరు ఎప్పుడైనా ఇక్కడకు రావచ్చు,  ఎమ్డుకంటే ముందుగా తెలియ పరిస్తే మంచిది.
మీ వారి విషయంలో తెలివో లేక అతి తెలివో నాకర్ధం కాలేదు.  ఇక్కడున్న రోజులు మూడు పువ్వులు ఆరుకాయలుగా  సాగుతున్న నా  హాస్పటల్  ఒక్క సారిగా కుప్పకూలుటకు సిద్దముగా ఉన్న పాక మాడాలా మారి పోవుటకు సిద్దమైనది.
మా అయన చేసిన పని ఏమిటి అని నీవు అడగవచ్చు,  అది కూడా  నేనే చెపుతున్నాను.    
మీ వారు మంచి తెలివిగలవాడని నేను అకౌంట్స్ సెక్షన్  లో పర్య వేక్షణ చేయమన్నాను.
మాదగ్గర విజిటింగ్ వచ్చే పేరు మోసిన డాక్టర్లు కొద్దిగా ఆలస్యము వస్తే వారికి క్రమ శిక్షణ గురించి క్లాసు తీసుకున్నడు.
డాక్టర్లు రావటం తగ్గించారు,  అట్లాగే అకౌంట్స్ బిల్లుల్లో తేడా ఎందుకు అందరికి సమానముగా ఉండాలి అని మా అకౌంట్స్  తో వాదన దిగాడు. అక్కడనుంచి నేనుతోలగిమ్చాను.
మీరు కాంపౌండర్ వద్ద ఉండి కొన్ని విషయాలు తెలుసుకొని జాగర్తగా ఉండండి అని చెప్పాను.
అంతె  మూడు  రోజులు అన్నివిషయాలు తెలుసుకొన్నాడు మీవారు.
ఎరోగానికి ఏమందు వాడుతారు, ఎ ఇంజక్షన్  చేస్తారో గమనించాడు, ఆ మందుల రెట్లు, రోగానికి ఎంత ఫీజు వసూలు చేస్తారు తెలుసుకున్నాడు.
కాంపౌండర్ వద్ద ఉండక వచ్చిన రోగులవద్దకు చేరి మందుల విషయాలు, ఫీజు మరియు  అన్ని విషయాలు తెలియపరిచాడు.
రోగులు రావటం మానివేశారు.
ఇటువంటి భర్తతో నీవు ఎట్లా భరిస్తున్నావు చెల్లి.
ఇట్లా వ్రాసినందుకు నీవు భాదపడ వద్దు. 
ఈ  వయసులో కూడా  నీతి నిజాయతి అంటే కష్టం కదా, అందుకే నీకు ఉత్తరం ద్వారా అన్ని విషయాలు తెలియపరిచాను. నన్ను క్షమించు.  ఇట్లు మీ అన్నయ్య.
ఈ ఉత్తరము అందిన వెంటనే నకు ఫోన్ ద్వారా నా మీద కోపం లేదని చెప్పగలవు.
అప్పుడే ఫోన్ మ్రోగింది అన్నయ్యా నేనే నీకు ఫోన్ చేద్దామనుకున్నా, నీవె ఫోన్ చేసావు,  నీవు వ్రాసిన ఉత్తరము చూసాను.
నలబై సంవత్సరాలనుండి మావారి  మనస్సు నేనే అర్ధం చేసుకోలేక పోయాను, నీవె చెప్పిన విషయాలకు నేను ఏమి అనుకోవటములేదు, ఎందు కంటే,  నాకు ఏది మామూలె.
భార్యగా భర్త  చేసేపనులను సమర్ధించటం తప్ప ఎదురు తిరిగి నా కాపురాన్ని పాడుచేసుకొను.
కొందరికి కొన్ని బలహీనతలు ఉంటాయి, మావారి బలహీనత ఏమిటో నాకు తెలుసు నేను దారిలో పెట్టుకోగలను.
తీర్ధ యాత్ర చేసినతర్వాత మీదగ్గరకొచ్చి ఒక సంవస్చరం ఉమ్డ గలము  అన్నయ్య.
ఫోన్ లో మీరు వచ్చేముందు చెప్పండి, మీరొచ్చాక మేము తీర్ధ యాత్రకు పోతాము అన్నాడు అన్నయ్య నవ్వుతూ.                         
           
                         

                                                      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి