19, జూన్ 2014, గురువారం

146. Children story-50 (Little Heart)

                                     ఓం... శ్రీ... రాం ...                ఓం... శ్రీ... రాం ...            ఓం... శ్రీ... రాం ...                                   

పసి హృదయము

అదొక పెద్ద హాస్పటల్, అంతా ప్రశాంతముగా ఉన్నది.  అంత పరిసుబ్రముగా  ఉన్నది.  అక్కడ విజిటింగ్ హౌర్స్  లో తప్ప వేరే  టైం లో ఎవ్వరిని లోపలకు పంపరు.  ఎమర్జన్సీ కేసులను ప్రత్యేకముగా చూస్తారు.
అదిఒక హాస్పటల్ గా ఉండదు,  ఒక ప్రశాంతి నిలయముగా ఉంటుంది.  అక్కడ పనిచేసే డాక్టర్ హస్త వాచి  మంచిదని చిన్న రోగానికి, పెద్దరోగానికి,  ప్రతిఒక్కరు  అక్కడ మనుషుల్లో వచ్చే మార్పుల  వళ్ళ వచ్చే రోగాలకు,  బిపి, షుగర్, తైరాఐడ్ మరిఒయు ఎక్సరే  అన్ని టెస్టులు చేయించు కొని తగిన మందులు వాడుతారు.
ఇదే హాస్పటల్ లలో పది నెలలు నిండి ప్రసవ వేదనతో భాదపడుతున్నది, సుబ్బారావుగారి భార్య లక్ష్మి దేవి.
నెప్పులు వస్తున్నాయి,  ఆగి పొతున్నాయి, సుబ్బారావుగారు మాత్రము నార్మల్  డిలివరి చేయాలని డాక్టర్ ను కోరారు.
మేము  శ్రాయశక్తులా ప్రయత్నం చేస్తాము.
అంతా మామీద నమ్మకం పెట్టుకొం
డి, మీ ఇshta దైవాన్ని నమ్ము కొండి అని చెప్పారు డాక్టర్లు.
అర్ధరాత్రి ఖచితముగా 12 గంటలకు మగపిలవాడికి  జన్మనిచ్చింది.  పుట్టిన వెంటనే పిల్లవాడు కెవ్వుమని ఏడవలేదు, డాక్టర్లు ఎంత ప్రయతం చేసినా ఏడవలేదు. నార్మల్ దిలివారి ఐఇమ్ది, తలీ పిల్లోడు క్షేమం అన్నారు. 
అంతలో డాక్టర్ సెల్ నుండి రామ్ రామ్ అనే సౌండ్ వినగానే కెవ్వు మని ఏడ్చాడు.
డాక్టర్లు కూడా  చాలా ఆశ్చర్యపోయారు రామ శబ్దం వినగానే ఏడవటం ఒక విమ్తనిపిమ్చిమ్ది వారికి.

డాక్టర్ సలహా ప్రకారముగా  తల్లి పిల్లవానికి తీసుకొవలసిన జాగర్తలు తెలుసుకొని హాస్పటల్ నుండి ఇంటికి చేరారు.
ఆపిల్లవానికి ఒక శుభముహూర్తాన చిరంజీవి అని నామకరణం చేసారు.
కాలంతో పాటు క్రమ క్రమముగా పెరిగి 5 సంవశ్చరాల బాలుడుగా మారాడు.
తల్లి తండ్రులకు తలలో నాలుకలా తయారయ్యాడు.  స్కూల్లొ చేర్పించారు.  స్కూల్లొ తను చదవక, ఇతరులను చదవనీయడు.
ఆటలలో అందరికన్నా ముందు ఉంటాడు. చదువులో మాత్రము వెనకపడి పోతున్నాడు.  

చిరంజీవి ఎప్పుడు మొదటి బెమ్చీలొ కుర్చుమ్డేవాడు.   పిల్లలతో మాట్లడు తుంటాడు,   ప్రోగ్రెస్ లో మాత్రము ఎమీ ఉండదు,
ఒకనాడు పిల్లలు క్లాసురూమ్లోకి ఒక తేలు వచ్చింది. అది ఆరడుగుల బల్ల క్రిందకు చేరింది. బల్లను ఎవ్వరు కదిలించలేక పోయారు, అప్పుడే చిరంజీవి వచ్చి ఒక్క  చేత్తో ఎత్తి ప్రక్కన పెట్టాడు, తేలును చంపారు,  మరొకసారి స్కూలు బస్సు ఆగిపోతే అందరు దిగి తోయండి అన్నాడు డ్రైవర్.  మీరమ్దరూ కూర్చోండి  నేనొక్కడనే తోస్తాను అని చిరంజీవి  బస్సును  తోసాడు అంతే ఎంతో వేగంతో ముందుకు జరిగింది ఇంజన్ స్టార్ట్ అయింది.
ఒకసారి  స్కూల్లొ కబాడీ పెద్దవాళ్ళు  ఆడుతున్నారు. వాళ్ళలో నన్ను చేర్చుకోమని అడిగాడు చిరంజీవి
ఒక గ్రూపు వారు మాత్రము చిరంజీవిని కూడా చేర్చుకున్నారు.
అ గ్రూపులో  వారు అందరు  పట్టు పడ్డారు. ఒక్క చిరంజీవి మాత్రమే ఉన్నాడు.
చిరంజీవి రామ్, రామ్,   రామ్,  అంటూ కూత పెట్టుతూ అవతల కోర్టులోకివేల్లాడు. అమ్దరూ  కలసి పట్టు కున్నారు.
అంతే అందరిని పట్టుకొని ఒక్క గంతులా పైకి ఎగిరి రేఖను తాకాడు చిరంజీవి. అందరికి  ఆశ్చర్య  మేసింది. 
అంతలో చిరంజీవి స్నేహితుడు ఎడుస్తూ వచ్చాడు, మానాన్న అమ్మ ఎరువులు మందు త్రాగి పడి పోయారు అన్నాడు. అప్పులు తీర్చలేక త్రాగారని అందరు అన్నారు. వెంటనే   చిరంజీవి కొన్ని  ఆకులను చేతిలోకి తీసుకొని  పసరును నోటిలోకి పోసాడు వెంటనే అంతా ఓక  గుటకలాగా మొత్తం కక్కి పోసారు ఇద్దరు, అప్పుడే నిద్రనుండి లేచిన వార్లలాగా మేము బ్రతికె ఉన్నామా అని అడిగారు. అందరికి అది ఒక కలలాగా కనిపించింది.  అ హడావిడిలో చిరంజీవి నెమ్మదిగా జారుకున్నాడు, ఇంటి దారి పట్టాడు.   

సుబ్బారావుగారు బాగున్నారా, బాగున్నాను పంతులు గారు. మీ గురించి మా అబ్బాయి గొప్పగా చెపుతున్నాడు, మీ అబ్బాయి ఎలా చెప్పాడో గాని స్కూల్లొ మాత్రము ఎ సబ్జెక్టు లో మార్కులు రావటములేదు, కేవలము తెలుగులో మాత్రం అందులో నా సబ్జెక్టు లో మాత్రం బాగా వచ్చాయి. ఇట్లా unte ఉమత కష్టం కదండి అన్నడు మాస్టర్.
మీరు మీ అబ్బాయి కలసి ఒక రోజు స్కూలు కు రండి. మీ అబ్బాయి చేసే ఘనకార్యాలు వినగలరు అన్నాడు.  
అమాటలకు సుబ్బారావుగారు, భార్య లక్ష్మి మన చిరంజీవి ఎప్పుడు బాగుపడతాడు, ఈ అల్లరి ఎప్పుడు మాను కుంటాడు, మంచిగా ఎప్పుడు చదువుకుంటాడు అనుకుమ్టు పిల్లవాడ్ని పిలిచారు.
మీ మాష్టర్ వచ్చారు నీవు స్కూల్లొ బాగుగా చ
దువుట లేదుట, నిన్ను మీ న్నాన్న గారిని రామ్మనమం టున్నారు  వారు రేపు వెళ్ళండి అన్నది తల్లి లక్ష్మి.
స్కూలుకు వెళ్లారు సుబ్బారావుగారు కొడుకుతో. హేడ్మాష్టారుగారు, మరియు వేరే టిచర్లు అందరు కాన్ఫరెన్స్  హాల్లో కూర్చొని ఉన్నారు. తక్కువమార్కులు వచ్చిన పిల్లల తల్లి తండ్రులను పిలిచి వారికి మీ పిల్లలు చదవకపోతే టి.సి. ఇచ్చి పంపుతాము అని గట్టిగా చెప్పారు. అదేసమయాన సుబ్బారావుగారికి కూదా అదే మాటలు చెప్పారు. అప్పుడే చిరంజీవి కలగ చేసుకుంటూ నేను నాలుగుమాటలు మాట్లాడవచ్చ అని అన్నాడు. అమ్దరూ ఆశ్చర్య పోయారు. ఇంత చిన్న పిల్లవాడు ఏమి మాట్లాడుతాడు అని వెనక్కి వెళ్ళేవారు కూడా ఆగి వింటున్నారు.
గురువులకు, పెద్దలకు, నాకన్నా పెద్ద విద్యా ర్ధులకు, ఇక్కడున్న ప్రతిఒక్కరిని నన్నుదీవిమ్చాలని ప్రార్ధిమ్చుతూ  నామాటలు తెలియపరుస్తున్నాను.
కాల  చక్రం తిరుగు తుమ్టుంది, పిల్ల
మెదడు చాలా చిన్నది. ప్రతిఒక్కరు ఒకరు లేక ఇద్దరే  పిల్లలను కంటున్నారు. మేము కష్ట పడుతున్నాము, మా పిల్లలు కష్టపడ  కూడదని, బాగుగా పిల్లలను చదివించాలని, ఎంత డబ్బు కర్చు చేసి అయినా ట్యూషన్ పెట్టి నూటికి తొంభైతొమ్మిది రాలేదని భాదపడుతున్నారు.
అందులో మన తల్లి భాషను వదలి అణ్యభాషను ప్రొశ్చహిమ్చు తున్నారు.  అదే గొప్పది అనుకుంటున్నారు, ఇపుడు మన ప్రభుత్వము హిమ్దీకి ప్రాధాన్యత  ఇస్తున్నారు.
ఎ భాష అయినా పిల్లల మనసుకు హత్తుకొనే విధముగా ఉండాలి,  కేవలము అందరు ఆ0గ్లము ఒక గొప్ప చదువనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం మీరె చెప్పడి అన్నాడు, ఆమాటలకూ అందరు ఆశ్చర్య పోయారు.
ఇతరదేశాలలో విద్యాలయాలు వారానికి కేవలము 5 రోజులుమాత్రమే ఉంటున్నాయి, మిగాతా రెండు రోజులు ఉత్చాహముగ కాలము గడుపుతారు,  మనదగ్గర ఆదివారము కుడా ప్రవేట్ క్లాసులు పెట్టి చదవమని వత్తిడి చేస్తున్నారు అది ఎంతవరకు సమంజసం.
దీనికితొడు స్కూలు  యాజమాన్యం కూడా  ఒరియంటేషన్  క్లాసులని, పౌండేషన్ కోర్సులని, వ్యక్తిత్వవికాస కోర్సులని,   ఈ చిన్న పిల్లలకు అవసరమ్మ అని నేను అడుగుతున్నాను అన్నాడు ఆ చిన్న పిల్లవాడు.
నేను అనేది  పిల్లలపై ఎటువంటి వత్తిడి చేయకా వారిని స్వేచ్చాగా చదువుకోనేవిదానము అవసరము, వారి ఆలోచనలు బట్టి, వారి కోరికలు బట్టి తల్లితండ్రులు సహాయము చేయాలి, ఆటలు ఆడుకొనే విధముగా సహకరించాలి. 
నాలో ఏదో శక్తి ఉన్నా
ని మీరమ్దరు అనుకుంటున్నారు. నాలో ఎటువంటి శక్తి లేదు, ఈపని సాధించాలని,పట్టుదల, మనోనిగ్రహ శక్తి మాత్రం  ఉన్నది అన్నాడు చిరంజీవి. నేను చేసినవి ఘనకార్యాలు కాదు, కేవలము పట్టుదలతో చేసినవి, మానవతాద్రుక్పదంతో చేసినవి.
మహోన్నతమైన సంస్కృతి కలిగినది మన భారతదేశం, వేద, సాస్త్ర, పురాణాలు,ఇతిహాసాలు, కాసిమజలీ కధలు, పద్య కావ్యాలు    రామాయణ, భారత, భాగవత  గ్రందాలు మనకు అందు బాటులో  ఉన్నాయి. అవి పాట్య పుస్తకాలుగా పెట్టి ప్రతిఒక్కారికి సత్యం,, ధర్మం. న్యాయం,  గురించి తెలుసుకో గలుగుతారు  అన్నాడు చిరంజీవి.
మనచేతులతో మనమే ఆ పుస్తకాలను భూస్తాపితమ్ చేస్తున్నాము, మన తెలుగుభాషను అవమానిమ్చుటకు ఆంగ్ల భాషను ప్రోస్చ హిచు తున్నాము ఇది అవసరమా.
మనం గీతాచార్యుని భోదలను విందామని అనుకుంటాము  కానివీలు పడదు, ఆకలితో అలమటిమ్చేవారి ఆక్రందనలు మనం వినిపిమ్చుకొం.
సర్వజీవులలో   భగవంతుడున్నాడని అందరికి తెలుసు, కాని పొరుగువారి భాదను పట్టించుకోము.
దప్పికతో భాదపడుతున్న జీవుని మరచి, శివునకు అభిషేకము చేయుటకు ముందుకు వస్తాము ఎందుకు.
పిల్లలను చదువు చదువు అనె వత్తిడి  చేసే మనసు గురువులకు, తల్లి తండ్రులకు ఉండ కూడదు, అటువంటి వారు ఉన్నా అట్టి వారు పిల్లల ద్రష్టిలో శత్రువులుగా మారుతారు అన్నాడు చిరంజీవి.
ఇంకా చెప్పాలని ఉన్నది మీ అమూల్యకాలన్ని నేను వ్యర్ధము చేసననిభావిమ్చాకుమ్డా నేను చెప్పిన విషయాలు అందరు గమనించగలరని భావిస్తూ  ఇంతటి తోముగిస్తున్నాను
అమరు ఒకటే చప్పట్లు కొట్టారు
పిల్లవాడు చిన్నవాడైనా  గట్టిమాటలు చెప్పాడు అన్నారు.  


నాన్న  నాకు  దాహ  మేస్తుమ్ది, మమ్చినీరు కావాలి అన్నాడు చిరంజీవి, నాన్న మా మాస్టార్ ఎమన్నా చెప్పరా మనము ఇంటికి పోదామా అన్నాడు ఆ పసి బాలుడు, ఆమాటలకు అందరు ఆశ్చర్యపోవటం తప్ప ఏమి చేయలేక పోయారు. మీ అబ్బాయికి మంచి తెలివి తేటలు లున్నాయి మీ పిల్లవాడిలో ఏదో మార్పు  వచ్చింది. అని అందరు అన్నారు.
పిల్లవాడ్ని మేచ్చుకున్న్నారే తప్ప ఏమి అనలేదు,  వెంటనే ఇంటికి బయలు దేరాడు చిరంజీవితొ తండ్రి.
ఇంట్లోకి వెళ్ళగానే ముందు మనవాడికి దిష్టి తీయాలి   అంటూ భార్యకు చెప్పాడు, కాళ్లు చేతులు, కడుక్కొని దిష్టి తీసినతర్వాతె లోపలకు రానిచ్చిమ్ది ఇద్దర్ని ఆ ఇల్లాలు.
మనబ్బాయిలొ మార్పు   ఎమన్నా గమనించావా అన్నాడు.
గమనిమ్చానండి  మనం కొండ గట్టు ఆంజనేయస్వామి ఆలయము వేల్లినప్పడి నుండి  వాడిలో ఏదో మార్పు   వచ్చింది నేను మొన్ననే గమనించాను, మీకు చెపుదామనుకున్నాను కాని చెప్పలేదు అన్నది ఆ ఇల్లాలు.
మనబాబు తెల్లవారుజామున సూర్యొదయమ్ కాకముందే లేస్తాడు. సుబ్రముగా కాళ్ళు, చేతులు, మొఖము, కడుక్కొని కొన్ని ఆసనాలు వేస్తాడు, తర్వాత తలారా స్నానము చన్నీళ్ళు చేస్తాడు. ఎందుకురా అంటే చేస్తే మంచిదమ్మా, నీవు నాన్న లేచి తెల్లవారుజామునా స్నానం చేసి  ఆ స్వామివారిని ప్రార్దన చేస్తే మంచిదమ్మా అన్నాడు.  
ఎందుకు మీరు రేపు తెల్లవారుజామున మనాబ్బాయి చేసేవి ఏమిటో మీరె కళ్లారా చూడచ్చు  అందుకని మీరు ముందు  లేవాలి    
నేనేలేచి మన బాబును లేపుతా అన్నడు ఆ తండ్రి.
చిరంజీవి అనుకున్న ప్రకారము అమృత ఘడియలలో లేవటం స్నానము  చేసి సుర్యాసనాలు వేయటం, పద్మాసనం వేసి హనుమంతుని ధ్యానం చేయటం (హనుమంతుని దండకం చదవటం) వీల్లుగమనించారు.
                                                               
శ్రీ ఆంజనేయ  దండకము


శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం  ప్రకీర్తి  ప్రదాయం భజేవాయుపుత్రం  భజేవాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మాతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్నీ నామ సంకీర్తనల్ చేసి నీరూపు వర్ణించి నీ మీదనే దండకం బొ క్కటిన్ జేయు నూహించి నీ  మూర్తి గావించి  నీ సుందరంబెంచి నీ దాస దాసుండనై రామ భక్తుండనై నిన్ను నేగొల్చెదన్ నీ కటాక్షంబునన్  జూచితే వేడుకల్ జేసితే నామోరాలించితే నన్ను రక్షించితే  అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంచ నేనెంత వాడన్  దయాశాలివై జూచితే  దాతవై బ్రోచితే దగ్గరం బిల్చితే తొల్లి సుగ్రీవుకున్మంత్రివై స్వామి కార్యంబు నందుండి  శ్రీ రామ సౌమిత్రులం జూచి వారిన్ విచారించి సర్వేశు పూజించి  యబ్బానుజం బంటు గావించి  యవ్వాలినిన్  జంపి  కాకుస్థ తిలకుందయా దృష్టి వీక్షించి  కిష్కింధ కేతెంచి శ్రీ రామ కర్యార్ధమై లంక కేతెంచియున్  లంకిణిన్ గొట్టియున్ లంకయున్ గాల్చియున్ భూమిజన్ జూచి యానంద ముప్పొంగ యా యుంగరం బిచ్చి యా రత్నమున్ దెచ్చి శ్రీ రామునకున్నిచ్చి సంతోషునిన్ జేసి సుగ్రీ వునిన్   అంగదున్   జాంబవంతాది నీలాదులం గూడి  యాసేతువున్ దాటి వానరల్మూకలై  పెన్మూకలై దై త్యులం  ద్రుంచగా రావణుండంత కాలాగ్ని యుగ్రుండుడై   కోరి బ్రహ్మాండమైనట్టి  యా శక్తినిన్ వేసి యా లక్ష్మణున్ మూర్ఛ   నొందింపగా    న ప్పడే బోయి సంజీవియుం  దెచ్చి  సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాది  వీరాళితో  పోరి చెండాడి  శ్రీ రామ భాణా గ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ నవ్వేళలం నవ్విభీషుణు న్వేడుకన్ దోడు కన్వచ్చి పట్టాభిషేకంబు జేయించి  సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీ రాముతో జేర్చి నయోధ్యకున్  వచ్చి  పట్టాభిషేకంబు సంరంభమై యున్న నీ కన్న  నాకె వ్వ రున్  గూర్మిలేరంచు మన్నించినన్ శ్రీ రామ భక్తీ ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనల్  జేసితే పాపముల్భాయునే  భయములున్దీరునే , భాగ్యముల్ కల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సమ్పత్తులున్   గల్గునే   వానరాకార, యో భక్త మందార యో పుణ్య  సంచార యో వీ ర   యో శూర నీవె సమస్తంబు  నీవే  మహా ఫలంమ్ముగా వెలసి యా తారక బ్రహ్మా మంత్రంబు పఠించుచున్  స్థిరమ్ము గా వజ్ర దేహంబునుం దాల్చి శ్రీరామ శ్రీ రామ యంచున్  మన: పూతమై యెప్పుడున్ తప్పకన్  తలతు నీ  జిహ్వా యందుండి నీ దీర్ఘ దేహంబు త్రైలోక్య సంచారివై రామనామాంకిత ధ్యానివై  బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్ రౌద్ర నీజ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార ఓంకార హ్రీంకార శబ్దంబులన్  భూత ప్రేత పిశాచ శాకినీ డాకిని గాలి దయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలం బడం కొట్టి నీ ముష్టి ఘాతంబులన్ భాహు దండంబులన్ రోమ ఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభా బాసితంబైన  నీ దివ్య తేజంబునన్ జూసి రారా నాముద్దు నరసింహ  యంచున్ దయాద్రుష్టి వీక్షించి  నన్నేలు నా స్వామి  నమస్తే సదాబ్రహ్మచారీ నమస్తే, వాయు పుత్రా     నమస్తే నమస్తే నమోనమ:  
అక్కడే తల్లి తండ్రులు కూడా  స్నానం చేసి వచ్చి ధ్యానం  చేస్తూ కూర్చున్నారు. 
అమ్మ  నాన్న నేను మీకు చెప్పేంత వాడ్ని కాను కాని అందరు కనీసము పది నిముషాలు ఆదేవుడ్ని ప్రార్ధన చేస్తే ధైర్యము, సంతోషము , మన స్  శాంతి  ఉంటుంది .
నేను చెప్పేది కాలాన్ని సద్వినియోగము చేసుకున్నవారికి ఆరోగ్యము, ఆనందము, సంతోషము, ఎటువంటి భయము లుండవు.ఆనాడు.
 Time - కాలము
1.Think of It and Bewar of It.
1. సమయము విలువ తెలుసుకొని జాగర్త పడాలి
2.Identify your Time killers.
2.సమయాన్ని వృదాచేసే సమయాన్ని గమనించాలి
3.Maintain The List of Things to do
3.చేయవలసిన కార్యక్రమాల పట్టికను తయారు చేయాలి
4.Establish priority.
4.ముందుగా చేయవలసినవి చేయాలి.

బుద్ధి మంతులు  ఎవరైనా గడచిపొయిన వాటిని గురించి సోకిమ్చారు,
భవి షత్తును గురించి చిమ్తిమ్చారు, వర్తమానంలోనే తన కర్తవ్యాలను నిర్వహిస్తారు అన్నాడు ఆ చిరంజీవి.
తల్లి తండ్రులు బాల వాక్కు బ్రహ్మ వాక్కు అని భావించి ఆ పసి హృదయపు  ఆమాటలు  వింటున్నారు.
మంచిని గౌరవించి, దేవుణ్ణి ప్రార్ధించి మనస్సు ప్రశాంతముగా ఉమ్చుకోవాలనే ఉద్దేశ్యముతో ఈ కధ వ్రాయటము జరిగింది.