29, డిసెంబర్ 2020, మంగళవారం

మాతృభాషా  దినోత్సవ శుభాకాంక్షలు ...సమ్మోహాలు.1271..1280

సంస్కార వంతమై ....  వంతుగా ను గళమై 
గళం మాతృభాష బోధించే ఈశ్వరాతేనెలా తియ్యనది

తీపి అమృత మైనది ... అమృత అదృశ్య మైంది 
అమృత మై జనులకు తెలుగు భాష ఈశ్వరా

అత్యంత మధురమై ..... మధురమ్ము దేశమై
దేశ భాష అమ్మ తెలుగు తనము ఈశ్వరా

తల్లిపాల గుణముతొ ......  గుణములె ప్రేమలతొ
ప్రేమతో తెలుగు స్వచ్ఛ మైనది ఈశ్వరా

అమ్మ పేగు బంధము ....... బంధ భాష భావము
భావ ఆత్మ సౌరభముతెలుగుది ఈశ్వరా

దేశభాషలందును  ..... లందు తెలుగు లెస్సను
తెలుగు జరా మరమైనది మనకు ఈశ్వరా

అమ్మ ఒడిలో వున్న  .... వున్న దే తెలుగ న్న
తెలుగు పలికిన కమ్మని భాషే ఈశ్వరా

మాతృభాషయె తెలుగు  .... తెలుగు తల్లీ వెలుగు 
వెలుగు మమతల పెన్నిధి భాషే ఈశ్వరా

అష్టదిగ్గజ కవులు ... .. కవులు తెలుగు శ్రేష్ఠులు 
శ్రేష్ఠులు అలరారె మేటి భాష ఈశ్వరా

రాజు లే మారినా  ....  మారినా కధైనా
కధలు ఆంగ్ల మున్నా తెలుగుయె  ఈశ్వరా

--(())--

సమ్మోహనాల  ... ముళ్ళు   1261-1270
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

ముళ్లును ముళ్లు గాను 
ముళ్లే మనసు లోను
మనసు కలవ రింతచేయు ముళ్ళు ఈశ్వరా 

కిరణముల లా ముళ్ళు 
ముళ్ళు దేహపు కళ్ళు 
కళ్ళ చూపులు కిరణాలు ముళ్ళు ఈశ్వరా 
  
మనిషి తీరు మనసును 
మనసు గుచ్చుకొన్నను 
గుచ్చే ముళ్ళు మనకు తప్పవు ఈశ్వరా 
 
కత్తి లాంటి మాటలు 
మాటలే  తూటాలు 
తూటాల ముళ్ళు లాగ గుచ్చే ఈశ్వరా 

ముళ్ళు యదను గుచ్చియు 
గుచ్చి వెఱ్ఱి తనముయు 
వెఱ్ఱి తనముతో బతుకులేలే ఈశ్వరా 

ముళ్ళ కాడకు పూలు 
పూలే  గులా బీలు   
గులాబీ లు చూపులే ముళ్ళే ఈశ్వరా 

హాని చేయును గాని 
గాని గాయము గాని 
గాని తగ్గించే ముళ్ళు తప్పదు ఈశ్వరా 

ప్రేమ ముళ్ళు పుట్టు 
పుట్టి తాళిని కట్టు 
కట్టాక ముళ్ళుపోటు జీవియె  ఈశ్వరా 
 
సుఖమును పంచు ముళ్ళు 
ముళ్ళులు చేయు గళ్ళు 
గళ్ళు లు నింపే ముళ్ళు తప్పవు ఈశ్వరా 
  
కాలమంతయు కళ్ళు 
కళ్ళు చూపుల ముళ్ళు 
ముళ్ళులా బతుకులో సిరులేలు ఈశ్వరా 

--(())--

సమ్మోహాల .. వేలు 1251--1260
రచయిత మల్లా ప్రగడ శ్రీదేవి రామకృష్ణ   

ఇది అంతర్మధనం 
మధనమే ఆయుధం 
ఆయుధం చూపుడు వేలు మనసే ఈశ్వరా

సమాజ అకృత్యాలు
అకృత్య సంఘటనలు 
సంఘటనలను ప్రశ్నించు హక్కు ఈశ్వరా

అవినీతి అందలము 
అందల మే నష్టము
నష్టమైన అవినీతి నరికే ఈశ్వరా

భావాల వేదనలు 
వేదన తొ రోదనలు 
రోదన చేసి పిడికలు బిగించె ఈశ్వరా 

ఒక్క ఆవేశము యె 
ఆవేశ ప్రేమ  యె 
ప్రేమ తొ హృదయము తాకు హస్తం ఈశ్వరా 

మాటల కంద కుండ 
ఉండె మనసు యె నిండ 
నిండిన మనసుతొ మనుగడ సాగు ఈశ్వరా 

అన్యాయ విన్యాసము 
విన్యాస విపరీతము 
విపరీత గణముల ప్రశ్నలే ఈశ్వరా 

కాలం తీరు మారు 
మారు వయసులు మారు 
మారు ప్రభుత్వాల ప్రశ్నలే  ఈశ్వరా 

గుండెల్లో అగ్నీ 
అగ్నియె బడభాగ్నీ
బడభాగ్ని తొ  కదులె ప్రపంచము ఈశ్వరా 

కాలమేదైన నూ 
మేదైన మనసునూ  
మనసు మార కుంచు బతుకు వేలు ఈశ్వరా 
 --(())--

సమ్మోహనాల  ... మోహనా  1241-1250
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ


నినుచూసిన నాలో 
నాలొ తెలియని కలో 
కల నిజమో నిద్రా లేపింది మోహనా 

మనసులో ఒకమాట 
మాటల తలపు పాట
పాట ఆట నీకోస మన్నది మోహనా 
     
దాగు వీణ పైనా 
పైన శృతి కలపనా 
కలిపి జోలపాడిలహాయిగా మోహనా 

ఈవేళ ఆకలిని 
ఆకలిగా పిలుపుని
పిలుపులు వలపుతలపులే మాకు మోహనా 
 
కను పాప అద్దమై  
అద్దమ్ము హృదయమై 
హృదయము కంటిపాపకోసమే మోహనా 
 
తెలియని భావమేదొ 
భావము రాగ మేదొ   
రాగము అనురాగమై జతగా మోహనా 

చూపు చిందు చూసే 
చేసి విందు చేసే 
విందు పసందు మైకము కమ్మే మోహనా

బుగ్గ కందిపోయే 
పోయె మనసు పోయే 
మనసు ఉక్కిరి బిక్కిరి చేసే మోహనా

మల్లె తొందరాయే
అయే చిందు లాయే 
చిందులు చిన్మయరూపు ఆకర్ష మోహనా 

ఈ గాలి నాదిలే
నాది నీదియునులే 
నీది నాది ఒకటే ఆలోచన మోహనా 

--(())--


సమ్మోహనాల ఈశ్వరుడు
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

పట్టుట ఎంతగాను
ఎంత భక్తి యున్నను
యన్న నమఃశివాయ అంటె వచ్చు ఈశ్వరా

నమ్మిన ట్టి వాళ్ళను
వాళ్ళను కాపాడును
కాపాడుటకేను వచ్చుచుండె ఈశ్వరా

శివుని నేను అనుచూ
అనుచూ హరి అనుచూ
అనుచున్న మూర్ఖులను తరిమేటి ఈశ్వరా

కాటి కాపరి అయిన
అయిన గంగ మోసిన
మోసిన కర్తవ్య దీక్షా శక్తివి ఈశ్వరా

మార్కండేయ రక్ష
రక్ష యముడికి శిక్ష
శిక్షించి రక్షించి పోషించు ఈశ్వరా

భస్మాసుర కు వరము
వర ప్రాణ సంకటము
సంకటమునే హరి రక్షించే ఈశ్వరా

ఆత్మ లింగము ఇచ్చి
ఇచ్చి గణేసు డొచ్చి
డొచ్చి రావణ గర్వమే అణచె ఈశ్వరా

వైరాగ్యం పంచీ
బైరాగనిపించీ 
అనిపించినా భోగరహితుడువి ఈశ్వరా

ఓం నమఃశివాయ..
ఓం నమఃశివాయ..
ఓం నమఃశివాయ..
--(())--


ఏకాగ్రత కలిగియు
కలిగి చూడు శక్తియు
శక్తితో గ్రద్ద పాము హరించు ఈశ్వరా

గ్రద్ద పాదము చుట్టె
చుట్టె సర్పము చిట్టె
చుట్టె పోరాటమ్మును సలిపే ఈశ్వరా

ఒకరు ఒకరు విరోధి
విరోధి అది ఒక నిధి
నిధి అనే ఆశ ఆహారమే ఈశ్వరా

బ్రహ్మ సృష్టే ఇదియు
ఇదియె కర్మ యైనదియు
యైనను పట్టు విడుపులు సాగే ఈశ్వరా

కాల మును బట్టియే
బట్టి స్నేహమ్ము గయే
స్నేహము వలన మంచిగా ఉండు ఈశ్వరా

తమ ఆహార కొరకు
కొరకేగ ఈ శ్రమకు
శ్రమించే ప్రతి ప్రాణి లోకాన మోహనా

గెలుపు ఓటమి ఆట
ఆటె అది బ్రతుకాట 
బ్రతుకాటలో శక్తి ఎవరిదో ఈశ్వరా  

ఆకలి కొరకు డేగ
డేగ పణిని చుట్టగ
చుట్టి కాళ్ళతో భందనమ్మే  ఈశ్వరా 

సమ్మోహనాల గాడిద 


గాడిద పాలు వేడి 
వేడి అయినా వాడి 
వాడివల్ల పిల్లలకు పట్టే ఈశ్వరా 

గాడిద బరువు మోసి 
మోసి రోళ్ళు చేసి 
చేసి ఆరోగ్యంగా ఉండేను  ఈశ్వరా 

గాడిదలా అరుపులు 
అరుపు పోరాటాలు 
పోరాటాల జీవితం మనది ఈశ్వరా 

గాడిద మల్లె చాకిరి  
చాకిరి తో పోకిరి 
పోకిరి చేయు చేష్ట గాడిదే ఈశ్వరా 
   
గాడిద కొడకా అని
అన్న తిట్లన్నీవిని
విన్న గాడిదే తల్లడిల్లే ఈశ్వరా 

కుక్కచేయు పనినీ 
పని గాడిద అననీ 
అనినా ఎవరిబుద్దులు వారివి ఈశ్వరా 

ఖరములు తక్కువయ్యె 
తక్కువ భారమయ్యె 
భారమంతయు రోబోలు తీర్చు ఈశ్వరా
    
గాడిద కెంత ఖ్యాతి
ఖ్యాతి దాని ప్రఖ్యాతి
ప్రఖ్యాతిగా కాళ్ళు పట్టించె ఈశ్వరా 

బ్రతుకు పోరాటములొ
పోరాటపు ఆటలొ 
ఆటలెన్నొ గాడిదల ముద్దుగ ఈశ్వరా 

గాడిద బరువు మోసి 
మోసి  పనులను చేసి 
చెస్తుంటే నే బ్రతుకు గడుచూ ఈశ్వరా 

--(())--


సమ్మోహనాలు .. లక్ష్మణరేఖ   (1201-1206) 
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

మొక్కే కదా అనియు
అనియు తొక్కేదనియు
దనియు అంటూ చెప్పు కాలుపేట్టె ఈశ్వరా

శీలము లేనివాడు
వాడు వట్టి మూర్ఖుడు
మూర్ఖుడు చెట్టు తొక్కు సంబరము ఈశ్వరా

నిర్లక్ష్యము వద్దూ
వద్దూకల వద్దూ
వద్దూ అంటు పాదాలు పట్టు ఈశ్వరా

కాలము ఏదైనను
ఏదైనా తరువును
తరువులను పెంచాలి అందరూ ఈశ్వరా

నిత్య ఉపాసనగా
ఉపాసన శక్తిగా
శక్తినే ఇవ్వాలి  తరువులకు ఈశ్వరా

తరువున మనసు నిలిపి
నిలిపి చింత సలిపి
సలిపి శ్రధ్ధ చూపాలి ఋషిగ ఈశ్వరా

--(())--


సమ్మోహనాలు .. లక్ష్మణరేఖ   (1191-1200) 
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


భర్త లేని చోటే 
చోటు రక్ష చోటే 
చోటు గ లక్ష్మణ రేఖగీతలు ఈశ్వరా    

గీతలు దాట కండి 
దాటితె కర్మ అండి 
కర్మను ఎవరూ మార్చలేరు ఈశ్వరా
 
బంగరు జింక చూపి 
చూపి ఆశను తెలిపి 
తెలిపిన కోరికను తీర్చ వెళ్లె ఈశ్వరా 

భర్త చావు కేకను 
కేకను విని భయమును 
భయమునే తెలిపేను లక్ష్మణకు ఈశ్వరా

మూడు గీతలు గీసి
గీత కదలక  నేసి  
కదలి ఇవతలకొచ్చిన కష్టం ఈశ్వరా 
   
మితీ చెడిన మాటలు
మాటలే తూటాలు
తూటాల సీత మాటకు గీత ఈశ్వరా 

ఎందుకు గీత హద్దు 
హద్దులు మీర వొద్దు
వద్దని చెప్పె సీతతొ  లక్ష్మణ ఈశ్వరా 

లక్ష్మణ రేఖ దాటె 
దాటె కష్టం పడుటె   
కష్టంతో రామాయణ మలుపే ఈశ్వరా 
 
రాక్షసుని మాయలే 
మాయలే కోర్కలే 
కోర్కెలు వల్ల సీత కష్టమే ఈశ్వరా 

రేఖ దాటి నందుకు 
నందుకే కష్టముకు 
కష్టము భార్య భర్తను వీడెను ఈశ్వరా 
 
--(())--

సమ్మోహనాలు .. జై జవాన్ -- సైకిసాన్  (1191-1200) 
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

రైతు ఆకలి తీర్చు
తీర్చి సంపద చేర్చు
చేర్చి మనిషికి తృప్తి కలిగించు ఈశ్వరా

సైనికును సేవలే
సేవలే ప్రేమలే
ప్రేమ దేశ సేవకు పంచునే ఈశ్వరా

రైతు కృషీ ఫలితం
ఫలితం ఆహారం
ఆహారం అందించు లక్ష్యము ఈశ్వరా

దేశ రక్ష సిపాయు
సిపాయి తెచ్చు హాయి
హాయి అనునది దేశ రక్షణే ఈశ్వరా

రైతు హృదయము పృథ్వి 
పృద్వి సాగును సాద్వి 
సాద్విగ రైతు కృషి దేశ రక్ష ఈశ్వరా 
 
అనుకోని విపత్తులు 
విపత్తులూ గొడవలు
గొడవల్ని రక్షించు సిపాయులు ఈశ్వరా 
  
బతుకు బండి లాగుచు 
ఇక పంట పండించు 
పండించిన పంట ప్రజలకే ఈశ్వరా 
 
చలి వానకి ఎండకి 
ఎండలో  రక్షణకి  
రక్షనే ధ్యేయంగా సిపాయి ఈశ్వరా 

రైతు ఆస్తి పడమియె
పుడమిలోన సాగుయె   
సాగుచేసి పంట పండించుట ఈశ్వరా 

శత్రువులపై దాడి 
దాడి సిపాయి వేడి 
వేడి తో దేశమునకు రక్షణ ఈశ్వరా 

--(())--

సమ్మోహనాలు .. గోడకు చెవి (1181-1190) 
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
 
జాగర్తపడేటప్పుడు 
అప్పుడు చెయు చప్పుడు 
చప్పుడు గోప్యము గోడకిచెవులు ఈశ్వరా

రాత్రిపూట మాటలు 
మాటలతో చేష్టలు 
చేష్టలు శబ్దము నెమ్మది గాను ఈశ్వరా

వినేందుకే చెవులు
చెవులు విన్న పలుకులు  
పలుకులు నే తెలిపు నోటిద్వార ఈశ్వరా 
 
ఎవరికివారైనా 
వారేను మరచినా 
మరచి గుర్తులు తెల్పి కలుపునే ఈశ్వరా 

చెవిన విన్న మాటలు   
మాటలు నిద్ర కలలు 
కలలు వల్ల కలవరింతలే ఈశ్వరా

తప్పొప్పులు వినినా 
విని భయము తెలిపినా 
తెలిపి గోడకు చెవులున్నాయనె ఈశ్వరా

మాటలతో గారడి
గారడి తో వినికిడి   
వినికిడి శక్తి పెరిగిన కష్టము ఈశ్వరా 

ఇవి చెప్పుడు మాటలు 
మాటల తో వేటలు 
వేటలు సల్పుదురు ధైర్యముతో ఈశ్వరా 

విషయము నిజమైనను
అయి అబద్ధమైనను 
అయినను గోడకుచెవులభయమే ఈశ్వరా 
 
వాంఛ తీరు సమయము 
సమయము తోన ధైర్యము 
ధైర్యము ఉన్నా గోడకుచెవులె ఈశ్వరా 

--(())-

సమ్మోహనాల గణపతి (1171-1180)

వినాయక చవితి రోజున
రోజు పూజలు వలన
పూజ పుణ్యం పురుషార్ధమోచ్చు ఈశ్వరా

జయము విఘ్నేశ్వరా
విఘ్నేశ్వర ఈశ్వరా
ఈశ్వరా సర్వపరాత్పరుడువి ఈశ్వరా

సకల జగదుద్ధారా
జగతికే శుభకరా
శుభకరా విద్యాదాయక యే ఈశ్వరా

మాయా రాక్షస డే
రాక్షస సంహరుడే
సంహార కార్యానికి మూలం ఈశ్వరా

మునీ జనా వందిత
జన మన్మ  ధారిసుత
సుత నిత్యానంద నిర్మలడే ఈశ్వరా

గౌరీ ప్రియ నందన
నందన సృష్టి కరుణ
కరుణ కారణం శంభో చరిత ఈశ్వరా

గరికతో పూజలే
పూజసంబరములే
సంబరంగా గణపతికి పూజ ఈశ్వరా

ఏక దంత గజాననుడు
గజాననుడే ఘనుడు
ఘనుడు గా రక్షకుడుగ గణపతి ఈశ్వరా

 దివ్య పుష్ప మాలలు
మాలల సుఘంధాలు
సుఘంధ పరిమళాలు మాకిచ్చే ఈశ్వరా

సిద్ధి బుద్ధి కలయిక
కలయిక మనసునఇక
ఇక శుద్ధిగా రక్షగా గణపతి ఈశ్వరా
**(())**

సమ్మోహనాల బ్రహ్మానందం (1161-1170)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


నవ్వులే నటనగా
నటనజీవితముగా
జీవితంలోను హాస్యబ్రహ్మా ఈశ్వరా

చిత్ర సీమకు రాజు
రాజు హాస్యపు రాజు 
రాజుగ హాస్య బ్రహ్మానందం ఈశ్వరా

ముఖకవలికలతో ను
తోను నగవు పంచెను
నగవులే హృదయాన్ని కదిలించె ఈశ్వరా

ఆనందంకొరకే
కొరకూ సినమాకే
సినమా వల్ల మనసు హాస్యమే ఈశ్వరా

 ప్రాణుల లో నవ్వులు
నవ్వుల లో కన్నులు
కన్నులతో  బ్రహ్మానందమే ఈశ్వరా

విస్త్రతి తెలుసుకుంటి
తెలిసి గ్రహించికుంటి
గ్రహించే నటనతో హిస్యమే ఈశ్వరా

నటనతొ విశ్వాసం
విశ్వాసపు వాసం
వాసం నటనలు హాస్యపు రసం ఈశ్వరా

 రూపమె ఐశ్వర్యము
ఐశ్వర్యమే హాస్యము
హాస్యము తో బ్రహ్మానందమే ఈశ్వరా

వేవేలు రూపాలు
రూపాలు హాస్యాలు
హాస్య స్వరూపాల తో సంపద ఈశ్వరా

 చూడు పలు హాస్యములు
హాస్యపు నవనటనలు
నటనలచక్రవర్తే బ్రహ్మా ఈశ్వరా

**(())**

సమ్మోహనాలు .. రచ్చ బండ (1151-1160)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

జాతుల కూడలి ఇది 
ఇది పరిష్కార విధి 
విధిగా సమస్య పరిష్కారము ఈశ్వరా 

పెద్దలు కూర్చొనునది 
కూర్చొని  తీర్పుల వీధి 
వీధి నందు తీర్పు చెప్పు పెద్ద ఈశ్వరా 

జాతీ సమైక్యత
సమైక్యత ఐక్యత 
ఐక్యతతో గ్రామ స్వేశ్చ ఇచ్చు ఈశ్వరా

ఇది  సమన్వయానికి 
సమన్వయ తీర్పులకి
తీర్పులతో రచ్చబండ తెల్పు ఈశ్వరా 

కులాలకు ఆజ్యంగ     
ఆజ్యాంగ ధర్మంగ
ధర్మ0గ న్యాయంగ నిర్వహణ ఈశ్వరా 
  
సంఘర్షణ వచ్చెను   
వచ్చె సందిగ్ధతను 
సందిగ్ధ పరిష్కార వేదిక ఈశ్వరా 

సమ సమాజం కొరకు   
కొరకు క్షేమం కొరకు  
కొరకు అభాగ్యుల సేవ కొరకు ఈశ్వరా 

శ్రేష్ఠులు కలసి ఉండు 
ఉండు న్యాయ ముండు 
ముండునది సేవలకు మార్గమే ఈశ్వరా

నవ వసంతం తోను 
తోను పండుగ లోను  
పండుగ సంభరం జరిపేను ఈశ్వరా 

కాల ప్రభుత్వమిది
ఇదిజనల కొరకుంది   
కొరకుంది ఆత్మగౌరవంతో ఈశ్వరా 

--(())--

సమ్మోహనాలు .. ఆత్మ స్వరూపుడు ... నన్నయ్య (1141-1150)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

తెలుగు పద్యము తెల్పి 
తెల్పి హృదయం నిల్పి 
నిల్పే నన్నయ్య పాండిత్య౦ ఈశ్వరా 
 
తెలుగు మాధుర్యమే   
మధుర పాండిత్యమే 
పాండిత్యమే మనసును చేరును ఈశ్వరా 

పరాశరు కుమారుడు
కుమారుడు వ్యాసుడు
వ్యాసుడు సంస్కృత  భారతము రాసె . ఈశ్వరా 
 
తెలుగుకవి నన్నయ్య 
నన్నయ్య తెల్పే నయ్య 
తెల్పే మహాభారతమ్మునే ఈశ్వరా 
 
జ్ఞానం మేర్పడునది 
ఏర్పడు కవిత్వమది 
కవిత్వ ము సంతృప్తి కల్గించు ఈశ్వరా

మనసును పంచె మగువ 
మగువ కథలతొ తెగువ 
తెగువ చూపు నన్నయ్య రచనలు ఈశ్వరా

వినయము నేర్పు రచనె  
రచనలు మనసు కరుణె  
కరుణ కవి పాండిత్యము తెలిపే ఈశ్వరా
   
పరాశరు కుమారుడు
కుమారుడు వ్యాసుడు
వ్యాసుడు సంస్కృత  భారతము రాసె . ఈశ్వరా 

రాజుల కొలవు లందు 
కొలువు కవుల లందు 
కవులలో ఆదికవి నన్నయ్య ఈశ్వరా 

ఆర్య నిర్వాహణకు
నిర్వాహణ కవితకు 
కవిత్వమ్ములో సార్వభౌముడు ఈశ్వరా 

--(())--

సమ్మోహనాలు .. ఆత్మ స్వరూపుడు ... శివోహం (1131-1140)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
 
జ్యోతిస్వరూపము యె   
రూపం లో ఆత్మయె 
ఆత్మయె జాగ్రదావస్థలోన ఈశ్వరా

మాయా రూపము యె 
రూపంలో అత్మయె 
 అత్మయె నిద్రావస్థలో నె ఈశ్వరా 

ఆత్మా మనమును చేరి 
చేరి సంకల్ప జారి 
జారీతో హృదయ స్పందన లే ఈశ్వరా 

మేధావులు కర్మలు   
కర్మల తో బుద్దులు 
బుద్ధులతో ప్రార్ధనల లొ ఆత్మ ఈశ్వరా 
 
ఆత్మైతే ప్రఙ్ఞా
ప్రజ్ఞ తోను ఆజ్ఞా 
ఆజ్ఞా ఙ్ఞాపక మనో స్థైర్యము ఈశ్వరా 

ఆత్మ ప్రాణులలో
ప్రాణ మై జీవిలో 
జీవిలో  నశించని స్వరూపం ఈశ్వరా
 
ఆత్మతో చేయుపని 
పని మాయ జాలమని 
మాయ తొలగి మనసు సంకల్పం ఈశ్వరా 
 
రథచక్రపు ఆకులు 
ఆకు నామ వేదాలు 
వేదాలు ఆత్మలో ఉంటాయి ఈశ్వరా 

ఋక్ వేదములలోను 
లో యజుర్వేదము ను 
యజుర్వేడమ్ జనుల మనస్సులు ఈశ్వరా 

కాలాలన్నిటినీ
అన్నిటి ఆత్మ లనీ  
ఆత్మ మనస్సు  సత్సంకల్పం ఈశ్వరా 

--(())--


సమ్మోహనాలు ..... శివోహం   1221-1230)
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

దైవాన్ని నమ్మాలి   
నమ్మి స్మరించాలి  
స్మరణ తొ మనిషి ఆరాధకుడౌను ఈశ్వరా 

మనని మనం మర్చీ 
మర్చి స్వర పర్చీ 
పర్చి జీవి ఆరాధకుడౌను ఈశ్వరా 
   
నేను భిన్నం కాదు 
కాదు సృష్టే కాదు 
కాదు మనిషి అబిన్నం సత్యం ఈశ్వరా 
 
సత్య భావన ఉంది 
ఉంది బోధను ఉంది 
ఉంది సాధనమే సత్సంగం. ఈశ్వరా 

గుణ రూపం లోను 
లోను భోజన లోను
లోను ఆహారాన్ని అందించు ఈశ్వరా 

ఆహారమ్మును పొందే  
పొంది శక్తి పొందే  
పొంది విసర్జించే శక్తియే ఈశ్వరా 
  
శివకేశవులపూజ 
పూజ మనసుకు తేజ 
తేజస్సు వల్లా జవమ్మేను ఈశ్వరా 

ఓంకార నామమ్ము 
నామము మోక్షమార్గమ్ము 
మోక్షమిచ్చును శక్తి నిచ్చేను ఈశ్వరా 

శివ శివేతి శివేతి
శివేతి భవ భవేతి
భవ భవేతి వా  నమ:శివాయ ఈశ్వరా 

హరహరేతి హరేతి
హరేతి వా జపేతి 
హర జపేతి వా  నమ:శివాయ ఈశ్వరా

--(())--

శివతత్వం లో మనుషుల జీవితం ఇమిడి ఉంది.
పులి చర్మం ధరించటం,దేహం పై బూడిదతో స్మశానంలో గడపటం వెనుక జీవిత పరమార్థమెంతో దాగుంది.
మెడలో సర్పాన్ని ధరించటంలో... సమస్యలు పాములై మెడను చుట్టుకొని ఉంటాయనే మర్మ ప్రతీకను తెలపటం.... భిక్షాటన వెనుక మనిషి ఈ భూమ్మీద ఒక యాచకుడేనని తెలపటం.....
ఇలా ఎన్నో విషయాలు శివతత్వం మనకు బోధిస్తుంది.....

సమ్మోహనాలు ..... బాలిక  1211-1220)
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

నువ్వు వేసే అడుగు
అడుగు ప్రీతి కలుగు
ప్రీతి అమ్మాయి ప్రతిరూపము ఈశ్వరా

పంచు కొను బంధమ్ము
బంధమను రాగమ్ము
రాగమ్ము ఆప్యాయతతోనే ఈశ్వరా

ఆనందం కల్గియు
కల్గి అభిమానము యు
అభిమానం దేశాభివృద్ధికి ఈశ్వరా

 నవ్వులతొ అమ్మాయె
అమ్మాయి గణమాయె
గుణము సద్గుణాలు అమ్మాయే ఈశ్వరా

మమతలతో మనస్సు
మనస్సు తో ఉషస్సు
ఉషస్సు ను పంచేది అమ్మాయిలు ఈశ్వరా

సంకల్పం దృష్టే
దష్టి కళల దృష్టే
దృష్టి సారించింది జీవితంలొ ఈశ్వరా

మంచి తనముతొ పేరు
పేరు పంచే వారు
వారు మగవారికి ప్రేమ పంచు ఈశ్వరా

బాలిక ఇంటి వెలుగు
వెలుగు పంచే మెలుగు
మెలిగి హృదయంలోను ఉండేను ఈశ్వరా

ముద్దు లొలుకు తల్లి
తల్లి అమృత వల్లి
అమృత వల్లి మాయింటి బాలిక ఈశ్వరా

కన్న వారి ప్రేమ
ప్రేమ గౌరవ ప్రేమ
ప్రేమతో అందరినాదరించె ఈశ్వరా

--(())--
జాతీయ బాలికా దినోత్సవం(24/01/2021) శుభాకాంక్షలు

***
సమ్మోహనాలు .....శ్రీ నేతాజీ వాక్కులు 1201-1210)
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

అనుబంధాలనేవి 
అణువు స్థిర మైనవి
స్థిరమైన ప్రఖ్యాతులు కలిగు ఈశ్వరా

జీవితంలో కళలు
కళలు అనుబంధాలు
అనుబంధం ఆత్మీయత గాను ఈశ్వరా

ప్రొత్సాహ ప్రశంస
ప్రశంసే అభ్యాస
అభ్యాసం ఎప్పుడు అవసరం ఈశ్వరా

సంకల్ప దీక్షలే
దీక్ష ఉద్య మములే
ఉద్యమం నిజాన్ని బతికించుట ఈశ్వరా

గమ్య సోపానాలు
సోపాన పు అడుగులు
అడుగులు ఎన్నో కష్టాలు లే ఈశ్వరా

 నిస్వార్ధ జీవితం
జీవితం ప్రశాతం
ప్రశాంత మనసు ఎప్పుడూ జయం ఈశ్వరా

ఒక ఉద్యమ కెరటం
కెరటమే నిర్ణయం
నిర్ణయం గమ్యమే సక్రమం ఈశ్వరా

ఆవేశం అగ్నీ
అగ్ని ప్రచండాగ్నీ
అగ్నీ కుటుంబాన్నీ దహించు ఈశ్వరా

 సద్గోష్ఠి సిరిపెంచు
పెంచు కీర్తిని పెంచు
పెంచి సంతుష్ఠితో బత్కేను ఈశ్వరా

విజ్ఞతను గలిగుండి
గలుగు జ్ఞానం వుండి
జ్ఞానం తో అజ్ఞానం పోవు ఈశ్వరా
__(())__

సమ్మోహనాలు .. చిన్నపువ్వులు (1191- 1200)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

సాగర సంఘము ఇది 
ఇందులో కలయు నది 
నది కలసి తనయునికి పోయేను ఈశ్వరా

సకల ఖనిజ సంపద
సంపద పై  సంపద 
సంపద అంతా సముద్ర మందు ఈశ్వరా 

సముద్ర కెరటములే  
కెరటములు పొంగులే 
పొంగులలో నుండి విద్యుత్తే ఈశ్వరా 

జీవితమొక సంద్రము 
సంద్రము బతుకు  కష్టము
కష్టమె చుక్కాని లేని నావ ఈశ్వరా 

మనసు  గొప్ప సంద్రము
సంద్రము అనిశ్చలము
అనిశ్చల ముతో కెరటము బతుకు ఈశ్వరా 

సాగరంపై పడవ 
పడవ కదిలే నావ 
నావ సముద్ర ప్రయాణముయే  ఈశ్వరా 

సాగర మందు అలలు  
అలలుండు తీరాలు 
తీరాలు స్నానపు ఆటలే ఈశ్వరా 

సముద్ర సుడి గుండం 
గుండం మది గండం 
గండాన్ని తప్పించు కోలేరు ఈశ్వరా 

 మత్యకారుల వృత్తి 
వృత్తి వేట ప్రవృత్తి 
ప్రవృత్తి వృత్తి సముద్రముపైన ఈశ్వరా

ఖనిజ వాయువు తీయు 
తీసి యంత్రము కీయు 
ఇచ్చిన పనిముట్లు తయారగును ఈశ్వరా   

--(())--


సమ్మోహనాలు .. చిన్నపువ్వులు (1181- 1190)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

సాగు కాల మెప్పుడు
మెప్పుడు కల ఇప్పుడు
ఇప్పుడు నసాధ్య సుసాధ్యము ఈశ్వరా

ఉద్వేగము నొందకు
నొందకూ బాధలకు
బాధలిచ్చిన సుఖము మావెంట ఈశ్వరా

జగతి గూర్చి  తెలుపుము
తెలుపు తాను కష్టము
కష్టము ఉన్న బతకాలి మనము ఈశ్వరా

ఐకమత్యం మనదే
మన లోనె  ఉన్నదే
ఉన్నదే మాయ తెర తొలగించు ఈశ్వరా

మనసు భ్రమతొ ఉంది
ఉంది తిమ్మిరి ఉంది
ఉంది అయినా నిగ్రహంగాను ఈశ్వరా

ఆనందం మనకే
మనకు ఓర్పు కొరకే
కొరకే అయినా కలిసి ఉంటాం ఈశ్వరా

జీవితం విచిత్రము
విచిత్రము ప్రేమము
ప్రేమమే మధురిమలకలయికే ఈశ్వరా

ప్రేమంటే మోహమే
మోహము  సమ్మతమే
సమ్మతమే ప్రళయమైతె కష్టం ఈశ్వరా

హృదివేదన తీరగ
తీరుగ మనసు కథలగ
కథలు ఎన్ని చెప్పిన నమ్మరే ఈశ్వరా

నిర్మల కాంతి వచ్చి
వచ్చి మాకే ఇచ్చి
ఇచ్చిన ప్రకా రంగా బతుకు ఈశ్వరా
--(())--


సమ్మోహనాలు " కరోనా టీకాలు " (1171-1180)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
:
అద్భుతం టీకాలు
టీకాలు కావాలి 
కావాలి కరోనా కే మందు ఈశ్వరా 
 
ప్రాణానికి రక్షణ 
రక్షణ నిరీక్షణ 
నిరీక్షణకు ముందు టీకాలు ఈశ్వరా 

విజయమే పరీక్షలు 
పరీక్ష ప్రయోగాలు 
ప్రయోగాలు అవసరాలు ఉండె ఈశ్వరా 
  
శాస్త్రవేక్తల కృషికి
కృషియే సిద్ధించుటకి   
సిద్ధించు ప్రయోజన౦ ప్రజలకు ఈశ్వరా  
  
సందేహాలు నివృత్తి 
నివృత్తే సంతృప్తి 
సంతృప్తి స్వచ్ఛందంగా కలుగు ఈశ్వరా 

ఎవరికి వారు వచ్చి 
వచ్చి ధైర్యాన్ని ఇచ్చి 
ఇచ్చి భయము తొలగే టీకాలు ఈశ్వరా 
  
జన్యు పరం టీకా  
టీకా ఫలిత టీకా
టీకా ఇక ఆరోగ్యం మనకు ఈశ్వరా 

మనుషుల లో  సఖ్యత 
సఖ్యత తో విజేత 
విజేతగా భారతదేశమే ఈశ్వరా

ప్రజా రక్షణ దీక్ష 
దీక్ష సఫలిత రక్ష 
రక్షతో ప్రజలకుభయము తగ్గె ఈశ్వరా 

పుకారు నమ్మకండి 
నమ్మకం ఉంచండి  
ఉంచి మందు  టీకాలు వేసెను ఈశ్వరా   

--(())--

సమ్మోహనాల... లోకం   (1161-1170) 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఇది మాయ లోకమ్ము 
లోకమున ప్రేమమ్ము 
ప్రేమతో కలసి మెలసి ఉండును ఈశ్వరా 
 
సుఖ దు:ఖము బంధము 
బంధము జీవితము 
జీవిత సత్యము లను తెల్పేను ఈశ్వరా 
  
బానిసత్వము కాదు 
కాదు ధైర్యము కాదు 
కాదు అనక మధ్య లాలిత్వము ఈశ్వరా 
 
పుత్తడి గొలుసు అయిన 
అయిన ఇనుము అయిన 
అయిన బంధము వలే కట్టును ఈశ్వరా 

విజ్ఞాన కవాటము 
కవాటము జ్ఞానము 
జ్ఞానమువల్ల జన్మ సార్ధకం ఈశ్వరా 

తాడిత పీడితులము 
పీడిత భాదితులము 
బాధితులకే సహాయ పరులము ఈశ్వరా 
 
చేయూత వసగియే
వసగి ప్రేమమ్ముయే 
ప్రేమతో జీవన తరుణమ్ము ఈశ్వరా 
  
న్యాయంగా బతుకును 
బతుకులో కష్టమును  
కష్ట నష్ట ములు వెంబడించే  ఈశ్వరా 

అధికారి ఆదరణ 
ఆదరణ తొ ప్రేరణ 
ప్రేరణ తొ అసలుకు  మోక్షము లేదు ఈశ్వరా 
 
ఆదు కొనుటయె హక్కు 
హక్కు నుబట్టి దిక్కు 
దిక్కులున్నా  కలుగు చిక్కులే ఈశ్వరా  

--(())--

సమ్మోహనాల... తాటిచెట్టు  (1147-1160) 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

స్త్రీలలోని ఒంపులు
ఒంపు సొంపు కెంపులు
ఇంపైనఒంపులు కవ్వింపులు ఈశ్వరా

పెదవి మధువులు విసిరి
విసిరి కనులతొ కసిరి
కసిరి మదిలో మోహమును పెంచే ఈశ్వరా

నల్ల నల్లని కురులు
కురులు చూపే ఎదలు
ఎద బరువులు మనసును పిలిచేను ఈశ్వరా

పాలించు మగనికై
మగనితొ కలియుటకై
కలసి ఉండుట కొరకే ఉండెను ఈశ్వరా

లేత పెదవుల కన్నె
కన్నె చూపులు వన్నె
వన్నె వయసుకు జోడు కరువాయె  ఈశ్వరా

గుండెకే బరువాయె
బరువుతో దిగులాయె
దిగులును తీర్చె సఖుడు లేడాయె ఈశ్వరా

చూపుతొ పిలుపు మహిళ
మహిళ పిలుపులో కళ
కళలన్నీ తెలిపే మనోహరియె ఈశ్వరా

పడతి మేని పసిడి
పసిడి మెరుపుల ఒడి
ఒడి కోరువారి సుఖమే పంచె ఈశ్వరా

పచ్చ బొట్టుల మోము
మోము ఉండె అందము
అందము మధురానందపు పడచు ఈశ్వరా

ప్రకృతి కాంత మెరుపు
మెరుపు తో మై మరుపు
మైమరుపు మాయ రూప సుందరి ఈశ్వరా

తరుణీ మనసివ్వుము
మనసు ఇచ్చి పొందుము
పొందుటలో సుఖము నీకు తెలుసు ఈశ్వరా

సుకుమారి మనోహరి
మనోహరి యై లహరి
లహరి వాంఛను తెలిపే మయూరి ఈశ్వరా


స్త్రీ వెలుగుతో కాంతి 
కాంతి తెచ్చు బ్రాంతి 
బ్రాంతి తో సాగును సంసారము ఈశ్వరా 

స్త్రీ పురుష ఏకమ్ము 
ఏకము జీవితమ్ము 
జీవితము సాగును ఆకర్షణ ఈశ్వరా 
   

--(())--


సమ్మోహనాల... తాటిచెట్టు  (1141-1146) 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
 
కవులు తాటి ఆకులు
ఆకులపై రాతలు
రాతలతో భవిష్యత్తు తెలుపు ఈశ్వరా

పండుగరోజు కల్లు
కల్లు త్రాగు ఇల్లు
ఇల్లు వళ్ళు గుల్లగ సంపదే ఈశ్వరా

దేహమంతా వేడి
వేడి తగ్గా జోడి
జోడిగ తాటి ముంజల చలవ ఈశ్వరా

కాలమేదైననూ
ఏదైన దొరుకునూ
దొరికేది తాటికల్లు , బెల్లము ఈశ్వరా

తాటి దుంగ లన్నీ
అన్ని ఇల్ల కన్నీ
కన్నీరు తుడిచి కాపురంమ్మే ఈశ్వరా

తాటి చెట్టు ఆకులు
ఆకులగా కప్పులు
కప్పులతొ బీదవారి  గృహములు ఈశ్వరా

మత్తు పెంచే కల్లు
కల్లు వ్య‌సన కల్లు
కల్లు త్రాగుట అందరికి చేటు ఈశ్వరా

పెద్ద దైనది చెట్టు 
చెట్టు ఎత్తున కట్టు 
కట్టు చుండ కల్లు కుండ ఉంచె ఈశ్వరా 

తాటి ముంజలు తినుము
తిని రసము జుఱ్ఱుము 
జుర్రితే ఆరుచే వేరులే ఈశ్వరా 

తాటాకుతొ గొడుగులు
గొడుగు విసనకర్రలు
కర్ర చిన్న కాలువకు వంతెన ఈశ్వరా 

తింటె తిప్పుతు వుంటె
వుంటె బెల్లము తింటె 
తింటే ఆరోగ్యానికి మేలు ఈశ్వరా  

ఆకులతో బొమ్మలు 
బొమ్మ బుట్ట చాపలు 
చాపలు పలు వస్తువులు తయారగును ఈశ్వరా 

తాటి కల్ప వృక్షము 
వృక్షము బతుకు మయము 
మయము బతుకులు పచ్చ గుండేను ఈశ్వరా 

శాఖ రహిత వృక్షము
వృక్ష మిచ్చును ఫలము
ఫల మనగా తీయ్యటి  ముంజలు ఈశ్వరా 
 
తాటి నుండి బెల్లము
బెల్లము బహు లాభము
లాభము తో సంసారము సాగు ఈశ్వరా 

తాటిపళ్ళు ముంజలు
ముంజల తో తాండ్రలు
తాండ్రను పిల్లలు ఇష్టపడుదురు ఈశ్వరా 


సమ్మోహనాల... సంక్రాతి (1131-1140) 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

చూడ చిన్న బాలుడు 
బాలు ఆశ లోలుడు 
ఆశ దేనికో  తెలుసా చదువు ఈశ్వరా

కట్ట బట్ట లేదు 
లేదు నిద్ర రాదు 
నిద్ర పోతే పాఠం  రాదుగ ఈశ్వరా

మంచి  కాల మొచ్చు 
మొచ్చి మనసును మెచ్చు 
మెచ్చి భయము తొలగి సుఖములుగా  ఈశ్వరా       
      
కళ్ళ మాయా లేదు
లేదు కోరిక లేదు 
లేదు ఈర్ష్య స్వార్ధం నాలో న ఈశ్వరా 

నవ్వు రాని  వాడిని 
వాడి ఉన్న వాడిని 
వాడినైనా  బతుకే  తెలియదు ఈశ్వరా
       
గోడ చాటు ఉన్నా 
ఉన్నా తెలియ కున్నా
తెలియాలని ఆశ తో ఉన్నా ఈశ్వరా 
 
దేశం రక్ష ఉన్న 
ఉన్న నూ లేకున్న 
లేకున్న ఓర్పు ధైర్యం ఉంది ఈశ్వరా 
 
చీకట్లను తరిమీ 
తరిమీ ఇక కలిమీ 
కలిమి లేములు కావడి కుండలు ఈశ్వరా 
 
జ్ఞానము వైపు అడుగు 
అడుగు  వేస్తే మడుగు 
మడుగు నడుమ బతుకులు మావేను ఈశ్వరా          

వెలుతురు లేని బతుకు 
బతుకు  అంతా చితుకు 
చితికినా సంకల్పం  మారదు ఈశ్వరా

--(())--


సమ్మోహనాల... సంక్రాతి (1121-1130) 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

సంక్రాంతి సంబరం
సంబరం మానసం
మానసం సుఖశాంతిమయం మనకు ఈశ్వరా

పంట ఇంటికి వచ్చు
వచ్చి పండుగ తెచ్చు
తెచ్చి పిల్లలు పెద్దలు సందడిఈశ్వరా

భోగ భాగ్యము కలుగు
కలుగు సంతోషమగు
సంతోషపు వెల్లువ సంక్రాంతి ఈశ్వరా

మకరసంక్రణము ఇది
ఇది శుభములొసగునది
శుభాలొసగే శోభ సంక్రాంతి ఈశ్వరా

ఆయురారోగ్యముల్
ఆరోగ్య జీవముల్
జీవుల సమ్మాహపరకాంతులు ఈశ్వరా

అంబరమ్మున కాంతి
కాంతి ‌జ్వాల శాంతి 
శాంతీ సంబరమ్ము సంక్రాంతి ఈశ్వరా

గ్రొంగొత్త హంగులతొ
హంగు ఆర్భాటం తొ
ఆర్భాటం గా అల్లుళ్ళె ఈశ్వరా

స్త్రీలు వేసే ముగ్గు
ముగ్గు ముంగిట ముగ్గు
ముగ్గుల తొ చూపె  స్త్రీల ఓర్పు ఈశ్వరా 

బావ చీర తెచ్చే   
తెచ్చె చీర ఇచ్చే 
ఇచ్చే మరదలికి సంతసమే ఈశ్వరా 

ఇల్లంతా సందడి 
సందడి తో సుఖపడి 
సుఖపడి సంతోషాలు వెల్లువ ఈశ్వరా 

--(())--

సమ్మోహాలు .. నేటి మహిళ (1111--1120)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ముద్దు లొలికే మోము
మోమే సౌందర్యము
సౌందర్యమే కాంతుల వెల్లువ ఈశ్వరా

అందమానందమే
ఆనంద భాగ్యమే
భాగ్యమె సర్వ జనరక్ష స్త్రీ ఈశ్వరా

విశ్వ వ్యాప్తి మహిళ
మహిళే ఇంటికి కళ
కళలు చూపి బాధ్యత వహించే ఈశ్వరా

శ్రీ వారు లేకనే
లేక హృదయార్పనే
అర్పపణతొ మనసు మోనజ్ణానిగా ఈశ్వరా

దేహమున నేనుంట
ఉండి ఆత్మగ వుంట
వుంటా చేసిన మోసము తెల్పు ఈశ్వరా 

కలలు కల్లలాయే 
కల్లా  లేదాయే 
లేక మగువకు విలువ లేదులే ఈశ్వరా 

మరులు గొల్పు వేళలు 
వేళ విషయం వాంఛలు 
వాంఛలని తక్కువే చేసారు ఈశ్వరా 
  
పండుగకు సంబరం 
సంబర ఆర్భాటం
ఆర్భాటంతొ అందరిని కలుపు  ఈశ్వరా 
  
తామరాకున నీరు 
నీరు లా కన్నీరు 
కన్నీరును మార్చు స్త్రీ హృదయం ఈశ్వరా 
 
మనసును పట్టి ఉండు 
ఉండి చల్లగ ఉండు 
ఉండి హృదయము ఇచ్చి పుచ్చుకొను ఈశ్వరా 

--(())--


సమ్మోహాలు... ఆట  1101---1110 

నలుగురు కలిశారె  
కలిసి యే ఆడారె
ఆడే ఆట అర్ధం తెలియదు ఈశ్వరా 

కట్ట బట్టయు లేదు 
లేదు భయమ్ము లేదు 
లేదు కాని మొండిధైర్యముతో ఈశ్వరా

గుంటను ఆట మార్చి 
మార్చి మనసున చేర్చి 
చేర్చి సంతోషమ్ముతో ఆట ఈశ్వరా
 
బాటుకు తెరువు ఏది 
ఏది అనుటయే మది 
మది పులకరించి ఆడే ఆట ఈశ్వరా 
 
నలుపు నాది అనియే 
అనియు తెలుపు అనియే 
తెలుపు నలుపు మధ్య గుంత ఆట ఈశ్వరా

చిన్న పెద్ద కలిసియు 
కలసి సరదా కళయు
కళ నైపుణ్యమంత చూపెట్టె ఈశ్వరా 
   
ఎర్ర నాది అంటూ 
అంటూ అని ఉంటూ 
ఉంటూ లెక్కవేసి గెలుపులట ఈశ్వరా

చిరుగాలి సవ్వడే 
సవ్వడి కి భయ పడే 
పడే నవ్వులాటల మధ్యలో ఈశ్వరా 
 
మా దారి మాదేను 
మాదే ఒక ఆటను 
ఆటల సంబరం మరవద్దులె ఈశ్వరా

మేధస్సుకు పదునులె 
పదును చూపి గెలుపులె  
గెలుపుల మధ్య గొడవ లేదులే ఈశ్వరా 
--(())--


సమ్మోహనాలు .. ఉట్టిలో కుండలు ((1091-1100)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఉట్టి ఎక్కలేకయు  
లేక స్వర్గ మనియు 
మనియు మాయమాటలు మనిషియే ఈశ్వరా

ప్రకృతి అనే గాలీ 
గాలి రాక జాలీ
జాలి లాగ ఉట్టి కట్టి ఉంచు ఈశ్వరా

ఉట్టి ప్రపంచంము 
ప్రపంచము సౌఖ్యము 
సౌఖ్యము ఉట్టిలా వేలాడే ఈశ్వరా 

ఉట్టిన కుండ పెట్టి 
కుండ పాలు పెట్టి 
పాలు తీయకుండ గజ్జె కట్టె ఈశ్వరా 
 
హృదయము ఒక కుండా  
శ్వాస రెండొ కుండా 
కుండా కదిలేది ప్రాణమె ఈశ్వరా 
 
ఉట్టి తెరువు కొరకుయె 
తెరువు పాలు అమ్ముయె 
పాలు వెన్న నెయ్యి అమ్మె బతుకు ఈశ్వరా 

సత్య మనే ఉట్టి 
ఉట్టి కుండా మట్టి
మట్టిలో కలియు ప్రాణమైనది ఈశ్వరా 

పాలు వెన్నను దాచు 
దాచి ఎత్తున యంచు 
యుంచె ఉట్టెలో కుండలలోన ఈశ్వరా 
 
క్రిములు చేరా కుండ
కుండ కుండా కుండ
కుండలను ఉట్టిలో ఉంచే ఈశ్వరా 
  
మాయ చేర కుండా    
కుండ చల్లఁ యుండా     
చల్ల చల్లగ ఉంచేది కుండ ఈశ్వరా 

--(())--

సమ్మోహనాల శ్రీ శ్రీ  (1081-1090) 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

నిత్య వెలుగు రచయత 
రచయత లో సాంద్రత 
సాంద్రత తోను వెన్నెల శ్రీశ్రీ ఈశ్వరా  

రచయితగ మణిపూస 
మణిపూస ప్రశంస 
ప్రశంసలతొ శ్రీ శ్రీ గా సాగె ఈశ్వరా 

కాల మార్పులు బట్టి 
రచన శ్రీ శ్రీ చుట్టి 
శ్రీ శ్రీ యువహృదయాలలోనే ఈశ్వరా 
 
మరోప్రపంచ సృష్టి 
సృష్టి తొ పర్య వేష్టి 
పరివేష్ఠిగా అద్భుత రచయత సృష్టి ఈశ్వరా
 
అగ్గిపుల్ల వెలుగులు 
వెలుగు కుక్క పరుగులు 
పరుగుల సబ్బు బిళ్ళల రచయత ఈశ్వరా 

జగతి ప్రగతి కొరకు 
ప్రగతి కృషిగ చినుకు 
చినుకు నదిలా సాగే శ్రీ  శ్రీ ఈశ్వరా 
  
కవిత్వం పటుత్వం 
పటుత్వం సమత్వం 
సమత్వం ప్రజా హృదయత్త్వమ్ము ఈశ్వరా 

సంఖ్యా కాదు లెక్క 
లెక్క మన్నన లెక్క 
లెక్క రచయితగాను  గుర్తింపు ఈశ్వరా 
 
సినీ గేయ రచయత 
రచయత చూపు మమత 
మమతల చీకటివెలుగులే కధ ఈశ్వరా

మహాప్రస్థానముగ 
స్థానము దశ దిశలుగ  
దిశ దేశాలు వరకు రచయతగ ఈశ్వరా 

--(())--

సమ్మోహనాలు () ... 1071----1080 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

కనులు కలబడు చూపు 

చూపుల చురక ఊర్పు 

ఊపుల ఉయ్యాల పిలుపు ప్రేమ ఈశ్వరా 

 

చీకటి వెలుగు పిలుపు

పిలుపుల మనసు తలపు 

తలపులు నిండి ఉన్నట్టు ప్రేమ ఈశ్వరా 

  

విరిసేను రవి కనులు 

కనులేలు  కమలములు  

కమలాలు పంచెను సౌందర్యం ఈశ్వరా 


రమ్ము ప్రియ సుందర

సుందర మదినివ్వర 

మదినిచ్చి ప్రేమ పంట చూడర ఈశ్వరా 

 

మోసకారి ప్రేమ

ప్రేమ విధి ప్రాప్తమ

వధిబలీయమైనది తప్పదే.ఈశ్వరా


వచ్చి వెళ్ళే ప్రేమ

ప్రేమ చుట్టు కాలమ

కాలము కన్నెర్ర చేయించే ఈశ్వరా


మరవాలను కన్నను

ఉన్న ప్రేమ ఉన్నను

ప్రేమ జీవిగా మరువలేనులె ఈశ్వరా


నీకు ప్రేమ లెందుకు

 ప్రేమ బతుకు ఎందుకు

ఎందుకో నీలో ఉండు ప్రేమ ఈశ్వరా


వెన్నె లాంటి మనసుకు     

మనసు పంచు మమతకు 

మమతల ప్రేమ ఇచ్చి పుచ్చే ఈశ్వరా 


సుందరా0గుని చూపు 

చూపు మేలు కొలుపు 

మేలుకొలుపు తెలుపు సూర్య తేజ ఈశ్వరా   


--(())--


సమ్మోహనాలు (1001 -1010 ) 

కొత్తసంవత్సరం .. ఇక హాయి 

రచయత: మాలాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

జరిగినది వెతుకుటయు 

వెతుకుట మరవవలయు 

మరచి జరిగేదియే మంచిదే ఈశ్వరా  

నీతి నిజాయతిగా 

నిజాయితి బతుకుగా  

బతుకు సంతృప్తి కే ఆయుధం ఈశ్వరా 

కాల మాయ ఉన్నా 

ఉన్నబతుకు మిన్నా 

మిన్నా విశ్వాస జీవితమే ఈశ్వరా 

కొత్త ఆశయాలకు

ఆశయ సాధనలకు

సాధన నిత్యమూ ఉంటె సుఖము ఈశ్వరా 

ఆశా నిరాశలే 

నిరాశ పాశాలే 

పాశాలలో నిజాలు  బతికించు ఈశ్వరా 

విశ్వాసముతొ కదులు 

కదులితే విజయాలు 

విజయాలతొ మనసు తేలిక పడు ఈశ్వరా  

సమయమె నీకు రక్ష 

రక్షతొ  ఉండు దీక్ష

దీక్ష తో లోకానికే రక్ష ఈశ్వరా 

ఎదిగిన కొద్ది ఒదిగి 

ఒదిగి కాలము మరిగి 

మరిగి మనిషిగాను గుర్తింపే ఈశ్వరా 

దివ్య వెలుగుగ నువ్వు 

నువ్వు హృదయపు నవ్వు 

నవ్వు చూపి బతుకే జీవితం ఈశ్వరా 

జీవిత సత్యాన్నీ 

సత్యాన్ని ధర్మాన్ని 

ధర్మమే నూతన హవిషత్తుగ  ఈశ్వరా 

--(())--



సమ్మోహనాలు ...(చంద్ర కళ ) 1011----1020 
రచయిత మెల్లఁప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

స్వరూప నిష్ట దృష్టి
దృష్టి వెన్నెల సృష్టి
సృష్టి తో సంతృప్తి రేయిగా ఈశ్వరా 

పున్నమి వెన్నెలలో
వెన్నెల రాత్రులలో
రాత్రి లో సుఖపు నిద్ర పంచేను ఈశ్వరా 

చంద్రుని కళలు అన్ని
అన్ని సుఖ కలలన్ని
కలలుగన్నవారి కలలు తీర్చు ఈశ్వరా 

తారల నడుమయున్న
నడుమన చంద్రు డున్న 
చంద్రుడు వెలుగుచున్నాడుగదా ఈశ్వరా 

సిరులను పంచు రాత్రి
రాత్రి సుఖ శుభ రాత్రి 
రాత్రి వెన్నెల మనసుకు శాంతియె ఈశ్వరా

సకలము సమ్మ తమ్ము 
సమ్మతమ్ము మయమ్ము 
మయమ్ము చంద్రకళలు రూపమే ఈశ్వరా 
  
కాలము తెల్పు చుండు 
తెల్పి ధరణిని నిండు 
ధరణి సంతృప్తి మనకు శుభ ములు ఈశ్వరా 

చంద్ర గ్రహణమ్మే  
గహణము సహజమ్మే 
సహజ కష్టాలు వచ్చి తొలగేను ఈశ్వరా 
 
విరహ బాధను పెంచు
పెంచి సహించ మంచు
మంచు జాబిలి వెన్నెల జల్లులు ఈశ్వరా 

నీలాల నింగిలో
నింగిన రాత్రు లలో 
రాత్రి కదలికలు మత్తును పెంచు ఈశ్వరా 

--(())--

సమ్మోహనాలు ...(సావిత్రీపూలే) 1021----1030 
రచయిత మెల్లఁప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఆడ పిల్లలకు బడి
బడి అదే అమ్మ ఒడి
ఒడికి తెచ్చె బిడ్డలను చదువుకు ఈశ్వరా 
   
స్త్రీ లు విశ్వ వ్యాప్తము
వ్యాప్తముతో హృదయము
హృదయము ఎప్పడూ నవనీతము ఈశ్వరా

స్త్రీలు యందున్న రుచి
రుచితో పాటుగ శుచి
శుచితో ప్రేమనే పంచేను ఈశ్వరా

స్త్రీలలొ పరాక్రమము
పరాక్రమము ధైర్యము
ధైర్య సాహస తేజో వంతులే ఈశ్వరా

బడుగు వర్గం చదువు
చదువు స్త్రీ లకు గురువు
గురువుగా సావిత్రీపూలేను ఈశ్వరా

సకాలమూ పలుకులు 
పలుకులొ దయ కృపలు
కృపతో సాధించలేనిదేది ఈశ్వరా 
  
వినయపు వాదములే  
వాదము వేదములే
వేదము లే  తెలుపెను జీవితం ఈశ్వరా 
   
సమర్ధ మైన పలుకు  
పలుకు హృదయము చిలుకు 
చిలకు శాంతి నిచ్చు ఆదుకోను ఈశ్వరా 
  
చిరునగువే మనసుకు  
మనసే మెళకువకు కు 
మెళకువ బతుకులు సార్ధకముయే ఈశ్వరా

ఎదిరించె సమాజము 
సమాజమున  దౌర్జ్న్య ము 
దౌర్జ్న్య ము వ్యతిరేకించేను లె ఈశ్వరా  

ఆమె చేయు సేవలు
సేవలు చేయు  మేలు
"మేలైన పనులను వదలలేదును ఈశ్వరా 
   
--(())--

సమ్మోహనాలు ...(థెరిసా ) 1031----1040 
రచయిత మెల్లఁప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

విశ్వ మాత అయినది  
అయినా   దాతైనది 
దాతగా ఆరోగ్యా న్కె మాత ఈశ్వరా    

సేవే లక్ష్యంగా 
లక్ష్యం ధైర్యంగా 
ధైర్యంతొ క్షయ రోగల సేవ ఈశ్వరా 

అనాధుల ఆదరణ 
ఆదరణ ఆచరణ
ఆచరణ ధేయంగా బతికే ఈశ్వరా 

మానవ సేవ కొఱకు 
కొఱకు దేశము కొఱకు 
కొఱకు బతుకును ధారపోసేను ఈశ్వరా 

మాతృ భూమిని వదలి  
వదలి రక్షగ కదలి 
కదలి మనదేశానికి సేవలు ఈశ్వరా 
 
వైద్య వృత్తితొ  సేవ 
సేవ ధర్మపు సేవ 
సేవయే పేదలకాశ్రమం ఈశ్వరా 

తొలగించే భయము 
భయము అనారోగ్యము
అనారోగ్యము ఆరోగ్యముగా ఈశ్వరా 
  
ఆరోగ్యా న్కి మాత   
మాత పేదల దాత 
దాతగా రోగనివారినిగా ఈశ్వరా 

భారత రత్నమ్ముగ   
రత్నం వలె స్త్రీగ 
స్త్రీ యే సేవల థెరీసాగా  ఈశ్వరా 

గుండె గుండెను తట్టు  
తట్టి శుద్ది చె పట్టు  
పట్టుగా మానవహృదయానా ఈశ్వరా 

 --(())--

సమ్మోహనాలు (గులాబీ) ... 1041----1050 
రచయిత మెల్లఁప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

గులాబీ రేకులతొ 
రేకుల పరిమళంతొ 
పరిమళాలు ఆస్వాదించేను ఈశ్వరా 
  
గులాబీ పువ్వులే 
పువ్వుల అందాలే 
అందాలు ఆకర్షించు అందరు ఈశ్వరా 
  
యువతి కురులనుఁ దువ్వు 
దువ్వి జడలో పువ్వు   
పువ్వు  గులాబీతోనె  అందము ఈశ్వరా 

ఇష్టమైన పువ్వులు 
పువ్వులు గులాబీలు 
గులాబీల మాలలు దేవునికి ఈశ్వరా 
 
ఔషద గుణము ఉండు 
గుణము  ప్రేమ ఉండు
ప్రేమ గులాబీ చుటై ఉండు ఈశ్వరా 
  
ప్రేమికుల గులాబీ 
గులాబీ జిలేబీ 
జిలేబి రుచి ఉండు పువ్వు రెమ్మలు ఈశ్వరా
 
పుట్టుక చూడు పువ్వు 
పువ్వు చూడు నవ్వు 
నవ్వు చూడు అందమకరందం ఈశ్వరా

పువ్వు తెల్లా రంగు 
రంగు పచ్ఛా రంగు  '
రంగు ఎర్రా  రంగు   
రంగు నీలీ  రంగు    
రంగు నల్ల రంగు 
రంగు గులాబీలు ప్రకృతి సృష్టి ఈశ్వరా 
  
ప్రేమకు ఇది గుర్తు 
గుర్తు చెలిమికి గుర్తు 
గుర్తు కలిమికి గుర్తు 
గుర్తు బలిమికి గుర్తు 
గుర్తుగా పుస్తుకం గులాబీ ఈశ్వరా 
 
పువ్వుకై  ఆశ పడి 
ఆశపడి మీదపడి 
మీదపడి తే ముళ్ళు గుచ్చేను ఈశ్వరా

--(()౦--

సమ్మోహనాలు () ... 1051----1060 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

దేశ మెలా ఉన్నా
ఉన్న నేను యున్నా
యున్న ఆధారమే జీవనం ఈశ్వరా

బతుక మార్గ మెంచా
మార్గము ఓర్పుంచా
ఓర్పుతో జీవసాగరంమ్మే ఈశ్వరా

కాలు లేని వాన్నీ
వాన్నీ ధర్మాన్నీ
ధర్మాన్ని బతికించు మార్గాన్ని ఈశ్వరా
 
బొమ్మ బొరుసు తప్పదు 
తప్ప దన్న ఆగదు
ఆగదు ఏనిముషము  నీకొరకు ఈశ్వరా 
 
మనిషిలొ అజ్ఞానం 
అజ్ఞాన మకారం  
మకార అహంకారం తొ సాగు ఈశ్వరా 
 
జిజ్ఞాసు ఉండాలి 
ఉండి ఆర్తవ్వాలి 
ఆర్తి అర్దార్ది జ్ఞాని కలసె ఈశ్వరా

స్వార్ధ పిశాచానికి
పిశాచం బుద్దులకి   
బుద్ధులు సక్రమం ఆధరణలు ఈశ్వరా 
 
విశ్వాసమే బలము 
బలము బతుకు తనము 
బతుకు వెలుగులు పంచుట మనిషియె ఈశ్వరా 
 
సంకల్పమే బలము
బలము తో జీవనము 
జీవన జవసత్వాలే కళలు ఈశ్వరా 

శోధనలు సాధనలు 
సాధన ఆయుధాలు 
ఆయుధాలు న్యాయం ధర్మం ఈశ్వరా

భారమవ్వక సాగు 
సాగే బండి లాగు 
లాగేది నిత్య బతుకు బండిని ఈశ్వరా 
   --(())--
సమ్మోహనాలు () ... 1061----1070 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

నిష్క లంక ప్రేమ
ప్రేమ బతుకుకు రమ
రమ నిరంతరంగా హృదయంలొ మోహనా

నష్క లంక చలిమియె
చెలిమి కలల పంటయె
పంటగా ప్రేమను పంచేనులె మోహనా

నిస్వార్ధ ప్రేమయే
ప్రేమ తో భక్తియే
భక్తియే బతుకుకు మార్గముయే మోహనా

రంగులే మారెనే
మారిన మోఖమునే
మోఖము లో మార్పులు ప్రేమగా మోహనా

సర్వ సుఖ తరంగము
తరంగ ముఖ విభవము
విభవ విశ్వాస పరీక్షకు లే మోహనా

పూర్ణవిశ్వాసముగా
విశ్వసనీయతగా
యతిగా మదిలొ మహాశక్తిగా మోహనా

మన మధ్య గుర్తింపు
గుర్తింపు వినసొంపు 
వినసొంపు కనసొంపు అనసొంపు మోహనా 
  
సత్యపు హృదయముంది 
హృదయ అర్పణమైంది 
ఆర్పనే జీవిత మధుర మైంది మోహనా 

సదా లోచన మనకు, 
మనకు హృదయతపనకు
తపనలే సంతృప్తి నిస్తుంది మోహనా   

దురాలోచన నాకు 
నాకు దు:ఖము అనకు 
అనకు నీమీద ప్రేమ వదలను  మోహనా 

--(())--

సమ్మోహనాలు 1071....1080

భగవంతుని లీలలు
లీల మనసు గోలలు
గోలను అరి కట్టుట తెల్పుమూ ఈశ్వరా

ఉదయించు కిరణములు
కిరణములు మెలుకువలు
మెలుకవలు బతుకునకు మార్గాలు ఈశ్వరా

మనిషి కను నేత్రాలు
నేత్రాలు పుష్పాలు
పుష్పాలవలె వాడి వికసించు ఈశ్వరా

మనిషి నిగ్రహశక్తి 
శక్తి మనిషికి యుక్తి
యుక్తితో కుయుక్తినే జయించు ఈశ్వరా

మనిషికి తపనఉంటె
ఉంటేను తోడుంటె
తోడుతో చల్లార్చుకొను శక్తి ఈశ్వరా

విశ్వమ్ము గ్రహించు
గ్రహించి నిగ్రహించు
నిగ్రహించి జీవించు కళలులె ఈశ్వరా

ప్రేమ ఉన్న చోటే
చోటు ఉండు లోటే
లోటు దైవసానిధ్యము తెల్పె ఈశ్వరా

వేషము వేసి ఉన్న
ఉన్న నటనలు సున్న
నటన తరుణము బట్టి మారేను ఈశ్వరా

మనసు మనసును చూడు
చూడు వయసును చూడు
చూడు కాలమాయగెలుపులనే ఈశ్వరా

దీపము వెలుగు నిచ్చు
నిచ్చి మనసును ఇచ్చు
ఇచ్చి కోరికలకు సహకరించు ఈశ్వరా

నేటి ఆటవెలది పద్యాలు 

రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


స్వార్ధ రహితమైన వాత్సల్య మవనిలో

కన్న తల్లి యందె కాంచ గలము

అవనికన్న గొప్ప దాయమ్మ హృదయము 

తెల్పు చున్న వాడ్ని మల్లాప్రగడ నీతి   ..... .... 1


ఉదయ భాను డొచ్చె ఉజ్వల కాంతి గా , 

సర్వ హృదయ మందు సీమ యం దె, 

చంద్రు డొచ్చు రాత్రి చల్లగా మెల్లగా, 

హాయి గొలుపు  శాంతి హృదయ మందు  ..... ... 2


పువ్వు పరిమళించు ప్రకృతిగా నిత్యమూ 

సత్య మొవ్వు జగతి సవ్య గుండు 

నదియు జాలు వారి నిర్ణయ విధిచేరు 

దాహతాపమంత తీర్చి జరుగు     ..... ........... 3


మేఘ మిచ్చు వర్ష మంతయు పుడమిలో 

చేరి సంప దలుగ మార్చు చుండు 

మనిషి ఆశ పెర్గి మాయను కమ్మియు 

జీవితమ్ము అంత సార్ధ కమ్ము  ....... ........ 4 


తరువుకు  హృదయముయు తపనతో ఉండుట   

కొమ్మ ఆకు పూలు కాయ  రెమ్మ  

జీవుల కుపయోగ సకలమ్ము  గాలిని   

పంచి తృప్తి పరచు పరమ బుద్ది   ... ....... 5 


వయసు ఉడుకుతోన వలపునే చెప్పక  

వీలు దొరక లేక వింత కోరు  

ఉండి  బతుకులోన  సరియగు బుద్ధిని  

వినయపు కళలన్ని పరచ యముగ   ....... ...6   


తనువుకు తపనంత దరినేలు చుండెను  

వయసు కులుకు లన్ని సలప రింత  

జన్మ వళ్ళ కలుగు సహజమ్ము కోరిక 

కళలు అన్ని  దరియు దొర్క పుచ్చు  ..... ..... 7


మనకు నిత్య మున్న మౌనము తరుముతూ  

సకల శోభ లేలు చరితము తెలుపుట 

బుద్ధి కుశలత జత కలయుట సుఖమ్ము      

విశ్వ జనిత భావ భవితయు పెరుగుట    .... .... 8


--(())--