8, డిసెంబర్ 2020, మంగళవారం

అంత్యప్రాసము అలంకారము



ప్రాంజలి ప్రభ ....అంత్యప్రాసము అలంకారము (6) 

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  


ప్రాంజలి ప్రభ .... ముక్తపదగ్రస్తము  అలంకారం (5)

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

ఒక పాదం చివర వదిలిన పదాన్ని మరలా రెండవ పాదం మొదటి పాదంగాను వచ్చు 


సుదతీ నూతన మదనా

మదనా తరంగ పూర్ణమణిమయ సదనా

సదనా మయగజ రదనా

రదనాగేంద్రనిభకీర్తి రస నరసింహా


మాధవ చూడవె సొగసును

సొగసును కాదా మరియేమి చూడు వయసును

వయసును బుధ్ధితొ మనసును

మనసును మెచ్చే గణముంది ప్రేమించెదను


రాధా కలలను కనకే

కనకే ఎవరు ఎన్నీ చెప్పినను వినకే

వినకే మనసు భాధను పెట్టేట్లు అనకే

అనకే కాలాన్ని నిన్నూ ప్రేమించెదను


తేన లాంటి తీపి పంచి

పంచి మనసు సొగసు వయసుతో ప్రేమ పంచి

పంచి నటనతో పంచి

పంచి నదానికి తృప్తి వ్యక్త పరిచిందే


నిద్రలో - సృష్టి బీజంబీజం 

రూపంలొ స్త్రీలో పెరిగే తేజం

తేజ జాగ్రత్తు విశ్వంగా శ్రీ రాజం

శ్రీ రాజం కరుణా కటాక్షమే వ్యాప్తి


ఎల్లలోకాలు నల్లా నల్వని కృష్ణుడు  

కృష్ణుడు చల్వని వాడె గోపాల కృష్ణుడు

కృష్ణుడు మెల్లగా ఉండు గోపికా కృష్ణుడు

కృష్ణుడే జగమంత తానై యున్నవాడు


==))((==

 

ప్రాంజలి ప్రభ .... లాటానుప్రాసాలంకారం ..(4)

 రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

శబ్దభేదం అర్థభేదం లేకుండా వాడే పదాలు 


కమలాక్షునినర్చించు కరములు కరములు 

శేషసాయిని జూచు చూడ్కులు చూడ్కులు  

మధువైరిఁదలివిన మనము మనము


నిత్య పోషణకు శక్తి తో మనసు మనసు 

హృదయ తపనలు భర్త కొరకు వెతుకు వెతుకు

భార్య ఆకాంక్ష తీర్చియు బతుకు బతుకు 


లోకము తీరు ఎవ్వరికీ తెలియదు తెలియదు 

తెలిసినదాన్ని గొప్పగా చెప్పి బతుకు బతుకు 

ఉన్నదానితో తృప్తి పడితే సంతృప్తి సంతృప్తి 


ఎవరేమన్నా తెచ్చుకోకు కోపము కోపము 

తప్పుచేసిన వానికి తగులు శాపము శాపము 

అందుకే అందించు ఓర్పు కాలము కాలము 

   

పక్షులు నిత్యము గాలిలో ఎగురు ఎగురు 

మనిషి ఆహారము తిని పనిలో మునుగు మునుగు 

తరువులు సర్వము అర్పించి బతుకు 


మనిషి కాలమాయకు చిక్కి చిక్కి 

కలి ప్రోత్సాహముతో బత్కి బత్కి 

అందుకే ప్రతిఒక్కరికి కావాలి శక్తి శక్తి  

దేవుని ప్రార్ధించుతూ భక్తి భక్తి 

--(())--


ప్రాంజలి ప్రభ ... ఛేకాను ప్రాస అలంకారము (3)

రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


రెండుగాని అంతకన్నా ఎక్కువగాని ఉన్న హల్లుల జంటలు 

 

సుధా హరిన్ .. మహా గిరిన్ 

రమా గురున్ .. ధనా గురున్ 

సకాలమున్  ..  సమానమున్ 

సుఖాలయమ్ .. విషాదమున్ 


మనో మయా .. మధూ మజా

కధా  కళా....  గరం కదం

గుణం గళం.... గణం తపం

కులం  బలం ... కలం ధనం


కులుక్ కురుల్... మదన్ మదిన్

కధల్ వెతల్... కళల్ ఋతుల్

మహేస్..సురేష్ వినయ్ అభయ్

విశాల్ వినోద్.......సుధా ... సుమన్


కృపా కృపల్ ..  శ్రుతీ  శృతీన్ 

క్రియా క్రియల్   ..కధా కదల్  

కసీ వలన్ ... మదీ చెడున్ 

కళే కవుల్ .... కళే నటన్ 

కలే కధల్ ... కలే లతల్ 

విశేషమున్ ... వివాదమున్ 


--(())--


ప్రాంజలి ప్రభ ...   నేటి అలంకారం ... వృత్యను ప్రాస (2) 

ఒకే అనే అక్షరం అనేకసార్లు వచ్చు వృత్యను ప్రాస 

రచయిత : మల్లప్రాదా శ్రీదేవి రామకృష్ణ 


శివ శంకర ... శంకర కృప .. కృప శంభో ... 

శంభో మహేశా ... మహేశా భవేశా ... భవేశా గిరీశా .. 

గిరీశా నటేశా,....  నటేశా లోకేశా ... లోకేశా ప్రేమేశా ... 

ప్రేమేశా మోక్షేశా ... మోక్షేశా .శక్తేశా ... శక్తేశా  ఆదిపరాశక్తేశా        


సమద విపక్ష శిక్షణ విచక్షణ దక్షిణ 

దొరసూక్షణ ప్రమద సుదీర్ని దీక్ష     (క్ష ) 


చుక్కల్లో చక్కని చుక్క చూడ చక్కగా 

చెక్కిన శిల్పముపై చుక్క బొట్టు అందం 

చక్కని చుక్కల మక్కువ పెంచే      (క్క )


అన్న నీవేమన్న అన్న మాట, కన్న ప్రేమ, 

ఉన్న స్థితి, మిన్నుమన్ను సాక్షిగా 

ఎన్నటికీ మన్నన లేకపోయినా వదలనన్న  (న్న )


వచ్చి చచ్చు వాక్కుతో మచ్చ తెచ్చి 

ఇచ్ఛమైన మచ్చికతో ముచ్చటించి 

మచ్చ లేని చంద్రుడంటే అచ్చెరువు       (చ్చ )


అల్లము బెల్లము కళ్లెంలో వేసి 

గుల్ల గుల్ల చేసి ఉల్లము జల్లనిపించి 

కాళ్ళ బొల్లి లొల్లి పల్కుతో ముళ్ళు గుచ్చే    (ల్ల )


కొత్తకోక చెత్త అయిందా అత్తా 

మత్తకోకిల కొత్త పాట, ముత్తైదువు ఆట 

వత్తి పత్తి లా చిత్తు చిత్తైనాదా అత్తా            (త్త )


అప్పు తాకు, తప్పు చేయకు, 

చిప్పకూడు తినకు,చెప్పుడు మాటలు వినకు, 

గొప్పలకు పోకు,  ఒప్పు తప్పని అనకు     (ప్ప )


అయ్యా కొయ్య తేవయ్యా, యవ్వారం 

కయ్యమయ్యే, చుడయ్యా, చెయ్యవయ్యా 

వియ్యంకులు అత్యాశయ్యా ఏమయ్యా      (య్య )   

      

--(())--


ఉపమేయోపమాలంకారము (1 )   


అర్ధము ధర్మము వలెను 

ధర్మము అర్ధము వలెను 

నీయందు లక్ష్మీ సమన్వితము 


పల్కులు వేదాలు అయ్యెను 

వేదాలు పల్కులు అయ్యెను 

నీయందు వాక్కు సమన్వితము 


నిజాలు తత్వాలు అయ్యెను 

తత్వాలు నిజాలు అయ్యెను 

నీయందు తత్వ సమన్వితము 


భాగ్యము సోఖ్యము అయ్యెను 

సౌఖ్యము భాగ్యము అయ్యెను 

నీయందు సౌఖ్య సమన్వితము 


వెల్గులు చీకట్లు అయ్యెను  

చీకట్లు వెల్గులు అయ్యెను

నీయందు వెల్గు సమన్వితము 


కాలమ్ము స్నేహమ్ము అయ్యెను 

స్నేహమ్ము  కాలమ్ము అయ్యెను 

నీయందు స్నేహ సమన్వితము

  

స్త్రీల శక్తి  పుర్ష శక్తి గా అయ్యెను 

పుర్ష శక్తి స్త్రీల శక్తి  గా అయ్యెను

స్త్రీపురుషుల శక్తి సమన్వితము 


నీరు వేడికి ఆవిరి అయ్యెను 

ఆవిరి మేఘపు వర్షము అయ్యెను 

ఆవిరి వర్షము సమన్వితము

 

చక్రముకు ఇరుసు ఆధార మయ్యెను 

ఇరుసుకు చక్రము ఆధార మయ్యెను 

చక్ర బ్రమణ  సమన్వితము


మంచి చెడుగా ఉండెను 

చెడు మంచిగా ఉండెను 

మంచి చెడుల సమన్వితము

 

--(())--




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి