నా చరిత్ర తేటగీతి పద్యాలు
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నేను ఓంనమ: శివాయ నీడలగుట
దిద్ది అప్పుడారంభము ధేయ చదువు
తెలుగు విధ్యల నడకతో దైవ వాక్కు
తల్లి తండ్రుల దీవెన బతుకు నాది .......
తలుపు తెరిచి ఉంచు సమంత కిరణములు
జేరి సుబ్ర పరిచి కాంతి పెంచు దీప
మనిషి రోజు కొత్త పలుకు మన పరుగులు
మనసు మార్చుటే కోరిక మతియు గతియు ....
బాల్యం
స్వచ్ఛమైన గాలి వాతావరణముక
లిగియు చేత నీడ లందు ఊగి
చెరువు లోకి దూకి స్నానమాడి పెరిగి
చిన్న నాటి గుర్తు రామకృష్ణ
పుస్తకాలు ఉన్న కాకిసంచి బరువు
మోస్తు పాద రక్షా లేక నడిచి
తలకు నూనె లేక చింపిరిచుట్టుతో
స్కూలుకెళ్ళి మంచి మార్కు లొచ్చె
ఖాళి సమయ మందు గోలీలు, బొంగరం
బంతి ఆట, ఏడు పెంకు లాట
దారమందు మాంజ పూసియు ఎగరేసె
రంగు కాగితమ్ము గాలి పఠము
సెలవు లుంటె చాలు సీమ తుమ్మ చెట్ల
వద్ద బంక తెచ్చి పుస్త మతికి
ఈతచెట్లవద్ద ఈత కాయలుకోసి
ఆడు కుంటు పాడు కుంటు ఉండె
అమ్మ దీపముంచియు పూజ చేసి నాన్న
తెచ్చిన మతాబు తార జువ్వ లను, చిచ్చు
బుడ్లు, నెల బాంబు విష్ణుభూ చక్రము
తెచ్చి పోటి పడియు కాల్చు చుండె
చిన్న నాటి విషయములు వ్రాయ దాల్చి
పోస్టు తెచ్చేటి మనిషి కో సమ్ము ఎదురు
చూపు కళ్ళు కాయలు కాసి పక్క ఇంట్లొ
ఉత్త రమ్మను ఇవ్వగా నీరసమ్ము
చిన్న నాటి విషయములు వ్రాయ దాల్చి
పోస్టు తెచ్చేటి మనిషి కో సమ్ము ఎదురు
చూపు కళ్ళు కాయలు కాసి పక్క ఇంట్లొ
ఉత్త రమ్మను ఇవ్వగా నీరసమ్ము
తల్లి తండ్రులశ్రమతో చదువు సాగె
తల్లి ఇంటియందు సేమ్యా చేసె ఉంచి
తండ్రి అమ్మి డబ్బులు తెచ్చె జీవితమ్ము
తండ్రి ఫెయిర్ డ్రైవెర్ గ చేరి నారు
తాత గారినుండి ఆంజనేయ పూజ విధము
నేర్చి అంజనం వేయుట వృత్తి అయ్యె
జాతక చక్రములు వేయటం నేర్చుకొని
మాధవ రావు వద్ద ఆయుర్వేదం నేర్చుకొనె
బాల్య వివాహముచేసె మా అక్క గార్కి
నేను బతుకులబండిన ఐదు చదువు
ఇల్లు మారిపూరిళ్లుకొని అందు చేరె
హాజరు కానందున ఐదు మరలా చదివె
ఆరు నుండి 10 వరకు చదువు ఆగలేదు
స్కూల్ డ్రస్సుకు నాన్నచోక్కా సైజు చేశా
అమ్మ దూపప్పోడి వామో వాటర్ చేసెదీను
కొకల్ప ఆవుపాలమందు శాతవారి చేసేది
రోజు ఏమేమి జరుగునో అంటు చదువు
సాగె గణితము యందును శ్రద్ధ పెరిగి
స్కూలు విద్యను నేర్పేటి గారువు గాను
బతుకు తొమ్మిది వత్సర ములుగ సాగె ...
దిట్టకవి వారితో పెళ్లి బంధ మాయె
కృష్ణ గుంటూరు ఏకము అయ్యె రోజు
వచ్చె మల్లాప్రగడ వారి బంధ మయ్యె
తండ్రి మాటను బట్టియు పెళ్లి జరిగె
కాపు ర మ్ము కొచ్చి భాధ్యత స్వీకరించె
చదువు కున్నట్టి ఇల్లాలు అవుట వళ్ళ
మూడు పువ్వులు ఆరుకా యల్లు లాగ
సుఖము సంతసమ్ముతో జీవితమ్ము
నెల కొల్పె హనుమాన్ విధ్యా మంది ర్గాను
సాటి అధ్యాప కులకృషి తోను వృద్ధి
పొంది ఎందరో విద్యార్థులకు సువిద్య
సలిపి కష్టపు అనుభవ మంత తెలిపు
మారి పోకయు సంసారి గాను సంబ
రమ్ము ముగ్గురు పుత్రికలు కలిగి ఉండె
వారి విద్యావృద్ధి కల్పించి ధైర్య మిచ్చె
సంబరమ్మున జీతము సాగి పోయె
భార తీయల కృపలతో లెక్క లేసి
దినము జన్మసంస్కారము తోడు నీడ
పవన పుత్రుని అండతో విధ్య నేర్పి
పోటి విద్య ద్వారాప్రభు త్వమ్ము తెలిపె
జన్మ భూమిణి దాటియు రమ్ము రమ్ము
అనియు ఉడ్జ్యోగమిచ్చియు బతుకు నిలిపె
టైపు చేయుట పనిగా తెలుగు సంక్షె
మమ్ము నందుఉద్యోగిగా చేరి యున్న
చిన్న నాటిస్నేహితుడుగా శ్రీ ధరుండు
కలసి చదువు ఆట మాట కలియు
లెక్క లప్రావిణ్యమ్మున దిట్ట సహక
రించె మానవాభ్యుదయ అక్కి రాజు
అలుపు ఎరుగనట్టి అజాత శత్రువుండు
కళల ను తండ్రి సాహిత్యం అభ్యసించి
పరుల సేవాపరుడు విద్య వ్యాపి కర్త
సంఘ సంసారపోషణ అక్కి రాజు
నిర్వి రామ కృషిగ తెలుగన్వేషన కర్త
శ్రీధరుండు సత్య బోధ కుండు
మనసు వెన్న పూస మాటలు మాంత్రికా
మాలొ ఒకడు వినయ అక్కి రాజు
కళ్ళ కపట మెరుగనీ వినమ్ర తవినయ
భావ కలిమి లేమి లేని చెలిమి కల్గి
కపట బుద్ధి లేని ధర్మతత్పర దయ
కలిగి సత్వరమ్ము ఆదు కున్న కృష్ణ
నిత్య సిద్ధి కలిగి తన్మాయ కమ్మిన
మనసు వెన్న పూస మారి కరిగె
రామకృష్ణ జీవితాన శ్రీదేవి క
లయిక సంత సమ్ము వాసికెక్కె
జన్య కార ణంబు సంతసవెలుగులు
పుత్రి కలకు జన్మ కార కుండు
జన్మ సార్ధకమ్ము విద్యలు నేర్పించి
ఒళ్ళు దాచ నట్టి ఓర్మి జూపె
నీవు వ్రాసినదానికి ఆటవెలది పధ్య భావము
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి