ఓం శ్రీ రామ్ ... శ్రీమాత్రేనమ: (ఇది నా ఆరాధ్య మాత లీల )
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
శ్రీలలితా అష్టోత్తర శతనామావళిని అమృత ఘడియల్లో పద్య రూపములో వ్రాయుట జరిగింది
తప్పులుంటే తెలుపగలరు
రజతాచల శృంగాగ్ర మధ్య స్థాయై
వినయాచల విశ్వాస మధ్య స్ధాయై
అరుణాచల ఏకాగ్ర మధ్య స్థాయై
కరుణాలయ మోక్షాగ్ర మధ్యస్థాయై ..... 1
హిమాచల మహావంశ పావనాయై
లతాలయ సహాయమ్ము దీవనాయై
సుఖాలయ పోషణాయ ధర్మ మాయై
సుధాలయ తత్వమంత తృప్తి ఆయై .... 2
శంకరార్ధంగ సౌందర్య శరీరాయై
పోషణార్ధంగ సందర్భ భావమాయై
తీవ్రతాత్పర్య సధ్భోద లక్ష్య మాయై
తన్మయానంద తత్వార్ధ శక్తి మాయై .... ... 3
లసన్మరకత స్వచ్ఛ విగ్రహాయై
సమస్మరణత నిత్య నిగ్రహాయై
జపత్వ కరుణ విద్య సంబ్రమాయై
తపశ్వి తరుణ మంత తృప్తి ఆయై .... ... 4
మహాతిశయ సౌందర్య లావణ్యాయై
మహా త్రిపుర కారుణ్య తత్వమ్మాయై
మహా చరిత సౌభాగ్య భాగ్యమ్మాయై
మహా మహిళ సామర్ధ్య మోహమ్మాయై ... ... 5
శశాంక శేఖర ప్రాణ వల్లభాయై
విభూతి ధారణ ప్రీతి వల్లభాయై
కపాళ హారపు ప్రాప్తి వల్లభాయై
త్రిశూల ధారిగ శ్రోత వల్లభాయై .... ... 6
సదాపంచదశాత్మైక్య స్వరూ పాయై
సదా ప్రేమ భరాత్మైక్యస్వరూపాయై
సదా ధర్మ సుధాత్మైక్య స్వరూపాయై
సదా నిర్విలయాత్మైక్య స్వరూపాయై.... ... 7
వజ్ర మాణిక్య కటక కిరీటాయై
రత్న వైఢూర్య లతల కిరీటాయై
స్వర్ణ ముత్చాల మెఱుపు కిరీటాయై
కెంపు లాకర్ష లలిత కిరీటాయై ... .... 8
కస్తూరి తిలకోల్లాసి నిటలాయై
సంపెంగ లతలోల్లాసి నిటలాయై
గంధాల పవనోల్లాసి నిటలాయై
మందార మదనోచ్చాహనిటలాయై ... ... 9
భస్మరేఖా0కితలసన్మస్తకాయై
సవ్యభావాంకితలసన్మస్తకాయై
దివ్యసేవాంకితలసన్మస్తకాయై
భవ్య వేదాంమృతలసన్మస్తకాయై... ... 10
వికచాంభోరుహదళలోచనాయై
సమతాంతీరునదళలోచనాయై
వినయాంవీరునిదళలోచనాయై
సమయాంసూర్యునిదళలోచనాయై... ... 11
శరచ్చాంపేయపుష్పాభనాశికాయై
మదిచ్చేదాయదుర్భాషనాశికాయై
మదన్నోచ్చాయదుర్భుద్ధినాశికాయై
తపస్సోచ్చాయదుర్మార్గనాశికాయై .... ... 12
లసత్కా0చనతాటంకయుగళాయై
మనస్కా0చనవేదాంతయుగళాయై
గుణత్కా0చనధర్మార్ధ యుగళాయై
సమస్యాన్తరవిశ్వార్ధ యుగళాయై .... .... 13
మణిదర్పణ సంకాశ కపోలాయై
కనువిప్పుగ సద్భావ కపోలాయై
కనసొంపుగ విశ్వార్ధ కపోలాయై
మదిపాషణ విశ్వాస కాపాలాయై ... ... 14
తాంబులపూరితస్మేరవదనాయై
సాత్వికకూడితన్మేఘమదనాయై
ధార్మికపాలిటస్నేహమదనాయై
ఆత్మకుసేవితస్మేరవదనాయై ... ... 15
సుపక్వదాడిమీబీజరదనాయై
సమత్వపోషణాతీరురదనాయై
వినమ్రతిరుణాభీరురదనాయై
సమగ్రభారతీబీజరదనాయై .... .... 16
కంబుపూగసమచ్ఛాయకంధరాయై
విప్పపూగనమచ్ఛాయసుందరాయై
దుమ్మిపూగకళచ్చాయనందమాయై
బంతిపూగకలచ్ఛాయ కంధరాయై ... ...17
స్థూలముక్తాఫలోదార సుహారాయై
సూన్యముక్తావిదోదార సుహారాయై
శ్రావ్యముక్తాస్వరోదార సుహారాయై
నిత్యతృప్త మనోదార సుహారాయై ... ... 18
--(())--
గిరీశ బద్ధమాంగల్య మంగళాయై
మహేశ శుద్ధ సాఫల్య మంగళాయై
త్రినేత్ర బుద్ధి కారుణ్య మంగళాయై
కపాళ మోక్ష తాపేత్వా మంగళాయై ... ... 19
పద్మ పాశాంకుశ లసత్కరాబ్జాయై
స్వర్ణ ఆకర్ష మనసత్కరాబ్జాయై
బ్రహ్మ పాశాంకుశ కళసత్కరాబ్జాయై
ధర్మ పాశాంకుశ సమ సత్కరాబ్జాయై ... .. 20
పద్మ కైరవ మందార సుమాలి న్యే
విశ్వ రక్షక సింధూర సుమాలి న్యే
సర్వ మోక్షక సంతృప్తి సుమాలి న్యే
సిద్ధి సాక్షిగ సంక్రమ సుమాలి న్యే ... .. 21
సువర్ణకుంభయుగ్మాభసుకుచాయై
సమర్ధబంధ యుగ్మా కనక చాయై
చమత్కారాలయుగ్మా వినయచాయై
పోరాట ప్రేమ యుగ్మా మిరప చాయై ... ... 22
రమణీయ చతుర్భాహు సంయుక్తాయై
కమనీయ మహద్భాహు సంయుక్తా యై
జననీయ జగన్మాత సంయుక్తా యై
అనురాగ పరమాత్మ సంయుక్తా యై ... ... 23
కనకాంగదకేయూర భూషితాయై
సమరాంగద ధైర్యంగ బాధ్యతా యై
జపతాం మదినోత్త్సాహ పోషితా యై
వినయాం విధినోత్త్సాహ ధార్మికా యై ... ... 24
బృహత్సౌవర్ణ శృంగార మధ్యమా యై
హృదత్సౌవర్ణ సాహిత్య మధ్యమా యై
కృప త్సౌవర్ణ త్యాగాల మధ్యమా యై
శృతిత్సౌవర్ణ సర్వార్ధ మధ్యమా యై ... ... 25
బృహన్నితంబ విలసజ్జఘనా యై
బృహన్నితంబ మానస జ్జఘనా యై
బృహన్నితంబ వలపు జ్జఘనా యై
బృహన్నితంబ వయసు జ్జఘనా యై .... ... 26
సౌభాగ్యజాతశృంగారమధ్యమా యై
ధర్మార్ధసాక్షి విశ్వాస మధ్యమా యై
ఆరోగ్య నీతి సద్భావ మధ్యమా యై
సర్వార్ధ రక్ష సమ్మోహ మధ్యమా యై ... ... 27
దివ్య భూషణ సందోహరంజితాయై
విద్య పోషణ హృద్యమ్ము రంజితాయై
సవ్య రక్షణ సమ్మోహ రంజితాయై
నిత్య దీవెణ శాంతమ్ము రంజితాయై.... .... 28
పారిజాత గుణాధిక్య పదాబ్జాయై
ధర్మ మార్గ సమారాజ్య పదాబ్జాయై
దీక్ష దక్షతతో ప్రేమ పదాబ్జాయై
సర్వమంగళ మే సేవ పదాబ్జాయై .... ... 29
సుపద్మరాగసంకాశ చరణాయై
సమ్మతి పూజ్య సమ్మోహ చరణాయై
వినమ్రవాణి విశ్వాస చరణాయై
సమగ్ర ధర్మ తత్వాల చరణాయై .... .... 30
కామకోటి మహాపద్మ పీఠస్థాయై
రామనామ మహాశక్తి పీఠస్థాయై
ధర్మదాత మహావిద్య పీఠస్థాయై
వేదమాత మహిలక్ష్య పీఠస్థాయై .... .... 31
శ్రీ కంఠనేత్రకుముద చంద్రికాయై
శ్రీ విద్య ధాత్రి మనసు భద్రకాయై
శ్రీ మాతనేత్ర వినయ దీప్తికాయై
శ్రీ వాణి ముద్ర సమత లక్ష్యమాయై ... ... 32
సచామర రమావాణీ విరాజితాయై
సుధామయి సుధారాణీ విరాజితాయై
మనోమయి మహాజ్యోతీ విరాజితాయై
మనోహరి సహాయమ్మే విరాజితాయై ... ... 33
భక్తరక్షణ దాక్షిణ్య కటాక్షాయై
శీష్టరక్షణ కర్తవ్య కటాక్షాయై
నిష్ట శిక్షణ సౌలభ్య కటాక్షాయై
ఇష్ట పూజిథ కారుణ్య కటాక్షాయై ... ... 34
భూతేశాలింగనోద్ఖూతపులకాంగ్యై
సోమేశా లింగనోద్ఖూతపులకాంగ్యై
రామేశా లింగనోద్ఖూతపులకాంగ్యై
కామేశా లింగనోద్ఖూతపులకాంగ్యై ... ... 35
అనంగజనకాపాంగవీక్షణాయై
ప్రదోషసమతాపాంగవీక్షణాయై
గళంకళలకాపాంగవీక్షణాయై
విషంగజనకాపాంగవీక్షణాయై ... .... 36
--(())--
ఓం శ్రీ రామ్ ... శ్రీమాత్రేనమ: (ఇది నా ఆరాధ్య మాత లీల )
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
శ్రీలలితా అష్టోత్తర శతనామావళిని అమృత ఘడియల్లో పద్య రూపములో వ్రాయుట జరిగింది
తప్పులుంటే తెలుపగలరు
సహస్రసూర్యసంయుక్త ప్రకాశాయై
సమస్తపృద్వి సంయుక్తప్రకాశాయై
సమస్తహృద్యసంయుక్త ప్రకాశాయై
సమస్తదేవ సంయుక్తప్రకాశాయై .... ..... 55
రత్నచింతామణి గృహమధ్యస్తాయై
ప్రేమ విద్యామణి గృహమధ్యస్తాయై
ధైర్య నారీమణి గృహమధ్యస్తాయై
ధర్మభాష్యామణి గృహమధ్యస్తాయై ..... ...... 56
హానివృద్ధిగుణాధిక్యరహితాయై
స్నేహవృద్ధిపదాతిత్యరహితాయై
రోగవృద్ధి సమాధిక్య రహితాయై
ద్వేషబుద్ధిగుణాధిక్యరహితాయై ..... ..... 57
మహాపద్మాటవీమధ్యనివాసాయై
మహామానుష్యవీమధ్యనివాసాయై
మహాహృద్యమ్మువీమధ్యనివాసాయై
మహాబ్రహ్మాండవీమధ్యనివాసాయై ..... ..... 58
జాగ్రత్ స్వప్నసుషుప్తీనాంసాక్షిభూత్వై
స్వీకృత్ స్వప్నసుషుప్తీనాంసాక్షిభూత్వై
ఆకృత్ స్వప్నసుషుప్తీనాంసాక్షిభూత్వై
ప్రాకృత్ స్వప్నసుషుప్తీనాంసాక్షిభూత్వై .... ... 59
మహాపాపౌఘతాపానాం వినాసిన్యై
మహా పుణ్యానమోక్షాణామ్ నివాసిన్యై
మహాశక్తీనధైర్యాణాం నివాసిన్యై
మహావీధ్యాన ఆకార్శ్యామ్ నివాసిన్యై ... ... 60
దుష్టభీతిమహాభీతిభంజనాయై
పాపభీతిమహాలోభిభంజనాయై
కామభీతిమహాద్వేషిభంజనాయై
ధాత్రిభీతిమహారాత్రిభంజనాయై .... ... 61
సమస్తదేవదనుజప్రేరకాయై
సమస్తహృద్యదనుజప్రేరకాయై
సమస్తకాలానుగుణప్రేరకాయై
సమస్తరక్షమనుషప్రేరకాయై .... ... 62
సమస్త హృదయాంభోజ నిలయాయై
సమస్తమనసా భోజ నిలయాయై
సమస్త మమతాభోజ నిలయాయై
సమస్త కళలా భోజ నిలయాయై .... ..... 63
సమర్ధతమహాశక్తి మందిరాయై
వినాశకమహాయుక్తి మందిరాయై
ప్రభంజనమహాముక్తి మందిరాయై... .... 64
--(())--
సహస్రారసరోజాత వాసితాయై
వినమ్రా విషయోత్సాహవాసితాయై
సమర్దా సమరోత్సాహవాసితాయై
గళత్రారసరోజాత వాసితాయై ...... ....65
పునరావృత్తి రహిత పురస్థాయై
కరుణాశక్తి రహిత పురస్థాయై
తరుణాదిత్య సహిత పురస్థాయై
జపదాదిత్యరహిత పురస్థాయై .... ....66
వాణీ గాయిత్రీ సావిత్రీ సన్నుతాయై
రూపా రూపసీ రమ్యశ్రీ సన్నుతాయై
రాణీ దివ్యశ్రీ సౌందర్యా సన్నుతాయై
కాళీ కావ్యశ్రీ కారుణ్యా సన్నుతాయై .... ...67
రమా భూమిసుతారాధ్య పదాబ్జాయై
సదా సౌమ్యసుతారాధ్య పదాబ్జాయై
విశ్వ మాయసుతారాధ్య పదాబ్జాయై
సర్వ శక్తి విశాలాస్య పదాబ్జాయై ... ...68
లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై
విశ్వసమ్మోహిత శ్రీమచ్చరణాయై
సర్వధర్మార్ధత శ్రీమచ్చరణాయై
విశ్వా విశ్వాసితశ్రీమచ్చరణాయై .... ...69
సహస్రరతి సౌందర్య శరీరాయై
వినమ్రా మతి సౌందర్య శరీరాయై
చమత్కారిగ సౌందర్య శరీరాయై
వసంతా లతొసౌందర్య శరీరాయై ... ...70
భావనామాత్ర సంతుష్ట హృదయాయై
కామ్యకారుణ్య సంతుష్ట హృదయాయై
శ్రావ్య సౌందర్య సంతుష్ట హృదయాయై
శాంతి సౌభాగ్యసంతుష్ట హృదయాయై ... ...71
సత్యసంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయై
నిత్యసంతృప్తి విజ్ఞాన సిద్ధిదాయై
విధ్యవిశ్వాస విజ్ఞాన సిద్ధిదాయై
తత్వమోహమ్ము విజ్ఞాన సిద్ధిదాయై ... ...72
శ్రీలోచన కృతోల్లాస ఫలదాయై
శ్రీ రంజన కృతోల్లాస ఫలదాయై
శ్రీమాధురి కృతోల్లాస ఫలదాయై
శ్రీశక్తిగ కృతోల్లాస ఫలదాయై .... ..... 73
శ్రీ సుధాబ్ధి మణి ద్వీపమధ్యగాయై
శ్రీ రమాచరిత ద్వీపమధ్యగాయై
శ్రీ కళా వినయ ద్వీపమధ్యగాయై
శ్రీ సుధా మధిర ద్వీపమధ్యగాయై .... ... 74
దక్షా ధ్వర వినిర్భేదసాదనాయై
విశ్వాజనితసఖ్యోప సాదనాయై
సర్వావిదిత సర్వోప సాదనాయై
సమ్మోహత నిర్భేదసాదనాయై .... ..... 75
శ్రీనాధసోదరీభూతశోభితాయై
శ్రీవిశ్వసాధనాభూతశోభితాయై
శ్రీధర్మబోధనాభూతశోభితాయై
శ్రీశక్తి మోహనాభూతశోభితాయై .... .... 76
చంద్రశేఖరభక్తార్తిభంజనాయై
శాంతిధార్మికభక్తార్తిభంజనాయై
విశ్వమోహిణిభక్తార్తిభంజనాయై
కార్యశేఖర భక్తార్తిభంజనాయై .... .... 77
సర్వోపాధివినిర్ముక్తచైతన్యాయై
విశ్వాసాలసమర్ధస్యచైతన్యాయై
సత్యానందతపస్యక్తచైతన్యాయై
సమోహాదివినిర్ముక్తచైతన్యాయై ... ... 78
నామపారాయణాభీష్టఫలదాయై
ప్రేమసామాన్యతాభీష్టఫలదాయై
కామసేవాపరాభీష్టఫలదాయై
సమ్మతమ్మేమనోభీష్టఫలదాయై .... .... 79
సృష్టిస్థితి తిరోధాన సంకల్పాయై
విశ్వజన్మ సమాధానసంకల్పాయై
ధర్మకర్త వినోభావ సంకల్పాయై
లక్ష్యమార్గ మనోనాధసంకల్పాయై ... ..... 80
శ్రీషోడశాక్షరీమంత్రమధ్యగాయై
శ్రీవత్సశోభితాతంత్రమధ్యగాయై
శ్రీరమ్యలాక్షనీయంత్రమధ్యగాయై
శ్రీమాతృవత్సలామంత్రమధ్యగాయై ... ... 81
అనాధ్యంతస్వయంభూతదివ్యమూర్తై
సమారాధ్యత్వయం భూతదివ్యమూర్తై
విశాలమ్ముస్వయంభూతదివ్యమూర్తై
సమాధాన స్వయంభూతదివ్యమూర్తై .... .... 82
భక్త హంసపరిముఖ్యవియోగాయై
ధర్మ బుద్ధి పరిముఖ్యవియోగాయై
లక్ష్య సిద్ధి పరిముఖ్యవియోగాయై
విశ్వ సాక్షి పరిముఖ్యవియోగాయై ... ..... 83
మాతృమండలసంయుక్తలలితాయై
నిత్యతృప్తి తొ సంయుక్తలలితాయై
సత్య బుద్ధితొ సంయుక్తలలితాయై
తత్వ సేవతొ సంయుక్తలలితాయై ... ...84
భండదైత్యమహాసత్వనాశనాయై
విశ్వధాత్రిమహాసత్వనాశనాయై
సర్వ దేవ మహాసత్వనాశనాయై
శుక్రనీతి మహాసత్వనాశనాయై ... ...85
క్రూరబండ శిర స్చేద నిపుణాయై
దుష్ట శక్తి నియె స్చేద నిపుణాయై
క్రూర కర్మ మతి స్చేద నిపుణాయై
దేహ మాశ కళ స్చేద నిపుణాయై .... .... 86
ధాత్రచ్యుతసురాధీశసుఖదాయై
మంత్రాచ్యుత నరాధీశసుఖదాయై
తంత్రాచ్యుత మయాధీశసుఖదాయై
తత్వాచ్యుత శిరో ధీశసుఖదాయై ... ... 87
చండముండనిశుంభాది ఖండనాయై
భూత ప్రేత పిశాచాది ఖండనాయై
దుష్ట బుద్ధిని నాశస్య ఖండనాయై
పాపభీతిని భందాన్ని ఖండనాయై ... .... 88
రక్తాక్ష రక్త జిహ్వాది శిక్షణాయై
ధర్మర్ధి ధర్మ విశ్వాస శిక్షణాయై
శీలస్య శక్తి కారుణ్య శిక్షణాయై
ప్రేమస్య భక్తి భాంధవ్య శిక్షణాయై ... .... 89
మహిషాసుర దోర్వీర్యనిగ్రహాయై
నరకాసుర దోర్వీర్యనిగ్రహాయై
దశ ఖంటుని దోర్వీర్యనిగ్రహాయై
ఖర దుఃషిని దోర్వీర్యనిగ్రహాయై ... ....90
అబ్రకేశమహోత్త్సాహకారణాయై
విశ్వశాంతి మహోత్త్సాహకారణాయై
ధర్మ నీతి మహోత్త్సాహకారణాయై
సర్వ సృష్టి మహోత్త్సాహకారణాయై ... ... 91
మహేశయుక్త నటనా తత్పరాయై
సుధర్మముక్తి నటనా తత్పరాయై
సకాల శక్తి నటనా తత్పరాయై
సమర్ధ భక్తి నటనా తత్పరాయై ..... .... 92
నిజభర్త్రుముఖాంభోజచింతనాయై
సుమమాల ముఖాంభోజచింతనాయై
వినయమ్ము ముఖాంభోజచింతనాయై
సమరమ్ము ముఖాంభోజచింతనాయై .... .... 93
వృషభధ్వజవిజ్ఞానభావనాయై
తరువుద్వజవిజ్ఞానభావనాయై
మనసు ద్వజవిజ్ఞానభావనాయై
పరమాత్మతొవిజ్ఞానభావనాయై .... ..... 94
జన్మమృత్యుజరారోగభంజనాయై
నిత్యకర్మ జరారోగభంజనాయై
సత్య వాది జరారోగభంజనాయై
దేశమాత జరారోగభంజనాయై .... .... 95
విధేయముక్తవిజ్ఞానసిద్ధిదాయై
సుధర్మశక్తి విజ్ఞానసిద్ధిదాయై
సకాలబుద్ధి విజ్ఞానసిద్ధిదాయై
విశాల నేత్ర విజ్ఞానసిద్ధిదాయై ...... ..... 96
కామక్రోధాది షడ్వర్గ నాశనాయై
దుష్టదుర్మార్గషడ్వర్గ నాశనాయై
రాజనీతిజ్ఞ షడ్వర్గ నాశనాయై
బ్రహ్మప్రోత్సాహషడ్వర్గ నాశనాయై ... .... 97
రాజరాజార్చితపదసరోజాయై
సర్వవేదార్చితపదసరోజాయై
నిత్యధర్మాత్మకపదసరోజాయై
రాజ్యభోజ్యాదిత పదసరోజాయై ... ...... 98
సర్వవేదాంత సంసిద్ధ సుతత్వాయై
విశ్వసంరక్ష సంసిద్ధ సుతత్వాయై
మోక్షకారుణ్య సంసిద్ధ సుతత్వాయై
సర్వమాంగళ్య సంసిద్ధ సుతత్వాయై .... ... 99
ఓం శ్రీ రామ్ ... శ్రీమాత్రేనమ: (ఇది నా ఆరాధ్య మాత లీల )
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
శ్రీలలితా అష్టోత్తర శతనామావళిని అమృత ఘడియల్లో పద్య రూపములో వ్రాయుట జరిగింది
శ్రీవీరభక్త విజ్ఞాన నిధానాయై
శ్రీధర్మ మోక్షవిజ్ఞాన నిధానాయై
శ్రీదివ్యశక్తి విజ్ఞాన నిధానాయై
శ్రీసూక్షబుద్దివిజ్ఞాన నిధానాయై ... ... 100
అశేష దుష్టదనుజసూదనాయై
విశేష క్రూరదనుజసూదనాయై
అకాలమృత్యదనుజసూదనాయై
సుశీల ప్రాప్తి దనుజసూదనాయై .... .... 101
సాక్షా చ్చి దక్షిణామూర్తి మనోజ్ఞా యై
సాక్షాచ్చి పుండరీనాధ మనోజ్ఞా యై
సాక్షాచ్చి ఆర్ధనారీశ మనోజ్ఞా యై
సాక్షాచ్చి పూజ్యభవాబ్ధిమనోజ్ఞా యై .... ... 102
హయమేధాగ్రసంపూజ్య మహిమాయై
సమతానేత్ర సంపూజ్య మహిమాయై
అణిమా శక్తి సంపూజ్య మహిమాయై
గరిమా శక్తి సంపూజ్య మహిమాయై.... .... 103
దక్షప్రజాపతి సుతా వేషాఢ్యాయై
శంభోకృపాపతి సుతా వేషాఢ్యాయై
సమ్మోహనాపతి సుతా వేషాఢ్యాయై
విశ్వప్రజాపతి సుతా వేషాఢ్యాయై ... .... 104
సుమబానేక్షుకోదండమండితాయై
సమకార్యార్ధి కోదండమండితాయై
మదిధర్మార్ధి కోదండమండితాయై
కళకారుణ్య కోదండమండితాయై .... .... 105
నిత్యయవ్వన మాంగల్యమంగళాయై
విశ్వమోహిత మాంగల్యమంగళాయై
తత్వబోధన మాంగల్యమంగళాయై
సృష్టి పోషణ మాంగల్యమంగళాయై .... .... 106
మహాదేవసమాయుక్త శరీరాయై
మహాదివ్యసమాయుక్త శరీరాయై
మహాభవ్యసమాయుక్త శరీరాయై
మహాలక్ష్య సమాయుక్త శరీరాయై..... ..... 107 .
మహాదేవర తౌత్సక్య మహాదేవ్వై
మహాసేవర తౌత్సక్య మహాదేవ్వై
మహా భక్తిర తౌత్సక్య మహాదేవ్వై
మహా శక్తిర తౌత్సక్య మహాదేవ్వై ... ... 108
మహిషాసురదోర్వీర్యనిగ్రహా యై
మనసే నవ దోర్వీర్యనిగ్రహా యై
వయసే జత దోర్వీర్యనిగ్రహా యై
ప్రకృతే కళ దోర్వీర్యనిగ్రహా యై
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి