చంద్రిక
జీవు డై నీవే జీవ మై నీవే జీవ లక్ష్య గనుము
జపము తపము ఏమి జాతి కొరకు ఏమి జాడ్య మవుట నేమి
చిత్త ముంచి చూడు చిత్ర విచిత్రాన్ని జొచ్చు సంప దెంత
ప్రేమ పంచి పొందు పేరు వలదు నీకు పెద్ద దిక్కు గురువు
నటన చూపు వలదు నమ్ము వారి ఎదుట బతుకు నేర్చుటేల
నేటి కథలు అన్ని నేడు తీర్పు జరుగు నిజము తెల్పి బతుకు
నోటి దురుసు వలదు నొసటి పిలుపు వలదు నవ్వు ఎవరి కొరకు
నడుమ కధలు ఏల నమ్మ పిలుపు లేల నారి కోస మేల
సీస పద్యం
తరుణమ్ము నీదియే...తమకము దేనికే
చిరుహాస చూపుల... చిత్త మాయె
విరిసింది అందాల్ని... విరజాజి మల్లెగ
మరుపేల ఇప్పుడు .. మనుసు మాయ
కిరణాల వెలుగులే... కలలను తీర్చులే
కరుణించె కధలుగా.... కనికరమ్ము
అరవింద కొరకు నే.. అభిషేకములుగా
మరచిపోని మనసు...మత్తు జల్లె
పంచు నమ్మ లేక నమ్మి నిడివి లేక
నమ్మ కమ్ము నడచి ఉండ లేక
నమ్మె మనసు నమ్మ నీయ లేక
నెమ్మ దనము నాన్య మిన్న లేక
నమ్మి నారి నారి నడుమ లేక
((()))
ఎన్ని కలకు ఏంత జనుల ఖర్చు
ఎన్ని కథలు ఎంత తెలివి చేర్చు
ఎన్ని కళలు ఎంత చదువు నేర్చు
ఎన్ని కలలు యదను సేద తీర్చు
ఎన్ని చిలికి ఎంత చెడును మార్చు
నేటి లోని నీతి నిన్ను మార్చు
మాట లన్ని మనసు దోచి మార్చు
ఆట లాంటి నటన నిన్ను మార్చు
కోటి లాంటి కులము బతుకు మార్చు
వాటి మైన వయసు వలపు మార్చు
శాశ్వత మిట సహన మెంత వరకు
విశ్వ మయము వింత మార్పు చిలుకు
శాశ్వి తమ్ము శాంతి నిచ్చు పలుకు
విశ్వ మాయ విజయ వాంఛ కులుకు
కశ్చి తమ్ము కళలు జయము కొరకు
ప్రకృతి చేయు పదును వింత ఎంత
ధరణి పిలు దారి చూపు ఎంత
నింగి మబ్బు నీడ నిజము ఎంత
కడలి పొంగు కళలు తీర్పు ఎంత
మనిషి బతుకు మనసు కోర్కె ఎంత
ఆటవెలది
ఇల్లు చిన్న దైన ఈశ్వర చూపుండు
మనసు పెద్ద దవ్వు మమత పంచు
గుండె గుప్పె డంత గళము ప్రేమించి
గుణము ఉన్న చోట మనసె వుంచు
శృంగార రస యోగం
శృంగార భావమే ఇంధనం..
శృంగార తన్మయం పావనం
శృంగార ఔషదం అదృష్టం
శృంగార జీవితం సంసారం
ధనము చేత విద్యను పొందు
విద్య చేత సౌఖ్యము పొందు
సౌఖ్యము చేత విశ్వాసం చెందు
విశ్వాసం చేత విజయం పొందు
ఆత్మ ధైర్యమే మనిషిలో పొందు
సుఖ లాలస తో కొత్త కళ చిందు
ప్రణయానికి నాందీ సుఖము చెందు
హృదయాల బంధనం సుఖాలు పొందు
స్వర్గమ్ము పొందుటక లే ..సుఖమిచ్చె దైవం
మర్మమ్ము తెల్పుటక లే.. మనసిచ్చు వైనం
కార్యమ్ము కల్గును కలే... కలతీర్చు ధైర్యం
సౌర్యమ్ము కల్గుట కలే..... సహనమ్ము తీర్ధం
శ్రీ వారి వక్షంపే అలరారె కస్తూరి
శ్రీ శక్తి అధరంపే ముద్దాడే మిఠారి
శ్రీ శక్తి వక్షంపై ఉబికే ను చెకోరి
శ్రీ వారి నీ హాయిగా చేయు వయ్యారి
దాంపత్య యజ్ణానికి శృంగార మే ఆజ్యం
ఆరోగ్య రాజ్యానికి శృంగారమే భోజ్యం
సంతాన భాగ్యానికి శృంగారమే దాశ్యం
ప్రేమతో విశ్వాసం శృంగారమే హాస్యం
తనువంతటా మనసైన ...మనసంతటా అనువైన
సుఖమిచ్చుటే వరమైన..వరమవ్వుటే సుఖమైన
కలతీర్చుటే విధియైన...విధి అవ్వుటే కలయైన
తనతోను పరిపూర్ణత చెందె.. ఆమెతో ను పరిపూర్ణత విందె
వసంతం వరించినప్పుడు .. ఎండిన తరువు చివురించు
శృంగార రసరాజం పిలిచినప్పుడు.. బండమారిన గుండె చెమరించు
కామసూత్రం ఆర్తిగా పిలచినప్పుడు...సింహమై మగధీరుడు కబలించు
సమాగమంలో పవిత్రమైన కవియత్రి.... శృంగార మే ఊతం కావ్య నాయక తనువంచు
రసజ్ఞత కొద్దీ కవిత్వం... రసి కత కొద్దీ స్త్రీ త్వం
ర రమ్య త భావం సమత్వం... సుఖ లయ లీలే స్త్రీ త్వం
ర సఖ్యత భావం సుఖ త్వం... రమ మయ మోహం స్త్రీ త్వం
మనోజ్ణత కొద్దీ కృషిత్వం...కృషీఫల హృద్యం స్త్రీ త్వం
కామం మనుష్యులకు సహజ లక్షణం
మితి మీరినపుడు మనిషి దుర్భరం
అశాంతితో నిగ్రహం లేక చపల చిత్తం
అధర్మ యుత కామా వలంబనతో నాశనం
మన మనస్సులో ఏది ఉంటుందో దాన్నే మాట్లాడటం.
ఏది మాట్లాడుతున్నామో దాన్నే చేయడం.
ఏం చేస్తున్నామో దాని గురించే మాట్లాడటం.
చిత్త బుధ్ధి దృడసంకల్పం ఉంటె జీవితం సుఖమయం
3
నేటి పద్యాలు
----
"సీ.
----
తూరుపుకొండపై తొలిసారి కనిపించు
దినరాజుకొసఁగుదు ప్రణతులెపుడు
ఆరోగ్యమిచ్చెడి యాదిత్యదేవుని
అరుణసూక్తార్చితుఁ గరుణకోరి
వినువీథిసంచారి వేదశాస్త్రజ్ఞుఁడు
వ్యాకర్త తిమిరాప హర్తయు
రఘురామవంశమ్ము రంజిల్లకరణుఁడు
వేవేలకిరణాల వెలుగులిచ్చు
--
గీ.
--
కాశ్యపేయునికమనీయకాంతుఁడంద్రు
సకలలోకాలసాక్షియుసర్వవేది
నిఖిలభువనాప్తుఁడు గ్రహాలనేతరవియు
నట్టివేల్పునిభక్తితోనంజలింతు !!!
----------------------------------------
చ:నవనవలాడు బాలిక సునామిగ గొప్ప లు చెప్పుటే కదా
సవినయ వాద సేవలు విశాలమనోన్నత తెల్పుటే కదా
నవవిధమాయె పూజలు మనస్సు తొభక్తియె కోరుటే కదా
కవిలిలడానపాత్రులయి గౌరవం ముందుట మంచిదే కదా
ధనము పోయినా పొందేటి దారు లెన్నొ
విద్య అభ్యాసముచె పొందు వినయ మల్లె
నియమ ఆచార ఆరోగ్య నిన్ను మార్చు
జరిగి పోయిన కాలము జేర్చ లేరు
ఆడంబరం అంత నిత్యము ఆర్ధికమ్ము గ చుట్టె
మర్యాద మన్నన మలుపులు మేలును కోరు చుండె
మోసమను నదియే కాలము మాయ గ తల్పుటయే
జీవితం ఎదురీద వలసిన జయ మేను సంధర్భమే
ఎక్కడమ్మా చిలుక నా .. చుక్కలయ్యా కనుక నే
మక్కువమ్మా మనసు నా...ముఖ్యమయ్యాది కనుకే
ఎక్కు వమ్మా కథలుగా.... తక్కువమ్మా మెరుపు గా
చుక్కలన్నీ చురుకుగా...చిక్కలన్నీ కరుణ గా
బురద అంట కుండగ బుద్ధి రాదులే
దురద లక్షణమ్ము మనసు దాహ మార్పులే
అరుదుగా మాట లాడుట ఆట అలుకుటే
మారదు కుఠిల బుధ్ధితో మాట దురుసెను
జనులు గుంపుగా చేరితే జపము భయము
జనులు ఏడుపే పలురకు జాడ్య మగును
జనులు వెధవ బ్రతుకు అంటు జయము కోరు
జనులు కలయిక సమయమే జాతి నడక
ధనము బంధుకోటికి నిత్య దాన మవ్వు
అందముతొ ఘర్షణలు సాగి ఆశ పెరుగు
చెలిమి కథలు గా కలసియే చెలియ దిశన
శాశ్వి తము ఏది అనుకున్న శాంతి కొరకు
డబ్బు జలమును కురిపించు డాంభి కమ్ము
జబ్బు భయమును తలపించు జాతి గాను
నిబ్బరము చూపు జీవన నియమము గను
మబ్బులు జలము జార్చును మహిమ లాగ
((()))
నవ్వుల తోను సమాజమ్ము -- నవ్వి ఏడ్వ లేక
నవ్వుల పాలు సమాజమ్ము -- నవ్వుతూను ఏడ్పు
నవ్వుల గోల సమాజమ్ము --- నవ్వు ధనము పలుకు
నవ్వి నవ్వుట సమాజమ్ము -- నవ్వ లేని జనము
(((()))))
పంచ రవళి
సత్య మేను సార్ధ కమ్ముగనులె
సత్య మేను సాహ సమ్ము గనులె
సత్య మేను సామ రస్యము గలె
సత్య మేను సాధ నంబు గనులె
సత్య మేను సార మెంచ గలిగె
ప్రేమ గుణము పెన్నిధి యగుచుండు
ప్రేమ మనసు కలలు కనుచు ఉండు
ప్రేమ ఇచ్చి పుచ్చు కొనుచు వుండు
ప్రేమ హృదయ తపన గురుతు వుండు
ప్రేమ గలుగు మాట ప్రీతి ఉండు
చూపు చురక చుర చుర లాడు
చూపు లోన చక్కఁ దనము లాడు
చూపు వల్ల చుక్క లలన రేడు
చూపు సిరులు చక్క చేయు వాడు
చూపు అంద చేయు గోప బలుడు
((())))
సమస్య :
ఉ :: ఆటలు ఆడినా మనసు ఆశ పడే కద గెల్పుకోసమున్
కోటలు కట్టినా బలుకు కాలముయే కద నిర్ణయించునన్
మీటిని వీణతంత్రువుగ మేలును కల్గుట సంభవమ్ముగాఁ
మాటల దప్పుగా బలుకు మానవుడే కద పండితుండనన్
బంధము నీడలా ఉంటేను బాధ్యత తెలిసొచ్చె
బంధము అద్దం అబధ్ధమ్ము చెప్పదు బాధ్యత యే
బంధము మనసును గూర్చి యు మాటలు చెప్పుటయే
బంధము పరువును నిల్పుట సత్యము తెల్పుటయే
సీస పద్యము
మాలక్ష్మి వల్లభా.. మమతల మాధవా
మాధాత్రి పతినీవు... మమ్ము జూడు
మాయందు కరుణయే...మనసున్న కృష్ణయ్య
మిమ్మేలు మనసార.. మనసు ఇవ్వు
మాదేవుడవు నీవు.. మాయను మాపుమా
మాకల తీర్చు మా... మదిని దలుచె
మాదృష్టి చూడుమా... మానస మును చూడు
మమ్ము కాపాడుము ...ముద్దు కృష్ణ
తేటగీతి
నిత్య జీవితంలో పూజ నియతి నెంచి
సత్య మార్గము పలుకు యే సల్పు జూడు
మదిన నిన్నే ను కోరితి మమతయేను
కధలు కావులే ప్రేమించె కరుణ పంచు
((())))
జనము నేడు జాతర గుట కదిలె
ధనము నేడు ధర్మ మార్గ మెదిలె
రాజ కీయ రాజ్య మలుపు కదిలె
ఇష్ట మయిన ఈశ్వరుండు కదిలె
భజన చేయు భక్తి రాజ్య మేలు
((())))
----
"సీ.
----
మాపద్మ భర్తయౌ మలయప్ప స్వామియే
మనసార ధ్యానింప మమ్ముఁజూచు
మాధాత్రిపతియగు మానల్లనయ్యయే
మాకు దిక్కందును మదినిఁదలఁచి
మాదైవమందునుమాలికాధారుని
ఖగవాహనుఁడుమమ్ముఁ గాచుఁగనుక
మాకష్టదూరుఁడుమాధవుఁడనుచును
స్మరియింతు భక్తితో సంతసమున
గీ.
--
కలియుగశరణ్యుఁడగువానిఁ గాంచెదనుగ
ఇరువురిసతులతోనొప్పు నురగశాయి
నినిరతముభజియించెదనిష్టనిష్ట
తోసకలవిదునేనంత తుష్టిఁగోర్చు !!!
0
132. అన్నదా, వసుదా, వృద్ధా, బ్రహ్మాత్మైక్య స్వరూపిణీ ।
బృహతీ, బ్రాహ్మణీ, బ్రాహ్మీ, బ్రహ్మానందా, బలిప్రియా ॥ 132 ॥
670. అన్నదా : సర్వజీవులకు ఆహారము ఇచ్చునది, 671. వసుదా : సంపదలిచ్చునది
672. వృద్ధా : ప్రాచీనమైనది, 673. బ్రహ్మత్మైక్యస్వరుపినీ :ఆత్మ, పరమాత్మల ఐక్యస్వరూపిణి
674. బృహతీ : అన్నిటికన్న పెద్దది, 675. బ్రాహ్మణీ బ్రహ్మఙ్ఞాన స్వరూపిణీ
676. బ్రాహ్మీ : సరస్వతీ, 677. బ్రహ్మానందా : బ్రహ్మానందస్వరూపిణీ, 678. బలిప్రియా :
బలి(త్యాగము) యందు ప్రీతి కలిగినది
సర్వజీవులకు అన్నముగను -- సర్వ పోష ణగను
సంపదలను ఇచ్చు మాతయే --- సంపదలను పంచు
పాత దైనను మంత్ర మగుటయే --- పాశ మగుట యేను
ఆత్మను పరమాత్మను కలియు -- ఆత్మ సత్య భావ
అన్నిటి కన్నను పెద్దది --- అన్ని అండ చేయు
జ్ఞానము సర్వబ్రహ్మమగుటే ---జ్ఞానసంపదగుట
చదువుల తల్లిగా పోషణ --- చదువు వళ్ళ తెలివి
బలిని కోరుప్రీతి గలిగియు --- బలిమి చెలిమి నిచ్చు
- Like
తేటగీతి పద్యాల ... కాలం
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
కాల మాయకు ఎవ్వరి కక్ష లేదు
దొంగలా వచ్చి పొయ్యేటి దివ్వె వెలుగు
పోయిన వయసుయె కరిగి పోవు మంచు
కాల సద్వినియోగమ్ము కలల పంట
నల్ల మేఘము కాలము నుండి కదులు
గ్రహణములు పట్టు కాలము గాయ మల్లె
వెన్నె లొచ్చుట సమయము వెన్న ముద్ద
గాలి తోడుగా మనసునే గాయ పరుచు
కామ బుద్ధికి కాలమే కాన రాదు
కర్షకుడు కాల మునుబట్టి ఖర్చు చేయు
కధలు తెలిపిన సమయము కల్ల కాదు
కవులు వారి రచనలన్ని గాధ లగును
రంగుల గులాబి పువ్వుల రమ్య గుండు
విందుల వినోద నవ్వుల వింత గుండు
లోకులు అనేటి అప్పుల లంగరవ్వు
జీవులు తినేటి తిట్టుల. జీవమవ్వు
మనసు మనసు కలయిక తో మచ్చికవ్వు
వయసు వయసు పరుగుల తో వరుస కలుపు
సొగసు సొగసు ఉరకల తో సౌఖ్యమవ్వు
తనువు తనువు తపనల తో తప్పు జరుగు
కూర్చుచుండు హామీ తోను కొంపముంచు
మార్పుచేసి పోటీ తోను మాయ యుండు
నీతి సూత్రాలు బతు కంత నీరు కార్చు
ఆశ పాశమ్ము చితి మంట లడుగు వేయు
సాధనం గా నిలిచె శక్తి సౌమ్యమవ్వు
బోధనం గా పలికె యుక్తి భాద్యతవ్వు
శోభనంగాను కా ముక్తి సులభమవ్వు
శక్తి యంతయు ధారిణియే శోభ నిచ్చు
--(())--
నేటి తేటగీతి పద్యాల .. రాత్రి
రాత్రి చోరుని కార్యము రంగరించి
నిద్ర మేము జయించు నిర్మలమ్ము
రక్షగా విశ్వమంతయు రాత్రి యందు
నిద్రపోని శునకములం నామకమ్ము
జాలి చూపుల జాబిల్లి జామురాత్రి
చల్ల చల్లగా వెచ్చగా చరిత చెప్పు
పంఖ తిరుగుతూ నన్నునూ పట్టలేరు
కీచురాళ్ళ శబ్దాలుగ కిటికి చెప్పు
అంధకారపు వేళలో అలుక తీర్చి
ఆదమర్చియు నిద్రలో ఆశ తీర్చి
భద్రతయు కుటుంబములలొ భర్త ఓర్పు
భయము లేదులే చెప్పిన భర్త తీర్పు
వ్యధ మాపియు హాయిగా వాయిదాను
వరుస మార్చియు సుఖమును వాక్కునిచ్చి
వాలు కన్నుల వరజాక్షి వరము తీర్చి
ఒడుపు పట్టుకు బిగింపు ఓర్పు చూపె
గుండెనేరాన్ని తలపక గంటు పడ్డ
రాత్రి రాకాశి అరుపులు రమ్యగున్న
రవ్వ వెలుగున రంజిల్లె రతిగ రాత్రి
నీరుకారి పోయేదిగా మంచు కరిగె
మగువ మనసున మక్కువ మగని చూపు
చూపు కనరాని మనసున చేష్ట లుడుకు
చెప్ప నలివికానికబుర్లు చెప్పు చుండి
బంతి చామంతి ఏకమ్ము భాగ్యమవ్వు
నిద్రపోనియ్యకుండగా భయముచూపి
భావ భవభంద విషయము బాధ తెల్పి
జన్మ పరిపక్వతను తెల్పి జాతరంత
సలిపి మనసు మనసునందు సలపరింత
రాత్రి మెల్ల మెల్లగను జారుకొను చుండి
వెలుగు నీవంతు ఇంకను వాదమొద్దు
ఒకరి తర్వాత పనులుగా ఒకరు వచ్చె
భార్య భర్తల ప్రేమలు భాగమయ్యె
--(())--
తేటగీతి
జీవి మనసును మరిగియు జాడ్య ముంచు
జీవి వయసును బట్టియు జాప్య ముంచు
జీవి నిత్యమూ వ్యసనం జోలపాడు
జీవి మంచులా కరిగియు జపము చేయు
నిత్య జీవితం సత్యమై నడక సాగు
నిత్య మాటల తలుపులు నింగి చేరు
నిత్య పరుగులు జీవితం నిన్ను మార్చు
నిత్య గెలుపుకు ప్రేమను నిచ్చి చూడు
జలమ చేరిన చినుకులు జలము కలియు
జలము నందు పెరుగుచుండు జలచరాలు
జలము మానవ దాహపు జీవనమ్ము
జలము త్రాగిన తరువాత జీవ శక్తి
అర్ధ నారీశ్వరల తత్వవమ్ము కలిగి
అర్ధ భావమ్ము జీవితం అర్ధ మవ్వు
వ్యర్ధ సంఘర్షణమ్ములు వ్యర్ధ మవ్వు
అర్ధ మవ్వునా ఈనాటి ఆర్య సూక్తి
రక్త మాంసాల ముద్దను రాజ్య మేలు
రక్త పంజరం వ్యాపించి రాటు తేలు
రక్త మంతయు దోచేటి రవ్వ వెలుగు
రక్త తర్పణతో తల్లి రామ అనుచు
పుడమి నెప్పులు పట్టని ప్రజ నడుగు
పుడమి తల్లి యు బాధను పట్టు యెవరు
పుడమి శక్తిని తోడియు పల్కు వారు
పుడమి కరుణను చూడక పిచ్చి దనుచు
యువత మాంసాల ముద్దను ఏలు చుండు
యువత పంజరం వ్యాపించి యేమి చేయు
యువత అంతయు దోచేసి యతిగ వెలుగు
యువత తర్పణతో తల్లి యాజ్ణ అనుచు
విత్తు పుడమిన నీటితో విచ్చి ఎగసె
విత్తు ఎరువును పొందియు వ్యర్ధ మవ్వ
కుండ విత్తు లు కలిసి యు కమ్ము కొచ్చు
వెలుగు నీడలు పొందియు వ్యాప్తి చెందు
మోక్క మోక్కయు అంటుయే మోక్క యగును
మొక్క కొమ్మరెమ్మలలోను మోగ్గ పువ్వు
మోక్క గాలినీటినిపీల్చి మేను పెంచు
మోక్క గామారి వృక్ష మ్ము మన్న నిచ్చు
పంట పండిస్తున్న ట్టి రైతులలొ శక్తి
పంట ఉత్పత్తి సామర్థ్య ప్రాంతమంత
పంట దేశసంపదగాను పిలుపు వుంచి
పంట దైవసమ్మతిగా పొందు చుండు
కంటిలోనినలసునినాలుకయు తీయు
ఇంటిలోనిఎలకలబోనుగను పట్టు
ఇంటిలో ఈగ మోతలు ఇంతికెరుక
బయటపల్లకీ మోతలు భర్త తెలుపు
ఏమని అనను జరుగేది ఏమి యైన
హాయి గొలిపే ది శక్తి మహత్యమేది
నింగి నేలను తాకే టి నమ్ము చున్న
వేంకటేశ్వర రూపము వ్యాప్తి చెందె
నీలి మేఘము నీమేను నిత్యమయ్యె
పగలు రేయి గా రవి శశి ప్రాప్తి కళ్ళు
నిలువునా నుంచొని ఉన్న నిన్ను చూడ
వేయి కుళ్ళును చాలవు వేంకటేశ
కాల యుగ ధర్మ మునుబట్టి కాపు కాయు
కామితార్ధము తీర్చేటి కావ్య పురుష
ఏలిక గను నీ చూపులే ఎరుక పరచె
ఏడు కొండల స్వామివి ఏ దడగను
వచ్చెను వసంత మాసము వకుళ పుత్ర
పుష్ప రాణులన్ వాసన పుడమి విప్పి
తెచ్చె శోభలన్ ఉదయమ్ము తెలుపు తెజ
మోక్కితియు మెండుగా నేను మోక్ష మివ్వు
--(())--
నేటి నేటి ప్రాంజలి ప్రభ గీతం
ప్రాంజలి ప్రభ నేటి కోకిల గీతం
రచయిత : మల్లా ప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ప్రాంజలి ప్రభ నేటి కోకిల గీతం
రచయిత : మల్లా ప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నా ప్రశ్నకు నీ జవాబే నా ప్రేమ
నీ జవాబే నా ప్రశ్నకు నీ ప్రేమ
మన ప్రేమే పెద్దల ఆశీర్వాదం
మన కలయికే దేశానికీ ఆదాయం
ఐతే తెలుపు
మెరుపుల తలుకులు ఏవీ .... మదిలో పులకింతలు
అరుపుల పలుకులు ఏవీ..... యదలో గిలిగింతలు
పెదవుల పలుకులు ఏవీ...... పొదలో సలపరింతలు
తలపుల కులుకులు ఏవీ....... రేయిలో కలవరింతలు
ఐతే గుట్టు విప్పు
మనసులోతు లెక్క గట్టు ..... సూత్రమే సరిగమలు
సొగసు లోతు కనిపెట్టు ..... మాత్రమే పదనిసలు
వయసు పోరు లెక్క గట్టు ....... ఆత్రమే గిరులు జరులు
తనువు ఆశ కనిపెట్టు ..... గాత్రమే ఫల గుణములు
మరి ఈ ఆటకు
బడిగంటకు గుడిమెట్లకు ....స్నేహమే కుదిరింది..
వడిఆటకు మదిపాటకు .... ప్రాణమే కుదిరింది
జడివానకు తడినేలకు ..... చెట్టుకే కుదిరింది
కళసాధన కలవేదన ........ గాలికే కుదిరింది
నా ప్రశ్నకు నీ జవాబే నా ప్రేమ
నీ జవాబే నా ప్రశ్నకు నీ ప్రేమ
మన ప్రేమే పెద్దల ఆశీర్వాదం
మన కలయికే దేశానికీ ఆదాయం
--(())--
ట్రంప్ మోదీ స్నేహం
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
ఎంతో సన్నిహిత బాంధవ్యం
మన ప్రతిభా ప్రగతికి నిదర్శనం
అమెరికా భారత భాగస్వామ్యం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
దిగ్విజయంగా యాత్ర సమ్మతం
సద్భావన సంఘీభావ విరచితం
సంతోష సమ్మోహన సంభాషణం
దేశాధినేతల మధ్య సౌహార్ధం
విస్తృత వాణిజ్య ఒప్పందం
భద్రతా రక్షణ ఇంధన సామర్థ్యం
సాంకేతిక అభివృద్ధి పరిజ్ఞానం
సత్సంబంధాల సన్నిహిత అంశం
మాతృ దేశం రక్షణ ఫలప్రదం
మాదక ద్రవ్యాల అక్లమ రవాణా నిరోధానికి
ఉగ్రవాద కార్యకలిపాల్ని తుడిచి పెట్టాలని
స్వేచ్ఛ ప్రగతి పథంలో చెట్టపట్టాలు కట్టుకొని
వ్యూహాత్మక భాగస్వామ్యం ఫలప్రదం
--(())--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి