29, డిసెంబర్ 2017, శుక్రవారం

కర్మ సన్యాసయోగం - 5 వ అధ్యాయము-




JAH WE # Yes Us # Krishna Consciousness

51.  శాంతి అనేది పరిశ్రమలో యంత్రాలు ఆడించి ఉత్పత్తి చేసేది కాదు.

52. ప్రభుత్వాలు శాసనం చేస్తే వచ్చేది కాదు.

53. ఇంట్లోకూర్చని వంట చేస్తే ఉడికి వచ్చేది కాదు.

54. వ్యక్తియొక్క మనస్సు కోరికలనే తుఫాన్ గాలులకు  చిక్క కుండా  స్థితియే శాంతి.

55. జ్ఞాన స్థితిలో పరమ శాంతి పొందాలంటే కోరిక, ఆశ అనే చిన్న ఫలాన్ని విడిచిపెట్టాలి.

56. సుఖసంపదల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం, ఆశలతో కర్మలు చేసేవాడు ఆయుక్తుడు.

57.  అట్టివాడు ఉత్తమ్, మహ్యమా, అధమ జన్మలు ఎత్తి జన్మ జన్మ బంధాలకు చిక్కుతాడు.

58. దేహంలో ఉన్న ఆత్మను  గ్రహించనివాడు అజ్ఞాని.

59. సత్రములో దిగిన జ్ఞాని సత్రము బాగోగులు పట్టించు కోడు, పొద్దున్నే వెళ్లిపోదా మను కుంటాడు.         

60. జ్ఞాని అయినవాడు అద్దెకొంప  దేహంలో  ఉంటూ  ప్రారబ్ధం పూర్తి కాగానే విడిచి వెళ్లిపోతాడు.

61. మనుష్యులలో శ్రేష్టుడు బ్రాహ్మణుడు, అధమాధముడు చండాలుడు, జంతువులలో ఉత్తమ మైనది గోవు, నీచాతి  నీచమైనది కుక్క, మధ్యమ మైనది ఏనుగు. 

62. పసువులకు ఉపయోగపడే వస్తువు మనుష్యులకు పనికిరాదు, లోకవ్యవహారంలో మనుష్యులకు జంతువు లకు  ఉన్న తారతమ్యము తెలుసుకొని బ్రతకటమే మాన వత్వము.

63.  న్యాయ యుక్త వ్యవహార భేదములను అందరు పాటించవలసినదే. 

64. లోకవ్యవహార దృష్టిలో వారి వారి యోగ్యతలను అనుసరించి ఆవశ్యకత భేదములను పాటించుటే జ్ఞానుల వైసిష్టము. 

65.  అందరి యెడల ప్రేమాదరములు, పరమాత్మ భావములు సమానముగా ఉండునని తెలుసుకొనవలెను. 

66.  శరీరమునకు అవయవములు ఎంత అవసరమో, సమాజమునకు కుల కర్మాచారనములు కూడా అంతే అవసరము. 

67.  అన్ని అంగములు ఆత్మీయత భావముతో ఉండుట వల్ల ఆరోయముగా ఉండగలుగుతున్నారు అదేవిధముగా అందరూ సమాన భావముతో ఉండి నప్పుడు అసమానత భేదము కానరాదు. 

68. శరీరములో ఏదైనా అన్గామునకు దేబ్బాగిలిన తగు చికిస్చ చేసుకోనగా బాగుపడును, అట్లే లోకవ్యవహారములో న్యాయవవస్తయందు తత్వజ్ఞానులు ధర్మముగా నడచిన లోకము బాగుపడును. 

69.  సమభావ స్థితి మనస్కులైనవారు శరీరము ఉన్నను దానితో సంభంధం ఉండదు, ఎందుకనగా జనన మరణ చక్రము నుండి విముక్తులగుతారు. 

70. సత్వ, రజ స్థమో గునములలోని దోషములు హెచ్చు తగ్గులు ఉండవచ్చును. పరమాత్మునిపై నమ్మకము ఉన్న వానియందు గుణములు అతీతముగా ఉండును. 

71.  మానవుడు అహంకార స్పర్స , సుఖము చుట్టు తిరుగుట వల్ల  గుణ అతీతుడుగా ఉండలేక ఉన్నాడు. అయినా చిత్తము సత్వగుణము చుట్టు ఉన్నయడల సంభవము.

72. ప్రియలాభములకు పొంగిపోనివాడును, అప్రియములు ఎదురైనప్పుడు కృంగి పోనివాడును పరమాత్మయందు ఏకీభావం స్థితి యందు ఉండును. 

73. లోకవ్యవహార దృష్టిలో అనేక విధములుగా సుఖ దు:ఖాలు బుద్ధి బ్రహ్మస్థితి నుండి మారదు.

74. జ్ఞానియొక్క అంత :కరణమునందు సంశయము, బ్రమ, మోహము లేశమాత్రమును ఉండవు.

75. భౌతిక శరీరములయందు ధ్యాస ఉండక, లోక వ్యవహారములో తలదూర్చక నిగ్రహస్థితిలో ఉన్నయడల పర మాత్మ లీలలు తెలుసుకోగలుగుతారు.

76. ఇంద్రియవిషయాలను, బాహ్య స్పర్శ విషయమును పూర్తిగా మనస్సునుండి తొలగించవలెను.

77. ఇంద్రియభోగములు దు:ఖ కారకములు, అనిత్యములు    ఇట్టి వారికి ధ్యానజనిత సుఖము లభింపదు.

78. వైరాగ్య ఉప రతి శ్రేష్ఠములు,  ధ్యాన జనిత సుఖఃము పరమాత్మసాక్షాత్కారము, అక్షయానందము పొందుటలోనే ఉంది పరమాత్మస్వరూపము.

79. మిడతలు మోహావేశమునకు చిక్కి అగ్నిజాలాలచుట్టి తిరిగి తాపము అనుభవించి దగ్దమగును. 

80. అజ్ఞానులు భోగములే సుఖ హేతువులని భావించి సుడిగుండములో పడిపోతారు. 
81.స్త్రీ కారణంగా భోగలాలసులుగా మారితే బలము, వీర్యము, ఆయువు క్షిణించును. 

82. మనస్సు, బుద్ధి, ప్రాణములు, ఇంద్రియములు క్షిణించును. 


83. అజ్ఞానిగా మారి కామాగ్నికి ఈర్ష్యాగ్ని తోడై ఆరోగ్యమును దగ్దము చేయును. 


83. ఇంద్రియభోగములు స్వప్న సదృశములు, మెరుపువలె క్షణ భంగురములు మానవజన్మ వైశిష్టము తెలుసుకొని ప్రవర్తించవలెను . 


84. కామ క్రోధాదులను జయించుటకు నిత్యమూ భగవంనామమే శరణ్యము అని గమనించవలెను. 


85 అపేక్ష వలన, అశ్రద్ధ వలన, ఉపేక్ష వలన భోగవస్తువులను సేకరించి అనుభవించితే పాస్చాత్తాపి బడ్డా ఫలితము ఉండదు. 


86. పరవళ్లు త్రొక్కు నది సముద్రము చేరగానే నామ రూప రహతమగును అట్లే కామక్రోధాలను నిగ్రహించుకోగలిగితే  

మటుమాయమగును. 

87. సంకల్ప వికల్ప ప్రవాహమనే క్రోధ విజృంభణ ప్రభావాలకు చిక్కకుండా యుంటేనే   సమర్థుడుగా మారుతాడు. 


88. స్త్రీ పుత్రాదులకొరకు, ధన మాన సంపదల కొరకు ప్రలోభాలకు చిక్కి పరమాత్మను విస్మరిస్తున్నారు. 


89. అంత రాత్మ యందే సుఖించు వాడును, ఆత్మయందే రమించు వాడును, సాంఖ్యయోగిగా మారును. 


90. ఆత్మజ్ఞాని అయినవాడు సచ్చిదానంద ఘనపరబ్రహ్మ పరమాత్మ యందు ఏకీభావస్థితుడై బ్రహ్మ నిర్వాణము పొందును.         



కర్మ  సన్యాసయోగం - 5  వ అధ్యాయము-
ప్రాంజలి ప్రభ- అంతర్గత సూక్తులు (5/100) , 
 రచయత : మల్లాప్రగడ రామకృష్ణ  
91. తనకు లేనిదాన్ని ఇతరులకు ఉన్నదానిని  కోరు కోవటమే కామం .   

92. కామంవల్ల వళ్ళు గగుర్పాటు జరగటం, మొఖంలో ప్రసన్నత చెడటం జరుగు తుంది .

93. కోరు కున్నది పొంద లేకపోయిన, దానికి మరొకడు అడ్డు పడిన కళ్ళు ఎరపడటం తో వచ్చేది క్రోధం. 

94. క్రోధం వల్ల శరీరంలో కంపం, చమటలు పట్టడం,  కళ్ళు ఎర్రబడటం, నోటికి ఎటువంటి మాటలైనా రావటం సహజం . 

95. అక్షయ సుఖం, శాశ్వత సుఖం, దుఃఖం లేని సుఖం, సుఖం బయట నుండి కోరేది కాదు లోపలనుండి ఊరేది దీనినే అనుభవం అంటారు. 

96. మహాత్ములు బాహ్యవస్తువులను త్యజించి, బంధాన్ని  పెంచు కోకుండా నిరంతరం ఆత్మ జ్ఞానంలో గడుపుతారు. 

97. పాపాలను తొలగించుకున్నవారు, దైతభావన ఛేదించిన వారు, మనస్సును స్వాదనములో పెట్టుకున్నవారు, సమస్త ప్రాణుల హితాన్ని కోరుకున్నవారు మాత్రమే ఆనందాన్ని పొందకలుగుతారు .

98. ఎవరు బాహ్యమైన స్పర్శాది విషయాలను బయటనే నిలిపి వేసి, దృష్టిని భూ మధ్యను నిలిపి ముక్కులో సంచరించే ప్రాణ, అపాన, వాయువులను సమం చేసి, మనోబుద్ధులను, ఇంద్రియాలను నిగ్రహించి, ఆశ భయ క్రోధాలను  విడిచిపెట్టి, మోక్షాన్ని కోరుకునేవాడు. మనన శీలుడు

99. పరమాత్ముడు సంసార సముద్రాన్ని దాటుటకు విజ్ఞానాన్ని మహర్షులద్వారా అందచేయడం, మనం తిన్న ఆహారాన్ని జీర్ణం అవడం మరలా ఆహారాన్ని అందుకోవటం దేవుని సృష్టి అని గమనించాలి. 

100. మనకున్న అశాంతి, సంసార భ్రాంతి క్షణము మాత్రమే దానిని జయించుటకు భగవంతుని యదార్ధ తత్వాన్ని   తెలుసుకొని నిరంతరం భక్తిమార్గంలో ఉన్నవానికి కలుగు ను పరమశాంతి. దానికి మించినది ఏదీలేదు.  

భగవద్ గీత యందు (5వ ధ్యాయము ) లో ఉన్న అంతర్గత సూక్తులు సమాప్తము.                    
        --((*))--

                  

   

16, డిసెంబర్ 2017, శనివారం

కర్మ సన్యాసయోగం - 5 వ అధ్యాయము- అంతర్గత సూక్తులు (1 /10 )

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణా యనమ:
కర్మ  సన్యాసయోగం - 5  వ అధ్యాయము-
Image may contain: text
ప్రాంజలి ప్రభ- అంతర్గత సూక్తులు (1  /10 
  రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

1. మనకు కావలసింది శ్రేయస్సే కానీ ప్రేయస్సుకాదు, శ్రేయస్సు అనగా శాశ్విత ఆనందం. 

2. ప్రేయస్సు అనగా నశించిపోయే ఇహలోక, పరలోక భోగాలు. విషాదములోను, సంతోషములోను, ప్రేయస్సు ను  కోరుట  మంచిది కాదు. 

3. కల్ప వృక్షం వద్దకు పోయి మౌనంగా ఉండుట ఎంత తప్పో, భోగాలను కోరుట కూడా అంతే తప్పు.

4. సన్యాసం అంటే విడిచి పెట్టడం, యోగం అంటే చెయ్యటం, సన్యాసయోగం గ్రహించుట ఎట్లు ? 

5. కర్మ సన్యాసం అంటే కర్మలు విడిచి పెట్టడం, కర్మయోగం అంటే కర్మలు చేయటం, ఈ రెండు ఒక్కటేనా,  అని  భగవంతున్ని కోరుట? . 

6. కర్మ సన్యాసం కంటే కర్మ యోగం శ్రేష్టమని భగవంతుడు తెలియ పరిచాడు.

7. వయసును బట్టి పనులు, చదువు చేయాలని భగవంతుడు తెలియపరిచాడు. (5  ఏళ్ల పిల్లవాడు డిగ్రీ చదువుట ఎంతకష్టమో ఈ గీతను అర్ధం చేసుకోనుట కొందరికి కష్టము)

8. జీవితంలో  గడ్డు పరిస్థితి వచ్చి నప్పుడు బుద్ధి ని ఉపయోగించాలి, లేదా పరమాచార్యులను సంప్రదించి పరిష్కారం చేసుకోవాలి .

9. మానవులు రజోగుణ ప్రభావంవలన వాసనా భారంతో క్రుంగి పోవుట సహజము. 

10. వాసనా భారము తగ్గితే  గాని మనస్సు ప్రశాంత పడదు. మనస్సు ప్రశాంత పడాలంటేకర్తవ్య భావముతో ధర్మాన్ని నిలబెట్టాలని దీక్ష పడితే వాసనా భారం కొంత తగ్గుతుంది. 

11. కొందరు శరీరము ద్వారా, వాక్కు ద్వారా కర్మలు చేయకుండా  మౌనం గా ప్రార్ధన చేస్తారు వారే కర్మ సన్యాసులు.

12. కొందరు నిష్కామ భావంతో ఫలితంపై ఆసక్తి చూపక, కర్తవ్య భావముతో అంట ఈశ్వరార్పణం అని బుద్ధితో చేసే కర్మలను కర్మ యోగం అందురు.         

13. ఎవరైతే ద్వేషించకుండా, దేనిని కోరకుండా ఉంటారో అతడే నిజమైన నిత్య సన్యాసి.

14. ఎవరైతే దుఃఖ కారణాలను ద్వేషించ కుండా, సుఖ కారణాలను కోరకుండా, మంచి చెడ్డల యందు తటస్థ భావము వహించి, సమ చిత్తం కలిగి ఉంటాడో అతడే నిత్య సన్యాసి.

15. శరీరాన్ని మనస్సుని, బుద్ధిని కలవర పెట్టే వాసనలు బంధాలు (అనగా ద్వందాలను ) తట్టుకొని  ప్రతి ఒక్కరు జీవితము సాగించవలెను.

16. శీతోష్ణాలు, సుఖదుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు, మానవమానాలు, రాగద్వేషాలు ఇవే పాశాలు, యమపాశాలు,  చేధింన వాడే నిజమైన సన్యాసి.

17. సన్యాసి వేషం వేసుకొని అన్నింటిపై ఆశక్తి  చూపినవాడు సంసారేకాని సన్యాసి కాడు.

18. భార్యా బిడ్డల పై ఆసక్తి,, భోగాలపై ఆసక్తి, ధన సంపదలపై ఆసక్తి, ఆశ్రమాలపై ఆసక్తి, భవణాలను కట్టాలని ఆసక్తి,  ధనం కోసం ఇతరులను ఆశ్రయించటం ఉన్న ఆసక్తి, కనుక ఉంటే అట్టివాడు సంసారి ఆయన సన్యాసితో సమానం.

19. అనాలోచితముగా త్వరపడి సన్యాసిగా మారిన రెంటికి చెడిన రేవడ అవుతాడు.           

20. కర్మలు బంధదాయకాలు అందుకే "కర్మణా బధ్యతే జంతు: " అన్నారు భగవానుడు. 
 

21. బంధాల నుండి తప్పించుకొని జ్ఞాణ నిష్టా శిఖరాన్ని ఎలా చేరుకోవాలో  ప్రయత్నిమ్చ మన్నారు. 

22. పనస తొనలు తీయాలంటే చేతికి నూనె వ్రాసుకుంటే తేలికగా తీయవచ్చు. 

23. పాత్రకు కళాయి పూసి వంట వండితే ఎటువంటి చిలుము  పట్టదు. 

24. విద్యుత్తును పరీక్షించేవాడు రబ్బరు తొడుగును ఉపయోగిస్తే ప్రమాదాలు ఉండవు. 

25. జ్ఞాన ప్రభావంతో కర్మలు చేస్తే బంధాలు అడ్డురావు అని భగవానులు తెలియ పరిచారు. 

26. నిర్మల హృదయము,, మనో నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, సర్వత్రా, ఆత్మ దర్సనము నిష్కామ కర్మాచరణ చేయాలి. 

27. కోరికల పట్ల అనాసక్తి కలిగి, బుద్ధి నిర్మలంగా ఉంచు కొన్నవాడు విశుద్దాత్ముడుగా మారుతాడు.   

28. కోరికలేని వానికి అలజడులు, ఆందోళనలు, నిరాశ నిస్పృహలు ఉండక, మనస్సు ప్రశాంతముగా ఉంటుంది అట్టివాడే విజితాత్ముడు.

29. ఇంద్రియాలకు దాసుడై వెంట బడి పోకుండా ఉన్నవాడే జితేంద్రియుడు. 

30. ప్రాణులన్నీ యదార్ధ స్వరూపాన్ని తెలిసికొని ఆత్మలలో తేడాలు ఉండవని గ్రహించగలరు.

31. సర్వమును ఆత్మయే అని జ్ఞానంతో ఏకర్మలు చేసిన అతడు యోగ యుక్తుడు.

32. ఇంద్రియములు మనస్సును అధీనములో ఉంచుకొన్న వాడు తత్వవిదుడు. 

33. అందరినీ  తనలోను, తనని అందరిలోనూ, చూడ గలుగుతూ ఉండేది  ఆత్మయోక్కటే            

34. కన్ను చూస్తున్నా, చెవి వినబడుతున్నా, నాలుక రుచి చెపుతున్నా, చర్మము స్పర్శ స్తున్నా, ముక్కు వాసన చూస్తున్నా, పాదాలు నడుస్తున్నా, నోరు మాట్లాడుతున్నా, చేతులు  పట్టుకుంటున్నా ఇంద్రియాలు పనిచిస్తున్నా నేను  సాక్షిగా ఉంటాను. 

35. ఆలోచనలలో, భావనలలో  కర్మల తాలూకు వాసనలు - జ్ఞాపకాలు ఉండవు. 

36.  కర్మను సన్యసించటము కాదు, కర్మతో సంగ భావాన్ని సన్యసించాలి. 

37. దేహేంద్రియాలను వాటియొక్క వృత్తులను తెలియపరుస్తూ ఉండేది ఆత్మ ఒక్కటే. 

38. మనసు నేను, బుద్ధినేను అనే భ్రమలో ఉండి ఆత్మను మరచి ఉంటారు. 

39. ఎవరైతే శాస్త్ర విషయాలను గురువు ద్వారా శ్రవణం చేసి మనన నిధి ధ్యాసనల ద్వారా గట్టి పరుచు కొన్నవాడు
 తత్వ విదుడు. 

40. కర్మలవల్ల లభించిన ఫలితం ఏదైతే ఉందో అది భగవంతుడు ప్రసాదించిన ప్రసాదంగా భావించాలి.   

41. అన్నీ చేసేవాడు భగవంతుడు నాదేం లేదు అనే నిశ్చయ జ్ఞాణం కలిగి ఉండి, ధర్మం తప్పక నడిచే వాడే నిజమైన మానవుడు. 

42. నిరంతరం మనస్సును పరమాత్మపై నిలపటము వలన బుద్దివికసించి ధర్మకార్యములు చేయ గలుగు మార్గం ఉంటుంది. 

43. పూర్వ పాప పుణ్య ఆలోచలు ఏవి ఉన్నాయో అవి మనస్సుపై ముద్రగా   మరలా మరలా కర్మలను చేయిస్తూ కర్మ భంధం లోకి నెట్టివేస్తాయి. 

44. బురదలో ఉన్న తామరాకు బురద నంటించుకోదు, అలాగే  ప్రపంచంలో ఉన్నా, ప్రపంచ విషయాలకు వ్యామోహాలకు దూరంగా ఉండాలి. 

45. సాధకులకు కావలసినది లౌకిక ప్రయోజనము కాదు, పారమార్ధిక ప్రయోజనము కావాలి. 

46. పారమార్ధిక ప్రయోజనమంటే ముక్తియే, మోక్షమే అట్టి మోక్ష ప్రాప్తికి ఆత్మ జ్ఞానము కావాలి. 

47. ఆత్మజ్ఞానం అనుభవంలోకి తెచ్చు కొనుటకు ధ్యాన నిష్ఠ నిలవాలి.  అందుకు మనస్సు ఏకాగ్రం కావాలి. 

48. ఏకాగ్రం కావాలంటే చిత్తం అన్ని మాలిన్యాలనుండి శుద్ధి పడాలి. 

49. చిత్తశుధ్దికోసమే  కర్తృత్వం లేకుండా కర్మలు ఆచరించి, శుద్ధికోసం సంగరహిత కర్మలు నాచరిస్తూ భగవంతుణ్ణి ప్రార్ధించాలి. 

50.    బ్రాహ్మణుడు గొఱ్ఱెను చూస్తే అయ్యో అనుకుంటాడు అదే కసాయివాడు చూస్తే ఎంతమాంసం వస్తుందో అని ఆలోచిస్తాడు. బ్రాహ్మణునిది కేవలం దృష్టి, కసాయి వానిది సంగ దృష్టి.