ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణా యనమ:
కర్మ సన్యాసయోగం - 5 వ అధ్యాయము-
ప్రాంజలి ప్రభ- అంతర్గత సూక్తులు (1 /10
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
1. మనకు కావలసింది శ్రేయస్సే కానీ ప్రేయస్సుకాదు, శ్రేయస్సు అనగా శాశ్విత ఆనందం.
2. ప్రేయస్సు అనగా నశించిపోయే ఇహలోక, పరలోక భోగాలు. విషాదములోను, సంతోషములోను, ప్రేయస్సు ను కోరుట మంచిది కాదు.
3. కల్ప వృక్షం వద్దకు పోయి మౌనంగా ఉండుట ఎంత తప్పో, భోగాలను కోరుట కూడా అంతే తప్పు.
4. సన్యాసం అంటే విడిచి పెట్టడం, యోగం అంటే చెయ్యటం, సన్యాసయోగం గ్రహించుట ఎట్లు ?
5. కర్మ సన్యాసం అంటే కర్మలు విడిచి పెట్టడం, కర్మయోగం అంటే కర్మలు చేయటం, ఈ రెండు ఒక్కటేనా, అని భగవంతున్ని కోరుట? .
6. కర్మ సన్యాసం కంటే కర్మ యోగం శ్రేష్టమని భగవంతుడు తెలియ పరిచాడు.
7. వయసును బట్టి పనులు, చదువు చేయాలని భగవంతుడు తెలియపరిచాడు. (5 ఏళ్ల పిల్లవాడు డిగ్రీ చదువుట ఎంతకష్టమో ఈ గీతను అర్ధం చేసుకోనుట కొందరికి కష్టము)
8. జీవితంలో గడ్డు పరిస్థితి వచ్చి నప్పుడు బుద్ధి ని ఉపయోగించాలి, లేదా పరమాచార్యులను సంప్రదించి పరిష్కారం చేసుకోవాలి .
9. మానవులు రజోగుణ ప్రభావంవలన వాసనా భారంతో క్రుంగి పోవుట సహజము.
10. వాసనా భారము తగ్గితే గాని మనస్సు ప్రశాంత పడదు. మనస్సు ప్రశాంత పడాలంటేకర్తవ్య భావముతో ధర్మాన్ని నిలబెట్టాలని దీక్ష పడితే వాసనా భారం కొంత తగ్గుతుంది.
11. కొందరు శరీరము ద్వారా, వాక్కు ద్వారా కర్మలు చేయకుండా మౌనం గా ప్రార్ధన చేస్తారు వారే కర్మ సన్యాసులు.
12. కొందరు నిష్కామ భావంతో ఫలితంపై ఆసక్తి చూపక, కర్తవ్య భావముతో అంట ఈశ్వరార్పణం అని బుద్ధితో చేసే కర్మలను కర్మ యోగం అందురు.
13. ఎవరైతే ద్వేషించకుండా, దేనిని కోరకుండా ఉంటారో అతడే నిజమైన నిత్య సన్యాసి.
14. ఎవరైతే దుఃఖ కారణాలను ద్వేషించ కుండా, సుఖ కారణాలను కోరకుండా, మంచి చెడ్డల యందు తటస్థ భావము వహించి, సమ చిత్తం కలిగి ఉంటాడో అతడే నిత్య సన్యాసి.
15. శరీరాన్ని మనస్సుని, బుద్ధిని కలవర పెట్టే వాసనలు బంధాలు (అనగా ద్వందాలను ) తట్టుకొని ప్రతి ఒక్కరు జీవితము సాగించవలెను.
16. శీతోష్ణాలు, సుఖదుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు, మానవమానాలు, రాగద్వేషాలు ఇవే పాశాలు, యమపాశాలు, చేధింన వాడే నిజమైన సన్యాసి.
17. సన్యాసి వేషం వేసుకొని అన్నింటిపై ఆశక్తి చూపినవాడు సంసారేకాని సన్యాసి కాడు.
18. భార్యా బిడ్డల పై ఆసక్తి,, భోగాలపై ఆసక్తి, ధన సంపదలపై ఆసక్తి, ఆశ్రమాలపై ఆసక్తి, భవణాలను కట్టాలని ఆసక్తి, ధనం కోసం ఇతరులను ఆశ్రయించటం ఉన్న ఆసక్తి, కనుక ఉంటే అట్టివాడు సంసారి ఆయన సన్యాసితో సమానం.
19. అనాలోచితముగా త్వరపడి సన్యాసిగా మారిన రెంటికి చెడిన రేవడ అవుతాడు.
20. కర్మలు బంధదాయకాలు అందుకే "కర్మణా బధ్యతే జంతు: " అన్నారు భగవానుడు.
21. బంధాల నుండి తప్పించుకొని జ్ఞాణ నిష్టా శిఖరాన్ని ఎలా చేరుకోవాలో ప్రయత్నిమ్చ మన్నారు.
22. పనస తొనలు తీయాలంటే చేతికి నూనె వ్రాసుకుంటే తేలికగా తీయవచ్చు.
23. పాత్రకు కళాయి పూసి వంట వండితే ఎటువంటి చిలుము పట్టదు.
24. విద్యుత్తును పరీక్షించేవాడు రబ్బరు తొడుగును ఉపయోగిస్తే ప్రమాదాలు ఉండవు.
25. జ్ఞాన ప్రభావంతో కర్మలు చేస్తే బంధాలు అడ్డురావు అని భగవానులు తెలియ పరిచారు.
26. నిర్మల హృదయము,, మనో నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, సర్వత్రా, ఆత్మ దర్సనము నిష్కామ కర్మాచరణ చేయాలి.
27. కోరికల పట్ల అనాసక్తి కలిగి, బుద్ధి నిర్మలంగా ఉంచు కొన్నవాడు విశుద్దాత్ముడుగా మారుతాడు.
28. కోరికలేని వానికి అలజడులు, ఆందోళనలు, నిరాశ నిస్పృహలు ఉండక, మనస్సు ప్రశాంతముగా ఉంటుంది అట్టివాడే విజితాత్ముడు.
29. ఇంద్రియాలకు దాసుడై వెంట బడి పోకుండా ఉన్నవాడే జితేంద్రియుడు.
30. ప్రాణులన్నీ యదార్ధ స్వరూపాన్ని తెలిసికొని ఆత్మలలో తేడాలు ఉండవని గ్రహించగలరు.
31. సర్వమును ఆత్మయే అని జ్ఞానంతో ఏకర్మలు చేసిన అతడు యోగ యుక్తుడు.
32. ఇంద్రియములు మనస్సును అధీనములో ఉంచుకొన్న వాడు తత్వవిదుడు.
33. అందరినీ తనలోను, తనని అందరిలోనూ, చూడ గలుగుతూ ఉండేది ఆత్మయోక్కటే
34. కన్ను చూస్తున్నా, చెవి వినబడుతున్నా, నాలుక రుచి చెపుతున్నా, చర్మము స్పర్శ స్తున్నా, ముక్కు వాసన చూస్తున్నా, పాదాలు నడుస్తున్నా, నోరు మాట్లాడుతున్నా, చేతులు పట్టుకుంటున్నా ఇంద్రియాలు పనిచిస్తున్నా నేను సాక్షిగా ఉంటాను.
35. ఆలోచనలలో, భావనలలో కర్మల తాలూకు వాసనలు - జ్ఞాపకాలు ఉండవు.
36. కర్మను సన్యసించటము కాదు, కర్మతో సంగ భావాన్ని సన్యసించాలి.
37. దేహేంద్రియాలను వాటియొక్క వృత్తులను తెలియపరుస్తూ ఉండేది ఆత్మ ఒక్కటే.
38. మనసు నేను, బుద్ధినేను అనే భ్రమలో ఉండి ఆత్మను మరచి ఉంటారు.
39. ఎవరైతే శాస్త్ర విషయాలను గురువు ద్వారా శ్రవణం చేసి మనన నిధి ధ్యాసనల ద్వారా గట్టి పరుచు కొన్నవాడు
తత్వ విదుడు.
40. కర్మలవల్ల లభించిన ఫలితం ఏదైతే ఉందో అది భగవంతుడు ప్రసాదించిన ప్రసాదంగా భావించాలి.
41. అన్నీ చేసేవాడు భగవంతుడు నాదేం లేదు అనే నిశ్చయ జ్ఞాణం కలిగి ఉండి, ధర్మం తప్పక నడిచే వాడే నిజమైన మానవుడు.
42. నిరంతరం మనస్సును పరమాత్మపై నిలపటము వలన బుద్దివికసించి ధర్మకార్యములు చేయ గలుగు మార్గం ఉంటుంది.
43. పూర్వ పాప పుణ్య ఆలోచలు ఏవి ఉన్నాయో అవి మనస్సుపై ముద్రగా మరలా మరలా కర్మలను చేయిస్తూ కర్మ భంధం లోకి నెట్టివేస్తాయి.
44. బురదలో ఉన్న తామరాకు బురద నంటించుకోదు, అలాగే ప్రపంచంలో ఉన్నా, ప్రపంచ విషయాలకు వ్యామోహాలకు దూరంగా ఉండాలి.
45. సాధకులకు కావలసినది లౌకిక ప్రయోజనము కాదు, పారమార్ధిక ప్రయోజనము కావాలి.
46. పారమార్ధిక ప్రయోజనమంటే ముక్తియే, మోక్షమే అట్టి మోక్ష ప్రాప్తికి ఆత్మ జ్ఞానము కావాలి.
47. ఆత్మజ్ఞానం అనుభవంలోకి తెచ్చు కొనుటకు ధ్యాన నిష్ఠ నిలవాలి. అందుకు మనస్సు ఏకాగ్రం కావాలి.
48. ఏకాగ్రం కావాలంటే చిత్తం అన్ని మాలిన్యాలనుండి శుద్ధి పడాలి.
49. చిత్తశుధ్దికోసమే కర్తృత్వం లేకుండా కర్మలు ఆచరించి, శుద్ధికోసం సంగరహిత కర్మలు నాచరిస్తూ భగవంతుణ్ణి ప్రార్ధించాలి.
50. బ్రాహ్మణుడు గొఱ్ఱెను చూస్తే అయ్యో అనుకుంటాడు అదే కసాయివాడు చూస్తే ఎంతమాంసం వస్తుందో అని ఆలోచిస్తాడు. బ్రాహ్మణునిది కేవలం దృష్టి, కసాయి వానిది సంగ దృష్టి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి