31, అక్టోబర్ 2014, శుక్రవారం

187. Divotional Story 90 (శ్రీ గాయత్రి మంత్రములు )


    .......  ఓం శ్రీ రాం                ......  ఓం శ్రీ  రాం             .....  ఓం శ్రీ రాం

                                                                               
 1. శ్రీ గాయిత్రి మంత్రం

    ఓం భూర్భువస్సువ: తస్చవితుర్వ రేణ్యం  భర్గోదేవస్య  ధీమహి ధియోయోన: ప్రచోదయాత్
                 
2. శ్రీ లక్ష్మీ  గాత్రి మంత్రం

    ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్యైచ దీమహి తన్నో లక్ష్మీ  ప్రచోదయాత్


3. శ్రీ అన్నపూర్ణా  గాయత్రి మంత్రం

    ఓం అన్నపూర్ణా యై విద్మహే జగన్మాత్రేచ  ధీమహి తన్నో దేవీ   ప్రచోదయాత్


4.  శ్రీ లలితా గాయత్రి మంత్రం

     ఓం లలితా యై విద్మహే కామెశ్వర్యెచ  దీమహి తన్నో దేవీ  ప్రచోదయాత్


5.  శ్రీ బాల  గాయత్రి మంత్రం

     ఓం భువనే శ్యై  విద్మహే ఆధార శక్యై చ దీమహి తన్నో బాల : ప్రచోదయాత్


6.  శ్రీ సరస్వతి  గాయత్రీ మంత్రం

     ఓం సరస్వత్యై చ  విద్మహే బ్రహ్మ సత్యైచ  ధీమహి తన్నో వాణీ  ప్రచోదయాత్


7.  శ్రీ రాజ రాజేశ్వరి గాయత్రీ మంత్రం

     ఓం రజెశ్వర్యై చ విద్మహే భావాన్యై చ  దీమహి తన్నో దేవీ : ప్రచోదయాత్


8.   శ్రీ దుర్గా  గాయత్రి మంత్రం

      ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార్యై  చ  ధీమహి తన్నో దుర్గా : ప్రచోదయాత్


9.   శ్రీ శాంకరీ  గాయత్రి  మంత్రం

      ఓం శాంకర్యై  చ  విద్మహే దాంపత్య సుఖదాయై దీమహి తన్నో దేవీ  ప్రచోదయాత్


10.   శ్రీ కామాక్షీ  గాయత్రి మంత్రం    

      ఓం కాంచీపుర స్థాయై  విద్మహే మహాదేవ్యై చ  ధీమహి  తన్నో కామాక్షీ  ప్రచోదయాత్

11. శ్రీ శారదా  గాయత్రి మంత్రం

      ఓం ఐం బాలాంబికాయై  విద్మహే క్లీమ్ మహాబాలాయై  దీమహి సౌ: శారదా  ప్రచోదయాత్


12. శ్రీ తులసీ  గాయత్రి మంత్రం

      ఓం తులస్యై చ  విద్మహే విష్ణుపత్నై చ  ధీమహి తన్నో బృందా  ప్రచోదయాత్


13.  శ్రీ  చంద్ర  గాయత్రి మంత్రం

       ఓం సుధాకరాయ విద్మహే ఓషధీశాయ  ధీమహి తన్నో సోమ  ప్రచోదయాత్


14  శ్రీ కుజ గాయత్రి మంత్రం

      ఓం లోహితాంగా య విద్మహే భూమి పుత్రాయ ధీమహి తన్నో కుజ: ప్రచోదయాత్


15. శ్రీ బుధ గాయత్రి మంత్రం

      ఓం చంద్ర సుతాయ విద్మహే సౌమ్య గ్రహాయ ధీమహి తన్నో బుధ: ప్రచోదయాత్


16. శ్రీ గురు గాయత్రి మంత్రం

       ఓం సురాచార్యాయ  విద్మహే మహావిద్యా య ధీమహి  తన్నో గురు:  ప్రచోదయాత్


17. శ్రీ శుక్ర  గాయత్రి మంత్రం

      ఓం దైత్యా చార్యాయ విద్మహే శ్వేతవర్షాయ ధీమహి తన్నో శుక్ర:  ప్రచోదయాత్


18. శ్రీ శని  గాయత్రి మంత్రం

      ఓం శనేస్వరాయ విద్మహే శ్వేతవర్ణాయ దీమహి తన్నో శుక్ర: ప్రచోదయాత్


19. శ్రీ  రాహు  గాయత్రి మంత్రం  

      ఓం నీలవర్ణా య విద్మహే సింహికేశాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్


20. శ్రీ కేతు   గాయత్రి మంత్రం

     ఓం కేతుగ్రహాయ విద్మహే మహా వజ్రా య దీమహి తన్నో కేతు: ప్రచోదయాత్


21. శ్రీ గంగ  గాయత్రి మంత్రం

      ఓం విష్ణు సజ్జాయై విద్మహే పావనాయై చ ధీమహి తన్నో గంగా  ప్రచోదయాత్

..                                                                            


22. శ్రీ గణేశ గాయత్రి మంత్రం

    ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుణ్డాయ దీమహి తన్నో దన్తీ  ప్రచోదయాత్


23.  శ్రీ విష్ణు గాయత్రి మంత్రం

     ఓం విష్ణు దేవాయ విద్మహే వాసుదేవాయ దీమహి తన్నో విష్ణు: ప్రచోదయాత్


24.  శ్రీ కృష్ణ గాయత్రి మంత్రం

     ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ దీమహి తన్నో శ్రీ కృష్ణ: ప్రచోదయాత్


25.  శ్రీ నారసింహ గాయత్రీ మంత్రం

     ఓం వజ్రనఖాయ విద్మహే తీక్షణ దంష్ట్రాయ దీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్


26.  శ్రీ హయగ్రీవ గాయత్రీ మంత్రం

     ఓం జ్ఞాన ప్రదాయ విద్మహే హౌయగ్రీవాయ దీమహి తన్నో హరి: ప్రచోదయాత్


27.   శ్రీ బ్రహ్మ గాయత్రి మంత్రం

      ఓం వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ దీమహి తన్నో బ్రహ్మ: ప్రచోదయాత్


28.   శ్రీ ధాత్రీ గాయత్రి  మంత్రం

      ఓం సర్వం సహయ్యై విద్మహే లోకధాత్ర్యెచ దీమహి తన్నో ధాత్రీ ప్రచోదయాత్


29.   శ్రీ గోపాల గాయత్రి మంత్రం    

      ఓం గోపాలాయ విద్మహే గోపీజన వల్లభాయ ధీమహి  తన్నో గోపాల ప్రచోదయాత్

30. శ్రీ నారాయణ గాయత్రి మంత్రం

      ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ దీమహి తన్నో విష్ణు: ప్రచోదయాత్


31. శ్రీ నాగ గాయత్రి మంత్రం

      ఓం నాగారాజాయ విద్మహే శివ భూషాయ ధీమహి తన్నో నాగ: ప్రచోదయాత్


32.  శ్రీ శివ గాయత్రి మంత్రం

       ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్


33  శ్రీ రామ గాయత్రి మంత్రం

      ఓం ధాశరధాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర : ప్రచోదయాత్


34. శ్రీ ఆంజనేయ గాయత్రి మంత్రం

      ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్


35. శ్రీ భాస్కర గాయత్రి మంత్రం

       ఓం భాస్కరాయ విద్మహే ద్యుతికరాయ ధీమహి  తన్నో సూర్య  ప్రచోదయాత్


36. శ్రీ వెంకటేశ్వర గాయత్రి మంత్రం

      ఓం వేంకటేశాయ విద్మహే శ్రీ మన్నాధాయ ధీమహి తన్నో శ్రీశ:  ప్రచోదయాత్


37. శ్రీ వాస్తు పురుష గాయత్రి మంత్రం

      ఓం వాస్తు నాధాయ విద్మహే చతుర్భుజాయ దీమహి తన్నో వాస్తు ప్రచోదయాత్


38. శ్రీ క్షేత్రపాల గాయత్రి మంత్రం  

      ఓం క్షేత్రపాలయ విద్మహే క్షేత్రస్థితాయ ధీమహి తన్నో క్షెత్రీ ప్రచోదయాత్


39. శ్రీ అయ్యప్ప గాయత్రి మంత్రం

     ఓం  భూతనాధాయ విద్మహే మహావీరాయ దీమహి తన్నో శ్శా స్తా ప్రచోదయాత్


40. శ్రీ దత్త గాయత్రి మంతం

      ఓం త్రిగుణాత్మకాయ విద్మహే ధ్యాణ  నిష్టాయ ధీమహి తన్నో దత్త: ప్రచోదయాత్


41. శ్రీ సాయి గాయత్రి మంత్రం

      ఓం భక్త రక్షాయ విద్మహే దయా సీలాయ  దీమహి తన్నో సాయి ప్రచోదయాత్  23, అక్టోబర్ 2014, గురువారం

185. Life Story 88 (MALLAPRAGADA VAARI MANCHI MAATA)
నీవు ఓర్పుతో  అందరికి   మంచి  మాటలు  భోధించు
ఇతరుల మనస్తత్వమనుసరించి నడుచుట ప్రయత్నించు
నీది గుణం  మంచి  దై తే  సంతోషాల నిలయ మనుచు  
మనోనిగ్రహ శక్తిని పెంచే హనుమంతుని నీవు ఆరాధించు

కలమి  కలవాడు  కైలాస  వాసున్ని మరచు  
స్వంతబలమణి  భావించి  దేవున్నేదూషించు  
కలిమిపోయి బీదవాడైననాడు దేవున్నేప్రార్ధించు 
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట

తెరను  దాగిన  సత్యమును  తెలుసుకొనుటకు  ప్రయత్నించు 
దూరపు  కొండలు  నునుపు  కావని తెలుసుకొని  సంచరించు 
కనులకగుపడు దృశ్యమునుచూసి శాంతించుటకు ప్రయత్నించు
మల్లాప్రగడ  వారు మదిన నిలిచిన సత్యాన్ని  తెలియ  పరుచు

నావల్ల  కానిపని ఇది యని గట్టిగా  పలుకుచు 
బ్రహ్మ  చెప్పిన  ఈ  పనిని  చేయనని చెప్పుచు   
ధర్మముతోఉన్న పనితప్ప ఏపని చేయననుచు 
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట

మంచి  పని  చేసిన  ఎప్పటికి  కీడు   రాదనుచు 
చెడ్డ  పని  చేసిన మంచి ఏమిచేయలేక నిద్రించు 
ఇది మంచా, చెడా అని ఈ మానవులు బ్రమించు 
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట

విద్యలు అన్ని  నేర్చుకొని  సద్వినియోగ  పరచు
విద్యా దానం  చేసి  నలుగుర్ని   సంతోష  పరచు 
భాహుసత్కార్యాలు  ఫలితములేదని  గమనించు 
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట

ఎంత చదువు చదివిన పరుల మనసును గ్రహించు 
తరచి చదివిన మనుష్యులతో నీ స్నేహాన్ని  పంచు  
అందరుచదవాలి, బ్రతికి బ్రతికిన్చేదుకు చదువనుచు  
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట

 చెట్టు పై ఆకు పచ్చ   పక్షులన్నీ చిలుకలని వాదించు
పువ్వులపై వాలే పురుగులు తుమ్మెదలని వాదించు
 పై వాక్యాలు ధనవంతుడన్న బీదవాడు తలవూపుచు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట

దేహము భవసాగరమీద లేని కంప అనుచు
రోగము  తో   మ్రగ్గేడి     సేవక గంప అనుచు
శరీరము చలనము చెందేడి దుంప అనుచు
భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట

శృంగారము వేరు, బంగారం ఒక్కటే  అనుచు
మతములన్నియు వేరు, మార్గం ఒక్కటే అనుచు
జాతి, నీతులు వేరు, అందరి జన్మ ఒక్కటే అనుచు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట

వస్త్రభేదములు వేరు, దారము ఒక్కటే అనుచు
పశువుల రంగులు వేరు, పాలు రంగు ఒక్కటే అనుచు
పూలు వేరు, దేవునికి సమర్పించే పూలుఒక్కటే అనుచు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచి మాట

నీవు దేహాన్ని అనుసరించి మనస్సు చలించక చలించు
అందరిని నీ మనోభావం  తో  అర్ధం చేసుకొని   క్షమించు
ఆత్మ భావంతో ప్రతి  ఒక్కరిని  ఆదుకుంటు పలకరించు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట

జీవ జంతువులు  వేరు, జీవుండు  ఒక్కడే   అనుచు
దేవుని రూపాలు వేరు, అందరికి దేవుడొక్కడే అనుచు
పిల్లలబుద్ధి వేరు, తల్లితండ్రులకు అందరు ఒక్కటే అనుచు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట

కలకాలము  కాకి  నిలువక   కాకి వగచు
మనసులో మాట నిలువక స్త్రీలు చెప్పుచు
నిద్రలో కళ్ళు మూసుకొని కలలో నడుచు
వినుము   మల్లాప్రగడ మంచి మాట

తామసంబు   విడువకపోతే తత్త్వం తెలియ దనుచు
రాజసంబు  విడువక పొతే భక్తి    భావం  రాదనుచు
సాత్వికంగాఉంటె శాంతముతో మంచిమాట అనుచు
భారతీయులారా  మల్లాప్రగడ    మంచి   మాట

పురుషుడు  కోర్కలతో వెమ్పర్లాడుతు పలుకుచు
స్త్రీ  పురుషున్ని  కవ్వించి  నవ్వంచి  కనిక  రించు
స్త్రీ పురుషులు కలసి సృష్టి ధర్మానికి సహకరించు
భారతీయులారా  మల్లాప్రగడ  మంచి  మాట

నింగిలో  మేఘాలు గాలికి  కదులుచు
నీటిలో   దుంగలు తేలుచు కదులుచు
కాలంతో  ప్రజలు బ్రతకలేక బ్రతుకుచు
వినుము మల్లాప్రగడ మంచిమాట

                                                                                            మతములన్ని ప్రజలకు  మంచిని భోధించు
కలసి ఉండి నీ తెలివితో  మంచిని బ్రతికించు
మనసులు కలిస్తే మాటలన్నీ మంచిదనిపించు
వినుము మల్లాప్రగడ వారి మంచి మాట

నీవు స్త్రీని ఎప్పుడు అర్ధం చేసుకొని ప్రేమించు
పురుష  అహంకారం వదలి  స్త్రీని   పాలించు
పెద్దలు,గురువులు, కులదైవాలని భావించు
వినుము   మల్లాప్రగడ    మంచి మా ట

పెద్ద మనిషి అయిన స్త్రీ కి  పెళ్లి చేయాలని తలచు
అందరికి అందాన్ని  చూసి  మనసు పరుగెత్తించు
మూడు ముళ్ళు భంధం తో  జీవితాలు   చలించు
భారతీయులారా  మల్లాప్రగడ  మంచి  మాట

వయస్సులో వస్తున్న  మార్పులకు  కండలు పెంచు
యోగాసనాలు వేస్తు,  పౌష్టికాహారము  తీసుకొనుచు
మదన కోర్కలతో మనసు  మనస్సులో ఉండదనుచు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట

కన్నవారిని కాదను కోవటం అవివేకమని గ్రహించు
భార్యను సంతృప్తి పరచి సంతోషాన్ని  అనుభవించు
నీరు ఎక్కువత్రాగి, నడుస్తూ ప్రకృతి  గాలి  గ్రహించు
భారతీయులారా  మల్లాప్రగడ   మంచి   మాట

శిలగా ఉన్న దేవుణ్ణి ప్రార్ధించి, సజీవమ్గా ఉన్నవానిని ప్రేమించు
ఉషోదయకాలాన్ని గమనించి, నీవుఆశలకు పోకుండా జీవించు
నేయి దీపాలు వెలిగించి అందరిని ఆహ్వానించి  వేదాలు పటించు
వినుము భారతీయులారా మల్లాప్రగడ వారి  మంచి  మాట

యవ్వనంలో సమయం,శక్తి,  ఉంటాయి  డబ్బు  ఉండ  దనుచు
మద్యవయస్సులో డబ్బు శక్తి ఉంటాయి సమయం ఉండదనుచు
వృద్దాప్యంలో సమయం డబ్బు ఉన్న కష్టపడే శక్తి ఉండ  దనుచు
వినుము భారతీయులారా మల్లాప్రగడ వారి   మంచి  మాట

గుమ్మడితీగకు కాయలు పూలు బరువు కాదనుచు
ప్రతి  స్త్రీ 10 నెలలు మోసే గర్భం బరువు కాదనుచు
పిల్లలు తల్లి తండ్రులను పోషించాలంటే బరువనుచు
భారతీయులారా  మల్లాప్రగడ   మంచి   మాట

చెదలు పుట్టి కొయ్యను తినివేయు,  మందు వాడాలనుచు             నీచులతొస్నేహంకుటుంబంనాశనామ్,మంచినిప్రేమించు                                                   గడియారంలా పైనించి క్రిందకు,క్రిందనుంచి పైకి  సంచరించు
వినుము భారతీయులారా మల్లాప్రగడ వారి   మంచి  మాట

ధనం, అహం ఉన్న వారి మాటలు మూర్ఖముగా ఉండుననుచు
ధనం లేనివాడి మాటలు ఎప్పుడు  బీద  పలుకులు   పలుకుచు
మద్యస్తుడు ధనం ఖర్చు చేయుటకు మాటలు తికమక పడుచు
వినుము భారతీయులారా మల్లాప్రగడ వారి   మంచి  మాట

లక్ష్యం నిర్దిష్టంగా మనుష్యులు  కృషి చేయాలనుచు
కృషి ద్వారా సంకల్ప  సిద్ధికి  ప్రయత్నిమ్చాలనుచు
సంకల్పంతో దీక్షాబద్ధుడిగాఉన్న తోడు కావాలనుచు  
భారతీయులారా  మల్లాప్రగడ   మంచి   మాట

మనదేహం వైరు పై ఉండే కవరు లాంటి దనుచు
మన మనసు కవరులో ఉన్నరాగి వైరు అనుచు
భారతీయులారా  మల్లాప్రగడ   మంచి   మాట

ప్రశ్నిమ్చనిదే నిజమైన సమాధానము  దొరకదనుచు
ప్రయత్నిమ్చనిదే కోరుకున్నది ఎవ్వరకి  దక్కదనుచు
కాలాన్ని గమనించిమాటలు మాట్లాడితే మంచిదనుచు  
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట

దాంపత్య ధర్మంలో శృంగారం ఒక మెట్టనుచు
చెడుపై పోరాటంలో   వీరత్వమ్    చూపించు
ఎప్పుడునవ్వుల్లో సంతోషపడి సంతోషపరుచు
భారతీయులారా  మల్లాప్రగడ మంచి మాట


హృదయపు లోతు  ఆలోచనలను గమనించు
కొత్త   విష యాలను  అందరికి తెలియ పరచు  
దుర్మార్గాన్ని  ఎప్పుడు  నిర్భయంగా ఎదిరించు
భారతీయులారా  మల్లాప్రగడ మంచి మాట


నిజాన్ని  మెంగే రాజ్యమేలుతున్నా ధర్మంమనుచు
వెలుగుని మెంగే  వ్యాపారం చీకటి వ్యాపార మనుచు   
ప్రకృతిని మింగే కాలచక్రం ఇప్పుడు   వికృతి అనుచు
భారతీయులారా  మల్లాప్రగడ   మంచి   మాట


భర్తే  భార్యకు  నిజమైన   దేవుడనుచు
తల్లితండ్రులు పిల్లలకు గురువులనుచు
ఆదిత్యుడే అందరికి మార్గదర్శకుడనుచు  
భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట

అందరికివందనాలుసమర్పిస్తుదీపావళిశుభాకాంక్షలతో                                                                                       మదిలో మేదిలన మంచి భావాలను అక్షర రూపములో 

16, అక్టోబర్ 2014, గురువారం

184. Fastival Story -87 (DEPAVALI)

...........................  ఓం శ్రీ రాం .................. ........... ఓం శ్రీ రాం .................. ...........ఓం శ్రీ రాం .................. .....
           దీపావళి                                                   
ఏమిటా కుప్పి గంతులు, ఎవరన్నా చూస్తె నాటకాల కొంప అని అనుకుంటారు, కాస్త  శబ్దం తగ్గించుకొని  డా న్సుచేయుర మనవడా  అన్నాడు" తాత " తాతా రావు. కాఫీ అందిస్తూ అప్పుడే మీ మనవడ్ని అనటం మొదలు పెట్టారు, ఎమీ అనందే  మీకు నిద్ర పట్టదు కదా అన్నాది  "భార్య" తారా దేవి.
మనవడంటే ఎంతైనా ప్రేమ నీకు,  ఈగ  కూడా వాలనీవు వాడి మీద, అబ్బో అంటూ మీకు ప్రేమ లేనట్టు ముసి ముసి నవ్వులతో ముందుకు నడిచింది, ఇదిగో మర్చి పోయా, దీపావళి పండుగ దగ్గర పడుతున్నది, దీపావళి ట పాసులతో పాటు, కుంకుడి  కాయలు తేవటం మరవకండి, ఏవో సామ్పోలు  తెచ్చి, పోసుకోమంటే,  పోసుకొను అన్నది తార. 
అవునే కుంకుడి కాయ రసం కళ్ళల్లో   పోసుకుంటుంటే ఉంటుంది  మజా,  గుర్తుకొస్తాయినాకు   చాల్లెండి మీ సరసం అక్కడ మనవడున్నాడు, ఇంన్నేల్లువచ్చినా,  ఏమి మాట్లాడాలో,  ఏమి మాట్లాడ కూడదొ ఇప్పటికి మీకు తెలియదు, అన్నినేను పూస గుచ్చినట్లుచేపితే, పద్యం అప్పచెప్పినట్లు చెపుతారు మీరు,  కావలసినవి తీసుకురండి అన్నది తార. 
కాస్త శబ్దం ఆపరా,  దీపావళి సామాను   తీసు కొద్దామువస్తావా,  అన్న తడువుగా ఇదిగో వచ్చా తాతయ్య అన్నాడు, నేను ఆటం బాంబులు, డైనమేట్ బాంబులు, కాల్చుతాను,  మీరు నెల టపాకాయలు కాల్చండి తాత గారు అన్నాడు. నీకు ఏవి కావాలో అవే కొనుకుందానివి  అన్నాడు, ఇదిగో సంచి కుడా చేతిలో ఉన్నాది పదా తాతయ్య అన్నడు మనవడు మనోహర్ . 
తాతయ్య మన నడుస్తూ ఉండేటప్పుడు నీవు కధలుచేపుతవుకదా,  ఈరోజు నాకు దీపావళి  కధేమిటో చెప్పు  తాతయ్య , సరే చెపుతాను విను . 
శ్రీ మహాలక్ష్మీ దేవికి ప్రత్యెక పూజలు పండుగ, ఈరొజు మహాలక్ష్మీదెవిని దీపం తొరణాలతొ స్వాగతం పలకాలి. దీపాలు వెలిగించిన ఇంటికి లక్ష్మీ దేవి ఖచ్చితంగా వస్తుంది. కొందరు దీపావళి రోజున అర్ధ రాత్రి సమయాన లక్ష్మీ దేవిని పూజిస్తారు. అంటే మంచినీరు త్రాగ కుండా కుడా పూజ చేస్తారు,  నిర్జల వ్రతం అంటారు, పూజ తర్వాత పాలు పలహారం తీసుకుంటారు. ఈనాడు తులారాసిలోనికి సూర్యుడు  ప్రవేసిస్తాడు, కావున ఈ అమావాస్య విశిష్ట దినంగా భావించి, లక్ష్మీదేవికి బంగారు నగలు పెట్టి, వెండి, బంగారు  నాణాలతో పూజిస్తారు.  మా మనసులో ఉన్న అజ్ఞాన అంధ కారాన్ని తొలగించి జ్ఞానం ప్రసాదించమని వేడుకుంటారు, ఇంటి వాకిలి  మొత్తం, తులసి చెట్టు వద్ద,  ఆవునేయి దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్ఫానిస్తారు. దీపావళి రోజున వ్యాపారస్తులు కొత్త పద్దు పుస్తకాలను ప్రారంభించి ధన, కనక, వస్తు, వాహనాలను పూజించి, జాతకఫలితాల్ని చెప్పించుకొని దానికి అనుగుణంగా వ్యాపారం చెస్తారు.  దీప మహిమ  కూడా  చెపుతాను విను 
దీపమహిమ:                                                                                

‘‘దీపం జ్యోతి పరబ్రహ్మ                                                                  దీపంజ్యోతి జనార్ధన
దీపేన హారతే పాపం                                                                   

దీపలక్ష్మి నమోస్తుతే’’


                                                                                             
           హిందూ సంస్కృతిలో దైవ కార్యాన్ని ప్రారంభించే ముందు దీపం వెలగించి దీపారాధన చేసి ప్రారంభిస్తాము. గృహణ మంగళం దీపం అన్నారు. ఇంట్లో దీపం పెట్టడం ఇంటికి మంగళప్రదం. దీపం ముల్లోకాలలోని చీకట్లను పారద్రోలుతుంది. నరకబాధలను నివారిస్తుంది. దీపంజ్యోతికొక దివ్యశక్తి ఉంది. అందుకే పరమాత్మను జ్యోతిర్మయ స్వరూపుడని అంటారు. అటువంటి పరబ్రహ్మ స్వరూపమైన దీమును ప్రతి ఇంట ఉదయము, సాయంకాలం తప్పక వెలిగించి మానసికానందం, శరీరారోగ్యమును పొందడం ఎంతైనా అవసరం. స్త్రీలకు ఈ దీపారాధన సౌభాగ్యకరం.   దీపావలి కధను ఆడియో, వీడియో చూడు బాగా అర్ధం అవుతుంది  అన్నాడు తాత్తయ్య,అట్లాగే తాతయ్య అన్నాడు మనోహర్   
                                                
భారత దేశ మంతట ప్రజలు మతాబులువెలుగు జిలుగులలాంటి  జీవన సౌఖ్యాలను, చిచ్చుబుడ్ల  వేలుగుల లాంటి  జీవనాభివృద్ధిగమనాన్ని సాగించాలనీ, అజ్ఞానమ్ లోను , కష్ట ములలోను  ఉన్న ప్రజలకు  ఈ దీపావళి  తెలివిని తెప్పించి, వారి జీవితాలు సుఖవంతంకావాలని కొరుకుంటు ఈ దీపావళి  పండుగను జరుపుకుందాం

దీపమ్   జ్ఞాన చిహ్నం
దీపమ్   జ్యోతి పరబ్రహ్మం
దీపమ్ వేలుగు పాపనాశనం
దీపమ్ వెలుగుతో చేస్తారునిర్జల వ్రతం

గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి,  ఇల్లంతా   దీపాలతొ  కళ కళ 
తలంటి పోసుకొని, తెల్లని పట్టు వస్త్రములతొ ఇంట్లో అందరు కళ కళ
స్పెషల్ వంటలతో, భందువులతో కలసి సంబరం చేసుకొనే  కళ కళ
పండుగనాడు తారా జువ్వల వెలుగుల్లో   బాంబుల శబ్దాలతో గలగల

ప్రతిఒక్కరు ఆనంద పారవశ్యం లో మునిగి తేలాని, సుఖ సంతోషాలతో జీవించాలని లక్ష్మి దేవి కృప కటాక్షము అందరికి ఉండాలని దీపావలి సందర్భముగా అంతర్జాల ప్రాంజలి ప్రభను ఆదరిస్తున్న వారిని పేరుపేరునా శుభాకాంక్షలు తెలియ పరుస్తున్నాను. నాకు సహకరిస్తున్న గూగుల్,ఫేస్ బుక్ యాజమాన్యానికి శుభాకాంక్షలు ఇందు మూలముగా తెలియపరుస్తున్నాను 

ఇట్లు మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ

                            ‘‘దీపం జ్యోతి పరబ్రహ్మ                                   దీపంజ్యోతి జనార్ధన
            దీపేన హారతే పాపం                                                                   

దీపలక్ష్మి నమోస్తుతే’’నింగినుండి భువికి దిగిన తారావళి
నింగిలో చీకట్లో తారాజువ్వల లోగిలి
ఆనందంతో అందరు కలుసుకొనె కౌగిలి
ఇంటింటా లక్ష్మి దేవిని పూజించె దీపావళి       

అంధకారాన్ని   దీపపు  వెలుగులతో తరమాలి
మనం దీపారాధన చేసి దేవుణ్ణి ప్రార్ధన చేయాలి
దీపకాన్తి ఊర్ధమ్, మన దృష్టి ఊర్ధ్వమ్గా ఉండాలి
మనస్సు ప్రశాంతత కల్పించాలని దేవుణ్ణి కోరాలి

అజ్ఞానంతో  ఉన్న  నరకున్ని తల్లే సంహరించిన నాడు
రావణున్నివధించి రాముడు అయోధ్యకు వచ్చిననాడు
అజ్ఞాతవాసం నుండి  పాండవులు తిరిగి  వచ్చిన నాడు
అందరు  కలసి దీపాలు పెట్టి టపాసులు కాల్చిన  నాడు      


ఆడపడుచుల   కేరింతలతో    దీపావళి  శోభ
స్త్రిలు ముత్యాల  ముగ్గులు వేసి  తెస్తారు శోభ
అందరూ   కలసి  టపాసులు కాల్చుతూ శోభ
ప్రపంచ సొదర,సొదరీమనులుచేసే పండుగ శోభ


నా వాక్కు  మనస్సు  లో    ప్రతిష్టితం   గాక
మనస్సు   వాక్కులో    ప్రతిష్టితం  అగు గాక
దేవత అంతరాత్మ ఐ నాలో ప్రకాశిమ్చు  గాక
నేను నేర్చుకున్నది, విన్నది, వీడకుండు గాక

నేర్చుకున్న మంచిని సదా మననం చేస్తాను గాక
నేను   ఎప్పుడు సత్యాన్ని,  పలుకుతాను   గాక
నేనుచీకటిని తరిమే దీపాన్నిరోజూ వెలిగించు గాక
ప్రతి ఒక్కరిని లక్ష్మి దేవి అందర్నీ రక్షించు గాక
                                             
                        శ్రీ కృష్ణ పరమాత్ముని కరుణాకటాక్ష వీక్షణాలు అందరిపై ప్రసరిమ్చాలనీ, అందరికి  ఆ దేవదేవుడు ఆయ్యురా రోగ్యఐశ్వర్యాలు ప్రసాదించాలనీ ఆకాంక్షిస్తూ  .......

జ్యోతిషామపి తజ్జ్యోతి: తమన: పరముచ్యతే
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య  విష్టితం: (భగవత్ గీత -13.17)

"జ్యోతులకు
జ్యోతి ఐ, తమస్సునకు పరమై, జ్ఞానమూర్తి  ఐ, జ్ఞేయశ్వరూపమై,  ప్రతి ప్రాణి హృదయ కోసములొ  విరాజిల్లేది ఆత్మ జ్యోతి "
ఆ ఆత్మ జ్యోతిని తెలుసుకొనేందుకు ప్రయత్నం చేసినవాడే వాస్త
వానికి దీపావళి పండుగకు పరమార్ధం చెకూరగలదు.
భాహ్యంగా దీపాలు వెలిగిస్తూ అంతరంగ దుష్టకార్యాలను చేయకండి, సత్ ప్రవర్తనతో, ధర్మమార్గంలో  నడిచిన నాడు 
ఆన్తరింగిక జ్యోతి ని మనం చూడగలము,       
                                                 


భారతదేశ ప్రజలందరికి, మరియు ప్రపంచ దేశాలలో నివసించు ప్రజలందరికి దీపావళి శుభాకాంక్షలతో ......... 
మీ  మల్లాప్రగడ రామకృష్ణ , ఎ.టి. ఓ , డిస్ట్రిక్ట్ ట్రెజరీ ,నిజామాబాద్ ,తెలంగాణ,ఇండియా  .  

12, అక్టోబర్ 2014, ఆదివారం

183. Gold Parents Story -87 (అంతర్జాతీయ వృద్ధుల దినోత్చవం)

                          ఓం... శ్రీ... రాం ...                ఓం... శ్రీ... రాం ...            ఓం... శ్రీ... రాం ...
ప్రాంజలి ప్రభ

                                         సర్వేజనా సుఖినోభవంతు
(అక్టోబర్ "1" తేది అంతర్జా తీయ "వృద్దుల దినోత్సవం సందర్భంగా వ్రాసిన వ్యాసం ) " ప్రతి ఇంట్లో దీపాల వెలుగు "


అరుణ కిరణములనుండి వెలుగు రేఖలు ప్రసరించినట్లు,  తల్లి తండ్రుల  చూపులు  యొక్క కిరణాలు కుటుంబ మంతా  విస్తరిస్తాయి,  తామరలు భాను కిరణాలకు  వికసిమ్చినట్లుగా, కుటుంబ సభ్యు లందరూ ఆనందముతో, ఆరోగ్యం గా , ఉల్లాసంగా ఉత్చాహంగా ఉండ గలుగుతారు,  మన సాంప్ర దాయము ప్రకారము తల్లితండ్రులను పూజిమ్చి ఆద రించటమే మన కర్తవ్యం. మన సంస్కృతి.   


ప్రపంచం మొత్తంలో 12వృద్ధులు 15 కోట్లు పైగా ఉన్నట్లు కొన్ని అంచనాల వాళ్ళ తెలిసింది. వృద్దాప్యం అనేది అందరికి రావటం సహజం, వృద్దులమయ్యము మనము దేనికి పనికి రాము అని భావించుట తప్పు, నిజానికి  ఎవ్వరూ అంత భాధ   పడాల్సిన అవసరం లేదు, కాల ప్రభావంతో ప్రాప్తించే శారీరక రుగ్మతలతో కాస్త అసౌకర్యం కలిగినా, మానసికంగా ఉచ్చాహంగా ఉండ కలగాలి, వయస్సులో వచ్చే ప్రతి సవాలును ఎదుర్కొవాలి, యుక్త వయస్సులో కన్న వృద్దాప్యంలో ఎక్కువ శక్తి, అనుభవము ఉంటుంది.  మనము ఎందుకు పనికిరామని అను కోకండి, పిల్లల పంచనే ఉండి పిల్లలకు సేవ చేయాలని అనుకోవటమే తప్పని, వారు పెడితేనే మేము తినగలుగు తున్నామని అనుకోవడము కుడా తప్పు.  కాలానికి అనుగుణంగా మారక చాదస్తంగా విసిగిస్తే ఎవరైనా    వృద్దులని చూడక నోటికి వచ్చినట్లు మాట్లాడుతారు,  కనుక చెట్టుపై పండులా ఉండాలనే అనేది నా భావన.     
                    వృద్ధులు బి.పి. లేకుండా సుఖముగా నడచి వేలుతున్నప్పుడు, ఎవరైనా కర్ర లేకుండా, కళ్ళజోడు లేకుండా, సుఖముగా పోతున్నారే  అని  అంటే , ఆ వృద్ధులకు  ఏర్పడుతున్నది, అనారోగ్యముతో పెద్ద వయసులో హాస్పటల్  కు వెళ్ళితే డాక్టర్  జబ్బులు తగ్గవు,  రేపోమాపో పోయేవారే కదా అని డాక్టర్ అంటే కొత్త వ్యాది ఏర్పడుతున్నాది, పెద్ద వయసులో సాహిత్య అభిమాని తనవంతు తన అను భవాలను కధలుగా వ్రాస్తూ ఉంటె వారిని ఈ వయసులో కృష్ణ, రామ అనక ఏమిటి ఆ కధలు వ్రాయటం అంటే వారికి కొత్త వ్యాధి ఏర్పడక తప్పదు.

సుఖముగా ఉన్న వృద్ధులను మీరు జీవితానికి సంభందించిన అన్ని ఫిలాసిఫీలను వదలి పెట్టాలన్నా, సిద్ధాంతాలను వదిలిపిట్టాలన్నా, ఆదర్శాలను వదిలి పెట్టాలన్నా, లేక పొతే మీ మనుగడకే కష్టము అన్నా, మీ మాటలు పట్టించుకోకుండా ఉన్నా, మీరు  జీవించాలను కుంటే  ఒంటరిగా  జీవించటానికి ప్రయత్నం చేయాలి, మీరు సంతోషంగా ఉండి , ఇతరులను సంతోష పెట్టుతూ ఉండాలి, మీరు ఎదుటివారికి ఆనందం ఇవ్వలేకపొఐనా పరవాలేదు కాని వారి ఆనందాన్ని చెరిపి వేయకపోతే అదే పదివేలు,  వృద్ధులు ఒకరి కొకరు కలసి మెలసి జీవితము ను పంచుకుంటే సుఖము సుఖము తప్పక ఉంటుంది.

వృద్ధులైన తమ స్వతంత్రభావాలు మానుకొని జీవించ కూడదు, ఈ దేశంలో ప్రతి 10 మంది  వృద్ధులలో ఇద్దరు ఒంటరిగా జీవిస్తున్నారు, కొందరు శారిరక హింసకు పాల్పడటం, కుటుంబ సభ్యు లే వృద్ధుల పాలిట  శత్రువులవు తున్నారు,  కొందరు కొడుకుల భాదను తప్పించుకొనుటకు,  వృద్దాశ్రమం లొ చేరుతున్నారు, కొడుకులే చేర్చి పట్టించుకోకుండా తిరుగు తున్నారు.

 దేశంలో వృద్ధులను పట్టించుకోని పిల్లలను శిక్షించే విధముగా ఒక చట్టము 2007 లో తెచ్చారు, తల్లి తండ్రులను పట్టించుకోని వారికి మూడు  నెలలు జైలు శిక్ష, ఇదు వేలు జరిమానా విధించే హక్కు చట్టముకున్నాది, ప్రభుత్వము  వారు వృద్ధులకు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు.  ఒదిశా రాష్ట్ర ప్రభుత్వం వ్రుద్దులకోరకు అంగన్ వాడి కేంద్రం  ద్వారా ఉచిత భోజనము అందిమ్చుతున్నారు ,  హర్యానాలో, తమిళనాడులో వృద్ధుల కొరకు సంక్షేమ పధకాలు అమలు పరుస్తున్నారు.
మోజు తీరగనె వేసేది కాదు మూడు  ముళ్ళ భంధం
ముసలి తనంలో కూడా మనసేరిగి  ఉండేది మాంగల్య భంధం
జన్మనిచ్చిన తల్లితండ్రులకు సేవచేయట పుత్రికా పుత్రుల  ధర్మం
వార్ధక్యం లో ఉన్నవారు పసి పిల్లలతో సమానం, ఆదరించుట ఆందరి  ధర్మం 
   
మా హృదయాన్ని నందన వనంగా మార్చిన వారు మీరు                        మాతో నవరాగములు పలికించి  నడిపించిన వారుమీరు                            మమ్ము కాలానుగుణంగా చదివించిన మార్గదర్శకులు మీరు               వృద్దులైన మీకు సేవ చేయుట మాభాద్యతగా భావిస్తాము మేము                     
 భద్రతా లేదని, అభద్రతా భావంతో ఉండద్దు మీరు                          నిర్భయంగా ధైర్యంగా, శాంతి సౌఖ్యాలతో ఉండాలి మీరు                       దైవాన్ని ప్రార్ధిమ్చుతు,  మమ్ము కాపాడి రక్షించే వారు మీరు  తప్పులేమన్న చేసిన క్షమించమని వేడుకుంటున్నాము మేము

   

7, అక్టోబర్ 2014, మంగళవారం

182. Family Story -86 (Rent House )

                                ఓం... శ్రీ... రాం ...                ఓం... శ్రీ... రాం ...            ఓం... శ్రీ... రాం ...

                                                                           
 (అద్దె ఇంటిలో అగచాట్లు )                                                                          
.    ఏమండి మీరు జాగర్తగా వెళ్ళండి,  అసలే ఎక్కడ చూసిన యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి,  మీ సెల్ ఫోన్ ఎప్పుడూ  చార్జిలో పెట్టుకోండి, మీరు దిగిన తర్వాత  ఫోన్ చేయుట మరవకండి, అసలే నాకు బి.పి. ఎక్కువ, మీ ఫోన్ కోసం ఎదురు చూస్తు ఉంటాను,   ఇప్పటి దాక మనం భాగ్యనగరంలో ఉన్నాము, ఇప్పుడు అనుకో కుండా  చిలకలూర్ పాటలో  ఉద్యోగము  చేయాల్సిన పరిస్తితి వచ్చింది. ఇక్కడ ఉన్న పిల్లలు చదువులు పూర్తి ఐన  తర్వాత నేను కుడా అక్కడకు వస్తాను అన్నాది భార్య జానకి

 అద్దెకు  ఇల్లు తీసుకున్దామనుకున్నాడు, వాళ్ళు పెట్టిన షరతులు చూసి ఆశ్చర్య పోవటం తప్ప ఎమీ చేయలేక పోయాడు, రాత్రి 9 గంటలకల్లా తలుపులు వేసేస్తామని, గోడలకు మేకులు కొట్ట  కూడదని, రోజుకు ఒక్కసారే మోటారు వేస్తామని, పని మనిషిని పెట్టు  కోకూడదని,  ఒక వెళ పెట్టు కుందామని అనుకున్నక్రింద వెనుక భాగములో అంట్లు తోముకోవాలి, బట్టలు ఉతికిన్చుకోవాలి అని షరతు పెట్టారు,  గ త్యంతరం లేక ఆ ఇంటిలో అడ్వాన్సు ఇచ్చి మరీ చేరాడు . ఆ విషయం  జానకి చెప్పగా అదేమీ ఇల్లండి, డాబానే మెదటి ప్లోర్ అన్నాడు నవ్వుతూ జానకితో, మన మేప్పుడైన సినమా పోవాలంటే  కష్టం కదండి, అక్కడే  ఉంటూ  మరేదైన అన్ని వసతులు ఉన్న ఇల్లు ఉంటె చూడండి అన్నది జానకి.జాగర్తగా రండి రేపు ఆదివారము నేను కుడా ఇక్కడ అన్ని సర్ది, మీతొ వస్తాను, ఇద్దరం కలసి వేరే ఏదైనా ఇల్లు చూద్దాము అన్నాది జానకి. 

మొన్న అఫీసులొ ఒక్కరవ్ ఆలస్యమైనది,  ఆరోజు వస్తున్నప్పుడు వాన కూడా వచ్చింది, ఇంటికి చేరి తాళం తీయగానె కరంటు పోయింది, కొవ్వత్తులు కనబడలేదు అందుకని ప్రక్క ఇంటిలో వారిని అడుగుదామని పోయాను, ముసలావిడ వచ్చి బాబు బాగా తడిసి నట్లు  వున్నావు, ముందు ఈ టవల్ తో  తుడుచుకో అన్నది,  కూర్చొని తుడుచుకో బాబు అన్నది, ఆ చీకట్లో  కాలి అందెల  సవ్వడికి తలని గుమ్మం వైపు చూసాను .. అక్కడ ఒక సుందరి కనిపించింది,  ఆ సుందరి నాకు వేడి  ' టి  ' ఇచ్చింది ఆమెను  కన్నెత్తి చూడ లేక పోయాను, ఎందుకంటే ఆమె చూపులు అదోరకంగా ఉన్నాయి,  భయము భయముగా కూర్చొని కొవ్వొత్తిని అగ్గిపెట్టి తీసుకొని వచ్చి వెలిగించాను, కరంటు రాలేదు, అంతా  చీకటిగా ఉన్నది, ప్రక్క గదిలో  నవ్వులు వినబడు తున్నాయి  స్త్రీ నవ్వులు  మరియు పురుషుడి నవ్వులు, మూలుగులు, మంచం చప్పుళ్ళు వినబడ్డాయి,   ఎప్పుడు నిద్రపోయానో నాకే  తెలీదు,  తెల్లారి చూస్తె  ముసలావిడ లేదు ఆ సుందరి లేదు, ఎందుకైనా మంచిదని ఇంటివారిని అడిగాను ముసలావిడ వాళ్ళ అమ్మాయి అల్లుడు ఉంటారు అన్నది, మరి అల్లుడేడి, ముసలావిడ ఏది, ఆ సుందరి ఏది అని అడిగాను  ఇంటావిడను,   మేమే చూడలేదు ఎక్కడకు పోయారో అన్నది.  వారికీ మీరు అద్దెకు ఎందుకిచ్చారని గట్టిగ అడిగాను, ఏమో బాబు డబ్బు కోసం అన్నారు వారు, డబ్బు కోసం గడ్డి తినమంటే తింటారా అని అరిచి వచ్చాను  

ఆఫిసునుండి ఇంటికి వచ్చాడు తాళం తీసాడు. అంకుల్ రండి అంటూ బర్తడే పార్టి అంటూ పిలిచారు ప్రక్క ఇంటి వారు. ఒక వైపు మైకులు పెట్టి హంగామా చేస్తున్నారు. బర్తుడేకు ఇంత ఖర్చు అవసరమా అని అడిగాను. చూడండి మీరు కొత్తగా వచ్చినట్లున్నారు, ఈ డాబా పైన ఈ కాలనీలొ ఉన్న వారందరూ ఫన్షన్ ఇక్కడే చేస్తారు ఇది మా అలవాటు అన్నడు ఒక పెద్దమనిషి. నేను లోపలకు పోతున్నా మైక్ సౌండ్  తగ్గించుకొని ఫన్షన్ చేసుకోండి అన్నాడు రామశర్మ,  నే చెప్పే విషయాలు వినండి, 6 నెలలు పెడితే మీకు మరళ  ఇక్కడకు ట్రాన్సఫర్ అవుతుంది, మనం విడి విడిగా ఉండటం అంత  మంచిదికాదు,  పిల్లల చదువు దృష్ట్యా ఇప్పుడు కుదరదు,  షుగర్, బిపి ఉన్నాయి మీకు, ఇపుడే పాపర్ల్లో కధ చదివాను విడివిడిగా ఉంటె మనుష్య్యులు మృగాలుగా మారుతారని నాకు తెలిసింది, ఏమిటే ఆ కధ అని అడిగాడు భర్త రామ శర్మ చెపుతా వినండి 
హైదరాబాద్ లోని ఆల్వాలుకు చెందిన అల్లూరి రాఘవేంద్ర   గురుప్రసాద్ కు (42)  ఇక్ఫాయ్ యూనివర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫిసర్,  ఆనందభాగ్ కు   చెందిన   సుహాసిని (38) ఐ .టి . కమ్పెనీలొ ఉద్యోగం, వీరికి  2004 లో వివాహమైనది. వీరికి  పిల్లలు వారి పేర్లు విరించి (9), నంద కిషోర్ (5) వీరిద్దరు బొఐనపల్లిలొని సెయింటు  ఆన్ద్రూస్ స్కూల్లొ చదువు తున్నారు  ఒక సంవస్చరం వీరిద్దరి మద్య గొడవ వచ్చింది, సుహాసిని భర్త వేదిస్తున్నాడనికేసు పెట్టింది,  రాజీ కుదరక విడాకులకోసం న్యాయస్తానాన్ని ఆశ్రయిమ్చారు, విడాకుల కేసు విచారణలో  ఉన్నది, పిల్లలు సుహాసిని వద్ద విడిగా ఉంటున్నారు , గురుప్రసాద్ ఫ్యామిలి  కోర్టును ఆస్రయించాడు, వారు మొదటి శని, ఆదివారములలో, మూడో  శనివారములో ఉదయం 9 గంటల నుండి   1 గంటవరకు తండ్రి వద్ద  పిల్లలు ఉండవచ్చని తీర్పు  ఇచ్చారు, ఆవిధముగా కొన్ని నెలలు జరిగినతర్వాత మొన్న మనస్తాపంతో గురుప్రసాద్ రైలు క్రింద పడి  ఆత్మా హత్య చేసుకున్నాడు అన్నది జానకి . 
ఏమిటి పిల్లలను చంపేసాడ అని అడిగాడు భర్త అట్లా ఇట్లా గాదు మరీ క్రూరమ్గా పాలల్లో మత్తు మందు కలిపి పిల్లలకు త్రాగించాడు,తాడు తీసు కొచ్చికొంతుకు ఉరి వేసాడు, ఇంకా చావక పొతే   ఆ పిల్లలను ముందుగా త్రవ్వి ఉంచిన తన సొంత  స్తలం వద్దకు తెచ్చి (మేడ్చల్ లోని బీరప్పగూడ  రైల్వే స్టేషన్ దగ్గర) కొబ్బరికాయ కొట్టే కత్తితో మెడలు నరికి గుంటలో పూడ్చి పెట్టి నట్లు పొలీసుల పరిశోధనలో తేలింది. 
ఎందుకె అంత  కిరాతకంగా చంపేసాడు చని పోయే ముందు ఉత్తరాలు కూడా వ్రాసాడు 1. సెక్షన్ 498(ఏ) (వరకట్న వేధింపులు, గృహహింస భర్తపై  పెట్టె  కేసు) మీద ఇప్పటికైనా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసు కుంటుందని  ఆశిస్తున్నాను, నీకు నేను అవసరములేదు, పిల్లలు అవసరములేదు, నీకు భందువులే ముఖ్యం, అందుకనే నామూలాలె నీకు లేకుండా చేస్తున్నాను నన్ను క్షమించు ఇంకా అనేక ఉత్తరాలు భార్యకు వ్రాసాడు, చనిపోయేముందు అని తెలుసుకున్నారు పొలిసులు. 
ఎందుకంటే భార్య భర్తలు ఒకరిని ఒకరు అర్ధం చేసుకొని జీవిమ్చటమె భారతీయుల సాంప్రదాయము, మొగవారు కాని ఆడవారు కాని ఒంటరిగా వేరు వేరు గా ఉంటె ఈ లోకం అనేక కధలు అల్లుతుంది, లొంగదీసు కోవటానికి అవకాశవాదులు ఎదురు చూస్తూ ఉంటారు, అందుకనే ఒంటరిగా అద్దె ఇంట్లో ఒక్కేరే ఉండొద్దని మిమ్మల్ని సెలవుపెట్టి రమ్మనమన్నాను భయంతో.  నామీద నమ్మకము లేదా నీకు, నమ్మకము ఉన్నది కాబట్టే ఇన్నళ్ళు మీతొ కాపురం చేస్తున్నాను 
ఎందుకుండరు రెండు కాపురాలు పెట్టినట్లు కూడా మీరు పాపర్లో చదువుతున్నారు కదా, కొందరు నిగ్రహనా శక్తితో అద్దె ఇంటిలో ఒంటరిగా ఉండి బ్రహ్మా చర్యం  చెడిపోకుండా ఉండే వారున్నారు. అందుకనే అన్ని వసతులు ఉన్న సింగల్ పోర్షన్ లో ఇద్దరం కలసి పిల్లలతో ఉందాం, అప్పటి దాక నా మాట వింటారు కాదు అని భార్య జానకి అన్నాది.