7, అక్టోబర్ 2014, మంగళవారం

182. Family Story -86 (Rent House )

                                ఓం... శ్రీ... రాం ...                ఓం... శ్రీ... రాం ...            ఓం... శ్రీ... రాం ...

                                                                           
 (అద్దె ఇంటిలో అగచాట్లు )                                                                          
.    ఏమండి మీరు జాగర్తగా వెళ్ళండి,  అసలే ఎక్కడ చూసిన యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి,  మీ సెల్ ఫోన్ ఎప్పుడూ  చార్జిలో పెట్టుకోండి, మీరు దిగిన తర్వాత  ఫోన్ చేయుట మరవకండి, అసలే నాకు బి.పి. ఎక్కువ, మీ ఫోన్ కోసం ఎదురు చూస్తు ఉంటాను,   ఇప్పటి దాక మనం భాగ్యనగరంలో ఉన్నాము, ఇప్పుడు అనుకో కుండా  చిలకలూర్ పాటలో  ఉద్యోగము  చేయాల్సిన పరిస్తితి వచ్చింది. ఇక్కడ ఉన్న పిల్లలు చదువులు పూర్తి ఐన  తర్వాత నేను కుడా అక్కడకు వస్తాను అన్నాది భార్య జానకి

 అద్దెకు  ఇల్లు తీసుకున్దామనుకున్నాడు, వాళ్ళు పెట్టిన షరతులు చూసి ఆశ్చర్య పోవటం తప్ప ఎమీ చేయలేక పోయాడు, రాత్రి 9 గంటలకల్లా తలుపులు వేసేస్తామని, గోడలకు మేకులు కొట్ట  కూడదని, రోజుకు ఒక్కసారే మోటారు వేస్తామని, పని మనిషిని పెట్టు  కోకూడదని,  ఒక వెళ పెట్టు కుందామని అనుకున్నక్రింద వెనుక భాగములో అంట్లు తోముకోవాలి, బట్టలు ఉతికిన్చుకోవాలి అని షరతు పెట్టారు,  గ త్యంతరం లేక ఆ ఇంటిలో అడ్వాన్సు ఇచ్చి మరీ చేరాడు . ఆ విషయం  జానకి చెప్పగా అదేమీ ఇల్లండి, డాబానే మెదటి ప్లోర్ అన్నాడు నవ్వుతూ జానకితో, మన మేప్పుడైన సినమా పోవాలంటే  కష్టం కదండి, అక్కడే  ఉంటూ  మరేదైన అన్ని వసతులు ఉన్న ఇల్లు ఉంటె చూడండి అన్నది జానకి.జాగర్తగా రండి రేపు ఆదివారము నేను కుడా ఇక్కడ అన్ని సర్ది, మీతొ వస్తాను, ఇద్దరం కలసి వేరే ఏదైనా ఇల్లు చూద్దాము అన్నాది జానకి. 

మొన్న అఫీసులొ ఒక్కరవ్ ఆలస్యమైనది,  ఆరోజు వస్తున్నప్పుడు వాన కూడా వచ్చింది, ఇంటికి చేరి తాళం తీయగానె కరంటు పోయింది, కొవ్వత్తులు కనబడలేదు అందుకని ప్రక్క ఇంటిలో వారిని అడుగుదామని పోయాను, ముసలావిడ వచ్చి బాబు బాగా తడిసి నట్లు  వున్నావు, ముందు ఈ టవల్ తో  తుడుచుకో అన్నది,  కూర్చొని తుడుచుకో బాబు అన్నది, ఆ చీకట్లో  కాలి అందెల  సవ్వడికి తలని గుమ్మం వైపు చూసాను .. అక్కడ ఒక సుందరి కనిపించింది,  ఆ సుందరి నాకు వేడి  ' టి  ' ఇచ్చింది ఆమెను  కన్నెత్తి చూడ లేక పోయాను, ఎందుకంటే ఆమె చూపులు అదోరకంగా ఉన్నాయి,  భయము భయముగా కూర్చొని కొవ్వొత్తిని అగ్గిపెట్టి తీసుకొని వచ్చి వెలిగించాను, కరంటు రాలేదు, అంతా  చీకటిగా ఉన్నది, ప్రక్క గదిలో  నవ్వులు వినబడు తున్నాయి  స్త్రీ నవ్వులు  మరియు పురుషుడి నవ్వులు, మూలుగులు, మంచం చప్పుళ్ళు వినబడ్డాయి,   ఎప్పుడు నిద్రపోయానో నాకే  తెలీదు,  తెల్లారి చూస్తె  ముసలావిడ లేదు ఆ సుందరి లేదు, ఎందుకైనా మంచిదని ఇంటివారిని అడిగాను ముసలావిడ వాళ్ళ అమ్మాయి అల్లుడు ఉంటారు అన్నది, మరి అల్లుడేడి, ముసలావిడ ఏది, ఆ సుందరి ఏది అని అడిగాను  ఇంటావిడను,   మేమే చూడలేదు ఎక్కడకు పోయారో అన్నది.  వారికీ మీరు అద్దెకు ఎందుకిచ్చారని గట్టిగ అడిగాను, ఏమో బాబు డబ్బు కోసం అన్నారు వారు, డబ్బు కోసం గడ్డి తినమంటే తింటారా అని అరిచి వచ్చాను  

ఆఫిసునుండి ఇంటికి వచ్చాడు తాళం తీసాడు. అంకుల్ రండి అంటూ బర్తడే పార్టి అంటూ పిలిచారు ప్రక్క ఇంటి వారు. ఒక వైపు మైకులు పెట్టి హంగామా చేస్తున్నారు. బర్తుడేకు ఇంత ఖర్చు అవసరమా అని అడిగాను. చూడండి మీరు కొత్తగా వచ్చినట్లున్నారు, ఈ డాబా పైన ఈ కాలనీలొ ఉన్న వారందరూ ఫన్షన్ ఇక్కడే చేస్తారు ఇది మా అలవాటు అన్నడు ఒక పెద్దమనిషి. నేను లోపలకు పోతున్నా మైక్ సౌండ్  తగ్గించుకొని ఫన్షన్ చేసుకోండి అన్నాడు రామశర్మ,  నే చెప్పే విషయాలు వినండి, 6 నెలలు పెడితే మీకు మరళ  ఇక్కడకు ట్రాన్సఫర్ అవుతుంది, మనం విడి విడిగా ఉండటం అంత  మంచిదికాదు,  పిల్లల చదువు దృష్ట్యా ఇప్పుడు కుదరదు,  షుగర్, బిపి ఉన్నాయి మీకు, ఇపుడే పాపర్ల్లో కధ చదివాను విడివిడిగా ఉంటె మనుష్య్యులు మృగాలుగా మారుతారని నాకు తెలిసింది, ఏమిటే ఆ కధ అని అడిగాడు భర్త రామ శర్మ చెపుతా వినండి 
హైదరాబాద్ లోని ఆల్వాలుకు చెందిన అల్లూరి రాఘవేంద్ర   గురుప్రసాద్ కు (42)  ఇక్ఫాయ్ యూనివర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫిసర్,  ఆనందభాగ్ కు   చెందిన   సుహాసిని (38) ఐ .టి . కమ్పెనీలొ ఉద్యోగం, వీరికి  2004 లో వివాహమైనది. వీరికి  పిల్లలు వారి పేర్లు విరించి (9), నంద కిషోర్ (5) వీరిద్దరు బొఐనపల్లిలొని సెయింటు  ఆన్ద్రూస్ స్కూల్లొ చదువు తున్నారు  ఒక సంవస్చరం వీరిద్దరి మద్య గొడవ వచ్చింది, సుహాసిని భర్త వేదిస్తున్నాడనికేసు పెట్టింది,  రాజీ కుదరక విడాకులకోసం న్యాయస్తానాన్ని ఆశ్రయిమ్చారు, విడాకుల కేసు విచారణలో  ఉన్నది, పిల్లలు సుహాసిని వద్ద విడిగా ఉంటున్నారు , గురుప్రసాద్ ఫ్యామిలి  కోర్టును ఆస్రయించాడు, వారు మొదటి శని, ఆదివారములలో, మూడో  శనివారములో ఉదయం 9 గంటల నుండి   1 గంటవరకు తండ్రి వద్ద  పిల్లలు ఉండవచ్చని తీర్పు  ఇచ్చారు, ఆవిధముగా కొన్ని నెలలు జరిగినతర్వాత మొన్న మనస్తాపంతో గురుప్రసాద్ రైలు క్రింద పడి  ఆత్మా హత్య చేసుకున్నాడు అన్నది జానకి . 
ఏమిటి పిల్లలను చంపేసాడ అని అడిగాడు భర్త అట్లా ఇట్లా గాదు మరీ క్రూరమ్గా పాలల్లో మత్తు మందు కలిపి పిల్లలకు త్రాగించాడు,తాడు తీసు కొచ్చికొంతుకు ఉరి వేసాడు, ఇంకా చావక పొతే   ఆ పిల్లలను ముందుగా త్రవ్వి ఉంచిన తన సొంత  స్తలం వద్దకు తెచ్చి (మేడ్చల్ లోని బీరప్పగూడ  రైల్వే స్టేషన్ దగ్గర) కొబ్బరికాయ కొట్టే కత్తితో మెడలు నరికి గుంటలో పూడ్చి పెట్టి నట్లు పొలీసుల పరిశోధనలో తేలింది. 
ఎందుకె అంత  కిరాతకంగా చంపేసాడు చని పోయే ముందు ఉత్తరాలు కూడా వ్రాసాడు 1. సెక్షన్ 498(ఏ) (వరకట్న వేధింపులు, గృహహింస భర్తపై  పెట్టె  కేసు) మీద ఇప్పటికైనా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసు కుంటుందని  ఆశిస్తున్నాను, నీకు నేను అవసరములేదు, పిల్లలు అవసరములేదు, నీకు భందువులే ముఖ్యం, అందుకనే నామూలాలె నీకు లేకుండా చేస్తున్నాను నన్ను క్షమించు ఇంకా అనేక ఉత్తరాలు భార్యకు వ్రాసాడు, చనిపోయేముందు అని తెలుసుకున్నారు పొలిసులు. 
ఎందుకంటే భార్య భర్తలు ఒకరిని ఒకరు అర్ధం చేసుకొని జీవిమ్చటమె భారతీయుల సాంప్రదాయము, మొగవారు కాని ఆడవారు కాని ఒంటరిగా వేరు వేరు గా ఉంటె ఈ లోకం అనేక కధలు అల్లుతుంది, లొంగదీసు కోవటానికి అవకాశవాదులు ఎదురు చూస్తూ ఉంటారు, అందుకనే ఒంటరిగా అద్దె ఇంట్లో ఒక్కేరే ఉండొద్దని మిమ్మల్ని సెలవుపెట్టి రమ్మనమన్నాను భయంతో.  నామీద నమ్మకము లేదా నీకు, నమ్మకము ఉన్నది కాబట్టే ఇన్నళ్ళు మీతొ కాపురం చేస్తున్నాను 
ఎందుకుండరు రెండు కాపురాలు పెట్టినట్లు కూడా మీరు పాపర్లో చదువుతున్నారు కదా, కొందరు నిగ్రహనా శక్తితో అద్దె ఇంటిలో ఒంటరిగా ఉండి బ్రహ్మా చర్యం  చెడిపోకుండా ఉండే వారున్నారు. అందుకనే అన్ని వసతులు ఉన్న సింగల్ పోర్షన్ లో ఇద్దరం కలసి పిల్లలతో ఉందాం, అప్పటి దాక నా మాట వింటారు కాదు అని భార్య జానకి అన్నాది.