12, అక్టోబర్ 2014, ఆదివారం

183. Gold Parents Story -87 (అంతర్జాతీయ వృద్ధుల దినోత్చవం)

                          ఓం... శ్రీ... రాం ...                ఓం... శ్రీ... రాం ...            ఓం... శ్రీ... రాం ...
ప్రాంజలి ప్రభ

                                         సర్వేజనా సుఖినోభవంతు
(అక్టోబర్ "1" తేది అంతర్జా తీయ "వృద్దుల దినోత్సవం సందర్భంగా వ్రాసిన వ్యాసం ) " ప్రతి ఇంట్లో దీపాల వెలుగు "


అరుణ కిరణములనుండి వెలుగు రేఖలు ప్రసరించినట్లు,  తల్లి తండ్రుల  చూపులు  యొక్క కిరణాలు కుటుంబ మంతా  విస్తరిస్తాయి,  తామరలు భాను కిరణాలకు  వికసిమ్చినట్లుగా, కుటుంబ సభ్యు లందరూ ఆనందముతో, ఆరోగ్యం గా , ఉల్లాసంగా ఉత్చాహంగా ఉండ గలుగుతారు,  మన సాంప్ర దాయము ప్రకారము తల్లితండ్రులను పూజిమ్చి ఆద రించటమే మన కర్తవ్యం. మన సంస్కృతి.   


ప్రపంచం మొత్తంలో 12వృద్ధులు 15 కోట్లు పైగా ఉన్నట్లు కొన్ని అంచనాల వాళ్ళ తెలిసింది. వృద్దాప్యం అనేది అందరికి రావటం సహజం, వృద్దులమయ్యము మనము దేనికి పనికి రాము అని భావించుట తప్పు, నిజానికి  ఎవ్వరూ అంత భాధ   పడాల్సిన అవసరం లేదు, కాల ప్రభావంతో ప్రాప్తించే శారీరక రుగ్మతలతో కాస్త అసౌకర్యం కలిగినా, మానసికంగా ఉచ్చాహంగా ఉండ కలగాలి, వయస్సులో వచ్చే ప్రతి సవాలును ఎదుర్కొవాలి, యుక్త వయస్సులో కన్న వృద్దాప్యంలో ఎక్కువ శక్తి, అనుభవము ఉంటుంది.  మనము ఎందుకు పనికిరామని అను కోకండి, పిల్లల పంచనే ఉండి పిల్లలకు సేవ చేయాలని అనుకోవటమే తప్పని, వారు పెడితేనే మేము తినగలుగు తున్నామని అనుకోవడము కుడా తప్పు.  కాలానికి అనుగుణంగా మారక చాదస్తంగా విసిగిస్తే ఎవరైనా    వృద్దులని చూడక నోటికి వచ్చినట్లు మాట్లాడుతారు,  కనుక చెట్టుపై పండులా ఉండాలనే అనేది నా భావన.     
                    వృద్ధులు బి.పి. లేకుండా సుఖముగా నడచి వేలుతున్నప్పుడు, ఎవరైనా కర్ర లేకుండా, కళ్ళజోడు లేకుండా, సుఖముగా పోతున్నారే  అని  అంటే , ఆ వృద్ధులకు  ఏర్పడుతున్నది, అనారోగ్యముతో పెద్ద వయసులో హాస్పటల్  కు వెళ్ళితే డాక్టర్  జబ్బులు తగ్గవు,  రేపోమాపో పోయేవారే కదా అని డాక్టర్ అంటే కొత్త వ్యాది ఏర్పడుతున్నాది, పెద్ద వయసులో సాహిత్య అభిమాని తనవంతు తన అను భవాలను కధలుగా వ్రాస్తూ ఉంటె వారిని ఈ వయసులో కృష్ణ, రామ అనక ఏమిటి ఆ కధలు వ్రాయటం అంటే వారికి కొత్త వ్యాధి ఏర్పడక తప్పదు.

సుఖముగా ఉన్న వృద్ధులను మీరు జీవితానికి సంభందించిన అన్ని ఫిలాసిఫీలను వదలి పెట్టాలన్నా, సిద్ధాంతాలను వదిలిపిట్టాలన్నా, ఆదర్శాలను వదిలి పెట్టాలన్నా, లేక పొతే మీ మనుగడకే కష్టము అన్నా, మీ మాటలు పట్టించుకోకుండా ఉన్నా, మీరు  జీవించాలను కుంటే  ఒంటరిగా  జీవించటానికి ప్రయత్నం చేయాలి, మీరు సంతోషంగా ఉండి , ఇతరులను సంతోష పెట్టుతూ ఉండాలి, మీరు ఎదుటివారికి ఆనందం ఇవ్వలేకపొఐనా పరవాలేదు కాని వారి ఆనందాన్ని చెరిపి వేయకపోతే అదే పదివేలు,  వృద్ధులు ఒకరి కొకరు కలసి మెలసి జీవితము ను పంచుకుంటే సుఖము సుఖము తప్పక ఉంటుంది.

వృద్ధులైన తమ స్వతంత్రభావాలు మానుకొని జీవించ కూడదు, ఈ దేశంలో ప్రతి 10 మంది  వృద్ధులలో ఇద్దరు ఒంటరిగా జీవిస్తున్నారు, కొందరు శారిరక హింసకు పాల్పడటం, కుటుంబ సభ్యు లే వృద్ధుల పాలిట  శత్రువులవు తున్నారు,  కొందరు కొడుకుల భాదను తప్పించుకొనుటకు,  వృద్దాశ్రమం లొ చేరుతున్నారు, కొడుకులే చేర్చి పట్టించుకోకుండా తిరుగు తున్నారు.

 దేశంలో వృద్ధులను పట్టించుకోని పిల్లలను శిక్షించే విధముగా ఒక చట్టము 2007 లో తెచ్చారు, తల్లి తండ్రులను పట్టించుకోని వారికి మూడు  నెలలు జైలు శిక్ష, ఇదు వేలు జరిమానా విధించే హక్కు చట్టముకున్నాది, ప్రభుత్వము  వారు వృద్ధులకు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు.  ఒదిశా రాష్ట్ర ప్రభుత్వం వ్రుద్దులకోరకు అంగన్ వాడి కేంద్రం  ద్వారా ఉచిత భోజనము అందిమ్చుతున్నారు ,  హర్యానాలో, తమిళనాడులో వృద్ధుల కొరకు సంక్షేమ పధకాలు అమలు పరుస్తున్నారు.
మోజు తీరగనె వేసేది కాదు మూడు  ముళ్ళ భంధం
ముసలి తనంలో కూడా మనసేరిగి  ఉండేది మాంగల్య భంధం
జన్మనిచ్చిన తల్లితండ్రులకు సేవచేయట పుత్రికా పుత్రుల  ధర్మం
వార్ధక్యం లో ఉన్నవారు పసి పిల్లలతో సమానం, ఆదరించుట ఆందరి  ధర్మం 
   
మా హృదయాన్ని నందన వనంగా మార్చిన వారు మీరు                        మాతో నవరాగములు పలికించి  నడిపించిన వారుమీరు                            మమ్ము కాలానుగుణంగా చదివించిన మార్గదర్శకులు మీరు               వృద్దులైన మీకు సేవ చేయుట మాభాద్యతగా భావిస్తాము మేము                     
 భద్రతా లేదని, అభద్రతా భావంతో ఉండద్దు మీరు                          నిర్భయంగా ధైర్యంగా, శాంతి సౌఖ్యాలతో ఉండాలి మీరు                       దైవాన్ని ప్రార్ధిమ్చుతు,  మమ్ము కాపాడి రక్షించే వారు మీరు  తప్పులేమన్న చేసిన క్షమించమని వేడుకుంటున్నాము మేము