నీవు ఓర్పుతో అందరికి మంచి మాటలు భోధించు
ఇతరుల మనస్తత్వమనుసరించి నడుచుట ప్రయత్నించు
నీది గుణం మంచి దై తే సంతోషాల నిలయ మనుచు
మనోనిగ్రహ శక్తిని పెంచే హనుమంతుని నీవు ఆరాధించు
కలమి కలవాడు కైలాస వాసున్ని మరచు
స్వంతబలమణి భావించి దేవున్నేదూషించు
కలిమిపోయి బీదవాడైననాడు దేవున్నేప్రార్ధించు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట
తెరను దాగిన సత్యమును తెలుసుకొనుటకు ప్రయత్నించు
దూరపు కొండలు నునుపు కావని తెలుసుకొని సంచరించు
కనులకగుపడు దృశ్యమునుచూసి శాంతించుటకు ప్రయత్నించు
మల్లాప్రగడ వారు మదిన నిలిచిన సత్యాన్ని తెలియ పరుచు
నావల్ల కానిపని ఇది యని గట్టిగా పలుకుచు
బ్రహ్మ చెప్పిన ఈ పనిని చేయనని చెప్పుచు
ధర్మముతోఉన్న పనితప్ప ఏపని చేయననుచు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట
మంచి పని చేసిన ఎప్పటికి కీడు రాదనుచు
చెడ్డ పని చేసిన మంచి ఏమిచేయలేక నిద్రించు
ఇది మంచా, చెడా అని ఈ మానవులు బ్రమించు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట
విద్యలు అన్ని నేర్చుకొని సద్వినియోగ పరచు
విద్యా దానం చేసి నలుగుర్ని సంతోష పరచు
భాహుసత్కార్యాలు ఫలితములేదని గమనించు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట
ఎంత చదువు చదివిన పరుల మనసును గ్రహించు
తరచి చదివిన మనుష్యులతో నీ స్నేహాన్ని పంచు
అందరుచదవాలి, బ్రతికి బ్రతికిన్చేదుకు చదువనుచు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట
చెట్టు పై ఆకు పచ్చ పక్షులన్నీ చిలుకలని వాదించు
పువ్వులపై వాలే పురుగులు తుమ్మెదలని వాదించు
పై వాక్యాలు ధనవంతుడన్న బీదవాడు తలవూపుచు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట
దేహము భవసాగరమీద లేని కంప అనుచు
రోగము తో మ్రగ్గేడి సేవక గంప అనుచు
శరీరము చలనము చెందేడి దుంప అనుచు
భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట
శృంగారము వేరు, బంగారం ఒక్కటే అనుచు
మతములన్నియు వేరు, మార్గం ఒక్కటే అనుచు
జాతి, నీతులు వేరు, అందరి జన్మ ఒక్కటే అనుచు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట
వస్త్రభేదములు వేరు, దారము ఒక్కటే అనుచు
పశువుల రంగులు వేరు, పాలు రంగు ఒక్కటే అనుచు
పూలు వేరు, దేవునికి సమర్పించే పూలుఒక్కటే అనుచు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచి మాట
నీవు దేహాన్ని అనుసరించి మనస్సు చలించక చలించు
అందరిని నీ మనోభావం తో అర్ధం చేసుకొని క్షమించు
ఆత్మ భావంతో ప్రతి ఒక్కరిని ఆదుకుంటు పలకరించు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట
జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కడే అనుచు
దేవుని రూపాలు వేరు, అందరికి దేవుడొక్కడే అనుచు
పిల్లలబుద్ధి వేరు, తల్లితండ్రులకు అందరు ఒక్కటే అనుచు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట
కలకాలము కాకి నిలువక కాకి వగచు
మనసులో మాట నిలువక స్త్రీలు చెప్పుచు
నిద్రలో కళ్ళు మూసుకొని కలలో నడుచు
వినుము మల్లాప్రగడ మంచి మాట
తామసంబు విడువకపోతే తత్త్వం తెలియ దనుచు
రాజసంబు విడువక పొతే భక్తి భావం రాదనుచు
సాత్వికంగాఉంటె శాంతముతో మంచిమాట అనుచు
భారతీయులారా మల్లాప్రగడ మంచి మాట
పురుషుడు కోర్కలతో వెమ్పర్లాడుతు పలుకుచు
స్త్రీ పురుషున్ని కవ్వించి నవ్వంచి కనిక రించు
స్త్రీ పురుషులు కలసి సృష్టి ధర్మానికి సహకరించు
భారతీయులారా మల్లాప్రగడ మంచి మాట
నింగిలో మేఘాలు గాలికి కదులుచు
నీటిలో దుంగలు తేలుచు కదులుచు
కాలంతో ప్రజలు బ్రతకలేక బ్రతుకుచు
వినుము మల్లాప్రగడ మంచిమాట
మతములన్ని ప్రజలకు మంచిని భోధించు
కలసి ఉండి నీ తెలివితో మంచిని బ్రతికించు
మనసులు కలిస్తే మాటలన్నీ మంచిదనిపించు
వినుము మల్లాప్రగడ వారి మంచి మాట
నీవు స్త్రీని ఎప్పుడు అర్ధం చేసుకొని ప్రేమించు
పురుష అహంకారం వదలి స్త్రీని పాలించు
పెద్దలు,గురువులు, కులదైవాలని భావించు
వినుము మల్లాప్రగడ మంచి మా ట
పెద్ద మనిషి అయిన స్త్రీ కి పెళ్లి చేయాలని తలచు
అందరికి అందాన్ని చూసి మనసు పరుగెత్తించు
మూడు ముళ్ళు భంధం తో జీవితాలు చలించు
భారతీయులారా మల్లాప్రగడ మంచి మాట
వయస్సులో వస్తున్న మార్పులకు కండలు పెంచు
యోగాసనాలు వేస్తు, పౌష్టికాహారము తీసుకొనుచు
మదన కోర్కలతో మనసు మనస్సులో ఉండదనుచు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట
కన్నవారిని కాదను కోవటం అవివేకమని గ్రహించు
భార్యను సంతృప్తి పరచి సంతోషాన్ని అనుభవించు
నీరు ఎక్కువత్రాగి, నడుస్తూ ప్రకృతి గాలి గ్రహించు
భారతీయులారా మల్లాప్రగడ మంచి మాట
శిలగా ఉన్న దేవుణ్ణి ప్రార్ధించి, సజీవమ్గా ఉన్నవానిని ప్రేమించు
ఉషోదయకాలాన్ని గమనించి, నీవుఆశలకు పోకుండా జీవించు
నేయి దీపాలు వెలిగించి అందరిని ఆహ్వానించి వేదాలు పటించు
వినుము భారతీయులారా మల్లాప్రగడ వారి మంచి మాట
యవ్వనంలో సమయం,శక్తి, ఉంటాయి డబ్బు ఉండ దనుచు
మద్యవయస్సులో డబ్బు శక్తి ఉంటాయి సమయం ఉండదనుచు
వృద్దాప్యంలో సమయం డబ్బు ఉన్న కష్టపడే శక్తి ఉండ దనుచు
వినుము భారతీయులారా మల్లాప్రగడ వారి మంచి మాట
గుమ్మడితీగకు కాయలు పూలు బరువు కాదనుచు
ప్రతి స్త్రీ 10 నెలలు మోసే గర్భం బరువు కాదనుచు
పిల్లలు తల్లి తండ్రులను పోషించాలంటే బరువనుచు
భారతీయులారా మల్లాప్రగడ మంచి మాట
చెదలు పుట్టి కొయ్యను తినివేయు, మందు వాడాలనుచు నీచులతొస్నేహంకుటుంబంనాశనామ్,మంచినిప్రేమించు గడియారంలా పైనించి క్రిందకు,క్రిందనుంచి పైకి సంచరించు
వినుము భారతీయులారా మల్లాప్రగడ వారి మంచి మాట
ధనం, అహం ఉన్న వారి మాటలు మూర్ఖముగా ఉండుననుచు
ధనం లేనివాడి మాటలు ఎప్పుడు బీద పలుకులు పలుకుచు
మద్యస్తుడు ధనం ఖర్చు చేయుటకు మాటలు తికమక పడుచు
వినుము భారతీయులారా మల్లాప్రగడ వారి మంచి మాట
లక్ష్యం నిర్దిష్టంగా మనుష్యులు కృషి చేయాలనుచు
కృషి ద్వారా సంకల్ప సిద్ధికి ప్రయత్నిమ్చాలనుచు
సంకల్పంతో దీక్షాబద్ధుడిగాఉన్న తోడు కావాలనుచు
భారతీయులారా మల్లాప్రగడ మంచి మాట
మనదేహం వైరు పై ఉండే కవరు లాంటి దనుచు
మన మనసు కవరులో ఉన్నరాగి వైరు అనుచు
భారతీయులారా మల్లాప్రగడ మంచి మాట
ప్రశ్నిమ్చనిదే నిజమైన సమాధానము దొరకదనుచు
ప్రయత్నిమ్చనిదే కోరుకున్నది ఎవ్వరకి దక్కదనుచు
కాలాన్ని గమనించిమాటలు మాట్లాడితే మంచిదనుచు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట
దాంపత్య ధర్మంలో శృంగారం ఒక మెట్టనుచు
చెడుపై పోరాటంలో వీరత్వమ్ చూపించు
ఎప్పుడునవ్వుల్లో సంతోషపడి సంతోషపరుచు
భారతీయులారా మల్లాప్రగడ మంచి మాట
హృదయపు లోతు ఆలోచనలను గమనించు
కొత్త విష యాలను అందరికి తెలియ పరచు
దుర్మార్గాన్ని ఎప్పుడు నిర్భయంగా ఎదిరించు
భారతీయులారా మల్లాప్రగడ మంచి మాట
నిజాన్ని మెంగే రాజ్యమేలుతున్నా ధర్మంమనుచు
వెలుగుని మెంగే వ్యాపారం చీకటి వ్యాపార మనుచు
ప్రకృతిని మింగే కాలచక్రం ఇప్పుడు వికృతి అనుచు
భారతీయులారా మల్లాప్రగడ మంచి మాట
భర్తే భార్యకు నిజమైన దేవుడనుచు
తల్లితండ్రులు పిల్లలకు గురువులనుచు
ఆదిత్యుడే అందరికి మార్గదర్శకుడనుచు
భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట
అందరికివందనాలుసమర్పిస్తుదీపావళిశుభాకాంక్షలతో మదిలో మేదిలన మంచి భావాలను అక్షర రూపములో
mallapragada vari manchimata nijamu ga manchi mata,anni nijale.chepparu .Andamu ga chepparu,1,2,4 PADYAMULAKU chivara line lo MALLAPRAGADA VARI MANCHI MATA ANI raaste BAAGUNDEDI
రిప్లయితొలగించండి