30, నవంబర్ 2016, బుధవారం

*మజిలీల జీవితం (స్టోరీ)

ఓం  శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:

సర్వేజనాసుఖినోభవంతు

*మజిలీల జీవితం (స్టోరీ)

గతంలో మనమందరం ఎవరమొ,  ఇప్పుడు కష్ట పడే పరిస్థితి ఉండుట కష్టముగా ఉన్నదను కోమంటారా అని ఒక వృద్ధుడిని ఓకే విలేఖరి అడిగాడు. అట్లా అనుకున్నవారు ఈ ప్రపంచములో బ్రతుకుట అనర్హులు, నాదృష్టిలో నేనన్నది మీరు ఈ వయసులో కుడా కష్టపడుట గురుంచి, అది నా కర్ద మైయింది, కానీ వయసు మీరినది అని ఊరికే కూర్చుంటే అనారోగ్యులుగా మారుటకు చేతులారా ఆహ్వానించిన వారు అవుతారు, ఎవరైనా వయసులో పడ్డ ఆకష్టాన్ని, చేసిన మంచి పనులను నలుగురితో వయసుని బట్టి  పంచు కుంటూ  ఉండటమే నిజమైన జీవితము అని నా భావన, ఆకలి తీర్చుకొనుకు వేరొకరిని ఇబ్బంది పెట్టకుండా, గుండెపోటు రాకుండా కష్టానికి తగ్గ ఫలితము తెచ్చుకోవటమే జీవితము కదా

అవు నను కోండి మీరు రోజూ ఆకలి కోసం మండు టెండలో నుంచోవటం అవసరమా అందులో కా ళ్ళకు చెప్పులు లేకుండా, తలపై గొడుగు లేకుండా కళ్ళకు జోడు లేకుండా ఉండి  కష్టపడటం అవసరమా

నా భార్య వృద్ధురాలు, ఆమెకు కళ్ళు కూడా సరిగా కనబడవు, నాకు పుట్టిన కొడుకులు, కూతుర్లు ఎవరి దారి వారు చూసుకున్నారు, కానీ నాతో జీవితము పంచుకున్న నా శ్రీమతిని నేను తప్పక కాపాడు కోవాలి, వయసులో ఉన్నప్పుడు ఒకరికొకరం కష్టపడి పనిచేసు కున్నాము, ఆ కష్టమే నా పిల్లల భవిషత్తుకు మార్గం చూపినాము, రెక్కలు వచ్చిన పక్షులను ఆపలేముకదా, అవి ప్రపంచాన్ని అనుభవాలన్నీ తెలుసు కోవాలి కదా బాబు

అవునండి మీరు చెప్పినది నిజమే నాకష్టం వేరొకరికి రావద్దని ఆ దేవుడ్ని కోరు కుంటాను.
అవును బాబు ఇప్పటి నా వయసులో ఎటువంటి పని ఇచ్చే వారు లేరు, నాభార్యను ముందు బ్రతి కించు కోవాలి అందుకనే ప్రధాన వీధిలో ఉన్న ఒక హోటల్ ముందు నుంచోటానికి ఒప్పు కున్నాను అది కూడా 12 గంటలనుండి మూడు గంటల వరకు " భోజనం తయారు " అనే బోర్డు పట్టుకొని నుంచోని ఉంటే భోజనం ప్యాకెట్టు అన్నా దొరుకు తున్నది, మా ఇద్దరి కడుపు నిండి పోతున్నది.

అట్లా వీధిలో నుంచోవటం కష్టముగా లేదా. ఎందుకు లేదు మనసులో దృఢసంకల్పం, ఓర్పు ఉంటే ఎంతటి కష్టమైనా భరించ గలిగే శక్తి ఆభగవంతుడే నాకు ఇచ్చాడు.

ఒకరోజు నేను ఎండలోనుంచున్నప్పుడు నాకాళ్ళు బొబ్బ లెక్కాయి, తల మీద సూరీడు విలయ తాండవం చేస్తున్నాడు, అట్టి సమయములో నాకు విపరీతమైన దాహము వేసినది, దాహం తీర్చు కోవటానికి కూడా కదల కూడదు అది మేము పెట్టుకున్న నిభందన, అప్పడే దేవుల్లాగా కొందరు విద్యార్థులు కనిపించారు వారు హోటల్లో కి వచ్చి మంచినీరు బాటిల్సుతో మోహము కడుక్కొని, వంటి మీద పోసుకొని, త్రాగి నంత వరకు త్రాగి ఒకతను నా మొఖానా ఒక బాటిల్ విసిరాడు, ఆత్రుతతోఁ పట్టి త్రాగాలని అనుకున్నా, చేతికి చిక్కక అది క్రింద పడింది, చివరకు బాటిల్లో ఉన్న ఆ నాలుగు చుక్కలే నా ప్రాణాన్ని రాక్షించాయి.

అప్పుడే నాకు తెలిసిన బంధువులు వచ్చారు, వారితో పలకరించుట కుదరలేదు, వారు నా పరిస్థిని చూసి పలకరించుటకు సహకరించలేదు అప్పుడు నా పరిస్థితి భాదను పంచుకొనే స్థితి లేదు, చెప్పుకొనే పరిస్థితి లేదు, అప్పుడని పించింది గుర్తింపుకు విలువలేని చోట ఉండుట మంచిదేనా అని ఆలోచించాను, కానీ బ్రతుకు కోసం కొన్ని నిజాలు దాచాలని గుర్తుకు వచ్చి అల్లా ఉండి పోయాను.

ఇలా కొన్ని రోజులు సాగుతున్నాయి ఒకరోజు నేను నుంచొని ఉండే చోట హోటల్ మూసివేశారు ఎప్పుడేమి చేయాలో నాకు తోచలేదు నా అలవాటు మానుకోవటం ఎందుకని ఆరోజు ఒక బల్లమీ  ద, ఇక్కడ మంచినీరు ఉచితముగా దొరుకును అని తెల్ల సుద్దతో వ్రాసి పట్టుకొని నుంచొని ఉన్నా, చాలామంది వచ్చి ఆగి మంచి నీరు త్రాగి నాకు డబ్బులు ఇవ్వ చూపారు, వారి వద్ద నేను ఎటు వంటి డబ్బు తీసు కోలేదు కానీ ఒక పాప చిన్న చాక్లెట్ ఇచ్చింది అది తీసుకు వచ్చి నాభార్యకు ఇచ్చాను ఇది నా ఈనాటి అహ్హరం అని చెప్పను. నవ్వుతూ నోటితో సగము కొరుక్కొని మిగతా సగము నాకు పంచింది సంతోషములో కష్టములో సమానముగా పంచుకో గలగాము.
ఈ జీవితమునకు ఇంకా ఎన్ని మజిలీలో బాబు

నాకధకు ముగింపు ఎప్పుడో, మీరే ఊహించండి, మాస్వేశ్చకు అడ్డు మాత్రం రాకండి .             .

29, నవంబర్ 2016, మంగళవారం

Internet Telugu magazine fo the month of 12/2016/45

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

సర్వేజనాసుఖినోభవంతు


1*ప్రేమ బంధం

కాలానికి కళ్లెం వేద్దాం
ప్రేమానికి గొళ్ళెం తీద్దాం
వసంత సమీరంలో విహరిద్దాం
హేమంత తుషారం ఆస్వాదిద్దాం

వలయములై చలించుదాం
విలయములై జ్వలించుదాం
చిగురించిన ఆకులవుదాం
వికసించిన పువ్వులవుదాం

జగతిని పరిశీలిద్దాం
ప్రకృతిని అనుకరించుదాం
భవిషత్తుకు పునాది వేద్దాం
ఒకరి కొకరం ఏకమవుదాం

నదిలా మనది అనురాగ బంధం
కడలికి సుమధుర సంభందం
నదిలా మన కలయిక ఆనందం
అంబర మొక్క అనుభందం

అను రాగపు అంచులు చూద్దాం
ఆనందం కొరకు లోతులు వెతుకుదాం
స్వర్గానికి నిచ్చెన వేద్దాం
ప్రణయానికి ప్రాణం పోద్దాం

మదిలో కోరికలు తీర్చుకుందాం
హృదయంలోని జ్వాలను చల్లబరుద్దాం  
జీవిత సమరంలో ఈదుదాం
కుటుంబాన్ని ధర్మమార్గాన్ని ఉంచుదాం

--((*))--

*స్త్రీ తత్త్వం (చదస్సు )

కాలముతో సర్దుకొనే - మరణానికి అంచులలో
సేవలు అందించుటయే - సహధర్మము అందరిలో
భావముతో రాగముతో - అనురాగము పంచుటలో
జీవమనే సంఘములో - వనితామణి ప్రేమలురా 

శారదగా పార్వతిగా - సలహాలను  ఇచ్చుటలో
చేరువలో నీడలుగా - ఫలహారము చేయుటలో
వేకువలో సుందరమౌ  - మనసేకము తప్పదులే           
వేళకు నీ పూజలకై - విరిదండల వేయునురా

భాదలలో ఉండుటయే - సహవాసము ఊపిరిలే
పంచుటలో ముచ్చుటలో - సహకారము అందునులే
ప్రేమలతో భంధముగా - సుఖమిచ్చుట అవ్వునులే
భాద్యతతో భావమునే - మహిళా సమ సౌఖ్యములే
--((*))--

*స్త్రీ తత్త్వం 
స్రగ్విణి / కామావతార -

స్రగ్విణి - ర/ర/ర/ర UIU UIU - UIU UIU
12 జగతి 1171


తూర్పునా ఊడ్చెనే - సుబ్రమే చేసెనే
నీటినీ చల్లెనే  - ముగ్గులే పెట్టెనే
రంగులే  దిద్దేనే - పువ్వులే చల్లెనే
ఓర్పుతో సంతసం - నిత్యధర్మాములే
   
రమ్ము కామావతా - రా ప్రకాశమ్ముగా
నిమ్ము  ప్రేమమ్ముతో -నిప్డు ప్రీతిన్ సదా    
తమ్మి నీమోము కెం - దమ్మి  నీ రూపమే   
చిమ్ము సోమమ్ము రం - జిల్ల సోముండగా

కళ్ళలో  వెల్తురూ - కాంతిలో సంతసం
చీకటే మెట్టుగా  - గుట్టుగా సంక్రమం 
పద్యమే వేదమై  - భావమే  నాదమై
అందమే సొంతమై - శ్రీమతీ సౌక్యమై   
  
తామసం తగ్గెనే - తన్మయం చెందెనే
సుందరం కాంతలో - నోములే పండెనే
మన్మధా అంబరం  - ప్రుద్విలో సంబరం
చీకటే తీరెనే - వెల్తురే పంచెనే          


లీలావతీ - న/న/య/ర/ర/ర/గల IIII IIIU UUI - UUI UUI UUI
20 కృతి 599168
వెలుగుచు నిలబడేన్ నాదేవి  - ఆనంద మానంద మొచ్చేను
రసములు చిలికెనే రాగాల - రంజిల్లు రంగుల్ విరాజిల్లు
కుసుమముల మనసే నా సీత - నవ్వేను పల్కేను నమ్మెట్లు
రుస రుసలు లేనిదే నామల్లి -  సాహిత్య సంగీత లాస్యమ్ము     

--((*))--

*సత్య సూక్తి

ధనం ఖర్చు చేస్తే - శుభం ప్రతి ఇంట
ధనం దానం చేస్తే - నిత్య తృప్తి మయం
ధనం దాచి పెడ్తే - తస్కరుని పాలే
ధనం కోసం తృప్తి - ఉంటె మన: శాంతి

గుణం సర్వ వ్యాప్తం - అల్పబుద్ధికి అనుమానం
బుధ్ధి  వక్ర మార్గం  -  సర్వ కుటుంబ నాశనం
బుద్ధి సక్ర మార్గం -  సర్వం విశాల హృదయం
మన: శాంతి మార్గం - జగమంతా నా కుటుంబం
 
స్నేహ ద్రోహునికి - సర్వం దూరం
కృతఘ్నుని స్నేహానికి - సర్వం దూరం
విశ్వనాస ఘాతకునికి - సర్వం దూరం
సర్వం పిచ్చి కుక్కకి - దూరం దూరం

*15. గోపాల కృష్ణుడు 

  రారమ్మ రారయ్యా చూడాలి చిన్న గోప బాలుడు 
నిర్మల మైన వాడు, మన మువ్వ గో పాలుడు 
శ్రీ రమ్య మైన వ్రేపల్లెలో, కాంతులు పంచు వాడు
చేరి కొలుతుము, మనసు ప్రశాంత పరుచు వాడు

ఎప్పుడు పున్నమి, వెన్నెల, వెలుగు నందించే వాడు       
ఎప్పటి కప్పుడు, మదిలో ప్రశాంతత, కల్పించే వాడు 
తప్పులు చేసిన, మానవులను సరిదిద్ది కాపాడే వాడు
చెప్పుడు మాటలలో నిజము ఉండదని, చెప్పిన వాడు 

మరి మరీ, కని వినీ, ఎరగని కళ్ళతో ఆకర్షించే వాడు
మురిసే యశోదమ్మకు ముద్దుల అల్లరి పిల్ల వాడు 
కరితో ఆడుకొని పైకిఎక్కి, ఆనందం అనుభవించే వాడు 
సిరి కల్పించి, సంతోష  పంచిన చిన్మయ స్వ రూపుడు

అరుణో దయ, వెలుగు, అందరికి సమంగా పంచు వాడు 
కరుణ చూపి ప్రాదించుచున్న వారిని కాపాడిన వాడు 
వరములు కోరిన వారికి వెంటనే సహకరించిన వాడు 
పరుష వాక్కులకు 100 తప్పుల వరకు రక్షించిన వాడు    
--((*))--      

   
16 .* శ్రీకృష్ణ లీలలు

వినరమ్మా, చూడడండమ్మా, మన కృష్ణయ్య తీరు
పనిఁబూని మనం సేవించిన సిరులు కురిపించే తీరు
కన్నీరు తుడిచి మమకారం అందించే నవ్వుల తీరు
ఆన్న వారికి  సుఘంద పరిమళాలు అందించే తీరు

ఆల పాలకడలిలో ఊయల శేషశయ్యపై ఉన్న తీరు
కలలు సఫలీ కృతము చేసి శుభములందించే తీరు
పలుకులో ధర్మ మార్గమున ఉండి ఉండమన్న తీరు
అలుకలో కూడా ఆనందము ఉన్నదని చూపినతీరు

నీల మేఘ శ్యాముడైన కృష్ణ కళ్ళకు  కాటుక తీరు
వలదు వలదు అంటూ పింఛము పెట్టుకున్న తీరు
తలచుకున్న వెంటనే కృష్ణుఁడు ప్రత్యక్షమైన తీరు
పాలు త్రాగి యశోదకు నోటిలో లోకాలు చూపిన తీరు

పద్ధతులనుచూసి పక పక నవ్వి ఏడి పించిన తీరు
పడుకున్న వారి కొంగులు ముడివేసి  ఆడిన తీరు
తడబడుతూ నవ్వులు కురిపిస్తూ ఆదుకున్న తీరు
అడగకుండా తలచిన వెంటనే కోరిక తీర్చే తీరు   
         
 --((*))---
   * 17 శ్రీకృష్ణ లీలలు .

ఎనలేని సిరులను అందించు శ్రీకృష్ణ ప్రేమ
కనరాని కడు ఈతిభాదలను తొలగించే ప్రేమ
మునులు నిత్యమూ త్రివిక్రముని ఆరాదించే ప్రేమ
కనుల చూపులతో కలతలు తొలగించే కమ్మని ప్రేమ

నెల నెలా మూఢు వానలు కురిపించే ప్రేమ
కల కళలాడుతూ పైరును ఏపుగా పెంచే ప్రేమ
కలువల పూలతో పూజించే నిస్వార్ధ ప్రేమ
అలల తాకిడిలా సాగె జీవితంలో ఉండే ప్రేమ

కడిగి కూర్చుండి పొంకపు చన్నుల పాల ప్రేమ
ఒడిసి పట్టి పాలు త్రాగుతూ రక్కసిని చంపిన ప్రేమ
బండి రూపములో వచ్చిన రాక్షసుని చంపిన ప్రేమ
కడవలు ఆవుపాలను అందించి ఆరగించే ప్రేమ       
--((*))--


* 18 శ్రీకృష్ణ లీలలు .

నరులకు అకాలమున - దప్పికను  గనిరో 
కురియును సకాలమున - వర్షములు దయతో
పయనమున ఒంటరిగ - వేదనలు గొలుతున్
కలత తొలగించియును - హర్షమును దెలుపున్   

జలనిధిలో జొర బడిన సర్పమును సంహరించి
జలమును శుభ్రపరిచి త్రాగుటకు సహకరించి
తలలు మార్చే దుష్ట రాక్షసులను సంహరించి 
కలకాలం శ్రీకృష్ణ ప్రార్ధించిన వారిని కాపాడుచుండెన్

సుందర బాహువులతో పిల్లన గ్రోవిని ధరించి
పొందిన ఆనందము తో వేణుగానము చేసి
అందరిని ఆనందపారవశ్యములో ముంచి
వందనాలు స్వీకరించి మనస్సు ప్రశాంత పరిచే    
 --((*))---

19 . శ్రీ కృష్ణ లీలలు

చెప్పరే చెప్పరే శ్రీకృష్ణ నామమ్ములు
ఒప్పుల కుప్పగా ఉన్న ఓ వనితలారా 
తప్పక చూచును మన స్థితిగతులు
ఎప్పుడో చేసిన తప్పులను రక్షించును

కళ్యాణదీప్త మైన వాని కనికరములు
అల్లన మెల్లగా ధ్యానించి పొందు దామురా
తల్లి కడుపున చల్లగా వెలిగేటి వానిని
సల్లలిత సుమము లర్పించి వేడుకొందుమరా

హాయిగా యమునా నదిన విహరించువానిని
మాయను తొలగించే మధురాపురికి రేడైన వానిని
భయము వదలి పరమాత్మునిని ప్రార్ధించి
తీయని పువ్వులతో సేవించి ప్రార్ధించెదమురా                
 --((*))---
 
 20 శ్రీకృష్ణ లీలలు

తెలవారు తున్నది లేవే లేవవే
కల కల కూసే కోయిల పాటలు
అల కృష్ణని గుడి గంటలు మ్రోగెనే
పిలిచెనే సుప్రభాత సేవలకు

ఓలి విషపు చను బాలు త్రాగిన వానిని
లాలి పాడుతున్న మాయారక్కసి చంపిన వానిని
గాలిలో మాయా శకటములను కూల్చిన వానిని
నిల మేఘశ్యాముని దర్శించుదాము లేవవే

మేలుకొని ఋషులు,మునులు కొలిచేటి
మలుపు మాయానుండి మమ్ము రక్షించేటి
గెలుపు కోసం చేసిన ప్రార్థనలను చూసేటి
చలువ రాతిపై ఉన్న గోపాలా నీవే నాకు దిక్కు
--((*))--


20, నవంబర్ 2016, ఆదివారం

Internet Telugu magazine for the monh ov 11/2016/44

ఓం శ్రీ రామ్ - శ్రీమా త్రేనమ :
 
సర్వేజనాసుఖినోభవంతు 
వనితా శ్రీ
ప్రతిభాదర్శనము - స/భ/త/న/గగ IIUU IIU - UIIII UU 

పదిలం గా పరువం - కాంతలకు సమానం 
    విపులంగా సమయం - చెప్పుకొనక చేసే 
మురిపంగా మనసే - పంచుకొను  సరాగం 
వయసే  సంతసమూ -  చక్కని గిలిగింతే   

 పదిలంగా నగునా - అర్హత తెలిపేగా
నయనంగా పిలిచే - సవ్యము తలపేగా 
మధురంగా మెదిలెన్ -  గమ్యములను చూపున్
      నియమమ్మున్ విడకన్ - మానసమును పంచున్ 

 సుధలీయున్ సుమతీ -  సుందరముగ పల్కే
 మదిదోచెన్ మమతే - మానసమున నిల్చే 
సతతమ్మూ వలపే - శాంతముననె మోమున్ 
   సమయం గా తనువే - సాహసమధురంగా


 -((*))--

    ఆటవెలది
వచ్చె డబ్బె వెలుగు - నిర్ణయంను తెలుపు 
విద్య, వైద్య వెలుగు - జీవితాల మలుపు
నవ్వు, పువ్వు, వెలుగు -పంటశాల తలపు
తల్లి తండ్రి  వెలుగు  - శాంతినీని తెలపు                
 
 *13. నిగృహ శక్తితో జీవించు


 తండ్రి వద్ద తడ పడ వద్దు 
తల్లివద్ద నిజం దాచ వద్దు 
తరుణిని వద్ద ధర్మం తప్ప వద్దు  
నీ భాద్యతలు ఎన్నటికీ మరువవద్దు 

ఇష్ట సఖికి సుఖం పంచటం వదలద్దు 
మనసు విప్పి మాట్లాడి ఇవ్వాలి ముద్దు 
అమ్మవలే  ఆదరించి ప్రేమను సద్దు   
నీవు ఇతరవిషయాలపై ఆశ పడవద్దు 

ప్రేమను పంచి ఆదమరచి నిద్ర పోవద్దు 
కోపంతో  అనరాని మాటలు అనవద్దు   
సుఖమును అందించిన దానినీ  తిట్టవద్దు 
నీవు ఓర్పుతో  కుటుంబాన్ని సరిదిద్దు 

ఉన్న విద్యతో సుఖపెట్టు చాతకాదనవద్దు 
తప్పునుచూపి నీకు ఏమీరాదనీ అనవద్దు 
ఈ కాలంతో మారుటయే ప్రతి ఒక్కరి హద్దు    
నీవే భర్తవు, కర్తవు ఎవరివల్ల భయపడవద్దు 

నాకు ఇది రాదు అది రాదు అనుకో వద్దు
అనుమానం మనసులోకి ఎప్పటికి తేవద్దు 
హద్దు దాటి ఎప్పుడూ  ప్రయాణించ వద్దు
దేవుని ప్రార్ధించు నిగృహ శక్తితో జీవించు   

--((*))--


*ముత్యపు చుక్క

చక్కని చుక్క ముత్యపు చుక్క
వంటరిగా ఉన్న పట్టలేని చుక్క
వయసుతో అల్లరి చేస్తున్న చుక్క
తుంటరితనంతో కదులుతున్న చుక్క    

చంద్రుని ప్రక్క మెరుస్తున్న చుక్క
కలవరం మదిలో రేపుతున్న చుక్క
హృదయంలో పరవశిస్తున్న చుక్క 
మనల్ని కంగారు పెట్టిస్తున్న చుక్క

బుడగలా మెరుస్తూ ఉన్న చుక్క
ఆకులమధ్య కనిపిస్తున్న చుక్క
కళ్ళలో కనిపిస్తున్నా స్వేత చుక్క
పెల్లిలో వధువు వరులకు పెట్టె చుక్క

నుదుటిమీద కుంకుమ బొట్టుచుక్క 
శ్రవణాలకు వ్రేలాడుతూ ఉన్న చుక్క 
ముక్కు ముక్కెరకు మెరుస్తూ చుక్క
స్త్రీలు ధరించే హారములో మెరిసే చుక్కలు
--((*))--


మేఘధ్వనిపూర - త/య/మ/గగ UUII UU - UUU UU 
11 త్రిష్టుప్పు 13 

*నా పుత్తడి రాణీ

నాయాశల బోణీ - నా ఆనందం భోధీ
నా పుత్తడి రాణీ - నా శ్రుంగారం దేవీ    
నా ఆరాట ఉహా - నా కోలాటం ఆశా   
రేయిన్ గడు భామా - యో నా ప్రేమాబ్ది 

భావమ్ములన్ తోడన్ - భాదిల్లెన్ గాదా
నీగానము నందున్ - నిత్యానందమ్మే 
తీయంగ పాటల్ - పాడంగా రావే
సాయంను చేసే - శాంతంగా పొందే 

పుష్పాలు విచ్చే- తుమ్మేదే చేరే 
మొహాలు తీరే - సంతోషం వచ్చే 
కాలాలు మారే - కల్లోలం తీరే
బంధాలు కమ్మే - భాద్యతా పెర్గే      

  
--((*))-- * . తరుణి 

పదము పలుకు పరువు పడఁతి 
నడక నటన నగవు పడతి
నయలు హాయలు భగల పడతి
వెలుగు విమల విరుల పడఁతి 

చెలువ చిలిపి నొలుకు వనిత
సిరుయు విరియు శరను వనిత 
ముదము వ్యధయు క్షుదయు వనిత    
సుతము సుధను నొసగు వనిత 

శృతియు స్మృతియు ధృతియు మహిళ
కృతియు నృతియు గతియు మహిళ  
స్వరము స్వనము సమ్మతి మహిళ 
ఇహము పరము నమృత మహిళ 

పృదివి జలధి జలము తరుణి 
కరియు ముసలి ఫణియు తరుణి
పురుగు పులుగు దినము తరుణి  
రజని  రవళి మోహిని తరుణి 

--((*))--

 *.

*బుద్ధి

ఆత్మబుద్ధి సుఖాన్ని కోరు
గురుబుద్ధి  హితాన్ని కోరు 
సమబుద్ధి సత్యాన్ని కోరు 
నీచబుద్ధి ద్వేషాన్ని కోరు 

బంధ విముక్తియే హితం కోరు 
దు:ఖనివృత్తియే హితం కోరు
నిత్య  ప్రాప్తియే హితం కోరు 
జ్ఞాన ప్రాప్తయే  హితం కోరు 

శ్రేష్టమైన మాట మనసు చేరు 
మాతృ హృదయం బిడ్డ చేరు 
బుద్ధిహీనం చేత భయం చేరు 
తపస్సే మనస్సుకు శాంతి చేరు

రాగి తీగలో విద్యుత్  చేరు
గాలివాటమున పడవ మారు
ఆశా మొహాలు మనిషని చేరు    
మనిషి ప్రతి క్షణం సుఖం కోరు
--((*))-- 


*పర్వత వెలుగు 

ఆ ఉదయం పాడుపడిన కోటపై వెలుగు 
న్సశ్శబ్ద చెట్లకదలిక మధ్యఉండే వెలుగు 
సందర్శకులకు అది ఒకఅద్భుత వెలుగు  
ముసలి వాసన కొట్టే శిలల మధ్య వెలుగు 

గబ్బు కంపు కొట్టే దుర్వాసన మధ్య వెలుగు 
అసభ్య చిత్రాలు అందమని పించే వెలుగు  
గతచరిత్రను తెలిపే యుద్ధశకటాల వెలుగు 
కదన కుతూహల కత్తుల వీరవిహారం వెలుగు

పచ్చని గరికపై నీటి బిందువులతో వెలుగు 
జంతువులు ఆరాటంతో తినుచున్న వెలుగు 
జాలు వారు జల తరంగాల శబ్దపు వెలుగు 
దేవదేవుని స్థానంగా దేవాలయముల వెలుగు 

నగర దర్శనంతో పిల్లలో కనిపించే వెలుగు
పైకి ఎక్కి దిగుట యోగాబ్యాసం తో వెలుగు 
ప్రకృతి ప్రశాంతగాలితో మనసుకు వెలుగు 

సంగీత వేదం పఠనంతో కనిపించే వెలుగు   

--((*))--

* సుఖ జీవితం
.
సత్యంగ జీవితము - సవ్యమే సంతసం
అత్యాస భావములు - భాదలే చింతలే
నిత్యాను రాగమును - ఎంచుకో పంచుకో
ఇత్యాది కోరికలు - తీర్చుటే జీవితం

అమ్మాయి ఆశయము - విద్యయే తొడ్పడూ      
నమ్మాలి అంబరము - అందరం ఆశతో
కమ్మనై నా పలుకు  - నిత్యమే  సత్యమే
సొమ్ములే  సంతసము - ఆకలే జీవితం   

కాలమే ఆశలను - తీర్చుటే సంభవం
జ్వాలయే బ్రతుకుకు - వెచ్చనీ దివ్వెగా
పల్లకీ ప్రాభవము  - పువ్వులే నవ్వులే
చల్లనీ జీవితమ్ - ముద్దులే  ప్రేమలే 
--((*))-- 
 
 నిక్షిప్తం ?.

మనిషిలో నిక్షిప్త మైనది
శరీరం కన్నా అపురూపమైనది
స్పృజించిన కొద్దీ ఉత్తేజ పరిచేది
ప్రజ్వలించి మహాజ్వాలగా మారేది

మౌనం మూగభాషలో చిక్కి ఉండేది

అకుంఠిత దీక్షకు మూలకారణం ఇది
ప్రాణానికి  ప్రాణమని పలికి స్తుంది
స్వభావ ప్రభావముతో శక్తిని పెంచేది


లాస్యం, తాండవం కు పొంగి పోయిది

అనుమానాల గనిగా ఆవరించి ఉన్నది
దాసోహం అనేవిధముగా మారుతుంది
చుసిన తప్పుకు శిక్ష పడునట్లు చేసేది


విశృంఖలముగా కామాన్ని ప్రేరేపించేది

పంచభూతాలను చూసి పరవశించి పోయేది
బుద్దిని చింతనగా, సంతోషముగా, మార్చేది
పుత్ర,మిత్ర,ధన సంపదకు దాసోహం అనేది


పంచేద్రియాలకు తనవంతు సహకారం అందించేది    

అడ్డుకు చేరనీయకుండా శరీరంలో పీడనంలా ఉంటుంది
సిరిసంపదలతో ఊరిస్తుంది ఆశలు పెంచి ఏడిపిస్తుంది
మందు లేకుండా మనిషిని ఇష్టం వచ్చినట్లు తిప్పేది


మానవులకు బలమైన ఆయుధం, విజయపధంలో నడిపేది

ఇంతకీ నెవరో తెలుసా మెదడులో నిక్షిప్తమై ఆడించేదాన్ని
దీన్ని మందిరంగా మార్చు కుంటే దైవంగా మారుతుంది
అనుమానంగా మలచుకుంటే జీవితాన్నే కల్లోలముగా మార్చేస్తుంది
మనల్ని నయనాంధకారనుండి సుమధురం అందించునది    
--((*))_-

దీపావళి ముచ్చట్లు(కథ)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
సర్వే జనా సుఖినోభవంతు 

దీపావళి ముచ్చట్లు(కథ) 
హలో సుబ్బారావుగారు ఈ రోజు దీపావళి పండుగ కదా ఏమేమి కొంటున్నారు టపాసులు, మీ అల్లుళ్ళు కూతుర్లు వచ్చారా అని అడుగు తుంటే ఏమి మాట్లాడరు ఎందుకు అని అడిగాడు స్నేహితుడు రాయారావుగారు. 
అందరూ రమ్మన్నారు ఎవరిదగ్గరకు పోకుండా మే మిద్దరమే ఉన్నాము,  రమ్మంటే కుదర దన్నారు మరి తప్పదుగా రామారావు. 
నిజమే సుబ్బారావు మా అమ్మాయిని రమ్మన్నాను, ముందు మా ఆయనకు కారు కొంటే పండుగకు వస్తానంది, ఇప్పుడు ఏంచేయాలో తోచక నీ దగ్గరకు వచ్చాను, కారుకొనే శక్తి నాకులేదు, మరి ఇప్పుడేం చేయాలో అర్ధం కావటము లేదు. 

నేను ఒకటే చెపుతాను పిల్లల పుట్టుటకు తల్లితండ్రులు కారణం మవుతూరు, వారి బుద్దులకు మాత్రము కారకులుకారు. పిల్లలకు పెళ్లి చేసి పంపటమే మనచేతుల్లో ఉన్నది. 
అదే కూతురికి పెళ్లి చేసినప్పుడు అల్లుడే నీసొంతము అని చెపుతావు,   అత్తమామలకు సేవలు చేయాలని చెపుతావు,  అప్పటికే తన సొత్తు ఇదని, తన కుటుంబమని అవగాహనకొస్తుంది కూతురు, పిల్లలు పుట్టారనుకో వారి చదువులు, ఆలనా పాలనా కోసం ఒక సముద్రాన్ని ఈదుతూ తన కుటుంబాన్ని వడ్డున వేయుటకు విశ్వ ప్రయత్నం చేస్తుంది. 
కొడుకనుకో ఇంట్లో నే ఉండి కోడలు చేసే సపర్యలు నచ్చినా నచ్చక పోయినా నోరు మూసుకొని కాలం గడపటం తప్ప ఏమి చేయలేవు, మనవళ్లను స్కూలు దాకా దింపండి మావఁగారంటే నోరుమూసుకుని   దింపే  విధముగా మారి పోతాము.

అవును మరిచా నీకెంత మంది పిల్లలు ముగ్గురు అందరికి పెళ్లిళ్లు చేసాను,       
సరే దీపావళి టపాస్సులు కొన్నావా, కొనలేదు ఈ రోజు గుడికి వెళ్లాలనుంది, నీవు కూడా వస్తావా
పోదాం పదా, అక్కడ అక్కడ దీపావళికి సంభందించిన మన పాతకధలు చెపుతారు, మన మనవళ్లకు చెప్పుకోవటానికి వీలు ఉంటుంది.
అవునూ అదీ నిజమే కాస్త కాలక్షేపముగా కూడా ఉంటుంది. 
అక్కడే రామకృష్ణ పంతులుగారు దీపావళి గురించి చెపుతున్నారు ఈ విధముగా
            
దీపావళి పర్వదినం (పండుగ) విశేషాలు.

హిందువుల (భారతీయుల) పండుగులలో ముఖ్యమైనది దీపావళి పండుగ. వయోభేదం లేకుండా, కులమతాలకతీతంగా యావత్భారతదేశం అంతా ఐకమత్యంగా జరుపుకునే ఏకైక పండుగ ఈ దీపావళి పండుగ.
నరకాసురుడు అనే రాక్షసుని సంహారంతో, ప్రజలు ఈతిబాధల నుండి విముక్తి పొందటంవల్ల, ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండుగే ఈ దీపావళి పండుగ. రావణ సంహారం అనంతరం శ్రీరాముడు సీతాసమేతుడై అయోధ్యకు తిరిగి రావటంతో, సీతమ్మ ఒక దీపాన్ని వెలిగించటంతో, ఆ రాజ్యంలోని ప్రతీ ఇంటిలోనూ దీపాలు వెలిగించి అందరు ఆనందోత్సాహాలతో దీపావళి పండుగ చేసుకున్నారు అని ఒక కథనం. జగతిలోని చీకటిని పారద్రోలి, దీపాలతో అంతటా వెలుగును నింపే పండుగ కనుక ఈ పండుగను దీపావళి పండుగ అని అంటారు. ఈ పండుగను ప్రతీ సంవత్సరము ఆశ్వయుజ అమావాస్య నాడు జరుపుకుంటారు. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి.దీనినే నరక చతుర్థశి అంటారు.
దీప + ఆవళి = దీపాల సమూహం అని అర్థం.
ఈ దీపాలని పెట్టడంలో రెండు అర్థాలు దాగి ఉన్నాయి. చీకటితో నిండి ఉండేది నరకం కాబట్టి, చీకటి నిండియున్న ఈ అమావాస్యలో పితృదేవతలందరికీ త్రోవని చూపించేందుకు దీపాలని పెడతారు అని ఒక విశేషం. ఇక రెండోది -- లక్ష్మీదేవికి దీపాలంటే చాలా ప్రీతి. ఇంటినిండుగా దీపాలున్న గృహమంటే ఆమెకు ఎంతో ఇష్టం.
పూర్వం దుర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుడు ఇచ్చిన ఆతిథ్యానికి సంతోషపడి, ఒక విలువైన హారాన్ని ప్రసాదించాడు.ఇంద్రుడు దానిని అహంభావముతో తన దగ్గర ఉన్న ఐరావతము అను ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో తొక్కినుజ్జు నుజ్జు చేసింది. అది చూసిన దుర్వాసమహర్షి ఆగ్రహముతో దేవేంద్రుని శపిస్తాడు. శాప ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని ఏం చెయ్యాలో పాలుపోక మహావిష్ణువుని ప్రార్థిస్తాడు. విషయం గ్రహించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సలహా ఇస్తాడు.ఇంద్రుడు విష్ణువు చెప్పినట్లే చేయగా, లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.
ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. నిన్ను ఏ విధంగా పూజిస్తే నీ కృపకు పాత్రులమవుతాము?? అంతట మహాలక్ష్మి " త్రిలోకాథిపతీ.!. "నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి కోర్కెలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, సంతానాన్ని కోరే వారికి సంతానలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలునిఅవుతాను" అని సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.


ముఖ్యముగా దీపావళికి టపాసులు కాల్చేటప్పుడు నూలువస్త్రములు, కాళ్లకు చెప్పులు, దగ్గరలో నీరు  నింపిన కుండలు ఏర్పాటు చేసుకోవాలి, ఏదన్న టపాసు పేలలేదనుకోండి దానిని వదిలెయ్యాలి, అంతేకాని తగ్గరికి పోయి చూడటం కదిలించటం చేయటం ప్రమాదం అలాచేయకండి. చేతులతో బాంబులు కాల్చకండి,   పూర్వము చాటలతో శబ్దాలు చేసేవారు, దివిటీలు తిప్పేవారు, మతాబులు చిచ్చుబుడ్లు,     తారా జువ్వలు ఇంట్లో తయారు చేసేవారు, వారు కుడా ఊరు చివర వెళ్లి కాల్చేవారు. 
ఆధునిక పద్ధతులు వచ్చాయి, టపాసులలో కూడా కొత్తవి తయారు చేస్తున్నారు . 
నూనె  దీపాలు వెలిగించండి. లక్ష్మీ  దేవిని కొలవండి అందరూ కలసి ఆనందంగా తీపి పదార్థాలు పంచుకొని ఆనందంగా దీపావళి జరుపుకోండి అంటూ ముగించారు. 

క్కడ ప్రసాదంగా పెట్టిన పులిహార తిని బయటకు నడిచారు రామారావుగారు, సుబ్బారావుగారు. 
సరే     ఇంత దూరము వచ్చాముకదా అలా ప్రభుత్వము వారు ఏర్పాటుచేసిన స్టాల్సులో టపాసులు   కొందాము. 
              
సరే నీమాటను కాదన్నాను ఎప్పుడైనా, 
మరే దీపావళి ముచ్చట్లు బాగా జరిగాయి, ఇలా కలుసుకుంటూ ఒకరి ముచ్చట్లు ఒకరు చెప్పుకుంటే మనసు తేలిక పడుతుంది కాదా 
అవునూ అక్షరాలా నిజం.   

*నోట్ల మార్పిడి-తెచ్చిన తంటా ( కధ )

 ఓంశ్రీ రామ్  - ఓం శ్రీ మాత్రేనమ

సర్వేజనాసుఖినోభవంతు : 

ఏమండి టి.వీ.  చూసారా,, ఏముంది దానిలో అసభ్యకరమైన నృత్యాలు, అర్ధం కాని పాటలు ,  నాయకుల వాదోప వాదాలు, దెయ్యపు కథలు, అర్ధరాత్రి హత్యలు, ప్రభుత్వము వారు ప్రజలకొరకు ఇవి చేస్తున్నారు ఇన్ని కోట్లు ఖర్చు, అది చేస్తున్నందుకు అన్ని కోట్లు ఖర్చులు అని వినటం, లేదా ప్రేమికులు హత్యలు, చూసిన సినిమా చూడటం తప్ప ఏమున్నదే దానిలో.


మీ కదే తెలుసు 500 రూపాయల నోట్లు, 1000  రూపాయల నోట్లు రద్దు చేస్తున్నారు తెలుసా

అయినా మన దగ్గర ఏమున్నాయి, ఏదన్న అవసరం అనుకునే  ఏ .టి  ఎం  కు పోయి డబ్బులు తెచ్చుకుంటున్నాము కదా
.
ఈ రోజు ముందు ఈ ముడుపులో దాచిన నోట్లు మన డిపాజిట్ లో వేసి రండి.

మన కవసరమయితే ఎట్లాగే, పనికిరాని నోట్లు ఇంట్లో పెట్టుకుంటే ఎం లాభం ముందు  బ్యాన్కు లో వేసి రండి అన్నది శ్రీమతి సుభద్ర.

సరేనే ఆగొడుగు, కళ్ళజోడు, ఆ కర్ర, ఇటు ఇవ్వు నెమ్మదిగా పోయి నీ      ఎకౌంట్లో జమా చేసి   వస్తాను, నాకు ఆలస్యమైనదని గాబరా పడకు, అక్కడ ఎంత మంది ఉన్నారో తెలియదుకదా అన్నాడు అర్జున్ రావు .

మీరు ఆఁలా అంటారని నాకు తెలుసు ఇదిగో ఈ సెల్లు దగ్గర పెట్టుకోండి, అక్కడ ఆలస్యమైతే నాకు ఫోన్ చేయండి.

నెమ్మదిగా బ్యాన్కువద్దకు చేరాడు అర్జున్ రావుగారు, అక్కడ ఒక పెద్ద క్యూ ఉన్నది దాని దాటుకుంటూ లోపలకు పో బోయాడు, అక్కడ వున్నవారు ఒక్కసారి దాడి చేసి నట్లు ముసలి వారని కూడా గమనించకుండా మేము పొద్దున్న వచ్చాము, మీరు ఇప్పుడొచ్చి ముందుకు పోతారా అని ఒకటే అరుపులు గత్యంతరం లేక లైన్లో నుంచొని ఉన్నాడు, పైన ఎండగా ఉన్నదని గొడుగు తీస్తే పక్కవాడు పొడుచు కుంటున్నాదని పోట్లాడాడు, కనీసము మంచి నీళ్లు కూడా ఏర్పాడు చేయలేదు బ్యాన్కువారు, అతి కష్టం మీద మూడు గంటలు నుంచొని బ్యాన్కు లో డిపాజిట్ చేసి వచ్చాడు అర్జున్ రావు.

ఏమండి ఉప్పు లేదు కొనుక్కు రండి అని ఇంట్లో ఉన్న చిల్లరంతా సేకరించి ఎక్కువరేటుతో ఉప్పు ప్యాకెట్టు కొనుక్కొని తెచ్చాడు.

ఏమండి మందులు అయిపోయినాయి ఏ.టి.ఎం వద్దకు పోయి డబ్బులు తెండి అన్నది సుభద్ర.

ఎం తెచ్చేది వాగులో మట్టి తేవచ్చు అసలు ఏ.ట్.ఎం.లో డబ్బులు పెడితేనే కదా, మరి ఎట్లాగండి నాకు చాలా కష్టముగా ఉన్నది, ప్రాణం పోయేటట్లు ఉన్నది.

నీవు భాద పడకు మందులు షాపు వాన్నీ బాకీ అడుగుతాను అని వెళ్ళాడు మందుల షాపువద్దకు

ఏమండి పెద్ద వారు, మీరు అప్పు అడగటం ఏమిటి,  ఎం చెప్పమంటావు బాబు ప్రభుత్వం వారు నోట్లు రద్దు చేసారు, ఏ.ట్.ఎం లో డబ్బు లేకుండా చేశారు, నీకు తెలుసు కదా అందుకని వచ్చాను అని నెమ్మదిగా చెప్పాడు. అదిగో ఆబోర్డు చూడండి దాని బట్టి మీరు ప్రవర్తించండి అని చెప్పగా  అటు చూడగా దానిపై 'అప్పు రేపు' అని ఉన్నది.

అప్పుడే అర్జునరావు స్నేహితుడు సుబ్బారావు కని పించాడు, వీరిద్దరి మాటలు విని వెంటనే ఆఁ చీటీలో ఉన్న మందులు ఒక్కొక్కటి చొప్పున, అన్నీ ఎంతవు తుందో చెప్పు నేను ఇస్తాను అని తీసి కొంత పైకము ఇచ్చాడు సుబ్బారావు.

ఒక పూటకు మాత్రలు తీసుకోని అర్జున్ రావు సుబ్బారావుతో మీరు చాలా తెలివి గలవారను కుంటా ముందు జాగర్తగా 100  రూపాయలు నోట్లు ఉంచుకొని ఉనట్లున్నారు.

మీరు అమాయకులు లాగున్నారు, భాద పడుతున్నారుగా, అవును సుబ్బారావ్ నీ దగ్గర డబ్బులెట్లా వచ్చాయి, ఏమీ లేదు అర్జున్ రావుగారు నాకు ఒక మెసేజ్ వచ్చింది మీ డబ్బుకు 100  నోట్లు ఇవ్వ బడును, కొంత కమిషన్లతో అని ఉన్నది.  మంచిదని అక్కడకు పోయాను వారి కమిషన్ ఇచ్చి నోట్లు తెచ్చుకున్నాను.

మరి మీరు బ్యాన్కులో వేయలేదా ఎందుకు వేస్తామండి, అక్కడకు  పోయి ప్రాణ్ కార్డు చూపి మరి వెయ్యాలి మా కెందు కండి అంత కష్టం అని నిర్మొహ మాటంగా చెప్పాడు, అర్జున్ రావు ఏంచేయాలో తోచక రెండో పూటకు మందులెట్లా అని ఆలోచిస్తూ సుబ్బారావును అప్పు అడుగు దామని నిర్ణయించుకున్నాడు. నెమ్మదిగా నాకు కొంత డబ్బు కావాలి అప్పుగా మాత్రమే అన్నాడు

అయ్యో మీరు అట్లా అడగాలండి ఒక్క మూడు రోజులు లాగండి ఏ.ట్.ఎం లు పని చే స్తాయి డబ్బు తీసుకోని ఇస్తాను ఇంతకీ మీకు ఎంత కావాలి అన్నాడు.

ఇపుడు ఎంత ఇవ్వగలవో చెప్పు అన్నాడు అర్జున్ రావు సుబ్బారావుతో అంత కోపము వద్దు అర్జన్ రావు ఇప్పుడు నేను ఇవ్వనంటే మన స్నేహం చెడి పోతుందని అనవద్దు, నీ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేను, మా హెడ్ ను కనుక్కొని రేపు చెప్పగలను సరే నీ మాటకు నేను ఏమి చెప్పగలను నీకు ఒక నమస్కారము తప్పా.

          అప్పుడే   తెలిసింది బ్యాంకులో డబ్బు తీసుకొనుటకు వీలు కల్పించారు  విషయం తెలుసుకొని అతికష్టం మీద ఇంటి దగ్గరగా ఉన్న s.b.h   బ్యాన్క్ లో లైన్ లో నుంచొని వెళ్లగా మాదగ్గర మీ ఎకౌంట్ లేదు, మీ చెక్కు ఇక్కడ మార్చుటకు కుదరలేదు అన్నారు , చేసేది లేక మరలా  SBH ఎకౌంట్ ఉన్న చోటునే వెళ్లి లైన్లో నుంచొనగా, 20, 2000 రూపాయల నోట్లతో బయటకు రాగలిగాడు అర్జునరావు.

మొత్తం మీద మందులు కొనుక్కొని ఇంటికి చేరాడు, అప్పుడే సు బ్బారావు వచ్చి ఇదిగో నీవు అడిగావు కదా డబ్బులు తెచ్చా 3 రూపాయల వడ్డీ అవుతుంది నీకు ఇష్టమైతే తీసుకో అన్నాడు . వెంటనే అర్జున్ రావు ఇప్పుడు అవసరము లేదు, అవసరమయితే నీ దగ్గరకే వస్తా అని చెప్పి పంపించాడు .

 ఇదేమి లోకమో బలహీనులను   బలవంతులు   దోచుకుంటారు, బలవంతులను తెలివిగలవాళ్ళు దోచు కుంటారు, తెలివి గలవాళ్ళు ఆశకు పోయి ఉన్నది పోగొట్టు కుంటారు, మధ్య తెలివిగలవాడు ప్రభుత్వాన్ని దోచుకుంటారు, టాక్స్ కట్టకుండా తిరిగినా ఏమి చేయ లేరు, ఇతరదేశాల పారిపోయినా ఏమిచేయలేరు, నోట్లు మారుస్తున్నారు ఐ .టి  కట్టని వారిని  ఎవరు పట్టు కుంటారు, ఏది ఏమైనా కొత్తనోట్లు రావటం సూచకం, ప్రజలు భాద పడకుండా ఏ.టి.ఎం. లో  కూడా డబ్బు పెట్టుట ఇంకా శుభసూచకం.

17, నవంబర్ 2016, గురువారం

ప్రాణ దాతలు (story)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
 
సర్వేజనా సుఖినోభవంతు
ప్రాణ దాతలు 
 ఏమిటోయ్ పొద్దున్నే ఆకుకూర పట్టుకొచ్చావ్, అలా కూర్చొని వాగే బదులు కాస్త మీ భార్యకు సహకరిస్తే మీ సొమ్మేపోదు అన్న మాటలకు అంత రుసరుస పలుకులతో మాట్లాడుట మంచిది కాదే  అన్నాడు భర్త.

మాటలకేం చక్కగా మాట్లాడుతారు,  నా మాటలకు మాత్రం సమాధానము రాదు. ఏమిటే అట్లా మాట్లాడుతావు నీవు ఏదంటే అదే చేస్తున్నాగా, సరే మీరు ఇప్పుడు ఏమిచేయ వద్దులే అంతా  నేను చేసు కుంటాలే, అప్పుడే కోపం వచ్చిందా ఏమిటి, కోపం కాదండి మీచేత పనిచేయిన్చటం మంచిది కాదు కదండీ, అన్ని నీవే అంటావు అంతా మీ ఆడోళ్లకే చెందుతుంది.  ఏమాటైనా నవ్వుతూ ఆకుకూర తీసుకొని లోపలకు వెళ్ళింది.

అవునే మనపిల్లలు కనిపించుట లేదే, అయ్యే రామ మీకు చెప్పలేదా, స్కూలు పిల్లలతో చెన్నై టూర్ కు వెళ్లారు, ఎదో చేతి ఖర్చు కావాలంటే ఇచ్చాను.

అవునే రాత్రి  నిద్రలో పిల్లలొచ్చి అడిగారు నేను ఒప్పు కున్నాను కూడా.
ఈ వయసులో అంత  మతి మరు పేంటీ, ఏమోనే పిల్లలను స్కూల్లో దించే అలవాటుగా అడిగా అంతే.
మనం ఈ కార్తీకమాసంలో విజయవాడ వెళ్లి కృష్ణలో స్నాన మాచరించి, దుర్గమ్మను కొలిచి అక్కడే ఉన్న మాగురువు గారు శర్మ గారింటికి వెళ్లి వద్దామా, పిల్లలు ఎటుతిరిగి చెన్నై కి వెళ్లారుకదా అని అడిగాడు భర్త శంకరం భార్య పార్వతితో.
నీమాట ఎప్పుడు కాదన్నానండి అని నవ్వుతూ పలికింది. అవునే నామాట ఎప్పుడూ కాదనవు, సరేలే ఒక మూడు రోజులు సరిపడే బట్టలు సర్దు నేను బస్సు టిక్కెట్లు తెస్తాను, ఈ రోజు రాత్రికె వెల్దాము,
అట్లాగేనండి అన్నీ సర్దుతా
తెల్లవారుజామునే విజయవాడ లో ఉన్న శర్మగారి ఇంటికి చేరారు.
శర్మ గారి కుటుంబం సాదరంగా ఆహ్వానించింది, అయన భార్య సరస్వతి, పిల్లలు కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు, చేతికి టవల్ అందించారు. అక్కడే కాలకృత్యాలు తీర్చుకొని ఉభయ పక్షాల క్షేమ సమాచారాలు తెలుసు కున్నాక కృష్ణ స్నానం దైవదర్శనం అంటూ  మేము శర్మ గారి భార్య పిల్లలతో బయలు దేరాము.    

మేము ఘాట్ దగ్గర స్నానం చేసి పైకి వచ్చాము గుడికి పోదామని, అప్పుడే శర్మగారి పిల్లవాడు గబగబా నీటిలోకి దూకాడు నీటిలో కొట్టుకు పోతున్న పిల్లవాన్ని కాపాడాడు, నేలమీద పడు కోపెట్టి పొట్ట వత్తాడు, నోటి నుండి నీరు కారుతూ కదిలాడు, ఆపిల్లవాని తల్లి తండ్రులు ఆ ఆమ్మ వారు నీలో ప్రవేశించి కాపాడింది బాబు, ఈ బాబు వాని తల్లి తండ్రులు చాలా పుణ్యాత్ములు అంటూ దీవించి వెళ్లారు.
అప్పుడే ఒక్కసారి తనపిల్లలు చేసే పనులు  గుర్తు తెచ్చు కుంది పార్వతి. నా పుత్రుడు మోటార్ సైకిల్ తో  ముసలావిడకు  డాషిచ్చి,    అయ్యో పాపం అనక పోగా,  అడ్డు వచ్చిందని తిట్టి మరీవచ్చాడు,    పోలీసులకు డబ్బులిచ్చి కేసులేకుండా చేసాడు.    

నా పుత్రిక ఎమన్నా తక్కువ తిన్నదా ఇంటి ముందుకు బిచ్చగాలొస్తే వారిపై కుక్కను తరిమి సంబర పడేది.  పనివాళ్లను కూడా నీటికి వచ్చినట్లు తిట్టేది. 
మచ్చుకైనా గౌరవ భావము లేదు నా బిడ్డలకు. అనుకున్నది. 

అమ్మవారి దర్సనం చేసుకొని శర్మ గారి ఇంటికి చేరాము.
అప్పుడే శర్మ గారి తండ్రి గారికి సేవలు చేస్తున్నారు, ఆయన వయసు 70 దాకా ఉండవచ్చు, పిల్లలు తాతా బాగున్నావా పలకరింపులు ఆయన ఓపికతో కధలు చెపుతున్నాడు 

శరణ కోరినవారికి అనేక మార్గాలు చూపిస్తాడు ఆ పరమాత్ముడు, అన్నింటికీ మూలం బుద్ధి, ఇది సక్రమముగా నడుస్తున్నప్పుడు, మానవుని  ప్రతిభ, ప్రజ్ఞ, నలుదిశలా పరిమళిస్తుంది. రాగ ద్వేషా లు, మానవుని ప్రధమ శత్రువులు వాటిని మానవులు త్యజించాలి.  కానీ కొందరు ఎవరో ఒకరికి భయపడి బంధాలు తెంచుకుంటున్నారు, వయసు మీరిన తల్లి తండ్రులను దూరంగా ఉంచు తున్నారు. ఎందుకు అలా ప్రవర్తిస్తారో నాకు తెలియుట లేదు, వారు పెద్దవారు కారా వారి పిల్లలు వారిని అట్లా చూస్తారని అనుకోరు ఎందుకు , ఇది అంతా కలియుగ మహిమ అనుకుంటున్నాను అని భాదతో శర్మ గారి తండ్రి గారు భాదతో పలికారు.  అవును శంకరం గారు మీ నాన్నగారు బాగున్నారా, వారు నాకు ప్రాణ దాత ఎలాగంటే మీనాన్నగారు నేను ఒకే ఆఫీసులో పనిచేసే వాళ్ళము, ఒకనాడు క్యామ్పుకు ఇద్దరం కలసి వెళ్ళాము, అక్కడ వాతావారణం నాకు పడ  లేదు, అంతా వర్క్ మీనాన్న చేసాడు అప్పుడే నాకు ఎదో పురుగు కుట్టింది,జ్వరం కూడా వచ్చింది వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు, నాకు సేవలు చేసాడు అటువంటి ప్రాణదాతకు నేను రుణపడి ఉన్నాను 
మీఇంటికి వచ్చి కలవాలని అనుకుంటున్నాను అన్నాడు.      
వింటుంటే పార్వతి మనసు కరిగి పోయింది. నేను ఉద్యో గం మానేసి మావ గారికి, అత్తయ్య గారికి సేవలు అందిస్తాను. 

అప్పుడే నెమ్మదిగా భర్త దగ్గరికి చేరి ఏమండి మీ తల్లితండ్రులను   వృద్ధాశ్రమం నుండి తీసుకొస్తే ఎంత బాగుంటుంది.

అవునే నేను చాలా తప్పు చేసాను,   ప్రాణ దాతలను నిర్లక్ష్యం చేసాను, అన్న  లు  వంత  పలికారని నేనుకూడా వెనకాడాను, వారికి సేవ చేయకుండా వృద్ధాశ్రమం లో ఉంచాను, నెలకు కొంత డబ్బు పంపుతున్నాను కానీ వారి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, ఇప్పుడు శర్మ గారి కుటుంబం చూసాకా నేను తల్లి తండ్రులకు  సేవ  చేద్దా మనిపిస్తున్నది.
అవునండి నాకు అదే అనిపిస్తున్నది        

వృద్దశ్రమంలోకి పార్వతీ శంకరులు పిల్లలతో లోపలకు ప్రవేశించారు. అక్కడ  ఉన్న తల్లి తండ్రుల పాదాలను కన్నీళ్లతో కడిగాడు, "సాగరంలో నీటి బుడగ మరల సాగరంలో కలసి పోవటమే మోక్షమని తెలుసుకున్నాము" తల్లి తండ్రులకు సేవచేయుటయే మానవజన్మ పరమార్ధమని తెలుసుకున్నాను. 
 మావయ్య గారు అత్తయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నాను రండి, మీకు సేవలు  చేయుటకు మేము సిద్ధముగా ఉన్నాము, రండి తాత గారు, అమ్మొమ్మగారు అని పిలుస్తూ పిల్లలు కన్నీళ్లతో అభిషేకించారు.     
        

      
  13, నవంబర్ 2016, ఆదివారం

Internet Telugu Magazine for the month 11/2016/43

ఓం శ్రీ రామ్ - ఓం శ్రీ మాత్రేనమ:
సర్వేజనాసుఖినోభవంతు

ప్రాంజలి ప్రభ-2
* కవుల రాతలు

అనిర్వచనీయ క్షణాలు
మరిచి పోలేని మధుర స్మృతులు
నిర్వచనీయ స్నేహాలు
ప్రాణానికి ప్రాణ హితులు

ప్రాణధారా పలకరింపులు
మదిలో నిలిచే పోయే స్మృతులు
జాజిపూల చినుకులే నవ్వులు
నవ్వుల వర్షమే స్వేత కలువలు

ప్రేమొన్నతాలే  పరిచయాలు 
పరిచయ కలలే ప్రేమకు చిహ్నాలు    
తరంగాలు మానవుని ఊహలు
ఊహలే మనసుని తొలిచే కెరటాలు      

గత జన్మ జ్ఞాపకాలే కలయికులు
కలయికలు జన్మజన్మ జ్ఞాపకాలు 
ముత్యాల సరాలే మనసులు
మనసుకు అర్ధాలే ముత్యాలు

విడదీయని భందాలు జీవితాలు
జీవితాలే పెనవేసుకొని బంధాలు
సర్వోన్నతాలే సంభందాలు
సంబంధాలే మనసుకు ఉన్నతాలు

కరిగి పోని కలలే కధలు
కధలే జీవితంలో చూపే కళలు
కవుల రాతలు హృదయ తపనలు
కొన్ని కధలు దారిచూపే దీపశిఖలు 
--((*))--


*తెలుగు భాష

కమ్మని భాష - ఎదను కుదిపే భాష
నమ్మిన భాష - నమ్మకం పెంచిన భాష
ప్రకృతి భాష -  ప్రపంచంలో గొప్ప భాష
ఛందస్సుగల భాష - మన తెలుగు భాష 

శ్రీకృష్ణ దేవరాయలు రచించిన భాష    
నన్నయ్య, తిక్కన, యర్రాప్రగడ, భాష
కాకతీయుల సిరికి గంధమలదిన భాష
అల్లసాని పెద్దన, అల్లిన తెలుగు భాష

కడలి అంచున దాటి కదను దొక్కిన భాష
త్యాగయ్య   గొంతుకు  రాగమద్దిన  భాష
రామదాసు, క్షేత్రయ్య సంగీత కీర్తనల భాష
ఘంటసాల మధుర పాటల తెలుగు భాష
--((*))--


*మార్గదర్శకులు వీరే     

లోకం లో ప్రతి ఒక్కరు గొప్పవారు
కాలం తో బ్రతక నేర్చిన వారు
గమ్యం లో ధర్మమార్గం నడిపేవారు
విజ్ఞులంతా భక్తులుగా ఉన్నవారు

పూజకు లొంగేవారు,
పొగడ్తలు నమ్మేవారు
అట్టహాసం లేని వారు,
అహంకారం లేని వారు

ఆరోగ్య సూత్రాలు తెలిపేవారు
ఆధ్యాత్మిక విశేషాలు తెలిపేవారు
మహా మహులు జ్ఞాన బోధ చేసేవారు
జ్ఞాన యోగ ఫలితాలను తెలిపేవారు 

జీవితమంటే ఏమిటో తెలిపేవారు
ఉత్తమ గతి పొందే మార్గం తెలిపేవారు
బుడగ లాంటి బ్రతుకు కాదు అనేవారు
తనువున్న నాడు దేశానికి సహాయపడేవారు

లక్ష్యసాధనలో కృషి చేసేవారు
సాధనతో సంతృప్తి గా ఉండేవారు
శ్రమిస్తే ఫలితం ఉందనే వారు
ఆశతో ఉంటే నరకం ఉంటుందనేవారు

మదిలో నిలిచిపోయే మంచిమాటలు చెప్పేవారు

-((*))--   
 విపినతిలకము - న/స/న/ర/ర IIIII UIII - UIU UIU
15 అతిశక్వరి 9696
*యవ్వన చిలుకలు (ఛందస్సు)

నిను తలచె నీసొగసుతొ  - సంబరం సంతసం
కలలను నిజంచెయుట  - సుందరం సవ్యయం
మనసును మాయచెయక - మన్మధ పిల్వవే
సొగసుతొ బంధమును   -  సుస్థిరం చెయ్యవే

నయనములు తోపిలుపు -  గుర్తుగా యవ్వనం
పదములును పల్కుటయు  - శక్తిగా నమ్మకం
కరములను  ఒక్కటిగ - చేయగా అంబరం
ఆధరములను అందుకొను - ఆర్తిగా బంధమే

కమలములు పూజకుయు- సంబరంకూ కదా
వినయముల కాపురము   - రాజకీయం కదా
సమయమును శాంతముకె - వాడటం మంచిదే
నియమమును పాల్గొనుట  - ఇద్దరూ ఒక్కటే

--))*((--            
   వనమయూరము - భ/జ/స/న/గగ UIII UIII – UIII UU
14 శక్వరి 3823

బాధ్యతల పూర్తియును  - సుస్వగతము కాదా
వాదనను దీవెనను - ఒక్కటియును కాదా       
అంతరము రామమయ మే- శుభము కాదా
కాలము అర్థములను - తెల్పుటయు కాదా
--((*))--          


*ఒక్క రోజు బ్యాన్కు లో
నా అనుభవం 

భయంకర సూన్యంలో
ఆశగా కళ్ళు తెరిచి చూసా
రణగొణ ధ్వను లలో
పెచ్చులూడిన కాపాలాలను చూసా

అప్పుడే వేలికొనలు తో
తడిలేని మాటలను చూసా
రాబందులు ఆకలి లాగా
గొంతులో తడి యారిదాకా అరిచా

యంత్రలోక యుగములో
మానవులలో నిరాశ చూసా
తప్పిక తీర్చుకొనుటకు
ఆదారి ఈదారి అంటూ తిరిగా

నేలరాలే కొన ప్రాణంతో  
ఎదురు చూపులతో తిరిగా
కమ్ము కోస్తున్న తల తిరుగుడు
తట్టు కొని బ్యాన్క్  లో చేరా

పగటి  నక్షత్రాలు  చూసా
కడలిని రెక్కల పక్షులను చూసా
గాలి నెవరో బంధించారో
పలు సువాసనల మధ్య  నలిగా

నీడలో  సేద  తీర్చుకున్నట్లుగా  
2000 రూపాయల నోట్లతోతేలిక  బయటకు వచ్చా
రూపాయ విలువ లేనట్టుగా
నోటుకు చిల్లర దొరకక తిరిగా

పడగవిప్పిన  పాముల కోసం  
ఏసిన ఎత్తులు ఫలితం దేవుడెరుగు
ప్రజలకు నోటులో ఆశచూపి
కష్టాలు శాశ్వితం కాదు అనటం
తేలిక  అనుభవిస్తే తెలుస్తుంది  
--((*))--

4 . "మార్పు "

మార్పును స్వాగతించాలి
ప్రతిఒక్కరు ఓర్పును వహించాలి
ఉత్తమ సమయం కోసం వేచి aఉండాలి
మార్పును అనుగుణంగా మనం మారాలి

యదార్ధాన్ని గమనించి అడుగు వేయాలి
వ్యతిరేక దోరనలు, భయాలు ప్రక్కకు నెట్టాలి
మానసికముగా మనోధైర్యాన్ని పెంచు కోవాలి
అంతర్గతముగా, బాహిర్గతముగా ఒప్పుకోవాలి

అంగీకరించక తప్పదను కుంటే స్వాగతించాలి
నడి వయసులో  ఉన్న వారు వత్తిడి తట్టుకోవాలి
ఫలితాలు వచ్చే దిశలో ప్రతిఒక్కరు అడుగు లెయ్యాలి
నేను చేయగలను అనే నమ్మకంతో బ్రతుకు సాగించాలి

ముసలివారు, అనారోగ్యులు, ఆత్రుత తగ్గించు కోవాలి
అయిష్టం ఇష్టంగా అనిశ్చితం నిశ్చితంగా మార్చుకోవాలి
మిమ్ములను గుర్తించినది ఏది మిమ్ము వదలదని గమనించాలి
మీ నైపుణ్యం, మీ శక్తి వ్యర్ధ పరచక నలుగురికి సహక రించాలి

నేను చేయలేను అనే భావన మనసులో నుండి తుడిచి వేయాలి
మార్పులోవచ్చే సవాళ్ళను ప్రతిఒక్కరు ధైర్యముగా ఎదుర్కోవాలి       
   --((*))--

 
*మనసు  తాకు

మల్లెల పరిమళం మనసు  తాకు
కాగితపు పూలు అందాన్ని  తాకు
వెన్నెల చల్లదనం జంటను తాకు
సూర్యుడు వెలుగు జగతిని  తాకు

సజ్జనుని  సద్గుణం  ప్రేమను తాకు
దుర్జనుని  సద్గుణం  ఆశను  తాకు
దీపం క్రిందనే చీకట్లు తాకు
భూమి పొరల్లో జలరాసులు తాకు

దుమ్ము, ధూలి అద్దాన్ని తాకు
మనుషుల జీవితం భ్రమలను తాకు
ఆవేశం, అహంకారం పరగుండెను తాకు
సద్గున శీలునకు  జనోద్ధరణ తాకు

నీతి నియమాలకు దుర్వసనమ్ తాకు
జనన  మరణాలు ప్రాణులను తాకు
నిశ్చల స్థితునకు చపల చిత్తుడు తాకు
కపట ప్రేమకు ఆశల దొంతరలు తాకు

మేఘాన్ని మెరుపు తాకు
 వర్షం  పృథ్విని తాకు
పూచిన పువ్వు కాయను తాకు
స్వచ్చంద మనసుకి మాలిన్యం తాకు
 --((*))--

*1000,500 ల పాత నోట్లు 

*అంగట్లో  అన్ని   ఉన్నాయి   - జేబులో   1000,500 ల   నోట్లు  ఉన్నాయి 
నోట్లు  చెల్లవని  బ్యాంకుల్లో మార్చు  కోమని  సలహా - సలహాకు తిండి దొరకలేదు   

*ఐదువందల నోటోడికి వెయ్యినోటోడు లోకువని - ఎంత  డబ్బు ఉన్న అక్కరకు పనికి రాకపోతే ఉన్నా లేనట్టే కదా 

*అన్నీ ఉన్న వందనోటు అణిగిమణిగి ఉంటది..ఏమీలేని వెయ్యినోటు ఎగిరెగిరి పడుద్ది,
ఎగిరెగిరి పడేవారికి విలువలేదు, పెద్దతరహా ఉన్న గుర్తింపు లేకపోతే విలువలేదు.  

*బుద్ధి 5  వంద నోట్లంటుంటే రాత వెయ్యినోట్లంటున్నది, బుద్ధి  రాతను  తప్పించుకోలేరు అంటే కనిపించనవి మనం ఏమిచేయ లేమని అవసరము  కానీ  ఎన్ని  నోట్లున్న  వ్యర్ధమే  కదా

*ఎక్కడయినా బావేగానీ వెయ్యినోటుకాడ కాదు. వంగ తోట వద్ద బావ విలువ వెయ్యినోటు లాగా మారింది  కదా  

* భూమి  విలువ  పడి పోయింది, కొత్త నోట్లు వచ్చేదాకా కొంత అగచాట్లు తప్పవు  అందరికి,
దేశాభివృద్ధికి  ఈ పని హర్షణీయమైనది అని  గమనించగలరు         :
 
*నా కలల కవిత్వం
 
ఒక  సాయంత్రం నదివద్ద ఉన్న చెట్టును చేరా 
చల్లని గాలిలో ఎగిరే పక్షులను చూసా 
కొమ్మల మాటున మొగ్గల గుసగుసలు చూసా
అస్తమించు చున్న సూర్య బింబం చూసా 

      నన్ను వెంటాడుతున్న జ్ఞాపకాలు చుట్టుముట్టాయి 
ఎక్కడో గుడిగంటలు మారు మ్రోగి నన్ను పిలిచాయి
నీటిలోని చేపలు నన్ను చూసి ఎగిరెగిరి పడుతున్నాయి 
నీటిలో పడవలు  పురిటినెప్పుల స్త్రీవలే నడుస్తున్నాయి 

నీటిలో  చూసిన కొనమెరుపుతో మనస్సు ప్రశాంతం 
 నాలో ఉడుకుతున్న రక్తం చల్లబడి ప్రశాంతం 
 ప్రకృతి కౌగిలిలో నా కలల కవిత్వం ప్రశాంతం 
నిశ్శబ్దంలో మనో నిగ్రహశక్తి  నాలో  ప్రశాంతం

--((*))--