5, నవంబర్ 2016, శనివారం

Internet Telugu magazine for the month of 11/2016/42

ఓం శ్రీ రామ్ - ఓం శ్రీ మాత్రేనమ:
సర్వేజనాసుఖినోభవంతు

*ఓ ప్రేమ సాక్షి

నీ  పేరు ఏమిటో 
నీకు ఏపేరున్న నాకు సాక్షి 
నీకు నేనంటే చాలా ఇష్టం 
నీ చూపే నాకు సాక్షి 

నీకు నేనంటే ప్రాణమే 
నీ పరుగులే నాకు సాక్షి
నీకు నేను అభిమానినే 
నీ నిరీక్షణే నాకు సాక్షి 

నీకు నేనంటే అనురాగమే 
నీ ఆతురతే నాకు సాక్షి 
నీకు నేనంటే ప్రేమే 
నీ హృదయస్పందనే నాకు సాక్షి 

ప్రియా నీ పరువము చూస్తే
నా మదిలో పులకరింతలు   
నీ వాలు చూపులను చూస్తే
నా హృదయంలో దడ దడలు 

నీ స్పర్శ నన్ను తాకితే 
నా మనసులో ప్రేమ జ్వరం 
నీవు నవ్వుతూ నన్ను పిలిస్తే 
నా హృదయం నీకే అర్పిస్తాను     
 --((*))--

  తృప్తి - సంతృప్తి 

ఓ మనిషి ఇది  గమనించు   

బ్రతికే విద్యను నేర్పిన గురువులా 
బ్రతుకు మార్గం చూపే తరువులా
బ్రతుకంతా వెలుగు నింపే సూర్యుడు లా 
కుటుంబాన్ని బ్రతికించు కునే శక్తి లా 

చీకటిని తరిమే కాంతి పుంజము లా 
       సకల దుర్మార్గాన్ని తరిమే సునామిలా  
మదాందులకు బుద్ధి చెప్పే ధీరుడిలా
మన మనస్సును ఆకర్షించే ప్రేమలా 

    మృగాసురులను వేటాడే నర సింహం లా 

భయాన్ని తొలగించే హనుమాన్ కవచం లా 
నవ ప్రగతి వీక్షింక్షే పుణ్య మూర్తి లా 
           ప్రజల ఉన్నతిని కాంక్షించే రచయిత లా 

మహా వృక్షాన్ని సృష్టించే విత్తులా 
      శ్రమతో కష్టించి రక్తాన్ని పంచే కార్మికుడిలా
 హృదయాన్ని ఓదార్చే సంగీతం లా 
మనసును అర్ధం చేసుకొనే మహా మనిషిలా ఉండు
--((*))--

 
ఇదేమి లోకం 

గంగ ఒడ్డున నీటి పొట్లాలు అమ్మటం 
కాశ్మిరులో కొబ్బరి బొండాలు అమ్మటం 
రోహిణీ కార్తిలో వేడిపాలు అమ్మటం 
జనసంచారం లేచోట చల్ల అమ్మటం 

గాలి, నీరు, నిప్పు కొనుక్కోవటం 
అతివృష్టి, అనావృష్టితో వ్యాపారం 
బలహీనులపై బలాఢ్యుల దౌర్జన్యం 
భుక్తి కోసం ప్రజా హక్కుల పోరాటం 

సేల్సులు వాడటం నేర్పి డబ్బు దోచుకోవటం 
ఆధునిక సౌకర్యాలు కోసం మనుషులే మారటం 
స్త్రీ అంటే అగ్ని లేదా ఓ మంచు పర్వతం 
సంక్షేమాలంటూ ధనం దుర్వినియోగం 

బ్యాలెట్ కోసం బుల్లెట్ వాడటం 
ఆకలి కోసం మూగజీవులను చంపటం 
సజీవులను వేటాడి చంపటం 
విరోధలనూ వేటాడి చంపటం 
--((*))--   




మనిషిని ప్రేమతో ఉంచేవి ?
మధుర భావా లెన్నో
మరువ లేని జ్ఞాపకా లెన్నో
మాసిపోని గుర్తు లెన్నో
మరువ లేని గాయా లెన్నో

మనసుని దోచిన నేస్తా లెన్నో
మనసుని వేధించిన భందా లెన్నో
మరపురాని సంఘటన లెన్నో
మన నీయని ఆశల వలయా లెన్నో

మాటలతో చెప్పలేని రహస్యా లెన్నో
మన మార్గం లో అఘాతా లెన్నో
మనల్ని కవ్వించే కబుర్లె న్నో
మనుగడ నే ప్రశ్నించే ప్రశ్న లెన్నో

మంచు లా కరిగే కోరిక లెన్నో
మంట ల్లా వెంటపడే రాబందు లెన్నో
ముత్యం లా వెలుగు నిచ్చే స్నేహా లెన్నో
మ్యాజిక్ తో మదిని దోచే ప్రయత్నా లెన్నో

మాయని చేధించ లేని డు:ఖా లెన్నో
మమతను మరువ లేని పరిస్థితు లెన్నో
మతాచారం లో మనకు చిక్కు లెన్నో
మెతుకు కోసం మనిషి చేసే మాయ లెన్నో

--((*))--



 *డబ్బు జబ్బు 

మనిషికి  తోడు ఉండేది డబ్బు 
 డబ్బు తెప్పిస్తుంది కొందరికి జబ్బు 
అది అసలు వడ్డీరాక వచ్చేది 
రోగం, నిద్ద్రపోనియ్యక చేసేది 
 
పేదోడి పెనుభారం  సంపాదన 
కొద్ది సంపాదనతో వడ్డీ జలగల్తో యాతన
బ్రతుకు బండి లాగలేక మత్తుకు
బానిసకాగా మారి చేరు అనారోగ్య పంచకు

తెలుగు ప్రజల జీవనంలో చీకటిని తరిమి 
వెన్నెల నింపి, చెరగని ముద్రగా కలిమి
కళ్ళుమూసుకున్న ధర్మ దేవత వెలుగై 
తెలుగు ప్రజల ఆశా జ్యోతి వజ్రంగా మారే  

ప్రకృతిని మురిపించి నమ్మిన వారికి ఆశలు చూపి 
జీవకళను ఉట్టిపడే విధంగా ధనాన్ని దుర్వినియోగం చేసి 
 అతివృష్టి అనావృష్టి అంటూ మాటలు చెప్తూ 
ప్రజలను నమ్మించే నాయకుల డబ్బు జబ్బు    
 --((*))--

ఏ తెలివి ఎవరిదో ?

అవినీతిని ధర్మమని వాదించే తెలివి
ఆరోగ్యాన్ని అనారోగ్యమనే చెప్పే తెలివి
ఇంట్లో ఆచరణ లేనిది వీధిలో చెప్పే తెలివి
ఈశ్వరుడు లేడని అరిచి గొంతు పోగొట్టుకొనే తెలివి


ఉన్న ఊరులో బ్రతకలేక వేరేచోట గొప్పలు చెప్పే తెలివి
ఊయలలా కదిలే మనసును అదుపున్నదని చెప్పే తెలివి
ఋతువుల బట్టి గాలిపిలుస్తా, నీళ్లు త్రాగుట అన్న తెలివి
ఎన్నికల్లో అవినీతి, మందుఖర్చు, డబ్బుపంచుట  తెలివి

    
ఏది ఏమైనా నేను స్త్రీ అందానికి లొంగనని చెప్పే  తెలివి
ఐరావతము ఎక్కాలని సర్కస్ లో చేరి చదువుని దాచి తెలివి
ఒకటి నీడలా నీవెంట ఉంటాను నమ్మించి మోసం  చేసే  తెలివి 
ఓనామాలు రానివాడు వేదికలో ఉపన్యాసము చెప్పే తెలివి

     
ఔషదములు దోచుకొని అమ్మి రోగము తెచ్చుకొని ఏడ్చే తెలివి
అందరూ వెళ్లి పోయేవారే, దేహములో ఉన్న చీకటిని చీల్చి తెలివి
అంతః:పురంలాంటి ఇంటిలోఉన్న ఇల్లాలిని వదిలి వేశ్యలతో కలసే తెలివి   : 
--((*))--
         


*మనసు  తాకు

మల్లెల పరిమళం మనసు  తాకు
కాగితపు పూలు అందాన్ని  తాకు
వెన్నెల చల్లదనం జంటను తాకు
సూర్యుడు వెలుగు జగతిని  తాకు

సజ్జనుని  సద్గుణం  ప్రేమను తాకు
దుర్జనుని  సద్గుణం  ఆశను  తాకు
దీపం క్రిందనే చీకట్లు తాకు
భూమి పొరల్లో జలరాసులు తాకు

దుమ్ము, ధూలి అద్దాన్ని తాకు
మనుషుల జీవితం భ్రమలను తాకు
ఆవేశం, అహంకారం పరగుండెను తాకు
సద్గున శీలునకు  జనోద్ధరణ తాకు

నీతి నియమాలకు దుర్వసనమ్ తాకు
జనన  మరణాలు ప్రాణులను తాకు
నిశ్చల స్థితునకు చపల చిత్తుడు తాకు
కపట ప్రేమకు ఆశల దొంతరలు తాకు

మేఘాన్ని మెరుపు తాకు
 వర్షం  పృథ్విని తాకు
పూచిన పువ్వు కాయను తాకు
స్వచ్చంద మనసుకి మాలిన్యం తాకు

 --((*))--


ఏకాత్మ పంచకం.!.........– భగవాన్ రమణ మహర్షి.!
.
1. తన్ను మరచి తనువు తానై తలచి
ఎన్నియో జన్మము లెత్తి తుది -తన్ను
తెలిసి తా నౌట పలు దేశ సంచార
కల న్మేల్కొనుట కను
.
(Forgetting the Self, mistaking the body for the Self, going through innumerable births and finally finding and being the Self — this is justlike waking up from a dream of wandering all over the world.)
2. తానుండి తానుగ దన్ను తా నేనెవ?
దే నుండు స్థానమేది ?
యను వానికి
నేనెవ డెక్కడ నేనున్నా నన్న మధు
పానుని యాడు పలుకు
.
(He who asks ‘Who am I?’ although existing as the Self, is like a drunken man who asks about his own identity and whereabouts.)
౩ .తనలో దను ఉండ దాను జడమౌ
తనువందున్నట్టు తలచు -మనుజుడు
చిత్రములో నున్నది చిత్రమున కాధార
వస్త్రమని ఎంచువాడు
.
(When in fact the body is in the Self, to think that the Self is within the insentient body is like thinking that the cinema screen on which a figure is projected is inside the figure.)
.
4. పొన్నుకు వేరుగ భూషణ ముండునే
తన్ను విడిచి తనువేది -తన్ను
దను వను వాడజ్ఞుడు తా నను వాడు
తను గనిన జ్ఞాని ధరించు .
,
.
(Has the ornament any existence apart from the gold (of which it is made)? Where is the body apart from the Self? The ignorant mistake the body for the Self, but the Jnani, knower of the Self, perceives the Self as the Self.)
.
5. ఎప్పుడు నున్నది ఏకాత్మ వస్తువే
యప్పడా వస్తువు నాది -గురు చెప్పక
చెప్పి తెలియగ జేసినారే , ఎవరు
చెప్పి తెలుపుదురు చెప్పు .
.
.(That one Self, the Reality, alone exists for ever. If even the Primal Guru (Adi Guru, Dakshinamurti) revealed it in silence, who can convey it in speech?)
.
ఏకాత్మ తత్వము నిట్టి దని తేల్చి భక్త
దేహాత్మ భావము దీర్చెను ఏకాత్మ
జ్ఞాన స్వరూప రమణ గురు నాధుడు తా
నానతిచ్చు పంచక మందు ..
– భగవాన్ రమణ మహర్షి




*నా కలల కవిత్వం
 
ఒక  సాయంత్రం నదివద్ద ఉన్న చెట్టును చేరా 
చల్లని గాలిలో ఎగిరే పక్షులను చూసా 
కొమ్మల మాటున మొగ్గల గుసగుసలు చూసా
అస్తమించు చున్న సూర్య బింబం చూసా 

      నన్ను వెంటాడుతున్న జ్ఞాపకాలు చుట్టుముట్టాయి 
ఎక్కడో గుడిగంటలు మారు మ్రోగి నన్ను పిలిచాయి
నీటిలోని చేపలు నన్ను చూసి ఎగిరెగిరి పడుతున్నాయి 
నీటిలో పడవలు  పురిటినెప్పుల స్త్రీవలే నడుస్తున్నాయి 

నీటిలో  చూసిన కొనమెరుపుతో మనస్సు ప్రశాంతం 
 నాలో ఉడుకుతున్న రక్తం చల్లబడి ప్రశాంతం 
 ప్రకృతి కౌగిలిలో నా కలల కవిత్వం ప్రశాంతం 
నిశ్శబ్దంలో మనో నిగ్రహశక్తి  నాలో  ప్రశాంతం

--((*))--
      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి