9, నవంబర్ 2016, బుధవారం

తాత మనవుడి ఆట. (story)

 ఓం శ్రీరామ్  -  శ్రీ మాత్రే నమ
సర్వేజనా సుఖినోభవంతు

తాత మనవుడి ఆట. (story)

తాతా నీవు అంత ఆదుర్దా పడతా వెందుకు, నేను ఆ కుక్కను కొట్టి నందుకా లేదా అది  కరుస్తుందేమో నని భయమా,  లేదురాబాబు లేదు, ఎంతైనా కుక్కలతో ఆడుట  మంచిది కాదు, తోకాడిస్తూ తిరుగుతుందని తోక పట్టుకున్నావో అది కరుస్తుంది కదా అందుకే ఆదుర్దా, లేదు తాత నాకేదైనా ఆయిందనుకో నాన్న నిన్ను తిడతాడని కదా ఆదుర్దా .  ఓరి బడుద్దాయి అన్నీ తెలిసి నన్నే   ఆట పట్టిస్తున్నావు అంటూ తాతగారు కఱ్ఱ పట్టుకొని వెంబడి పడ్డాడు, నీకు చిక్కను అంటూ పరిగెత్తాడు మనవుడు. ఆమ్మో వీడిదగ్గర చాలా జాగర్తగా ఉండాలి అని అను కున్నాడు తాత. 

  తాత తాత విండోస్ ఓపెన్ కవాటం లేదు, ఎలా ఓపెన్ చేస్తారో తెలుపు అనగా బాబు కొబ్బరినూనె వ్రాయి అవి ఓపెన్ అవుతాయి అని చెప్పాడు మనవుడితో .
కొడుకు అడుగు పెడుతూ నాన్న ఈ లాబ్ టాబ్ కు కొబ్బరినూనె వ్రాసిందెవరు, అది పాడై పోయింది,  అసలు మన చిన్నా గాడేడి, ఇది అంతా వాడిపనే అయ్యింటుంది, అని గట్టిగా అరిచాడు కొడుకు కోదండం.
ఆలా అరవకు ఎదో కొబ్బరినూనె సీసా జారి పడి యుంటుంది, పొనీలేరా అది పాడయితే బాగు చేయిద్దాము, లేదా కొత్తది కొనుక్కో, చిన్న తప్పును పెద్దదిగా చేసి ఆరవకురా,

నాన్న నీవు  చిన్నాను వెనకేసు కొస్తున్నావు, అంటూ లోపలకు వెళ్ళాడు కోపంగా .
 అబ్బా వస్తూనే ఆ అరుపు ఎందుకు, కూల్ అవ్వండి డ్రింక్ తీసుకోని వస్తా, నీకు కుడా లోకువై పోతున్నా రానురాను, ఎదో ఎవరు అన్నారు " అత్తమీద కోపమ్ దుత్తమీద చూపారుట "
ఏమిటే గొణుగుతున్నావ్ మనబ్బాయ్ ఎంచేశాడో తెలుసా "ఏమీ తెలియని వాడ్ని అరిస్తే, కొడితే పాడైన వస్తువు రాదుకదా, మీరు కోపిష్ఠుతండ్రి గా పిల్లవాని ముందు ప్రవర్తించ కండి, వీలు చూసుకొని నచ్చ చెప్పుదాం. ఏమిటో నా మాటలు అటు నాన్న అర్ధం చేసుకోరు, నీవు అర్ధం చేసుకోవు కదా.
అట్లా అనకండి అంతా  మనమంచికే జరిగిందనుకోండి, సరే అట్లాగే, అబ్బా నవ్వండి మీరు నవ్వుతుంటే ఏంతో  ముచ్చటగా ఉన్నదండి, ఆ ఆ ఆగు ఇప్పుడేం టెండర్ పెట్టకు అసలే ఖర్చులో పడ్డా .. నవ్వు కుంటూ లోపలకు వెళ్ళింది భార్య భారతి. పాపరును చూస్తూ కూర్చున్నాడు కోదండం. 
 
          తాతా ఎవరిని అరుస్తున్నాడు నాన్న, నిన్నేరా
నేనెంతప్పు చేసాను, లాబ్ టాబ్ ను పాడుచేసావుట అందుకని
అవును తాతయ్య నేను నిన్ను అడిగాగా విండోస్ ఓపెన్   కావాలంటే నూనె వ్రాయమన్నావుగా
నేను కిటికీ తలుఫులనుకున్నా, లాబ్ ట్యాబ్  అను కోలేదురా చిన్నా. 
నాకేం తెలుసు నీవు చెప్పావు నేను చేసాను, అది నాతప్పు కాదు, అంతా నీదే తప్పు కదా తాత.
అవునురా అంతా నాదే తప్పు, నీతో మాట్లాడం కష్టంగా ఉందిరా.   

సరే మీనాన్న కోపం తగ్గేదాకా అలా మార్కెట్ కు పోయి కూరలు, పళ్ళు, తెద్దాము వస్తావా, ఎందుకు రాను తాతయ్య పోదాం పదా అంటూ మరిచా,  అమ్మొమ్మ వద్దకు పోయి కూరలకు పోతున్నాము అని చెప్పి సంచి తీసుకొనిరా, ఎందుకంటే ప్లాష్టిక్ కవర్లు వాడొద్దన్నారు కదా, కాదు తాతయ్య పలుచనవి మాత్రమే వాడొద్దన్నారు, నీకు తెలియదా అన్నమాటాలకు "గుడ్డొచ్చి పిల్ల నెక్కిరిచ్చించి నట్లు ఉంది నా పరిస్థితి "అని గొనుకున్నాడు తాతయ్యా.

కూరలు కొన్నాడు తాతగారు, అప్పుడే మనవుడు ప్రక్కనుండి ఒకటమాటా తీసి నోట్లో పెట్టు కున్నాడు, అది చూసి తాతయ్య తప్పు కదా నీవు చేసేపని అన్నప్పుడు, ఎం తప్పుకాదు దీనికి కూడా డబ్బులు తీసుకోమను, నేనేమి దొంగను కాదు కొద్దిగా రుచి చూసా అంతే, అన్నమాటలకు షాపువాడు, తాతయ్య ఆశ్చర్యపోయారు "వేలుడంత లేడు, పెద్ద పెద్ద మాటలు పలుకు తున్నాడు".అని మనసులో అనుకున్నాడు.

వెంటనే తాను తీసుకున్న కూరలకు 500 రూపాయల నోటు ఇచ్చాడు తాతయ్య.
సార్ 30 ముపై రూపాయల కూరలకోసం 500 ఇస్తే ఎట్లాసార్, నేను ఇప్పుడే వచ్చాను, మీరు ఏమన్నా కొన్న తర్వాత డబ్బులు ఇవ్వండి మీరు రోజు వచ్చే వారే కదా అన్నాడు షాపువాడు. పళ్ళు , పూలు కొని తాత మానవుడు ఇంటి దారి పట్టారు.

       మనవుడికి హఠాత్తుగా గుర్తుకువచ్చి తాత నీవిక్కడే ఉండు అంటూ తాత దగ్గర పర్సులో డబ్బులు తీసి ఇప్పుడే వస్తా అంటూ పరిగెత్తాడు, కూరల వ్యాపారునికి ఇవ్వటానికి పోతున్నా అన్నాడు.

ఎందుకురా అంత తొందర రేపు ఇవ్వచ్చుగా తెలిసిన వాడేగా, అసలు అతనికి గురుతుందో లేదో   పోదాం పదా అసలే చాలా సమయము అయినది కదా

తాత " కష్టంతో పొట్ట పోసు కొనే వాళ్ళ సొమ్ము మన కెందుకు" ?  ఎప్పుడూ నమ్మకం ముఖ్యం అంటారు కదా, అందుకే కూరలమ్మే వాని నమ్మకము వమ్ము చేసి పోవటం మంచిది కాదు కదా తాతయ్య, మనం ఇవ్వలేదనుకో డబ్బు లివ్వ కుండా ఎగ్గొట్టి వెళ్లారని అంటాడు, అందుకే వెళ్లి ఇచ్చివస్తా, మనవుడు పరిగెడుతుంటే నోరప్పగించి చూస్తూ ఉన్నాడు.   

తాత నాకేమయిన కధ చెపుతావా, కొన్ని నీతివాక్యాలు చెపుతాను విను 

మనుష్యులకు రోగాలు వేగంగా వెంబడిస్తాయి కుందేలుగా, నెమ్మదిగా తొలగి పోతాయి. 
తాబేలుగా మనుష్యులకు నెమ్మదిగా డబ్బు చేరుతుంది, స్వార్ధానికి చిక్కి ఉండ లేనని కుందేలుగా వేగంగా వెళ్ళిపోతుంది. 
 
అపజయం వచ్చిందని నిరాశచెందకు, ప్రాణాలున్నంత వరకు దేశం కోసం పోరాడుతూ ఉండాలి.
నేను వ్రాసిన కవితలు కధలు చివరిదాకా చదివిన వారికి దానిలో ఉన్న నీతి కనిపించి  మంచి మార్గంలో దేశం కోసం పోరాడ గలరు.   

నేనొక్కడినే ఏమి చేయగలను ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు సంకల్ప బలముతో దేశానికి నీ శక్తి చూపి అందరి కీ  సహాయకుడిగా ఉండవచ్చు. 
సూర్య భగవానుడు ఒక్కడే ప్రాంచానికి వెలుగు నందిస్తు న్నాడు గమనించు. 
చదువు రాని వాణ్ణి తక్కువ చేయ వద్దు, అతని తెలివిని బట్టి ఉపయోగించు కోవటం నేర్చుకోవాలి. 
మురికనీరు దప్పిక తీర్చలేక పోయిన మంటను ఆర్పుటకు ఉపయోగపడును, ఉపయోగించుకొనే తెలివి మనకుండాలి ఉపయోగము లేని వస్తువు లేదు అని తెలుసుకో . 

మనిషిగా మాట్లాడలేకపోయిన పశువులా మౌనంగా  ఉండుట వళ్లు కొన్నికార్యములు నెరవేరుతాయ్. 
కాలాన్ని వ్యర్థం చేయకుండా ఉండేవాని వాక్కు ఖచ్చిత ముగా నిజ మవుతున్నదని లోకమే తెలుపు తున్నది. 

ఏమిటి మీ పురాణాలు  మనవుడికి చెపుతున్నారా, వాడు ఇంగ్లీషు మీడియం చదువు తున్నాడు, మీరు చెప్పిన మాట ఒక్కటి కూడా వాడికి  అర్ధము కాదు ఎందుకు వృద్దాశ్రమ అని అంటూ లోపల నుంచి వచ్చింది కోడలు. 

ఎందుకమ్మా తాతగారిని అంటావు, మనభాష వదలి పరభాషా నేర్చు కోమని వత్తిడి చేసినందుకు నిన్ను నాన్నను అనాలి, నేను మాతృభాషను వదలను, అన్నీ  భాషలు నేర్చుకొనుటకు నాకు సహకరించండి అన్న మాటలకు అందరూ అలా శిలలుగా మారిపోయారు 
అప్పుడే గుడి గంట మ్రోగింది శుభసూచన అంటూ ఉపన్యాసము ముగించారు తాతగారు .


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి