20, నవంబర్ 2016, ఆదివారం

Internet Telugu magazine for the monh ov 11/2016/44

ఓం శ్రీ రామ్ - శ్రీమా త్రేనమ :
 
సర్వేజనాసుఖినోభవంతు 

    ఆటవెలది
వచ్చె డబ్బె వెలుగు - నిర్ణయంను తెలుపు 
విద్య, వైద్య వెలుగు - జీవితాల మలుపు
నవ్వు, పువ్వు, వెలుగు -పంటశాల తలపు
తల్లి తండ్రి  వెలుగు  - శాంతినీని తెలపు                
 
 *13. నిగృహ శక్తితో జీవించు







ఇష్ట సఖికి సుఖం పంచటం 
మనసు విప్పి మాట్లాడి ఇవ్వాలి ముద్దు 
అమ్మవలే  ఆదరించి ప్రేమను సద్దు   
నీవు  

ప్రేమను పంచి ఆదమరచి నిద్ర పోవద్దు 
కోపంతో  అనరాని మాటలు అనవద్దు   
సుఖమును అందించిన దానినీ  తిట్టవద్దు 
నీవు ఓర్పుతో  కుటుంబాన్ని సరిదిద్దు 

ఉన్న విద్యతో సుఖపెట్టు చాతకాదనవద్దు 
తప్పునుచూపి నీకు ఏమీరాదనీ అనవద్దు 
ఈ కాలంతో మారుటయే ప్రతి ఒక్కరి హద్దు    
నీవే భర్తవు, కర్తవు ఎవరివల్ల భయపడవద్దు 

నాకు ఇది రాదు అది రాదు అనుకో వద్దు
అనుమానం మనసులోకి ఎప్పటికి తేవద్దు 
హద్దు దాటి ఎప్పుడూ  ప్రయాణించ వద్దు
దేవుని ప్రార్ధించు నిగృహ శక్తితో జీవించు   

--((*))--


*ముత్యపు చుక్క

చక్కని చుక్క ముత్యపు చుక్క
వంటరిగా ఉన్న పట్టలేని చుక్క
వయసుతో అల్లరి చేస్తున్న చుక్క
తుంటరితనంతో కదులుతున్న చుక్క    

చంద్రుని ప్రక్క మెరుస్తున్న చుక్క
కలవరం మదిలో రేపుతున్న చుక్క
హృదయంలో పరవశిస్తున్న చుక్క 
మనల్ని కంగారు పెట్టిస్తున్న చుక్క

బుడగలా మెరుస్తూ ఉన్న చుక్క
ఆకులమధ్య కనిపిస్తున్న చుక్క
కళ్ళలో కనిపిస్తున్నా స్వేత చుక్క
పెల్లిలో వధువు వరులకు పెట్టె చుక్క

నుదుటిమీద కుంకుమ బొట్టుచుక్క 
శ్రవణాలకు వ్రేలాడుతూ ఉన్న చుక్క 
ముక్కు ముక్కెరకు మెరుస్తూ చుక్క
స్త్రీలు ధరించే హారములో మెరిసే చుక్కలు
--((*))--


మేఘధ్వనిపూర - త/య/మ/గగ UUII UU - UUU UU 
11 త్రిష్టుప్పు 13 

*నా పుత్తడి రాణీ

నాయాశల బోణీ - నా ఆనందం భోధీ
నా పుత్తడి రాణీ - నా శ్రుంగారం దేవీ    
నా ఆరాట ఉహా - నా కోలాటం ఆశా   
రేయిన్ గడు భామా - యో నా ప్రేమాబ్ది 

భావమ్ములన్ తోడన్ - భాదిల్లెన్ గాదా
నీగానము నందున్ - నిత్యానందమ్మే 
తీయంగ పాటల్ - పాడంగా రావే
సాయంను చేసే - శాంతంగా పొందే 

పుష్పాలు విచ్చే- తుమ్మేదే చేరే 
మొహాలు తీరే - సంతోషం వచ్చే 
కాలాలు మారే - కల్లోలం తీరే
బంధాలు కమ్మే - భాద్యతా పెర్గే      

  
--((*))--




 *.

*బుద్ధి

ఆత్మబుద్ధి సుఖాన్ని కోరు
గురుబుద్ధి  హితాన్ని కోరు 
సమబుద్ధి సత్యాన్ని కోరు 
నీచబుద్ధి ద్వేషాన్ని కోరు 

బంధ విముక్తియే హితం కోరు 
దు:ఖనివృత్తియే హితం కోరు
నిత్య  ప్రాప్తియే హితం కోరు 
జ్ఞాన ప్రాప్తయే  హితం కోరు 

శ్రేష్టమైన మాట మనసు చేరు 
మాతృ హృదయం బిడ్డ చేరు 
బుద్ధిహీనం చేత భయం చేరు 
తపస్సే మనస్సుకు శాంతి చేరు

రాగి తీగలో విద్యుత్  చేరు
గాలివాటమున పడవ మారు
ఆశా మొహాలు మనిషని చేరు    
మనిషి ప్రతి క్షణం సుఖం కోరు
--((*))-- 


*పర్వత వెలుగు 

ఆ ఉదయం పాడుపడిన కోటపై వెలుగు 
న్సశ్శబ్ద చెట్లకదలిక మధ్యఉండే వెలుగు 
సందర్శకులకు అది ఒకఅద్భుత వెలుగు  
ముసలి వాసన కొట్టే శిలల మధ్య వెలుగు 

గబ్బు కంపు కొట్టే దుర్వాసన మధ్య వెలుగు 
అసభ్య చిత్రాలు అందమని పించే వెలుగు  
గతచరిత్రను తెలిపే యుద్ధశకటాల వెలుగు 
కదన కుతూహల కత్తుల వీరవిహారం వెలుగు

పచ్చని గరికపై నీటి బిందువులతో వెలుగు 
జంతువులు ఆరాటంతో తినుచున్న వెలుగు 
జాలు వారు జల తరంగాల శబ్దపు వెలుగు 
దేవదేవుని స్థానంగా దేవాలయముల వెలుగు 

నగర దర్శనంతో పిల్లలో కనిపించే వెలుగు
పైకి ఎక్కి దిగుట యోగాబ్యాసం తో వెలుగు 
ప్రకృతి ప్రశాంతగాలితో మనసుకు వెలుగు 

సంగీత వేదం పఠనంతో కనిపించే వెలుగు   

--((*))--

* సుఖ జీవితం
.
సత్యంగ జీవితము - సవ్యమే సంతసం
అత్యాస భావములు - భాదలే చింతలే
నిత్యాను రాగమును - ఎంచుకో పంచుకో
ఇత్యాది కోరికలు - తీర్చుటే జీవితం

అమ్మాయి ఆశయము - విద్యయే తొడ్పడూ      
నమ్మాలి అంబరము - అందరం ఆశతో
కమ్మనై నా పలుకు  - నిత్యమే  సత్యమే
సొమ్ములే  సంతసము - ఆకలే జీవితం   

కాలమే ఆశలను - తీర్చుటే సంభవం
జ్వాలయే బ్రతుకుకు - వెచ్చనీ దివ్వెగా
పల్లకీ ప్రాభవము  - పువ్వులే నవ్వులే
చల్లనీ జీవితమ్ - ముద్దులే  ప్రేమలే 
--((*))-- 
 
 నిక్షిప్తం ?.

మనిషిలో నిక్షిప్త మైనది
శరీరం కన్నా అపురూపమైనది
స్పృజించిన కొద్దీ ఉత్తేజ పరిచేది
ప్రజ్వలించి మహాజ్వాలగా మారేది


మౌనం మూగభాషలో చిక్కి ఉండేది

అకుంఠిత దీక్షకు మూలకారణం ఇది
ప్రాణానికి  ప్రాణమని పలికి స్తుంది
స్వభావ ప్రభావముతో శక్తిని పెంచేది


లాస్యం, తాండవం కు పొంగి పోయిది

అనుమానాల గనిగా ఆవరించి ఉన్నది
దాసోహం అనేవిధముగా మారుతుంది
చుసిన తప్పుకు శిక్ష పడునట్లు చేసేది


విశృంఖలముగా కామాన్ని ప్రేరేపించేది

పంచభూతాలను చూసి పరవశించి పోయేది
బుద్దిని చింతనగా, సంతోషముగా, మార్చేది
పుత్ర,మిత్ర,ధన సంపదకు దాసోహం అనేది


పంచేద్రియాలకు తనవంతు సహకారం అందించేది    

అడ్డుకు చేరనీయకుండా శరీరంలో పీడనంలా ఉంటుంది
సిరిసంపదలతో ఊరిస్తుంది ఆశలు పెంచి ఏడిపిస్తుంది
మందు లేకుండా మనిషిని ఇష్టం వచ్చినట్లు తిప్పేది


మానవులకు బలమైన ఆయుధం, విజయపధంలో నడిపేది

ఇంతకీ నెవరో తెలుసా మెదడులో నిక్షిప్తమై ఆడించేదాన్ని
దీన్ని మందిరంగా మార్చు కుంటే దైవంగా మారుతుంది
అనుమానంగా మలచుకుంటే జీవితాన్నే కల్లోలముగా మార్చేస్తుంది
మనల్ని నయనాంధకారనుండి సుమధురం అందించునది    
--((*))_-

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి