ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
సర్వేజనాసుఖినోభవంతు
ఇది కథ కాదు - నిజమో కాదో మీరే చదివి చెప్పండి ?
బాబు
సమయానుకూలముగా పోవుటము కాదు, సమయము వ్యర్ధము కాకుండా సద్వినియోగము
చేసుకోవటం మంచిది, వయసులో ఉన్నప్పుడు కష్టపడి నలుగురికి సహాయము చేసి
నట్లయితే అదే నీకు అక్కరకు వచ్చును కన్నా.
అమ్మా
నన్ను ఆశీర్వదించమ్మా అంటూ పాదాలకు నమస్కరించాడు, చెపుతున్నానీ ఏమీ
అనుకోకు, ఆ పరమేశ్వరుని నమస్కరించి, నీ భార్యకు క్షేమ సమాచారములు చెప్పి,
బయలుదేరటం ఒక అలవాటుగా మార్చుకోవాలి, ఇక ముందున్నదంతా నీ తరమూ, నీ బిడ్డల
తరము ఆధునిక పద్దతులలో ఆధునిక విద్యను నేర్పాలి, నీవు కూడా దేశ సేవచేస్తూ,
మాద్వారా నేర్చుకున్న విద్యతో, నికష్టంతో నేర్చుకున్న విద్యతో అందర్నీ
బ్రతికించే విధముగా మార్చు కోవాలి, సమయం వ్యర్థం చేయకుండా జీవితము గడపాలి.
అమ్మా నీ మాటలు అక్షరాలా పాటిస్తాను, అని చెప్పి బయలుదేరాడు.
అప్పుడే హెల్మెట్ పెట్టుకొని స్కూటర్ పై బయలు దేరాడు "రామకృష్ణ "
వీధులన్నీ
జన సమూహముతో పాటు వాహన పొల్యూషన్ ఎక్కువ ఉంది, నెమ్మదిగా పోతున్న నన్ను
ఒక్కసారి పొగకమ్ముకున్నది, హెల్మెట్లో పొగచూరి నన్ను ఉక్కిరి బిక్కిరి
చేసింది, అప్పుడు స్కూటర్ ఆపాను, నాముందే ఒక పోలీసు వ్యాను ఆగింది, లైసన్సు
, ఆర్ సి బుక్ చూపినా, హెల్మెట్ పెట్టుకోలేదని ఫెన్ కట్టమన్నారు, నేనొక
భారత పౌరుడుగా వారితో వాదన చేయక వారికి నేను పైకము కట్టి రసీదు
తీసుకున్నా, వారితో ఒకటే అడిగాను, నా ముందు 30 సంవత్సరాల పైన కొన్న లారీ
పొగవల్ల మా ఆరోగ్యము చెడకొడుతుంది దాన్ని ముందు సీల్ చేయండి, అని లారీ
నెంబర్ చెప్పగా, ఇది మేము ఏమీ చేయలేము, ప్రభుత్వము వ్వారి దృష్టిలో ఉన్నది,
నీవు మాకు చెప్పనవసరము లేదు అని చెప్పి వెళ్లి పోయారు, అప్పుడు నేను
అనుకున్నా ఈ లోకం ఎప్పుడు మారుతుంది, ధర్మం ఎక్కడ బ్రతుకుతుంది.
నేను ఒక లెక్చరర్ గా పనిచేస్తూ విద్యార్ధులకు నీతి పాఠాలు భోధిస్తున్నాను.
కాలేజీ
నుండి తిరిగి వస్తున్నాను, అప్పుడే నాముందుగా ఒక నీళ్ల ట్యాన్కి నీళ్లు
రోడ్డుమీద పోసుకుంటూ వెళుతున్నది, దాన్ని అడిగే వారు లేరు, నేను లారీ ఆపి
డ్రైవర్ను అడిగితే మాకష్టాల్నీ మీకెలాచెప్పాలి, ఆఫీసు వచ్చి రేపోర్టు
చేయండి అన్నాడు, అప్పుడే లారీ వెళ్ళగానే అక్కడ తడినీరు ఉండటం వల్ల కొత్తగా
నేర్చుకున్న ఒక విద్యార్థి రెండుకాళ్లు నేలపై పెట్టుకుంటూ అక్కడకు వేగంగా
రావటం, ఒక్కసారి బ్రేక్ వెయ్యటం, వెనుకచక్రం జారటం క్షణంలో కాలుమీద స్కూటర్ వేసుకొని పడింది. పెద్దగా రోదన వినబడింది, జనం అందరూ చుట్టుమూగారు, వింతగా చూసారు.
అప్పుడే
నేను మానవతా దృక్పధముతో ఆవిద్యార్ధికి ధైర్యము చెప్పి, స్కూటర్ ను ప్రక్క
షాపు దగ్గర ఉంచి ప్రక్కనే ఉన్న హాస్పటల్ లో చేర్చగా కాలికి ఫ్యాక్చర్
ఆయినదని చెప్పారు, వెంటనే నా దగ్గర ఉన్న పైకము కట్టి, విద్యార్థి చెప్పిన
ఫోన్ చేసి వారిని పిలిచి కొంత ఆలస్యముగా ఇంటికి చేరాను.
జరిగిన
విషయాలన్నీ తల్లికి, భార్యకు చెప్పగా ఇద్దరూ ఒక్కసారిగా మంచిపని చేసావు,
ఇదిగో ఈ ప్లాస్కోలో టీ త్రాగి కాస్త రెష్టు తీసుకో, మేము ఇప్పుడే హాస్పటల్
దాకా పోయి ఆవిద్యార్ధిని చూసి మంచిమందులు ఇవ్వమని డాక్టర్ను కోరి,
మార్కెట్కు పోయి కూరలు తీసుకొని వస్తాము. అని చెప్పి బయటకు నడిచారు అత్తా
కోడలు, అప్పుడే టి.వి లో చూడఁగా పొగ కాలుష్యం వళ్ళ ఊపిరి తిత్తులలో పొగచేరి
వంద మంది అనారోగ్యులుగా మారినట్లు చెప్పారు, నాయకులు ఇదే అవకాశం గా చూసి
ఆర్ధిక సహాయం ప్రకటించారు, అది రోగులకో పార్టీ కార్యకర్తలకో ప్రకటించ లేదు
ఇదేమిలోకం, మారేదెప్పుడో అనుకోవటం తప్ప నేను ఏమీ చేయలేక పోయాను.
తల్లికోసం, భార్యకోసం ఎదురుచూసున్నాడు"రామకృష్ణ ", ఇంటిముందు ఆటోలో దిగటం చూసాడు, అమ్మా కూరలు తెలీదా , చాలాసేపు ఉన్నారే అని అడిగాడు . చూడు బాబు ని భార్య చాలా గట్టిగా మాట్లాడింది అనుకూ కొంత ఆలస్యమైనది అని చెప్పింది .
సరే లోపలకు రండి మనం భోజనం చేసాకా మాట్లాడుకుందాం అని చెప్పి టి. వి. చూస్తూకూర్చున్నాడు .
బోజనం కు రండి అని భార్య పిలుపుకు వచ్చి కూర్చొని చాలా బాగున్నాయి వంట ఎవరు చేశారు నువ్వా అమ్మ అని భార్యను అడిగాడు, నేనే చేసానండి నేను మీ అమ్మగారి సలహా తీసుకోని నేనే చేసాను అన్నది .
అందరి భోజనాలు పూర్తయినాయి.
ఆ ఇప్పుడు చెప్పండి మీరు ఎక్కడికెళ్లారు అని అడుగగా తల్లి కలగచేసుకొని మేము నీవు చెప్పిన హస్పటల్ వెళ్ళాము ఆ విద్యార్థి పలకరించాము, ఒక్కసారి డాక్టర్ ను కాలిసాము, డాక్టర్ తో కోడలు చక్కగా మాట్లాడింది.
ఏమ్మాట్లాడావో చెప్పవే భారతి అని అడిగాడు. హాస్పటల్స్ ఏదోవిధముగా రోగులను ఏడిపించి డబ్బు గుంజే మనస్వ భావములో ఉన్నారండి, చిన్న దెబ్బకు అన్ని టెష్టులు చేస్తే గాని ఏమిచెప్పలేమని బెదిరించారు విద్యార్థి తల్లిని ఆమె భాదపడుతూ మాతో చప్పింది, డాక్టర్ తో ఆవిషయమే గట్టిగా అడిగాను, వారు చెప్పింది ఒకటే మా హై కమాండ్లను పాటించటం తప్ప మేము ఏమి చేయలేము, అన్నీ టెష్టులు చేయగలిగితేనే మేము మందు వాడగలము, మామీద నమ్మకము లేకపోతె మీ పేషేంట్ ను వేరే హాస్పటల్ ల్లోకి మార్చుకోండి, మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు ఎక్కడుంది, మీకు విద్యార్థికి సంభంధం ఎక్కడున్నది అని గట్టిగా అన్నాడు డాక్టర్ . అప్పుడు నేను కోపం ప్రవర్తించకుండా నాకు తెలిసిన డాక్టర్ ను పిలిపించాను ఆమె వచ్చి, పెద్ద దెబ్బ తగళ్లేదు,అంటూ అక్కడ డాక్టర్ ను కలిసింది.
ఎం జరిగిందో నాకు తెలియలేదు, కొన్ని మందులు వ్రాయగా అవినేను తీసికొనివచ్చి, ఇచ్చి ఆ విద్యార్థిని ఇంటిదాకా దించి, స్కూటర్ ను రేపెర్కి ఇచ్చి వచ్చాము.
ఏమిటో ఈలోకము అర్ధం పర్ధం లేకుండా ప్రజల బలహీనతలను డబ్బు చేసుకుంటున్నారు , ఈ వ్యవస్థ ఎప్పుడు బాగుపడుతుందో అని నెమ్మదిగా చెప్పింది.
నిజమేనే నీవుచెప్పింది, ఈ మార్పుకు మనసహాయము, మనకు తెలిసిన విషయాలను తప్పక ప్రభుత్వము ముందు ఉంచుదాం, పరిష్కారం కోసం భారతీయులుగా పోరాడదాం
అవునురా బాబు నీవు చెప్పింది ఖచ్చితము, అన్యాయాన్ని చూసినప్పుడు తప్పక న్యాయం జరిగేదాకా పోరాడదాం, మనదేశ ప్రగతిని కాపాడుదాం, ఈ తల్లి సహాయము తప్పక ఉంటుంది, భయపడి వెనుకడుగు వేయకు దేశం కోసం ప్రాణాలర్పిందం . అట్లాగే ........ అట్లాగే .......
--((*))--

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి