31, ఆగస్టు 2015, సోమవారం

ప్రాంజలి ప్రభ - ఆనంద పారవశ్యం పొందాలని చిన్న తాపత్రయం -1

http://vocaroo.com/i/s1a2aDCNP7kS
ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం
శ్రీ మాత్రే నమ:
 ప్రాంజలి ప్రభ
Animated gifs : Animated wallpapers for cellphones
ఆనంద పారవశ్యం పొందాలని చిన్న తాపత్రయం 


నీ లాలి ధునిలోన ధ్వనియించగా
కదలి రావమ్మా రావే! కధలమ్మా రావే!
పలుకుల్లో పదునిచ్చి పలికించగా
తల్లీ చదువమ్మా రావే! శ్రీవాణీ రావే! ~ నీ లాలి ~

మేఘాలబాల రాగాలనేలే
మారాణి వీవే!
చిగురాకునూచే తెమ్మెరలలోన
విరిరాగ ఝరులెన్నో పొంగించినావే!

నీ దీవెనలే భావనలై విరబూసిన
గీతమాలికలోన స్వరజ్ఞానమీవే! ~ నీ లాలి ~

ఈ భువనమందు రవళించినావే
స్వరజతులనెన్నో!
ప్రతి తావు జూడ సిరిభావమేదో
పురుడించెనమ్మా నా మదిలో నిత్యం

కోవిదుల యెదలాంటి కోవెళ్ళలో
కొలువు చేసింది తల్లి విజ్ఞానఖనిగా! ~ నీ లాలి ~ 
Democracy needs a measure of tolerance of other people's views and ways -
ప్రజాస్వామ్య జీవనములో సాటి మనిషి ఆలొచనలనూ, వారు అనుసరించే మార్గాలనూ సామరస్యంతో సహించడం కనీసధర్మం       

విశాల హృదయ్యంతో స్త్రీ ని ఆదరించుదాం, స్వేచ్చను కల్పించుదాం,  జీవితంలో తప్పు త్రోవ త్రొక్క కుండా సుఖసంతోషాలతో కలసి మెలసి జీవించుదాం 


ఇందఱికి అభయాలని ఇచ్చే చేయి. : అన్నమాచార్యుఁడు,
.
సంకీర్తన:
ఇందఱికి నభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి

వెల లేని వేదములు వెదకి తెచ్చిన చేయి
చిలుకు గుబ్బలి క్రిందఁ జేర్చు చేయి
కలికియగు భూకాంతఁ గౌగిలించిన చేయి
వలనైన కొనగోళ్లవాఁడి చేయి

తనివోక బలిచేతఁ దాన మడిగిన చేయి
వొనరంగఁ భూదాన మొసఁగు చేయి
మొనసి జలనిధి యమ్ము మొనకుఁ దెచ్చిన చేయి
యెనయ నాఁగేలు ధరియించు చేయి

పురసతుల మానములు పొల్లసేసిన చేయి
తురగంబుఁ బరపెడి దొడ్డ చేయి
తిరువేంకటాచలాధీశుఁడై మోక్షంబు
తెరువు ప్రాణులకెల్లఁ దెలిపెడి చేయి
అర్థాలు:
కందువ - నేర్పు। చిలుకుగుబ్బలి - మంథరపర్వతం (చిలుకు - మథించు, గుబ్బలి - కొండ)। కలికి - చక్కటి స్త్రీ। వలను - నేర్పు। తనివోవు - తనివి పోవు (తనివి - సంతుష్టి)। ఒనరు - కలుగు। మొనయు - యుద్ధానికి పూనుకొను (మొనగాడు అంటే యుద్ధం చేయడానికి సిద్ధమైనవాడు)। అమ్ము - బాణం। మొన - కొస। ఎనయు - సరిపడు। నాఁగేలు - నాగలి। పొల్ల - పొల్లు (వ్యర్థం)। తురగము - గుఱ్ఱం। పరపు - తోలు। దొడ్డ - గొప్ప। తెరువు - దారి।

తాత్పర్యం:
ఇందఱికీ అభయాలను ఇచ్చే చేయి. అలా అభయాన్ని ఇవ్వడంలో బాగా నేర్పు కలిగిన గొప్ప బంగారుచేయి (బంగారుతల్లి అన్నప్పుడు బంగారు ఎలా విశేషణంగా వాడుతామో అలాగ).

వెలకట్టడానికి సాధ్యం కాని వేదాలని మత్స్యావతారమూర్తియై వెదికి తెచ్చి బ్రహ్మగారికి ఇచ్చినది ఈ హస్తమే. కూర్మమూర్తియై మంథరపర్వతం క్రింద చేరి తన చేతితో వహించే చేయి. చక్కటి భూకాంతను వరాహమూర్తియై సముద్రంనుండి ఉద్ధరించి కౌగిలించిన చేయి. హిరణ్యకశిపుణ్ణి చంపగల నేర్పు కలిగిన కొనగోళ్లు కలిగిన నరసింహావతారుని చేయి.
తను సాక్షాత్తూ లక్ష్మీదేవికే భర్త ఐనా అంతటితో తృప్తి పడక ఇంద్రుడి కోసమై బలి చేతినుండి దానం పుచ్చుకున్న వామనుని చేయి. పరశురాముడై సమస్త భూమండలాన్ని జయించి, అంత భూమినీ కలిగియున్నప్పుడు, యాగం చేసి ఆ ఋత్విక్కులకు సమస్తభూమినీ దానంగా ఇచ్చిన చేయి. రామావతారంలో సముద్రముపై యుద్ధానికి బయలుదేరి తన బాణాన్ని కొసకు తెచ్చిన చేయి. చక్కగా సరిపడేలా నాగలిని ధరించే బలరాముని చేయి.
గొల్లకాంతలందఱికీ వారి మానము తనే అనే అవగాహన కల్పించడానికై వారి మానములను అపహరించిన కృష్ణుని చేయి. గుఱ్ఱాన్ని తోలుతూ ధరావలయమునందు ధర్మస్థాపన చేసే కల్కిమూర్తి యొక్క గొప్ప చేయి. అలాగే, శ్రీవేంకటాచలానికి అధిపతియై తన పాదములే మోక్షపు మార్గము అని తెలిపే చేయి.


వినమ్రతతో విన్నవించుకుంటున్న విన్నపము, నేను స్టేట్ గజ్ టెడ్ రాంకు పొందినప్పటి నుండి వయసులో ఉన్నవారికి, వయసుడి కినవారికి ఆనందం కలగించే విధముగా ఎంచేయాలని ఆలోచించిన  సమయయంలో నాకు ఆ వేంకటేశ్వరుణి కృపతో, నేను 
ఆంజనేయ్యుని మనోధైర్యముతో చిత్తు కాగితాలమీద కవితలు వ్రాసాను. 

 శ్రావణమాసంలో 2012 న ప్రారంభిమ్చాను అంతర్జాలంలో అక్షర రూపంలో 03-11- 2012 ఒక బ్లాగ్ గా గుర్తించు కొని ఓనామాలు దిద్దటానికి ప్రాంభించాను, ఇప్పటికి రెండో మెట్టు దాటి మూడో మెట్టు కూడా దాటటానికి మీ ఆశిర్వాద బలము కావాలని అజ్ఞాతములో ఉన్న నా భావ కధా ప్రభను ప్రాంజలి ప్రభగా మీముందు ఉంచినాను. 

 నేను వ్రాసినవి మీకు నచ్చ వచ్చు, నచ్చక పోవచ్చు కవి కున్న స్వేచ్చను ఆదరిస్తారాని, నా అనుభవాలను కేంద్రీకరించి నేను చదివిన పుస్తకాలను అనుసరించి, ఆ సరస్వతీ దేవిని అర్ధించి కవితలు వ్రాసాను. 

 నాకన్నా పెద్ద వారికి పాదాభి వందనములు సమర్పిస్తున్నాను, చిన్న వారికి నా ఆశిస్సులు అందిస్తున్నను
ప్రకృతి సౌదర్యము, స్త్రీ సౌందర్యము, ప్రపంచ సౌందర్యము వర్ణించటం అనాదిగా వస్తున్నది మెట్టు నుండి త్గడబడి క్రింద బడిన పసి పిల్లవాడి  లాటి మనసున్న వాడిని నేను. నేను వ్రాసిన వాటిని లైక్ చేసి, షేర్  చేసి, మీ అమూల్య అభిప్రాయాలు తెలుపగలరని ఆనంద పారవస్యంతో  తెలియపరుస్తున్నాను, తప్పులు దొర్లినా సరిదిద్దు కోగలను, నేను ఆదరించే దేవుని తర్వాత ప్రాంజలి ప్రభను ఆదరించివారు అందరూ నాకు దేవుళ్ళతో సమానము. నా మేల్ పంపిన కధలు, కవితలు.చిత్రములు  
పంపినవారికి నాకు సహరిస్తున్న గూగుల్ వారి సౌజన్యం, ఫేస్ బుక్, యు ట్యూబ్ యాజమాన్య్యం వారికీ నా కవితలలో కొన్ని వాడుకున్నందుకు, సహకరించిన ప్రతిఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాను 

గమనిక నేను వ్రాసినవి నచ్చితే చదవమని చెప్పండి, నచ్చక పొతే చదవద్దని చెప్పండి ఈ ఒక్క సహాయము చేసి పుణ్యం కట్టు కొండి ఆ వేంకటేశ్వరుని ఆశిస్సులు పొంది ఆనందంగా ఉండండి   


సర్వేజనా సుఖినోభవంతు
ఇక చదవండి, ఆనంద పారవశ్యానికి మార్గాలు - నాకు తెలిసినవి ఇందు పొందు పరుస్తున్నాను
ఇందులో మంచిని గ్రహించండి - భోదించండి - తన్మయత్వం పొందండి 

                                   ఇంకా ఉంది ....

23, ఆగస్టు 2015, ఆదివారం

ప్రాంజలి ప్రభ- bhaava kavitvam -4 (మనిషిగా బ్రతకనీయ్యని ఆధునికం అవసరమా ?)

ఓం శ్రీ రామ్    ఓం శ్రీ రామ్       ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి ప్రభ - మనిషిగా బ్రతకనీయ్యని ఆధునికం అవసరమా ?

సర్వే జనా సుఖినోభవంతు 

చాలారోజులు తర్వాత నేను ఈనాడు పాపర్ చదివాను, వారు ప్రచరించిన "విధ్వంసక ఆవిష్కరణ" చాలా బావుంది ముందు వారికి  ధన్యవాదములు ఇందు మూలముగ తెలియ పరుస్తున్నాను.    
 నా ఆలోచనలతో భావ కవిత  "మనిషిగా బ్రతకనీయ్యని ఆధునికం అవసరమా ?"ఇందు వ్రాయుటకు ముందుకు వచ్చాను మీ అభిప్రాయాలు నాకు తెలుపగలరు 

భూమి మీద కొందరి ఆలోచనలు 
వారి మంచి అభి ప్రాయ బావాలు 
ఆధునిక చరిత్రకు ఇక పునాదులు
కొత్త మార్గం  ఆవిష్కరణ మార్గాలు

ఊహలకు హద్దు లేదు 
ఆలోచనకు పద్దు లేదు 
ఆచరణకు రద్దు లేదు 
నిష్క్రమణకు సద్దు లేదు 

కడలి విజ్రుంభించిట్లుగా
పర్వత ఊర్ద్వ లావా పొంగినట్లుగా 
దావాలనంగా కారుచిచ్చు రగిలనట్లుగా 
ఇంకా ఎక్కువగా కంప్యూటర్ విస్తరిస్తున్నదిగా 

మనిషి వికాసానికి తోడ్పడే అంశమిది
జాగారూకతో బ్రతకమని చెప్పుతున్నది
పోటీగ ప్రపంచ మంతా విస్తరించుతుంది
మనిషి మెదడు తో ఆడు  కుంటున్నది
 (ఇది అవసరమా )

మనం అనుభవిస్తున్న మహా మహా సౌఖ్యాలు 
మనం ఉపయోగిస్తున్న గొప్ప సాంకేతిక పరిజ్ఞానాలు
సాంకేతిక పరిజ్ఞానంతో పెరుగుతున్న వ్యాపారులు 
ప్రపంచ మంతా కావాలి అంటున్నారు కొత్త సౌఖ్యాలు 

పోటీ ఉంటేనే మనిష్యులో పట్టుదల పెరుగుతుంది 
పోటీ ఉంటేనే వ్యాపారంలో కొత్తదనం చోటు చేసుకుంటుంది 
అట్లాగే తపాల వ్యవస్థకు.. పోటీగా జి మైల్. వచ్చింది 
పలకపై దిద్దే పద్దతి పోయి .. లాబ్ టాబ్ లో దిద్దటం నేర్పుతుంది

వార్తలు పక్షులు ద్వారా, బంట్రోత్తు ద్వారా, కధలు ద్వారా
అందించేవారు తాళ పత్రముల ద్వారా, గాలిపటాల ద్వారా
 వార్తలు తెలిసేవి సెల్  ఫోన్ ద్వారా, సిడి లద్వారా డివిడి ద్వారా
పైవన్నీ అటకెక్కి కొత్తమార్గంలో 3G, 4G సెల్సు రావడం అవసరమా

చక్రంలోంచి యంత్ర శక్తి ప్రాణం పోస్తుంది
మంత్రం లోంచి మనిషికి బుద్ధి పెరుగుతుంది
తంత్రానికి మనిషి బానిసగా మారి బుద్ది చెడుతుంది
మనిషి బుద్ధి మారితే ప్రపంచమే విధ్వంస మౌతుంది
(ఆదునిక పరికరాలు మనకు అవసరమా )

అధిక దిగుబడి కోసం వంగడాలు వస్తాయని విన్నాను
 టెక్నికల్ బిజినెస్ స్కూల్ల్ వచ్చి కొత్త పాఠం చెపుతారని విన్నాను 
 మనిషికి ఉపాది కల్పించకుండా కంప్యూటర్ పాఠం చెప్పటం చూస్తున్నాను
మనిషి మెదస్సును  ఉపయోగించు కోవాలని హేచ్చరిస్తున్నాను   
  
ఎమీ లేని చోట ఆముద వృక్షమే మహావృక్షం
అన్ని ఉన్న చోట అది మాములు వృక్షం
ప్రజలు తక్కువ ఉన్న చోట అవసరం యంత్ర వృక్షం
మేధావులు ఎక్కువున్న చోట ఆ యంత్రమే విష వృక్షం
                                                                      
పారిశ్రామిక మొగ్గ తొడిగింది  
అది క్రమేపి విప్లవంగా మారింది 
అంతర్జాతీయంగా వ్యాపారం పెరిగింది
కంప్యూటర్ వచ్చి ఉద్యోగ వ్యవస్థకు దెబ్బ తగిలింది
(ఇద సమంజసం కాదా )

స్మార్టు ఫోన్ విజ్రుమ్భన హూహించ లేక పోయం 
సంకేతిక విప్లవం వళ్ళ ఆవహిస్తున్నది విరాట్ రూపం 
భౌతికమైన శ్రమ తగ్గినది, వెన్నుపోటు కల్పించే యంత్ర రూపం  
ఉప్పెనలా రాజ్యమేలుతున్నమనమీద  పర సంప్రదాయం  

 
ఆధునిక పారిశ్రామిక పద్దతికి కుటీరపరిశ్రమలు మూతపడక తప్పదు
             ప్రభుత్వ సంస్థలు పోటికి ఎదగలేక ఉద్యోలును తొలగిగిస్తున్నది 
సంస్థలు బండి నడిస్తే చాలు అనుకున్నా, వారి మనుగడ ప్రశ్నగా మారుతున్నది
ఎదగాలని తపన లేకపోతె ఎదుగే కాదు ఉనికే ఉండదు అది పతి ఒక్కరు గమనిమ్చాలి              
 
 నూట పాతికేళ్ళు గల కొడక్ కెమెరాలు పరిస్తితి ఎప్పుడు ఏమైనది
కార్పోరేట్  భవంతుల్లో కెరీర్ మరణాల రేటు మునుపటి  కంటే బాగా పెరిగింది
సినమారంగంలో గ్రూపులు ఏర్పడి కార్మీకులను నడి బజారులో పెడుతున్నది 
కాని డబ్బును చూసు కోకుండా సుఖప్రదేశంలో సుఖబడుదామని తాపత్రయం పెరుగు తున్నది
(దీనివల్ల) 

రువురి సంపాదన లేందే మనం బ్రతకలేం అనే దోరణకు రావటం జరుతున్నది 
చిన చేపను పెదచేప, పెదచేపను తిమింగలం తిన్నట్లు దోపిడీ వ్యవస్థ పెరుగుతున్నది 
నా కనవసరం 2లక్షలు పెట్టైనా పెద్ద స్కూల్లో చదివించాలి అనే తాపత్రయ పెరుగుతున్నది
దీనికి కారణం ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం, భాషను ఆదరించక పోవడం

మట్టిని తీసె యంత్రాలు వచ్చాయి కూలీలు నడి బజారుకు వచ్చారు 
 పొలం దున్నే యంత్ర్రాలు వచ్చాయి రైతుకూలీలు వీధిన పడ్డారు 
కులవృత్తులు వదలి చదువు మీద పడ్డారు నిరుద్యోగులు పెరిగారు 
దొపిడీ దొంగలుగా దగాకోరులు రేపిష్టులుగామారుతున్నారు 
(ప్రభుత్వ అసమర్ధత వలన)

ధర్మ నీతి వెలుగుతో 

బ్రతుకు చీకటిలో మెరిసి
అంతులేని సంపదతో.. 


వెలుగులోకి వచ్చినప్పుడు, నలుగురికి సహకారం అందించినప్పు  డే 


నిజమైన మనిషి 


కోర్టులోకొన్ని వేల కేసులు పెండిగ్ ఉంచారు తీర్పు చెప్పే మేధావులు లేరా
విద్యా వ్యవస్తను కట్టడి చేసి ఉత్తమమైన విద్యనూ ఉచితముగా అందచలేదా 
ఆరోగ్యవ్యవస్థ చదవలంటే కార్పోరేటువారు కోటి కావాలంటున్నారు  
 దానికి కట్టడి లేదా 

ఎవ్వరు నిరుస్చాహ పడకండి టెక్నాలజీమనకు అందు బాటులోకి వచ్చింది 
ఇంటర్నెట్ ద్వారా మీ పరిజ్ఞానాన్ని పెంచుకుంటు తోటి కార్మికులకు సహకారం అందిస్తూ ముందుకు పోవాలి 
ఎన్ని వచ్చిన మనిషి ఆలోచనకు మించినది లేదు ప్రతిఒక్కరు మనుగడకు ప్రశ్నార్ధ కంగా మారకుండా నిరుద్యోగ వ్యవస్థను బతికించటానికి ప్రయత్నం చేయండి. మనలో ఉన్న మేధావిని గమనించండి వానిద్వార నలుగురు కలసి సహకరించుకొని భారత దేశ  ప్రగతి ప్రపంచ దేశాల్లో చాటటం తో పాటు మనకృషి మన ప్రజలు అందే విధముగా ప్రతిఒక్కరు సహకరిస్తే "ఆధునికమే నిత్యకళ్యాణం ఆనందదాయకమని భావించ గలుగుతాం " ఆధునికం ఎక్కడ నుండి పుట్టలేదు  మన, దేశ " తాతలు, అమ్మోమ్మలు, తండ్రులు, తల్లులు, ఒకరేమిటి పెద్దలందరి కృషి ఫలితమే మన ఎదుగుదలకు తార్కాణం 
కొత్తదనాన్ని ఆస్వాదించండి పాతలో ఉన్న గట్టితనం నాణ్యతను గమనించండి. 

ప్రమోదం తో పరిసీలించి అనుసరించు 
ప్రయతుడిగా మారి సహకారం అందించు
ప్రయత్నం లేనిదే స్వతంత్ర భావం రాదు
ప్రమత్తుడ్ని మార్చి ప్రయోక్త గా మారు    
image not displayed

    (మల్లీ ఇంకోసమస్యను పరిశీలించుదాం -  సహకారం అందించుకుంటూ జీవిద్దాం  )    

16, ఆగస్టు 2015, ఆదివారం

ప్రాంజలి ప్రభ - భావకవిత్వం -3

ఓం శ్రీ రాo ఓం శ్రీ రాo     ఓం శ్రీ రాo 
ప్రాంజలి ప్రభ - భావకవిత్వం

సర్వేజనాసుఖినోభవంతు

నేల పై నడిచే వెన్నెలమ్మవు నీవు
నింగిపై గాలికి తేలే మెఘానివి నీవు
పృధ్వి పై వెంటాడే ఎండ నీడవు నీవు
ప్రేమతో ప్రత్యుపకారము చేయాలని నేను   

కళ్ళ భాష్యాలేందుకు - చెక్కిళ్ళ వాపెందుకు
గుళ్ళ పై మక్కువెందుకు - ముళ్ళపై శయనమెందుకు
గల్లము ఇచ్చుటెందుకు - వల్లప్ప గిన్చుటెందుకు
కళ్ళ కపటం ఎరుగ నందుకా - కళ్ళు మైకంలో చిక్కినందుకా

ఈ 'ఊహ' నీది, నీ 'మనసు' నాది
ఈ ' నిషా' నీది, నీ 'వయసు' నాది
ఈ ' సిరి' నీది, నీ 'యశస్సు' నాది
ఈ 'భాష' నీది , నీ 'భారం ' నాది

నయనాల కదలిక కనక వర్షం
పెదాల పదనిస అనంత హర్షం
నరాల కధలిక ప్రక్రుతి వర్షం
మాయల బ్రతుకే ఒక శీర్షం

తల్లి చేసేది పెళ్ళాం చేయగలదు
పెళ్ళాం చేసేది మాత్రం తల్లి చేయ లేదు
అమ్మని అన్నం అడగటం తప్పులేదు
పెళ్ళాం కొంగు వదిలితే తప్పనక తప్పదు 

నెత్తుటి  కోరల ఎత్తులు చిత్తు  చెయ్
మెత్తటి కురుల వత్తును మత్తు చెయ్
కత్తిలాంటి మాటలు చిత్తు  చిత్తు  చెయ్
ఎంతటి వారైనా కాంతా దాసులని గుర్తు చెయ్    

నడక చూస్తె  చిక్ భుక్ రైలా అనిపించింది
పెదాలు చూస్తె లిప్ లిప్ అంటూ పల్సు రేటు పెరిగింది
ముఖం చూస్తె లబ్ డబ్ అంటూ హర్టుబీట్ పెరిగింది
వళ్ళు చూస్తె లవ్ లవ్ అంటూ హెడ్  తిరిగింది  


ఎటు వేల్లోవో బావా - ఎటు చూసిన కాన రావా
ఎంత మరిచావో బావా - ఎద చూసి ఇటు రావా
ఏరు దాటలేదు కదా బావా -  పొంగులో ఉన్నది బావా
ఎంత తప్పు చేసావు బావా - వచ్చి ముద్ద తిని పో బావా

కపటమెరుగని దాన్ని బావ - కళ్ళు చూసి మోసపోకు బావా
కసి ఉంటె మనసార తిట్టు బావా - కల్లబొల్లి మాటలకు లొంగకు బావా
కళ్ళు త్రాగిన ఊరుకుంటానుకద బావా - కసి తీర తిట్టు బావా
నన్ను విడిచి పోకు బావా - నా అంతరాత్మను క్షోభ పెట్టకు బావా     

చిన్న నాటి జ్ఞాపకాలు - మరువలేని తీపి గుర్తులు
కన్న  వారి ఆశయాలు - తీర్చ వలసిన కోరికలు
అన్నగారి అమృత పల్కులు - ఆచరణకు మార్గాలు
కట్టుకున్న వారికోరికలు - తీర్చుటే దాంపత్య ధర్మాలు 
 
 
ఎంకి ఇటు రాయే - రాములోరిగుడి ఎల్లోద్దాం 
ఆవుల్ని దూడల్ని కట్టేయే - అత్తోరికి చెప్పి ఎల్లోద్దాం 
 సద్దిమూట కట్టుకొని రాయే - సరదాగా ఎల్లోద్దాం 
సల్లంగా చూడమని అడగాలి రాయే - సామికి చెప్పుకుందాం 

 'యామినిని'  తరిమై - ' ముత్య మై'  వెలుగు
' కడలిని ' వెతికై  - ' యంత్ర మై ' పరుగు
'శాంతిని ' కల్పిం చై - 'వెన్న లై'  నలుగు
' కష్టాలన్నీ'  మన మై - 'సుఖా లై' కరుగు

మెరుపు లా వెలగకు - హృదయ దీపం లా వెలుగు
చురు జల్లు లా కురవకు - దాహం తీర్చె లా జరుగు
మొండిమాట లా బ్రతకకు - నిజం వళ్ళ వేదన కలుగు
ఇది అది ఏది అనకు - తృప్తి పరిస్తే సంతృప్తే వెలుగు

నీ మువ్వలో కదలికలు - నా గుండెలో సరిగమలు
నీ నవ్వులో చురకలు  - నా మనసులో వేదనలు
నీ కొప్పులో మల్లికలు - నా వయసుకు పరుగులు
నీ నృత్యం లో హావభావాలు - తన్మయపరుచే పవనాలు 

ఊహల్లొ కురిసే పూల జళ్ళు
మాటల్లో చూపే పన్నీటి జళ్ళు
చేతల్లో చూసి జలధరించే వళ్ళు
చూసి చూడకుండా  ఉండేవి కళ్ళు 

ఆశలెన్నో  పొంగి  పూస్తున్నాయి
తలపులెన్నో పరిమళిస్తున్నాయి
కవితలన్నో కదలు చెపుతున్నాయి
తనువు లెన్నో దగ్గిరవు తున్నాయి     

ఇక్కడ అక్కడ ఎందుకు  ప్రేమ
ఎక్కడ కక్కడ ఆగదు ప్రేమ
మక్కువ తక్కెడ లా ఉండు ప్రేమ
ఎక్కములా వక్కానిమ్చలేవు ప్రేమ 

ప్రేత్యేక హోదా కోసం ఎందుకు రాజకీయం
ప్రజాసామ్యంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉండటం
చేయలేని వారి మాటలకు ఎందుకు ఇస్తారు ప్రాదాణ్యం
ఓర్పు వహిస్తే ప్రేత్యేక హొదా ఇవ్వటం కేంద్రప్రభుత్వ లక్ష్యం

హోదా వస్తుందో రాదో  అనే శంక కీటకం మీలొ చేర్చద్దు
తల్లి తండ్రులు ఎదిరించి రాజకీయముల్లో పాల్గొనవద్దు
రాజకీయ చదరంగంలో మీరు పావులు కావద్దు
అమరావతి నగరం ఏర్పడుతుంది అనుమానం వద్దు    
 --((*))--

ప్రేమతో పలకరింపు(ఇది నా పాట )

రాక రాక వచ్చావు  - రాత్రి ఉండి పోతావా
లేక లేక నచ్చావు  - నన్నువదలి పోతావా

మబ్బుల వర్షం కరిచింది - మనసు జలదరించింది
మబ్బుల వర్షం కరిచింది - మనసు జలదరించింది
మరులు కొన్న విరికన్నె - వినయంగా తెలిపింది
మరులు కొన్న కలువా  - మనసుతో  పలికింది
 
రాక రాక వచ్చావు  - రాత్రి ఉండి పోతావా
లేక లేక నచ్చావు  - నన్నువదలి పోతావా

లోకమంతా వెతికాను - కళ్ళకు నీవె నచ్చావు
లోకమంతా వెతికాను - కళ్ళకు నీవె నచ్చావు
కళ్ళవత్తులతో వెతికాను - కళ్ళను దాటి పోలేవు
కలవపూలవలె విరిసాను- పరిమళాలు పొందక పోలేవు
 
రాక రాక వచ్చావు  - రాత్రి ఉండి పోతావా
లేక లేక నచ్చావు  - నన్నువదలి పోతావా

తీరని కోరికలు - తీపి తేనీయులు
వదలని ఆశలు - మరువలేని కలలు
దొంగలా ఎందుకు - దొబూచులు 
వదలవు లే నిన్ను - వెన్నెల కన్నులు
 
రాక రాక వచ్చావు  - రాత్రి ఉండి పోతావా
లేక లేక నచ్చావు  - నన్నువదలి పోతావా
--((*))--

  
 
  నెమ్మదిగా పాలు త్రాగు పిల్లి
ఏడుపు ఆపు ముద్దుల చెల్లి
చదువు కోవాలి  మల్లి  మల్లి
పూర్తి చేయాలి వచ్చేలోపు తల్లి    
నీ కోసం వేచి ఉండి  ఇలా మారా
నీ ప్రేమ పొందటానికి ఇలా తిరిగా
నా కోసం తయారయ్యవు ఇలా ఎలా
నా కోసం నీవు ఎలా చేస్తావు పెళ్లి గోల     

                    నా పరుష పదాలు పెదవి దాటించకు
                     

                   నా మంచి మాటలు మనసులో ఉంచుకోకు
 

                   మంచి చెడుల మద్య నాకోసం  నలుగకు
 

                  ఇద్దరం కలిస్తే మనకు నిజమైన  బ్రతుకు


                                     నీవు లావ్వున్న నేను సన్నగా ఉన్న 
                           అనక మన ప్రేమ నిండు సున్న 
                             నీ సొగసు నాకే నని చెప్పుతున్న 
                                  నా మనసు నీకెనని వక్కానిస్తున్న 

13, ఆగస్టు 2015, గురువారం

ప్రాంజలి ప్రభ - 7 స్వాతంత్త్ర్య దినోత్సవం (15-08-2015)

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - 7
స్వాతంత్త్ర్య దినోత్సవం  

సర్వేజనాసుఖినోభవంతు 

దాస్య సృంఖలాల నుంచి - కాంతి పథం వైపు పయనించిన రోజు 
పరపీడన పాలన నుంచి - ప్రజాసామ్యం ఉదయించిన రోజు
 అమరవీరుల త్యాగఫలం నుంచి - ఉద్భవించిన రోజు 
అహింసాయుధముగా ఎంచి - గాంధి మహాత్ముడు సాధించిన రోజు 

విదేశీ వస్తు భాహిష్కరణ - సహాయనిరాకరణ 
ఉప్పు సత్యాగ్రహం వలణ - క్విట్ ఇండియా ఉద్యమాల వలణ 
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు- ఆనందం వచ్చిన రోజు 
ఎర్రకోటపై త్రివర్ణ పతాకం -రేపరేపలాడిన రోజు 

మూడు రంగుల జండ - ముచ్చటగా ఎగిరింది 
కాషాయం - ఎల్లరలో త్యాగాన్ని నింపుతుంది 
తెలుపు - ఎల్లరులో ప్రేమను నింపుతుంది 
ఆకుపచ్చ - ఎల్లరలో మానవత్వం నింపుతుంది 
అశోక చక్రం - ధర్మానికి సౌర్యానికి నిలయమైనది 
అవినీతిపరులను ఎదిరిద్దాం - స్వేచ్చ సమాజాన్ని ఏర్పరుచుకుందాం
స్వతంత్రానికి అర్ధం చాటుదాం - 
కలసికట్టుగా భారతమాతను గౌరవించుదాం 

                                      

1INDEPENDENCE DAY  (స్వాతంత్ర దినోత్సవం)

మన దేశానికి ఉన్న ఘనమైన చరిత్ర ఆధ్యాత్మిక సంపద  "వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఉపపురాణాలు, రామాయణము, మహాభారతము వెలసి ఉన్న ఈ దేశం " శివాజి, రాణాప్రతాప్, పల్నాటి బ్రహ్మనాయుడు, అక్బర్   పరిపాలించిన దేశం, బుద్దుని భొదలు, ఏ సు ప్రబువు  ఆశయాలు, అనేక మతాలను ఆదరిస్తున్న దేశం, ఆది శంకరాచార్యులు, శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ రాఘవేంద్రస్వామి,  వంటి  వారి ఆద్యాత్మిక వారసత్వం పొందిన దేశం, భాస్కరుడు, వరాహమిహురుడు వంటి గొప్ప శాస్త్ర వేక్తల  ఆవిష్కరణలు. భారత దేశాన్ని ఆధునీకరణ  చేయుటకు, ఎందఱో మహానుభావుల కృషి ఫలితముగా దేశం అభివృద్ధి చెందింది.
ఇంకా అభి వృద్ధి చెందాల్సిన పరిస్తితి ఉన్నది

స్వాతంత్ర్య దినోత్సవం--మన దేశానికీ పరుల పాలన/ఆక్రమణ నుంచి విముక్తి లభించిన రోజుని స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీ. ఆగష్టు పదిహేను (August 15) భారత దేశపు స్వాతంత్ర్య దినోత్సవం గా జరుపుకోబడుతోంది. 1947 ఆగష్టు పదిహేనున భారత దేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదలయింది.దానికి గుర్తుగా, స్వాతంత్ర్యానంతర ప్రభుత్వం ఆగష్టు పదిహేనుని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా, జాతీయ శెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది.

బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారతీయులకు విముక్తి కలిగించి వారిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడైన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ని గురించి తెలియని వారంటూ ఉండరు. శాంతి ఆయుధాన్ని చేతబూని స్వాతంత్ర్యం సంపాదించిపెట్టిన జాతిపిత సత్యము, అహింసలను దేవతలుగా కొలిచారు.

ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో జాతిపిత అగ్రగణ్యుడు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము మహాత్మా గాంధీ.. 
కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహము , అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న గాంధీజీని స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా స్మరించుకుందాం.. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు...!

                                               


దేశ  స్వాతంత్ర వేడుకలను (ఆగష్టు -15 - 2014)  డిల్లీలో ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగురవేసి ప్రజల నుద్దేసించి, ప్రధాని, రాష్ట్రపతి సందేశాలు అందిస్తారు. అదేవిధముగా హైదరాబాదులో, గోల్కొడ కోటపై   తెలంగాణ   గవర్నమెంటు జాతీయ పతాకము ఎగుర వేసి ముఖ్య మంత్రి .గవర్నర్ ప్రజలకు సందేశాలు ఇవ్వటం హర్షణీయం.

కులమతాల కతీతముగా అన్ని ప్రాంతాలలో, ముచ్చడైన మువ్వన్నెల జండాను ఎగరవేసి వందన సమర్పణ చేయుదురు. నేను భారత దేశాన్ని ప్రమిస్తున్నాను అంటూ పలు పట్టణాలలో జండాలు పట్టు  కొని ఊరెగడం, వింత వేషాలు వేసి జండాను అవమాన పరుస్తున్నారు కొందరు, కొందరు జండాలు ఎగురవేసి  పిల్లలకు పెద్దలకు స్వీట్సు పంచుకుంటూ సరదాగా కాలం కడుపుతారు.

ఎందఱో మహానుభావుల త్యాగ ఫలితముగా భారతదేశము  ఆవిర్భవిమ్చిమ్ది.

ఈ దేశాన్ని మనం పరిమళాలు వెదజల్లే పుష్పంలాగా, అమృతం పంచె  ఫలములాగా, ప్రతిఒక్కరి మనసు ప్రశాంతముగా ఉండేందుకు, దేశ సౌభాగ్యానికి ప్రతిఒక్కరు చేయవలసిన కొన్ని పనులు  ఇందు ఉదహరిస్తున్నాను.  దేశ పురోభివృద్ధికి అందరు పాటు పడాలనేది నా ఆకాంక్ష

ఒక్కక్క కుటుంబములో ఇద్దరు, ముగ్గురు పనిచేస్తూ, ధన సంపాదన పెంచుకుంటూ విలాస వంతమైన జీవితము గడుపుతున్నారు. ఆ విలాసాలు తగ్గిమ్చి కొంత ధనమును, నిరుపేదలను ,అనాధలను, ఆదు కున్నప్పుడే నిజమైన దేశ భక్తులు.

విద్య అనేది ప్రస్తుతము కొనుక్కొనే పద్దతిలో ఉన్నది. దీనికి ధనవంతుల  బిడ్డలను మత్రమే చదివిమ్చగలుగుతున్నారు, బీదవారు రెక్కలు ముక్కలు చేసుకొని, కష్ట పడ్డా  తమ బిడ్డలకు అన్నము పెట్టలేక పోతున్నారు, ఇక పిల్లలను ఎలా చదివిమ్చగలుగుతారు,

కొందరు విద్యావంతులు గ్రామాలకు  పోయి చదువులేని విద్యార్ధులను సేకరించి, వారికి ఉచిత విద్యను కల్పించి, వారి కల్లల్లో తలుక్కు మనే ఆనందాన్ని చూసే విధముగా చేసినవారే నిజమైన దేశ భక్తులు.

మన ఆరో గ్యానికి కాపాడుకోవటానికి పౌష్టిక ఆహారం ,వ్యాయామం, వ్యాధి గ్రస్తులమైతే తగిన మందులు వాడి రోగ విముక్తులవుతాము .

మనదీశంలో కోన్ని గ్రామాలల్లో ఇప్పటికి వేద్యానికి నోచుకోలేక వ్యాధి గ్రస్తులై మరణిస్తున్నారు. ఎ రోగము వచ్చిన లంఖనమే మందని మంచం మీదె ఉండి  పోతున్నారు.

కొందరు వైద్యులు కలసి కొన్ని గ్రామాలు దత్తత  తీసుకొని ప్రజలకు ఆరోగ్య పరిక్షలు చేసి వారికి తగిన మందులు ఇచ్చి సహాయ పడినవారే  నిజమైన దేశ భక్తులు.

మన ఇంటిని సుబ్రముగా ఉంచుకోనుటే కాదు, మన ప్రక్కవారి ఇంటిని కూడా  సుబ్రముగా ఉంచుటకు సహకరించాలి, మన వీధి పరిసుబ్రత మన అందరి ఆరోగ్యానికి మూలకారణం. దుర్ఘంధం మీద ఎంత అత్తరు చల్లిన వాసన పోనట్లు, దుర్ఘంధమనేది లేకుండా, దోమల బారి పడకుండా జాగర్త పడినవారు నిజమైన దేశ భక్తులు  

రెడ్ క్రాస్ వ్యవస్థ చాలా అద్వాన్నముగా ఉన్నది. వీరు కేవలము బ్లడ్ బ్యాంకులు గా ఉన్నాయి, దేశ ప్రజలకు అవసరానికి ఆదుకొనే విధముగా  పరిధిని పెంచాలి , కేవలము నెంబర్ షిప్ లు చేర్చుకొని సభ్యులను పెంచుతున్నారు కాని వారిని అన్ని విధాల ఉపయోగిమ్చుకున్నప్పుడే నిజమైన దేశ భక్తులవుతారు.
 

రక్షక భటులు చాల ఓర్పుగా పనిచేస్తున్నారు. ట్రాఫిక్ కంట్రోల్ చేయుటకు తీవ్ర కష్ట పడుతున్నారు, దొపిడిలు, దొంగతనాలు పెరుగుతున్నాయి, వాహనాలు వేగముగా నడుపుతున్నా పట్టిమ్చుకోవటములేదు,  లంచాలను ఆశించక ధర్మమార్గమున దేశానికి సేవ చేస్తారని  నాకు చాల నమ్మకమున్నది, దేశాన్ని పూర్తిగా రక్షించే భాద్యతలు రక్షక భటులపై ఉన్నది
భారతదేశ ప్రతిపౌరుడు "నేను నాదేశం కోసం పనిచేస్తున్నాను, నాదేశం సమృద్ధిగా ఉండాలి, సేవాతత్పరత, అంకితభావం, క్రమశిక్షణ, అలవరుచుకోవాలి.
ప్రతిఒక్కరు మనం పుట్టిన  మట్టిని సృసిమ్చి నమస్కరించి, మన కన్న తల్లి ఆశీర్వాదముతొ దేశసేవ  చేయాలన్నది నాభావన.
అందుకే అన్నారు కవులు "జననీ జన్మభూమి స్వర్గం కన్నా గొప్పదని .
ఇకమత్యమే మహాబలం అనే సూక్తి ప్రకారము కుటుంబమంతా శంఘీభావమ్తొ, ఒకే సంకల్పంతో ఉన్న కుటుంబాన్ని ఎవ్వరు వేరుచేయలేరు, అదేవిధముగా ప్రతిఒక్కరు కలసుకొని అధర్మాన్ని ఎదిరించి ధర్మాన్ని నిలబెట్టండి .దేవతలు ఏక మనస్సు కలవారగుట వల్లన హవిస్సులు పొందగలుగు తున్నారు,  అందుకే మానవులు వివిధ దేవతలను పూజిమ్చిన దేవతలందరూ ఒకే మనసు  కల్గి ఉండుట వలన అందరిని ఆదుకొన గలుగుతున్నారు. ఈ రోజు తిరుమల తిరుపతి పై సూర్య భగవానుడు చుట్టు వృత్తాకారముగను లోపల అనేక రంగులు కనిపించటం సుభసూచనమ్
"భారత మాత హృదయ సామ్రాజ్యాన్ని గెలుచుకోనేమ్దుకు  పోరాటం జరుపుతున్న వీర సైనికులం మనం, మనకు శక్తి ఉన్నంతవరకు ప్రజాసేవచేయుటయే ప్రధాన కర్తవ్యం అని ప్రతిఒక్కరు ప్రమాణము చేయాలని నా ఆకాంక్ష.                  

జాతీయ పతాకము ఎగురవేసి వందనం సమర్పించుదాం    
భరతమాత ముద్దు  బిడ్డలుగా జాతి గౌరవం కాపాడుదాం
కుల మతాలకు  అతీతంగా  కలసి   మెలసి బ్రతుకుదాం
దేశంకోసం త్యాగంచేసిన వారిని గుర్తు చేసుకొని జీవిన్చుదాం            


 గాలిలో, నీటిలో, ఉండే కాలుష్యాన్ని తోగిమ్చుదాం
ఆకలికి అలమటించే అనాధులను  ఆదు  కుందాం
ప్రతిఒక్కరము  దెశపురోభివృద్ధికి సహకరించుదాం 
అందరం నవ్వుతూ అందరిని  నవ్విస్తూ బ్రతికేద్దాం

భూమి పాదాలను నమస్కరించి భూమిని సాగు చేద్దాం
అందరి హృదయాలలో తృప్తిగా  ఆనందాన్ని నింపెద్దాం
య్యజ్ఞాలను చేసి మేఘాల ద్వారావర్షాలను కురిపిద్దాం
పాలబుగ్గల పసిపాలను నవ్వులతో,కేరింతలతో ఆడిద్దాం

జ్ఞాన సముద్రాన్ని నలుగురికి పంచేద్దాం
ప్రకృతి ఆనందాన్ని అందరకీ  పంచేద్దాం
అణచివేతపై ఓర్పుతో సమాధానం చెప్పేద్దాం
పిడికలుబిగించి దేశం కోసం నడుంకట్టి జీవిద్దాం

ఇంటర్నెట్ వెబ్ లో దేశం గురించి  తెలుసుకుందాం
మెల్సుగా, చాటగా, ప్రజల సమస్యలను పరిష్కరిద్దాం
పేస్ బుక్ లో సంగీతస్వరాల విని ఆనందిమ్చుదాం
టచ్ స్క్రీ న్ ద్వారా పిల్లలకు ఆటలుఆడించి సంతోష పెడదాం

7, ఆగస్టు 2015, శుక్రవారం

Pranjali Prabha-5 భావ కవిత్వం-2

ఓం శ్రీరాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి  ప్రభ -5సర్వేజనా సుఖినోభవంతు
భావ కవిత్వం-2
జన్మదిన (10-08-1957) శుభాకాంక్షలు పంపిన వారందరికి హ్రుదయపూర్వక అభినందనలు
మీ అందరి అభిమానంతో నాలో నూతనొత్తెజం
మీ కందరికీ హ్రుదయ పూర్వక  అభినందనం
నాలో నిండే ఉషోదయ ఉషస్సుల అశిర్వాదబలం
పెద్దలను  గురువులు అర్ధించుతున్న జ్ఞానం పంచమని    

కవికుమారకులారా - కదలి రండయ్యా 
కన్నుల పండువై  - కనుపించే యుగమయ్యా
తొలకరి మనందరి లక్ష్మి -  తొంగి చుచిందయ్యా
తొల్లింటి పాపము  - తొలగి పోయిందయ్యా

వేద పఠణములోన  - కలదురా తీపి
మన మానసములోన - కలదురా తేట
ప్రేమ పలుకులోన - కలుగునురా తృప్తి
 స్నేహ  సేవలోన - ఉండునురా సంతృప్తి  

1. ఆ నవ్వుతో ఏటో వెళ్లి పోయింది నా వయసు
ఆ చూపుతో ఏటో వెళ్లి పోయింది నా మనసు
ఆ నడకతో నన్ను కలవర పెట్టు  నీ సొగసు
ఆ చేతితో పావడా తిప్పటం చూసి పడే నలుసు    

ప్రాంజలి ప్రభ
తళుకు బెళుకు తన్మయ నవతరుణి
తరుణోపాయం తెల్పే  విధు  షీమణి
తేట తెలుగు లా  వెలుగుల  జవ్వణి
తేనపలుకు తెమ్మెరలా సాగే తరంగిణి
2. ఆరుబయట అందాలు ఆరబోస్తుంటివి ఎలా చెప్మా..!

ఒయ్యారాలను వలకబోస్తూ చేనుగట్టు కూర్చుంటే ఎలా చెప్మా..!

కొనసీమ కొబ్బరి చెట్ల అందాలన్ని నీలొఉంటే ఎలా చెప్మా..!

ఆకర్షించే చూపులతొ నన్ను తికమిక పెడితే ఎలా చెప్మా..!


http://1.bp.blogspot.com/-EnOjBCmukow/VZgHSkHYeII/AAAAAAAAF4E/44dKUrbWDiA/s1600/1.png

శంకరాభరణం బ్లాగ్ వారు పంపిన చిత్రానికి నాభావ కవిత్వం

3. భయ మెరుగని భవ్య దివ్య భవుడు
భవ భంధ బగ భగలు లేని భద్రుడు
భాండము లేక కేసరినెదిరించిన భర్గుడు
భద్రదారువు వలే  శార్దూల రక్ష భానుడు4. శ్రీ రాఘవం దశరధాత్మజ మప్రమేయం
 

సీతా పతిం రఘుకులాన్వయ రత్న దీపం
 

ఆజానుబాహుమ్ అరవింద దళాయ తాక్షం
 

రామం నిశాచర వినాశ కరం నమామి... 


5. చెరువు లెండె - చేలములు కరువాయె 
వాననిండు కుండె - ఎండలు మంది పోయె 
చెట్లు ఎండకు మండె - నీడకు కరువాయె 
మనుగడ లేకుండె - ఓం శ్రీ రామ కాపాడవయ్య

 

 6. సరస సల్లాపముతో సరసుని సముదాయించే 
సరళ శ్రావ్య స్వర్ణ ప్రియని తనువుతో సంతృప్తిపరిచే 
సంతసముతో సంతుష్టినియై సవ్యసాచికి మనసుపంచే
 సమాన సమిష్టిగా తలపుల రంగులకల ఫలించే 

దొబూచి లాటలు సంసారంలో ఉంటె ఆ త్రిల్లే వేరు
దొంగ ముద్దులిస్తు ఉడికించి చల్లపరిచే కిక్కే వేరు
దొండకాయగున్నా, దొండపండులాగున్నా రుచీ వేరు
దంపతులెటులున్న అరచు కొని సర్దుకోవటం వేరు      


 మనోభావన

నన్ను చూడగానే నీ కళ్ళలో
ప్రజ్వరిల్లిన కాంతి కిరణాలను
చూసి నేనెంతో పొంగి పోయాను

కాంక్షలూరె నీ కనులను ఆ కళ్ళలో
ఆకలి చూపులను చూసి సిగ్గుతో
కుంచించుకు పోయిన నన్ను ప్రేమగా
పొదివి పట్టుకుని నాతనువంతా
స్పృషిస్తూంటే నేను అనంతానంద
తీరాలలో తేలిపోయాను

నీపేదవులని నా పెదాలపై చేర్చి
నా లోని మధురామృతాన్ని గ్రోలుతుంటే
నా జన్మకి సాఫల్యత సిద్ధించిందని
మురిసి పోయాను.....పోంగి పోయాను

నీ పెదాలు నా మాధూర్యాన్ని గ్రోలుతుంటే
ఆనంద పారవశ్యంతో నీ కనులు
అరమోడ్పులౌతూ మధుర లోకాలలో
నీ మనసు తేలిపోతున్న దృశ్యం
నేనెన్నటికీ మరచి పోను........

నీ చుంబనంలోని సుఖాన్నాస్వాదిస్తుంటే
నువ్ నీ చేతులతొ నా తనువంతా యెక్కడెక్కడో
తడుముతూ నన్నురెచ్చగొడుతున్నావ్ ....

నీ వెంత తెలివైన వాడివో......
నన్నెక్కడ మీటితె నీకు నేను పూర్తిగా
వశపడతానో తెలుసు..
నన్ను నీకనుకూలంగా మార్చుకుంటూ
నన్ను యేవేవో లోకాలలో విహరింపజేసావ్
నాలో నువ్వే ప్రాంతాన్నీ వదలలేదు

క్రమంగా నా ఆచ్ఛాదననీ తొలగించావ్
వలువల్లేని నన్ను చూసి పులివే అయ్యావ్
విజృంభంచావ్ .........
యెంతో కక్కుర్తీగా నా అణువణువుని
నీ స్వాధీనంలోకి తీసుకొని నన్నాక్రమించడం
ప్రారంభించావు.....

నాలోని నీకు కావలసిందంతా తీసేసుకున్నావ్
నన్ను పొందిన నీ కళ్ళల్లో తృప్తీ చూసాను....
నీ అవసరం తీర్చుకుని విసిరీ వేసినా బాధ లేదు
నీ ఆనందానికంటే నాకింకేం కావాలి..

నీ ఆరాటాన్ని అర్థం చేసుకోగలను
ఫలాలకే మహరాణీగా కీర్తించ బడీనా
అన్ని కాలాలలో నేనందను మీకనీ తెలుసు

రుచిలోనూ రూపంలోనూ మహారాణీనే
దేవతలు అమృతం తాగితే నేం
మారుచి నాస్వాదించలేదే...
కేవలం ఓక్క కాలానికే పరిమితమైన
మామిడిపండుని మీసేవ కొరకే అవతరించాను


మనకు అక్కరలేని విషయాల గురించి అలోచించి భాదచెందవద్దు 
చదువుకున్నవారు కూడా చెప్పలేరని వాదించ వద్దు 
 దేవునిలీల గురించి  ప్రశ్నలు వేయొద్దు
ధర్మమార్గమునే  నడుచు కోవటం మనకు హద్దు
 
మనసనేది  ఉన్నదా  - ఉండినా ఎక్కడున్నాదో తెలియదు
ప్రేమ అనేది ఉన్నదా - ప్రేమకు కొలమానం ఎమిటో తెలియదు 
హృదయ మనేది ఉన్నదా  - ఉండినా రక్త జలాలమద్య ఎలాఉందో తెలియదు
బుడ్డి అసలు ఉందా - ఆ బుద్దు ఎప్పుడు ఎలామరుతుందో ఎవరికీ తెలియదు 

ఈ విషయం ఎలా చెప్పాలి - విషయం ఎలా తెలియాలి 
నిజం తెలియాలి - గుట్టు తెలిసుకోవాలి 
లొసుగు విప్పాలి - సద్దు చేయాలి 
ప్రేమ పండించాలి - సుఖాన్ని ఇవ్వాలి 

మనకు అసలు సమస్య ఎలా వివరించాలో తెలియదు 
ఎప్పుడు మొదలు పెట్టాలో అసలే  తెలియదు 
ఎప్పుడు అపా లో అంతకన్నా తెలియదు 
ఆ మద్యలో ఏంచేయాలో తెలియదు 
చిత్రం మహా అద్భుతం - సేకరణ అమోఘం

విశ్వమ్ విశ్వాన్తరాళలో వెలిసిన ఒక అద్భుతం
విశ్వనాద సత్యనారాయణకు అదేకల్ప వృక్షం
ఆనందపారవశ్యం తో వర్ణన చేసే  రామాయణం
అదే ఈనాటి కి చెక్కు చెదరని మాహ వృక్షం
 
తెలుసుకోవాల్సింది ఏముంది నీ అన్వేషణలో
ఎజన్మభందం అని తెలుసుకోవు ఈ లోంకంలో 
గమ్యానికి అంతు తెలుసుకోలేవు ఎవిషయం లో
ఎన్నిమాటలు మార్చిన అర్ధం కాని పదాలు ఎన్నో   

నా గమ్యం నీవె అంటూ ఓ మంద హాసం
నన్ను మరువకు అంటూ ఓ మౌన హాసం
నిన్నుచూసి చూడకుండ ఓ చిరు దరహాసం
నీలొ నాలో ఎప్పుడు పల్లవించాలి సా హాసం    అన్నీ ఉన్నప్పుడు మన వైఖిరి తెలుస్తుంది -
 ఎమీలేనప్పుడు మన ఓర్పు కనిపిస్తుంది 

ఒక్కసారి ఈ పాట విని సంతోషిమ్చగలరని ఆశిస్తున్నాను

మూగనోము చిత్రంలోని ఒక అందమైన పాట
చిత్రం : మూగనోము (1969)
సంగీతం : ఆర్. గోవర్ధన్
సాహిత్యం : దాశరథి
గానం : ఘంటసాల, సుశీల
 
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు...
లోలోన ఏవో విరిసెలే వలపులు
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు...
లోలోన ఏవో విరిసెలే వలపులు
 
నీలోని ఆశలన్నీ నా కోసమే...
నా పిలుపే నీలో వలపులై విరిసెలే
నీలోని ఆశలన్నీ నా కోసమే...
నా పిలుపే నీలో వలపులై విరిసెలే
 
నీ చూపులో స్వర్గమే తొంగి చూసే..
నీ మాటలో మధువులే పొంగిపోయే
నీ చూపులో స్వర్గమే తొంగి చూసే..
నీ మాటలో మధువులే పొంగిపోయే
 
నాలోని ఆణువణువు నీదాయెలే..
బ్రతుకంతా నీకే అంకితం చేయనా..
నీలోని ఆశలన్నీ నా కోసమే..
నా పిలిపే నీలో వలపులై విరిసెలే..
లా ... లాలలా... లలలా... లా...
 
నీ రూపమే గుండెలో నిండిపోయే...
నా స్వప్నమే నేటితో పండిపోయే
నీ రూపమే గుండెలో నిండిపోయే...
నా స్వప్నమే నేటితో పండిపోయే
ఉయ్యాల జంపాల ఊగేములే..
 
కలకాలం మనకు ప్రేమయే ప్రాణము..
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు..
లోలోన ఏవో విరిసెలే వలపులు
లా ...లా ...లా ... లాలలా
లాలలా... ఊ హూ హు.

https://youtu.be/oiN8f-LaHng
Ee Vela Naalo Enduko || Mooga Nomu Telugu Hit Song - ANR , Jamuna (HD)
Subscribe For More Telugu Movies: http://goo.gl/V65dIk Subscribe For More Tamil Movies: http://goo.g...


 నాకు చిత్రములు, కవితలు, గీతాలు, మెయిల్ కు  పంపినవారికి పేరు పేరున కృతజ్నతలు చెప్పుకుంటున్నాను (మంచిని నలుగురికి పంచాలని ఒక ఆశయంతో సేకరిస్తున్నాను )


6, ఆగస్టు 2015, గురువారం

Pranjali Prabha - 4 (కృష్ణ నీ చరణమ్ములే నాకు దిక్కు)

ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ- 4
సర్వేజనా సుఖినోభవంతు

 
కృష్ణా నీ చరణమ్ములే  నాకు దిక్కు

1. మల్లె పువ్వును నేను, మంచి గంధ వాసన లందిస్తాను
గులాబి పువ్వును నేను, కస్తూరి  వాసన లందిస్తాను
పారిజాతాన్ని నేను,  నీ పాదాలకు సెవగా ఉంటాను
నామాటలు వినవా కృష్ణా,  నీ చరణమ్ములవద్ద రాలిపోతాను. 

ఉపవాస వ్రతములు, నీకోసం చేయలేను
ఒక్క దీపారాధనమైన,    నీకోసం చేయలేను 
స్నాన సంద్యా, నియతి జరుపలేను
నామాటలు వినవా కృష్ణా నీ చరణమ్ములవద్ద రాలిపోతాను. 

నీ జ్ఞానులను,  గనుగొని మ్రోక్కలేను
దాసులను,  గనుగొని వేడలేను
కృష్ణా,  నీ సన్నిధికి నే చేరలేను
కృష్ణ నీ చరణమ్ములవద్ద రాలిపోతాను. 

జన్మములెత్తి, ఎత్తి, విసికి పోయాను
ఈ జన్మతో, సరి చేయవలెను
నే మరువనేప్పుడు, నీనామ జపమున్
కృష్ణ నీ చరణమ్ముల వద్ద రాలిపోతాను. 

దుర్మార్గులను దండన చేస్తావు నీవు 
సన్మార్గులకు మోక్షం ప్రాసాదిస్తావు నీవు 
రాధకోర్కను తీర్చి తృప్తి పరిచావు నీవు 
అందుకే నిన్ను వదలక నీ చరణమ్ముల వద్దే ఉన్నాను. 

" కమలనయన బ్రోవరా .....కరిరాజవరద
వర యాదవ పురవాస: కృష్ణ విను
కరమదుగా నా కన్నుల గాంచెద
కోరి కొలుతు నాదు కొర్కలుదీర్పగ
సారసాక్షి నీ సంనిదిజేరితి .........
కమలనయన బ్రోవరా .....కరిరాజవరద "
--((ఓం శ్రీ రాం))--

--((*))--

ఈ మధురగీతాన్ని ఆలకించండి

యమునా తీరం సంధ్యా రాగం
నిజమైనాయి కలలు నీలా రెండు కనులలొ
పిలువగనే తేనెల్లొ పూదారి ఎన్నెల్లొ గోదారి మెరుపులతో
యమునా తీరం సంధ్యా రాగం
ప్రాప్తమనుకొ ఈ క్షణమె బ్రతుకులాగా
పండెననుకొ ఈ బ్రతుకె మనసు తీరా
శిధిలంగ విధినైన చేసేదె ప్రేమ
హృదయంల తననైన మరిచేదె ప్రేమ
మరువకుమా ఆనందమానందమానందమాయేటి మనసు కధా
మరువకుమా ఆనందమానందమానందమాయేటి మనసు కధా
యమునా తీరం సంధ్యా రాగం
ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం
చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం
శిశిరంలొ చలిమంటై రగిలేదె ప్రేమ
చిగురించె ఋతువల్లె విరబూసె ప్రేమ
మరువకుమా ఆనందమానందమానందమాయేటి మధుర కధా
మరువకుమా ఆనందమానందమానందమాయేటి మధుర కధా
యమునా తీరం సంధ్యా రాగం
mve : Anand
రచన: వేటూరి
సంగీతం: రాధక్రిష్ణన్
గాయకులు: హరిహరన్, చిత్ర

Watch Nuvvena Naa Nuvvena Song From Anand Movie. Anand is a Telugu movie, directed by Sekhar Kammula. Starring Raja, Kamalinee Mukherjee, Satya Krishnan, Ani...

 


ఆడపిల్ల కష్టం లేని రోజు ఏదని
 వంటకు కట్టెపోయి తప్పదెందు కని
దేశంఇంకా వెనుక పడుతుందేమోనని 
నాకళ్ళు చెమ్మగిల్లు చున్నవి 
ఏమిది నీదు లీల ఆకొన ఈ కోన కలిపినావు
వన్య మృగాలకు మార్గం చూపిన వాడవు
ప్రక్రుతి వనరులు పొందటానికి మార్గదర్సకుడవు
ఆనద పారవస్యాన్ని  తలపించే చిత్రం గీసావు   
మీరు గీసినచిత్రము బాగుంది 

వర్ధమానులను ప్రోస్చహించాలని ఇందు పొందు పరిచాను R.K.S. thoughts. వారు పంపినారు   
తులసీ మండపం ఉండే పద్ధతి
పవిత్రమైన తులసీ మండపాన్ని ఇంట్లో పద్ధతి ప్రకారం ఏర్పాటు చేయాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. శ్రీ మహాలక్ష్మీ దేవి నివసించే తులసీ మండపం తప్పకుండా అందరి ఇళ్ళల్లో ఉండి తీరాల్సిందేనని వారు అంటున్నారు. ఇంటి ముంగిట నాలుగు అడుగుల వెడల్పు, నాలుగు అడుగుల ఎత్తు గల తులసీ మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపాన్ని తూర్పు, ఉత్తర దిశల్లో ఉండేలా చూసుకోవాలి.
మండపం మధ్యలో ముక్కోణపు ఆకారం వుండి తీరాలి. ఇందులో దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఇక మండపంలో నాగులు నివసించే పుట్ట మట్టితో లేదా ఏదైనా పవిత్రమైన ఆలయం నుంచి తెచ్చుకున్న మట్టితో నింపాలి. వెదురు బూడిద, ఎండిన పేడతో తయారైన భస్మాన్ని అందులో కలిపి తులసీ మొక్కను నాటుకోవాలి. తులసీ మండపానికి ముందు కల్లాపు చల్లి ముగ్గులు వేసే విధంగా చూసుకోవాలి. కృష్ణ తులసీ అనే మొక్కను (రెండింటిని జంటగా) నాటుకోవడం మంచిది. పౌర్ణమి రోజుతో పాటు కార్తీక మాసం, కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి, ద్వాదశిల్లో తులసీ దేవికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు.
తులసీ మండపం ఏర్పాటు చేయలేకపోతే.. 12 లేదా 16 ఇటుకలతో తులసీ మండపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. 12-16 ఇటుకలతో ఏర్పాటు చేసిన తులసీ మండపంలో తులసీ మొక్కను నాటి దీపమెలిగించి పూజలు చేయవచ్చు. 12-16 సంఖ్యలో ఏర్పాటు చేసుకున్న తులసీ మండపానికి 12 సంఖ్యలో చందనం, 
కుంకుమ బొట్లు పెట్టాలి.
ప్రతిరోజూ స్నానమాచరించి తులసీ మొక్కకు పుష్పాలు వుంచి.. కేశవా, నారాయణా, మాధవా, గోవిందా, విష్ణు, మధుసూదనా, వామనా. పద్మనాభా అంటూ స్మరించాలి. తమలపాకుపై విఘ్నేశ్వరుడిని చందనంతో పట్టిపెట్టి.. ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. నవగ్రహ దోషాలు 
పటా పంచలవుతాయి.