3, ఆగస్టు 2015, సోమవారం

Pranjali Pabha -3 (- భావ కవిత్వం)


ఓం శ్రీరాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి  ప్రభ -3


సర్వేజనా సుఖినోభవంతు
భావ కవిత్వం

1అరణ్యంలో చిక్కిన అబలకు ఆశ్రయం దొరికితే  ఆనంద మొసంగు 
ఎడారిలో చిక్కిన యువతికి  నీరు దొరికితే సంతోషం నొసంగు 
కడలిలో చిక్కిన వనితకు దుంగ దొరికితే ప్రాణం మోసంగు
 అట్లే ఆకలిగొన్న బాలికకు ఈగ పడిన పాలు హితమోసంగు 


2కుక్క అరుపుతో పిక్క బడుతుందేమోనని గోడదూకె ఒక మనిషి
అమిత వేగంతో నిద్రపోతున్న వారిపే గోడ దూకి పడే ఒక లారి
పులివేషంలో మనిషిచూసి పులి అనుకోని గోడ దూకె ఒక పోకిరి
కామంతో ఒకడు వెశ్యకొంపకు చేరే పొలీసును చూసి గొడ దూకెన్

3. సూర్య కరుణా కిరణ రక్షణ కై వృక్షముల్ సదా
చంద్ర కరుణా చల్లని వెన్నలకే విహంగముల్ సదా
లోక రక్షణా దుష్ట శిక్షణ కై హైందవుల్ సదా
అట్లే హరి కరుణా కటాక్షముల సకల జనుల్  సదా

4. శ్రీమతితో చేరి శృతి  కలిపి సంతోష పరిచే *  
*జనినీ జనకుల పాద సేవచేసి విశ్రాంతి పరిచే*  
*పిల్లలకు విద్యనేర్పి ఉన్నతవిద్యకు సహకరించే *  
*గురుచణమ్ములు మరువక కొలిచి సంతృప్తి పరిచే*
*అందుకే నా దృష్టిలో గురువు నిజమైన సంసారి *

5. కామాంధునకు సతిని ఇచ్చిన పతి , సతి చావుకు కారకుడు కాదా*
*గర్బినిని నాటువైద్యుని వద్దకు తీసుకువెల్లిన పతి సతి చావుకు కారకుడు కాదా*
*పతె దైవముగా భావించ సతిని హింసించిన పతి, సతి చావుకు కారకుడు కాదా*
* అట్లే " సతిచావుకు కారకుండు శంకరుఢుగదా " *

6. త్రాగి ఇంట్లో వారని తిట్టినా డబ్బుకోసం మెచ్చు కొనుచుండ
వైద్యుడు డబ్బుకోసం రోగం తగ్గకుండా చేసిన మెచ్చు చుండ
పొలీసులు లంచం పుచ్చుకున్నప్రజలు నిజాయి పరులను చుండ
అందుకే "మోసము జేయు వారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడ"


7. మాటలతో మనసును లొంగదీసి మోసం చేసే
మచ్చలేని మనిషి కుడా ఒక్కోసారి మోసపోయే
మోసం ఉన్నచోట తప్పులు దరిదాపులో కనబడవే
మోసము జేయువారలకె పుణ్యము కలుగు చుండే


8జ్వరముతో లంకణం చేసే వ్యక్తికి ఎ రుచి తెలియదాయె
తపనతో ఉన్న వ్యక్తి కి యేది తిన్న రుచిగా ఉండ దాయె
ఆకలి లేనివానికి రుచికరమైన భోజనం పెట్టిన తినలేడాయె
ఆకలిఉన్నవాడికి పాయసమున నుప్పుకలుపబడ తీయనాయె


9. అన్నము పెట్టిన తండ్రిని దీవించి ఆత్మారామున్ని శాంతపరిచే
మనస్సును వేదించిన మన్మధుని తరిమి సతిని సుక పరిచే
సూర్యుడు రాగానే కనుమరిగేన నళిని మరచి సుఖంగా జీవించే
అందుకే అన్నారు "తండులేవారు గలరండు ధరణి యందు


10. మనసు చెడిన వాడు - గన్నేరు కాయను తినును
వయసు ముదిరిన వాడు - మాటల కాలం తినును
ప్రేమ ముదిరిన వాడు - అనుమానంతో మనసు తినును
ఆకలి గొన్న " బ్రాహ్మణుండు కాకి పలలము దిను "

11. వనముల్ ఎక్కు వైతే వర్షములు పడున్ మృగాలు బ్రతుకున్
వనముల విస్తారణలో నిత్యవసర వస్తువుల్ సమస్తం దొరుకున్
కొండల కోణల వనముల్లో దివ్యోషదముల్ దొరుకు ప్రాన్తముల్
" వనమే మానవజాతి యున్నతికి సర్వశ్రేష్ఠమూలం బగున్ "


12నటన సూత్రధారి నల్లనయ్య కపట నిద్ర పోతున్నావేమయ్య
వచ్చిన వారితో మాట్లాడక నీవు మౌనంలో ఉన్నావేమయ్య
కృష్ణ ఇరువురికి సంధి కలిపి ఆదరించేవాడవు నీవే గదయ్య
విజయుడు వినమ్రతతో విన్నవించే విజయం చేకూర్చవయ్య


13. రుద్రాక్షను తలపించు తాను కానీ నేను కాను
మురికిని వదిలిన్చుతాను సబ్బును కాను
తడిసిన నురుగుగా మారుతాను కడలిని కాను
మరి నేను కురులు రక్షించే కుంకుడి కాయను


14. షణ సుఖము కోసం సాగు ప్రణయం
సంసార సుఖంకోసం సాగు విరహం
రోగమున్న వదలదు తన్మయత్వం
వేశ్య వలన బ్రతుకు వెలుగు లీను"

15. తనువులో ముళ్ళు, మనసులో కుళ్ళు
ఎంగిలాకు బతుకుళ్ళు, ఉండేది కల్ముషలోగిళ్ళు
రోగాలతో వళ్ళు, మరణశయ్యపై చేరేవాళ్ళు
ధనంకోసం రక్త దానమ్ము చేయట రాక్షసమ్ము

sameera.muv@gmail.com,sameera.86@gmail.com,sameera.86,meera12.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి